హీరోయిన్ హన్సిక మోత్వాని వివాహం ఆదివారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో హన్సిక మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. జైపూర్‌లోని ముండోతా కోట వీరి పెళ్లికి వేదికగా నిలిచింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. తాజాగా కూతురి వివాహంపై హన్సిక తల్లి ఎమోషనల్ అయ్యారు.
(ఇది చదవండి: ఘనంగా హీరోయిన్ హన్సిక వివాహం... స్పెషల్ గెస్టులు ఎవరో తెలిస్తే షాక్!)
హన్సిక తల్లి మోనా మాట్లాడుతూ.. 'నేను అదృష్టవంతురాలిని. హన్సికను చూసి సంతోషంతో పొంగిపోయా. ఏ తల్లిదండ్రులకైనా బిడ్డ సంతోషంగా వివాహం చేసుకోవడమే మరిచిపోలేని క్షణం. సరైన సమయంలో మంచి వరుడు దొరికాడు. నేను చెప్పాల్సింది ఒక్కటే. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. హన్సిక తనకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అదృష్టంగా భావించాం. ఇంత మంచి కుటుంబం దొరకడం కూడా మన అదృష్టం. మంచి మనిషిగా ఉండటం చాలా ముఖ్యం.' అంటూ ఎమోషనల్ అయ్యారు. పెళ్లి తర్వాత హన్సిక ప్లాన్‌పై ఆమె మాట్లాడారు. హన్సిక హాట్‌స్టార్ కోసం ఏడు సినిమాలు, రెండు వెబ్ షోలు ఉన్నాయి. పెళ్లి తర్వాత కూడా ఆమె మునుపటిలానే బిజీగా ఉండబోతోందని మోనా వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment