Orphans
-
అనాధ పిల్లలను కలిసిన సుకుమార్ కూతురు సుకృతి
-
ఆమె ఒడి... అనాథల బడి
‘మా అమ్మాయి బాగా చదువుకోవాలి. పెద్ద ఉద్యోగం చేయాలి’ అనే కల తల్లిదండ్రులు అందరికీ ఉంటుంది. మరి అనాథపిల్లల గురించి ఎవరు కల కంటారు? సమాధానం వెదుక్కోవాల్సి ఉంటుంది. ఎవరో ఎందుకు కల కనాలి? ఆ పిల్లలే బాగా చదువుకుంటే బాగుంటుంది కదా! అయితే, అనిపించవచ్చు. ‘పేరుకే చదువు’ అనుకునే పరిస్థితుల్లో... నాణ్యమైన విద్య అనేది అందని పండు అనుకునే పరిస్థితుల్లో ఆ పిల్లల చదువు ముందుకు సాగకపోవచ్చు. కల కనడం అసాధ్యం కావచ్చు. ఈ పరిస్థితిని గమనించిన న్యాయమూర్తి సునీత కుంచాల అనాథపిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ఒక వేదికను ఏర్పాటు చేశారు.న్యాయసేవాధికార సంస్థ తరఫున అనాథ బాలల వసతి గృహాలను సందర్శిస్తూ ఉంటుంది నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల. అలా వెళుతున్న క్రమంలో బాలికల సదన్‌లో పిల్లలు చదువుకుంటున్న తీరు ఆమెకు బాధగా అనిపించేది. ‘నేను మాత్రం ఏంచేయగలను!’ అనే నిట్టూర్పుకు పరిమితం కాలేదు.‘ఏదైనా చేయాల్సిందే’ అని గట్టిగా అనుకున్నారు. ఆనుకున్నదే ఆలస్యం అక్కడ ఉన్న 30 మంది బాలికలకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందడుగు వేశారు.ఒక మంచిపనికి పూనుకున్నప్పుడు, ‘మీ సహకారం కావాలి’ అని అడిగితే ఎవరు మాత్రం ముందుకు రారు! సునీత అడగగానే హైకోర్టు న్యాయవాది సరళ మహేందర్‌రెడ్డి 23 మంది బాలికలకు తమ పాఠశాల ‘రవి పబ్లిక్ స్కూల్’లో పదవ తరగతి వరకు ఉచితంగా చదువు అందించేందుకు ముందుకు వచ్చారు. సరళ మహేందర్ రెడ్డి స్ఫూర్తితో మరో రెండు పాఠశాలల వారు తమ వంతు సహకరిస్తామని ముందుకు వచ్చారు. దీంతో నిజామాబాద్ ‘బాలసదన్’లోని 30 మంది అనాథ బాలికలకు నాణ్యమైన విద్య అందుతోంది.సునీత కుంచాలకు సహాయం అందించడానికి ఐపీఎస్ అధికారులు రోహిణి ప్రియదర్శిని (సెవెన్త్ బెటాలియన్ కమాండెంట్), కల్మేశ్వర్ శింగనవార్ (నిజామాబాద్ పోలీసు కమిషనర్), ఐఏఎస్ అధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు(నిజామాబాద్ కలెక్టర్) ముందుకు వచ్చారు. విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ డ్రెస్... ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులను అందించేందుకు సునీతతో పాటు పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ శింగనవార్, బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని సిద్ధమయ్యారు. వీరంతా కలిసి తమ బ్యాచ్‌మేట్స్ సహకారంతో కొంత మొత్తాన్ని సమకూర్చారు. బాలికలను తమ స్కూల్స్‌కు వెళ్లివచ్చేందుకు వీలుగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పోలీసు వాహనాన్ని సమకూర్చారు. తాము బదిలీ అయ్యాక కూడా ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగేందుకు వీలుగా ‘భవిష్య జ్యోతి’ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేశారు.ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా తెరిచి వాట్సాప్ గ్రూపు ద్వారా ప్రతి లావాదేవీని పారదర్శకంగా కనిపించేలా చేశారు. ‘విద్య అనే పునాది గట్టిగా ఉంటేనే కలలు నిలుస్తాయి. సాకారం అవుతాయి’ అంటున్న సునీత కుంచాల ఇతర జిల్లాల్లోనూ అధికారుల సహకారం తీసుకొని ఇలాంటి ట్రస్ట్‌లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. భవిష్యత్తుకు భరోసా!ఒక జిల్లా న్యాయమూర్తిగా లైంగిక వేధింపులకు గురైన బాధిత అమ్మాయిలను చూశాను. తల్లిదండ్రులు లేని ఆ పిల్లలకు ప్రభుత్వం వసతి సదుపాయాల వరకు కల్పిస్తుంది. అయితే చదువుకోకపోతే వారి భవిష్యత్తు ఏంటి అనిపించేది. ఆ ఆలోచనలో భాగంగా ఆ పిల్లలున్న హాస్టల్‌కు వెళ్లాం. వారితో మాట్లాడుతున్నప్పుడు వారి చదువు అంతంత మాత్రంగానే ఉందని అర్థమైంది. వారికి మంచి చదువు ఇప్పించాలనుకున్నాం. సాధారణంగా ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో 25 శాతం నిరుపేద పిల్లలకు ఉచితవిద్యను అందించాలి. స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వాళ్లను పిలిచి, ఈ పిల్లల చదువు గురించి అడిగాం. ఫీజు లేకుండా పిల్లలకు చదువు చెప్పడానికి మూడు స్కూళ్లు ముందుకు వచ్చాయి. అయితే బుక్స్, స్కూల్ డ్రెస్‌ల సమస్య వచ్చింది. ఒక్క ఏడాదితో ఈ సమస్య తీరదు. పిల్లల చదువు పూర్తయ్యేంతవరకు వారికి సాయం అందాలి. దీంతో పిల్లల కోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చే స్తే మంచిదనే ఆలోచన వచ్చింది. మా నాన్న గారైన గురువులు గారి స్ఫూర్తితో ట్రస్ట్ ఏర్పాటు అయింది. దీనిద్వారా దాతలు స్పందించి, పిల్లల చదువుకు సాయం అందిస్తున్నారు. ప్రతి జిల్లాల్లోనూ ఇలాంటి పిల్లలకు నాణ్యమైన విద్యావకాశాలు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపితే బాగుంటుంది. – సునీత కుంచాల, జిల్లా న్యాయమూర్తి, నిజామాబాద్ – తుమాటి భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ -
ఆస్పత్రిలో అవినీతి జలగ
కోల్‌కతా: కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతం వేళ ఆ ఆస్పత్రి తాజా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. గతంలో ఆయన పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని అదే ఆస్పత్రి మాజీ డెప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ ఒక జాతీయ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘సందీప్ సెక్యూరిటీ సిబ్బందిలో నిందితుడు సంజయ్ రాయ్ కూడా ఉన్నాడు. ఆస్పత్రి, వైద్యకళాశాలలోని అనాథ మృతదేహాలను సందీప్ అమ్ముకునేవాడు. దీనిపై కేసు నమోదైంది. తనకు సెక్యూరిటీగా ఉండే బంగ్లాదేశీలతో కలిసి సిరంజీలు, గ్లౌజులు, బయో వ్యర్థ్యాలను రీసైకిల్ చేసి బంగ్లాదేశ్‌కు తరలించి సొమ్మ చేసుకునేవారు. నేను గతేడాది వరకు ఆస్పత్రిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఉండగా సందీప్ అక్రమాలపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదుచేశా. దీనిపై ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీలో నేనూ ఉన్నా. సందీప్‌ను దోషిగా తేల్చినా చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ఆరోగ్య శాఖకు నివేదిక పంపిన రోజు నన్ను, కమిటీలోని ఇద్దరు సభ్యులను బదిలీచేశారు. ఈయన నుంచి విద్యార్థులను కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యా’’ అని అఖ్తర్ అన్నారు.ప్రతి టెండర్లో 20 శాతం కమిషన్‘‘ ఆస్పత్రి, వైద్యకళాశాల పరిధిలో చేపట్టే ప్రతి టెండర్ ప్రక్రియలో సందీప్ 20 శాతం కమిషన్ తీసుకునేవాడు. తనకు అనుకూలమైన సుమన్ హజ్రా, బిప్లబ్ సింఘాలకు ఈ టెండర్లు దక్కేలా చూసేవాడు. సుమన్, సింఘాలకు 12 కంపెనీలు ఉన్నాయి. ఏ టెండర్ అయినా వారికి రావాల్సిందే. డబ్బులు ఇచ్చిన వైద్య విద్యార్థులనే పాస్ చేసేవాడు. లేకుంటే ఫెయిలే. తర్వాత డబ్బులు తీసుకుని మళ్లీ పాస్ చేయించేవాడు. ‘శక్తివంతమైన’ వ్యక్తులతో సందీప్‌కు సత్సంబంధాలున్నాయి. అందుకే రెండు సార్లు బదిలీచేసినా మళ్లీ ఇక్కడే తిష్టవేశాడు’’ అని అఖ్తర్ చెప్పారు.కొత్త ప్రిన్సిపల్ తొలగింపుకోల్కతా: వైద్య విద్యార్థుల డిమాండ్ మేరకు ఆర్జి కర్ మెడికల్ కాలేజీ కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్‌ను బెంగాల్ ప్రభుత్వం తొలగించింది. వైస్–ప్రిన్సిపల్ బుల్బుల్, మరో ఇద్దరిని కూడా తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ‘‘మా కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్ పత్తా లేరు. మాకు సంరక్షకురాలి వ్యవహరించాల్సిన ఆమె ఆర్జి కర్ ఆసుపత్రిలో విధ్వంసం జరిగిన రాత్రి నుంచి ఆసుపత్రి ప్రాంగణంలో కనిపించలేదు. ఆమె స్వాస్థ్య భవన్ నుంచి పనిచేస్తున్నారని విన్నాం. అందుకే ఇక్కడకు వచ్చాం’ అని ఒక జూనియర్ డాక్టర్ బుధవారం ఉదయం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్పత్రిపై దుండగులు దాడి చేస్తుంటే అడ్డుకోకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు, ఒక ఇన్స్పెక్టర్ను కూడా కోల్‌కతా పోలీసు శాఖ బుధవారం సస్పెండ్ చేసింది. మంగళవారం నాటి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ ఆస్పత్రి, వైద్యకళాశాల వద్ద దాదాపు 150 మంది పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందితో కట్టుదిట్టమైన రక్షణ కల్పించారు. మరోవైపు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద డాక్టర్ల ఆందోళనలు పదోరోజు కూడా కొనసాగాయి. విధుల్లో చేరాలని రెసిడెంట్ డాక్టర్స్‌కు ఎయిమ్స్ విజ్ఞప్తి చేసింది. -
హైదరాబాద్‌లో పెరుగుతున్న సంతాన లేమి జంటలు
అధిక బరువు..ఆలస్యపు పెళ్లిళ్లు..రోజంతా ల్యాప్‌ట్యాప్‌లతో సహవాసం..కాలుష్యం..మారిన జీవనశైలి..మానసిక ఒత్తిడి..వెరసి నవ దంపతుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.ఎన్ని మందులు వాడినా సంతానం కలుగక..ఒంటరిగా ఉండలేక చాలా మంది యువ దంపతులు అనాథ పిల్లలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. దత్తతకు పిల్లలు కావాలని కోరుతూ ఇప్పటి వరకు 2,050 మంది దంపతులు శిశువిహార్‌కు దరఖాస్తు చేసుకోవడం ఇందుకు నిదర్శనం. సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు పాతికేళ్లకే పెళ్లి చేసుకుని, ఏడాది తిరక్క ముందే పండంటి బిడ్డకు జన్మనిచ్చేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల వేటలో పడి 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లికి సిద్ధపడుతున్నారు. గంటల తరబడి ల్యాప్‌టాప్‌లతో గడపడం..జంక్‌ఫుడ్ అధికంగా తీసుకోవడం, వీకెండ్లో పార్టీల పేరుతో మద్యం అతిగా తాగడం వంటి అలవాట్లు స్త్రీ, పురుషుల హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. పెళ్లై నాలుగైదేళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో చివరకు సంతాన సాఫల్య కేంద్రాకు పరుగులు తీస్తున్నారు. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్(ఐవీఎఫ్), ఇంట్రాసైటో ప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్(ఐసీఎస్ఐ)చికిత్సలు చేయించుకున్నా..ఫలితం లేక పోవడంతో చివరకు కొందరు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. ఒంటిరిగా జీవించలేక, పిల్లలపై మమకారం చంపుకోలేక అనాథ పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. 186 మంది పిల్లలు..2050 దరఖాస్తులు గతంతో పోలిస్తే దంపతుల వైఖరిలో చాలా మార్పులు వచ్చాయి. ఆడపిల్లలు ఇంటికి భారమని భావించే రోజులు పోయాయి. శిశు విహార్‌లో పిల్లలను దత్తత తీసుకుంటున్న జంటల జాబితాను పరిశీలిస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం శిశువిహార్‌లో 2050 మందికిపైగా తమ పేర్లను నమోదు చేసుకుని ఉండగా, 186 మంది పిల్లలు మాత్రమే అందుబాటులో ఉన్నారు. దత్తతకు దరఖాస్తు చేసుకున్న వాళ్లలో ఎక్కువ మంది మగపిల్లలు కావాలని కోరగా, అందులో అత్యధికంగా ఏడాదిలోపు పిల్లలను కోరుకుంటున్న వారే అధికం. రంగు, ఎత్తు, బరువు వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆడ శిశువుకు రెండు నుంచి మూడేళ్లు సమయం పడుతుండగా, మగ శిశువుకు ఐదు నుంచి ఆరేళ్లు పడుతోంది. పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నా..అది కూడా గ్యారంటీ లేదు. ఇదిలా ఉంటే గత పదిహేనేళ్లలో శిశువిహార్ ద్వారా మొత్తం మూడు వేల మందికిపైనే దత్తత ఇస్తే, కేవలం నాలుగేళ్లలో 798 మంది పిల్లలను మాత్రమే దత్తత ఇవ్వగా, వీరిలో 527 మంది ఆడపిల్లలు ఉన్నారు.మహిళల్లోనే కాదు పురుషుల్లోనూ.. గతంలో 5 నుంచి 10 శాతం మందిలోనే ఇన్‌ఫెరి్టలిటీ సమస్య ఉండేది. ఇప్పుడది 15 నుంచి 20 శాతానికి పెరిగింది. మహిళల కంటే పురుషుల్లోనే ఈ సమస్య ఎక్కువ కని్పస్తుంది. చిన్న వయసులోనే మెనోపాజ్ వస్తుండటం వల్ల చాలా మంది రెండోసారి గర్భధారణకు నోచుకోవడం లేదు. దంపతుల్లో ఉన్న బలహీనతను ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. సాధారణ చికిత్సలతో పిల్లలు జని్మంచే అవకాశం ఉన్నా.. ఐవీఎఫ్, ఐయూవీ వంటి చికిత్సల పేరుతో బాధితులను లూటీ చేస్తున్నారు. మంచి ఆహారపు, జీవన శైలి అలవాట్లు, త్వరగా వివాహం చేసుకోవడం ద్వారా సంతాన లేమిని నిరోధించవచ్చు. – డాక్టర్ బాలాంబ, సీనియర్ గైనకాలజిస్ట్ప్రాధాన్యతను బట్టి కేటాయింపు గతంతో పోలిస్తే పిల్లలను దత్తతకు తీసుకునే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. దత్తతకు ఇక్కడ పిల్లలు లేక చాలా మంది నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా వందకుపైగా దరఖాస్తులు అందుతున్నాయి. దంపతుల అభీష్టం మేరకు పిల్లలను దత్తత ఇస్తున్నాం. విదేశాల్లో స్థిరపడిన వారు కూడా ఇక్కడి పిల్లలను దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న దంపతుల ప్రాధాన్యతను బట్టి పిల్లల దత్తతకు అవకాశం కలి్పస్తున్నాం. – మోతీ నాయక్, అదనపు డైరెక్టర్, శిశువిహార్ -
టంపాబే లో అనాథల కోసం నాట్స్ సరికొత్త సేవా కార్యక్రమం!
సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే సందేశాన్ని భావితరానికి తెలియజేయడంతో పాటు వారిలో సామాజిక స్ఫూర్తిని రగిలించడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సరికొత్త కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నాట్స్ తాజాగా ప్లోరిడాలోని టంపాబే లో అనాథ పిల్లల కోసం పీనట్ బటర్ అండ్ జెల్లీ శాండ్విచ్ మేకింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దాదాపు 20 మంది మిడిల్ స్కూల్ పిల్లలు 10 మంది పెద్దలు కలిసి అనాథ పిల్లల కోసం శాండ్విచ్లను తయారు చేశారు.. ఇలా చేసిన వాటిని టంపా లోని అనాధశ్రమానికి అందించింది. నిరాశ్రయులైన అనాథ పిల్లలకు మనం కూడా సామాజిక బాధ్యతగా ఏదో ఒక్కటి చేయాలనే సంకల్పంతోనే నాట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, నాట్స్ కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ సేవాభావాన్ని చాటారు. నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్(ఫైనాన్స్/మార్కెటింగ్), భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్టా, కోర్ టీమ్ అచ్చిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భావితరంలో సేవాభావాన్ని నింపేందుకు డ్రైవ్ చేపట్టి విజయవంతం చేసిన టంపాబే నాట్స్ విభాగాన్ని నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా అభినందించారు. సేవే గమ్యం నినాదానికి తగ్గట్టుగా టంపాబే విభాగం శాండ్విచ్ మేకింగ్ కార్యక్రమం నిర్వహించిందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి టంపాబే నాయకులను ప్రశంసించారు.(చదవండి: టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?) -
యుద్ధం కన్న అనాథలు
ప్రపంచంలో ఎంతో మంది ఒక పూట తిండి కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో మరెంతో మంది కన్న ప్రేమను కోల్పోయి తల్లడిల్లుతున్నారు. – మదర్ థెరెసా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు. ఇరువైపులా ఎంతో మంది మరణించారు. రష్యా దాడులు తట్టుకోలేక ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది వలసపోయారు. అటు పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులతోనూ లక్షలాది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. అంతా యుద్ధ నష్టం గురించి, ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుకుంటుంటే.. అభంశుభం ఎరుగని ఎందరో చిన్నారులు యుద్ధం మిగిల్చిన అనాథలుగా భవిష్యత్తు ఏమిటో తెలియని దుస్థితిలో పడిపోయారు. జనవరి 6న (శనివారం) ప్రపంచ యుద్ధ సంక్షుభిత అనాథ పిల్లల దినోత్సవం (వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్) నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం.. నేను ఎందుకిలా అయ్యానో తెలియదు ఈ చిత్రంలోని అమ్మాయి పేరు మసిక. వయసు పన్నెండేళ్లు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ)లో జరుగుతున్న అంతర్యుద్ధంలో తిరుగుబాటుదారులు ఆమె కళ్ల ముందే తల్లిదండ్రులను కాల్చి చంపేశారు. ఎవరూ దిక్కులేక తన స్నేహితురాలి తల్లితో కలసి జీవిస్తోంది. నాటి ఘటనను తలచుకుని కుమిలిపోతూ.. తినేందుకు తిండి, సరైన రక్షణ లేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ‘‘అసలు వాళ్లెవరో, ఎందుకోసం ఇలా చేస్తున్నారో, మా అమ్మానాన్నను ఎందుకు చంపేశారో, నేను ఎందుకిలా బతకాల్సి వస్తోందో నాకు తెలియదు..’’ అంటూ మసిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. అమ్మానాన్నను కోల్పోయి.. ఈ చిన్నారి పేరు కరీనా. వయసు ఏడేళ్లు. ఉక్రెయిన్‌లోని చెర్నిగివ్ ప్రాంతంలోని ఓ గ్రామం. రష్యా యుద్ధం మొదలుపెట్టాక తమ ఊరిని విడిచిపోతున్న సమయంలో.. జరిగిన బాంబు దాడిలో కరీనా తల్లిదండ్రులు చనిపోయారు. ఇప్పుడు ఉక్రెయిన్‌లోని కీవ్ నగరంలో తమ బంధువుల ఇంట్లో ఉంటోంది. తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ, బాంబు దాడిలో అయిన గాయాలతో బాధపడుతూ గడుపుతోంది. ప్రపంచ యుద్ధాలతో ముమ్మరమై.. ► రెండు ప్రపంచ యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అనాథ చిన్నారులను మిగిల్చాయి. అధికారిక అంచనాల ప్రకారమే.. అప్పట్లో పోలాండ్‌లో 3 లక్షలు, యుగోస్లే్లవియాలో 2 లక్షల మంది పిల్లలు అనాథలయ్యారు. ► ‘యూనిసెఫ్ (ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి)’ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సంక్షుభిత ప్రాంతాల్లో 25 కోట్ల మందికిపైగా చిన్నారులు కనీస అవసరాలైన ఆహారం, మంచినీరు, నిలువనీడ లేక అవస్థ పడుతున్నారు. ఇందులో సుమారు 14 కోట్ల మంది తండ్రినిగానీ, తల్లిదండ్రులు ఇద్దరినీగానీ కోల్పోయి అనాథలుగా బతుకీడుస్తున్నారు. ► అనాథలుగా మారినవారిలో సుమారు 6 కోట్ల మంది ఆసియా దేశాల్లో, 5 కోట్లకుపైగా ఆఫ్రికా, మరో కోటిన్నర మందికిపైగా లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంత దేశాల్లో ఉన్నారు. ► యుద్ధాలు, తిరుగుబాట్లతో అట్టుడుకుతున్న మధ్య ప్రాచ్యం, ఆసియా, దక్షిణ అమెరికా దేశాల్లో.. ముఖ్యంగా సిరియా, ఇరాక్, అఫ్గానిస్తాన్ వంటి దేశాల్లో.. ఆఫ్రికా ఖండంలోని సూడాన్, కాంగో, ఉగాండా, సోమాలియా వంటి దేశాల్లో అనాథ పిల్లల సమస్య పెరుగుతోంది. ఇలాంటి చోట్ల చాలా మంది చిన్నారులు తిరుగుబాటు దళాల్లో సైనికులుగా తుపాకులు చేతబట్టాల్సి వస్తోంది. ► సూడాన్‌లో అయితే ప్రతి వంద మంది చిన్నారుల్లో పది మంది అనాథాశ్రమాల్లో, వీధుల్లో బతుకు వెళ్లదీస్తున్నారు. ► ఇటీవల ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ దాడికి ప్రతిగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడటంతో.. వేల మంది మరణించారు. లక్షలాది మంది వలసపోయారు. ఈ యుద్ధంలో నూ పెద్ద సంఖ్యలో చిన్నారులు అనాథలయ్యారు. ఏనాటి యుద్ధమైనా.. పిల్లలూ సమిధలే.. ఏ పిల్లలకైనా తల్లిదండ్రులే అన్నీ. చదువు కోసమో.. ఉద్యోగం కోసమో దూరంగా ఉంటున్నా..తల్లడిల్లేది వారి గురించే. అమ్మ ఒడికి, నాన్న చెంతకు చేరితేనే సాంత్వన. అలాంటి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోతే.. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోతే.. ఆ బాధ వర్ణనాతీతం. అలాంటిది అస్తిత్వం కోసమో, అన్నం కోసమో, ఆక్రమణ కోసమో.. మానవ నాగరికత మొదలైన నాటి నుంచీ జరుగుతున్న యుద్ధాల్లో ఎందరో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తమ వారంటూ ఉన్న బంధువుల మధ్య పెరుగుతున్నవారు కొందరు.. ఏతోడూ లేకుండా కునారిల్లిపోతున్నవారు మరికొందరు. సరైనదారిలో పడ్డవారు మంచి జీవితం గడపగలిగితే..‘దారి తప్పిన’వారి బతుకులు ఆగమైపోతున్నాయి. ఉక్రెయిన్‌లో రెండేళ్లుగా పిల్లల గోస రష్యా–ఉక్రెయిన్ ఒకప్పుడు ఒకే సోవియట్ యూనియన్‌లో భాగం. అందుకే ఇరు దేశాల మధ్య రాకపోకలూ, సంబంధ బాంధవ్యాలూ సాధారణమే. కానీ ఇరు దేశాల మధ్య పొరపొచ్చాలు, యుద్ధంతో ఇరువైపులా ఉండిపోయిన మరోదేశపు కుటుంబాలు ఆగమైపోయాయి. మరణించిన, వలస వెళ్లినవారి పిల్లలు, సైనికులు బలవంతంగా తల్లిదండ్రుల నుంచి విడదీసినవారు.. ఇలా ఎందరో చిన్నారులు అనాథలుగా మారారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ‘కిడ్సేవ్’ అనే స్వచ్ఛంద సంస్థ తమ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్‌కు మిలటరీ సాయమేకాదు.. యుద్ధంతో అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. బలవంతంగా క్యాంపులకు చిన్నారులు 2022 ఫిబ్రవరి చివరివారం నాటికి ఉక్రెయిన్‌లో అనాథ పిల్లల సంఖ్య లక్ష వరకు ఉండగా.. ఆ తర్వాత ఈ సంఖ్య మరింతగా పెరిగింది. కానీ సంక్షుభిత పరిస్థితుల్లో లెక్కలు తేల్చేదెలాగని, వేల మంది చిన్నారులు క్యాంపుల్లో మగ్గుతున్నారని అమెరికాకు చెందిన కాన్ఫ్లిక్ట్ అబ్జర్వేటరీ సంస్థ గతంలోనే పేర్కొంది. మరోవైపు రష్యా తమ దేశంలోని సుమారు 14 వేల ఉక్రెయిన్ కుటుంబాల పిల్లలను తల్లిదండ్రుల నుంచి బలవంతంగా విడదీసి క్యాంపులకు తరలించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో యూరప్‌లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన యూదు చిన్నారులు వీరు. వారికి కొత్త జీవితం అందించడం కోసం 1921లో అమెరికాలోని న్యూయార్క్‌కు తరలించినప్పుడు హార్బర్లో తీసిన ఫొటో ఇది. ఫ్రెంచ్ ఆర్గనైజేషన్ చొరవతో..ప్రత్యేక రోజుగా.. ఫ్రాన్స్‌కు చెందిన ‘ఎస్ఓఎస్ ఎన్ఫాంట్స్ ఎన్ డెట్రెసెస్’ స్వచ్ఛంద సంస్థ చొరవతో యూనిసెఫ్ ఏటా జనవరి 6న ‘వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్ డే’గా నిర్వహిస్తోంది.యుద్ధాలు, తిరుగుబాట్ల కారణంగా అనాథలుగా మారుతున్న చిన్నారులు.. వారు శారీరకంగా, మానసికంగా తీవ్ర దుస్థితిని ఎదుర్కొంటున్న అంశంపై అవగాహన కల్పించడం, వారిని ఆదుకోవడం లక్ష్యంగా చర్యలు చేపట్టడమే దీని లక్ష్యం. అనాథలను ఆశ్రమాల్లో చేర్చడంతోపాటు చదువుకోవడానికి, సాధారణ జీవితం గడపడానికి తోడ్పడాలని స్వచ్ఛంద సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. -
Pranav Shukla: పండుటాకులే పిల్లలుగా...
దైనందిన జీవితంలో ఎన్నో సందర్భాలు ఎదురవుతుంటాయి. వాటిలో కొన్ని మనల్ని కదిలించి ఆలోచింపచేస్తాయి. మరికొన్ని సందర్భాలు భవిష్యత్‌నే మార్చేస్తాయి. అలాంటి ఓ సంఘటన ప్రణవ్ శుక్లా జీవితాన్ని మార్చేసి సామాజికవేత్తగా తీర్చిదిద్దింది. వందలమంది వృద్ధులను చేరదీసి వారి ఆలన పాలన చూసుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాడు ప్రణవ్. హరియాణలోని ఫరిదాబాద్‌కు చెందిన వ్యక్తి ప్రణవ్ నారాయణ్ శుక్లా. ప్రణవ్ శుక్లా ప్రొఫెసర్ కొడుకు కావడంతో ఇంటర్మీడియట్ తరువాత మెడిసిన్ చదవాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే మెడిసిన్‌లో చేరాడు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్‌పై మక్కువ ఏర్పడడంతో నెలరోజుల తరువాత మెడిసిన్ మానేసాడు. ఇది కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో ఎటువంటి ఆర్థిక సాయం చేయలేదు. అయినా తనకిష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్‌ను కష్టపడి చదివి ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. కాలేజీ రోజుల్లో... ప్రణవ్ శుక్లా ఫ్యాషన్ డిజైనింగ్ చదివేటప్పుడు రోజూ కాలేజీకి ట్రైన్లో వెళ్తుండేవాడు. ఒకసారి ట్రైన్ ఎక్కేందుకు ఓక్లా స్టేషన్‌కు చేరుకున్నాడు. అది చలికాలం కావడంతో ప్లాట్‌ఫాం మీద మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ప్లాట్‌ఫాం పైన ఒక మూలన ఒక వృద్ధుడు చలికి వణికిపోతూ అల్లాడిపోతున్నాడు. అదిచూసి చలించిపోయిన ప్రణవ్ తను ఎంతో ఇష్టంతో కొనుక్కున్న జాకెట్‌ను ఆ వృద్ధుడికి ఇచ్చాడు. అప్పుడు అతడి కళ్లలో చూసిన ఆనందం ప్రణవ్‌కు చాలా సంతృప్తినిచ్చింది. తను జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకున్న తరువాత వృద్ధుల బాగోగులను చూసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఆనందాల, ఆత్మీయతల ఆశ్రమం.. ప్రణవ్ ఉద్యోగంలో చేరాక కొంతమొత్తాన్ని దాచుకుని వృద్ధులకు ఖర్చుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. çకొంతమొత్తం జమయ్యాక.. నిరాశ్రయులైన వృద్ధులకు బియ్యం, పప్పులు, దుస్తులు వంటి నిత్యావసరాలు సమకూర్చేవాడు. అయితే వారి అవసరాలు తీర్చడానికి మరిన్ని సదుపాయాలు అవసరం అని భావించి... 1996లో ‘అనడి సేవా ప్రకల్ప్’ పేరిట ఓల్డేజ్ హోమ్‌ను ఏర్పాటు చేశాడు. అప్పుడు ప్రణవ్‌కు పంతొమ్మిదేళ్లు. వసతి సదుపాయాలు లేక అనాథలుగా మారిన ఒంటరి వృద్ధులను చేరదీసి వసతి, కడుపునిండా ఆహారం పెట్టడం, అవసరమైన ఆరోగ్య అవసరాలు తీర్చుతూ వృద్ధుల జీవననాణ్యతను మెరుగుపరిచాడు. ఒకపక్క ప్రణవ్ ఉద్యోగం చేస్తూనే అనడిని చూసుకునేవాడు. కొన్నాళ్ల తరువాత పూర్తి సమయాన్ని ఆశ్రమానికి కేటాయించడం కోసం 2017లో ఉద్యోగం వదిలేశాడు. అప్పటినుంచి మరింత సమయాన్ని కేటాయించి ఆశ్రమంలోని వారిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకోవడం మొదలు పెట్టాడు. వారికి అవసరమైన వైద్యసదుపాయాలు సకాలంలో అందిస్తూ వారిని ఆనందంగా ఉంచేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. ఆవులు పెంచుతూ... ఆశ్రమాన్ని నడిపేందుకు.. అవసరమైన ఖర్చుల కోసం అనడి ఫారమ్స్ అండ్ గోదామ్ పేరిట ఆవుల పెంపకాన్ని ప్రారంభించాడు. రెండువందల ఆవులను పెంచుతూ.. వాటి ద్వారా వచ్చే పాలు, పెరుగు, నెయ్యిని విక్రయిస్తూ వచ్చిన ఆదాయాన్ని అనడి ఆశ్రమ వృద్ధుల కోసం ఖర్చు చే స్తున్నాడు. గత ఇరవై ఆరేళ్లుగా అనడీలో ఎంతోమంది వృద్ధులు ఆశ్రయం పొందారు. మలివయస్కుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న నలభై ఆరేళ్ల ప్రణవ్ సేవకు గుర్తింపుగా అనేక అవార్డులు, గౌరవ సత్కారాలు దక్కడంలో ఆశ్చర్యం లేదు. అందుకే పిల్లలు వద్దనుకున్నాం కాలేజ్ డేస్‌లో తీసుకున్న నిర్ణయం ఈరోజు ఇంతమందికి ఆశ్రయం కల్పిస్తోంది. పెద్దవారికి సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఆశ్రమంలో నలభైæరెండు మంది వృద్ధులు ఉన్నారు. వారిని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాము. అందుకే నేను, నా భార్య పిల్లలు వద్దు అనుకున్నాము. -
డాడీ హోం రాజారెడ్డి అనుమానాస్పద మృతి
ప్రొద్దుటూరు క్రైం : ఎందరో అనాథలు, అభాగ్యులను చేరదీసి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన డాడీ హోం వ్యవస్థాపకుడు రాజారెడ్డి (52) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పూజాస్కూల్ ప్రాంగణంలో పడి ఉండగా ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు, సన్నిహితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపాళెం మండలంలోని పర్లపాడు గ్రామానికి చెందిన నల్లదిమ్ము రాజారెడ్డి సుమారు 20 ఏళ్ల నుంచి మైలవరంలో డాడీ హోం నిర్వహిస్తున్నారు. ఆయన పెళ్లి చేసుకోలేదు. పెద్దముడియం మండలంలోని పాలూరు గ్రామంలో చర్చి ఫాదర్‌గా కొనసాగుతున్నారు. అనాథ, ఎయిడ్స్ బారిన పిల్లలతోపాటు వృద్ధులకు డాడీ హోంలో ఆశ్రయం కల్పించి వారి పోషణా బాధ్యతలను చూస్తున్నారు. అలాగే ప్రొద్దుటూరు మండలంలోని చౌడూరు గ్రామం సమీపంలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో పూజా ఇంటర్నేషనల్ స్కూల్, ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రి వెనుక భాగంలో పూజా కిడ్స్ స్కూళ్లను కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. రాజారెడ్డి సోదరుడు శ్రీధర్‌రెడ్డితోపాటు అతని భార్య ప్రసన్నలక్ష్మిలు పూజా స్కూల్లోనే ఉంటూ నిర్వహణా బాధ్యతలు చూస్తున్నారు. శనివారం, ఆదివారం పాఠశాలకు సెలవులు రావడంతో పూజా స్కూల్లోని విద్యార్థులను ఇళ్లకు పంపించారు. దీంతో పూజా స్కూల్లో దూరప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, పని మనిషులు మాత్రమే ఉన్నారు. రాత్రి శబ్ధం రావడంతో.. శుక్రవారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో స్కూల్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో పై అంతస్తులో ఉన్న ప్రిన్సిపాల్ జాన్ హుటాహుటిన కిందికి వచ్చాడు. శ్రీధర్‌రెడ్డి గాబరా పడుతూ కనిపించడంతో.. తిరిగి ఆయన పైకెళ్లి తొందరగా కిందికి రావాలని తోటి ఉపాధ్యాయులను పిలిచాడు. దీంతో ఉపాధ్యాయులతోపాటు పీఈటీ రామాంజనీ కిందికి వచ్చారు. వారు వచ్చేసరికి కింద పడిపోయిన రాజారెడ్డికి శ్రీధర్‌రెడ్డి, అతని భార్య లక్ష్మీప్రసన్న, కుమార్తెలు సపర్యలు చేస్తున్నారు. కొద్ది సేపటి తర్వాత రాజారెడ్డిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు చెప్పారు. విషయం తెలియడంతో సీఐ ఇబ్రహీంతోపాటు రూరల్ ఎస్ఐలు చిరంజీవి, శివప్రసాద్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాజారెడ్డి మృతదేహంపై ఎక్కువ గాయాలు ఉండటం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. వీపు, ముఖం, చేతులకు గాయాలున్నాయి. దీంతో ఆయన మృతిపై బంధువులు, పూజా స్కూల్ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాలను పెంచిన రీ పోస్టుమార్టం పూజా స్కూల్ పీఈటీ రామాంజనీ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం రాజారెడ్డి మృతదేహానికి జిల్లా ఆస్పత్రిలోని డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పూజా స్కూల్‌కు తరలించారు. విద్యార్థులు, బంధువుల సందర్శనార్థం కొంత సేపు అక్కడ ఉంచి తర్వాత మైలవరంలోని డాడీ హోంకు మృతదేహాన్ని తరలించాలని భావించారు. అక్కడే ఉన్న పోలీసు అధికారులకు అనుమానం రావడంతో మరింత లోతుగా రీ పోస్టుమార్టం నిర్వహించాలని డీఎంహెచ్ఓను కోరారు. రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు కడప నుంచి ప్రొఫెసర్ల బృందాన్ని పంపించనున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. దీంతో పూజా స్కూల్లో ఉన్న రాజారెడ్డి మృతదేహాన్ని తిరిగి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రొఫెసర్లచే రీ పోస్టుమార్టం చేయించారు. పోస్టుంమార్టం తర్వాత రాజారెడ్డి మృతిపై పోలీసులకు అనుమానాలు మరింతగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయంత్రం మైలవరంలోని డాడీ హోంలో రాజారెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. రాజారెడ్డి మృతితో డాడీహోంలోని అనాథ పిల్లలు బోరున విలపించసాగారు. రాజారెడ్డి తల్లి సుబ్బమ్మ కుమారుని మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదించింది. పోలీసు అధికారుల దర్యాప్తు ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణాకుమార్, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు జిల్లా ఆస్పత్రికి చేరుకొని స్కూల్ నిర్వాహకులతో మాట్లాడారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులతో కూడా పోలీసు అధికారులు చర్చించారు. కాగా ఇటీవల పూజాస్కూల్ నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయి బాధ్యతలను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగిన ఇరువురు అనాథ బాలికలకు అప్పగించినట్లు తెలిసింది. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రముఖుల నివాళులు రాజారెడ్డి మృతదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పూజాస్కూల్లో ఉన్న రాజారెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సేవకు మారుపేరుగా నిలిచిన రాజారెడ్డి మరణం తనను ఎంతగానో కలచి వేసిందని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఏఎస్పీ లోసారి సుధాకర్‌తోపాటు రాజుపాళెం మండలంలోని రాజారెడ్డి బంధువులు, సన్నిహితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూజా స్కూల్లో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు రాజారెడ్డిని కడసారి చూడటానికి వచ్చారు. -
అనాథ పిల్లలకు అండగా
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్భంగా వినూత్న సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు 47వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది అర్థవంతంగా జరుపుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడాలో ఉన్న స్టేట్ హోమ్‌లోని అనాధ పిల్లలకు అండగా నిలవాలనుకుంటున్నట్లు ప్రకటించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 10, 12వ తరగతుల్లో ప్రతిభావంతులైన 47 మంది పిల్లలకు, ప్రొఫెషనల్ కోర్సుల నుంచి మరో 47 మంది పిల్లలకు వ్యక్తిగతంగా అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్ టాప్‌లు అందిస్తానని తెలిపారు. వారి బంగారు భవిష్యత్కై బెస్ట్ ఇన్స్టిట్యూట్ ద్వారా రెండేండ్ల పాటు అత్యుత్తమ కోచింగ్ ఇప్పిస్తానని స్పష్టం చేశారు. కాగా, తన పుట్టినరోజు సందర్భంగా ఎవరికి తోచిన మార్గంలో వారు అనాథ పిల్లలకు సహాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కోరుతున్నానని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. నేడు వెయ్యిమంది రక్తదానం మంత్రి కేటీఆర్ 47వ జన్మదినం సందర్భంగా సోమవారం ఖాజాగూడలోని దివ్యశ్రీ ఎన్ఎస్ఎల్ ఐటీ పార్క్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఐటి టవర్లలో పనిచేసే దాదాపు 1000 మంది టెక్కీలు రక్తదానం ఇవ్వనున్నారు. -
దత్తత ఇప్పుడు మరింత సులభం.. అనాథలకు ‘అమ్మ’తోడు
సాక్షి, అమరావతి: చెత్త కుండీలో అప్పుడే పుట్టిన పసికందు.. హాస్టల్లో బాలిక ప్రసవం–కిటికీ నుంచి బిడ్డను విసిరేసిన వైనం వంటి వార్తలు వింటుంటే హృదయం ద్రవించి పోతుంది. మరోవైపు.. ఐవీఎఫ్ సెంటర్లలో శిశు విక్రయాలు.. పిల్లలను కిడ్నాప్ చేసి రూ.లక్షలకు అమ్మేస్తున్న ఘటనలూ చూస్తున్నాం. అవాంఛిత బిడ్డలను వదిలించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తుంటే.. సంతానం కలగని తల్లిదండ్రులు ఎందరో పిల్లల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మారుతున్న జీవన శైలి, అనారోగ్యం, ఆలస్యంగా వివాహాలు చేసుకోవటం, కెరీర్ కోసం పిల్లలను వాయిదా వేయటం వంటి కారణాల వల్ల సంతానలేమి సమస్య బాగా పెరిగిపోయింది. ఫలితంగానే.. ప్రతి పట్టణంలో ఇప్పుడు ఫెర్టిలిటీ సెంటర్లు వెలిశాయి. అయితే, వైద్య విధానాల ద్వారానూ సంతానం కలగని తల్లిదండ్రులు దత్తత తీసుకోవచ్చు. దత్తత ఎంతో మేలు గతంలో దత్తత నిబంధనలు కఠినతరంగా ఉండేవి. కేంద్రప్రభుత్వం 2022 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి తెచ్చిన నూతన మార్గదర్శకాల ప్రకారం దత్తత పొందటం ఇప్పుడు సులభం. దత్తత తీసుకోదలిచిన తల్లిదండ్రులు చట్టబద్ధంగా మాత్రమే ఆ పని చేయాల్సి ఉంటుంది. మరే ఇతర పద్ధతుల్లో పిల్లలను దత్తత తీసుకుంటే చట్టరీత్యా నేరం. అలాంటి వారు శిక్షార్హులు అవుతారు. గతంలో పిల్లలు కలగని దంపతులు మాత్రమే దత్తత తీసుకునేందుకు అర్హులు. తాజాగా ఈ నిబంధనను తొలగించి.. పిల్లలు ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత కలిగిన వారు దత్తత తీసుకునే అవకాశం ఇచ్చారు. పిల్లలు కావాలనుకున్న వారు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీకి దరఖాస్తు చేసుకుంటే.. వారు వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లోని శిశుగృహాల్లో దత్తతకు సిద్ధంగా ఉన్న పిల్లల వివరాలు తెలియజేస్తారు. ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటైన స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలు దత్తత ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు తోడ్పడతాయి. దేశవ్యాప్తంగా ఉన్న శిశు గృహాల్లో అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఆరేళ్ల పిల్లల వరకు 2,188 మంది దత్తతకు సిద్ధంగా ఉన్నారు. మన రాష్ట్రంలోని శిశు గృహాల్లో సుమారు 120 మంది బాల బాలికలు ఉన్నారు. మరోవైపు దేశ విదేశాలకు చెందిన 31 వేల మందికి పైగా తల్లిదండ్రులు పిల్లలను దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకుని ఉన్నాÆý‡ు. రంగు, భాష, ప్రాంతం తదితర ప్రాధాన్యతల కారణంగా పిల్లలందరినీ దత్తతకు అప్పగించటంలో జాప్యం జరుగుతోంది. దీన్ని నివారించేందుకు సైతం ఏజెన్సీలు కృషి చేస్తున్నాయి. దత్తత కోరే తల్లిదండ్రులకు అవగాహన కల్పించటంతో పాటు వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లోని శిశు గృహాల్లో ఉన్న పిల్లల వివరాలను అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. సమాచారాన్ని వెబ్సైట్లో అప్డేట్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు కావాలంటే.. దత్తతకు సంబంధించిన మరిన్ని వివరాలు అంగన్వాడీ కేంద్రాలు, ఐసీడీఎస్ అధికారులు, జిల్లా బాలల సంరక్షణాధికారి కార్యాలయంలో లభిస్తాయి. అనాథ శిశువులను సంరక్షించేందుకు సైతం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రోడ్డు పక్కన, కాలువలోనూ చెత్త కుండీల్లోనూ శిశువులను గుర్తిస్తే సమాచారం తెలిపేందుకు టోల్‌ఫ్రీ ఫోన్ నంబర్లు 1098, 181, 100లను ఏర్పాటు చేసింది. ఎలా దరఖాస్తు చేయాలంటే.. దత్తత తీసుకోదలచిన వారు పాన్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, వయసు ధ్రువీకరణ పత్రం, దంపతుల ఫొటో, నివాస ధ్రువీకరణ పత్రం, వివాహ ధ్రువీకరణ పత్రం, ఆరోగ్య ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. దత్తత కోసం ఏడు దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ► దత్తత తీసుకోవాలనుకుంటున్న తల్లిదండ్రులు వారి పాన్‌కార్డు ద్వారా ఠీఠీఠీ.ఛ్చిట్చ.nజీఛి. జీn వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. ► సిద్ధం చేసుకున్న ధ్రువీకరణ పత్రాలను వెబ్సైట్లో వారి లాగిన్ ఐడీ ద్వారా 30 రోజులలోపు అప్లోడ్ చేయాలి. దత్తత ఏజెన్సీకి గృహ అధ్యయన నివేదిక సమయంలో రూ.6 వేలు డీడీ తీసి ఇవ్వాల్సి ఉంటుంది. ► తర్వాత దత్తత ఏజెన్సీ గృహ అధ్యయన నివేదికను తయారు చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంది. ► అర్జీదారు కోరుకున్న లక్షణాలున్న పిల్లల వివరాలు రిఫర్ చేస్తూ వారి మొబైల్‌కు సమాచారం అందుతుంది. ఆ సమాచారం ప్రకారం 48 గంటలలోపు వెబ్సైట్లో లాగిన్ అయి నచ్చిన బిడ్డను రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. ► రిజర్వు చేసుకున్న బిడ్డను 20 రోజులలోపు సరిపోల్చుకుని దత్తత ఏజెన్సీ వద్దకు వెళ్లి బిడ్డ నచ్చిందని ఆమోదం తెలియజేసి రూ.40 వేలు డీడీ ద్వారా చెల్లించి బిడ్డను పొందవచ్చు. ► బిడ్డను పొందిన వారం రోజులలోపు సదరు దత్తత ఏజెన్సీ దత్తతకు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలన్నింటినీ స్థానిక కుటుంబ న్యాయస్థానం లేదా జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో సమర్పించి దత్తత ఉత్తర్వుల ప్రతిని పొందాలి. ► దత్తత తీసుకున్న బిడ్డ సంక్షేమం కోసం స్థానిక దత్తత ఏజెన్సీకి చెందిన సోషల్ వర్కర్ రెండు సంవత్సరాల పాటు ప్రతి ఆరు నెలలకు ఒకసారి గృహ సందర్శన చేసి ఫాలోఅప్ రిపోర్టును ‘కారా’ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఫాలోఅప్ సందర్శనకు వచ్చిన ప్రతిసారి దత్తత ఏజెన్సీకి రూ.2 వేలు డీడీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. -
విద్యా సంస్థలకు యూజీసీ లేఖ
సాక్షి, అమరావతి: దేశంలో అనాధ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన సూపర్ న్యూమరరీ సీట్లతో ఎంతమంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది? ఎన్ని విద్యా సంస్థల్లో వారికి సీట్లు ఇచ్చారో తెలపాలని అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వాటికి లేఖ రాసింది. ఇందుకు సంబంధించిన నోటీసును తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. కోవిడ్‌తో 2020, 2021ల్లో అనేక మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో పిల్లలు అనాధలుగా మారారు. వీరిలో కొంతమంది పాఠశాల చదువుల్లో ఉండగా మరికొంతమంది ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. వీరు తదుపరి ఉన్నత తరగతుల్లో చేరేందుకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్’ కింద అన్ని విద్యాసంస్థల్లోనూ సూపర్ న్యూమరరీ సీట్లు ప్రవేశపెట్టాలని గతేడాది మార్చిలో సూచించింది. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలూ సూపర్ న్యూమరరీ సీట్లను అనాధ విద్యార్థులకు కేటాయించేలా చేసింది. ఇప్పుడు విద్యా సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో సూపర్ న్యూమరరీ సీట్లతో లబ్ధి పొందిన వారి సమాచారాన్ని తెలియచేయాలని యూజీసీ ఆయా విద్యాసంస్థలకు సూచించింది. విద్యార్థుల సంఖ్యతో పాటు వారు ఏయే కోర్సులు అభ్యసిస్తున్నారు? వారు ఎలాంటి సహాయం పొందుతున్నారు? వంటి అంశాలను కూడా అందించాలని కోరింది. -
Turkey and Syria Earthquake: బాల్యం శిథిలం
అమ్మ పొత్తిళ్లలో హాయిగా పడుకోవాల్సిన అభం శుభం తెలియని పసికందులు అందరినీ కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. ఎందుకీ విపత్తు ముంచుకొచ్చిందో తెలీక నిలువ నీడ లేక ఎందుకు రోడ్లపైకొచ్చామో అర్థం కాక బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తుర్కియే, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపం ఎందరో చిన్నారుల్ని అనాథల్ని చేసింది. వీరిలో చాలా మంది రోజుల పసికందులే. ఇప్పటికే అంతర్యుద్ధంతో అల్లాడిపోతున్న సిరియాలో భూకంపం పిల్లల నెత్తిన పిడుగుపాటులా మారింది. ప్రకృతి వైపరీత్యాలు, అధికార కాంక్షతో మానవులు చేస్తున్న యుద్ధాలు చిన్నారులకు ఎలా శాపంగా మారుతున్నాయి..? తుర్కియే భూకంపంలో శిథిలాల మధ్యే ఒక పసిపాప భూమ్మీదకొచ్చింది. బిడ్డకి జన్మనిచ్చిన ఆ తల్లి ప్రాణాలు కోల్పోవడంతో పుడుతూనే అనాథగా మారింది. అయా (అరబిక్ భాషలో మిరాకిల్) అని పేరు పెట్టి ప్రస్తుతానికి ఆస్పత్రి సిబ్బందే ఆ బిడ్డ ఆలనా పాలనా చూస్తున్నారు. ఈ రెండు దేశాల్లో సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటే ఎక్కువగా పిల్లలే శిథిలాల కింద నుంచి ప్రాణాలతో బయటకి వస్తున్నారు. 10 రోజుల నుంచి 14 ఏళ్ల వయసున్న వారి వరకూ ప్రతీ రోజూ ఎందరో పిల్లలు ప్రాణాలతో బయటకి వస్తున్నారు. వారంతా తల్లిదండ్రులు, బంధువుల్ని కోల్పోయి అనాథలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఈ చిన్నారులకు అండగా యునిసెఫ్ బృందం తుర్కియే చేరుకుంది. తుర్కియేలో 10 ప్రావిన్స్‌లలో 46 లక్షల మంది చిన్నారులపై ప్రభావం పడిందని యూనిసెఫ్ అధికార ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ చెప్పారు. సిరియాలో బాలల దురవస్థ పన్నెండేళ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాలో ఇప్పటికే చిన్నారులు దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. యుద్ధ వాతావరణంలో గత పదేళ్లలో సిరియాలో 50 లక్షల మంది జన్మిస్తే వారిలో మూడో వంతు మంది మానసిక సమస్యలతో నలిగిపోతున్నారు. బాంబు దాడుల్లో ఇప్పటికే 13 వేల మంది మరణించారు. పులి మీద పుట్రలా ఈ భూకంపం ఎంత విలయాన్ని సృష్టించిందంటే 25 లక్షల మంది పిల్లల జీవితాలను అల్లకల్లోలం చేసినట్టుగా యూనిసెఫ్ అంచనా వేస్తోంది. ఇంతమందికి సరైన దారి చూపడం సవాలుగా మారనుంది. పిల్లల భవిష్యత్తుకి చేయాల్సింది ఇదే.! ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల విద్య, సంక్షేమం కోసం కృషి చేసే ఐక్యరాజ్యసమితి సంస్థ యునిసెఫ్ ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు జరిగే ప్రాంతాలు, కరువు, పేదరికం ఎదుర్కొనే దేశాల్లో పిల్లలకి భద్రమైన భవిష్యత్ కోసం కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది... ► ప్రభుత్వాలు యూనివర్సల్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్‌లతో పిల్లలకు ప్రతి నెలా ఆదాయం వచ్చేలా చూడాలి. ► శరణార్థులు సహా అవసరంలో ఉన్న పిల్లలందరికీ సామాజిక సాయం అందేలా చర్యలు చేపట్టాలి. ► ప్రకృతి వైపరీత్యాల ముప్పున్న ప్రాంతాలతో పాటు , ఇతర ఘర్షణాత్మక ప్రాంతాల్లో సంక్షేమ వ్యయాన్ని వీలైనంత వరకు పరిరక్షించాలి. ► పిల్లల చదువులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు బడి బాట పట్టేలా చర్యలు తీసుకోవాలి. ► మాత శిశు సంరక్షణ, పోషకాహారం అందించడం. ► బాధిత కుటుంబాలకు మూడు పూటలా కడుపు నిండేలా నిత్యావసరాలపై ధరల నియంత్రణ ప్రవేశపెట్టాలి. చిన్నారులపై పడే ప్రభావాలు ► ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులతో ప్రభావానికి లోనయ్యే పిల్లల సంఖ్య సగటున ఏడాదికి 17.5 కోట్లుగా ఉంటోందని యునెస్కో గణాంకాలు చెబుతున్నాయి. ► ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలతో ఒంటరైన పిల్లలు ఎన్నో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల వారిలో పెరుగుదల ఆరోగ్యంగా ఉండదు. ఇలా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారు పుట్టకొకరు చెట్టుకొకరుగా మారిన పిల్లల్లో 18% వరకు ఉంటారు. ► 50% మంది పిల్లలు మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. భూకంపం వంటి ముప్పులు సంభవించినప్పుడు గంటల తరబడి శిథిలాల మధ్య ఉండిపోవడం వల్ల ఏర్పడ్డ భయాందోళనలు వారిని చాలా కాలం వెంటాడుతాయి. ► సమాజంలో ఛీత్కారాలు దోపిడీ, దూషణలు, హింస ఎదుర్కొంటారు. బాలికలకు ట్రాఫికింగ్ ముప్పు! ► తుఫాన్లు, వరదలు, భూకంపాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. ► 2021లో ప్రకృతి వైపరీత్యాలు, ఉక్రెయిన్ వంటి యుద్ధాల కారణంగా 3.7 కోట్ల మంది పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరుగా మారారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కన్నపేగు కన్నీరు!
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు ఆమె. ఆమె కొడుకు, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు, కోడలు ఆమెను ఊళ్లోనే వదిలేసి కామారెడ్డికి వలస వెళ్లారు. తర్వాత కొడుకు బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లాడు. ఆమె వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో వంట కూడా చేసుకోలేక ఆకలితో అలమటించింది. కోడలికి సమాచారం ఇచ్చినా రాకపోవడంతో గ్రామస్తుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. వారు కోడలిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేదు. వృద్ధురాలు ఇరుగుపొరుగు వారు నాలుగు మెతుకులు పెడితే తిని కాలం వెళ్లదీసేది. ఆవేదనతో ఓ రోజు ఉరివేసుకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండరామేశ్వర్పల్లికి చెందిన ఓ వృద్ధుడు తన కొడుకు పట్టించుకోవడం లేదంటూ ఇటీవల పోలీసులను ఆశ్రయించాడు. ఆయన కష్టపడి ఎనిమిది ఎకరాల భూమి సంపాదించి పెట్టాడు. కుమార్తెలకు పెళ్లిళ్లు అయిపోయాయి. భార్య చనిపోయింది. తాను కష్టపడి సంపాదించిన భూమిని సాగు చేసుకుంటున్న కొడుకు తనకు తిండి కూడా పెట్టక పోవడంతో తల్లడిల్లిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కొడుకును పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా మార్పు రాలేదని ఆ వృద్ధుడు ఆవేదన చెందుతున్నాడు. సాక్షి, కామారెడ్డి: వారు వయసు మీద పడిన వృద్ధులు.. పిల్లాజెల్లా అంతా ఉన్నా పట్టించుకునేవారు లేక బాధపడుతున్నవారు.. నడిచే శక్తి, పలికే ఓపిక లేక ఇబ్బందిపడుతున్నవారు.. పిడికెడు మెతుకులు పెట్టి, కాసింత చోటు ఇస్తే.. బిడ్డల నీడలో కన్నుమూస్తామని ఆరాటపడుతున్నారు. ఇలాంటి వృద్ధ దంపతుల్లో ఇద్దరు ఉన్నంత కాలం ఎలాగోలా బతికేస్తున్నా.. ఎవరైనా ఒకరు దూరమైన తర్వాత ఒంటరి జీవితం నరకప్రాయంగా మారుతోంది. తోడు కోల్పోయి, బిడ్డల ఆదరణ కరువై మానసికంగా కుంగిపోతున్నారు. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతూ.. సరైన వైద్యం అందక కన్నుమూస్తున్నారు. మరికొందరు ఈ జీవితం మాకొద్దంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవలికాలంలో చాలా చోట్ల వృద్ధుల బలవన్మరణాలు వెలుగు చూస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై.. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కొన్ని కుటుంబాల్లో తండ్రులే కాదు తాతలు కూడా కలిసి జీవించారు. ఆ పెద్దల మాట మేరకు ఎవరి పనివారు చేసుకుంటూ ఉండేవారు. కొన్నేళ్లుగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. చాలా కుటుంబాల్లో కన్నవారిని కూడా భారంగా భావించే పరిస్థితి నెలకొంది. ఉద్యోగం, వ్యాపారం పేరుతో పట్టణాలకు వెళ్తున్నవారు కన్నవారిని ఇంటి దగ్గరే వదిలేస్తున్నారు. ఊర్లలోనూ విడిగా ఉంటున్నారు. దీనితో వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉన్న కుటుంబాల్లో కొందరు కన్నవారిని ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. తాము ఉద్యోగాలు, వ్యాపారాల్లో బిజీగా ఉండి ఆలనా పాలనా చూడటం ఇబ్బందని చెప్పుకొంటూ డబ్బులు కట్టి ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటున్నాయి. ఆశ్రమాల్లో ఉన్న అలాంటి వృద్ధులను కదిలిస్తే చాలు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయినా తమ పిల్లలకు చెడ్డ పేరు రావొద్దని బాధను దిగమింగుకుంటున్నారు. కొందరిని బతికిస్తున్న ‘ఆసరా’ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు ఎంతో మంది వృద్ధుల బతుకులకు ‘ఆసరా’గా నిలుస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో 41 లక్షల మంది వృద్ధులు ఉండగా.. 15,94,650 మందికి వృద్ధాప్య పింఛన్ అందుతోంది. మందులు, నిత్యావసరాలకు కొంత వరకు పింఛన్ సొమ్ము ఉపయోగపడుతోంది. ఇదే సమయంలో కన్నవారి పింఛన్ డబ్బుల కోసం పిల్లలు వేధిస్తున్న ఘటనలూ ఉన్నాయి. ఆత్మహత్యల్లో 14% వృద్ధులవే.. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యల ఘటనల్లో 14 శాతం వృద్ధులవే ఉంటున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంటోంది. కన్నబిడ్డల ఆదరణ లేకపోవడం, ఒంటరితనం, అనారోగ్య సమస్యలతో వృద్ధులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఏడాదిలో తెలంగాణలో 8 వేల పైచిలుకు ఆత్మహత్యలు జరిగితే.. అందులో 12 వందల మంది వరకు వృద్ధులు ఉంటున్నారు. రాష్ట్ర జనాభాలో వృద్ధులు 11 శాతం తెలంగాణ జనాభాలో వృద్ధులు పదకొండు శాతం ఉన్నారు. 2021 అంచనాల ప్రకారం రాష్ట్ర జనాభా 3.77 కోట్లుకాగా.. ఇందులో వృద్ధుల సంఖ్య 41 లక్షలు దాటింది. ఇందులో 60–64 ఏళ్ల మధ్య వయసు వారు 12.77 లక్షల మంది.. 65–69 ఏళ్లవారు 10.18 లక్షలు, 70–74 ఏళ్లవారు 8.33 లక్షలు, 75–79 ఏళ్లవారు 5.62 లక్షలు, 80ఏళ్లు పైబడినవారు 4.70 లక్షల మంది ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి చాలా కుటుంబాల్లో పేదరికం ఇబ్బందులు సృష్టిస్తోంది. తాను, భార్యాపిల్లలు బతకడమే కష్టమని, ముసలివాళ్లను ఎలా పోషించాలంటూ కొందరు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆర్థికంగా ఉన్న కుటుంబాల్లో మరో రకమైన సమస్య ఉంటోంది. తమకు ముసలివాళ్లు అడ్డుగా ఉంటున్నారంటూ ఆశ్రమాలకు పంపడమో, వేరుగా ఉంచడమో చేస్తున్నారు. ఒంటరితనం, సరైన ఆహారం దొరకకపోవడం, పిల్లలు పట్టించుకోకపోవడంతో వృద్ధులు మానసికంగా కుంగిపోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొన్ని కుటుంబాల్లో చాదస్తం ఎక్కువైందంటూ వృద్ధులను ఇబ్బంది పెడుతుంటారు. నెలలు, ఏళ్ల తరబడి ఒకేచోట ఉండటంతో చాదస్తం వస్తుంది. అందుకే పెద్దలకు నలుగురితో కలిసి ముచ్చటించుకునే అవకాశం కల్పించాలి. మన దగ్గర ప్రభుత్వమే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ సి.వీరేందర్, సైకాలజిస్ట్, హైదరాబాద్ -
30న ‘అనాథల అరిగోస’ పేరుతో దీక్ష
పంజగుట్ట: అనాథలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలు గుర్తు చేసేందుకు 30వ తేదీన ఇందిరాపార్క్ వద్ద ‘అనాథల అరిగోస’ పేరుతో దీక్ష నిర్వహిస్తున్నట్లు అనాథల హక్కుల పోరాట వేదిక వ్యవ స్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. పోరాట వేదిక ఆధ్వర్యంలో సోమవా రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అనాథ హక్కుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు గుర్తుచేస్తూ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రొఫెసర్ హరగోపాల్, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, అద్దంకి దయాకర్, రాములు నాయక్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆప్ నేత ఇందిరా శోభన్, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు రాములుతోపాటు పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. మందకృష్ణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనాథలకు ఎన్నో హామీలు ఇచ్చి నేటికి ఏడు సంవత్సరాల ఏడు నెలలు అయ్యిందని ఇప్పటికీ అవి నెరవేర్చకుండా మోసం చేశారని విమర్శించారు. -
నిధుల లేమి.. నిర్వహణ లోపం
సాక్షి, హైదరాబాద్: ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ ఫుట్‌పాత్‌ల మీద, రోడ్ల పక్కన నరకయాతన అనుభవించే అభాగ్యులను హైదరాబాద్‌తో పాటు అన్ని పట్టణాల్లో చూస్తుంటాం. ఈవిధంగా తల దాచుకునేందుకు అగచాట్లు పడే అనాథలు, ఒంటరి యాచకులు, అభాగ్యులు, మానసిక రుగ్మతలతో బాధపడేవారికి అండగా నిలవాల్సిన బాధ్యత స్థానిక పాలకుల దేనని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆచరణలోకి తీసుకురావడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. వాస్తవానికి ఇలాంటి వారి కోసం జాతీయ పట్టణ జీవనోపాధి పథకం (నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ – ఎన్యూఎల్ఎం) కింద రాత్రి ఆవాసాలు (నైట్ షెల్టర్లు) ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పట్టణ పాలక సంస్థలదే. ఈ విధంగా నైట్ షెల్టర్లు ఏర్పాటు చేసే ప్రక్రియకు 2014లో శ్రీకారం చుట్టినా.. పట్టణ సంస్థల చిత్తశుద్ధి లోపంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 35 నైట్ షెల్టర్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. వీటిలో 17 సెంటర్లు జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ సర్కిళ్లలో ఉండగా, మిగతా 141 పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న నైట్ షెల్టర్లు కేవలం 18 మాత్రమే కావడం గమనార్హం. కాగా ఉన్న నైట్ షెల్టర్లు కూడా సరైన నిధుల లేమి, నిర్వహణ లోపంతో ఓ ఉదాత్త కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో విఫలమవుతున్నాయి. ఖమ్మం నైట్‌షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులు నవంబర్‌లో ర్యాపిడ్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా మరో 23 కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోంది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అండ్ కమిషనర్ (సీడీఎంఏ) సత్యనారాయణ నేతృత్వంలో ఈ కొత్త సెంటర్ల నిర్మాణం జరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో నిరాశ్రయుల ర్యాపిడ్ సర్వే ప్రక్రియ నవంబర్ నెలలో ప్రారంభం కానుంది. తదనుగుణంగా 6 కొత్త సెంటర్లను జనవరి నాటికి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అన్ని షెల్టర్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ, బెడ్లు, ట్రంకులు, బాత్ రూం సదుపాయం కల్పించాలి. ఆశ్రయం పొందేవారిలో పనిచేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న 10 శాతం మందికి ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. చాలాచోట్ల ఈ పరిస్థితి లేదన్న ఫిర్యాదుపై ... ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే గుర్తించి తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఓ అధికారి తెలిపారు. స్వచ్ఛంద సంస్థల నిర్వహణలో.. పలు స్వచ్ఛంద సంస్థలు ఈ నైట్ షెల్టర్లు నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం మెప్మా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. నైట్ షెల్టర్ నిర్వహణకు తొలి సంవత్సరం రూ. 6 లక్షలు, మరుసటి ఏడాది నుంచి ఏటా రూ.4 లక్షల చొప్పున చెల్లిస్తుంది. ఈ నిధులకు అదనంగా స్వచ్ఛంద సంస్థలు విరాళాలు సేకరించి నిర్వహణ బాధ్యతలు చూస్తాయి. షెల్టర్లలో ఆశ్రయం పొందేవారికి బ్లాంకెట్లు, ఫ్యాన్లు, ఇతర సౌకర్యాల కల్పనకు కొన్ని సంస్థలు దాతల నుంచి సహకారాన్ని తీసుకుంటున్నాయి. రామగుండంలో మూడు షెల్టర్లున్నా.. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మూడు నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు 2013లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక్కో నైట్‌షెల్టర్‌కు రూ.44 లక్షలు చొప్పున కేటాయించారు. గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో, ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి ఆవరణలో, రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో 2019 నుంచి వీటిని వినియోగంలోకి తీసుకొచ్చారు. ఒక్కో షెల్టర్‌లో 50 మంది వరకు ఆశ్రయం పొందే వీలుండగా ఇందులో ఐదుగురికి మాత్రం భోజనం పెడతారు. మరోవైపు సరైన సదుపాయాలు, టాయ్లెట్లు లేక బస చేయడానికి నిరాశ్రయులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అధికారులు రాత్రుళ్లు సర్వే చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు నైట్‌షెల్టర్ల గురించి ప్రచారం కూడా చేయకపోవడంతో నిరాశ్రయులకు రోడ్లు, ఫుట్‌పాత్‌లే దిక్కవుతున్నాయి. ఖమ్మంలో భేష్.. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో రెండు నైట్ షెల్టర్లు ఉన్నా యి. ప్రభుత్వ ఆస్పత్రిలో మెప్మా ఆధ్వర్యంలో నైట్ షెల్టర్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ 20 మంది పడుకునేందుకు బెడ్లు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ నైట్ షెల్టర్‌ను 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. మరొకటి బైపాస్ రోడ్డులోని ప్రభుత్వ భవనంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ 200 మంది ఉండేలా సౌకర్యాలు కల్పించారు. భవనంలో పై అంతస్తులో 100 మంది మహిళలు, గ్రౌండ్ ఫ్లోర్లో 100 మంది పురుషులు ఉండొచ్చు. ఈ షెల్టర్‌ను అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు జరగని సర్వే ఎన్యూఎల్ఎం కింద రాష్ట్రంలో మున్సిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మిషన్ (మెప్మా) ఆధ్వర్యంలో నడుస్తున్న 35 నైట్ షెల్టర్లలో 1,990 మంది మాత్రమే ఆశ్రయం పొందేందుకు అవకాశం ఉంది. ఖమ్మం బైపాస్ రోడ్డులోని టాకులపల్లి బ్రిడ్జి దగ్గర డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ నిర్వహిస్తున్న నైట్‌షెల్టర్‌లో మాత్రమే అత్యధికంగా 350 మంది ఆవాసం ఉండేందుకు అవకాశం ఉంది. ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసు పత్రి వద్ద ఆదిలాబాద్ పట్టణ సమాఖ్య నిర్వహిస్తున్న కేంద్రంలో 100 మంది, హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి కేంద్రంలో 118 మంది, బేగంపేట కంట్రీక్లబ్ వద్ద గల కేంద్రంలో 130 మంది, కోఠి ఆర్టీసీ బస్టాండ్ వద్ద సెంటర్లో 100 మంది నిరాశ్రయులు ఉండేందుకు వీలుగా నైట్ షెల్టర్లు ఉన్నాయి. మిగతా అన్ని చోట్లా 15 నుంచి అత్యధికంగా 77 మంది నిరాశ్రయులు మాత్రమే రాత్రి వేళల్లో ఉండేందుకు ఏర్పాట్లు ఉన్నా యి. మెప్మా ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించి, ఆశ్రయం లేక ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి ఈ కేంద్రాల్లో చేర్చాల్సి ఉన్నప్పటికీ.. ఈ తర హా కసరత్తు సరిగా జరగడం లేదనే ఫిర్యాదులున్నాయి. ఉన్న కొన్ని షెల్టర్లలో ప్రజలు పూర్తిస్థాయిలో తలదాచుకునే పరిస్థితులు లేవనే విమర్శలు కూడా ఉన్నాయి. నిధుల్లేవు.. వసతుల్లేవు.. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, ఆదిలాబాద్ వంటి చోట్ల మెప్మా పర్యవేక్షణ లోపంతో షెల్టర్లలో ఉన్న వారికి మౌలిక వసతుల కల్పన జరగడం లేదనే ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల నిర్వహణకు అవసరమైన సొమ్ము అందడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. వరంగల్‌లోని రెండు సెంటర్లలో ఒక సమయంలో 233 మంది నిరాశ్రయులకు నైట్‌షెల్టర్లు ఆశ్రయం కల్పించాయి. అయితే నెలకు రూ.33 వేల చొప్పున చెల్లించాల్సిన నిర్వహణ ఖర్చులను మెప్మా నుంచి అందలేదు. దీంతో నిర్వహణ గాడితప్పింది. రామగుండంలో ఒక్కో షెల్టర్‌లో 50 మంది వరకు ఉండే వీలున్నా, 10 మంది కూడా ఉండడం లేదు. వాస్తవానికి గోదావరి ఖని, రామగుండం ప్రాంతాల్లో రోడ్లపక్కన చలికి గజగజ వణుకుతూ పడుకునేవారు కోకొల్లలు. ఇక రాష్ట్రవ్యాప్తంగా వీరిసంఖ్య వేలల్లోనే ఉండే అవకాశం ఉండగా..వివిధ కారణాల రీత్యా ప్రస్తుతం నైట్‌షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నవారు కేవలం 1,500 మంది వరకు మాత్రమే ఉండటం శోచనీయం. అనా«థలకు నీడనిస్తున్న ఈ సెంటర్ల విషయంలో మెప్మా మరింత చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
విషాద జీవితాల అనాథ బిడ్డలకు ‘అమ్మఒడి’ ఆలంబన
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆ బిడ్డలు చేసిన పాపం ఏమిటో వారెవరికీ తెలియదు. తల్లి గర్భం నుంచి బాహ్య ప్రపంచంలోకి రాగానే అనాథలయ్యారు. అమ్మ ఆప్యాయత, నాన్న అనురాగానికి దూరమయ్యారు. వారిని ‘దాతృత్యం’ అక్కున చేర్చుకుంది. కన్నబిడ్డల కంటే మిన్నగా ఆదరించి కడపు నింపింది. అయితే దశాబ్దాలుగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. పాలకులు మారినా ఇటువంటి వారికి అందరి మాదిరిగానే ప్రభుత్వ పథకాలకు అర్హులైనా సంక్షేమ పథకాలు అందని పరిస్థితి నెలకొంది. రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మానవత్వం, ప్రభుత్వ యంత్రాంగం చొరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హృదయాన్ని కదిలించింది. హృదయాలు ద్రవించే విషాద జీవితాల అనాథ బిడ్డలకు ఒక్క సంతకం ‘అమ్మఒడి’ ఆలంబనగా నిలిచింది. తల్లిదండ్రుల స్థానంలో దేవుళ్ల పేరు పాఠశాలలో చేరే విద్యార్థులకు తల్లిదండ్రులు పేర్లు, మతం, కులం తప్పనిసరిగా పొందుపర్చాల్సింగా స్పష్టమైన ఆదేశాలున్నాయి. అయితే తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాథ బిడ్డలకు దేవుళ్లే తమ తల్లిదండ్రులుగా భావించి (సరస్వతి, లక్ష్మీ, పార్వతి, శివయ్య, బ్రహ్మ, విష్ణుమూర్తి) వంటి పేర్లను రాసుకుంటున్నారు. గతంలో ఎస్ఎస్సీ పరీక్షల్లో తండ్రి పేరే రాయాల్సి ఉండేది. 2009 సెప్టెంబర్ 14 నుంచి తల్లి పేరు తప్పనిసరి చేయడంతో తల్లి పేరు కూడా రాయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు తండ్రి పేరు రాసేందుకు తంటాలు పడిన విద్యార్థులు చివరకు తల్లిదండ్రులుగా దేవుళ్లు, దేవతల పేర్లనే దరఖాస్తుల్లో నమోదు చేసుకుంటున్నారు. సంక్షేమానికి దూరంగా అనాథ బాలబాలికలు రాష్ట్ర ప్రభుత్వం విద్యావిప్లవాన్ని తీసుకొచ్చింది. పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు. నాడు–నేడు పథకంతో మౌలిక వసతులను సమకూర్చింది. అర్హులైన విద్యార్థులు పాఠశాలల్లో ఉండాలనే సంకల్పం తీసుకుంది. ఇంతటి మహోన్నత ఆశయంలో కూడా అనాథ బాలబాలికలకు ‘అమ్మఒడి’ అర్హత లేకుండా పోయింది. సంక్షేమ పథకాలకు ప్రధానంగా రేషన్‌కార్డు, కులం, ఆదాయం, ఆధార్ కార్డు తప్పనిసరిగా అయ్యాయి. ఎవరో దాత దాతృత్వంతో బతికే వీరికి కులం, ఆదాయ ధ్రువీకరణ, గుర్తింపు కార్డులు గగనమయ్యాయి. దీంతో అర్హులైనప్పటికీ అమ్మఒడి వర్తించడంలేదు. ఫలించిన ఎంపీ వేమిరెడ్డి కృషి వాత్సల్య అనాథాశ్రమ నిర్వాహకులు ఈ పరిస్థితిని ఓ వైపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తూనే మరోవైపు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి వివరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాలబాలికల విద్యకోసం విశేషంగా కృషి చేస్తున్న తరుణంలో అనాథలకు అమ్మఒడి పథకం వర్తించకపోవడాన్ని విని చలించిపోయారు. కలెక్టర్‌తో చర్చించి నివేదికను రూపొందించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 227 మంది అనాథ బాలబాలికలు అమ్మఒడికి అర్హులుగా తేల్చారు. అదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నెల్లూరు జిల్లాతో సరిపెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమాల్లో ఉంటూ చదుకుంటున్న అనాథ బాలబాలికలు వివరాలపై నివేదిక కోరారు. ఆ విధంగా 5,990 మంది అనాథ విద్యార్థులకు రూ.7.787 కోట్లు విడుదల చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లెటర్ నంబర్.1768275/2022 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు నెల్లూరు జిల్లాలోని అనాథ బాలబాలికలకు రూ.29.51 లక్షలు విడుదలయ్యాయి. నెల్లూరులో బీజం.. అనాథ బిడ్డలకు అమ్మఒడి పథకం వర్తింప చేయాలనే ఆలోచనకు నెల్లూరులో బీజం పడింది. రాష్ట్ర వ్యాప్తంగా అనాథాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న అందరికీ వర్తించింది. నెల్లూరు నగరంలోని కొండాయపాళెం రోడ్డు సమీపంలోని రామకృష్ణానగర్‌లో ఉన్న జనహిత–వాత్సల్య సేవా సంస్థలో దాదాపు 117 మంది అనాథ బాలలు ఆశ్రమం పొందుతున్నారు. దాతల దాతృత్వంలో నడిచే ఈ సేవా సంస్థ ఆధ్వర్యంలో భారతీయ విద్యా వికాస్ పేరుతో ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను నిర్వహిస్తోంది. ఆ పాఠశాలలో విద్యను అభ్యసించే ఇతర విద్యార్థులకు అమ్మఒడి పథకం వర్తిస్తోంది. అనాథలుగా ఉన్న విద్యార్థులకు వర్తించడం లేదు. ఇదే విషయం జనహిత–వాత్సల్య సేవా సంస్థ ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. కలెక్టర్ చక్రధర్‌బాబు చొరవతో ఇటువంటి అనాథలను జిల్లా వ్యాప్తంగా 227 మందిని గుర్తించి ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రజాప్రతినిధుల తోడ్పాటుతో అమ్మఒడి పథకం వర్తించింది. జిల్లా నుంచి వెళ్లిన సిఫార్సులను పరిశీలించిన ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా వర్తింప చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనాథ బాలబాలికలకు 5,590 మందికి రూ.7.787 కోట్లు అమ్మఒడి నిధులు మంజూరయ్యాయి. అనాథలకు ఎంతో ఉపయోగం చదువుకు సర్కార్ తోడ్పాటునిస్తోంది. అమ్మఒడి చక్కటి పథకం. ఎంతో కాలంగా అనాథ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని కోరుతున్నాం. మా అభ్యర్థను కలెక్టర్ మన్నించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చొవర కారణంగా సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపజేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మనసున్న ముఖ్యమంత్రి అని చాటుకున్నారు. ఆశ్రమాలు నిర్వహణకు అమ్మఒడి తోడ్పాటు కానుంది. – జీవీ సాంబశివరావు, వాత్సల్య అనాథాశ్రమం సంస్థాగత కార్యదర్శి సమాజంలో వారికి గుర్తింపు సమాజంలో అనా«థలను ప్రభుత్వాలు అక్కున చేర్చుకోవాలి. గత ప్రభుత్వాలు అనా«థల విషయంలో సరైన న్యాయం చేయలేకపోయింది. కేవలం దాతల దాృతత్వంతోనే జీవనం సాగిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం స్పందించింది. అమ్మ ఒడి పథకం వర్తించేలా కసరత్తు చేయడం హర్షనీయం. అనా«థలు అంటే మన పిల్లలే అనే భావన అందరిలో కలగాలి. వారిని చేరదీసి ప్రయోజకుల్ని చేయాలి. – సామంతు గోపాల్‌రెడ్డి, వాత్సల్య సేవా సంస్థ గౌరవాధ్యక్షుడు -
ఆరుబయట జీవనం.. అనాథలుగా మరణం!
రాయదుర్గం: నా అనే వారు లేక దీన స్థితిలో కాలం వెళ్లదీస్తూ కొందరు... అయినవాళ్లందరూ ఛీదరించుకుని గెంటేస్తే రోడ్డున పడిన మరికొందరు వృద్ధాప్యంలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య పొత్తిళ్లలో నుంచి కాపాడుకుంటూ వచ్చి, విద్యాబుద్ధులు చెప్పించి, జీవితంలో ఓ స్థాయికి ఎదిగేలా చేసిన తల్లిదండ్రులను కొందరు నిర్దాక్షిణ్యంగా రోడ్డున వదిలేస్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రహదారుల పక్కనే అనాథలుగా జీవనం సాగిస్తూ.. చివరకు అనాథలుగానే మృతి చెందుతున్నారు. ఈ మూడేళ్ల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 42 మంది అనాథలుగా మృతిచెందారు. ఇందులో 15 మృతదేహాల ఆచూకీని పోలీసులు గుర్తించి సంబందీకులకు అప్పగించారు. మరో 27 కేసుల్లో మృతుల కుటుంబసభ్యులు ఎవరైంది ఆచూకీ చిక్కడం లేదు. ఇతని పేరు జి.గోవిందు. డి.హీరేహాళ్ మండలం గొడిశెలపల్లి. వివిధ కారణాలతో తల్లిదండ్రులు, సోదరి, సోదరులు మృతి చెందారు. ఒంటరిగా జీవనం సాగిస్తున్న అతనికి బళ్లారికి చెందిన ఓ యువతితో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె ఉంది. కొన్నేళ్లపాటు వీరి సంసారం సజావుగా సాగింది. ఇటీవల అంతు చిక్కని వ్యాధితో గోవిందు సతమతమవుతున్నాడు. కాలుకు ఇన్ఫెక్షన్ సోకి వేళ్లు తెగిపోయాయి. ఈ క్రమంలో కుటుంబపోషణ భారం కావడంతో 15 ఏళ్ల క్రితం అతణ్ని వదిలేసి పాపతో కలసి భార్య వెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో అతని పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. అద్దె చెల్లించలేక ఇల్లు ఖాళీ చేసి నడిరోడ్డుపైకి చేరుకున్నాడు. గ్రామంలోని బస్ షల్టర్‌లో ఉంటూ ఇరుగుపొరుగు వారు అందించే ఆహారంతో బతుకు నెట్టుకొస్తున్నాడు. మీరు చూస్తున్న ఈ చిత్రంలోని వృద్ధురాలి పేరు ఈరమ్మ. కర్ణాటకలోని బళ్లారి జిల్లా గోనేహాళ్ గ్రామం. అనంతపురం జిల్లా రామగిరి, బొమ్మనహాళ్ ప్రాంతాల్లో సమీప బంధువులున్నారు. ఈ నెల 4న బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు క్రాస్ వద్ద ఆమె మృతి చెందింది. అంతకు ముందు 20 రోజులుగా అక్కడే చావుబతుకుల మధ్య ఆమె కొట్టుమిట్టాడింది. అయినవాళ్లు అందరూ ఉన్నా.. చివరకు అనాథగా కన్ను మూయడంతో గ్రామ నౌకర్ల సాయంతో అధికారులు అంత్యక్రియలు పూర్తి చేయించారు. మీరు చూస్తున్న ఈ చిత్రం రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోనిది. కొంతకాలంగా రాయదుర్గం – భైరవాని తిప్ప ప్రాజెక్ట్ ప్రధాన రహదారిలోని రింగ్ రోడ్డు వద్ద ఒంటరిగా నివసిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ నెల 6న ఆలస్యంగా ఈ విషయం వెలుగుచూసింది. అప్పటికే మృతదేహం కుళ్లి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ఆ చుట్టుపక్కల నివాసముంటున్న వారు మృతదేహాన్ని బయలు ప్రాంతానికి మార్చారు. ఈ విషయం తెలుసుకున్న రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ దివాకర్‌రెడ్డి వెంటనే పారిశుద్ధ్య కారి్మకులను పంపి ఆ మృతదేహన్ని ఖననం చేయించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఎవరైంది ఇప్పటి వరకూ పోలీసులు గుర్తించలేకపోయారు. భరోసానివ్వాలి అనాథలుగా ఏ ఒక్కరూ జీవించేందుకు వీల్లేదు. నిజంగా ఎవరైనా అనాథగా గుర్తింపబడితే వెంటనే వారిని ఆదరించడం మానవధర్మం. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత బిడ్డలపై ఉంది. దగ్గరుండి వారి అవసరాలను తీర్చాలి. మేమున్నామంటూ భరోసానివ్వాలి. అలా కాదని భారంగా భావించి రోడ్లపై వదిలేయడం సరైన పద్ధతి కాదు. ఆఖరి క్షణాల్లో వారు అనుభవించే బాధను ఆలోచించాలి. – ఎస్.నాగలక్ష్మీ, కలెక్టర్ కఠిన చర్యలు తీసుకుంటాం తల్లిదండ్రులను కేవలం వ్యక్తులుగా కాకుండా సమాజ మార్గదర్శకులుగా చూడాలి. వారి అనుభవాలు మన జీవిత గమనాన్ని మారుస్తాయి. అలాంటి దేవతామూర్తులను ఆఖరి క్షణాల్లో ఆరుబయట వదిలేయడం దారుణం. అయినవాళ్లందరూ ఉండి అనాథగా మరణిస్తున్నారంటే అది మానవ జన్మకే సిగ్గుచేటు. శిశువుగా పుట్టినప్పటి నుంచి పెద్దయ్యేవరకూ పోషించడంలో వారు పడ్డ ఇబ్బందులను గుర్తు చేసుకోవాలి. మలిదశలో వారిని సేవించడాన్ని అదృష్టంగా భావించాలి. కాదని నిర్దాక్షిణ్యంగా రోడ్లపాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ ఫక్కీరప్ప, ఎస్పీ (చదవండి: ఊపిరిపీల్చుకున్న ‘అనంత’) -
రేప్ కేసు రద్దు.. మాజీ భర్తకు వెరైటీ శిక్ష
ఢిల్లీ: అత్యాచారం ఆరోపణలతో మాజీ భర్తపై కోర్టుకెక్కింది ఓ మహిళ. అయితే.. చివరికి ఇద్దరూ ఓ ఒప్పందానికి వచ్చి కేసు వాపసు తీసుకునే యత్నం చేశారు. మరి తమ విలువైన సమయాన్ని వృథా చేస్తే న్యాయస్థానం ఊరుకుంటుందా? అందుకే విచిత్రమైన ఓ శిక్ష విధించింది. నోయిడా, మయూర్ విహార్‌లో బర్గర్ సింగ్, వాట్ ఏ బర్గర్ పేరుతో సదరు వ్యక్తికి రెండు బర్గర్ రెస్టారెంట్లు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో బాధితురాలితో విడిపోయి.. మరో వివాహం చేసుకున్నాడతను. అయితే.. వైవాహిక బంధంలో తన భర్త శారీరకంగా, మానసికంగా తనను హింసించాడంటూ 2020లో ఆమె కోర్టును ఆశ్రయించింది. రెండేళ్లపాటు కోర్టులో కేసు విచారణ కొనసాగగా.. జులై4వ తేదీన న్యూఢిల్లీ సాకేత్ కోర్టులో మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. దీంతో ఆ మాజీ భార్య అతనిపై ఎఫ్ఐఆర్ రద్దుకు అంగీకారం తెలిపింది. అయితే.. ఈ పరిణామంపై జస్టిస్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, కోర్టుల విలువైన సమాయాన్ని వృథా చేశారు. ఈ వ్యవధిలో ఎన్నో కీలక అంశాలను చర్చించే వాళ్లం. కాబట్టి, పిటిషనర్ కచ్చితంగా సంఘానికి పనికొచ్చే ఏదైనా ఒక పని చేయాల్సిందే అని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు.. అతనిపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటే అనాథలకు బర్గర్ అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రెండు అనాథశ్రమాలను ఎంచుకుని వంద మంది దాకా అనాథలకు బర్గర్ అందించాలని ఆ వ్యక్తిని ఆదేశించింది కోర్టు. పైగా శుభ్రమైన వాతావరణంలో ఆ బర్గర్లు తయారు చేయాలని, పోలీసులు దగ్గరుండి ఈ వ్యవహారాన్ని చూసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది. అంతేకాదు.. మాజీ భార్య సమయాన్ని సైతం వృధా చేసినందుకుగానూ రూ.4.5 లక్షలు పరిహారంగా చెల్లించాలని, అనాథలకు బర్గర్లు పంచే రోజునే అది చెల్లించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. -
పక్కా సమాచారంతో స్ట్రింగ్ ఆపరేషన్.. ఆ ముఠా గుట్టురట్టు!
సాక్షి,ఖమ్మం గాంధీచౌక్: ఖమ్మం కేంద్రంగా శిశు విక్రయాలు సాగిస్తున్న ముఠా కార్యకలాపాలను మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం(ఏహెచ్‌టీఓ), చైల్డ్‌లైన్ బృందం బట్టబయలు చేసింది. నవజాత శిశువులతో పాటు అప్పుడే పుట్టిన పసికందులను విక్రయిస్తున్నారనే సమాచారం అందడంతో రంగంలోకి దిగిన బృందం తమకు పిల్లలు కావాలని ముఠా సభ్యులతో సంప్రదింపులు జరిపారు. ఆతర్వాత డబ్బు చెల్లిస్తామని నమ్మబలుకుతూ ముఠా గుట్టు రట్టు చేయడం విశేషం. ఈమేరకు ముఠా సభ్యులపై ఖమ్మం టూ టౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేయగా వివరాలిలా ఉన్నాయి. పిల్లలు లేని దంపతులే టార్గెట్ వివాహమై ఏళ్లు గడిచినా సంతానం కలగని దంపతులు అధికారికంగా దత్తత ప్రక్రియపై అవగాహన లేక ఇతరులను ఆశ్రయిస్తున్నారు. ఇదేఅదునుగా రంగంలోకి దిగిన ముఠా, పిల్లలను పోషించలేని వారి నుంచి తీసుకుని రూ.లక్షల్లో నగదు తీసుకుని అమ్ముకుంటున్నారు. ఈక్రమంలో జిల్లాకేంద్రంలోని వికలాంగుల కాలనీకి చెందిన ఉప్పతల పుల్లారావు, అద్దంకివారి వీధికి చెదిన మోదుగు మేరీ నవజాత శిశువులు, చిన్న పిల్లలను అమ్ముతున్నారని గుర్తు తెలియని వ్యక్తులు చైల్డ్‌లైన్ – 1098 కోఆర్డినేటర్ కువ్వారపు శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన చైల్డ్‌లైన్ ఉన్నతాధికారులతో పాటు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సీఐ నవీన్, సీడీపీఓ కవితకు తెలిపారు. ఈమేరకు మూడు శాఖలకు చెందిన ఉద్యోగులు అనూష, నరసింహారావు, భాస్కర్‌ను బృందంగా ఏర్పాటుచేసి స్ట్రింగ్ ఆపరేషన్ చేయించారు. వీరు ముగ్గురు మేరీతో పరిచయం పెంచుకుని తమకు పాప కావాలని కోరారు. ఎంత నగదైనా చెల్లిస్తామని చెప్పడంతో ఆమె పలువురు పసిపిల్లల ఫొటోలను వాట్సాప్‌లో పంపించి ధర కూడా వెల్లడించింది. ఇటీవల ఓ పాపను విక్రయించినట్లు చెబుతూ బాండ్ పేపర్లపై రాసిస్తామని, భవిష్యత్‌తో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పగా అన్ని వివరాలు రికార్డు చేశారు. ఇంతలోనే ఖమ్మం జెడ్పీ సెంటర్లోని ఓ ఆస్పత్రిలో కొణిజర్ల మండలానికి చెందిన మహిళ మూడో కాన్పులో ఆడ శిశువుకు జన్మనిచ్చిందని, ఆమె డిశ్చార్జి కాగానే పాపను అమ్మాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇందుకోసం రూ.4లక్షలు చెల్లించాలని, అడ్వాన్స్‌గా రూ.1.50లక్షలు ఇవ్వాలని సూచిస్తూ నగదుతో జెడ్పీ సెంటర్‌కు రావాలని చెప్పింది. ఇందుకు ఒప్పుకున్న అనూష బృందం నగదు, బాండ్ పేపర్లతో సోమవారం సాయంత్రం జెడ్పీసెంటర్‌కు వెళ్లగా ఖమ్మం టూ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి పుల్లారావు, మోదుగు మేరీతో పాటు వీరికి సహకరించిన తలారి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. కాగా, శిశువును విక్రయించేందుకు ముందుకొచ్చిన ఆమె తల్లి, ఓ ఆస్పత్రి ఉద్యోగి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈసందర్భంగా శిశు విక్రయాల వ్యవహారాన్ని చాకచక్యంగా చేధించిన చైల్డ్‌లైన్, మానవ అక్రమ రవాణా నిరోధక బృందం ప్రతినిధులను చైల్డ్‌లైన్ డైరెక్టర్ ఎంఎల్.ప్రసాద్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ భారతీరాణి తదితరులు అభినందించారు. చదవండి: రాజాసింగ్‌కు షాక్.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు ∙ -
కోవిడ్ బాధిత బాలలకు ప్రభుత్వం అండ
సాక్షి,శ్రీకాకుళం: కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి నిస్సహాయులుగా మారిన బాలలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసానిచ్చారు. కోవిడ్ బాధిత చిన్నారుల కోసం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వా రా అందించే సంక్షేమాల గురించి ఆయన సోమ వారం వర్చువల్ విధానంలో ప్రసంగిస్తూ వివరించారు. జిల్లా కేంద్రం నుంచి ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి విశ్వేశ్వర తుడు, కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, శాసన మండలి సభ్యులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సమగ్ర సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, అందుకే పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ఏర్పాటు చేశారని తెలిపారు. కలెక్టరేట్లో వర్చువల్ విధానంలో పీఎం ప్రసంగం వి న్న అనంతరం ఆయన మాట్లాడారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవడం ఈ పథకం లక్ష్యమని తెలిపా రు. ఇలాంటి పిల్లలను గుర్తించాక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీబ్ల్యూసీ) ముందు హాజరు పరిచామని, వారు వివరాలను ధ్రువీకరించాక పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పోర్టల్‌లో పిల్లల వివరాలతో పాటు డీఎం పరిశీలన కోసం అప్లోడ్ చేస్తారన్నారు. జిల్లాలో ఇలాంటి చిన్నారులు తొమ్మిది మంది ఉన్నారని, వారి గురించి ఒక్కొక్కరికి ఒక్కో ఫోల్డర్ కేటాయించామని తెలిపారు. అందులో పోస్టాఫీసు పాస్ బుక్, ముఖ్య మంత్రి సందేశ పత్రం, ధ్రువీకరణ పత్రం ఉంటాయన్నారు. వీరికి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్య ను అందించడంతోపాటు పుస్తకాలు, దుస్తులు కూ డా అందిస్తామన్నారు. నెలవారీ స్టై ఫండ్ రూపంలో రూ.4000లు వరకు అందజేస్తామన్నారు. ఈ పథకాలు పొందేందుకు పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరం లేదన్నారు. కలెక్టర్ అందరికీ బాధ్యత తీసుకుంటారని పేర్కొన్నారు. కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ మాట్లాడుతూ ఇలాంటి చిన్నారులు ఏ సమస్య వచ్చి నా తనను సంప్రదించాలన్నారు. సమస్యలు గ్రీవెన్స్‌కు తెలియజేస్తే 15 రోజులు లేదా నెల రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. వెబ్సైట్ ద్వారా సమస్యలు తెలియజేస్తే సమస్యలు పరిష్కారమవుతాయని చె ప్పారు. ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ పథకం మంచి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్బంగా మంత్రి విశ్వేశ్వర తుడుని కలెక్టర్, ఎస్పీ దుశ్శాలువ, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. -
కోవిడ్ అనాథ పిల్లలను ఆదుకుంటున్నఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని ఏపీ మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ ఎస్.సిరి తెలిపారు. పీఎం కేర్స్‌లో కేంద్రం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం (ఎక్స్‌గ్రేషియా) ఇస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లల సంక్షేమం, సహాయం విషయమై సోమవారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోను ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం కేర్స్‌కు అర్హులైన పిల్లలను ఆదుకునేలా ప్రధాని నరేంద్రమోదీ పలు సూచనలు చేశారని సిరి ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ బాధిత పిల్లలకు 23 సంవత్సరాల వయసు వచ్చేవరకు వారి సంరక్షణ, ప్రయోజనాలు కాపాడటం జరుగుతుందని పేర్కొన్నారు. కోవిడ్ అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ఎక్స్‌గ్రేషియా అందుతుందని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 351 మంది పిల్లలను అర్హులుగా ఎంపిక చేసినట్టు తెలిపారు. వారిలో ఉమ్మడి జిల్లాల లెక్కల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాలో 56 మంది, తూర్పుగోదావరి 45, అనంతపురం 40, విశాఖపట్నంలో 39, కృష్ణా 28, వైఎస్సార్ 25, గుంటూరు 24, నెల్లూరు 24, చిత్తూరు 21, కర్నూలు 16, ప్రకాశం 16, శ్రీకాకుళం 9, విజయనగరం జిల్లాలో 8 మంది అర్హులు ఉన్నారని వివరించారు. పీఎం కేర్స్‌లో ఆర్థిక సహాయంతోపాటు పిల్లల ఉన్నతవిద్యకు ఏడాదికి రూ.50 వేలు స్కాలర్షిప్ ఇస్తారని తెలిపారు. పాఠశాల విద్య కోసం కేజీబీవీ, సైనిక పాఠశాలలు, నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద 12వ తరగతి వరకు పాఠశాలకు వెళ్లే పిల్లలకు సంవత్సరానికి రూ.20 వేల ప్రత్యేక స్కాలర్షిప్ను సామాజిక న్యాయం, సాధికారత శాఖ నుంచి ఇస్తారని తెలిపారు. కోవిడ్ అనాథ పిల్లలకు ఆయుష్మాన్ భారత్–ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జాయ్)లో ప్రతి బిడ్డకు సంవత్సరానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ ఉంటుందని తెలిపారు. వారిలో 18 నుంచి 23 సంవత్సరాల వయసు గల పిల్లలకు స్టైఫండ్ ఇస్తారని తెలిపారు. ప్రభుత్వం డిపాజిట్ చేసిన రూ.10 లక్షల మొత్తాన్ని పిల్లలు 23 సంవత్సరాల వయసు నిండాకే అందుకుంటారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సందేహాలు, ఫిర్యాదులు ఉంటే వెబ్సైట్: https://pmcaresforchildren. in/.లో తెలపాలని సూచించారు. వాటిని జిల్లా మేజిస్ట్రేట్ స్థాయిలో పరిష్కరిస్తారని తెలిపారు. 15 రోజుల కంటే ఎక్కువకాలం పెండింగ్‌లో ఉంటే ఉన్నతస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటారని ఆమె పేర్కొన్నారు. -
కోవిడ్ అనాథలకు ‘పీఎం కేర్స్’: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశంలో కోవిడ్ మహమ్మారి కారణంగా అనాథలైన పిల్లలు, విద్యార్థులను ‘పీఎం కేర్స్’ద్వారా దత్తత తీసుకుంటున్నట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్’పథకాన్ని సోమవారం వర్చువల్‌గా ప్రారంభిస్తారని చెప్పారు. 2020 ఏప్రిల్ 28 నుంచి ఈ ఏడాది ఫిబ్ర వరి వరకు తల్లిదండ్రులు, సంరక్షకులు, దత్తత తీసుకున్నవారు చనిపోయి అనాథలుగా మిగిలిన పిల్లలకు కేంద్రం, ప్రధాని మోదీనే గార్డియన్‌గా వ్యవహరించేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ పథకం ప్రారంభమవుతుందని, హైదరాబాద్ కలెక్టరేట్లో జరిగే కార్యక్రమంలో తాను పాల్గొంటున్నట్టు తెలిపా రు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈ పథకం కింద ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 9,042 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని తిరిగి జిల్లా కలెక్టర్లు పరిశీలించి 4,345 మంది పిల్ల లను అర్హులుగా గుర్తించి సిఫార్సు జాబితా పంపించారని తెలిపారు. ఈ పిల్లల పేరిట రూ.10 లక్షలను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని, 18 ఏళ్లు నిండిన వారికి సోమవారం వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను అందజేస్తామన్నారు. నెలనెలా స్టైపెండ్..: కోవిడ్ అనాథలకు నెలనెలా స్టైపెండ్ కూడా ఇస్తామని చెప్పారు. 18 నుంచి 23 ఏళ్లు వచ్చే వరకు ఈ స్టైపెండ్ కొనసాగుతుందని, 23 ఏళ్లు నిండాక రూ.10 లక్షల నగదును కేంద్రప్రభుత్వం అందజేస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకునేవారికి రూ.50 వేల చొప్పున, స్కిల్ ట్రైనింగ్ పొందేవారికి ప్రత్యేక స్కాలర్షిప్లు ఇస్తారని పేర్కొన్నారు. ఇలాంటి పిల్లలు, విద్యార్థులకు అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం కల్పించేలా యూజీసీ ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు. విదేశీవిద్య చదవాలనుకునే ఈ పిల్లలకు వడ్డీలేని బ్యాంక్ రుణాలు అందజేస్తామన్నారు. వీరిలో ప్రతి ఒక్కరికీ ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల ఆరోగ్యబీమా కల్పించనున్నట్టు తెలిపారు. -
కరోనా: తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు పరిహారం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన 9మంది పిల్లలకు కేంద్రం ప్రభుత్వం పీఎం కేర్ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పోస్టాఫీస్ ఖాతాలో జమ చేసింది. కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ ఆధ్వర్యంలో జిల్లా మహిళ, శిశు సంక్షేమ, సాధికార అధికారి అనంతలక్ష్మి, జిల్లా బాలల రక్షణ అధికారి కేవీ రమణలకు వీరి పాసు పుస్తకాలు హెల్త్ ఇన్సూ్యరెన్స్ కార్డులు అందజేశారు. పిల్లలకు 23 ఏళ్లు వచ్చాక వారి అవసరాలకు వినియోగించుకునే విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. వీరికి ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 18 ఏళ్ల నిండాక వినియోగించుకునేలా ఏర్పాటు చేసింది. మరో ఘటనలో.. వేసవిలో జాగ్రత్తలు అవసరం శ్రీకాకుళం పాతబస్టాండ్: వేసవి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గోడప్రతికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ వలన సంభవించే మరణాలను అరికట్టవచ్చన్నారు. ఎండ తీవ్రత వలన శరీర ఉష్ణోగ్రత పెరిగి (104.9డిగ్రీలు) మెదడుపై ప్రభావం చూపుతుందని తద్వారా వడదెబ్బకు గురవుతారన్నారు. చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడం, మగత నిద్ర, ఫిట్స్, పాక్షికంగా అపస్మారక స్థితి వంటి లక్షణాలు కనిపించినట్లయితే సమీపంలోని వైద్యులను సంప్రదించి ప్రాథమిక చికిత్స పొందాలని సూచించారు. గొడుగు వాడడం, తెలుపు రంగు లేదా పలుచటి చేనేత వస్త్రాలు ధరించడం, తలకు టోపీ ధరించడం లేదా రుమాలు వాడడం మంచిదన్నారు. ఎండగా ఉండే సమయాల్లో ఆ రుబయట శారీరక శ్రమతో కూడిన పని చేయకుండా ఉండడం మేలన్నారు. ఇంటి నుంచి బయటకెళ్లే ముందు ఒక గ్లాసు మంచినీరు తాగడం ఉత్తమమన్నారు. మాంసాహారం తగ్గించి, తాజా కూరగాయలను ఆహారంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ఎం.విజయసునీత, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీపతి, జిల్లా వైద్యారోగ్య అధికారి అనూరాధ, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, ఇరిగేషన్ ఎస్ఈ డోల తిరుమలరావు, జిల్లా సరఫరాల అధికారి డి.వి.రమణ, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు పి.రత్నం తదితరులు పాల్గొన్నారు. -
హృదయ విదారకం.. చెదిరిన కల.. అనాథలుగా ఇలా!
సాక్షి,పెద్ద తిప్పసముద్రం(అన్నమయ్య జిల్లా): ‘మంచంపైన నాన్నను పడుకోబెట్టారు.. అందరూ పూల దండలు వేస్తూ నాన్నకు నమస్కరిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్లంతా బోరున విలపిస్తున్నారు. అసలు ఏం జరిగింది నాన్నకు. అమ్మను అడుగుదామంటే అమ్మ ఎవరో కూడా గుర్తు లేదు. అసలు ఎక్కడుందో తెలియదు.. అమ్మ ప్రేమకు దూరమైన ఆ చిన్నారులు నాన్న శవం వద్ద నిలబడి బిక్క చూపులు చూస్తుంటే ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదురా దేవుడా అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు’. ఈ హృదయ విదారక సంఘటన మండలంలోని సంపతికోట పంచాయతీ ముంతపోగులవారిపల్లిలో జరిగింది. వివరాలిలా.. బూర్లపల్లి రామకృష్ణ (37), నాగరత్న దంపతులు. వీరికి మోహన్ (9), చరణ్ (7)లు సంతానం. కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. చిన్న కుమారుడు చరణ్‌కు ఆరు నెలల వయసు ఉన్నప్పుడే నాగరత్న భర్త, పిల్లలను వదిలి కర్నాటక రాష్ట్రం కంచార్లపల్లి వద్ద ఉన్న నందగామలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పిల్లలను తండ్రితో పాటు అవ్వా, తాతలైన నారెప్ప, వెంకటలక్ష్మిలు కంటికి రెప్పలా చూసుకునేవారు. ఈ నేపథ్యంలో ఐదు నెలల క్రితం రామకృష్ణ అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఆసుపత్రిలో చూపించారు. రెండు కిడ్నీలు పాడైనట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి నుంచి మదనపల్లిలో డయాలసిస్ చేయించుకునేవాడు. మూడు నెలల క్రితం తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి గ్రామంలో పర్యటించినప్పుడు తన దయనీయ స్థితిని చెప్పుకోగా స్పందించిన ఎమ్మెల్యే నెలకు రూ.10 వేల పింఛన్‌ను మంజూరు చేయించారు. ఇంతలోనే పరిస్థితి విషమించి సోమవారం రాత్రి రామకృష్ణ మృతి చెందాడు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. అటు తల్లి ప్రేమకు నోచుకోక.. ఇటు నాన్న తోడు దూరమై అనాథలుగా మారిన ఆ చిన్నారులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పగబట్టిన విధి.. మొదట తల్లి, ఇప్పుడేమో తండ్రి
సాక్షి,బజార్హత్నూర్(అదిలాబాద్): ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. ఇద్దరు పిల్లలను అనాథలను చేసింది. ఏడాది క్రితం తల్లి క్యాన్సర్ మృతిచెందగా, నాలుగు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రిని మృత్యువు కబళించింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గంగాపూర్‌కు చెందిన రామగిరి గంగయ్య, భారతి దంపతులు. వీరికి అనిరుధ్, శ్వేతరాణి సంతానం. తల్లిదండ్రుల మృతితో వీరు దిక్కులేని వారయ్యారు. ఉండడానికి సొంత ఇల్లు లేదు. బజార్హత్నూర్ జెడ్పీ సెకండరీ పాఠశాలలో అనిరుధ్ 9వ తరగతి చదువుతున్నాడు. శ్వేతరాణి ఇచ్చోడ కేజీబీవీలో 7వ తరగతి అభ్యసిస్తోంది. సంవత్సరం క్రితం భారతి క్యాన్సర్‌తో మృతి చెందింది. ఆ విషాదం నుంచి కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలో ఈనెల 6న రాత్రి గిర్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బలన్‌పూర్ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామగిరి గంగయ్య(35) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. తల్లి మృతి తర్వాత భారతి క్యాన్సర్‌తో మృతి చెందిన తర్వాత గంగయ్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని బజార్హత్నూర్లోని బంధువుల ఇంటి వద్ద ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. మార్బుల్ మేస్త్రీగా పనిచేసే గంగయ్య రోజు ఇచ్చోడకు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకునేవాడు. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజులాగా 6న బుధవారం రాత్రి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ఆటో రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. సాయంత్రం వరకు వచ్చే తండ్రి రాకపోయేసరికి కొడుకు ఫోన్ చేయగా అరగంటలో చేరుకుంటానని చెప్పాడు. మార్గమధ్యలోనే బలన్‌పూర్ బ్రిడ్జి సమీపంలో సొనాలలో వారసంత ముగించుకుని వస్తున్న కూరగాయాల ఆటో గంగయ్య బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో గంగయ్యతోపాటు ఆటోలో ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. గంగయ్య గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొదుతూ తుదిశ్వాస విడిచాడు. దీంతో చిన్నారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కుమారుడు అనిరుధ్ గాంధీ ఆసుపత్రిలో తండ్రి శవం పోస్టుమార్టం కోసం శుక్రవారం సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు. తండ్రి శవం రాక కోసం కూతురు ఇంటి వద్ద ఎదురు చూస్తూ కన్నీరుమున్నీరవుతోంది. చిన్నారి బాధను చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి పిల్లలను ఆదుకోవాలని కోరుతున్నారు. చదవండి: బాలికపై సాముహిక అత్యాచారం... ఆపై వీడియో తీసి... -
క్షత్రియ సమితి.. సేవానిరతి
ఆకివీడు: మానవత్వానికి కొదవ లేదు.. దాతృత్వానికి అవధుల్లేవు.. అన్నట్టు ఉంది పశ్చిమ గోదావరి జిల్లా చెరుకుమిల్లి గ్రామం. అనాథలను ఆదుకుంటూ, ఆపదలో ఉన్నవారికి చేదోడు వాదోడుగా ఉంటూ, గ్రామాభివృద్ధికి తమ వంతు ఆర్థిక సహాయం అందజేస్తూ జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారు గ్రామానికి చెందిన క్షత్రియ సేవా సమితి నిర్వాహకులు. గ్రామానికి చెందిన పలువురు క్షత్రియ సామాజికవర్గానికి చెందినవారు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వారు సంపాదించిన దానిలో కొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఎక్కడెక్కడో సేవలు చేసేకన్నా సొంత గ్రామంలో ఏదో ఒక కార్యక్రమం చేయాలనే తలంపుతో గ్రామంలో క్షత్రియ సేవా సమితిని ఏర్పాటుచేశారు. ట్రస్టు ఏర్పాటు చేసిన డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు సూచనల మేరకు 2007లో రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం ఆయన సూచనల మేరకు 25 మంది ఒంటరి వృద్ధులు, వ్యక్తులకు రోజూ రెండు పూటలా భోజనాన్ని అందిస్తున్నారు. ఇంటి వద్దకే క్యారేజీలతో భోజనం పంపించే ఏర్పాట్లు చేశారు. మొదట్లో క్షత్రియ, క్షత్రియేతరులకు క్యారేజీల ద్వారా భోజనం అందజేశారు. ప్రస్తుతం క్షత్రియ సామాజికవర్గంలోని వృద్ధులు, వితంతువులు, అనాథలకు క్యారేజీల భోజనం అందజేస్తున్నారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో పూర్తి ఆర్థిక సహకారాన్ని వెచ్చిస్తున్నారు. రుచితో పాటు నాణ్యత క్యారేజీల ద్వారా అందిస్తున్న ఆహారం ఇంట్లో వండుకున్నట్టుగా ఉంటుందని, రుచితో పాటు నాణ్యత మెండు అని వృద్ధులు అంటున్నారు. రోజూ ఉదయం పప్పు, పచ్చడి, రసం, కూర లేదా పులుసు కూర, పెరుగు, సాయంత్రం ఇగురు కూర, వేపుడు, సాంబారు, పచ్చడి, పెరుగుతో భోజనాన్ని అందిస్తున్నారు. కరోనా విపత్తులోనూ.. కరోనా విపత్తులోనూ ఉచిత భోజనాన్ని వృద్ధుల ఇళ్లకు చేర్చారు. కరోనాను ఎదుర్కొనేలా రోజూ కోడి గుడ్డు, చికెన్ భోజనాన్ని అందించారు. దాతలు ప్రత్యక్ష దేవుళ్లు ఇక్కడ దాతలు మాతకు ప్రత్యక్ష దేవుళ్లు, 14 ఏళ్లుగా ఉచితంగా భోజనం చేస్తున్నాను. ఉదయం 8 గంటలు, సాయంత్రం 4 గంటలకు క్యారేజీలు సిద్ధమవుతాయి. సంస్థ ఆఫీసు దగ్గరకు వెళ్లి తెచ్చుకోలేనివారికి ఇళ్లకే పంపిస్తున్నారు. నేను 14 ఏళ్లుగా వెళ్లి తెచ్చుకుంటున్నాను. ఈ గ్రామంలో పుట్టినందుకు అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. – దాట్ల రామలింగరాజు, చెరుకుమిల్లి ఇబ్బంది లేకుండా.. రెండు పూటలా భోజనం ఇబ్బంది లేకుండా పెడుతున్నారు. పిల్లలు దగ్గర లేకపోవడంతో గతంలో భోజనానికి చాలా ఇబ్బంది పడే దాన్ని. ఇంట్లో వండుకునే విధంగానే రుచి, శుచి క్యారేజీల్లో భోజనం ఉంటుంది. దాదాపు 13 ఏళ్లుగా ఇక్కడ భోజనం చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. వీరి కార్యక్రమం అభినందనీయం. – మంతెన కస్తూరి, చెరుకుమిల్లి వండుకునే బాధలేదు ముసిలిదానినై పోయాను. ఇంటి వద్దకే భోజనం పంపిస్తున్నారు. వృద్ధాశ్రమాలకన్నా ఈ విధానం ఎంతో బాగుంది. పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇక్కడ ఒక్కదాన్నే ఉంటున్నాను. పనిమనిషి మిగిలిన పనులు చేస్తుంది. పిల్లలు అప్పుడప్పుడూ వచ్చి వెళుతుంటారు. క్షత్రియ సేవాసమితి ఔదార్యం ఎంతో గొప్పది. చాలా ఆనందంగా ఉంది. – దాట్ల మంగమ్మ, చెరుకుమిల్లి రుచీశుచితో.. సేవా సమితి ప్రాంగణం శుభ్రతగా ఉంచడంతో పాటు రుచికరమైన ఆహారం అందిస్తున్నాం. పెరడులో పండిన పంటలను వినియోగిస్తున్నాం. దాతలు అందించిన కూరగాయలు, పిండి వంటలను కూడా క్యారేజీల్లో పంపుతున్నాం. నిత్య పర్యవేక్షణతో కార్యక్రమం నడుస్తోంది. –దాట్ల వెంకట కృష్ణంరాజు, ఇన్చార్జి, సేవాసమితి, చెరుకుమిల్లి -
అనాథ వృద్ధురాళ్లకు రాములోరి దర్శనం.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఔదార్యం
భద్రాచలం: టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఔదార్యంతో కొందరు అనాథ వృద్ధురాళ్లు భద్రాచలం రామయ్య దర్శనం చేసుకోగలిగారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వావివలస గ్రామానికి చెందిన పాలూరు సిద్ధార్థ తన భార్య సుధారాణితో కలిసి ఓ స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అనాథలు, దివ్యాంగ మహిళలకు అండగా ఉంటూ భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. అక్కడ నివసిస్తున్న కొందరు వృద్ధురాళ్లకు భద్రాచలం రామయ్యను దర్శించుకోవాలనేది చిరకాల కోరిక. దీంతో సిద్ధార్థ తన పరిచయస్తుల ద్వారా విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సజ్జనార్ విశాఖపట్నం నుంచి భద్రాచలం, భద్రాచలం నుంచి పర్ణశాల, తిరిగి విశాఖపట్నం వరకు పూర్తిగా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. ఈమేరకు 20 మంది వృద్ధురాళ్లు గురువారం ఉదయం భద్రాచలం చేరుకుని పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించాక రామయ్యను దర్శించుకున్నారు. అనంతరం పర్ణశాలను కూడా సందర్శించారు. వీరికి భద్రాచలం పట్టణ సీఐ టి.స్వామి భోజన, వసతి, ఆలయ ఈవో శివాజీ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. తమ చిరకాల కోరిక తీర్చిన ఎండీ సజ్జనార్, ఏర్పాట్లు చేసిన అధికారులకు వృద్ధురాళ్లు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపి విశాఖ తిరుగు పయనమయ్యారు. -
తప్పిపోయిన చిన్నారులను గుర్తించేలా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం
సాక్షి హైదరాబాద్: చిన్నారుల మోములో చిరునవ్వులు వికసించాలన్న ప్రధాన లక్ష్యంతో నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. తప్పిపోయి నిరాదరణకు గురై ఉన్న చిన్నారులు తల్లిదండ్రుల అక్కున చేరుతుండగా, వెట్టిచాకిరీలో మగ్గుతున్న బడీడు బాలకార్మికులు చదువుబాట పడుతున్నారు. బాలల సంక్షేమాన్ని కాంక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆపరేషన్ స్మైల్ పేరుతో నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపుతోంది. ఈ నెల 1 నుంచి 31 వరకు తప్పిపోయిన బాలలను గుర్తించడం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నియంత్రణతో పాటు భిక్షాటన చేసే చిన్నారులు, వీధిబాలలు, అనాథలు, బడిమానేసిన చిన్నారులు, ఇతరత్రా అంశాల్లో వారిని గుర్తించి విముక్తి కల్పించడమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. రంగంలోకి బృందాలు గ్రేటర్ పరిధిలో ఆపరేషన్ స్మైల్– 8 స్పెషల్ డ్రైవ్ కోసం పోలీసు డిపార్ట్మెంట్ , లేబర్ డిపార్ట్మెంట్, శిశు సంక్షేమశాఖ, రెవెన్యూ శాఖ, చైల్డ్ లైన్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కూడిన సుమారు 24 బృందాలు రంగంలోకి దిగి జల్లెడ పడుతున్నాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రద్దీ ప్రదేశాలు, హోటళ్లు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, ఇళ్లు, గాజుల పరిశ్రమలు, భిక్షాటన, దుకాణాల్లో పనిచేస్తున్న చిన్నారుల జాడ కనిపెట్టేందుకు ఈ బృందాలు కృషి చేస్తాయి. పలు పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన అదృశ్యం కేసుల్లోనూ చిన్నారుల వివరాలను సేకరించి.. వాటిని సీసీటీఎన్‌ఎస్‌లోని డాటాబేస్‌తో పోల్చిచూస్తున్నారు. ఇందుకోసం పోలీసులు దర్పణ్ అనే సరికొత్త టెక్నాలజీని సైతం వినియోగిస్తున్నారు. దీనిద్వారా తప్పిపోయిన చిన్నారులు.. వివిధ ప్రభుత్వ హోంలు, అనాథాశ్రమాలు, ఎన్జీఓల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల ఫొటోలను పోల్చిచూస్తూ వారి వివరాలు కనిపెట్టడంలో సఫలీకృతమవుతున్నారు. సదుపాయాలు ఏవి? ఆపరేషన్ స్మైల్‌లో చిన్నారుల గుర్తింపు, కుటుంబాల వద్దకు చేర్చడం, లేదా వివిధ హోమ్స్‌లలో ఆశ్రయం కల్పించడం సమస్యగా తయారైంది. ఇక్కడ చాలామందికి ఒకే చోట ఆశ్రయం కల్పించడం వల్ల సదుపాయాల సమస్య తప్పడంలేదు. పతీ పిల్లాడికి ఇచ్చే నగదును పెంచుతామన్న మహిళా శిశు సంక్షేమ శాఖ హామీ ప్రతిపాదనగానే మిగిలిపోయింది. మరోవైపు ఇతర రాష్ట్రాల పిల్లలను కాపాడాక వారి సమస్యలు తెలుసుకునేందుకు భాష సమస్యగా మారుతోంది. దుబాసీలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల బాలల వివరాలు, కనుక్కోవడం క్లిష్టతరంగా మారుతోంది. ఎనిమిదేళ్లుగా... వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న చిట్టిచేతులను కాపాడాలని, వారి ముఖంలో చిరునవ్వును తిరిగి తేవాలన్న సంకల్పంతో ఆపరేషన్ స్మైల్ 2015లోశ్రీకారం చుట్టారు. ఎనిమిదేళ్లలో సుమారు 3 వేలకుపైగా చిన్నారులను కాపాడారు. 1600 మందికిపైగా చిన్నారులను తిరిగివారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. 14వందల మందిని వివిధ హోమ్స్‌కు తరలించారు. ప్రతి ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరుతో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్‌కు బీజం పడింది. పోలీసు అధికారి చేపట్టిన చర్యలను ఆదర్శంగా తీసుకొని కార్యక్రమ రూపకల్పన చేయాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడటంతో ప్రతి ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ చేపడుతున్నారు. -
కరోనా అనాథ పిల్లలెంతమంది?
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో దశ కోవిడ్ సమయం లో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పిల్లలు అనాథలయ్యారు. అలాంటి పిల్లలను గుర్తించేం దుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ద్వారా సమాచార సేకరణ చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 236 మంది పిల్లలు పాక్షిక, పూర్తి అనాథలైనట్లు తేల్చింది. తాజాగా కోవిడ్–19 మూడో దశ కూడా తీవ్రంగా ఉంది. వైరస్ వ్యాప్తి పెరుగుతుండగా.. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఈనేపథ్యంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సమాచారాన్ని సేకరించాలని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖను ఆదేశించింది. జిల్లా కార్యాలయానికి సమాచారం.. కరోనా వైరస్ ప్రభావంతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలుంటే ఆ సమాచారాన్ని నేరుగా జిల్లా సంక్షేమాధికారి కార్యాలయానికి చేరవేయాలి. ప్రభుత్వం ఈ బాధ్యతలను అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు అప్పగించింది. తల్లిదండ్రుల్లో ఒకరు మరణిస్తే పాక్షిక అనాథగా, ఇద్దరు మరణిస్తే పూర్తి అనాథగా గుర్తించి ఆ సమాచారాన్ని జిల్లా కార్యాలయానికి చేరవేయాలి. తల్లిదండ్రుల మరణం నేపథ్యంలో వారి ఆర్థిక స్థితిని అంచనా వేసి తక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలకు తరలించాలి. ఈ ప్రక్రియను శిశుసంక్షేమ ప్రాజెక్టు కార్యాలయం (సీడీపీఓ) ఆధ్వర్యంలో చేపట్టాలి. రాష్ట్రంలో ఇప్పటివరకు 236 మంది పిల్లలు అనాథలైనట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ప్రస్తుతం 11 మంది మాత్రమే ప్రభుత్వ సంక్షేమ గృహాల్లో వసతి పొందుతున్నారు. మిగతా పిల్లలు వారి సమీప బంధువుల వద్ద ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. పిల్లల వయసు బట్టి ప్రభుత్వ గృహాలకు పంపే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో జారీ చేయనుంది. -
TS: రాష్ట్రంలో అనాథ వసతిగృహాలెన్ని?
సాక్షి, హైదరాబాద్: అనాథల సంరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక పాలసీని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సుదీర్ఘ అధ్యయనం చేసి సలహాలు, సూచనలతో కూడిన నివేదిక ఇవ్వాలంటూ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అనాథల వసతిగృహాలు, అనాథల లెక్క తేల్చే పనిలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిమగ్నమైంది. అధికారిక లెక్కల ప్రకారంరాష్ట్రవ్యాప్తంగా 57 అనాథ వసతిగృహాలు నమోదయ్యాయి. మరో 2 వందల వరకు అనధికారికంగా కొనసాగుతున్నట్లు అధికారుల అంచనా. వీటి పరిధిలో దాదాపు 34 వేల మంది పిల్లలున్నారు. అయితే వీరిలో పాక్షిక, పూర్తి అనాథులున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వసతిగృహాల గుర్తింపు, పిల్లల లెక్కలను కచ్చితంగా తేల్చేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ వసతిగృహాలను సందర్శించి పిల్లల సంఖ్యను నిర్ధారించనుంది. ఇలా గుర్తించిన పిల్లలకు స్మార్ట్‌కార్డులు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వనికి సూచించింది. పట్టణ ప్రాంతాల్లోనే అత్యధికం... రాష్ట్రంలో కొనసాగుతున్న అనాథ వసతిగృహాలు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. స్వచ్ఛందసంస్థలు నిర్వహించే వసతిగృహాలకు ప్రభుత్వ గుర్తింపు ఉండగా, స్వతంత్రులు నిర్వహించేవాటికి మాత్రం గుర్తింపు లేదు. రాష్ట్రంలోని అనాథ వసతిగృహాల్లో 80 శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చ ల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చేవారంలో మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి అనాథల లెక్కింపు ప్రక్రియను వేగవంతం చేసేలా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. అనాథ వసతిగృహాలను సందర్శించి తనిఖీలు చేసే కమిటీలు వసతిగృహం నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలు(ట్రాక్ రికార్డు)ను క్షుణ్ణంగా పరిశీలించనుంది. వసతిగృహం నిర్వహణకు వచ్చే నిధులు, విరాళాలను సైతం పరిశీలించి వసతిగృహాల వారీ గా నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనుంది. -
కన్నీటి గాథ: అనాథలుగా ఆడబిడ్డలు
సాక్షి, మోటకొండూర్(నల్గొండ): మండలంలోని కొండాపురం గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి డిగ్రీ చదువుతున్న ఆడబిడ్డలు అనాథలుగా మారారు. దీంతో ఆ అమ్మాయిల భవిష్యత్ ప్రశ్నాకార్థంగా మారింది. వివరాల్లోకి వెళ్లితే ఆత్మకూరు(ఎం) మండలంలోని శీలంబాయి గ్రామానికి చెందిన కందడి సబిత– శ్రీనివాస్‌రెడ్డి దంపతుల్లో శ్రీనివాస్‌రెడ్డి 12ఏళ్ల కిందట మృతిచెందాడు. దీంతో సబిత(39) 2006 నుంచి తన పుట్టిన ఇల్లు అయిన మోటకొండూరు మండలం కొండాపురంలోనే ఆశ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తూ జీవనం సాగిస్తుంది. ఆమెకు డిగ్రీ చదువుతున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొదటి కూతరు రేఖ డిగ్రీ తృతియ సంవత్సరం, హారిక ప్రథమ సంవత్సరం చుదువుతున్నారు. కరోనా సమయంలో గ్రామంలోని ప్రజలకు సబిత విశేష సేవలందించి అందరి మన్ననలు పొందింది. చదవండి: (సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబంలో విషాదం) నాలుగు నెలల కిందట ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో చికిత్స చేయించుకునేందుకు అప్పటినుంచి ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగి ఉన్న డబ్బు అంతా ఖర్చు చేశారు. అప్పులు కూడా తీసుకుని వైద్యం చేయించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఈనెల 17న మృతిచెందింది. దీంతో ఆ ఆడబిడ్డలు అనాథలుగా మారారు. వీరకి కనీసం గ్రామంలో ఇల్లు, వ్యవసాయ భూమి ఏమీ లేదు. ఆ ఆడబిడ్డలను చూసుకునేందుకు కేవలం 70 ఏళ్ల పైబడ్డ అమ్మమ్మ మాత్రమే ఉంది. ఆ పిల్లల చదువు, పోషణ ఎలారా భగవంతుడా అంటూ అమ్మమ్మ ఎడుస్తూ ఉంటే ఆ గ్రామస్తుల హృదయాలు బరువెక్కాయి. ఆ అమ్మమ్మకు కూడా ఇద్దరు కూతుళ్లే, మగ బిడ్డలు ఎవరూ లేరు. రోడ్డున పడ్డ ఆ ఆడబిడ్డల భవిషత్య దృష్టిలో ఉంచుకుని దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: (‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్మల్ని ఎవరు చూస్తారు') -
అనాథ బాలల సంరక్షణ సమాజ బాధ్యత
సాక్షి, అమరావతి: అనాథ బాలల సంరక్షణ సమాజంలో అందరి బాధ్యతని డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. రక్షా బంధన్ పండుగ సందర్భంగా పలు అనాథ శరణాలయాలకు చెందిన బాలికలు ఆయనకు సోమవారం రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ బాలికలు బాగా చదువుకుని ఉన్నతస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి కంటి గాయాన్ని గమనించిన ఆయన ఏమైందని వాకబు చేశారు. గతంలో విజయవాడలో ఓ ఇంట్లో పనిచేస్తుండగా యజమానురాలు కొట్టడంతో కంట్లో గాయమైందని ఆ బాలిక తెలిపింది. అప్పట్లో 1098కు సమాచారం ఇవ్వడంతో పోలీసు అధికారులు ఆ బాలికను రక్షించి జిల్లా పునరావాస కేంద్రంలో చేర్పించారని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డీజీపీకి తెలిపారు. రమ్య కుటుంబాన్ని వేధిస్తున్నవారిపై కఠిన చర్యలు గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులను మానసికంగా వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. రమ్య కుటుంబ సభ్యులు డీజీపీ గౌతం సవాంగ్‌ను మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో సోమవారం కలిశారు. పోలీసులు తక్షణం స్పందించి నిందితుడిని అరెస్టు చేసి తమకు న్యాయం చేశారని కృతజ్ఞతలు తెలిపారు. కాగా తాము డబ్బుకు అమ్ముడుపోయామని కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుండడం తమకు తీవ్ర మానసిక వ్యథ కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డీజీపీ స్పందిస్తూ రమ్య కుటుంబ సభ్యులను మానసికంగా వేధిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
కరోనా కాటు.. దేశవ్యాప్తంగా 75,320 పిల్లల పరిస్థితి దయనీయం
సాక్షి, భువనేశ్వర్: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి ఎంతోమంది చిన్నారులకు తమ తల్లిదండ్రులను దూరం చేసింది. కొంతమంది తల్లిదండ్రులిద్దరినీ కోల్పోగా, మరికొందరు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని పోగొట్టుకుని, దిక్కులేని వారుగా మిగిలిపోయారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో అటువంటి చిన్నారుల బాగోగులను చూసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) అభ్యర్థన మేరకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు చేపట్టిన కార్యాచరణతో నివేదిక దాఖలు చేయాలని సూచించింది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆగస్టు 13 వరకు ప్రభుత్వాలకు ధర్మాసనం గడువు విధించింది. రెండో స్థానంలో రాష్ట్రం.. 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది జూలై 23 మధ్య రాష్ట్రంలో సుమారు 6,562 మంది బాలలు కరోనా కాటుతో తమ తల్లిదండ్రుల్ని కోల్పోయారు. దీంతో అనాథ బాలల జాబితాలో జాతీయ స్థాయిలో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. 13,589 మంది అనాథ బాలలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఎన్సీపీసీఆర్ అఫిడవిట్ దాఖలు చేసింది. వీరి భవిష్యత్ అంధకారం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టేందుకు ఆదేశించాలని అభ్యర్థించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు చిన్నారుల భవిష్యత్ సంరక్షణ, విద్య తదితర సంక్షేమ కార్యకలాపాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సి ఉంది. కరోనా తాండవించిన వ్యవధిలో కరోనా లేదా కరోనాయేతర రోగాలతో ఉభయ తల్లిదండ్రులు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన అనాథ బాలల వివరాలను బాల స్వరాజ్ పోర్టల్‌లో దాఖలు చేయాలని స్పష్టంచేసింది. కరోనా విపత్తుతో గత 2020 ఏప్రిల్ 1 నుంచి ఏడాది జూలై 23 మధ్య 818 మంది చిన్నారులు తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయారు. 5,742 మంది తల్లి లేదా తండ్రిని కోల్పోవడం విచారకరం. గత నెలలో బాలల హక్కుల కమిషన్ దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ సంఖ్య 26గా పేర్కొనడం గమనార్హం. అనంతరం73 మంది శిశువులు అనాథలైనట్లు రెండో అఫిడవిట్లో పొందుపరిచారు. 6,210 మంది అనాథ శిశువులతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 75,320.. జాతీయ స్థాయిలో కరోనా మహమ్మారి 75,320 మంది చిన్నారులను అనాథలుగా మిగిల్చింది. వీరిలో ఉభయ తల్లిదండ్రుల్ని కోల్పోయిన బాలలు 6,855 మంది. తల్లి లేదా తండ్రి అండ కోల్పోయిన వారు 68,218 మందిగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎన్సీపీసీఆర్ దాఖలు చేసిన అఫిడవిట్ పేర్కొన్నారు. వీరితో మరో 247 మంది దిక్కులేని బాలలు మిగిలారని కమిషన్ విశ్లేషించింది. 30 పేజీలతో కమిషన్ సుప్రీంకోర్టులో అఫిడవిటు దాఖలు చేసింది. ఈ వ్యవధిలో అనాథలుగా మారిన బాలల తల్లిదండ్రులు కరోనా, ఇతరేతర రోగాలతో మరణించి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేసింది. -
ఐదుగురు అక్కాచెల్లెళ్లు.. అంతులేని కష్టాలు
అమ్మ అనురాగం, నాన్న మమకారం దూరమయ్యాయి. జీవనాధారం లేదు.. జీవితాలకు వెలుగూ లేదు. నా అన్న వాళ్లు లేరు. కష్టమొచ్చినా కన్నీరు రాల్చడం తప్ప..ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. బతుకు దుర్భరంగా కాలం వెళ్లదీస్తున్నారు. దయనీయ జీవితాలకు దర్పణంగా నిలుస్తున్నారు గుమ్మఘట్ట మండలం గొల్లపల్లికి చెందిన అక్కాచెల్లెళ్లు. గుమ్మఘట్ట (అనంతపురము): మండలంలోని గొల్లపల్లి ఎస్సీ కాలనీలో పీజీ హంపన్న, సాకమ్మ దంపతులు కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. వీరికి శశికళ, తిప్పక్క, రాధ, లక్ష్మి, శైలజ సంతానం. పెద్దమ్మాయి శశికళకు పదేళ్ల వయసున్నప్పుడే తల్లి సాకమ్మ క్షయ వ్యాధితో చనిపోయింది. పెద్దమ్మాయి సాయంతో మిగిలిన నలుగురు ఆడపిల్లల ఆలనాపాలనను తండ్రి చూసుకుంటూ వచ్చాడు. కూతుళ్లు మంచి ప్రయోజకులు కావాలని కష్టపడి చదివించాడు. పెద్దమ్మాయి (ఐదో తరగతి) మినహా మిగిలిన నలుగురూ చదువులో ముందుకెళ్లారు. రెండో అమ్మాయి తిప్పక్క బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) పూర్తి చేసింది. మూడో అమ్మాయి రాధ డిప్లొమా కోర్సులో చేరి డ్రాపౌట్ అయ్యింది. నాల్గో అమ్మాయి లక్ష్మి ఇంటర్ పూర్తి చేసింది. ఐదో అమ్మాయి శైలజ డిగ్రీ ఫస్టియర్ చదివి ఆపేసింది. కాగా వీరి జీవితంలో మరొకసారి కుదుపు వచ్చింది. తండ్రి తరచూ అనారోగ్యం బారిన పడుతుండటంతో ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఒక్కరైనా బాగా చదవాలని... తండ్రి అనారోగ్యం నేపథ్యంలో నలుగురు అక్కాచెల్లెళ్లు ఒక నిర్ణయానికి వచ్చారు. తిప్పక్క బీటెక్ కోర్సు పూర్తి చేసేలా, అందుకు అవసరమైన ఖర్చుల కోసం కూలి బాట పట్టారు. ఇంతలోనే ఈ ఏడాది మే నెలలో తండ్రికి తీవ్ర జ్వరం, జలుబు, చలి లాంటి లక్షణాలు కనిపించాయి. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతిచెందాడు. ఇన్నాళ్లూ అండగా నిలిచిన తండ్రి కూడా దూరం కావడంతో అమ్మాయిలకు కష్టాలు రెట్టింపయ్యాయి. చౌకదుకాణం ద్వారా వచ్చే రేషన్ సరుకులతో పాటు కూలి పనుల ద్వారా వచ్చే సంపాదనతో బతుకు నెట్టుకొస్తున్నారు. ఆర్థికసాయం చేయాలనుకునే వారు.. పేరు : పి.జి.జి.తిప్పక్క అకౌంట్ నంబర్ : 520101212861618 యూనియన్ బ్యాంకు, రాయదుర్గం బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ : యూబీఐఎన్ 0900362 ఉద్యోగం ఇప్పించండి బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసి ఇంటికే పరిమితమయ్యాను. ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తే మా కుటుంబాన్ని ఆదుకున్న వారవుతారు. అమ్మానాన్న లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మా యోగక్షేమాలు చూసుకునేవారు ఎవరూ లేరు. ఏ కష్టం వచ్చినా మాకు మేమే ధైర్యం చెప్పుకుంటూ బతుకుతున్నాం. దయార్ద్ర హృదయులు స్పందిస్తే మా బతుకులు బాగుపడతాయి. - తిప్పక్క విధిలేక కూలి పనులకు.. బ్రహ్మసముద్రం గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశా. అనంతపురంలో డిప్లొమా కోర్సులో చేరా. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆపేశా. సర్టిఫికెట్లు ఇవ్వమంటే డబ్బు చెల్లించలేదని కళాశాల వారు నిరాకరించారు. వాటిని అక్కడే వదిలేసి విధిలేక కూలి పనులకు వెళ్తున్నా. - రాధ, డిప్లొమా విద్యార్థిని -
ఏప్రిల్–మేలో 645 మంది చిన్నారులు అనాథలయ్యారు
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్‌లో ఏప్రిల్ 1 నుంచి మే 28 తేదీ వరకు 645 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయారని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. రాజ్యసభలో గురువారం ఒక ప్రశ్నకు సమాధానంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ విషయాన్ని తెలిపా రు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 158 పిల్లలు అనాథలుగా మారారని, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 119 మంది, మహారాష్ట్రలో 83, మధ్యప్రదేశ్‌లో 73 మంది చిన్నారులు అనాథలు అయ్యారని వివరించారు. తల్లిదండ్రుల్లో ఇద్దరినీ కోల్పోవడమో, బతికున్న ఒక్కరినీ కోల్పో వడం లేదా సంరక్షకులను కోల్పోవడం జరిగిం దని తెలిపారు. ఇలాంటి పిల్లల కోసం వారికి 18 ఏళ్లు నిండేసరికి రూ. 10 లక్షల మూలధన నిధి ఉండేలా (వారి పేరిట బ్యాంకుల్లో) ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. 18 ఏళ్ల నుంచి 23 ఏళ్ల వరకు వీరికి దీనిపై వచ్చే వడ్డీతో నెలనెలా స్టైపెండ్ అందుతుందని, ఉన్నత విద్యకు, స్వంత అవసరాలకు ఇది ఉపయోగపడుతుందని ఇరానీ తెలిపారు. 23 ఏళ్లు నిండాక మూలధన నిధి రూ. 10 లక్షలను ఒకేసారి వారికి ఇచ్చేస్తారన్నారు. -
అనాథ బాలలకు అండగా ఉంటాం
పెడన: కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు సీఎం వైఎస్ జగన్ మేనమామలా అండగా నిలిచారని మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్యే జోగి రమేష్‌తో కలిసి మంత్రి పేర్ని నాని పెడన ఏడో వార్డులో జక్కుల లీలాప్రసాద్, భారతీ దంపతుల పిల్లలు ఉషశ్రీసాయి(11), జుహితేశ్వరి(5)లకు చెరో రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలకు మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి నాని మాట్లాడుతూ.. నాలుగు పదుల వయసు కూడా నిండకుండానే లీలాప్రసాద్, భారతీ చనిపోవడం.. వీరి ఇద్దరు ఆడపిల్లలూ అనాథలు కావడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారని.. వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. సీఎం వైఎస్ జగన్ మానవత్వంతో స్పందించి సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారని చెప్పారు. చెల్లిని బాగా చూసుకో.. ఈ సందర్భంగా ఉషశ్రీ సాయితో మంత్రి పేర్ని నాని మాట్లాడారు. ‘ఇక మీదట చెల్లికి అమ్మ, నాన్న అన్నీ నువ్వే. చెల్లిని ఏడిపించకుండా.. బాగా చూసుకోవాలి. నువ్వు కూడా మంచిగా చదువుకోవాలి’ అని ఉషశ్రీ సాయికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ బళ్ల జ్యోత్సా్నరాణి, వైస్ చైర్మన్ ఎండీ ఖాజా, కమిషనర్ అంజయ్య, తహసీల్దార్ పి.మధుసూదనరావు, ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, వార్డు కౌన్సిలర్ కటకం నాగకుమారి, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
అనాథలకు అన్నగా..
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా అనాథలైన బాలలను ఆదుకునే చర్యలు ఊపందుకున్నాయి. తల్లిదండ్రుల్ని కరోనా పొట్టనపెట్టుకోవడంతో అనాథలుగా మారిన బాలల గుర్తింపు, వసతి కల్పన, విద్యావంతులను చేయడం వంటి చర్యలతోపాటు వారి భవితకు భరోసా కల్పించేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అభినందనలు అందుకోగా.. ఇతర రాష్ట్రాలు సైతం ఆంధ్రప్రదేశ్‌ను అనుసరిస్తున్నాయి. 146 మంది గుర్తింపు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పలు శాఖల సమన్వయంతో ఈ నెల 4వ తేదీ వరకు 146 మంది అనాథ బాలలను గుర్తించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తించిన వీరిలో 56 మంది అనాథ బాలలకు రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఆ మొత్తాన్ని అనాథలైన బాలల పేరిట డిపాజిట్ చేయడంతోపాటు వారి చదువు, ఆశ్రయం, భవితకు భరోసా ఇచ్చేలా ఆయా జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అనాథ బాలల్లో చాలా మందికి బాబాయి, తాత, మావయ్య వంటి బంధువులు ఉండటంతో వారి వద్ద ఆశ్రయం పొందేలా ఏర్పాట్లు చేశారు. ఏడుగురు బాలలకు మాత్రం ఎవరూ లేకపోవడంతో చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్(సీసీఐ)లో ఆశ్రయం కల్పించారు. రాష్ట్రంలో ఎక్కడైనా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన బాలలు ఉంటే తమకు సమాచారం అందించాలని, ప్రభుత్వ తోడ్పాటును వారికి అందేలా సహకరించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాలకులు కృతికా శుక్లా కోరారు. డయల్ 181, 1098 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. -
చదువులమ్మ ఈ లాయరమ్మ
అనాథ పిల్లలు రోజు గడవడానికే దిక్కులు చూడాల్సిన పరిస్థితి. జీవితంలో ఎదుగుదలకు లక్ష్యం ఏర్పాడటానికి ఊతంగా నిలిచే చదువు లభించాలంటే అందుకు దైవం నుంచి వరం లభించాల్సిందే. అలాంటి అనాథ పిల్లల చదువుకు వరప్రదాయినిగా కృషి చేస్తోంది లాయర్ పౌలోమి పావిని శ్లుక్లా. ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ 30 సంవత్సరాల వయస్సులో సేవా రంగంలో గణనీయమైన కృషి చేసిన 30 మంది వ్యక్తుల జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాది అనాథల విద్య కోసం కృషి చేస్తున్న పావిని పేరును ఆ 30 మంది జాబితాలో చేర్చింది. అనాథ పిల్లలకు సరైన విద్యను అందించడం ఎలాగో 28 ఏళ్ల సుప్రింకోర్టు న్యాయవాది పావినికి తెలుసు. ఆమె చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి ఆమె కుటుంబమే అతి పెద్ద మద్ధతు. పావిని తల్లి అరాధన శుక్లా మాట్లాడుతూ –‘దేశంలో తమ గొంతు వినిపించలేని అనాథ పిల్లలు చదువులో రాణించడం వల్ల వారి హక్కుల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఏమీ లేని పిల్లలు జీవితంలో ఎదిగేందుకు ప్రోత్సాహమిస్తున్నది ఒక న్యాయవాది. ఆమె నా కూతురు అవడం మాకెంతో గర్వంగా ఉంది’ అని ఆనందంగా పావిని చేస్తున్న పనిని అభినందించారు ఆమె తల్లి. స్వీయ రచన లక్నోలో ఉంటున్న రచయిత, న్యాయవాది, సామాజిక కార్యకర్త పౌలోమి పావిని శుక్లా దేశం గర్వించదగిన వ్యక్తుల జాబితాలో చేరడం ఒకే రోజులో జరగలేదు. దాని వెనక పదేళ్లుగా ఆమె చేస్తున్న కృషి ఉంది. సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్లైన ఆరాధన శుక్లా, ప్రదీప్ శుక్లాల కూతురు పౌలోమి పావిని శుక్లా. 2015 లో భారతదేశంలో అనాథ పిల్లల దుస్థితి గురించి తన సోదరుడితో కలిసి ‘వీకెస్ట్ ఆన్ ఎర్త్– ఆర్ఫాన్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో పుస్తకం రాసింది. పావిని అదే ఏడాది అనాథల కోసం లక్నోలో ‘అడాప్ట్ ఎ అనాథాశ్రమం’ ప్రారంభించింది. ఆశ్రమ నిర్వహణకు స్థానిక కంపెనీల మద్దతు తీసుకుంది. వీరి నుంచి నగరంలోని పాఠశాలల నిరుపేద పిల్లలకు, అనాథ పిల్లలకు స్టేషనరీ, పుస్తకాలు, ట్యూషన్ ఫీజులను ఇచ్చి చదివించగలిగింది. పిల్లలను చదివించడానికి గల కారణాలను పావిని తెలియజేస్తూ– ‘నా తొమ్మిదేళ్ల వయసులో నా పుట్టిన రోజున మా అమ్మ అనాథాశ్రమానికి తీసుకెళ్లింది. అక్కడ నేను పిల్లలతో కలిసి ఆడుకున్నాను. మాట్లాడాను. చదువుకోవాలనే వారి ఆశను స్వయంగా తెలుసుకున్నాను. అప్పటి నుండి అనాథల కోసం ఏదైనా చేయాలి అని బలంగా అనుకునేదాన్ని. దాంట్లో భాగంగానే వారి కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టాను’ అని వివరించింది. పదేళ్ల కృషి సాధ్యమైనంత ఎక్కువ మంది అనాథ పిల్లలకు చదువుకునే అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో దాదాపు దశాబ్దం పాటు కృషి చేస్తూనే ఉంది పావిని. విద్యార్థులకు అవసరమైన కోచింగ్, ట్యూషన్ల కోసం ఉత్తరప్రదేశ్ విద్యాశాఖతో కలిసి కీలక పాత్ర పోషించింది. ఎనిమిది నగరాల్లో 13 స్కూళ్లలోని నిరుపేద పిల్లలకు స్టేషనరీ, పుస్తకాలు, ట్యూషన్ డబ్బును అందజేసింది. లాక్డౌన్ సమయంలో నగరంలోని అన్ని అనాథాశ్రమాలలో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది. దీని వల్ల ఆ ఆశ్రమాల్లో ఉన్న పిల్లలకు ఆ¯Œ లైన్ విద్య సౌకర్యం లభిస్తోంది. ఈ పని ప్రారంభాన్ని వివరిస్తూ, పావిని ఇలా అన్నారు ‘ఫోర్బ్స్ జాబితాలో నా పేరు చూడటం చాలా సంతోషంగా ఉంది. అనాథల కోసం ఎక్కువ పని చేయమని సూచించిన ఈ స్థానం నన్ను మరిన్ని అడుగులు వేసేలా ప్రోత్సహిస్తోంది’ అని తెలిపారు. -
అనాథలకో అమ్మానాన్న
సమాజంలో సాయం కోసం ఎదురుచూసే అభాగ్యులెందరో. వీరికి చెయ్యందించేవారు మాత్రం అరుదుగా కనిపిస్తారు. కానీ పిసరంత సాయం దొరికితే చాలు అభాగ్యుల జీవితాలు కొంతైనా మెరుగుపడతాయని, చెప్పడమేగాక చేసి చూపుతున్నారు‘పొపాట్రో పుండే దంపతులు’. మనస్సుంటే మార్గం ఉంటుంది అనే మాటకు ఈ దంపతులు సాక్ష్యంగా నిలుస్తున్నారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా పత్రాది ప్రాంతంలో నివసించే పొపాట్రో ఫుండె, అనురాధ దంపతులు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడమేగాక.. గత ఆరేళ్లుగా వీరు తమ జీతాల్లోనుంచి 10 శాతం మొత్తాన్ని ఒంటరి నిరాశ్రయులైన మహిళలు, వితంతువులు, అనాథలు, బాధిత రైతులు, అవసరంలో ఉన్న స్కూలు పిల్లలకు ఖర్చుచేస్తున్నారు. ఇప్పటిదాకా దాదాపు 1200 మందికి సాయమందించారు. ఇంతకీ వీరికి ఈ ఆలోచన ఎందుకొచ్చిందంటే... అది 2014 జూన్ నెల.. ఓ రోజు స్కూల్లో ఉండగా అకస్మాత్తుగా పొపాట్రో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో తోటి ఉద్యోగులు హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పొపాట్రోని పరీక్షించిన డాక్టర్ లో బి.పితో అలా స్పృహæతప్పి పడిపోయారని చెప్పారు. సకాలంలో డాక్టర్ వైద్యం అందించడంతో తనకు ఏ ప్రమాదం జరగలేదని గ్రహించిన పొపాట్రో... తనకు సాయం అందినట్లుగానే అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తే బావుంటుందన్న ఆలోచన తట్టింది. అనుకున్న వెంటనే సాయం చేయడం ప్రారంభించారు. ప్రొపాట్రో దంపతులు ఇద్దరూ ప్రతి ఆదివారం దగ్గరల్లోని గ్రామాల్లో పర్యటించి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం అందిస్తారు. ఇందులో భాగంగా వారు కుట్టుమిషన్, బట్టలు, బుక్స్, బర్త్‌డే గిఫ్ట్స్, వ్యవసాయం చేసుకునే రైతులకు మేకలు, అనాథలకు మౌలిక సదుపాయాల కల్పన వంటివి చేస్తుంటారు. కొంతమందికి వంట చేసుకోవడానికి గ్యాస్ స్టవ్, మరికొందరికి ఆసుపత్రి బిల్లులు కట్టడం, గృహిణులకు వెట్ గ్రైండర్లు వంటివి ఇచ్చి ఆదుకుంటున్నారు. ప్రొపాట్రో తన పదేళ్ల సర్వీసులో ఎక్కువగా రిమోట్ ఏరియాల్లో పనిచేయడంతో .. అక్కడ ఉన్న పరిస్థితులను నిశితంగా గమనించారు. దీంతో గ్రామాల్లో ఉన్న స్కూళ్లను మెరుగు పరిచేందుకు వారి స్నేహితులను, బంధువులు, సామాజిక కార్యకర్తలను సంప్రదించి ఇక్కడి పరిస్థితులు వివరించి వారు చేయగలిగిన సాయంతోపాటు వీరు కొంత ఖర్చుపెట్టి ..స్కూళ్లలో రెండు గదులను ఏర్పాటు చేయడం, కంప్యూటర్లు, ఈ–లెర్నింగ్స్ కిట్స్, లౌడ్‌స్పీకర్స్, బల్లలు, వాటర్ ఫ్యూరిఫయర్స్, టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించారు. అంతేగాక స్కూలు మానేసిన పిల్లలను మళ్లీ బడికి తీసుకు రావడం, వారు చదువుకోవడానికి అవసరమైన వాటిని కొనిస్తూ్త వారిని ప్రోత్సహించడం వీరి పనులు. గ్రామాల్లోని మహిళలకు స్వయం సహాయక సంఘాల గురించి అవగాహన కల్పించడం, పొదుపుతో కుటుంబాన్ని సక్రమంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్పి వారిని సైతం సరైన మార్గంలో నడిపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. -
అవ్వ మరణంతో అనాథలుగా..
జయపురం: అమ్మా, నాన్నలు పోయారు. నాన్నమ్మే వారికి అన్నీ. ప్రస్తుతం నాన్నమ్మ కూడా చనిపోవడంతో ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు. కొరాపుట్ జిల్లా జయపురం సబ్‌డివిజన్ కుంధ్ర సమితి బిజాపూర్ పంచాయతీ ఖిలాపుట్ గ్రామానికి చెందిన వృద్ధురాలు పద్మ పొరజ కుమారుడు, కోడలు కొన్నేళ్ల కిందట మృతి చెందారు. అప్పటి నుంచి వారి నలుగురు కుమారులు, కుమార్తె నాన్నమ్మ పద్మ పొరజ వద్ద ఉంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.500 పింఛన్, 25 కేజీల బియ్యంతో కుటుంబం నెట్టుకువచ్చేది. కూలిపనులు చేస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. ఆ చిన్నారులకు ఏ కష్టం రాకుండా చూసుకునేది. నాన్నమ్మ మృతి చెందడంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు. వారిని ఆదుకునే ఆపద్భాందవుడి కోసం ఎదురుచూస్తున్నారు. ఆ చిన్నారులను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వృద్ధురాలు మృతి విషయం తెలుసుకున్న బిజాపూర్ సర్పంచ్ బృందావన్ నాయిక్‌తో పాటు పలువురు ఆమె దహన సంస్కారాలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కుంధ్రా సమితి బీఎస్‌ఎస్‌వో సుమిత్ర ఖొర, సమితి అధ్యక్షురాలు సురేంధ్ర పొరజ, కొరాపుట్ జిల్లా శిశు సురక్షా అధికారి రాజేశ్వరీ దాస్ అక్కడకు చేరుకుని మృతురాకి కుటుంబానికి రూ.15 వేలు ఆర్థికసాయం అందజేశారు. ఆ చిన్నారులకు పునరావాసం కల్పిస్తామని జిల్లా శిశు సురక్షా అధికారి రాజేశ్వరి దాస్ హామీ ఇచ్చారు. అంతవరకు వారు అంగన్వాడీ కేంద్రంలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. -
దిల్ రాజు కీలక నిర్ణయం
ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రుల అకాల మరణంతో అనాథలుగా మిగిలిన ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సత్యనారాయణ ఏడాది క్రితం కాలం చేశాడు. అతని భార్య అనురాధ కూడా ఇటీవలే మరణించారు. దీంతో ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. తొమ్మిదేళ్ల పెద్ద కుమారుడే పెద్ద దిక్కుగా మారి తన చెల్లి, తమ్ముడి ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. ఈ కథనం ఎంతో మందిని కదిలించగా నటుడు సోనూసూద్ వారికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. (సోనూ సూద్ వెనుక సోనాలి పాత్ర) వారు ఎంతమాత్రం అనాథలు కారని, వారి బాధ్యత తాను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వారిని మహారాష్ట్రలోని నాసిక్‌కు తీసుకువచ్చి ఓ ఆశ్రమంలో ఉంచుతానని తెలిపారు. మరోవైపు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సైతం వారి పరిస్థితికి చలించిపోయారు. ఆ ముగ్గురిని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. వారి బాధ్యతను తన భుజాలపై వేసుకుంటానని వెల్లడించారు. అయితే ఆ ముగ్గురు పిల్లలు ఈ ఇద్దరిలో ఎవరి దగ్గరకు వెళ్తారనేది ఇంకా నిర్ణయించుకోలేదు. (సోనూసూద్ అన్లిమిటెడ్ : వారి బాధ్యత నాదే) -
సేవకు కాదేది అనర్హం..
సేవా గుణం ఉండాలే కానీ, సేవకు కాదేది అనర్హం అని నిరూపిస్తున్నారు సిటీకి చెందిన హెయిర్ స్టైలిస్ట్స్..తాము చేసే వృత్తినే సేవకు అనుసంధానం చేశారు. తమ సేవల కోసం తమ దగ్గరకు రాలేని వారి దగ్గరకు తామే స్వయంగా వెళుతూ... ‘‘వి ఫర్ ఆర్ఫన్స్’’ పేరుతో సిటీలోని ఆర్ఫాన్హోమ్స్, వృద్ధాశ్రమాలు... వంటి చోట్లకు వెళ్లి ఉచితంగా హేర్ కటింగ్ చేస్తూ మనసుంటే సేవా మార్గాలెన్నో అని నిరూపిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ‘‘అనాథలకు తనకు తోచిన, నిరంతరాయంగా సాగే సహయం ఏదైనా చేయాలనే తపనతో ఉండేవాడినని, అందులోంచి పుట్టిన ఆలోచనే ‘‘వి ఫర్ ఆర్ఫన్స్’’ అని అంటున్నాడు ముషీరబాద్లో సెలూన్‌ని నిర్వహించే రాజేష్. 2018 నుంచి ఈ కార్యక్రమంలో భాగంగా సిటీలోనే దాదాపు 30 వరకు అనాథ ఆశ్రమాలు,స్వచ్చంద సేవా సంస్థల్లోని పిల్లలకు, వృద్ధులకు అంతేకాకుండా అంధులకు,రోడ్లపైన ఉండే మానసిక వికలాంగుల వద్దకు స్వయంగా తన టీంతో వెళ్ళి ఉచితంగా కటింగ్ చేస్తామని చెప్పాడు. సిటీలోనే కాకుండా చౌటుప్పల్, స్టేషన్ ఘన్పూర్, నర్సాపూర్ తదితర ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నాడు. ఇప్పటి వరకు 40 ఆశ్రమాల్లో 3500 మందికి పైగా తమ సేవలు అందించామన్నారు. సెలవుకు బదులు సేవ.. తను చేస్తున్న కార్యక్రమాలు నచ్చి సిటీలోని ప్రముఖ హేర్ సెలూన్స్‌లో పనిచేసే దాదాపు 40 మంది సభ్యులుగా చేరారని రాకేష్ చెప్పారు. వీరంతా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమ సేవలు అందిస్తున్నారన్నారు. తమకు సెలవు దినమైన మంగళవారం రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఇందులో భాగంగా ప్రతీ ఆశ్రమానికి నెలలో కనీసం ఒకసారైనా వెళ్ళి ఈ సేవలు అందిస్తామని తెలిపాడు. ప్రతీ ఆదివారం తన సెలూన్లో వచ్చే పూర్తి ఆదాయాన్ని ఈ కార్యక్రమ నిర్వాహణకు ఉపయోగిస్తానని,ఈ కార్యక్రమ నిర్వాహణకు ఒక ఆశ్రమానికి 1500 వరకు ఖర్చువుతుందని, ఎవరి దగ్గరా నిధులు సేకరించమని రాకేష్ తెలిపాడు. -
అనాథలకోసం ప్రత్యేక చట్టం
నాగోలు: అనాథల కోసం పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరముందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నా రు. నాగోలు తట్టిఅన్నారంలోని జె–కన్వెన్షన్‌లో జరుగుతున్న ఫోర్స్ ఫర్ ఆర్ఫన్స్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ (ఫోర్స్) అంతర్జాతీయ సదస్సు రెండో రోజు ఆదివారం జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అనాథల అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగే విధంగా కృషిచేస్తానని తెలిపారు. గతంలో తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనాథ విద్యార్థులకు సర్టిఫికెట్ల కోసం అసెంబ్లీలో ప్రస్తావిస్తే, అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేశారని గుర్తు చేశారు. అనాథాశ్రమాలు నడిపే ప్రతినిధులంతా ఢిల్లీ వస్తే ఈ విషయంపై ఇతర శాఖ మంత్రులతో చర్చించి వారి అభివృద్ధికి కావలసిన చర్యలు తీసుకుందామని తెలిపారు. మాజీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నాయకులు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, అనాథల సంక్షేమానికి స్వచ్చంధ సంస్థలతో పాటు రాజకీయ నాయకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనాథలను ఆదుకోవడానికి వెంకటస్వామి ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. -
ఫిబ్రవరిలో అనాథల అంతర్జాతీయ సదస్సు
సాక్షి, హైదరాబాద్: అనాథల అంతర్జాతీయ సదస్సును ఫిబ్రవరి 8, 9 తేదీల్లో నాగోల్ సమీపంలోని జె–కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నట్లు ఫోర్స్ (ఫోర్స్ ఫర్ ఆర్షన్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్) అధ్యక్షుడు గాదె ఇన్నయ్య తెలిపారు. శనివారం బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య సదస్సు వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లా డుతూ అనాథల హక్కుల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. వీరికి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని, ఉచిత విద్యతో పాటు ఉపాధి కలి్పంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరారు. అనంతరం గాదె ఇన్నయ్య మాట్లాడుతూ ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, టి.నందగోపాల్, రాంకోటి పాల్గొన్నారు. -
అనాథ పిల్లలకు ‘వెంకీ’మామ గిఫ్ట్
రియల్ లైఫ్ మామ అల్లుడు విక్టరీ వెంకటేష్, నాగచైతన్య రీల్ లైఫ్‌లో కలిసి నటించిన ‘వెంకీమామ’ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. కడుపుబ్బా నవ్విస్తున్న ఈ చిత్రం సినిమా యూనిట్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా వెంకీ అనాథ పిల్లలను కలిసి వారితో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆ పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు వెంకీతో సెల్ఫీలు తీసుకుని ఆనందపడ్డారు. అనాథ పిల్లల ప్రేమను చూసిన వెంకీ వారిని దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా హత్తుకున్నారు. అనంతరం వాళ్లందరి కోసం ‘వెంకీమామ’ ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. వారికి క్రిస్మస్ కానుకలను కూడా అందించాడు. దీంతో ఊహించని సర్ప్రైజ్కు అనాథ పిల్లలు ఎంతగానో సంతోషించారు. ప్రస్తుతం వెంకీ వారితో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా డిసెంబరు 13న విడుదలైన వెంకీమామ జోరు ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ చిత్రంలో మామ వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్, అల్లుడు నాగచైతన్యకు జోడీగా రాశి ఖన్నా నటించారు. (చదవండి: మామాఅల్లుళ్ల జోష్) -
తల్లిదండ్రుల మృతితో అనాథలుగా..
సాక్షి, జగిత్యాల: అమ్మానాన్న కానరాని లోకాలకు వెళ్లిపోయారు. అల్లారుముద్దుగా పెరగాల్సిన పిల్లలు అనాథలుగా మిగిలారు. ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల కోరిక తీర్చాలనుకున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లకు తండ్రి లక్ష్మణ్, తల్లి బాలవ్వ అనారోగ్యంతో మృతిచెందడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పూరిగుడిసెపై ప్లాస్టిక్ కవరు కప్పుకొని బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. ఇప్పుడు ఆ గుడిసె కూడా శిథిలావస్థకు చేరి ఎప్పుడేం ఏం జరుగుతుందోనని భయం భయంగా బతుకు వెల్లదీస్తున్నారు. జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన బిరుదుల లక్ష్మణ్, బాలవ్వకు ఇద్దరు కుమార్తెలు రజిత, జ్యోతి. వీరు చదువుకుంటున్న సమయంలోనే తండ్రి లక్ష్మణ్ 2009లో అనారోగ్యంతో మృతిచెందాడు. తల్లి బాలవ్వ పంచాయతీలో పారిశుధ్య కార్మికురాలుగా పని చేస్తూ ఇద్దరు కూతుర్లను చదివించింది. మూడేళ్ల కిందట తల్లిని క్యాన్సర్ మహమ్మారి కబలించింది. దీంతో ఇద్దరు యువతులు అనాథలుగా మిగిలారు. తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన పూరి గుడిసెలోనే ఉంటూ రజిత ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పని చేసుకుంటూ చెల్లెలు జ్యోతిని డిగ్రీ చదివిస్తోంది. వీరికి నాఅనే వారు లేకపోవడంతో ఇదే గుడిసెలో జీవనం సాగిస్తున్నారు. నిత్యం పని చేస్తే తప్పా పూట గడవడం కష్టతరంగా మారింది. దీంతోపాటు ప్రస్తుతం నివాసం ఉంటున్న గుడిసె కూడా శిథిలావస్థకు చేరడంతో నిత్యం బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. వర్షం పడితే గుడిసెలో ఉండడం ఇబ్బందికరంగా ఉండడంతో గుడిసెపై పాలిథిన్ కవరు కప్పుకుని జీవనం సాగిస్తున్నారు. అనాథ యువతులకు ఇంటి నిర్మాణ వ్యయం కోసం దాతలు ఆపన్నహస్తం అందిస్తారని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వమైనా స్పందించి తమకు గూడు, స్వయం ఉపాధి కోసం దారి చూపాలని వేడుకుంటున్నారు. బాధితులకు ఆర్థికసాయం చేసేవారు బిరుదుల రజిత అకౌంట్‌నం. 62483346935, ఎస్బీఐ, జగిత్యాల. ఐఎఫ్ఎస్సీ నం. SBIN0021978 -
పాపం.. పసివాళ్లు
కూడేరు: ఆ తల్లిదండ్రుల మనస్పర్థలు ఇద్దరు చిన్నారులను అనాథలను చేశాయి. క్షణికావేశంతో వారు ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలిద్దరూ దిక్కులేనివారయ్యారు. అభం శుభం తెలియని ఆ చిన్నారులు.. తల్లిదండ్రుల మృతదేహాలపై పడి ఏడుస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని కొర్రకోడు డ్యామ్‌కు చెందిన ఈడిగ వాసు(30), నాగతేజ శ్వణి(27) ప్రేమించుకుని 2012లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వాసు పీఏబీఆర్ డ్యామ్ వద్ద ఉరవకొండ తాగునీటి ప్రాజెక్ట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగి. ఆరేళ్ల కుమారుడు జయవర్ధన్, నాలుగేళ్ల కుమార్తె మోక్షిత ఉన్నారు. శనివారం రాత్రి వాసు, నాగతేజశ్వణిలు భోంచేసి నిద్రించేందుకు వెళ్లారు. వాసు తల్లిదండ్రులు మరో ఇంట్లో నిద్రించారు. ఉదయం ఎంతసేపటికీ తలుపు తెరవకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా.. ఉరేసుకుని కనిపించారు. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. -
అందుకే దత్తతలో అమ్మాయిలే అధికం!
దంపతులిద్దరూ పెద్ద ఉద్యోగాలు చేస్తారు, ధనవంతులు కూడా. కానీ సంతానమే లేదు. ఇక పిల్లలు పుట్టరని వైద్యులు తేల్చాక దత్తత తీసుకోవడమే మంచిదని భావించారు. శిశు సంక్షేమ శాఖ వద్ద నియమ నిబంధనలన్నీ పూర్తి చేసి చిన్నారి పాపను దత్తత తీసుకున్నారు. ఇలా రాష్ట్రంలో మగపిల్లల కంటే ఆడపిల్లలనే ఎక్కువమంది దంపతులు తమ బిడ్డగా చేసుకుంటున్నారు. మరో చేదు నిజం ఏమిటంటే వీధుల్లో, చెత్తకుప్పల్లో అనాథలుగా దర్శనమిస్తున్నవారిలో బాలికలు, ఆడశిశువులే అధికంగా ఉండడం గమనార్హం. సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో దంపతులు దత్తత తీసుకుంటున్న చిన్నారుల్లో ఎక్కువ మంది బాలికలే ఉంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2018– 19 ఏడాదికి సంబంధించి మొత్తం 237 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు. వారిలో 130 మంది బాలికలు, 107 మంది బాలురు ఉన్నారు. అంతేకాకుండా శిశుసంక్షేమ శాఖకు అప్పజెబుతున్న అనాథ పిల్లల్లో కూడా ఎక్కువ మంది బాలికలే ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా 3,374 మందిని దత్తత తీసుకోగా అందులో 1,977 మంది బాలికలు, 1,397 మంది బాలురు ఉన్నారు. కాగా కర్ణాటకలో గత 2017 – 18లో 294 మంది శిశువులను, బాలలను దంపతులు దత్తత తీసుకోగా, మరుసటి ఏడాది 237 మందికి తగ్గింది. గతేడాది కంటే ఈసారి 19 శాతం తక్కువ దత్తతలు నమోదయ్యాయి. దత్తతల్లో దేశంలో రెండవస్థానం చిన్నారులను దత్తత తీసుకోవడంలో జాతీయస్థాయిలో కర్ణాటక రెండోస్థానంలో ఉంది. కాగా మహారాష్ట్ర 695 మందితో ప్రథమ స్థానం ఆక్రమించింది. ఆడపిల్లలైతే బుద్ధిగా చదువుకుంటారని, చెప్పినట్లు వింటారనే భావనతో ఎక్కువమంది దత్తత తీసుకొంటున్నారని తెలుస్తోంది. మలివయసులో తమ ఆలనాపాలనా చూస్తారని దత్త తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. ఆస్తుల పంపకాల గొడవలు, కోపతాపాలు ఉండవనేది మరో కారణం. అనాథల్లో బాలికలే ఎక్కువ అనాథ ఆశ్రమాలకు, శిశు సంక్షేమ శాఖకు అప్పజెబుతున్న చిన్నారుల్లో ఎక్కువ మంది బాలికలే ఉన్నారు. రోడ్లపై దొరికే పిల్లల్లో.. బాల కార్మికులుగా పట్టుబడుతున్న వారిలో బాలికలే ఉండటం గమనార్హం. శిశు సంక్షేమ శాఖ అధికారులు రోడ్లపై, రైల్వేస్టేషన్లలో, బస్స్టేషన్లలో పనులు చేసుకుంటే తిరిగే వారిని గుర్తించి రక్షిస్తున్నారు. అంతేకాకుండా అప్పుడే పుట్టిన పిల్లలు చెత్తకుండీల పాలవుతున్నారు. వీరిలోనే ఆడ శిశువులే ఎక్కువగా ఉండటం దారుణమని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి 2019 వరకు పోలీసుల ద్వారా శిశు మందిరాలకు సుమారు 576 మందిని అనాథ శిశువులను అప్పగించగా, వారిలో 478 మంది బాలికలు ఉన్నారు. అంతేకాకుండా ఆడపిల్ల పుట్టిందని కూడా కొందరు తల్లిదండ్రులు పోషించలేమంటూ శిశు మందిరాలకు అప్పజెబుతున్నారు. మరోవైపు ఆడపిల్లలైతే పెద్దయ్యాక ఆప్యాయత పంచుతారని ఆశిస్తూ ఎంతోమంది దత్త తల్లిదండ్రులు వారిని అక్కునచేర్చుకుంటున్నారు. కర్ణాటకలో బాలబాలికల దత్తత వివరాలు ఏడాది దత్తత 2018-19 237 2017-18 294 2016-17 252 2015-16 277 -
ఊపిరి ఆగుతున్నా.. ఆదుకోరేమయ్యా?
ఆధునిక సమాజంలో అనాథలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఆకలితో అలమటిస్తూ నిత్యం జీవితంతో పోరాడుతూ బతుకుతున్న దుస్థితి. విధి వారిని కుటుంబం నుంచి దూరం చేసినా.. పట్టుదలతో ఆకలి తీర్చుకుంటున్నారు. చూసే వారు లేక అనారోగ్యంతో పిట్టల్లా రాలిపోతున్నారు అనాథలు. వీరిని ఆదుకుంటామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం చేతులేత్తిసింది. దీనికి తోడు అధికారుల మనసు కూడా రాకపోవడంతో నిశ్శబ్దంగా తనువు చాలిస్తున్నారు... ప్రకాశం, చీరాల: అనాథల జీవితాలు అర్దాంతరంగా ముగిసిపోతున్నాయి. నా అనే నాథుడే లేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఎండ, వాన...చలికి చితికిపోతున్నారు. రోజు ఏదో ఒక వీధిలో అనారోగ్యంతో తనువు చాలిస్తున్నారు. వారి కోసం ఆదుకునేందుకు మేమున్నాం అంటూ ప్రగల్బాలు పలికి మిన్నకుండి పోయింది. మున్సిపల్ అధికారులు వారిపై మమకారం చూపకపోగా, వారికి కేటాయించిన నిధులను సైతం మింగేశారు. అనాథల కోసం రాత్రి విడిది (షెల్టర్) ఏర్పాటు చేస్తామని మూడేళ్ల క్రితం మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదం చేసి పైపెచ్చు రూ.5 లక్షలు ఖర్చు చేశారు. కానీ ఒక్క అనాథకు కూడా షెల్టర్ ఇవ్వలేదు. మనసు లేని అధికారులు... వారికి ప్రతిరోజు అల్పాహారం, రాత్రికి భోజనం ఏర్పాటు చేసి రాత్రి వసతి కల్పిస్తామంటూ ప్రభుత్వం రెండేళ్ల క్రితం జీవో విడుదల చేసింది. రాష్ట్రంలోని సంగతేమో కానీ చీరాలలో మాత్రం అనాథలను ఆదుకోవడం లేదు. దేవుడు వరమిచ్చినా పూజారి వదడంలేదన్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసినా అమలు చేసేందుకు కింది స్థాయి అధికారులకు మాత్రం మనసు రావడంలేదు. దీంతో అనాథలుగా మారిన ఎంతో మంది మహిళలు, వృద్ధులు ఎండ వేడిమికి చలి గాలులకు వణికిపోతు రైల్వే స్టేషన్, బస్టాండ్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, దుకాణాల అరుగులపై నిద్రిస్తు అల్లాడిపోతున్నారు. పథకం ఉద్దేశం... పట్టణ పేదరిక నిర్మూలన (మెప్మా) సిబ్బంది పట్టణంలో అనాథలు ఎంత మంది ఉన్నారు, వారు ఏఏ పనులు చేస్తుంటారనే విషయాలను సేకరించి అధికారులకు నివేదిస్తారు. ఆ నివేదికల ప్రకారం అధికారులు నిధులు విడుదల చేసి వారికి ప్రతిరోజు అల్పాహారం, రాత్రికి భోజనం అందిండంతో పాటు వారు రాత్రి నిద్రించేందుకు వసతి (షల్టర్) ఏర్పాటు చేయాలి. 2015–16 గాను చీరాలలో 50 మంది అనాథలు మాత్రమేనని అధికారులు లెక్కలు తేల్చారు. ఏ ప్రాంతంలో చూసినా అనాథలు, బిక్షగాళ్లు లెక్కకు మించి తిరుగుతుంటే అధికారులు మాత్రం చీరాలలో కేవలం 50 మంది అనాథలు ఉన్నట్లు లెక్కలు తేల్చడం విస్మయానికి గురి చేస్తోంది. హడావుడిగా రూ. 5 లక్షలు ఖర్చుచేశారు... ప్రభుత్వం జీవో విడుదల చేసిన రెండేళ్లకు చీరాల మున్సిపల్ అధికారులు, పట్టణ పేదరిక నిర్మూలన (మెప్మా) ద్వారా అనాథలకు షెల్టర్ ఏర్పాటు చేసేందుకు హడావుడి చేశారు. నిరుపయోగంగా ఏ మాత్రం నివాసయోగ్యంకాని కూలేందుకు సిద్ధంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ బంగ్లా అనాథల షల్టర్‌కు సిద్ధం చేశారు. పెచ్చులూడుతున్న ఆ భవనానికి రూ. 5 లక్షలతో చిన్నచిన్న మరమ్మతులు చేపట్టి రంగులు వేయించారు. అనాథలైన స్త్రీ, పురుషులను వేర్వేరుగా ఉంచేందుకు గదులను సిద్ధం చేశారు. వంట గది, బాత్ రూమ్‌లు, లెట్రిన్లు కూడా కట్టించారు. తీరా షెల్టర్‌ను ప్రారంభించే నాటికి స్థానికులు అభ్యంతరం చెప్పారు. నివాస ప్రాంతాలలో అనాథలను పెడితే షెల్టర్‌లోకి ఎటువంటి వారు వస్తారో తెలియదు, ఈ ప్రాంతంలోకి దొంగలు, ఇతర నేరగాళ్లు వచ్చే ప్రమాదం ఉందని అడ్డు చెప్పారు. దీంతో అధికారులు షెల్టర్ ప్రారంభోత్సవాన్ని నిలుపుదల చేశారు. రూ. 5 లక్షలతో మరమ్మతులు చేపట్టినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా అయ్యాయి. ప్రస్థుతం ఆ భవనాన్ని మున్సిపాలిటికి చెందిన పాత సామాగ్రిని భద్ర పరిచేందుకు ఉపయోగిస్తున్నారు. -
సేవాభావం వర్ధిల్లాలి
ఒకరు తెలిసీ తెలియని వయస్సులో సమాజ మార్పు కోసం తుపాకీ పట్టారు. అడవుల్లో తిరిగారు. పాటలతో ప్రభావితమైన సాయుధ సమరంలో భాగస్వామ్యమయ్యారు. మరొకరు తల్లిదండ్రుల వారసత్వంతో విప్లవోద్యం వైపు అడుగులు వేశారు. అడవి తల్లి ఒడిలో కలిసి ప్రయాణిస్తూ జీవితాన్ని పంచుకున్నారు. అనుకోని సందర్భంలో పోలీసుల చేతికి చిక్కి జైలు జీవితాన్ని అనుభవించారు. ఇప్పుడు అనాథలకు అమ్మనాన్నలుగా మారారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు అన్నీ తామై సాకుతున్నారు. పోరుబాటను వదిలి నేడు అనాథలకు తమ జీవితాన్ని ధారపోస్తున్నారు. సొంత ఖర్చులతో అనాథల జీవితాల్లో వెలుగులు నింపడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వారే.. మాజీ నక్సలైట్ దంపతులు కత్తుల లక్ష్మి, రవీందర్.బాల్యంలోనే పోరుబాట వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం రాంపేట గ్రామానికి చెందిన కత్తుల కట్టయ్య, ఉపేంద్ర దంపతుల కుమారుడు కత్తుల రవీందర్. రాంపేట గ్రామం నాడు పీపుల్స్ వార్ ఉద్యమానికి కంచుకోటగా ఉంది. ఉద్యమ నేపథ్యం కలిగిన గ్రామం కావడంతో రవీందర్‌పై ఆ ప్రభావం పడింది. దీనితో పదో తరగతి పూర్తి చేసిన వెంటనే 1992లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన ఆకిటి నర్సిరెడ్డి, అనసూర్య దంపతుల కుమార్తె లక్ష్మి. నర్సిరెడ్డి, అనసూర్య దంపతులు అప్పటికే పార్టీ కంట్రోల్లో పని చేస్తున్నారు. లక్ష్మి రామన్నగూడెంలో 7వ తరగతి చదువుతోంది. మీ తల్లిదండ్రుల జాడ చెప్పమని పోలీసులు వేధించారు. దీనితో లక్ష్మి చదువును ఆపేసి 1996లోనే పోరుబాట పట్టింది. రవీందర్, లక్ష్మిలు ఇద్దరూ పాలకుర్తి ఏరియాలోనే పనిచేయడంతో పార్టీ అనుమతిలో 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అరెస్టుతో ఉద్యమానికి స్వస్తి ఉద్యమంలోనే దంపతులుగా మారిన లక్ష్మి, రవీందర్‌లు అరెస్టు కావడంతో పోరుబాటకు స్వస్తి చెప్పారు. పార్టీ విస్తరణలో భాగంగా లక్ష్మి, రవీందర్లను మహారాష్ట్రకు పంపించారు. అనారోగ్యానికి గురికావడంతో వైద్యం కోసం హైదరాబాద్‌కు వచ్చారు. పోలీసులు అరెస్టు చేశారు. దీనితో 2000 నుంచి 2002 వరకు వరంగల్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవించారు. విడుదలైన తరువాత మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. లక్ష్మి తీవ్రంగా అనారోగ్యానికి గురి కావడంతో 2004లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. భార్య లొంగిపోయిన 6 నెలల తరువాత భర్త రవీందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది రోజులు జైలు జీవితం అనుభవించి ఉద్యమ పంథాకు స్వస్తి చెప్పి సాధారణ జీవితాన్ని ఎంచుకున్నారు. మనసు చలించి..! ఉద్యమం బాట నుంచి బయటకు వచ్చిన లక్ష్మీ రవీందర్ దంపతులు చిరు వ్యాపారం చేసుకుంటూ జీవితంలో ఎదిగేందుకు అష్టకష్టాలు పడ్డారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో లక్ష్మి ఆత్మహత్య చేసుకుందామని కాజీపేట రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ అనాథ పిల్లలు పైసలు అడుక్కుంటూ కన్పించారు. ఈ దృశ్యాన్ని చూసిన లక్ష్మి మనస్సు మార్చుకుని తిరిగి ఇంటికి వచ్చారు. ఆలోచనను మార్చిన అనాథల కోసం ఏమైనా చేయాలనే నిర్ణయించుకున్న ఆమె భర్త రవీందర్ సహకారంతో ముందు చీరెల అమ్మకం ప్రారంభించారు.. 15 ఏళ్లపాటు చీరెల అమ్మకం చేసి ఆర్థికంగా స్థిరపడ్డారు. దృష్టి సారించి.. ఆర్థికంగా నిలబడిన తరువాత లక్ష్మి, రవీందర్ దంపతులు సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారించారు. 2013 లోనే కుమారుడు జన్మించారు. కుమారుడి పేరు మీద ‘వర్ధన్ స్వచ్ఛంద సంస్థ’ను ప్రారంభించారు. ఏజెన్సీ ఏరియాలో ఇల్లు కాలిపోయిన బాధితులకు బియ్యం, బట్టలు, నిత్యావసర వస్తువులను అందించారు. నిరుపేద మహిళలకు చీరెలు దానం చేయడం, అనాథ ఆశ్రమాల్లో అన్నదానాలు నిర్వహించారు. వికలాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ చేశారు. .. అనాథలకు చేయూత సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నం అయిన లక్ష్మి రవీందర్ దంపతులు 2017 అక్టోబర్‌లో జనగామ జిల్లా కేంద్రంలో ‘వర్ధన్ అనాథ ఆశ్రమం’ ప్రారంభించారు. రెడ్డి సంక్షేమ భవనాన్ని అద్దెకు తీసుకుని ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆశ్రమంలో 30మంది అనాథ పిల్లలు ఆశ్రయంపొందుతున్నారు. పిల్లలను పోషిస్తూనే విద్యను చెప్పిస్తున్నారు. అలనాపాలన మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నారు. ‘అమ్మ’కు కర్మకాండ ఆరు మాసాల కింద గుర్తు తెలియని అనాథ వృద్ధురాలు నర్సమ్మ ఆశ్రమంలో చేరింది. అయితే నర్సమ్మ ఆగస్టు 1వ తేదీన మృతి చెందింది. దీనితో నర్సమ్మకు లక్ష్మి రవీందర్ దంపతులు అంత్యక్రియలు నిర్వహించారు. లక్ష్మి కర్మకాండ చేయడం పలువురిని కదిలించింది. బంగారు భవిష్యత్తు ఇవ్వడమే ధ్యేయం కొత్త జీవితాన్ని ప్రారంభించిన సమయంలో ఎన్నో కష్టాలను అనుభవించాం. కనీసం తినడానికి అన్నం లేదు. ఉండటానికి ఇల్లు లేదు. బయటకు వచ్చిన తరువాత ఎవరూ తెలియదు. ఎలా బతకాలో తెలియదు. వరంగల్‌లో చిరు వ్యాపారం చేసి ఈ స్థాయికి వచ్చాం. అనాథలకు బంగారు భవిష్యత్ ఇవ్వడమే ధ్యేయంగా ఆశ్రమాన్ని నిర్వహించాం. ఆశ్రమానికి వచ్చే పిల్లలకు తల్లిదండ్రుల్లా సేవ చేస్తాం. దాతలు అందిస్తున్న తోడ్పాటు మరువలేనిది. ఆడపిల్లలను బతికించుకుందామనే కార్యక్రమంతో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించబోతున్నాం. అనాథలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో సేవలను మరింతగా విస్తరిస్తాం. మాకు చేయూతగా మానవత్వవాదులు ముందుకు రావాలని కోరుతున్నాం. – కత్తుల లక్ష్మి – ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామ -
అనాథలుగా బతకలేమని..
పటాన్చెరు టౌన్: ముగ్గురు కొడుకులున్నా ఎవరూ పట్టించుకోక పోవడంతో మనస్తాపానికి గురైన వృద్ధ దంపతులు భోజనంలో పురుగుల మందు కలుపుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పటాన్చెరు మండల పరిధిలోని నందిగామకు చెందిన పిచ్చకుంట్ల లక్ష్మీనారాయణ (65), అక్కమ్మ (61) దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహాలు కావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, అనాథలుగా బతకాల్సి వస్తోందని మనస్తాపం చెందిన ఆ వృద్ధ దంపతులు శనివారం అర్ధరాత్రి కూరలో పురుగుల మందు కలుపుకొని తిన్నారు. ఇద్దరికీ వాంతులు కావడంతో పక్కింట్లో ఉంటున్న చిన్న కోడలు రేణా గమనించి 108కి సమాచారం అందించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ ఆదివారం ఉదయం మృతిచెందారు. తమను చూసే వారు ఎవరూ లేరని తమ తల్లిదండ్రులు తరచూ బాధపడుతుండే వారని, చనిపోవాలని ఉందని అనేవారని, ఇలా చేస్తారని అనుకోలేదని పెద్ద కొడుకు పెంటయ్య పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
జీవచ్ఛవాలు
ఔను వారు జీవచ్ఛవాలే.. పలుకరించే తోడు లేదు. పట్టెడన్నం పెట్టే చేయీ లేదు. ఒంటికి వచ్చిన రోగం ఓపికనంతా పిండేస్తోంది. శరీరానికి తగిలిన గాయం ప్రాణాలను నిలువునా తోడేస్తోంది. దారినపోయే దానయ్యలెవరో దయతలిస్తే ఆస్పత్రికి చేరినా వైద్యానికి నోచుకోని అభాగ్యులు. వైద్యులు, వైద్య సిబ్బంది అనుక్షణం హడావుడిగా ఉండే అత్యవసర విభాగం వద్దనే స్ట్రెచర్‌పై కదలలేని పరిస్థితుల్లో పడి ఉన్నా ఎవరికీ పట్టని అనాథలు. ఇదీ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)లో నెలకొన్న పరిస్థితి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన, ప్రయాణంలో ఉండగా అనారోగ్యంతో అస్వస్థతకు గురైన రోగులను సహాయకులు లేరన్న కారణంతో ఆస్పత్రిలో చేర్చుకోవడం లేదు. ప్రాణాపాయస్థితిలో ఉన్నా స్ట్రెచర్లపైనే వదిలేస్తున్నారు. వార్డులో చేర్చకపోవడంతో వారికి ఆహారం కూడా అందడం లేదు. ప్రాణం పోయేవరకు రోగులు జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ఎప్పుడూ వివిధ శాఖల అధికారులతో కలిసి వేదికపై కూర్చుని, తమ వద్దకు వచ్చే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కలెక్టర్ కోన శశిధర్ సోమవారం ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ఆలకించారు. పలు సమస్యలను పరిష్కరించాలంటూ అప్పటికప్పుడే సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే అవకాశమున్న ‘గ్రీవెన్స్’ అంటే తనకెంతో ఇష్టమన్నారు. సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చిన ఏ ఒక్కరు అసంతృప్తితో వెనుదిరిగినా ఇక తమ అధికారాలకు అర్థమే లేదన్నారు. గుంటూరు ఈస్ట్ : శ్రీకాకుళం జిల్లాకు చెందిన 30 ఏళ్ల చిన్ననారాయణ తాపీ పనుల కోసం చెన్నై వెళ్లి తిరిగి రైలులో ప్రయాణిస్తున్నాడు. గుంటూరు సమీపంలో రైలు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 ద్వారా జూన్ 28న అత్యవసర విభాగానికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. చిన్ననారాయణ కొంత మతిస్థితిమతం కోల్పోవడం, సెల్‌ఫోన్ పోగొట్టుకున్న కారణంగా బంధువుల వివరాలు చెప్పలేకపోయాడు. తన పని తాను చేసుకోలేక నరకయాతన పడుతున్నాడు. ఆకలి అయితే తిండి పెట్టేవారు లేక, మరోవైపు గాయాల నొప్పులతో అల్లాడిపోతున్నాడు. ఈ నెల 8న పక్షవాతంతో గుర్తు తెలియని వృద్ధుడు, రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి షేక్ రబ్బాని జీజీహెచ్ అత్యవసర విభాగంలో చేరారు. ఇద్దరూ కొంత స్పృహలో ఉన్నప్పటికీ తీవ్ర అస్వస్థతో తమ వివరాలు చెప్పలేక పోయారు. స్ట్రెచర్ మీద నుంచి పైకి లేవలేని స్థితిలో అలాగే పడి ఉన్నారు. వారిని పట్టించుకున్న నాథుడే లేడు. ఎందరో రోగులు.. కొందరే వైద్యులు ఇలా తీవ్ర అస్వస్థతో జీజీహెచ్ అత్యవసర విభాగానికి వచ్చే గుర్తు తెలియని వ్యక్తులు, అనాథల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వీరికి సహాయకులు ఎవరు ఉండక పోవడంతో ఎక్కువ కాలం వార్డుల్లో ఉండాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ఈ క్రమంలో పట్టించుకునేవారు లేకపోవడంతో అత్యంత దయనీయంగా బతుకీడుస్తున్నారు. ప్రతిరోజు జీజీహెచ్‌కు 3,500 నుంచి 4,000 మంది రోగులు చికిత్స నిమిత్తం వస్తారు. అత్యవసర విభాగానికి ప్రతి రోజు వెయ్యి మందికి పైగా వస్తుంటారు. వీరందరికీ సమర్థవంతంగా చికిత్స అందించడానికి వైద్య, వైద్యేతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ కారణంగా అడ్మిషన్ పొంది సహాయకులు ఉన్న రోగులకు చికిత్స అందించడంలో చాలా సార్లు లోపాలు వెల్లువెత్తాయి. నెలకు సుమారు 50 నుంచి 60 మంది అనాథలు, గుర్తు తెలియని వ్యక్తులు తీవ్ర గాయాలతో జీజీహెచ్‌కు వస్తున్నారు. వీరిని వార్డులో చేర్చుకుని ఎక్కువ రోజులు చికిత్స అందించడం ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రాణాలు పోతున్నాయి.. సహాయకులు లేని రోగులను వార్డుల్లో చేర్చుకోవడానికి గతంలో వైద్యులు నిరాకరించేవారు. కానీ ప్రతికల్లో వచ్చిన కథనాలతో ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి వారిని వార్డుల్లో చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి ఇటువంటి వారిని వైద్య సేవలు లభిస్తున్నాయి. కానీ కదలలేని స్థితిలో ఉన్న వీరికి ఆహారం ఇచ్చేవారు కరువయ్యారు. అంతే కాకుండా వీరు తమ పనులు చేసుకోలేక మంచం మీద, స్ట్రెచర్‌పై సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక చర్యలు చేపట్టాలి.. ఇటువంటి వారిలో ఎముకలు విరిగినవారిని ఆర్థో విభాగానికి, నరాల సంబంధిత సమస్యలు ఉన్న వారిని నరాల విభాగానికి పంపుతున్నారు. ఇతర సమస్యలు ఉన్నవారిని ఎక్కడ బెడ్లు ఖాళీ ఉంటే అక్కడ వదిలి పెడుతున్నారు. అయితే తిండి అందక విలవిల్లాడుతున్నారు. ఈ క్రమంలో మృతి చెందిగానే మార్చురికి తరలిస్తున్నారు. ఒక్కొసారి బాగా బతికిన కుటుంబాలకు చెందిన వారు, ఇతర రాష్ట్రాల వారు ప్రయాణాలలో గాయపడి వస్తే వారిది ఇదే పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు ఇటు వంటి వారి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనితో పాటు మానవసేవ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తే ఈ సమస్యకు కొంతైనా పరిష్కారం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘మానవ సేవ’ ఏమైంది? జీజీహెచ్‌లో రోగులకు సహాయం అందించేందుకు మాన సేవ కార్యక్రమాన్ని ప్రారంభించిన వైద్య అధికారులు క్రమేపీ దానిపై అశ్రద్ధ వహిస్తూ వచ్చారు. ఫలితంగా కార్యక్రమం పడకేసింది. ఇందులో భాగంగా రోగులకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న మానవతావాదులు జీజీహెచ్‌కు వచ్చి వివిధ వార్డుల్లో రోగులకు సేవ చేసేవారు. ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభిస్తే నగరంలోని విద్యార్థులు, యువత, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో వచ్చి రోగులకు సేవల అందించే అవకాశం ఉంది. -
అనాధ మహిళల కోసం స్వధార్ హోం
విజయనగరం ఫోర్ట్ : వివక్ష గురైన మహిళలు, నిరాదరణకు గురైన మహిళల కోసం స్వధార్ హోమ్ ఏర్పాటు చేసినట్టు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభాస్వాతిరాణి తెలిపారు. స్థానిక మహిళా ప్రాంగణంలో సోమవారం నూతనంగా ఏర్పాటు చేసిన స్వధార్ హోమ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వధార్ హోమ్‌లో ఉన్న మహిళలకు భోజనం, వసతి, కౌన్సెలింగ్, రక్షణ, వైద్యం, న్యాయసహాయం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే మీసాలగీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, ఐసీడీఎస్ పీడీ రాబర్ట్స్, ఏపీడీ వసంత బాల, ప్రాంగణం జిల్లా మేనేజర్ కె.నీలిమ తదితరులు పాల్గొన్నారు. -
నాడు తండ్రి.. నేడు తల్లి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : అనారోగ్యం ఆ కుటుం బాన్ని వెంటాడింది. కూలీ పనులు చేస్తేనే పూటగడిచే కడు పేదరికం అనుభవిస్తున్న ఆ కుటుం బంలో భార్యభర్తలు అనారోగ్యంతో తనువు చా లించడంతో వారి ఇద్దరు కూతుళ్లు అనాథలయ్యా రు. ఈ విషాద సంఘటన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్‌లో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..తిమ్మాపూర్‌కు చెందిన కొలకాని సుజాత–లక్ష్మయ్య దంపతులు కూలీ పనులు చేస్తూ కూతుళ్లు అక్షయ(10), ఐశ్వర్య(5)ను పోషించుకుంటున్నారు. రెండేళ్ల క్రితం లక్ష్మయ్య అనారోగ్యానికి గురయ్యాడు. స్థానిక ఆస్పత్రుల్లో చూపించుకున్నా వ్యాధి నయం కాలేదు. హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్తే ఖరీదైన వైద్యం అందించాలని వైద్యులు సూచించగా.. అం దకపోవడంతో లక్ష్మయ్య మృతిచెందాడు. అప్పటి నుంచి సుజాత కూలీ పనులు చేస్తూ ఇద్దరు పిల్లల ను పోషించుకుంటుంది. ఆమె కూడా అనారోగ్యానికి గురై ఆదివారం మరణించడంతో ఇద్దరు పిల్లలు అనాథలై తల్లి శవం వద్ద విలపించడం అందరినీ కలచివేసింది. మృతురాలి కుటుంబాన్ని ఏఎంసీ చైర్మన్ అందె సుభాష్ పరామర్శించి ఇద్దరు ఆడ పిల్లలను మంత్రి కేటీఆర్ సాయంతో గురుకుల విద్యాలయంలో చేర్పించి ప్రయోజకులుగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. అంత్యక్రియల్లో నాయకులు అనిల్, సీత్యానాయక్, రవి పాల్గొన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అనాథలను ఆదుకోరూ...
వెల్గటూరు(ధర్మపురి) : రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. లైన్ బండి(లారీ) నడుపుతున్న నాన్న, పొద్దంతా బీడీలు చుట్టే అమ్మ నెల వ్యవధిలో అంతుచిక్కని వ్యాధితో మరణించడంతో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. వీరిలో పెద్ద పాప కూడా అనారోగ్యం బారిన పడడం.. అమ్మమ్మ లేచి నడవలేని స్థితిలో ఉండడం ఆ కుటంబాన్ని తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుతం చిన్నారులకు బంధువులు బుక్కెడు వండి పెడితే తింటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గ్రామస్తుల వివరాల ప్రకారం .. మండలంలోని కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన పొనగంటి శ్రీనివాస్(45), బుజ్జవ్వ (38) దంపతులు అంతుచిక్కని వ్యాధి బారినపడి నెల వ్యవధిలో మృతి చెందారు. దీంతో వారిపిల్ల్లలు శ్రీవాణి(17), వెంకటేశ్(13), వైష్ణవి(10) వీధిన పడ్డారు. జగిత్యాల మండలం కల్లెడ గ్రామానికి చెందిన శ్రీనివాస్ కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన బుజ్జవ్వను వివాహం చేసుకుని ఇల్లరికపు అల్లుడుగా వచ్చాడు. సుమారు 20ఏళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సవ్యంగా సాగింది. శ్రీనివాస్ పెట్రోల్ ట్యాంకర్ లైన్‌బండి నడుపుతుండగా అతడి భార్య బీడీలు చుడుతూ పిల్లలను పోషించుకుంటున్నారు. నెలక్రితం శ్రీనివాస్ మరణించగా.. గురువారం బుజ్జవ్వ మృతి చెందింది. దీంతో పిల్లలు అనాథలయ్యారు. వీరితో పాటు ఉంటున్న అమ్మమ్మ చంద్రవ్వ కళ్లు కనపడక లేవలేని స్థితిలో ఉంది. ఉన్నతాధికారులు, నాయకులు స్పందించి పిల్లల చదువు ఆగిపోకుండా.. వారిని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. -
అనాథ పిల్లలపై అమానుషం
హన్మకొండ చౌరస్తా: అమ్మా, నాన్న పిలుపునకు దూరమై.. నా అనేవారు లేని పిల్లల సంరక్షణ చూడాల్సినవారే అమానుషంగా ప్రవర్తించారు. సరైన భోజనం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించినందుకు హింసించారు. అంతటితో అహం చల్లారక గుండు గీయించారు. అమానుషమైన ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ లష్కర్ బజార్‌లోని ప్రభుత్వ పట్టణ వీధి బాలల వసతి గృహంలో సుమారు వంద మంది అనాథ విద్యార్థులు ఉన్నారు. పిల్లలందరూ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. వారం రోజులుగా వార్డెన్ అర్చన వ్యక్తిగత సెలవులో ఉండగా, వసతి గృహాన్ని ట్యూటర్ రాజు, వాచ్‌మన్ జవహర్లే నిర్వహిస్తున్నారు. అయితే నీళ్ల చారు, సరిగా ఉడకని అన్నాన్ని వడ్డించడంపై రెండు రోజుల క్రితం కల్యాణ్, దిలీప్, అక్షయ్‌వర్మ అనే విద్యార్థులు ట్యూటర్, వాచ్మన్లను నిలదీశారు. దీంతో ‘మమ్మల్నే అడుగుతార్రా’అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ఆ ముగ్గురు విద్యార్థులను చితకబాదారు. అయినప్పటికీ శాంతించని వాచ్‌మన్, ట్యూటర్లు ఆ ముగ్గురికి గుండు చేయించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. ఏబీఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్బీ, డీఎస్‌యూ విద్యార్థి సంఘాలు బుధవారం సాయంత్రం వసతి గృహం ఎదుట ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్ మాట్లాడుతూ ట్యూటర్, వాచ్మన్లను విధుల నుంచి తొలగించాలని, మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న హన్మకొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన ఉధృతం కాకుండా బందోబస్తు చేపట్టారు. ఆ ఇద్దరిని తొలగించాం విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ట్యూటర్ రాజు, వాచ్‌మన్ జవహర్‌ను తొలగిస్తూ ఉదయమే తీర్మానం చేశాం. వారిద్దరిపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. పిల్లలకు సరైన భోజనం పెట్టడం లేదనడం సరైంది కాదు. ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నాం. – కేడల పద్మ, నిర్వాహకురాలు,పట్టణ వీధి బాలల వసతి గృహం, లష్కర్‌బజార్ -
క్రమశిక్షణతో చదవాలి
పెద్దపల్లిరూరల్ : చదువుకోసం దూర, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని మున్సిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య, ఏసీపీ హబీబ్‌ఖాన్ అన్నారు. రంగంపల్లి గిరిజన వసతిగృహంలో అనాథ విద్యార్థులకు కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన అన్నదానంకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. బీసీ, ఎస్టీ హాస్టల్లో ఉంటూ చదివే విద్యార్థులు తాము పెద్దపల్లిలోని పాఠశాలకు వెళ్లి› రావడానికి ఇబ్బందులు పడుతున్నామని చైర్మన్ రాజయ్య దృíష్టికి తెచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీఐ నరేందర్, ఎస్సై జగదీశ్, వార్డెన్లు స్వర్ణలత, రమేశ్, కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ తదితరులున్నారు. -
ఉద్యోగాల్లో అనాధలకు కోటా
సాక్షి, ముంబయి : ప్రభుత్వ ఉద్యోగాల్లో జనరల్ క్యాటగిరీ కింద అనాధలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగాలకు దరఖాస్తు చేసే సమయంలో తమ కులమేంటో తెలియని అనాధలకు ఊరట లభించిందని అధికారులు పేర్కొన్నారు. జనరల్ క్యాటగిరీ కింద రిజర్వేషన్లు కల్పించడంతో అనాధలకు ఉద్యోగాలు ఇతర సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో అనాధ పిల్లల పునరావాసం సులభతరమవడంతో పాటు వారి భవిష్యత్‌కూ భరోసా ఏర్పడిందని మహిళా శిశు సంక్షేమ మంత్రి పంకజ ముండే చెప్పారు. అనాధలకు వారి కులానికి సంబంధించిన వివరాలు తెలియకపోవడంతో వారికి విద్యా, వ్యాపార, సామాజిక రాయితీలు, రుణాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా నిర్ణయంతో అనాధల జీవితాల్లో వెలుగు నింపామని మంత్రి పేర్కొన్నారు. -
సిటీలో అడ్రస్ లేని కొత్త నైట్ షెల్టర్లు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకులక్ష జనాభాకో షెల్టర్ తప్పనిసరి ఆ లెక్కన గ్రేటర్ జనాభా మేరకు 200 షెల్టర్లు అవసరం ప్రస్తుతం ఉన్నవి: 12, ఆశ్రయం పొందుతున్నవారు 200 మంది నీడలేని వారిని గుర్తించే ప్రక్రియలో నిర్లక్ష్యం తూతూ మంత్రపు సర్వేలను తిరస్కరించిన కేంద్రం. పొట్టకూటి కోసం వలస వచ్చి..ఏ ఆధారమూ లేక జీవన పోరాటం చేస్తున్న అభాగ్యులు నగరంలో ఎందరో..ఇక కుటుంబ సభ్యుల ఆదరణ లేక... సంతానం లేక..ఏ తోడూ నీడా లేని వారు మరెందరో. వివిధ జిల్లాల నుంచి నగరంలోని ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చే వారూ వేలల్లోనే ఉంటారు. వారి సహాయకులకూ సిటీలో నీడ దొరకడం కష్టమే. ఇలాంటి వారికి కనీస ఆశ్రయం కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో నగరవ్యాప్తంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 12 నైట్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. కానీ ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. మూడేళ్ల క్రితమే కొత్తగా మరికొన్ని షెల్టర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రతి ఐదు లక్షల మందికో నైట్ షెల్టర్ ఉండాలి. ఆ లెక్కన కోటి జనాభా దాటిన నగరంలో 200 నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కనీసం పది శాతం కూడా లేవు. దీంతో చలిలో వణుకుతూ వేలాది మంది నిరాశ్రయులు రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపైన అవస్థలు పడుతున్నారు. నిరాశ్రయులను గుర్తించడంలోనూ నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. ఇక ఉన్న షెల్టర్లలోనూ కొన్నిచోట్ల వసతుల కొరత ఉంది. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు తగ్గింది. సాయంత్రం నుంచే మొదలవుతున్న చలిగాలులతో ప్రజలు బయట తిరగలేకపోతున్నారు. ఇక ఎలాంటి ఆశ్రయమూ లేని వారు చలి రాత్రుల్లోనే జాగారం చేయాల్సి వస్తోంది. చలిని తట్టుకోలేని వారు కడుపులోకి కాళ్లు ముడుచుకొని పడరాని పాట్లు పడుతున్నారు. దుకాణాలు మూసివేశాక షట్టర్ల కింద కొందరు తలదాచుకుంటుండగా..ఫుట్‌పాత్‌లతో సహా ఎక్కడ ఏ మాత్రం దాపు కనిపించినా అక్కడ ముడుచుకుంటున్న వారు ఎందరో. ప్రతి చలికాలం సీజన్లో నిరాశ్రయులకు తగినన్ని నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటిస్తున్న జీహెచ్ఎంసీ మాటలు నీటి మూటలవుతున్నాయి. గత మూడేళ్లుగా నైట్‌షెల్టర్లను పెంచుతామంటున్నప్పటికీ, నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చేవారు..ఆస్పత్రుల్లో రోగులకు సహాయకులుగా ఉంటున్నవారు.. నా అన్నవారు లేని అనాథలు.. యాచకులు తదితరులు చలి తీవ్రతతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రుల వద్ద ఇలాంటి వారు ఎక్కువగా ఉంటున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రతి ఐదు లక్షల మందికో నైట్ షెల్టర్ ఉండాలి. ఆ లెక్కన కోటి జనాభా దాటిన నగరంలో 200 నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కనీసం పది శాతం కూడా ఏర్పాటు కాలేదు. గ్రేటర్లో వివిధ ప్రాంతాల్లో 14 నైట్‌షెల్టర్లు మాత్రమే ఉన్నాయి. వాటిల్లోనూ కనీస సదుపాయాల్లేక చాలామంది వాటిని కూడా వినియోగించుకోవడం లేరు. తూతూమంత్రపు సర్వేలు.. ఏ గూడు లేక ఆకాశం కప్పుకిందే తలదాచుకుంటున్న వారిని గుర్తించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు గత మార్చిలో సర్వే నిర్వహించారు. అలాంటి వారు కేవలం 1491 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దాదాపు మూడేళ్లక్రితం నిర్వహించిన సర్వేలో 3500 మంది ఉండగా, ఈ సంఖ్య సగంకంటే తగ్గింది. ఇంతపెద్ద మహానగరంలో ఇంత తక్కువమంది ఉండటాన్ని నమ్మలేక మరోమారు సర్వే నిర్వహించాల్సిందిగా కేంద్రం నుంచి వచ్చిన అధికార బృందం సూచించింది. అయినప్పటికీ ఇంతవరకు మళ్లీ సర్వే నిర్వహించలేదు. నైట్‌షెల్టర్లను పెంచలేదు. చలిరాత్రుల్లో వణకుతున్నవారిలో ఎక్కువ మంది ఆస్పత్రుల వద్ద ఉంటున్నట్లు మూడేళ్ల క్రితమే గుర్తించి, ఆయా ఆస్పత్రుల వద్ద నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కోఠి ప్రసూతి, ఈఎన్టీ, ఉస్మానియా, నిలోఫర్, గాంధీలతో సహా మొత్తం ఏడు ఆస్పత్రుల వద్ద నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలనుకున్నారు. గాంధీ ఆస్పత్రి వద్ద నైట్‌షెల్టర్‌కు అవసరమైన స్థలం ఇచ్చేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. మిగతా ప్రాంతాల్లో పనులు ప్రారంభమైనప్పటికీ, ఇంతవరకు ఒక్కచోట కూడా అందుబాటులోకి రాలేదు. ఉండాల్సిన చోట లేక.. ఉన్నవాటి గురించి తెలియక.. నైట్‌షెల్టర్లను ఆశ్రయించేవారికి కేవలం ఆశ్రయం మాత్రమేకాక, తగిన పడక, తాగునీరు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానాలు చేసేందుకు తగిన ఏర్పాట్లతోపాటు, లాకర్లు, రాత్రిపూట రూ.5 భోజనం వంటి సదుపాయాలుండాలి. కానీ కొన్ని కేంద్రాల్లో మాత్రమే ఈ సదుపాయాలున్నాయి. 12 నైట్‌షెల్టర్లలో 380 మంది ఉండేందుకు సదుపాయాలున్నాయని జీహెచ్ఎంసీ చెబుతుండగా, వాటిల్లో ఉంటున్న వారు 200 మందికి మించడం లేదు. వీటి గురించి తెలియక చాలామంది షెల్టర్లను వినియోగించుకోవడం లేదు. ఉన్న నైట్‌షెల్టర్లు ప్రధాన రహదారులు, ఆస్పత్రులు, బస్టాండ్లకు దూరంగా ఉండటంతో వీటి గురించి సమాచారం తెలియడం లేదు. ఉస్మానియా, నిలోఫర్, ఆస్పత్రుల్లో వెయ్యిమందికి పైగా ఉండే ఇన్‌పేషెంట్లకు సహాయకులుగా వచ్చేవారు అంతకు ఎక్కువే ఉంటారు. ఎంఎన్‌జే క్యాన్సర్, కోఠి, పేట్లబుర్జు ప్రసూతి ఆస్పత్రులకు వచ్చే అటెండెంట్లు కూడా వెయ్యి మంది వరకు ఉంటారు. వీరంతా పేద కుటుంబాలకు చెందినవారే కావడంతో హోటళ్లు, లాడ్జిల్లో ఉండలేక ఆస్పత్రుల పరిసరాల్లోనే ఎముకలు కొరికే చలి రాత్రుల్లో అల్లాడుతున్నారు. ఉపయోగించుకుంటున్నది ఎందరు? బంజారాహిల్స్‌లోని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వద్ద నైట్‌షెల్టర్ కాక జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వివిధ ఎన్జీఓల నిర్వహణలో 12 నైట్షెల్టర్లున్నాయి. వాటిల్లో 380 మందికి వసతికి సదుపాయం ఉన్నట్లు పేర్కొంటున్నప్పటికీ 200మంది కూడా ఉండటం లేదు. జీహెచ్ఎంసీ లెక్కల్లో మాత్రం ఎక్కువ మంది ఉంటున్నట్లు చూపుతున్నారు. రాత్రిపూట తక్కువ ధరకు (రూ. 5 )భోజనం ఏర్పాట్లు ఏ నైట్షెల్టర్లోనూ లేవు. సరూర్‌నగర్ మహిళల నైట్‌షెల్టర్‌లో 20 మందికి వసతి ఉన్నట్లు పేర్కొనగా, 12 మంచాలున్నాయి. వండుకునే వారి కోసం గ్యాస్, స్టవ్ సదుపాయాలున్నాయి. నిలువ నీడ లేక..వేరే దారి లేక...బంజారాహిల్స్‌లో రోడ్ల పక్కనే నిద్రిస్తున్న దృశ్యం నామాలగుండులో వసతులు ఓకే... సికింద్రాబాద్: సికింద్రాబాద్ నామాలగుండులోని జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయంలో మహిళల కోసం నైట్‌షెల్టర్ కొనసాగుతుంది. ఇందులో 29 మంది మహిళలు ఆశ్రయం పొందుతున్నారు. 15 మంది మహిళలు బయట ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ ఆశ్రయం పొందుతుండగా, మిగతా 14 మంది ఇక్కడే ఉంటూ కుట్టు పనులు చేసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లతో ఇక్కడే శిక్షణ పొంది మహిళలు ధరించే నైటీలను కుడుతున్నారు. బయట నుంచి కొన్ని కంపెనీలు నైటీలను బల్క్‌లో కుట్టడం కోసం అవపరమైన క్లాత్, దారంను అందిస్తున్నాయి. ఒక్కో నైటీ కుట్టినందుకుగాను వీరికి రూ.40 కూలీ ఇస్తుంటారు. నైట్ షెల్టర్‌లో వసతులు బాగున్నాయని ఆశ్రయం పొందుతున్న మహిళలు చెబుతున్నారు. పేట్లబురుజులో 20 మంది బస దూద్‌బౌలి: పేట్లబురుజులోని వార్డు కార్యాలయంలో నైట్ షెల్టర్ కొనసాగుతుంది. ఇందులో గతంలో 30 మంది ఉండగా... ప్రస్తుతం 20 మంది బస చేస్తున్నారు. వీరికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో భోజన సదుపాయంతోపాటు దుప్పటి, బకెట్, సబ్బులు, పరుపుతో కూడిన మంచం ఏర్పాటు చేశారు. నైట్ షెల్టర్ కేర్‌టేకర్ ఖాలేద్ ఖాన్ మాట్లాడుతూ... 20 మందికి సరిపడా బెడ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వారికి సమయానికి భోజన, ఇతర సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ఒక వేళ అధిక సంఖ్యలో సభ్యులు చేరితే వారిని బేగంపేట్ కార్యాలయానికి తరలిస్తున్నామన్నారు. బేగంపేటలో 50 మంది... సనత్‌నగర్: బేగంపేట బ్రిడ్జి కింద ఉన్న జీహెచ్ఎంసీ పునరావసం కేంద్రంలో దాదాపు 50 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారు. వీరంతా ఇక్కడ ఉంటూ హౌస్ కీపింగ్, ఫ్లంబర్, హోటల్స్, హెల్పర్స్, అడ్డా కూలీలు, కాల్ సెంటర్...ఇలా తమకు తోచిన పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఇక ఇక్కడ వసతుల విషయానికొస్తే...నిద్రించేందుకు బెడ్స్, మ్యాట్స్, బెడ్‌షీట్స్, దిండ్లు, సామాన్లు భద్రపరచుకునేందుకు లాకర్స్, టాయిలెట్స్, కిచెన్ అండ్ ఫుడ్, టీవీ తదితర సదుపాయాలున్నాయి. షెల్టర్‌ను ఆనుకునే ఉన్న రూ.5 భోజన కౌంటర్లో చాలా మంది మధ్యాహ్నం భోజనాలు కానిచ్చేస్తారు. రాత్రికి ఎవరైతే షెల్టర్‌లో భోజనం చేయాలనుకుంటారో లిస్ట్ తయారుచేసి, వారికి రూ.20లకు భోజనం అందిస్తారు. నగరం వ్యాప్తంగా ఉన్న షెల్టర్లలోని వారంతా ప్రతి ఏటా అక్టోబర్ 2న కలుసుకుని పరస్పరం తమ అనుభవాలను పంచుకుంటున్నారు. -
ఇద్దరు అనాథ ఆడపిల్లలకు ఆదర్శ వివాహం
అమలాపురం టౌన్: అమలాపురం కామాక్షీ పీఠం పెరిగిన ఇద్దరు అనాథ యువతులను ఆదర్శ వివా హం చేసుకునేందుకు ఇద్దరు యువకులు ముందుకు వచ్చారు. ప్రేమ మందిరంలో ఆ అనాథ యువతుల నడత, నమ్రతలను చూసిన ఆ ఇద్దరు యువకులు తమ మనసులోని మాటను తొలుత తమ కుటుంబ పెద్దలకు చెప్పుకున్నారు. తర్వాత ఆ పెద్దలు తమ కొడుకుల నిర్ణయాన్ని సమర్ధిస్తూ పీఠానికి వచ్చి పీఠాధిపతి కామేశ మహర్షి అంగీకారం, ఆశీర్వాదం తీసుకున్నారు. నిశ్చితార్థాలు కూడా అయ్యాయి. ఆ ఇద్దరి అనాథ ఆడపిల్లలకు పీఠంలో ఆదివారం రాత్రి వివాహం చేసేందుకు పీఠాధిపతి ముహూర్తాలు నిర్ణయించారు. దీంతో పీఠం పెళ్లి సందడితో కళకళలాడు తోంది. పీఠంలోని ప్రేమమందిరంలో పెరుగుతున్న కామేశ్వరిని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామానికి చెందిన అర్చకుడు సాయి సత్యనారాయణ పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చారు. మరో యువతి వల్లిని రామచంద్రపురానికి చెందిన లారీ ట్రాన్స్‌పోర్టు ఆఫీసు నిర్వహిస్తున్న దైవ వరప్రసాద్ పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చారు. -
‘జబర్దస్త్’ షోపై మరో ఫిర్యాదు
సాక్షి, కామారెడ్డి: ఓ చానెల్లో ప్రసారమవుతున్న ‘ జబర్దస్త్’ కామెడీ షో చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. తాజాగా ప్రసారమైన ’జబర్దస్’ ఎపిసోడ్లో అనాథలను కించపరిచేలా హైపర్ ఆది డైలాగులు ఉన్నాయంటూ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు అనాథలు ‘జబర్దస్’కు, హైపర్ ఆదికి వ్యతిరేకంగా రాష్ట్ర మానవహక్కుల సంఘానికి (హెచ్చార్సీ), పోలీసులకు ఫిర్యాదుచేశారు. తాజాగా ‘జబర్దస్త్’ షోలో తమను అవమానించారంటూ కొందరు అనాథ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు వారు సోమవారం ఫిర్యాదు చేశారు. గత గురువారం టీవీలో ప్రసారమైన స్కిట్లో తమపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అనాథలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జబర్దస్త్ షోపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో అనాథ యువతులు ఫిర్యాదు చేశారు. జబర్దస్త్ కార్యక్రమంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని సినీ విమర్శకుడు కత్తి మహేష్ గతంలో ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. బాలల హక్కులు, మానవ హక్కులను నాశనం చేసేలా జబర్దస్త్ లో స్కిట్లు వేస్తుండటం పట్ల కేసు నమోదైందని, తన మద్దతు అనాథలకే అని తెలిపాడు. ‘అతిగా ఆవేశపడే ఆడదానికి .. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానంని ఆనాథలు అంటారు’ అనే హైపర్ ఆది చెప్పిన డైలాగ్.. అనాథల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఎలాంటి అండ లేని అభాగ్యులపై ఇంత నీచంగా డైలాగ్‌లు చెప్పడం ఏమిటని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. -
అభాగ్యుల తల్లి.. సింధుతాయి!
ముంబై: ఉత్తరప్రదేశ్‌లో ఓ సామాజిక కార్యకర్తను మదర్ ఆఫ్ ఆర్పన్స్‌గా సత్కరించారు. సింధుతాయి సఫ్కల్ అనే సామాజిక కార్యకర్త చూపిన అసమాన మానవత్వానికి... రచయిత, మానవతావాది, జర్నలిస్టు అయినటువంటి డాక్టర్ రామ్మనోహర్ త్రిపాఠీ గౌరవార్థం ఇచ్చే డాక్టర్ రామ్మనోహర్ త్రిపాఠీ లోక్‌సేవ సమ్మాన్‌తో సత్కరించారు. 70 ఏళ్ల సింధుతాయ్‌కు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. పూనేకు చెందిన సామాజిక కార్యకర్త సింధుతాయ్. తన జీవితం మొత్తం వెనుకబడిన వర్గాల వారి కోసం ఎంతో సేవ చేశారు. తన సేవలో భాగంగా 1000మందికి పైగా పిల్లలను దత్తత తీసుకున్నారు. అవార్డు తీసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుసంపన్నమైన మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ అవసరమున్న ప్రతివ్యక్తికి సాయపడుతూ తమ దేశ భక్తిని చాటాలని పిలుపునిచ్చారు. నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నారు. సింధు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అహల్యాబాయి హల్కర్ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. -
అనాథలతో దీపావళి జరుపుకున్న సీఎం
సాక్షి, ఆర్ఎస్ పుర (కశ్మీర్) : జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గురువారం అనాథ పిల్లలతో కలిసి కశ్మీర్లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇండో-పాకిస్తాన్ సరిహద్దులోని ఆర్ఎస్ పురా సెక్టార్లో ఉన్న ఆనాథాశ్రయంలోని పిల్లలతో మెహబూబా ముప్తీ పండగ పూట సరదాగా గడిపారు. చిన్నారుకు మిఠాయి పంచడమేకాక వారికి తానే స్వయంగా తినిపించారు. చిన్నారుల భజన పాటలకు సీఎం పరవశించిపోయారు. గత ఏడాది కూడా సీఎం మెహబూబా ముఫ్తి అనాథ చిన్నారులతోనే దీపావళి వేడుకులను జరుపుకోవడం గమనార్హం. -
అనాథలుగా అనంతలోకాలకు..
వేర్వేరు చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు మృతి కర్నూలు: కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు వెనుక రామయ్య ఐఐటీ కాలేజీ సమీపంలో సుమారు 35 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. సుమారు 5.5 అడుగుల ఎత్తు, నలుపు రంగు ఉంటాడు. బ్లాక్ ప్యాంటు ధరించాడు. ఆర్టీసీ బస్టాండ్ ఔట్వే దగ్గర వ్యాపార దుకాణం ముందు సుమారు 55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతిచెందాడు. నలుపు, బ్లూ రంగులు గల షర్టు, బ్లూ డ్రాయర్ ధరించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నాల్గవ పట్టణ పోలీసులు ఆయా ప్రాంతాలకు వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో వడదెబ్బతో మృతిచెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిసినవారు 94406 27736, 08518–259462కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ నాగరాజరావు కోరారు. -
విద్యార్థులతో థౌజండ్‌వాలా సినిమా చూసిన జేసీ
సిరిసిల్ల : 105 సంవత్సరాల చరిత్ర గల భారత సినిమా సింహసనం పై తెలుగు సినిమా బాహుబలి-2 చరిత్ర సృష్టించింది. విడుదలైనా పది రోజులోనే ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ బద్దలుకొట్టింది. సింహానసం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రసేనుడిది.. రికార్డులు సృష్టించేది ఇక్కడ ఈ బాహుబలిది అన్నటుగా ఉంది సినిమా. ఈ థౌజండ్‌వాలా సినిమాను ఓ జాయింట్ కల్లెక్టర్ అనాధ విద్యార్థులకు చూపించాలనుకున్నారు. రాజన్న సిరిసిల్లా జ్లిలా జాయింట్ కల్లెక్టర్ యాస్మీన్ బాషా అనాథ పిల్లల పట్ల తన ప్రేమను ప్రదర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను మంత్రముగ్థల్ని చేస్తున బాహుబలి-2 ను రంగినేని ట్రస్టులో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులనున ఆమె సినమాకు తీసుకెళ్లారు. సోమవారం ఆమె సిరిసిల్ల నటరాజ్ థియేటర్లో బాహుబలి-2 సినిమాను చూశారు. జేసీ మాట్లాడుతూ తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానంలో నిలిపిన బాహుబలి-2. ఇటువంటి అద్బుత సినిమాపై పిల్లల్లో నెలకొన్న ఉత్సాహంతోనే వారికి సినిమా చూపించాలన్నుకున్నట్లు జేసీ చెప్పారు. అనాథ పిల్లల మనసులో కుటుంబ సభ్యులతో సినిమా చూసే అదృష్టం, అవకాశం లేదనే నిరాశను వారిలోంచి తొలగించి ఆనందం నింపినట్లయ్యిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగినేని ట్రస్టు వ్యవస్థాపకుపడు మోహన్‌రావు, థియేటర్ మేనేజర్ వెంగయ్య, అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేను సైతం...
-
సప్కాల్... అనాథల తల్లి
ఎవరూ లేని స్థాయి నుంచి తనకంటూ ఒక పెద్ద కుటుంబాన్ని సృష్టించుకున్న వైనమే ఈ కథనం.. ఈ ఫొటోలోని 68 ఏళ్ల మహిళ పేరు సింధుతై సప్కాల్. సప్కాల్ ఒక పేద కుటుంబంలో జన్మించింది. 9 ఏళ్ల వయసులో చదువును మధ్యలోనే ఆపేసింది. పదేళ్ల వయసులో 20 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పదేళ్ల తర్వాత సప్కాల్ గర్భం దాల్చింది. ఆ సమయంలో అండగా ఉండాల్సిన భర్త ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. నా అనుకున్న వాళ్లు కూడా ఎవరూ చేరదీయలేదు. పశువుల పాకలో ఒక పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. తనకు, తన కుమార్తె కోసం భిక్షాటన చేసింది. ఆ సమయంలోనే తనలాగా కష్టాలు పడుతున్న యువతను చేరదీసి వారికి తన ఆహారాన్ని పంచేది. అలా అలా ఆమెను ఆశ్రయించిన వారు నేటికి 1400 మంది అయ్యారు. ప్రస్తుతం సప్కాల్‌ను అందరూ అనాథల తల్లి అని ముద్దుగా పిలుచుకుంటారు. అనాథలకు కావాల్సిన ఆహారం, నివాసం ఇవ్వడంతోపాటు వారికి కావాల్సిన∙ప్రేమను పంచేది. సప్కాల్ చేస్తున్న విశేష కృషికి ఇప్పటివరకు 750 అవార్డులు నడుచుకుంటూ వచ్చి ఆమె పాదక్రాంతం అయ్యాయి. పుణేలో సప్కాల్ నాలుగు అనాథశ్రమాలను నడుపుతోంది. అందులో రెండు అబ్చాయిలకు, రెండు అమ్మాయిలకు. తనను ఆశ్రయించిన అనాథలలో చాలా మంది లాయర్లుగా, డాక్టర్లుగా, ప్రొఫెసర్లుగా జీవితాల్లో స్థిరపడ్డారు. చాలా మందికి దగ్గరుండి వివాహాలు కూడా జరిపించింది. అలా అలా ఎవరూ లేని స్థాయి నుంచి ఒక పెద్ద కుటుంబానికి తల్లిలా మారింది. -
అనాథలకు అండగా నిలవడం అభినందనీయం
– విజ్ఞాన పీఠానికి సోలార్, ఆర్ఓ వాటర్ ప్లాంట్, కూలింగ్ వాటర్ ఫ్రిజ్ వితరణ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): అనాథలకు అండగా నిలవడం అభినందనీయమని కర్నూలు ఎంపీ బుట్టారేణుక కితాబిచ్చారు. శనివారం విజ్ఞాన పీఠంలోని అరక్షిత శిశుమందిర్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలోని శ్రీసాయి ఆదరణ సేవా సమితి ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ను సమకూర్చింది. అలాగే నందిరెడ్డి వినీల్‌రెడ్డి మిత్ర బృందం ఆరు పలకల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్, దొనపాటి యల్లారెడ్డి అనే యువకుడు..వాటర్ ఫ్రిజ్‌ను తమ సొంత ఖర్చులతో సమకూర్చారు. శనివారం ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వాటిని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. విజ్ఞాన పీఠంలోని బాలబాలికల కోసం ఎంపీ నిధుల నుంచి మరుగుదొడ్లను నిర్మించాలని వీహెచ్‌పీ దక్షణాది రాష్ట్రాల అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి కోరగా అందుకు ఎంపీ సానుకూలంగా స్పందించారు. పాఠశాలకు ప్రహరీ నిర్మానానికి నిధులు మంజూరు చేయిస్తానని ఆమె హామీ ఇచ్చింది. అనంతరం విజ్ఞాన సేవా సమితి, రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంపీ బుట్టారేణుక, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిలను సన్మానించి మెమొంటోలను అందజేశారు. విజ్ఞాన పీఠానికి దాతలు చేసే సాయానికి ఆదాయపు పన్ను మినాయింపును ఇస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ విషయాన్ని కర్నూలు జిల్లా ప్రజలు గుర్తుంచి అనాథల సేవకు ముందుకు రావాలని కోరారు. అంతకముందు విజ్ఞాన పీఠానికి రామకృష్ణ అనే వ్యక్తి రూ.50 వేలు, తిరుపాల్, అతని మిత్ర బృందం రూ.లక్షను ఎంపీ బుట్టా రేణుక చేతుల మీదుగా పాఠశాల కరస్పాండెంట్ గురుమూర్తికి అందజేశారు. విజ్ఞాన పీఠంలోని అనాథలకు అన్నదానం కోసం ఎంపీ తమ బుట్టా ఫౌండేషన్ నుంచి రూ.25 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు బసవన్నగౌడ్, నగర అధ్యక్షుడు లక్కీరెడ్డి అమరసింహరెడ్డి, పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ సుబ్బారెడ్డి, డాక్టర్ శంకర్‌శర్మ, శ్రీధర్, ఏకాంబరరెడ్డి, బీసీ నాయకుడు నాగరాజుయాదవ్, వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శౌరీ విజయకుమారి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అందరికి ఆదర్శం ఈ సేవ...
ఆలేరు: రోడ్డుపై అనాథగా పడి ఉన్న వారికి కనీస సాయం అందించే ఆశయం ఎంతో ఉన్నతమైనది. సమాజానికి కొంతైనా సేవా చేయాలన్న సంకల్పం కొందరిలోనే ఉంటుంది. అలాంటి కోవలోకే వస్తారు ఆలేరుకు చెందిన జెల్ల శంకర్, దివ్య దంపతులు. వీరి అనాథలను ఆదుకునేందుకు 2016 జూన్ 19న అమ్మఒడి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. శంకర్ చిన్నపాటి వ్యాపారం చేస్తుంటాడు. ఇతడి భార్య ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వీరికి వచ్చే ఆదాయం కొద్ది మాత్రమే అయినా ఎంతో ఉన్నత ఆశయంతో అమ్మ ఒడి అనాథాశ్రమాన్ని నెలకొల్పి ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు. మతిస్థిమితం లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని, అన్నీ కోల్పోయిన అభాగ్యులను అక్కున చేర్చుకొని వారికి అన్నీ తామై సేవలందిస్తున్నారు. ఇక్కడ ఆశ్రయం పొందిన ఎనిమిది మందిని బాగు చేయించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో 10 మంది ఉన్నారు. తమకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే అభాగ్యులకు సేవ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. దాతలు చేయూతనందించాలి - జెల్ల శంకర్, ఆశ్రమ నిర్వాహకుడు అనాథలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు సొంత డబ్బుతోనే నిర్వహణను చూసుకున్నాం. అనాథలకు సేవ చేసి వారిని బాగు చేయించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించడం సంతృప్తిని ఇస్తుంది. ఇప్పటి వరకు కరీంనగర్, బాలనగర్, జనగామ, పిడుగురాళ్ల, విజయనగరం, జమ్మికుంట, ఏలూరు చెందిన అనాథలను బాగు చేయించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించాం. ఎవరైనా దాతలు సహకరిస్తే మరింత మందికి సేవ చేస్తాం. ఆర్థికసాయం అందించే దాతలు 90525 63756 నంబర్‌ను సంప్రదించవచ్చు. -
తండ్రి పరలోకంలో.. తల్లి పరాయి దేశంలో..
► అనారోగ్యంతో మృతి చెందిన తండ్రి ► సౌదీకి వెళ్లి జాడలేని తల్లి ► అనాథలైన నలుగురు పిల్లలు గాలివీడు: గాలివీడు మండల పరిధిలోని గొట్టివీడు పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన పరికిజోన నాగేంద్రనాయుడు (35) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇతనికి భార్య పార్వతి, నలుగురు సంతానం ఉన్నారు. అయితే భార్య పార్వతి జీవనోపాధి కోసం సౌదీకి వెళ్లడంతో వారి పిల్ల లు అనాథలు గా మిగిలారు. వివరాలిలా ఉన్నాయి. నాగేంద్రనాయుడు భార్య పార్వతి ఏడాది క్రితం కుటుంబ పోషణ కోసం సౌదీకి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత మొ దట్లో రెండు నెలలు తాను సంపాదించిన సొమ్మును కుటుంబ సభ్యులకు పంపింది. ఆ తర్వాత ఆమెకు సం బంధించిన ఎలాంటి సమాచారం వీరికి అందలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ తెలుసుకోండంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తల్లి ఆచూకీ తెలియక దిగులు చెందిన తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. అమ్మా.. నాన్నలు దూరం కావడంతో దిక్కు తోచని స్థితిలో ఆ బిడ్డలు విలపిస్తున్న తీరు చూసి ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. సౌదీలో ఏమైందో కూడా తెలియని ఆ తల్లి ఆచూకీ తెలుసుకుని ఆమెను స్వదేశానికి రప్పించేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీ చొరవ చూపాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మిదేవమ్మ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీ అబ్దుల్‌రహీం, మాజీ సర్పంచ్ మల్లికార్జున నాయుడు, మాజీ ఎంపీటీసీ చిన్నరెడ్డిలు మృతుని కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. సౌదిలో ఉన్న తల్లిని ఇండియాకు రప్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరతామన్నారు. -
పసిమొగ్గల హృదయ విలాపం
►కన్నబిడ్డను వదిలి వెళ్లిపోయిన మరో తల్లి ►గత కొద్దిరోజుల్లో మూడో ఘటన ►పురిట్లోనే అనాథలుగా శిశువులు పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం) : కొన్ని రోజుల క్రితం అర్ధరాత్రి వేళ తగరపువలస హైవే పక్కన ఓ బిడ్డను వదిలిపెట్టారు.. మొన్నేమో.. అవయవాలు వృద్ధి చెందకుండా పుట్టిందన్న ఉక్రోషంతో కన్నపేగునే సజీవ సమాధి చేయడానికి ప్రయత్నించాడో కసాయి తండ్రి.. ఇప్పుడేమో.. ఈ లోకంలోకి వచ్చిన రెండో రోజే నన్ను దిక్కులేని దాన్ని చేశావా అమ్మా.. అని ఘోషిస్తోంది ఓ ఆడ శిశువు హృదయం.. మాటల్లో చెప్పలేని ముక్కుపచ్చలారని ఆ పురిటిగుడ్డుకే మాటలొస్తే.. ఆ హృదయ ఘోష ఎలా ఉంటుందంటే.. అమ్మా.. ఎంత పని చేశావు.. నువ్వు మోసపోయిందే కాకుండా.. నన్నూ మోసం చేశావా! మోసపోయేవారి బాధ ఎలా ఉంటుందో తెలిసి కూడా.. ఇంకా ఈ లోకాన్ని పూర్తిగా చూడకుండానే నన్ను అనాథను చేసి పోవడానికి నీ మనసు ఎలా అంగీకరించిందమ్మా.. అసలు నేను చేసిన నీకు పుట్టడమా లేక ఆడపిల్లగా పుట్టడమా.. నన్ను భరించలేనప్పుడు.. నవమాసాలు మోసి ఎందుకు కన్నావమ్మా.. నాలో ఏ లోపం చూశావమ్మా.. అందంగా ఉన్నానని ఆస్పత్రిలో నర్సులు, డాక్టరమ్మలూ.. అందరూ నన్ను ముద్దు చేస్తున్నారే.. మరి నీకు మాత్రం ముద్దుగా కనిపించలేదా.. ముద్దుమురిపాలు పంచాలనిపించలేదా.. నీ పొత్తిళ్లలో దొరికినంత హాయి.. నాకు ఇంకెక్క లభిస్తుందమ్మా.. నీవు లేని ఈ లోకంలో ఒంటరిగా ఎలా ఉండగలను.. ఎంతమంది అండ లభించినా.. అమ్మ ఇచ్చేంత అండ ఎవరివ్వగలరు.. రేపు ఈ సమాజం నీ తల్లి ఎవరంటే.. ఏం సమాధానం చెప్పాలి.. అందుకే నువ్వెక్కడున్నా.. వెంటనే తిరిగి రా అమ్మా.. నీ వెచ్చని ఒడిలో నన్ను హాయిగా సేదతీరనివ్వమ్మా.. ఆదుకున్న వారినే ఏమార్చి.. పొదివి పట్టుకొని కాపాడుకోవాల్సిన ఈ బిడ్డను పక్కవారికి అప్పగించి పారిపోయిన ఆ కన్నతల్లి కూడా ఏ దిక్కూలేక ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఐదురోజుల క్రితం ఓ నిండు గర్భిణి(30) మల్కాపురంలోని నగరాల వీధికి చెందిన లక్ష్మి అనే మహిళను కలుసుకుంది. తన పేరు జోగాదేవి అని పరిచయం చేసుకుంది. నగరంలోని ఓ హోటల్లో పని చేస్తున్న ఓ యువకుడిని ప్రేమించానని.. కన్నవారింటి నుంచి అతనితో వచ్చేసి వివాహం చేసుకున్నానని చెప్పింది. అయితే తన భర్త తమ ఇంటి పక్కనే ఉన్న మరో యువతిని తీసుకొని ఎటో వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. నెలలు నిండిన సమయంలో ఎక్కడికి వెళ్లాలో.. ఏం చేయాలో తెలియక ఇలా వచ్చానని తన కష్టం చెప్పుకోవడంతో లక్ష్మి కరిగిపోయింది. తన వివరాలు పూర్తిగా చెప్పకపోయినా సాటి ఆడదానిగా దేవిని అక్కున చేర్చుకుంది. తన కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ఇంట్లో ఆశ్రయమిచ్చింది. అలా ఆ ఇంట్లో చేరిన దేవికి ఈ నెల 18(శనివారం) ఉదయం నొప్పులు మొదలయ్యాయి. దాంతో తన సోదరుడు, మరదలి సాయంతో దేవిని ఆటోలో తీసుకొచ్చి ఘోషా ఆస్పత్రిలో చేర్పించడమే కాకుండా అక్కడే ఉండి సపర్యలు చేశారు. అదే రోజు మధ్యాహ్నం జోగాదేవి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సాధారణ డెలివరీ కావడంతో రెండుమూడు రోజుల్లోనే డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు చెప్పారు. కాగా ఈ నెల 19(ఆదివారం) సాయంత్రం ఏడు గంటల సమయంలో బాత్రూముకు వెళతానని చెప్పి బిడ్డను లక్ష్మికి అప్పగించి వెళ్లింది. అయితే ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడంతో బిత్తరపోయిన లక్ష్మి ఆస్పత్రివర్గాలకు సమాచారమిచ్చింది. అంతా కలిసి వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
విధి వంచితులు
► ఆరు నెలల క్రితం తండ్రి మృత్యువాత ► కిడ్నీ సంబంధ వ్యాధితో మృత్యుఒడికి చేరిన తల్లి ► అనాథలైన ముగ్గురు పిల్లలు బొమ్మలరామారం (ఆలేరు) : పేద కుటుంబంపై విధి మరోమారు కన్నెర్రజేసింది. ఆరు నెలల క్రితమే తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. నాటి నుంచి కూలినాలి చేసి తన పిల్లలను కాపాడుకుంటున్న తల్లి కిడ్నీ సమస్యతో మంగళవారం మృతి చెందింది. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. హృదయ విధారకమైన ఈ సంఘటన మండలంలోని సోలిపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంధాల నాగమల్లయ్య, పోషమ్మ దంపతులది రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం. ఇద్దరు ఆడ పిల్లలు ప్రభావతి మమత, కొడుకు వెంకటేష్‌తో కలిపి ఐదుగురు సభ్యుల కుటుంబం. కూలి పని లభించిన రోజు కడుపునిండా భోజనం చేస్తూ.. పని దొరకని రోజు పస్తులున్నా.. బయటకు పడని నైజం వారిది. పోషమ్మ, నాగమల్లయ్య దంపతులు తమ పిల్లలకు ఇలాంటి పరిస్థితి రావొద్దని తపన పడేవారు. వారు పస్తులండి మరీ పిల్లలకు ఓ ముద్ద పెట్టి పాఠశాలకు పంపేవారు. కొడుకును పదో తరగతి వరకు చదివించి కూతుళ్లను మధ్యలో బడి మాన్పించారు. నాగమల్లయ్య ఆర్నెల్ల క్రితం గుండెపొటుతో మృతి చెందాడు. నాటి నుంచి పోషమ్మ కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించింది. మూడు నెలల నుంచి కిడ్నీ సమస్యతో పోషమ్మ సైతం అనారోగ్యంతో మంచాన పడింది. చేతిలో చిల్లి గవ్వలేని పిల్లలు తల్లిని ఎలాగైనా కాపాడుకోవాలనే తపనతో ఇరుగుపొరుగు వారి నుంచి రూ.రెండు లక్షల వరకు అప్పు చేసి ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. కానీ విధి వారిని వెక్కిరించింది. కిడ్నీ వ్యాధితో మంగళవారం పోషమ్మ మృతి చెందింది. కన్న వారిని పోగొట్టుకున్న ఆ పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు అమ్మాయిలు, కుమారుడు అనాథలుగా మారారు. పోషమ్మ అంత్యక్రియలకు సైతం డబ్బు లేకపోవడంతో వారి రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోషమ్మ అంత్యక్రియల ఖర్చులకు రూ.ఐదువేలను చీకటిమామిడి ఎంపీటీసీ మచ్చ శ్రీనివాస్ ద్వారా అందజేశారు. పిల్లలను కలసి వారికి అన్ని రకాలు సహయ సహకారాలు అందిస్తానని తెలిపాడు. -
అందరూ ఉన్నా అనాథలా మారిన మాతృమూర్తి
-
తిట్టిన వారికీ దీవెనలే!
వలస వచ్చిన విశ్వాసుల్లో అబూ తాలిబ్ తనయుడు హజ్రత్ జాఫర్ రజీ, చక్రవర్తి ప్రశ్నలకు సమాధానాలిస్తూ, ‘మహారాజా! మేము పూర్వం చాలా అజ్ఞానంగా ఉండేవాళ్ళం. విగ్రహారాధన చేసేవాళ్ళం. సారాయి, జూదం, అశ్లీలతల రొచ్చులో కూరుకు పోయి ఉండేవాళ్ళం. చచ్చిన జంతువులను తినేవాళ్ళం. పగలు, ప్రతీకారాలతో రగిలిపోతూ ఒకళ్ళనొకరు చంపుకునేవాళ్ళం. కక్షలు, కార్పణ్యాల పరంపర తరతరాలుగా కొనసాగేది. ఇలాంటి పరిస్థితిలో దేవుడు మాపై దయ దలిచాడు. మాలోనే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. ఆయనది ఎంతో గౌరవప్రదమైన వంశం. ఆయనగారి నీతి నిజాయితీ, సత్యసంధత మాకు మొదటి నుండీ తెలుసు. ఆయన మమ్మల్ని సత్యం వైపు, ధర్మం వైపు పిలిచాడు. దేవుని సందేశం మాకు బోధించాడు. సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యమే పలకాలనీ, జాలి, దయ, పరోపకారం లాంటి సుగుణాలు కలిగి ఉండాలనీ, సాటి మానవుల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలనీ, బంధువుల హక్కులు నెరవేర్చాలనీ, అనాధలను ఆదరించాలనీ, వారిసొమ్ము కబళించకూడదనీ, శీలవతులపై అపనిందలు మోపకూడదనీ, దానధర్మాలు చేస్తూ ఉండాలనీ ఆయన మాకు బోధించాడు. మేమాయన మాటలు విని, ఆయనను అనుసరిస్తున్న కారణంగా మా వాళ్ళు మమ్మల్ని హింసించడం ప్రారంభించారు. వారి దౌర్జన్యాలు భరించలేక, ఇక్కడైనా కాస్త ప్రశాంతంగా బ్రతకవచ్చని మీ దేశంలో తలదాచుకున్నాం. ఇదే మేము చేసిన నేరం’ అన్నారు. తరువాత జాఫర్ ద్వారా కొన్ని ఖురాన్ వాక్యాలు కూడా చదివించుకొని విన్నాడు – నీగస్ చక్రవర్తి. ఈసా ప్రవక్తకు సంబంధించి ఖురాన్ చెప్పిన విషయాలను ధ్రువీకరించాడు. అంటే, ముహమ్మద్ ప్రవక్త(స) వారి సందేశం మహోన్నతమైన నైతిక, మానవీయ ప్రమాణాలతో నిండి ఉందని మనకు అర్థమవుతోంది. జీవితంలోని ప్రతి రంగంలో నీతిని పాటించాలనీ, ఇంట్లోనైనా, వీధిలోనైనా, కార్యాలయాల్లోనైనా, న్యాయస్థానాల్లోనైనా, అధికార పీఠంపైనా ప్రతిచోటా నిజాయితీ, సౌశీల్యం తొణికిసలాడాలనీ, జీవితంలోని ఏ రంగమూ నీతి రహితంగా ఉండకూడదనీ ప్రవక్త అభిలషించారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకూ, మానవీయ సంబంధాల పెంపుదలకూ ఎంతటి ప్రాముఖ్యమిచ్చారో ప్రవక్త జీవితం ద్వారా మనకు తెలుస్తోంది. ప్రవక్త(స) తన సందేశ కార్యక్రమంలో భాగంగా ‘తాఝెఫ్’ అనే ఊరికి వెళ్ళారు. గ్రామ పెద్దలను కలుసుకొని తన సందేశం వినిపించారు. కానీ వారు చాలా అమర్యాదగా, అమానవీయంగా ప్రవర్తించారు. మంచిని బోధించినందుకు నానా మాటలన్నారు. రౌడీ మూకను ఆయనపైకి ఉసిగొలిపి రక్తసిక్తమయ్యేలా కొట్టించారు. అయినా ప్రవక్త పల్లెత్తుమాట అనలేదు. పర్వతాలపై అదుపు కలిగిన దైవదూతలు ప్రత్యక్షమై, తమరు అనుమతిస్తే రెండు కొండల మధ్య ఉన్న ఈ ఊరిని విసుర్రాయిలో పప్పులు నలిపినట్లు నలిపి పిండి చేస్తామన్నా, ఆ మానవతామూర్తి ససేమిరా ఒప్పుకోలేదు. చెడుకు చెడు సమాధానం కాదని ఉపదేశించారు. తనను హింసించిన వారిని దీవించి, వారికి సద్బుద్ధిని ప్రసాదించమని దైవాన్ని ప్రార్థించారు. (మిగతాది వచ్చేవారం) -
బలహీనుల ఆశాజ్యోతి
సమస్త సృష్టికీ కర్త అయిన ఏకైక దైవాన్నే ఆరాధించమని ప్రజలకు పిలుపునిచ్చిన మహనీయుడు ముహమ్మద్ ప్రవక్త. తల్లితండ్రులను గౌరవించాలనీ, వారిపట్ల విధేయతా భావం కలిగి ఉండాలనీ, వారి సేవ చేయని వారు నరకానికి పోతారనీ హెచ్చరించారాయన. బంధువులు, బాటసారులు, అనాథలు, వితంతువులు, నిస్సహాయుల పట్ల దయగా ఉండాలని బోధించారు. మానవ మహోపకారి ముహమ్మద్ (స) ఒక్క ముస్లిమ్ సముదాయానికే కాక సమస్త మానవ జాతికీ సంపూర్ణ మార్గదర్శకులు. ఆయన జన్మదినమైన ‘మిలాద్ –ఉన్–నబీ’ వేళ ఆయన బోధనలపై దృష్టి సారించాలి. సత్యమే పలకాలి. చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి. పలికే ప్రతిమాటకు, చేసే ప్రతి పనికీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని బాధ్యతా భావాన్ని ప్రవక్త నూరిపోశారు. అన్యాయానికీ, అధర్మ సంపాదనకు ఒడిగట్టవద్దన్నది ఆయన బోధ. అలాగే ధనాన్ని దుర్వినియోగం, దుబారా చేయవద్దని కూడా ఆయన హెచ్చరించారు. వ్యభిచారం దరిదాపులకు కూడా పోవద్దని, ఈ పాపానికి దూరంగా ఉండటమే కాకుండా, దానికై పురిగొలిపే ప్రసారసాధనాల్ని కూడా రూపుమాపాలని పిలుపునిచ్చారు. నిష్కారణంగా ఏ ప్రాణినీ చంపకూడదనీ, ప్రజల ధన, మాన ప్రాణాలు సురక్షితంగా లేని సమాజం ప్రగతిపథంలో పయనించజాలదనీ ఉపదేశించారు. వ్యాపార లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, లెక్కపత్రాలు, కొలతలు, తూనికలు చాలా ఖచ్చితంగా, నికార్సుగా ఉండాలని ముహమ్మద్ ప్రవక్త (స) బోధించారు. స్వార్థాన్ని, అహాన్ని త్యజించాలని, తోటి మానవ సోదరుల్ని తమకన్నా తక్కువగా చూడకూడదని ఆయన ఉపదేశించారు. స్త్రీ జాతిని గౌరవించాలనీ, అనాథలను ఆదరించని వారు మహాపాపాత్ములనీ, వారిని ఆదరించి, సంరక్షిస్తే స్వర్గార్హత సాధించవచ్చని ఆయన చెప్పారు. అదేవిధంగా ఖైదీల పట్ల కరుణతో వ్యవహరించాలని, వారిని హింసించకూడదని, అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న అమాయకుల విడుదలకు కృషి చేయాలని ఉపదేశించారు. వితంతువులను చిన్నచూపు చూడకూడదని, సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం దక్కాలని, శుభకార్యాల్లో వారిని ఆహ్వానించకపోవడం అన్యాయమని, ఈ దురాచారాన్ని మానుకోవాలని హెచ్చరించారు. అవసరం, అవకాశం ఉన్నవారి పునర్వివాహానికి ప్రయత్నించాలని, వారిని నిర్లక్ష్యం చేసిన సమాజం అథోగతి పాలవుతుందని కూడా ఆయన హెచ్చరించారు. వృద్ధులను ఆదరించాలని హితవు పలికారు. ఒక మార్గదర్శిగా ప్రవక్త (స) బోధించే ప్రతి విషయాన్ని స్వయంగా ఆచరించి చూపేవారు. ఆచరణ లేని హితబోధ జీవం లేని కళేబరం వంటిదని ఆయన చెప్పేవారు. ఆ మహనీయుని మంచితనానికీ, మానవీయ సుగుణానికీ అద్దం పట్టే ఓ సంఘటన... ఇది ముహమ్మద్ ప్రవక్త ధర్మప్రచారం చేస్తున్న తొలినాళ్ళ మాట. ఒకసారి ఆయన మక్కా వీధిలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఒక చౌరస్తాలో ఓ వృద్ధురాలు తన మూటాముల్లెతో సహా నిలబడి ఉంది. వృద్ధురాలు కావడంతో మూటల బరువు మోయలేక పరుల సహాయం కోసం అర్థిస్తోంది. దారిన వెళ్ళేవాళ్ళను బతిమాలుతోంది కాస్తంత సాయం చేయమని! చాలామంది ఆ దారిన వెళుతున్నారు కానీ, వృద్ధు్ధరాలిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతలో ముహమ్మద్ ప్రవక్త అటుగా వెళుతూ, వృద్ధు్ధరాలిని ఎవరూ పట్టించుకోకపోవడం చూసి, ఆమెను సమీపించారు. ‘అమ్మా! నేను మీకు సహాయం చేస్తాను’ అన్నారు. ‘బాబ్బాబూ! నీకు పుణ్యం ఉంటుంది. ఈ మూట చాలా బరువుగా ఉంది. మోయలేకపోతున్నాను. కాస్త అందాకా సాయం చేస్తే, నేను వెళ్ళిపోతాను’ అన్నదా వృద్ధురాలు. ‘అయ్యో! దీనికేం భాగ్యం’ అంటూ మూట భుజానికెత్తుకొని, ఆమె కోరిన చోటుకు చేర్చారు ప్రవక్త. ‘బాబూ! దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఏ తల్లి కన్నబిడ్డవో గాని ముక్కూమొహం తెలియని నా లాంటి ముసలిదానికి ఇంత సాయం చేశావు. బాబూ! ఒక్కమాట వింటావా! ఎవరో ముహమ్మద్ అట, ఏదో కొత్త మతాన్ని ప్రచారం చేస్తున్నాడట. అతని మాటల్లో ఏముందో గాని చాలామంది అతని ప్రభావంలో పడిపోతున్నారు. జాగ్రత్త నాయనా! అతని మాటల్లో పడకు. నేను కూడా అందుకే ఊరే విడిచి వెళ్ళిపోతున్నాను’ అని హితవు పలికింది. ‘సరేనమ్మా’ అంటూ ఆమె చెప్పినదంతా విని, వినయపూర్వకంగా అవ్వకు అభివాదం చేసి సెలవు తీసుకున్నారు ప్రవక్త. ఆ మహనీయుని మంచితనానికీ, వినయపూర్వకమైన ఆ వీడ్కోలుకూ ఆనందభరితురాలైన వృద్ధురాలు ఒక్కసారిగా భావోద్రేకానికి లోనై, ‘బాబూ!’ అని పిలిచింది ఆప్యాయంగా. ‘అమ్మా!’ అంటూ దగ్గరికి వచ్చిన ప్రవక్త తలపై చేయి వేసి నుదుటిని ముద్దాడుతూ, ‘బాబూ! నీ పేరేమిటి నాయనా!’ అని ప్రశ్నించింది ప్రేమగా. కాని ప్రవక్త మాట్లాడకుండా, మౌనం వహించారు. ‘బాబూ! పేరైనా చెప్పునాయనా! కలకాలం గుర్తుంచుకుంటాను’ అంటూ అభ్యర్థించింది. అప్పుడు ప్రవక్త మహనీయులు, ‘అమ్మా! నా పేరు ఏమని చెప్పను ? ఏ ముహమ్మద్‌కు భయపడి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావో ఆ అభాగ్యుణ్ణి నేనేనమ్మా!’ అన్నారు ప్రవక్త మహనీయులు. దీంతో ఒక్కసారిగా ఆ వృద్ధురాలు అవాక్కయిపోయింది. కాసేపటి వరకు ఆమెకేమీ అర్థం కాలేదు. ఏమిటీ.. నేను వింటున్నది ముహమ్మద్ మాటలనా..! నేను చూస్తున్నది స్వయంగా ముహమ్మద్నేనా..? నా కళ్ళు, చెవులు నన్ను మోసం చేయడం లేదు కదా..! ఇలా ఆమె మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఎవరి మాటలు వినకూడదనీ, ఎవరి ముఖం కూడా చూడకూడదనీ పుట్టిపెరిగిన ఊరినే వదిలేసిందో, అతనే తనకు సహాయం చేశాడు. ఎవరూ పట్టించుకోని నిస్సహాయ స్థితిలో ఆప్యాయత కురిపించాడు. సహాయం కంటే ఎక్కువగా ఆయన మాట, మంచితనం, వినమ్రత, మానవీయ సుగుణం ఆమెను మంత్రముగ్దురాలిని చేశాయి. కళ్ళ నుండి ఆనందబాష్పాలు రాలుతుండగా, ‘బాబూ ముహమ్మద్ ! నువ్వు నిజంగా ముహమ్మద్వే అయితే, నీ నుండి పారిపోవాలనుకోవడం నా దురదృష్టం. ఇక నేను ఎక్కడికీ వెళ్ళను. నీ కారుణ్య ఛాయలోనే సేద దీరుతాను’ అంటూ అదే క్షణాన ప్రవక్త వారి ప్రియ శిష్యురాలిగా మారిపోయింది. ఇదీ ప్రవక్త మహనీయుని ఆచరణవిధానం. ప్రజల పట్ల, ముఖ్యంగా నిస్సహాయులు, బడుగు, బలహీనులు, పీడిత తాడిత శ్రామిక వర్గాల పట్ల ఆ మహనీయుడు అవలంబించిన ఆచరణ శైలి. ఇందులో ఎంతో కొంతైనా మనం ఆచరించడానికి ప్రయత్నిస్తే నేటి మన సమాజం ఎలా ఉంటుందో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి. ఇలా మానవ మహోపకారి ముహమ్మద్ (స) ఊహ తెలిసినప్పటి నుండి అంతిమ శ్వాస వరకు సమాజ సంక్షేమం కోసం, సంస్కరణ కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. మానవాళికి సత్యధర్మాన్ని పరిచయం చేస్తూ, వారి ఇహ పర సాఫల్యాల కోసం అహర్నిశలు శ్రమించారు. ఆ మహనీయుని జీవన విధానం మానవాళికి అంతటికీ ఆదర్శం కావాలి. ప్రజలతో ఆయన ఏవిధంగా ప్రేమానురాగాలతో,స్నేహ సౌహార్దాలతో, సానుభూతితో వ్యవహరించేవారో, అవసరార్థులకు, ఆపదలో ఉన్నవారికి, ఏ విధంగా ఆపన్నహస్తం అందించేవారో, అలాంటి వ్యవహారశైలి నేడు మనలోనూ తొణికిసలాడాలి. ప్రవక్త తన చివరి హజ్‌యాత్ర సందర్భంగా ఇలా అన్నారు... ‘‘ప్రజలారా! ఒక మనిషికి మరో మనిషిపై ఎలాంటి ఆధిక్యతా లేదు. మీరు తినేదే మీ సేవకులకు పెట్టండి. కూలివాని చెమట బిందువులు ఆరక ముందే అతని వేతనం చెల్లించండి. మహిళల గురించి దైవానికి భయపడండి. మీకు వారిపై ఎలాంటి హక్కులున్నాయో, ధర్మం ప్రకారం వారికీ మీపై అలాంటి హక్కులే ఉన్నాయి. వడ్డీ తినకండి, దాన్ని త్యజించండి. సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి. ఆయనకు ఎవరి భాగస్వామ్యాన్నీ కల్పించకండి. బాధ్యతాభావం, జవాబుదారీతనం కలిగి ఉండండి. మీ కర్మలన్నింటికీ ఒకనాడు దైవం ముందు సమాధానం చెప్పుకోవాల్సి ఉంది...’’ ఇలా ప్రజానీకానికి అనేక హితోపదేశాలు చేశారు. అవన్నీ మనకు మార్గదర్శకం. రేపు‘మిలాద్–ఉన్–నబీ’ ముహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు -
కాంగోలో 40 లక్షల మంది అనాథ బాలలు
గోమా: ఆఫ్రికా ఖండ దేశమైన కాంగోలో 20 ఏళ్లుగా చెలరేగుతున్న హింసకు 40 లక్షలకు పైగా చిన్నారులు అనాథలయ్యారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి దుర్భర జీవితం గడుపుతున్నారు. పశ్చిమ, మధ్య ఆఫ్రికా ప్రాంతాల్లో దాదాపు 260 లక్షల మందికి పైబడి అనాథలున్నారని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో తెలిపింది. జాతి కలహాలు, విలువైన ఖనిజాల కోసం వేట తదితర కారణాలతో చెలరేగుతున్న హింసకు అక్కడ అనేక కుటుంబాలు విచ్ఛినమవుతున్నాయని పేర్కొంది. లైంగిక దోపిడీలు అక్కడ నిత్యకృత్యంగా మారాయని తెలిపింది. 1994 నుంచి రగులుతున్న హింసకు గుర్తుగా ఒక తరం అంతా బాధితులయ్యారని, వాళ్ల జీవితాన్ని కోల్పోయారని వివరించింది. -
అనాథలకు ‘ఓబీసీ’ రిజర్వేషన్
న్యూఢిల్లీ: జనరల్ కేటగిరీకి చెందిన అనాథ పిల్లలు ఇకపై ఓబీసీ కేటగిరీతోపాటు 27 శాతం రిజర్వేషన్ పొందనున్నారు. ఈ మేరకు వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్(ఎన్సీబీసీ) గతవారం తీర్మానం చేసింది. ఈ తీర్మానం ప్రకారం తల్లిదండ్రులను కోల్పోయిన పదేళ్లలోపు పిల్లలు ఓబీసీ జాబితాలో స్థానం పొందుతారు. తద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఉద్యోగాల్లో ఓబీసీ కోటా కింద రిజర్వేషన్ లభిస్తుంది. తీర్మానం ప్రతిని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు పంపించినట్లు ఎన్సీబీసీ సభ్యుడు అశోక్ సైని తెలిపారు. ఎన్సీబీసీ ప్రతిపాదనలు అన్ని ప్రధాన పార్టీలు పరిగణనలోకి తీసుకున్నట్లు.. ఇక కేబినెట్ ఆమోదం మాత్రమే మిగిలి ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇదే తరహాలో హిజ్రాలకు ఓబీసీలో 27 శాతం కోటా అమలు చేయాలని ఎన్సీబీసీ ప్రతిపాదించగా ఓబీసీ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో కేంద్రం దానిని నిలుపుదల చేసింది. -
అనాథ పిల్లల కోసం ‘ఊయల’
కర్నూలు(హాస్పిటల్): అనాథ పిల్లల కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఊయల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి చెప్పారు. గురువారం ఆమె ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగాన్ని సందర్శించారు. పీఐసీయులో చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలను భారంగా భావించేవారు వారిని ఆసుపత్రిలోని ఊయలలో పడుకోబెట్టి వెళ్లవచ్చన్నారు. వారి బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. ఎస్‌ఎన్‌సీయూలో సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. చిన్నపిల్లల విభాగానికి అదనంగా 10 ఏసీలు, 40 పడకలు అవసరం ఉందన్నారు. మందుల కొరత తీవ్రంగా ఉందని, ఈ విషయాలను జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ దృష్టికి తీసుకెళతానన్నారు. ఆపరేషన్ థియేటర్లు, పరికరాలు లేకుండా మాతాశిశు భవనాన్ని ఎందుకు ప్రారంభించారని, దీనిపై ఆరోగ్య శాఖ మంత్రితో చర్చిస్తానన్నారు. ఆమె వెంట ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ అరుణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, ఏఆర్ఎంవో డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. -
అమ్మానాన్న అని ఏడ్చినందుకు..
* చిన్నారిని చితకబాదిన వంట మనిషి * పోలీస్‌స్టేషన్‌కు చేరిన చిన్నారులు ఆత్మకూర్: తల్లిదండ్రులు లేని అనాథలు అమ్మా నాన్నను గుర్తు చేసుకొని ఏడిస్తే.. ఆదరించి వారి కన్నీటిని తూడ్చాల్సిందిపోయి చితకబాదింది ఆ వంట మనిషి. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ బాల సదనంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్న ఈ బాలసదనంలో 14 మంది విద్యార్థినులు ఉన్నారు. ఇన్చార్జ్ మ్యాట్రిన్ వెంకటేశ్వరమ్మ ఎప్పుడో ఒకసారి వచ్చిపోతుండటంతో వంట మనిషి ప్రమీలదే అక్కడ పెత్తనం. బాల సదనంలోని పాప పేరు మనీష. ప్రస్తుతం 3వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రుల పేర్లు పెట్టాలి కాబట్టి నాన్న సీతయ్య, అమ్మ చిట్టెమ్మలుగా రిజిస్టర్లో పేర్కొన్నారు. ఆ పాపకు తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి బుధవారం రాత్రి ఓ మూలన ఏడ్చుకుంటూ కూర్చుంది. అప్పుడే వచ్చిన వంటమనిషి ప్రమీల నచ్చజెప్పాల్సిందిపోయి ఒక్కసారిగా విరుచుకుపడిందని విద్యార్థినులు తెలిపారు. మేం చెప్పినట్లు వినాలి.. నేనే ఇక్కడ బాస్‌ను అని, లేని తల్లిదండ్రులను ఎందుకు గుర్తుచేసుకున్నావంటూ మనీషను చితకబాదింది. దీంతో భయబ్రాంతులైన మిగతా విద్యార్థినులు గేటు దూకి ఎదురుగా ఉన్న ఇళ్లలోకి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకుడు ఐ.శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అక్కడికు చేరుకొని ఆ విద్యార్థులకు నచ్చజెప్పి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ట్రైనీ ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. -
అనాథలకు ఆలయం
చీకటి జీవితాలకు వెలుగు హౄదయశాంతి ఆశ్రమం వృద్ధుల సేవలో ఆనందరావు మమేకం ‘మౌనం యొక్క ఫలితం ప్రార్థన ప్రార్థన యొక్క ఫలితం నమ్మకం నమ్మకం యొక్క ఫలితం ప్రేమ ప్రేమ యొక్క ఫలితం సేవ సేవ యొక్క ఫలితం సంతృప్తి’ కలుగుతుందని సేవామూర్తి మదర్‌థెరిసా చెప్పిన మాటలివి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని పొలమరశెట్టి ఆనందరావు వృద్ధులు, అనాథల సేవలో మమేకమయ్యారు. నాకెవ్వరూ లేరు అనేవారికి ఆప్తుడయ్యారు. కూతురు చూడటం లేదని బోరున విలపిస్తే ఓ తల్లిగా కన్నీళ్లు తుడిచారు. కొడుకు నిర్లక్ష్యానికి చావే శరణ్యమనుకుంటున్న ఓ పెద్దాయనకు తాతలా ఓదార్చారు. మీ అందరికీ నేనున్నానంటూ ‘హృదయం’లో స్థానమిచ్చారు. వృద్ధులకు తల్లిగా..తండ్రిగా..స్నేహితుడిగా మారారు. హృదయశాంతి ఆశ్రమం స్థాపించి సేవామూర్తిగా మారారు. –అనకాపల్లి రూరల్ ఆనందరావు సొంత ఊరు కొత్తవలస వద్ద మంగళపాలెం. ట్రెజరీ అధికారిగా అనకాపల్లిలో ఎక్కువ కాలం సేవలందించారు. 2000 సంవత్సరంలో వలంటిరీ రిటైర్మెంట్ తీసుకుని వృద్ధాశ్రమం స్థాపించారు. అప్పటి నుంచి నిరంతరాయంగా సేవలందిస్తున్నారు. వృద్ధులకు సకల సౌకర్యాలు కల్పించారు. ఎక్కడెక్కడినుంచి వచ్చిన వారంతా ఒక పేగుతెంచుకుని పుట్టిన బిడ్డల్లా మారిపోయారు. చివరిమజిలిలో ఆనందరావును ఆ దేవుడే మా కోసం పంపాడని ఆనందబాష్పాలతో చెబుతున్నారు. మనస్ఫూర్తిగా చేయాలి... ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. అందుకే ఉద్యోగానికి వలంటిరీ రిటర్మెంట్ ఇచ్చేసి సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆనాటి నుంచి నేటి వరకూ అదే స్ఫూర్తిగా సేవచేస్తున్నాను. వృద్ధాశ్రమంలో 32 మంది ఉన్నారు. సరైన భోజనం, నిద్రించేందుకు మంచి గదులు, అడగడుగునా జాగ్రత్తలు, బాత్రూం సౌకర్యం, నడవలేని వారికి సాయం చేసేవారు ఉన్నారు. ప్రతి రోజూ ప్రార్థన చేసుకునేందుకు మందిరం, కమ్యూనిటీ హాలు ఇలా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పిల్లలకు సెటిల్ అవడంతో ఆనందరావు భార్యతో కలిసి వృద్ధాశ్రమంలో సేవలందిస్తున్నారు. ప్రత్యక్ష అనుభవంతోనే... కొత్తవలస సమీపంలోని మంగళపాలెం గ్రామంలో జన్మించాను. గతంలో మా నాయనమ్మకు ఇదే పరిస్థితి రావడంతో అప్పట్లో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఆమె ఎన్నో బా«ధలు పడి, ఉన్నవాళ్లవద్ద ఇమడలేక, బయటకు వెళ్లలేక నరకం అనుభవించింది. ఉద్యోగరీత్యా స్థిరపడటంతో అలాంటి వాళ్లకు ఏదో విధంగా సేవ చేయాలన్న సంకల్పంతో ఈ ఆశ్రమాన్ని స్థాపించాను. ఆశ్రమానికి దాతలు, గ్రామస్తులు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించారు. వీరే లేకపోతే నా సంకల్పం నెరవేరేదికాదు. - పొలమరశెట్టి ఆనందరావు, ఆశ్రమ వ్యవస్థాపకుడు . ఆత్మీయులు ఇక్కడే ఉన్నారు కుటుంబసభ్యులు చూడలేని పరిస్థితి కారణంగా ఈ ఆశ్రమానికి రావాల్సివచ్చింది. ఇక్కడకు వచ్చిన తర్వాత నా బాధలన్నీ మరిచిపోయి ఎంతో ఆనందంగా జీవించగలుగుతున్నాను. కన్నవారు లేకపోయినా ఓదార్చే వ్యక్తులు ఉండడం వలన ఉండగలుగుతున్నాను. – కరణం నిర్మల, తుమ్మపాల ఆశ్రమంలో అన్ని దక్కాయి... అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు బయటకు పంపేయడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ఈ ఆశ్రమానికి వచ్చా. ఆశ్రమంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎంతో హాయిగా ఉంటున్నాను. బాగా చూసుకుంటాను, రమ్మని నా కొడుకు పిలిచినా ఇప్పుడు వెళ్లను. వృద్ధాశ్రమం దేవాలయంగా ఉంది. ఎంతో ప్రశాంతంగా బతుకుతున్నాను. –సర్వలక్ష్మి, విజయరామరాజుపేట, అనకాపల్లిపట్టణం ఇంటి కన్నా ఆశ్రమమే బాగుంది ఇంట్లో నా కుటుంబసభ్యుల మధ్య ఉన్నప్పుడు ఎంతో నరకం చూశాను. సరైన వసతి, తిండి వంటి సౌకర్యాలతోపాటు ముఖ్యంగా ప్రశాంతత వంటివి లేక ఎంతో ఇబ్బందులు పడ్డాను. ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ పోయాయి. మంచి భోజన సదుపాయం, మనశ్శాంతి కోసం ప్రార్ధనామందిరంతో ఏ చీకూ చింత లేకుండా ఆనందంగా ఉన్నాను. – పార్వతమ్మ, వృద్ధురాలు. కన్నోళ్లు చేయనివన్నీ ఆశ్రమం కల్పిస్తోంది కొడుకు, కోడలు చూడక ఇంత దూరం వచ్చాను. ఈ ఆశ్రమంలో మంచి జీవితాన్ని అనుభవిస్తున్నాను. అన్నిసౌకర్యాలు ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు లేవు. కన్నవాళ్ల గురించి మాట్లాడే కన్నా ఆశ్రమం గురించి ఎక్కువ మాట్లాడాలనిపిస్తోంది. ఆరోగ్యం బాగోకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లి మంచి వైద్యాన్ని అందిస్తున్నారు. కన్నోళ్లు చేయని పరిస్థితి ఈ ఆశ్రమం చేస్తోంది. –గోపాలరావు, వృద్ధుడు