అనాథలకు గుర్తింపునిచ్చి వారిని ఆదుకోవాలని లైవ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి సోమవారం కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని కోరారు.
న్యూఢిల్లీ: అనాథలకు గుర్తింపునిచ్చి వారిని ఆదుకోవాలని లైవ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి సోమవారం కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని కోరారు. పార్లమెంట్‌లో శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడుతో కలసి ఆమె మంత్రిని కలిశారు. అనాథలకు ఎలాంటి చేయూత లేకపోవడంతో వారి భవిత వక్రమార్గంలో పయనిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా నిలచి, ఉన్నత చదువులు చదివించాలని, సమాజంలోని బడుగు, బలహీన వర్గాలకు అందుతున్న రిజర్వేషన ్లను వీరికి అమలయ్యేలా చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.