maha
-
నవభారతానికి స్టార్టప్‌లే వెన్నెముక.. ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దు
న్యూఢిల్లీ: నవభారత నిర్మాణానికి అంకుర సంస్థలే వెన్నెముకలాంటివని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. 2047 నాటికి 35 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగే క్రమంలో దేశం అందించే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ఏ ఒక్కదాన్ని చేజార్చుకోవద్దని స్టార్టప్‌లకు సూచించారు. స్టార్టప్ మహాకుంభ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. దేశాభివృద్ధిలో కీలకమైన స్టార్టప్ విప్లవానికి వచ్చే నెల 18 నుంచి మూడు రోజులు జరిగే మహాకుంభ్ దర్పణంగా నిలుస్తుందని గోయల్ చెప్పారు. దేశీయంగా మనకు అతి పెద్ద మార్కెట్ ఉంది కదా అని నింపాదిగా ఉండకూడదని, అంతర్జాతీయ మార్కెట్లలోనూ కార్యకలాపాలను విస్తరించడంపై అంకుర సంస్థలు మరింతగా దృష్టి పెట్టాలని మంత్రి చెప్పారు. ఎంట్రప్రెన్యూర్ షిప్, ఆవిష్కరణలపై ఆసక్తి గల విద్యార్థులు ఈ సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొంటారని ఈ సందర్భంగా తెలిపారు. -
నెల రోజుల్లోపే ఓటీటీకి సంపూర్ణేశ్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సంపూర్ణేష్ బాబు, వీకే నరేష్, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఈ మూవీ నెల రోజులు కాకముందే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన మార్టిన్ లూథర్ కింగ్ త్వరలోనే ఓటీటీలో అలరించనుంది. నవంబర్ 17న లేదా 24న ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఓటీటీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ఈ మూవీ సోనీ లివ్‌లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. కాగా.. తమిళంలో విజయవంతమైన మండేలా మూవీకి రీమేక్‌గా మార్టిన్ లూథర్ కింగ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో డైరెక్టర్ వెంకటేష్ మహా కీలక పాత్ర పోషించారు. అసలు కథేంటంటే.. 'మార్టిన్ లూథర్ కింగ్' ఒక స్థానిక చెప్పులు కుట్టే వ్యక్తి యొక్క కథ. అతను నివసించే గ్రామంలో ఎన్నికలు వస్తాయి. ఇద్దరు ప్రత్యర్థులు ఎలాగైనా గెలవాలని పోటీ పడతారు. అయితే ఆ ఎన్నికలలో అతని ఓటు, గెలుపుని నిర్ణయించే ఓటు కావడంతో ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది. -
శ్రీలక్ష్మీ మహా యజ్ఞంలో సీఎం జగన్..!
-
శ్రీలక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: సనాతన ధర్మ పరిరక్షణతోపాటు రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతూ ప్రజలందరూ కల్యాణ సౌభాగ్యాలతో వర్థిల్లాలని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఉదయం 5గంటలకు మహామంగళ వాయిద్య హృద్య నాదం, భగవత్ ప్రీతిగా వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర–విష్వక్సేన పూజలు, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అజస్ర దీపారాధన తదితర కార్యక్రమాలు మొదలయ్యాయి. సీఎం జగన్ యజ్ఞ సంకల్పం తీసుకున్న అనంతరం మహాయజ్ఞం ప్రారంభమైంది. గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్.. కపిల గోవుకు హారతి ఇచ్చారు. అనంతరం అఖండ దీపారాధనలో పాల్గొన్నారు. నాలుగు ఆగమాల నడుమ.. మే 17వ తేదీ బుధవారం వరకు 6 రోజులపాటు ఈ మహాయజ్ఞం కొనసాగనుండగా.. వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం ఆగమాలతో ఏర్పాటు చేసిన నాలుగు ప్రధాన యాగశాలల్లో యజ్ఞాలు జరుగుతాయి. ఒక్కొక్క యాగశాలలో 27 కుండాల చొప్పున మొత్తం 108 కుండాలతో రుత్వికులు యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తొలి రోజు ఉదయం మినహా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు.. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కొనసాగుతాయి. పవిత్ర సప్తనదీ, త్రి సముద్ర జలాలతో 1008 కలశాలతో విశేష అభిషేకాలు నిర్వహించనున్నట్టు దేవదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. చదవండి: బాగున్నావా అన్నా..? భక్తుల కోసం నాలుగు క్యూలైన్లు యజ్ఞ కార్యక్రమాలను భక్తులు వీక్షించేలా ఉమ్మడిగా యాగశాలల చుట్టూ 4 క్యూలైన్లను ఏర్పాటు చేశారు. యజ్ఞ కార్యక్రమాలను వీక్షిస్తూనే ఆ యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసేలా వీటిని తీర్చిదిద్దారు. వాటిలో ఒకటి వీఐపీల కోసం కేటాయించారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల ఆధ్వర్యంలో భక్తులకు రోజుకు ఒక ఆలయం చొప్పున ప్రసాదాల పంపిణీ చేపడుతున్నాయి. తొలిరోజు విజయవాడ దుర్గ గుడి ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, చక్రపొంగ లి పంపిణీ చేస్తారు. యజ్ఞం తొలిరోజున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, 13న ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, 14న అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి, 15న శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, 16న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. 17వ తేదీన చివరి రోజు సీఎం జగన్ చేతుల మీదుగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వ రూపానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర అన్వయంతో మహా పూర్ణాహుతితో యజ్ఞ కార్యక్రమాలు ముగుస్తాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆహాలో హన్సిక మహ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ సంవత్సరం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో హన్సిక ఒకరు. ఇప్పటికే పలు ప్రాజెక్టులను పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం మిగతా సినిమాలను ఓ పట్టు పట్టనుంది. ఇదిలా ఉంటే ఆమె ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మహ ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెల 10 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారం కాబోతోంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. శ్రీకాంత్, శింబు ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 22న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. మరి ఓటీటీలో ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి! Missing!! Maha's daughter is missing!! Find out #MahaOnAHA Premieres September 10.@SilambarasanTR_ @ihansika @MathiyalaganV9 pic.twitter.com/ouDeKqDHtr — ahavideoin (@ahavideoIN) September 7, 2022 చదవండి: రణ్‌బీర్ - ఆలియాకు చేదు అనుభవం బిగ్‌బాస్‌కు వెళ్తానంటే ఆ కామెడీ షో వాళ్లు అడ్డుకున్నారు -
పెళ్లిపై హీరోయిన్ హన్సిక ఆసక్తికర వ్యాఖ్యలు
పెళ్లెందుకు చేసుకోవాలంటూ ప్రశ్నిస్తోంది హన్సిక. ముంబయికి చెందిన ఈ బ్యూటీ తెలుగు, తమిళం భాషల్లో క్రేజీ హీరోయిన్గా రాణిస్తోంది. హన్సిక నటించిన తొలి లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం మహా. అంతే కాకుండా ఈమె నటించిన 50వ చిత్రం ఇది కావడం విశేషం. ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ పతాకంపై వి.మదియళగన్ నిర్మించిన ఈ చిత్రానికి యుఆర్ జమీల్ దర్శకత్వం వహించారు. నటుడు శింబు ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం అతి త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటి హన్సిక సోమవారం సాయంత్రం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. మహా చిత్రాన్ని అంగీకరించడానికి ప్రత్యేక కారణం ? చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది కథ. రెండోది నేను నటిస్తున్న తొలి లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం. మూడోది నా 50 వ చిత్రం. ఇందులో ఒక బిడ్డకు తల్లిగా నటించాను. ఎన్నో కష్టాలను ఎదుర్కొనే పాత్ర. నేను ఇంత వరకు చేయనటువంటి పాత్ర. నటనకు అవకాశంతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ కలిగిన పాత్ర. ఇలా చెప్పుకుంటూ పోతే మహాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పాత్రను చేయడం చాలా ఛాలెంజ్ అనిపించింది. చిత్రం చాలా బాగా వచ్చింది. నా సినీ కెరియర్లో మైలురాయిగా నిలిచిపోతుంది. చిత్రం విడుదలలో జాప్యానికి కారణం? నేను మాత్రం కాదు. చాలా కారణాలున్నాయి. అందులో కోవిడ్ కూడా ఒక కారణం. కరోనా కారణంగా ప్రపంచానికే పెద్ద గ్యాప్ వచ్చింది. కరోనా కాలంలో మీరు బోర్‌గా ఫీల్ అయ్యారా? లేదు. నేను ఎప్పుడు ఖాళీగా ఉండను. ఏదో ఒక పని చేస్తునే ఉంటాను. అదే నాకు ఎనర్జీ ఫైర్ ఇస్తుంది. మధ్యలో ఒక వెబ్‌సిరీస్‌ను చేశాను. అందులో ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇది రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? మహా నా 50వ చిత్రం. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషలలో 10 చిత్రాలు చేస్తున్నాను. ఈ ఏడాది వరుసగా చిత్రాలు చేస్తున్నాను. ఏ తరహా చిత్రాలు చేయాలని కోరుకుంటున్నారు? ఏ నటి అయినా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలని చేయాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం నాకు అలాంటి అవకాశాలే వస్తున్నాయి. అయితే కథలను బట్టే నా ఎంపిక ఉంటుంది. అర్ధసెంచరీ సినిమాలు దాటేశారు. పెళ్లెప్పుడు చేసుకుంటారు? పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ప్రస్తుతం నేను సంతోషంగానే ఉన్నాను. ఇప్పటికీ వర్క్‌తోనే నా పెళ్లి. టైం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను. -
హన్సిక సినిమా విడుదలపై నిషేధం విధించలేం
నటి హన్సిక నటించిన 'మహా' చిత్రానికి చెన్నై హైకోర్టులో ఊరట లభించింది. వివరాలు.. హన్సిక, శింబు నటించిన తాజా చిత్రం 'మహా'. జమీల్ దర్శకత్వంలో మదియళగన్ నిర్మిస్తున్నారు. త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ సమయంలో చిత్రం విడుదలపై నిషేధం విధించాలని ఆ చిత్ర దర్శకుడు జమీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాత ఇంకా రూ.10 లక్షలు పారితోషికం బాకీ ఉన్నారని, ఆ మొత్తాన్ని చెల్లించే వరకు చిత్రం విడుదలపై నిషేధం విధించాలని కోరారు. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. నిర్మాత తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ 'మహా' చిత్రానికి చిత్రంపై పూర్తి హక్కులు నిర్మాతకే చెందుతాయన్నారు. దర్శకుడి పారితోషికం గురించి సామరస్య పూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని న్యాయమూర్తి జయచంద్రన్కు వివరించారు. న్యాయమూర్తి స్పందిస్తూ చిత్రం విడుదలపై నిషేధం విధించలేమని, దర్శకుడికి చెల్లించాల్సిన పారితోషికం వ్యవహారంపై చిత్ర నిర్మాత రిట్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 26కు వాయిదా వేశారు. చదవండి: ఓటీటీలో దీన్ని ఆపేయాలి: దర్శకుడి డిమాండ్ వ్యాపారవేత్తతో స్టార్ హీరోయిన్ సహజీవనం! -
మహా పూర్తయింది
హీరోయిన్గా హన్సిక 50వ సినిమా మైలు రాయిని అందుకున్నారు. 50వ సినిమా కోసం ఓ క్రేజీ లేడీ ఓరియంటెడ్ కథను ఎంచుకున్నారామె. ‘మహా’ టైటిల్‌తో ఈ సినిమాకు యుఆర్ జమీల్ దర్శకత్వం వహించారు. విశేషం ఏంటంటే ఈ సినిమాలో హన్సిక పాత్రకు నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయట. అతిథి పాత్రలో శింబు మెరవనున్నారు. సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో శింబు కనిపిస్తారట. కోవిడ్ తర్వాత ఇటీవలే సినిమా చిత్రీకరణ ప్రారంభించి, పూర్తి చేశారు కూడా. ఈ విషయం గురించి హన్సిక మాట్లాడుతూ – ‘‘నా 50వ సినిమా షూటింగ్ పూర్తిచేశాం. మహా పాత్రకు బైబై. ఇదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో భాగం అయిన అందరికీ నా ధన్యవాదాలు’’ అన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. -
షూటింగ్లో మాజీ ప్రేమజంట
నటి నయనతారను డీప్‌గా ప్రేమించిన నటుడు శింబు ఆ తరువాత అంతగా ప్రేమించిందెవరన్నా ఉన్నారంటే అది నటి హన్సికనే. అయితే విధో మరేదో అడ్డుపడిందో గానీ శింబుతో ఈ భామలిద్దరి ప్రేమా వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా హన్సికతో శింబు పెళ్లి, చర్చలు వరకూ వచ్చి ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే వీరి పెళ్లికి శింబు తండ్రి, దర్శక, నటుడు టి.రాజేందర్ కూడా పచ్చజెండా ఊపారు. అయినా ఏ కనిపించని హస్తం అడ్డుపడిందో శింబు, హన్సికల పెళ్లి కథ పీటల వరకూ సాగలేదు. దీంతో తాజాగా నటుడు శింబును తనకు ప్రియుడిని చేయమని నటి హన్సిక దర్శకుడు జమీల్‌ను కోరిందట. ఆయన సరే అని శింబును ఆమెకు ప్రియుడిని చేసేశారు. అయితే ఇది రియల్ జీవితంలో కాదు సుమా.. రీల్లో లైఫ్‌లోనే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ క్రేజీ హీరోయిన్గా రాణిస్తున్న నటి హన్సిక ప్రస్తుతం మహా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఈ అమ్మడు నటిస్తున్న తొలి హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం. అంతే కాదు హన్సిక అర్ధసెంచరీ చిత్రం కూడా కావడం విశేషం. జమీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్‌లుక్ పోస్టర్లలో వివాదాల్లో మునిగిపోయింది. తాజాగా ఈ చిత్రంలో సంచలన నటుడు శింబు చోటు చేసుకోవడంతో ఇంకా హైప్‌ను పెంచేసుకుంది. ఎందుకంటే రియల్ లైఫ్‌లో మాజీ ప్రేమజంట రీల్ లైఫ్‌లో ప్రేమికులుగా కనిపించబోతుండడమే. అవును మహా చిత్రంలో శింబు అతిథి పాత్రలో హన్సికకు ప్రియుడిగా మెరవనున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే మహా చిత్రంలో తనకు ప్రియుడి పాత్రలో శింబును నటించడానికి ఒప్పించమని నటి హన్సికనే దర్శకుడికి చెప్పారట. శింబు కూడా పెద్ద మనసుతో తన మాజీ ప్రియురాలితో మహా చిత్రంలో ప్రియుడిగా నటించడానికి సమ్మతించేశారు. ఈ చిత్రంలో శింబు 30 నుంచి 45 నిమిషాల పాటు కనిపిస్తాడని సమాచారం. ఇటీవలే మహా చిత్రం షూటింగ్లో శింబు పాల్గొన్నాడు. మరో విషయం ఏమిటంటే చెప్పిన సమయానికి షూటింగ్‌కు రాడనే అపవాదును మూట కట్టుకున్న నటుడు శింబు. అలాంటిది మహా చిత్రం విషయంలో మాత్రం చెప్పిన సమయానికి రెండు గంటల ముందే స్పాట్లో ఉంటున్నాడట. గతాన్ని మరచిపోయి శింబు, హన్సిక స్నేహంగా ఉంటున్నారట. షూటింగ్లో ఇద్దరూ చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారని టాక్. ఈ సంచలన జంట నటన చాలా ఇంప్రెస్ చేస్తోందని చిత్ర వర్గాలంటున్నారు. మొత్తం మీద మహా చిత్ర వ్యాపారానికి శింబు, హన్సిక జంట బాగానే వర్కౌట్ అయ్యేలా ఉంది. -
కలిసిపోయారు
తమిళ నటుడు శింబు, హన్సిక అప్పట్లో ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత విడిపోయారు. తాజాగా మళ్లీ కలిశారు. కలిసిపోయారా? అని ఆశ్చర్యపడకండి. ఈసారి కలిసింది ప్రొఫెషనల్‌గా మాత్రమే. హన్సిక తాజా చిత్రం ‘మహా’లో శింబు ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్లో శింబు జాయిన్ అయ్యారు. హన్సిక చేస్తున్న ఈ తొలి ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ ఆమెకు 50వ సినిమా కావడం విశేషం. యుఆర్ ఉజ్వల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శింబు ఫ్లాష్‌బ్యాక్ భాగంలో మెరుస్తారట. ప్రస్తుతం ఫారిన్లో శింబు, హన్సికలపై ఓ సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ సినిమాలో నటించడానికి శింబూని హన్సికనే ఒప్పించారని దర్శకుడు ఇటీవల పేర్కొన్నారు. -
మాజీ ప్రియుడితో హన్సిక
తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన హన్సిక తరువాత కోలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు తరుచూ వివాదాలతోనూ వార్తల్లో కనిపించే ఈ బ్యూటీ తాజా మరోసారి ఆసక్తికర వార్తలో హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ప్రస్తుతం హన్సిక తన 50వ చిత్రంగా నటిస్తున్న మహా సినిమా కూడా తరుచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. తాజా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ను ప్రకటించారు. ఈ సినిమాలో హన్సిక మాజీ ప్రియుడు కోలీవుడ్ స్టార్ హీరో శింబు అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని హన్సిక స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘న్యూస్ అనుకున్న సమయం కన్నా ముందే లీకైంది. నేను, శింబు ‘మహా’లో కలిసి నటిస్తున్నాం’ అంటూ ట్వీట్ చేసింది హన్సిక. ఇప్పటికే పోస్టర్ల వివాదంతో మంచి పబ్లిసిటీ సాధించిన ఈ సినిమా ఇప్పుడు శింబు, హన్సికల క్రేజీ కాంబినేషన్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. Since the buzz is crazy and the news is leaked out way before time. Me and #STR are back in #MAHA 😊 pic.twitter.com/98WWdOg3Bu — Hansika (@ihansika) 6 March 2019 -
షూటింగ్లో గాయపడ్డ హన్సిక
ఇటీవల కోలీవుడ్ లో తరుచూ వార్తల్లో కనిపిస్తున్న హీరోయిన్ హన్సిక. ప్రస్తుతం మహా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న హన్సికకు గాయమైనట్టుగా తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా జారిపడిన హన్సిక చేతికి గాయమైంది. అయితే ఆ గాయం తీవ్రమైనది కాకపోవటంతో రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచించారు. తన 50వ చిత్రంగా తెరకెక్కుతున్న మహా సినిమా పనుల్లో బిజీగా ఉన్న హన్సికను పలు వివాదాలు చుట్టు ముట్టాయి. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా రిలీజ్ చేసిన పోస్టర్స్ హన్సికను కష్టాల్లో పడేశాయి. హన్సిక మాత్రం అవేవి పట్టించుకోకుండా షూటింగ్ పనులు కానిచ్చేస్తుంది. -
జలకాలాట కాదు!
రక్తాన్ని చూస్తే చాలు కొంతమంది కళ్లు తిరిగి ఢామ్మని కిందపడిపోతారు. అలాంటిది హీరోయిన్ హన్సిక మాత్రం జలకాలాట కాదు.. ఏకంగా రక్తస్నానం చేస్తున్నారు. ఇది ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘మహా’లోని ఓ పోస్టర్. న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేశారు. హన్సిక కాషాయ వస్త్రాలు ధరించి ధూమపానం చేస్తున్నట్లు ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ వివాదమైన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేయడం విశేషం. యుఆర్. జమ్మిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హన్సిక కెరీర్లో 50వ చిత్రం కావడం మరో విశేషం. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న జిబ్రాన్ కెరీర్లో ఇది 25వ చిత్రం. ఈ సినిమా కాకుండా హన్సిక నటించిన ‘100’ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక తెలుగులో ‘యన్.టీ.ఆర్’ సినిమాలో ఓ కీలక పాత్ర చేశారామె. హీరోయిన్గా సందీప్ కిషన్ సరసన ఓ సినిమా చేయనున్నారు హన్సిక. -
ఈ సారి ముస్లిం గెటప్‌లో..
సినిమా: నటి హన్సిక వివాదాస్పద గెటప్ల్లో ఉచిత ప్రచారాన్ని తెగ పొందేస్తోంది. ఇందులో ఆమె ప్రమేయం లేకపోయినా ప్రైమ్ టైమ్ వార్తల్లోకెక్కేస్తోంది. ఈ అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం మహా. ఇది హన్సికకు 50వ చిత్రం. అంతే కాదు ఈ బ్యూటీ నటిస్తున్న తొలి హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం. ఇందులో అమ్మడు రకరకాల గెటప్‌లు ధరించి పిచ్చపిచ్చగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతకంటే ఎక్కువ వివాదాల్లో నానుతూ ఉచిత ప్రచారాన్ని పొందేస్తోంది. నవ దర్శకుడు జలీల్‌ను పరిచయం చేస్తూ ఎక్స్ట్రా ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మాత మదియళగన్ నిర్మిస్తున్న చిత్రం మహా. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రానికి ప్రచారాన్ని మొదలెట్టేశారు. ఇటీవల నటి హన్సిక కాషాయ దుస్తులు ధరించి నోటి నిండా సిగరెట్ పీల్సిన పొగతో కాశీ నగర బ్యాక్‌డ్రాప్‌లో సింహాసనంలో కూర్చున్న దృశ్యంతో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనిపై మత సంఘాలు, రాజకీయ నాయకులు విరుచుకుపడ్డారు. పోలీసులకు ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర యూనిట్ క్రిస్మస్ పండగ సందర్భంగా మహా చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సారి హన్సికను ముస్లిం అమ్మాయి గెటప్‌లో చూపించి, మసీదు ముందు భాగంలో కూర్చుని నమాజ్ చేసుకుంటున్నట్లు దృశ్యాన్ని ఆ పోస్టర్లో పొందుపరిచారు. ఇంత వరకూ బాగానే ఉన్నా, అదే పోస్టర్లో వెనుక భాగంలో హన్సిక తుపాకీ పట్టుకుని కాల్చుతున్నట్లు స్టిల్‌ను చేర్చారు. ఇది కూడా వివాదాంశంగా మారింది. మొన్న హిందువు అమ్మయిగా, ఇప్పుడు ముస్లిం యువతిగా చూపించిన మహా చిత్ర వర్గాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మహా చిత్రానికి మతాలను అంట గట్టరాదని, ఇలాంటి సన్నివేశాలతో మహా చిత్రం ఎలా ఉంటుందన్నది చూడాలని చిత్ర నిర్మాత అంటున్నారు. -
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న వివాదాస్పద చిత్రం
విమర్శలు, వివాదాలు, కేసుల మధ్య మహా చిత్రం ఒక ఘట్టాన్ని దాటింది. నటి హన్సిక నటిస్తున్న తాజా చిత్రం మహా. ఇది ఈ అమ్మడి 50వ చిత్రం అన్న విషయం తెలిసిందే. ఎక్స్ట్రా ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై వి. మదియళగన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జమీల్ దర్శకత్వం వహిస్తున్నారు. మహ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో తెలిసిందే. హన్సిక కాషాయ వాస్త్రాలు ధరించి, నోటీ నిండా పొగతో చేతిలో సిగరెట్‌తో కాశీ పట్టణం తీరంలో సింహాసనంలో దర్జాగా కూర్చున్న దృశ్యంపై తీవ్ర దుమారం రేపింది. ఇవన్నీ అసలు పట్టనట్లు ఆ చిత్ర నిర్మాత వి.మదియళగన్ శనివారం ఒక ప్రకటనను విడుదల చేస్తూ, మాగ్నెటింగ్, అలూరింగ్, హిడ్డన్, అగ్రెస్సీవ్ వంటివి మహా చిత్రంలో ఇంకా చాలా ఉంటాయని పేర్కొన్నారు. ఈ చిత్రం మొత్తం తమిళ చిత్రపరిశ్రమ దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుందన్నారు. సాధారణంగా నిర్మాతలు స్టార్ తారాగణాన్ని, ప్రముఖ దర్శకులను, ప్రముఖ సాంకేతిక నిపుణులను తమ చిత్రాల్లో ఉండాలని కోరుకుంటారన్నారు. తనకు మాత్రం ప్రణాళిక ప్రకారం, నిబద్ధతతో పనిచేసే చిత్ర టీమ్ లభించడం ఆనందంగా ఉందన్నారు. మహా చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ సంతృప్తిగా పూర్తి చేశారని చెప్పారు. అందుకు నటి హన్సిక, దర్శకుడు జలీల్, ఛాయాగ్రాహకుడు లక్ష్మణ్ ఇలా అందరి సహకారం చాలా సంతోషాన్నికలిగిస్తోందని అన్నారు. ఈయన నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న కొలైయుధీర్ కాలం, అరుణ్ విజయ్ హీరోగా బాక్సర్ చిత్రాలను నిర్మిస్తున్నారు. వీటిలో నయనతార నటించిన కొలైయుధీర్ కాలం చిత్రం త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
మహా వివాదంపై వివరణ
హన్సిక లేటెస్ట్ చిత్రం ‘మహా’ ఫస్ట్ లుక్ పోస్టర్ల మీద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. హన్సిక కాషాయ వస్త్రాలు ధరించి ధూమపానం చేస్తున్నట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. అయితే ఈ పోస్టర్స్ మీద కొందరు అభ్యంతరాలు తెలిపారు. మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఈ విషయం గురించి చిత్రదర్శకుడు యుఆర్ జమీల్ స్పందిస్తూ – ‘‘మా ఫస్ట్ లుక్ గురించి అందరి కామెంట్స్ చూశాను. దర్శకుడిగా నా ఉద్దేశం ఎవరినీ హర్ట్ చేయాలని కాదు. కొత్తగా చూపించాలనుకున్నాను. కుల, మతాలకు సంబంధించిన సెంటిమెంట్స్‌ను దెబ్బతీసే ఉద్దేశం అయితే అస్సలు లేదు. హిందూ, ముస్లిం మతాలను కాదు, మానవత్వాన్ని నమ్ముతాను నేను. దయ చేసి ఇందులోకి కులాలు, మతాలకు సంబంధించిన యాంగిల్‌ను తీసుకురావద్దు’’ అని పేర్కొన్నారు. ‘మహా’ హన్సిక కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. -
మహా వివాదం!
సౌత్‌లో కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్న హన్సిక చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఆమె ప్రధానపాత్ర పోషిస్తున్న లేడీ ఒరియంటెడ్ మూవీ ‘మహా’ వివాదంలో ఇరుక్కుంది. ఈ చిత్రం హన్సిక కెరీర్లో 50వది కావడం విశేషం. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు. అందులో ఒక పోస్టర్లో కాషాయ వస్త్రాలు ధరించి హన్సిక ధూమపానం చేస్తున్న లుక్ ఒకటి. ఈ లుక్ హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని తమిళనాడు కోర్టులో కేసు నమోదైంది. కోర్టు కూడా కేసును స్వీకరించినట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ వివాదంపై ‘మహా’ చిత్రబృందం ఏ విధంగా స్పందించనుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. యూఆర్ జమీల్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. కరుణాకరన్, తంబి రామయ్య కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్ స్వరకర్త. జిబ్రాన్ కెరీర్లో ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ సంగతి ఇలా ఉంచితే..« ధూమపానం చేస్తున్న విజయ్ ‘సర్కార్’ చిత్ర పోస్టర్ కూడా వివాదంలో చిక్కుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. -
ఫస్ట్ లుక్ వివాదం.. కష్టాల్లో హీరోయిన్
హీరోయిన్ కెరీర్లో 50 సినిమాలు పూర్తి చేయటమంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతను సాదించిన సౌత్ బ్యూటీ హన్సిక. అయితే త్వరలో తన 50వ సినిమా ‘మహా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న హన్సికకు ఆ సినిమా కారణంగా వివాదాలు ఎదురవుతున్నాయి. మహా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేసారు. అయితే ఆ లుక్ ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలను ధరించిన హన్సిక, సింహాసనం లాంటి కుర్చిలో కూర్చొని హుక్కా తాగుతున్నట్టుగా ఉన్న స్టిల్‌ను ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందంటూ పీఎంకే పార్టీ కోర్టులో కేసు వేసింది. ఈ కేసును కోర్టు విచారణకు స్వీకరించటంతో సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి నెలకొంది. యు.ఆర్.జెమిల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 50వ సినిమా కావటంతో హన్సిక కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి ఈ వివాదం కారణంగా హన్సికకు మరింత ప్రచారం లభిస్తుందో లేక సినిమానే ఇబ్బందుల్లో పడుతుందో చూడాలి. -
మహా సస్పెన్స్
కథానాయిక హన్సిక ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పదకొండేళ్లు అవుతోంది. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దేశముదురు’ సినిమాతో ఆమె హీరోయిన్గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ 11ఏళ్ల కాలంలో ఆమె ఎన్నో డిఫరెంట్ పాత్రలు చేశారు. మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం ‘విలన్’లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కూడా చేశారామె. ఇప్పుడు హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ ‘మహా’. హాన్సిక నటిస్తున్న 50వ చిత్రం ఇది. యూఆర్. జెమిల్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ఆదివారం విడుదల చేశారు. ఒక పోస్టర్లో మాస్క్‌లను చేతిలో పట్టుకుని, మరో పోస్టర్లో కుర్చీలో కూర్చొని ధూమపానం చేస్తున్న పోజుతో హన్సిక రెండు రకాలుగా కనిపించారు. ఈ సినిమా కాకుండా ‘100, తుపాకీ మునై’ హన్సిక నటించిన చిత్రాలు. ‘తుపాకీ మున్నై’ ఈ నెల 14న విడుదల కానుంది. -
ఆ విషయం ముందే తెలుసు!
అగ్ర కథానాయకిగా రాణిస్తానని తనకు ముందే తెలుసు అని చెప్పింది నటి హన్సిక. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చి కథానాయకిగా సెటిల్ అయిన నటి హన్సిక. ముఖ్యంగా కోలీవుడ్‌లో మాప్పిళ్లై చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆపై వరుసగా అవకాశాలను అందుకుని, దర్శకుల హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఖాతాలో విజయాల శాతమే అధికం అని చెప్పవచ్చు. మొత్తం మీద అర్ధశతకానికి రీచ్ అయిన ఈ అమ్మడి ఖాతాలో మహా అనే చిత్రం అర్ధశతకంగా నమోదు అవుతోంది. త్వరలో చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆనందంలో తుల్లిపోతున్న హన్సిక మాట్లాడుతూ 50వ చిత్రంలో నటించబోతుండడం చాలా సంతోషంగా ఉందంది. మహా చిత్ర కథ హీరోయిన్ సెంట్రిక్తో కూడి ఉంటుందని చెప్పింది. ఇలాంటి కథా చిత్రంలో నటించడం ఇదే ప్రప్రథమం అని తెలిపింది. అందుకే ఇందులో నటించడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంది. ఈ చిత్రం బాగా వస్తుందని నమ్ముతున్నట్లు చెప్పింది. మహా చిత్ర దర్శకుడు జమీల్ తనకు ముందే తెలుసని, బోగం చిత్రాలకు తామిద్దరం కలిసి పని చేశామని చెప్పింది. ఈ చిత్ర స్క్రిప్ట్‌ను చెప్పడానికి ఆరు నెలలు ఎదురు చూశారని, తాను బిజీగా ఉండడంతో ఆయన్ని కలిసి కథ వినడం కుదరలేదని తెలిపింది. ఎట్టకేలకు ఒక సమయంలో దర్శకుడు తనను కలిసి కథ వినిపించారని, అయితే అప్పుడు అందులో నటించడానికి అంగీకరించలేదని అంది. రెండవసారి మరోసారి కథ చెప్పినప్పుడు ఓకే చెప్పానంది. అయితే ముందు కథ విన్నప్పుడే మహా చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి సక్సెస్ఫుల్ హీరోయిన్ని అవుతానని తనకు ముందే తెలుసని చెప్పింది. ఎందుకంటే తాను కఠినంగా శ్రమిస్తానని అంది. అందుకే తనను మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని, ప్రముఖ నిర్మాణ సంస్థల్లో నటిస్తానని, అగ్ర కథానాయకినవుతానని తెలుసంది. ఒక్కో చిత్రంలో నటిస్తున్నప్పుడు కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నానని చెప్పింది. పలువురు లెజెండ్స్‌ను కలిసి మాట్లాడుతున్నానని, తప్పులు చేయడం సహజం అని, అయితే తప్పు చేశానే అని దాన్నే తలుచుకుని బాధ పడుతూ కూర్చునే మనస్తత్వం తనది కాదని చెప్పింది. తాను గత ఏడాది మాత్రమే 19 చిత్రాల అవకాశాలను నిరాకరించినట్లు చెప్పింది. ఇంతకుముందు ఏడాదికి 8 చిత్రాల వరకూ చేసేదాన్నని, ఇప్పుడు ఏడాదికి 4 చిత్రాలే చేస్తున్నానని తెలిపింది. అలాగని పనిలేకుండా ఖాళీగా ఉంటున్నట్లు భావించరాదని అంది. ప్రస్తుతం రెండు చిత్రాలను పూర్తి చేసి మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు హన్సిక తెలిపింది. -
మిస్ మహా
దాదాపు పదేళ్ల క్రితం ‘దేశముదురు’ సినిమాతో కథనాయికగా జర్నీని స్టార్ట్ చేశారు హన్సిక. తెలుగు నుంచి తమిళ్‌కి వెళ్లి అక్కడ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హాఫ్ సెంచరీని టచ్ చేశారు. హన్సిక 50వ సినిమాకి ‘మహా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ టైటిల్‌ను దర్శక–నిర్మాత, నటుడు ధనుష్ అనౌన్స్ చేశారు. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి యు.ఆర్. జమీల్ దర్శకత్వం వహించనున్నారు. ఇంతకుముందు ‘రోమియో జూలియట్, బోగన్’ సినిమాలను డైరెక్ట్ చేసిన లక్ష్మణ్ వద్ద జమీల్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ హన్సికనే కావడం విశేషం. ‘‘హన్సిక ల్యాండ్ మార్క్ సినిమాను డైరెక్ట్ చేయనుండటం ఆనందంగా ఉంది. స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తయింది. సెప్టెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు జమీల్. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిచనున్నారు. -
నరసన్నకు వైభవంగా మహాజ్యేష్టాభిషేకం
సప్తనదీ జలాలతో అభిషేకం పోటెత్తిన భక్తులు అంతర్వేది (సఖినేటిపల్లి) : అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో శుక్రవారం స్వామివారి మూలవిరాట్‌కు సప్తనదీ జలాలతో మహాజ్యేష్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.దేముళ్లు పర్యవేక్షణలో ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వెంకటశాస్త్రి ఆధ్వర్యంలో అర్చకులు ఈ అభిషేకాన్ని కనులు పండువుగా నిర్వహించారు. జ్యేష్ట మాసం శుద్ధపౌర్ణమి(జ్యేష్టా నక్షత్ర మహాపర్వదినం)సందర్భంగా ప్రాంతాలన్నీ సుభిక్షంగా ఉండాలని, శ్రీస్వామివారికి దివ్య తేజస్సు నిమిత్తం ఈ సప్త నదీ తీర్థ మహాజ్యేష్టాభిషేకం(సప్త నదీ జలాలతో అభిషేకం)చేశారు. మూలవిరాట్‌కు మహాజ్యేష్టాభిషేకం నిర్వహిస్తున్నంత సమయంలో భక్తులు స్వామిని భక్తి శ్రద్థలతో కొలుస్తూ భక్తి పారవశ్యంలో ఓలలాడారు. విష్వక్సేన పూజతో.... శ్రీవైఖానసాగమానుసారం శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రకారం విష్వక్సేన పూజతో అర్చకులు మహాజ్యేష్టాభిషేకానికి శ్రీకారం చుట్టారు. ఈ అభిషేకానికి గంగా, యమున, సరస్వతి, వశిష్ట గోదావరి, నర్మదా, సింధు, కావేరి నదుల పవిత్ర జలాలను వినియోగించారు. స్థానిక భక్తులతో పాటు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని, స్వామిని కొలిచారు. అర్చకస్వాములు దీక్షాధారణ.... మహాజ్యేష్టాభిషేకం పురస్కరించుకుని అర్చకులు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించి దీక్షాధారణ చేశారు. సప్తనదీ జలాలతో నింపిన కలశలకు, పంచామృతాలతో నింపిన కలశలకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అగ్నిమధనం చేసి, ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో అగ్ని ప్రతిష్ఠాపన చేశారు. పవిత్ర జలాల కలశలతో ప్రదక్షిణం... మూలవిరాట్‌కు అభిషేకం చేసే పవిత్ర జలాల కలశలను ఆలయ ప్రధానార్చకుడు కిరణ్, అర్చకస్వాములు శిరస్సులపై ధరించి ఆలయ ప్రదక్షిణం చేసి, స్వామికి మహాజ్యేష్టాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రీతికరమైన తామరపూవులు, ఆవునెయ్యితో కలిపి ప్రధానార్చకుడు కిరణ్ మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూవులతో అలంకరించి విశేషార్చన, బాలభోగ నివేదన గావించారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు వీరా మల్లిబాబు, తిరుమాని ఆచార్యులు, యెనుముల శ్రీరామకృష్ణ, గంటా నాయుడు, ఎస్ శ్రీనుబాబు, ఆలయ పర్యవేక్షకుడు డి.రామకృష్ణంరాజు, సీనియర్ అసిస్టెంట్ జె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
నగరంలో మరో దివ్య క్షేత్రం
శ్రీ మహా కాళేశ్వరాలయానికి శంకుస్థాపన రాజమహేంద్రవరం కల్చరల్: ఆధ్యాత్మికత క్షేత్రాలకు ఆటపట్టయిన రాజమహేంద్రవరంలో మరో దివ్యక్షేత్రం రూపుదిద్దుకుంటోంది. అదే శ్రీ మహాకాళేశ్వరాలయం. ఉజ్జయినిలో కొలువుదీరిన శ్రీ మహాకాళేశ్వరుని సందర్శించుకోలేని భక్తులకోసం ఆ మహాదేవుడే గోదావరీతీరానికి విజయం చేయనున్నాడని ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి పేర్కొన్నారు. రోటరీక్లబ్ ఆఫ్ రాజమండ్రి ఆధ్వర్యంలో ఆదివారం ఇన్నీసుపేట కైలాసభూమి పక్క ప్రాంగణంలో శ్రీమహాకాళీ కాళేశ్వరాలయ శంకుస్ధాపన మహోత్సవంలో ఆధ్యాతిక, సారస్వత, రాజకీయరంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి మాట్లాడుతూ మనం చేసే ప్రతిపనీ భగవదర్పితం కావాలన్నారు. జ్ఞాన సరస్వతి డాక్టర్ ప్రభల సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ కాలస్వరూపుడే కాళేశ్వరుడని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ దక్షిణకాశీగా పేరుగాంచిన రాజమహేంద్రవరానికి ఈ ఆలయం రావడం మన సుకృతమన్నారు. శాసనమండలి మాజీ సభ్యుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ నగర ఆధ్యాత్మిక శోభను ఇనుమడించే విధంగా ఆలయం రూపుదిద్దుకోనుందన్నారు. హిమాలయవాసి సూర్యభాస్కర సరస్వతీస్వామి మాట్లాడుతూ కంటికి కనిపించేదంతా కనుమరుగైపోతుందన్నారు. భస్మాభిషేక ప్రియుడు, భస్మవిభూషిత సుందరుడు శంకరుడన్నారు. ఆలయ నిర్మాణకర్తలు పట్టపగలు వెంకటరావు దంపతులు, తోట సుబ్బారావు దంపతులు శంకుస్థాపన పూజల్లో పాల్గొన్నారు. నాలుగు ద్వారాలు, నాలుగు నందీశ్వరులు, నాలుగు మండపాలు, నాలుగు ధ్వజస్తంభాలు, నాలుగు రాజగోపురాలు, నాలుగు శివకోటి స్ధూపాలతో రెండేళ్లలో ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని పట్టపగలు వెంకటరావు తెలిపారు. రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళీమోహన్, నగర మేయర్ పంతం రజనీ శేష సాయి, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామసుబ్రహ్మణ్యం, 20వ వార్డు కార్పొరేటర్ మింది నాగేంద్ర, సీతారాం మహేశ్వరి, పట్టపగలు ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రా, మహారాష్ట్రలో రెండు మెగా ఫుడ్ ప్రాజెక్టులు
న్యూడిల్లీ: ప్రతిష్టాత్మక సాగర మాల ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర లో రెండు మెగా ఫుడ్ పార్క్ లు నెలకొల్పనున్నట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. సుమారు రూ 324 కోట్ల వ్యయంతో రెండు మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. సాగర మాల ప్రణాళికలో భాగంగా, రెండు మెగా ఫుడ్ పార్కులు ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్టు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ, దక్షిణ మహారాష్ట్ర ప్రాంతాలను ఈ ప్రాజెక్టుల కోసం ఎంచుకున్నట్టుచెప్పారు. కోస్టల్ ఎకనమిక్ జోన్ లలో ఈ ప్రాజెక్టులను వ్యూహాత్మకంగా అమలుచేయనున్నట్టు పేర్కొంది. దీనికి ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ 184.88 కోట్ల అంచనా వేసింది. మహారాష్ట్ర కోస్టల్ జోన్ లో ప్రాజెక్టుకు 139.33 కోట్లు అంచనా వేశామని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని భావిస్ఓతంది. భారతదేశం లో ప్రాసెస్డ్ ఫుడ్ పెరుగుతున్న అంతర్జాతీయ డిమాండ్ ఉందనీ, ఆహార ప్రాసెసింగ్ రంగంలో పోటీకోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈనేపథ్యంలో లాజిస్టిక్ ఖర్చులు, రవాణా ఖర్చులు, ఇతర మౌలిక సదుపాయాల పరంగా సమర్థవంతంగా ఉండాలన్నారు. పారిశ్రామిక సంస్థల సమూహాలు, సీఈజెడ్ లకు చెందిన రకరకాల ఓడరేవులకు లాజిస్టిక్ ఖర్చులు తగ్గింపు భరోసా, మౌలిక సౌకర్యాలు, కనెక్టివిటీ సదుపాయాలు అందించడానికి ఆ ప్రకటన తెలియజేసింది. -
ఆద్యంతం తన్మయత్వం