Hansika Motwani Bachelorette Party in Greece With Dancing at Night With Friends - Sakshi

Hansika Motwani: గ్రీస్ వీధుల్లో హన్సిక డ్యాన్స్.. వీడియో వైరల్

Nov 27 2022 2:48 PM | Updated on Nov 27 2022 4:18 PM

Hansika Motwani bachelorette party in Greece with dancing at night with friends - Sakshi

నటి హన్సిక మోత్వాని వచ్చేనెలలో వివాహబంధంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వివాహానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. ఆమె వ్యాపారవేత్త సోహెల్ కతురియాను పెళ్లి చేసుకోబోతుంది. ఇ‍ప్పటికే అతనికి పెళ్లై విడాకులు తీసుకున్నారు. జైపూర్‌లోని ఓ పురాతన కోట వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. అంతేకాక హన్సిక పెళ్లి వేడుకను ఓటీటీలోనూ ప్రసారం చేయనున్నారు. 

(చదవండి: హన్సిక ఇంట పెళ్లిసందడి.. ప్రత్యేక పూజలో పాల్గొన్న జంట..!)

తాజాగా పెళ్లికి ముందు జరుపుకునే బ్యాచ్‌లర్‌ పార్టీని ఎంజాయ్ చేస్తోంది భామ. తన స్నేహితులతో కలిసి వీధుల్లో తిరుగుతూ డ్యాన్స్‌ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గ్రీస్‌లో పార్టీ చేసుకున్న వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.  ఆ వీడియోలో ఆమె తన ‌ఫ్రెండ్స్‌తో డ్యాన్స్ చేస్తూ కనిపించింది.

 ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేస్తూ..'బెస్ట్ బ్యాచిలరేట్ ఎవర్' అంటూ పేర్కొంది. హన్సికతో పాటు నటి శ్రీయా రెడ్డి, ఆమె స్నేహితులు కూడా ఉన్నారు. ఆమె వేసుకున్న డ్రెస్ వెనుక భాగంలో 'పెళ్లికూతురు' అని రాసి ఉంది. హన్సిక వివిధ రకాల దుస్తుల్లో కెమెరాకు పోజులిచ్చింది. రెస్టారెంట్‌లో కుర్చీలపై నిలబడి డ్యాన్స్ కూడా చేశారు ముద్దుగుమ్మ. ఇప్పటికే హన్సిక తన వివాహ వేడుకల్లో భాగంగా 'మాతా కి చౌకీ' కార్యక్రమంలో కాబోయే భర్తతో పూజలో పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement