
మహా కుంభమేళాలో మౌని అమావాస్య వేళ జరిగిన తొక్కిసలాటకు యోగి ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. మహా కుంభమేళాకు ఏర్పాట్లు చేయడానికి బదులుగా, ప్రభుత్వం ప్రచారంలో బిజీగా ఉందని కాంగ్రెస్ ప్రతినిధి అన్షు అవస్థి ఆరోపించారు. భక్తులను పట్టించుకునేందుకు బదులుగా ప్రభుత్వం తన ఫోటో సెషన్‌లో బిజీగా ఉందన్నారు. ఇకనైనా ప్రభుత్వం వీఐపీ సంస్కృతిని విడనాడి, భక్తులకు భద్రత కల్పించాలని కోరారు.
కుంభమేళాలో నిర్వహణ లోపం, సన్నాహాలలో నిర్లక్ష్యం, తగిన ఏర్పాట్లు లేకపోవడం కారణంగానే తొక్కిసలాట జరిగిందని, దీనికి బీజేపీ ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహించాలని అన్షు అవస్థి పేర్కొన్నారు. మహా కుంభమేళా బడ్జెట్ అంతా అవినీతితో నిండిపోయిందని ఆరోపించారు. కుంభమేళా మొదటి రోజు నుండే తాము భక్తుల రద్దీ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం భక్తులకు తగిన విధంగా అవగాహన కల్పించి ఉంటే, ఈ తొక్కిసలాటను నివారించగలిగేదన్నారు. వీఐపీ స్వాగత సంస్కృతిని ఆపాలని, బడ్జెట్‌లో అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని యోగి సర్కార్‌కు అన్షు అవస్థీ విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: ఆ లోపాలే తొక్కిసలాటకు కారణం: మల్లికార్జున ఖర్గే
Comments
Please login to add a commentAdd a comment