ఆదిత్యనాథ్‌ అభ్యంతరకర ఫొటోలు, మహిళపై కేసు | Bengaluru woman booked for depicting UP CM Adityanath in 'poor light' | Sakshi
Sakshi News home page

ఆదిత్యనాథ్‌ అభ్యంతరకర ఫొటోలు, మహిళపై కేసు

Published Wed, Mar 22 2017 9:43 AM | Last Updated on Sat, Aug 25 2018 4:19 PM

ఆదిత్యనాథ్‌ అభ్యంతరకర ఫొటోలు, మహిళపై కేసు - Sakshi

ఆదిత్యనాథ్‌ అభ్యంతరకర ఫొటోలు, మహిళపై కేసు

బెంగళూరు: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అభ్యంతరకర ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేసిన ప్రభ ఎన్ బైలహొంగల అనే మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ యువమోర్చా ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసినట్టు పోలీసు అదనపు కమిషనర్(క్రైమ్) ఎస్. రవి తెలిపారు.

మహిళతో ఆదిత్యనాథ్ సన్నిహితంగా ఫొటోలను ప్రభ తన ఫేస్ బుక్ పేజీలో పెట్టారు. దీనిపై బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాయచూరులోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోషల్ మీడియాలో ఆదిత్యనాథ్‌ పై అసభ్యకర ఫొటోలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మధుగిరి తాలూకా బీజేపీ యువమోర్చా కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్‌ బీజేపీ విజయాన్ని జీర్ణించుకోలేక ఇటువంటి నీచమైన పనులకు దిగుతున్నారని యువమోర్చా నాయకులు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement