
ఈ ఏడాది డాకు మహారాజ్‌తో అభిమానులను అలరించిన ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా దబిడి దిబిడి సాంగ్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్‌లో మెరిసిన ముద్దుగుమ్మ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా ఇటీవల తన పుట్టిన రోజును కూడా సెలబ్రేట్ చేసుకుంది.
అయితే తన పుట్టిన రోజు సందర్భంగా ఊర్వశి రౌతేలా తన మంచి మనసును చాటుకుంది. ఊర్వశి రౌతేలా ఫౌండేషన్ తరఫున అనాథలైన అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించింది. ఈ మహోన్నత కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు ఆశీర్వదించారు. దాదాపు 251 జంటలకు సామూహిక వివాహం జరిపించనట్లు ఊర్వశి రౌతేలా వెల్లడించారు. అంతేకాదు తానే స్వయంగా వారికి భోజనాలు కూడా వడ్డించింది బాలీవుడ్ భామ. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ ఊర్వశి చేసిన పనికి అభినందనలు తెలియజేస్తున్నారు.
During Mahashivratri & her birthday Urvashi Rautela facilitated the marriages of 251 underprivileged orphaned girls along with PM @narendramodi ji & President @rashtrapatibhvn ji 🙏🏻 #NarendraModi #UrvashiRautela #DroupadiMurmu #UrvashiRautelaFoundation #BageshwarDhamSarkar pic.twitter.com/ySjcwnkI9X
— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) February 28, 2025
Comments
Please login to add a commentAdd a comment