పెళ్లెందుకు చేసుకోవాలంటూ ప్రశ్నిస్తోంది హన్సిక. ముంబయికి చెందిన ఈ బ్యూటీ తెలుగు, తమిళం భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తోంది. హన్సిక నటించిన తొలి లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం మహా. అంతే కాకుండా ఈమె నటించిన 50వ చిత్రం ఇది కావడం విశేషం. ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వి.మదియళగన్ నిర్మించిన ఈ చిత్రానికి యుఆర్ జమీల్ దర్శకత్వం వహించారు. నటుడు శింబు ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం అతి త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటి హన్సిక సోమవారం సాయంత్రం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు.
మహా చిత్రాన్ని అంగీకరించడానికి ప్రత్యేక కారణం ?
చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది కథ. రెండోది నేను నటిస్తున్న తొలి లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం. మూడోది నా 50 వ చిత్రం. ఇందులో ఒక బిడ్డకు తల్లిగా నటించాను. ఎన్నో కష్టాలను ఎదుర్కొనే పాత్ర. నేను ఇంత వరకు చేయనటువంటి పాత్ర. నటనకు అవకాశంతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ కలిగిన పాత్ర. ఇలా చెప్పుకుంటూ పోతే మహాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పాత్రను చేయడం చాలా ఛాలెంజ్ అనిపించింది. చిత్రం చాలా బాగా వచ్చింది. నా సినీ కెరియర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది.
చిత్రం విడుదలలో జాప్యానికి కారణం?
నేను మాత్రం కాదు. చాలా కారణాలున్నాయి. అందులో కోవిడ్ కూడా ఒక కారణం. కరోనా కారణంగా ప్రపంచానికే పెద్ద గ్యాప్ వచ్చింది.
కరోనా కాలంలో మీరు బోర్‌గా ఫీల్ అయ్యారా?
లేదు. నేను ఎప్పుడు ఖాళీగా ఉండను. ఏదో ఒక పని చేస్తునే ఉంటాను. అదే నాకు ఎనర్జీ ఫైర్ ఇస్తుంది. మధ్యలో ఒక వెబ్‌సిరీస్‌ను చేశాను. అందులో ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇది రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్.
ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
మహా నా 50వ చిత్రం. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషలలో 10 చిత్రాలు చేస్తున్నాను. ఈ ఏడాది వరుసగా చిత్రాలు చేస్తున్నాను.
ఏ తరహా చిత్రాలు చేయాలని కోరుకుంటున్నారు?
ఏ నటి అయినా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలని చేయాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం నాకు అలాంటి అవకాశాలే వస్తున్నాయి. అయితే కథలను బట్టే నా ఎంపిక ఉంటుంది.
అర్ధసెంచరీ సినిమాలు దాటేశారు. పెళ్లెప్పుడు చేసుకుంటారు?
పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ప్రస్తుతం నేను సంతోషంగానే ఉన్నాను. ఇప్పటికీ వర్క్‌తోనే నా పెళ్లి. టైం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను.
Comments
Please login to add a commentAdd a comment