Urvashi Rautela Wins 'World's Most Eligible Bachelorette' Award - Sakshi
Sakshi News home page

Urvashi Rautela: ఊర్వశి రౌతేలాకు అరుదైన పురస్కారం.. సోషల్ మీడియాలో షేర్ చేసిన నటి!

Published Mon, Jun 26 2023 4:55 PM | Last Updated on Mon, Jun 26 2023 5:05 PM

Urvashi Rautela Wins World Most Eligible Bachelorette Award - Sakshi

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్‌లో మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, అఖిల్ ఏజెంట్ సినిమాల్లో ప్రత్యేక సాంగ్స్‌తో అదరగొట్టింది. అంతే కాకుండా రిషబ్ పంత్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ కూడా వినిపించాయి. బాలీవుడ్‌లో హేట్ స్టోరీ-4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పాగల్‌ పంటి లాంటి చిత్రాల్లో పనిచేసింది. అంతే కాకుండా 2015లో 'యంగెస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్' టైటిల్‌ను కైవసం చేసుకుంది.  తాజాగా 'వరల్డ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరెట్' టైటిల్‌ను గెలుచుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఊర్వశి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 

(ఇది చదవండి: టూమచ్‌ ఓవరాక్షన్‌ అని చెడామడా తిట్టాడు, రాత్రంతా నిద్రపోలే: నటుడు)

ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ప్రపంచంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలొరెట్ అవార్డుకు ఎంపిక చేసినందుకు ఐడబ్ల్యూఎం బజ్ సంస్థకు నా కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మన ప్రేమ, కలలు సాకారమయ్యే క్షణాలను ఇలా జరుపుకుంటూనే ఉంటాం. ' అంటూ పోస్ట్ చేసింది. 

నెటిజన్స్ ట్రోల్స్

ఊర్వశి రౌతేలాకు అవార్డ్ రావడంతో ఆమె కొన్ని ఫోటోలను గ్లామరస్ పిక్స్ తన ఇన్‌స్టాలో పంచుకుంది. అయితే ఆ ఫోటోలను బాగానే ఎడిట్ చేసిందంటూ కామెంట్స్ చేశారు. మరికొందరేమో ఐఐటీ, ఐఐఎంలో చదివిన మోస్ట్ బ్యూటిఫుల్ మిస్ యూనివర్స్ ఫోటోలను అత్యుత్తమంగా ఎడిట్ చేశారంటూ ఎద్దేవా చేశారు.  మరొకరు రాస్తూ ప్రపంచంలోనే అత్యంత భ్రమలు కలిగించే వుమెన్ ఊర్వశినే అంటూ రాసుకొచ్చాడు. 

(ఇది చదవండి: 'ది కేరళ స్టోరీ' సినిమాకు ఓటీటీ కష్టాలు.. కారణం అదేనా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement