batchler
-
దేవర భామ జాన్వీ కపూర్ బ్యాచిలరేట్ పార్టీ .. పెళ్లికి రెడీనా?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర చిత్రంలో జూనియర్ సరసన కనిపించనుంది. ఈ మూవీ ద్వారానే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించనుంది. అయితే ఇటీవల జాన్వీ కపూర్ పెళ్లిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆమె మైదాన్ సినిమాకు చూసేందుకు వెళ్లిన జాన్వీ తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా పేరుతో నెక్లెస్ ధరించి కనిపించారు. దీంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాకుండా శిఖర్‌పై జాన్వీ తండ్రి బోనీ కపూర్ సైతం ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లి చేసుకోవడం ఖాయమని బీ టౌన్లో టాక్ నడుస్తోంది. అయితే తాజాగా జాన్వీ కపూర్ బ్యాచిలరేట్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. అదేంటీ అప్పుడే పెళ్లికి సిద్ధమైపోయిందనుకుంటున్నారా? కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. జాన్వీ కపూర్ తన ఫ్రెండ్ రాధికా మర్చంట్ బ్యాచిలరేట్ పార్టీని నిర్వహించింది. జాన్వీతో పాటు రాధిక ఫ్రెండ్స్ కూడా ఈ విందుకు హాజరయ్యారు. జాన్వీ కపూర్ హోస్ట్ చేసిన ఈ పార్టీలో ఆమె స్నేహితులందరూ గులాబీ రంగు దుస్తులు ధరించారు. ఈ పార్టీకి హాజరైన వారిలో అంజలి మర్చంట్ కూడా ఉన్నారు. కాగా.. ఇటీవలే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ తారలు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు హాజరయ్యారు. పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ 2022 డిసెంబర్లో రాజస్థాన్‌లో జరిగిన వేడుకలో అనంత్ అంబానీతో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం ఈ ఏడాది జూలైలో జరగనుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్లో మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, అఖిల్ ఏజెంట్ సినిమాల్లో ప్రత్యేక సాంగ్స్‌తో అదరగొట్టింది. అంతే కాకుండా రిషబ్ పంత్‌తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ కూడా వినిపించాయి. బాలీవుడ్లో హేట్ స్టోరీ-4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పాగల్ పంటి లాంటి చిత్రాల్లో పనిచేసింది. అంతే కాకుండా 2015లో 'యంగెస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్' టైటిల్‌ను కైవసం చేసుకుంది. తాజాగా 'వరల్డ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరెట్' టైటిల్‌ను గెలుచుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఊర్వశి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. (ఇది చదవండి: టూమచ్ ఓవరాక్షన్ అని చెడామడా తిట్టాడు, రాత్రంతా నిద్రపోలే: నటుడు) ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ప్రపంచంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలొరెట్ అవార్డుకు ఎంపిక చేసినందుకు ఐడబ్ల్యూఎం బజ్ సంస్థకు నా కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మన ప్రేమ, కలలు సాకారమయ్యే క్షణాలను ఇలా జరుపుకుంటూనే ఉంటాం. ' అంటూ పోస్ట్ చేసింది. నెటిజన్స్ ట్రోల్స్ ఊర్వశి రౌతేలాకు అవార్డ్ రావడంతో ఆమె కొన్ని ఫోటోలను గ్లామరస్ పిక్స్ తన ఇన్‌స్టాలో పంచుకుంది. అయితే ఆ ఫోటోలను బాగానే ఎడిట్ చేసిందంటూ కామెంట్స్ చేశారు. మరికొందరేమో ఐఐటీ, ఐఐఎంలో చదివిన మోస్ట్ బ్యూటిఫుల్ మిస్ యూనివర్స్ ఫోటోలను అత్యుత్తమంగా ఎడిట్ చేశారంటూ ఎద్దేవా చేశారు. మరొకరు రాస్తూ ప్రపంచంలోనే అత్యంత భ్రమలు కలిగించే వుమెన్ ఊర్వశినే అంటూ రాసుకొచ్చాడు. (ఇది చదవండి: 'ది కేరళ స్టోరీ' సినిమాకు ఓటీటీ కష్టాలు.. కారణం అదేనా?) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
గ్రాండ్‌గా హన్సిక బ్యాచ్‌లర్ పార్టీ.. గ్రీస్ వీధుల్లో హల్ చల్
నటి హన్సిక మోత్వాని వచ్చేనెలలో వివాహబంధంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వివాహానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. ఆమె వ్యాపారవేత్త సోహెల్ కతురియాను పెళ్లి చేసుకోబోతుంది. ఇప్పటికే అతనికి పెళ్లై విడాకులు తీసుకున్నారు. జైపూర్‌లోని ఓ పురాతన కోట వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. అంతేకాక హన్సిక పెళ్లి వేడుకను ఓటీటీలోనూ ప్రసారం చేయనున్నారు. (చదవండి: హన్సిక ఇంట పెళ్లిసందడి.. ప్రత్యేక పూజలో పాల్గొన్న జంట..!) తాజాగా పెళ్లికి ముందు జరుపుకునే బ్యాచ్‌లర్ పార్టీని ఎంజాయ్ చేస్తోంది భామ. తన స్నేహితులతో కలిసి వీధుల్లో తిరుగుతూ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గ్రీస్‌లో పార్టీ చేసుకున్న వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె తన ఫ్రెండ్స్‌తో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేస్తూ..'బెస్ట్ బ్యాచిలరేట్ ఎవర్' అంటూ పేర్కొంది. హన్సికతో పాటు నటి శ్రీయా రెడ్డి, ఆమె స్నేహితులు కూడా ఉన్నారు. ఆమె వేసుకున్న డ్రెస్ వెనుక భాగంలో 'పెళ్లికూతురు' అని రాసి ఉంది. హన్సిక వివిధ రకాల దుస్తుల్లో కెమెరాకు పోజులిచ్చింది. రెస్టారెంట్లో కుర్చీలపై నిలబడి డ్యాన్స్ కూడా చేశారు ముద్దుగుమ్మ. ఇప్పటికే హన్సిక తన వివాహ వేడుకల్లో భాగంగా 'మాతా కి చౌకీ' కార్యక్రమంలో కాబోయే భర్తతో పూజలో పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
ఈ బ్రహ్మచారి.. మహా చిలిపి గురూ!
బ్యాచిలర్ లైఫ్ అనగానే అబ్బ అంతకుమించిన లైఫ్ జీవితంలో ఇంకోటి లేదనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. సరే.. బయటికి కనిపించే జీవితం ఒకటైతే, ఒంటరి జీవితంలోని అనుభవాలు ఇంకో రకం. బ్యాచిలర్ లైఫ్ అనుకోగానే ముందుగా గుర్తొచ్చేది బ్యాచిలర్ రూం. ఎక్కడపడితే అక్కడ పడి ఉండే దుస్తులు, గోడల నిండుగా సగం దుస్తుల హీరోయిన్ల ఫొటోలు.. లాంటివి సహజంగానే అందరికీ గుర్తొస్తాయి. అంతే కాదు బ్రహ్మచారి గది.. ఇన్నోవేషన్‌కు పెన్నిధి అని కూడా చెప్పొచ్చు. ఒక వస్తువును ఎంత విభిన్నంగా ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు? అనేది నేర్పే ట్రైనింగ్ సెంటర్ కూడా. చెప్పలేనన్ని... స్టవ్ అవసరమే లేనట్టు పుస్తకాల మధ్యలో ఐరన్ బాక్స్ పెట్టి టీ కాచుకోవడం, చపాతీలు కాల్చటం, బీర్ బాటిల్‌ని చపాతీ రోలర్‌గా ఉపయోగించడం, కూలర్ని ఫ్రిజ్‌లా ఉపయోగించుకోవచ్చు అనేట్టుగా కూల్‌డ్రింక్ బాటిల్స్‌ని కూలర్ దగ్గరగా కట్టడం.. ఇలా ఒకటీ రెండు కాదు ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు మనం నగరంలోని బ్రహ్మచారుల గదుల్లో చూడొచ్చు. సదరు ఉత్పత్తి తయారీదారు సైతం విస్తుపోయేలా వస్తువులను వినియోగిస్తున్నారు వీరు. ఏకాంతం లేని బంధువుల గృహాలు, ఫుడ్ నచ్చని హాస్టళ్లలో ఉండడం నచ్చని బ్యాచిలర్స్ ఏదైతే అదైందని తెగించి సెపరేట్‌గా ఒక రూం తీసుకొని, సొంతంగా ఫుడ్ వండుకొని తినడం అలవాటు చేసుకున్నారు. ఇంకేంటి అంతా హ్యాపీయే కదా అనుకుంటున్నారేమో..? కానీ ఇందులో ఒక కిటుకు ఉంది. ఇలాంటి సెపరేట్ రూమ్‌లలో బ్యాచిలర్స్ చేసే అద్భుతాలు, ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. అందులో కొన్నింటిని ఉదాహరణకి తీసుకుందాం. స్వయంగా వంట చేసుకుంటే కాస్తా ఉప్పు కారం అటు ఇటు అయినా రుచిగానే ఉంటుంది. కానీ అందుకు అవసరమయ్యే కిచెన్ సామగ్రి కొని తెచ్చుకొని సెట్ చేసుకునేంత ఓపిక మాకు ఉండదు. పైగా చదువు, ఉద్యోగమని ఎప్పుడంటే అప్పుడు రూమ్స్ మారుతూ ఉంటాం. షిఫ్టింగ్‌కు భారంగా ఉంటుందని ఎక్కువ సామగ్రి కొని పెట్టుకోం. అందుకే సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండే వస్తువులతోనే రకరకాల ప్రయోగాలు చేస్తుంటాం. ఇలా చేసినప్పుడు అప్పుడప్పుడు ఇబ్బందులు తప్పవనుకోండి.. కానీ ఇదొక లైఫ్ స్టైల్. - శివ, బ్యాచిలర్(ఉద్యోగి) వినియోగానికి కాదేదీ అనర్హం.. పని జరగడం ముఖ్యం. దేనిని దేనికి వాడితే ఏమవుతుంది? ఇదీ బ్యాచిలర్స్ రూమ్‌లలో ‘బ్రహ్మ’ సూత్రం. కాదేదీ వినియోగానికి అనర్హం.. అన్న రేంజ్లో ఉంటుంది వీరి వాడకం. పోపుల డబ్బాను ఉల్లిపాయలతో నింపడం లాంటి సాధారణ ప్రయోగాలతో మొదలుపెట్టి.. హెల్మెట్‌ను కోడిగుడ్ల పెట్టెలాగ, కంప్యూటర్ సీపీయూని గోడకు వేలాడదీసి స్పూన్లు, గరిటెలు.. తదితరాలుంచే కిచెన్ స్టాండ్‌లా, ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్లు రాకుండా హెల్మెట్ ధరించడం లాంటి భయంకర ప్రయోగాలూ సిటీలోని బ్యాచిలర్ లైఫ్ స్టైల్.