
కన్నప్ప సినిమా విడుదలకు ముందు మోహన్‌బాబు, విష్ణు, శరత్‌కుమార్ 12 జ్యోతిర్లింగాల దర్శనం చేయనున్నారు.

పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ను కన్నప్ప టీమ్ ఇప్పటికే సందర్శించింది.

ఈ క్రమంలో బద్రీనాథ్, రిషికేశ్‌లను వారు సందర్శించారు.

తాజాగా సోమనాథ, నాగేశ్వర జ్యోతిర్లింగాలను కన్నప్ప టీమ్ సందర్శించింది.

మంచు విష్ణు, మోహన్ బాబు యాత్రకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏప్రిల్ 25న కన్నప్ప పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది

కన్నప్ప సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.


