Smriti Irani
-
స్మృతి ఇరానీకి ఢిల్లీ పగ్గాలు?
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా..నూతన ముఖ్యమంత్రి ఆతిశి ప్రమాణస్వీకారం.. వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల పరిణామాల నేపథ్యంలో అప్రమత్తమైన బీజేపీ అధిష్టానం ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలన్న గట్టి పట్టుదలతో ముందుకు కదులుతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోనే తన నిజాయితీని నిరూపించుకొని మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానంటూ కేజ్రీవాల్ ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించడంతో ఆయనకు గట్టి పోటీనిచ్చే నేతను రంగంలోకి దించే వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగానే మాజీ కేంద్రమంత్రి, ఫైర్‌బ్రాండ్ స్మృతి ఇరానీని ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సభ్యత్వ నమోదు బాధ్యతలను ఆమెకు కట్టబెట్టిన కమలదళం, మున్ముందు మరిన్ని బాధ్యతలు కట్టబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.పీఠమెక్కాలన్న కసితో బీజేపీ.. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను ఎదుర్కొనే క్రమంలో బీజేపీ మాజీ ఐపీఎస్ కిరణ్‌బేడీని తమ ముఖ్యమంత్రిగా ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో కిరణ్‌బేడీ ఏమాత్రం ప్రభావం చూపకపోగా, ఆమె నాయకత్వాన్ని ఏమాత్రం లెక్కపెట్టని బీజేపీ శ్రేణులన్నీ క్షేత్రస్థాయిలో మౌనం వహించాయి. దీంతో ఆ ఎన్నికల్లో బీజేపీ 70 స్థానాలకు గానూ కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. ఆ తర్వాత 2020 ఎన్నికల్లో సీఎం అభ్యరి్థని ప్రకటించకుండానే బీజేపీ పోటీకి దిగింది. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. కేవలం 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. అదే 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఢిల్లీలోని ఏడింటికి ఏడు సీట్లు గెలుచుకున్న బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బోల్తా పడుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప్‌కు తిరిగి అధికారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ ముందునుంచే ఎన్నికల ప్రణాళికలను అమలు చేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే స్మృతి ఇరానీని ఢిల్లీ రాజకీయాల్లో క్రియాశీలం చేసే పనిలో పడింది. ఢిల్లీ బీజేపీకి చెందిన 14 జిల్లా యూనిట్లలోని ఏడింటిలో సభ్యత్వ నమోదు బాధ్యతలను పార్టీ ఆమెకు కట్టబెట్టింది. ఈ నెల 2వ తేదీ నుంచి ఢిల్లీలోని ప్రతి వార్డులో ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు. సభ్యత్వ కార్యక్రమాలలో బూత్ స్థాయి కార్యకర్తల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, పార్టీని అట్టడుగు స్థాయిలో బలోపేతం చేయడంపై ఆమె దృష్టి పెట్టారు. దక్షిణ ఢిల్లీలో ఇప్పటికే ఆమె ఒక ఇంటిని సైతం కొనుగోలు చేశారని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో అమేధీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్ శర్మ చేతిలో ఓటమి అనంతరం ఎక్కడా కనిపించని ఆమెకు తాజాగా ఢిల్లీ బాధ్యతలు కట్టబెట్టారనే చర్చ జరుగుతోంది. ఢిల్లీలో ఇప్పటికే బీజేపీ తరఫున దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె, ఎంపీ బాసూరీ స్వరాజ్ క్రియాశీలంగా ఉన్నప్పటికీ ఆమె తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమెతో పాటు ఎంపీలు మనోజ్ తివారీ, ప్రదీప్ ఖండేల్వాల్, కామజీత షెరావత్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా వంటి సీనియర్లు ముఖ్యమంత్రి ముఖాలుగా ఉన్నప్పటికీ వాక్చాతుర్యం, గాంధీ కుటుంబ వ్యతిరేక భావజాలమున్న ఇరానీనే సరైన మార్గమని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. ఆప్ కొత్త ముఖ్యమంత్రి ఆతిశిని ఎదుర్కొనేందుకు ఇరానీ సరితూగుతారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల వ్యూహరచన, ప్రచార ప్రణాళిక, అభ్యర్థుల ఎంపిక, ప్రచారానికి నాయకత్వం వహించే బాధ్యతను ఆమెకు అప్పగించవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -సాక్షి, న్యూఢిల్లీ -
రాహుల్ రాజకీయం మారింది.. స్మృతి ప్రశంస
లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ అదరగొడుతున్నారు. పార్లమెంట్లో ఇప్పటికే పలు అంశాలపై ఎన్డీయే కూటమి సర్కార్‌కు రాహుల్ చుక్కలు చూపించారు. ప్రస్తుతం రాజకీయంగా ప్రతీ విషయంలోనూ యాక్టివ్‌గా ఉంటూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. దీంతో, రాజకీయ విమర్శకులు, ప్రత్యర్థుల నుంచి కూడా రాహుల్ ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక, ఆ జాబితాలోకి మాజీ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా చేరిపోయారు.తాజాగా రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్ గురించి స్మృతి ఇరానీ ప్రస్తావిస్తూ..‘రాజకీయంగా రాహుల్ గాంధీ ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తన గెలుపును రాహుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఎంతో పరిపక్వతతో మాట్లాడుతున్నాడు. రాజకీయాల్లో అలా మాట్లాడటం ఎంతో కీలకం. పార్లమెంట్‌లోకి తెల్ల టీషర్ట్ వేసుకుని హాజరు కావడం ద్వారా యువతకు ఓ సందేశం ఇచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇదంతా మనకు నచ్చినా నచ్చకపోయినా భిన్నమైన రాజకీయం చేస్తున్నట్లు మాత్రం అనిపిస్తోంది అంటూ పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఇక, ఆమె వ్యాఖ్యలకు బీజేపీ నేతలు షాక్‌లోకి వెళ్లిపోయారు. Whether you like it or not, but Rahul Gandhi’s politics has changed. He is giving a message to the youths of the country through his white T-shirt. — BJP leader Smriti Irani pic.twitter.com/qsdCIwFE2z— Shantanu (@shaandelhite) August 28, 2024రాహుల్ వ్యాఖ్యలే కారణమా?పార్లమెంట్ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి స్మృతి ఇరానీ ఓటమిని చవిచూశారు. రాహుల్ గాంధీ ఆఫీసులో పనిచేస్తున్న కిషోరీ లాల్ శర్మ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. అనంతరం, కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా స్మృతి ఇరానీని టార్గెట్ చేశారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ.. స్మృతి ఇరానీకి మద్దతుగా నిలిచారు. జీవితంలో గెలుపోటములు సహజం. ఈ విషయంలో స్మృతీ ఇరానీతోపాటు ఇతర నేతలను కించపరిచే విధంగా మాట్లాడొద్దు. దురుసుగా ప్రవర్తించడం మానుకోవాలి. ఇతరులను కించపరచడం, అవమానించడం బలహీనతకు సంకేతం అంటూ రాహుల్ చెప్పుకొచ్చారు. అందుకే రాహుల్ విషయంలో ప్రస్తుతం స్మృతి ఇరానీ ఇలా మాట్లాడారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. After Rahul Gandhi gave his speech, Smriti Irani roaring now in loksabha🔥🔥.Smriti Irani : "You are not India, for India is not corrupt. India believes in merit not in dynasty & today of all the days people like you need to remember what was told to the British - Quit India.… pic.twitter.com/E3RtczdW0g— Times Algebra (@TimesAlgebraIND) August 9, 2023 నాడు విమర్శలు..అయితే, రాహుల్ గాంధీకి రాజకీయ ప్రత్యర్థి అయిన స్మృతి ఇరానీ అంతకుముందు ఆయనపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అమేథీలో పోటీ చేసేందుకు రాహుల్ భయపడుతున్నారని పలు సందర్భాల్లో సెటైర్లు వేశారు. తనను చూసి రాహుల్ వయనాడ్ పారిపోయారని కూడా ఎద్దేవా చేశారు. ఇక, పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా సభలో రాహుల్‌పై స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు. రాహుల్ అసలు భారతీయుడే కాదంటూ మండిపడ్డారు. అంతేకాకుండా.. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీతో డిబేట్ చేసే స్థాయి రాహల్ గాంధీకి ఉందా?. రాహల్ గాంధీ ఏమైనా విపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థినా? అంటూ కూడా కామెంట్స్ చేశారు. Modi Govt has an absolute majority, they have 353 MPs. In Manipur, there is a BJP CM. But when a question on Manipur was asked, the Women and Child Development minister @smritiirani said that @RahulGandhi’s actions put Manipur on fire. How shameless & obsessed one can be,… pic.twitter.com/MyDK8VGZP2— Shantanu (@shaandelhite) July 26, 2023 -
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన స్మృతీ ఇరానీ
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. ఆమె గత పదేళ్లుగా ఈ బంగ్లాలో ఉంటున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె ప్రభుత్వం కేటాయించిన నివాసాన్ని ఖాళీ చేయవలసి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయిన ఎంపీలంతా జూలై 11లోగా తమ నివాసాలను ఖాళీ చేయాల్సివుంది. దీనిపై స్మృతీ ఇరానీకి నోటీసు రావడంతో ఆమె బంగ్లాను ఖాళీ చేశారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో ఆమె నివాసం ఉంటున్న ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలంటూ ఆమెకు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని స్టేట్ డైరెక్టర్ నుంచి నోటీసు వచ్చింది. దీంతో ఆమె బంగ్లాను ఖాళీ చేశారు. -
లండన్‌కు స్మృతి ఇరానీ.. ‘మోదీ 3.0’ విజయోత్సవాలకు హాజరు
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వారిలో స్మృతి ఇరానీ ఒకరు. ఓటమి తర్వాత ఆమె చాలా అరుదుగా బహిరంగంగా కనిపించారు. ఈ నేపధ్యంలో స్మృతి ఇరానీ ప్రస్తుతం ఎక్కడున్నారని చాలామంది ప్రశ్నిస్తున్నారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నారు. అక్కడ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ‘మోడీ 3.0’ విజయోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్మృతీ ఇరానీ లండన్ చేరుకున్నారు. అక్కడి అభిమానులు ఆమెకు ఘస స్వాగతం పలికారు. ఈ సమయంలో పలు దేశభక్తి నినాదాలు చేశారు.స్మృతి ఇరానీ సభలో మాట్లాడుతూ తనకు ఇక్కడ బెంగాలీ, గుజరాతీ స్నేహితులు ఉన్నారని తెలిపారు. తరువాత మలయాళంలో మాట్లాడుతూ కేరళకు చెందినవారిని పలుకరించారు. అలాగే మహారాష్ట్ర ప్రజలను మరాఠీలో పలకరించారు. ఈ సమయంలో అక్కడున్న వారిలో కొందరు జై మహారాష్ట్ర, జై శివాజీ మహారాజ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్మృతి మాట్లాడుతూ భారతదేశం విభిన్న భాషలు, సంస్కృతుల మిళితం అని, తాను భారతీయురాలిని అయినందుకు గర్వపడుతున్నానని అన్నారు. #WATCH लंदन, ब्रिटेन: भाजपा नेता स्मृति ईरानी ने कहा, "...विभिन्न आवाजों और संस्कृतियों के इस सम्मिश्रण के बावजूद, एक आवाज ही आवाज गूंज रही है, 'मैं भारतीय हूं'..." https://t.co/U6IBYD822w pic.twitter.com/P9ZCATcHJx— ANI_HindiNews (@AHindinews) June 23, 2024 -
ఓటమి దిశగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
కాంగ్రెస్ కంచుకోట అమేథీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2024 ఎన్నికల్లో ప్రతిష్టాత్మక పోరుగా భావిస్తున్న అమేధీ నుంచి ఆమె వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిదిశగా పయనిస్తున్నారు.. కి కాంగ్రెస్ అభ్యర్థి, గాంధీ కుటుంబ విధేయుడు కేఎల్ శర్మ 28వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నువ్వే నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో ఉత్కంఠగా మారింది.శర్మకు గత 40 సంవత్సరాలుగా అమేథీతో అనుబంధం ఉంది. అమేథీలో ప్రియాంక గాంధీ వాద్రా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అమేథీకి మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన రాహుల్ 2019లో ఇరానీ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అటు దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఇండియా కూటమి దాదాపు226పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు 2019లో భారీ మెజార్జీసాధించిన బీజేపీ గతంతో పోలిస్తే 61 సీట్లతో నష్టంతో కేవలం 291 సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారం పీఠం ఎవరికి దక్కనుంది అనేదానిపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమేథీ చరిత్ర ఇదీ1980లో సంజయ్ గాంధీ విజయంతో వారసత్వం ప్రారంభమైంది. అతని ఆకస్మిక మరణం తరువాత, అతని సోదరుడు రాజీవ్ గాంధీ 1981 ఉప ఎన్నికలలో విజయం సాధించారు మరియు 1984, 1989 , 1991లో విజయం సాధించారు. రాజీవ్ హత్య తర్వాత, కుటుంబ విధేయుడైన సతీష్ శర్మ 1991 ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 1999లో సోనియాగాంధీ, 2004, 2009, 2014లో రాహుల్‌గాంధీ అమేథీ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నారు. -
లోక్‌సభ ఎన్నికలు 2024: ముగిసిన ఐదో విడత పోలింగ్
Updatesసాయంత్రం 7 గంటలవరకు నమోదయిన సగటు పోలింగ్ శాతం 57.38బీహార్ - 52.35%జమ్మూ-కాశ్మీర్ - 54.21%జార్ఖండ్ - 61.90%లఢఖ్ - 67.15%మహారాష్ట్ర - 48.66%ఒడిస్సా- 60.55%ఉత్తరప్రదేశ్ - 55.80%పశ్చిమబెంగాల్ - 73%మధ్యాహ్నం 3 గంటల వరకు 47.53 శాతం పోలింగ్..లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ కొనసాగుతోందిప్రజలు తమ ఓటు హక్కు వినియోంగిచుకోవడానికి తరలి వస్తున్నారు.మధ్యాహ్నం 3 గంటల వరకు సగటున 47.53 శాతం పోలింగ్ నమోదుబీహార్ 45.33 శాతంజమ్మూ అండ్ కాశ్మీర్ 44.90 శాతంఝార్ఖండ్ 53.90 శాతంలడఖ్ 61.26 శాతంమహారాష్ట్ర 38.77 శాతంఒడిశా 48.95శాతంఉత్తర ప్రదేశ్ 47.55 శాతంవెస్ట్ బెంగాల్ 62.72 శాతంమధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 36.73 శాతం పోలింగ్ నమోదైంది.బీహార్ 34.62%జమ్మూ కశ్మీర్ 34.79%జార్ఖండ్ 41.89%లడఖ్ 52.02%మహారాష్ట్ర 27.78%ఒడిశా 35.31%ఉత్తరప్రదేశ్ 39.55%పశ్చిమ బెంగాల్ 48.41%#LokSabhaElections2024 | 36.73% voter turnout recorded till 1 pm, in the fifth phase of elections. Bihar 34.62% Jammu & Kashmir 34.79%Jharkhand 41.89%Ladakh 52.02% Maharashtra 27.78% Odisha 35.31% Uttar Pradesh 39.55%West Bengal 48.41% pic.twitter.com/6cxi2tJsHq— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రబాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఆయన తల్లిదండ్రులు రాకేష్ రోషన్, పింకీ రోషన్, సోదరి సునైనా రోషన్‌తో కలసి ఓటు వేశారు.ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Actor Hrithik Roshan, his sister Sunaina Roshan & their parents Rakesh Roshan and Pinkie Roshan cast their votes at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/5h8XFTRMvA— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రశివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన భార్య రష్మీ, కుమారుడు ఆదిత్య ఠాక్రే ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.Uddhav Thackeray, his wife Rashmi and son Aaditya cast their vote in MumbaiRead @ANI Story | https://t.co/Ljg2V0qtYc#UddhavThackeray #AadityaThackeray #LokSabhaElections2024 pic.twitter.com/8nSagjge6V— ANI Digital (@ani_digital) May 20, 2024 మహారాష్ట్రనటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Mumbai: After casting his vote, actor Manoj Bajpayee says, "This is the biggest festival and everyone should vote as you will get this opportunity after 5 years. If you haven't voted then you have no right to complain..."#LokSabhaElections2024 pic.twitter.com/ECZH5TeBU8— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రక్రికెటర్ అజింక్య రహానే దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.LS Polls 2024: India cricketer Ajinkya Rahane, wife cast their vote in MumbaiRead @ANI Story | https://t.co/MyHmMbTF55#AjinkyaRahane #LokSabhaElections2024 pic.twitter.com/EUkJ5a0ZGR— ANI Digital (@ani_digital) May 20, 2024 దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, ఆయన కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.Sachin Tendulkar, son Arjun, cast vote in Lok Sabha electionsRead @ANI Story | https://t.co/Lz7fVhAoT0#SachinTendulkar #LokSabhaPolls #cricket #LSPolls #Elections2024 #TeamIndia pic.twitter.com/Vq2cgSgYCE— ANI Digital (@ani_digital) May 20, 2024 ఢిల్లీ:ఐదో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోందిఉదయం 11 గంటల వరకు 23.66 శాతం ఓటింగ్ నమోదైంది.బీహార్- 21.11%జమ్మూ కశ్మీర్- 21.37%జార్ఖండ్- 26.18%లడఖ్- 27.87%మహారాష్ట్ర- 15.93%ఒడిశా- 21.07%ఉత్తరప్రదేశ్- 27.76%పశ్చిమ బెంగాల్- 32.70%#LokSabhaElections2024 | 23.66% voter turnout recorded till 11 am, in the fifth phase of elections. Bihar 21.11% Jammu & Kashmir 21.37% Jharkhand 26.18% Ladakh 27.87% Maharashtra 15.93% Odisha 21.07% Uttar Pradesh 27.76%West Bengal 32.70% pic.twitter.com/wr9kbCIwYN— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రమహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఓటు హక్కు వినియోగించుకున్నారు.థానేలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Maharashtra CM Eknath Shinde casts his vote at a polling booth in Thane. #LokSabhaElections2024 pic.twitter.com/RZvG01iVyY— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర:బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Veteran actor Dharmendra casts his vote at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/FqXmZ5jFPG— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: ఎంపీ హేమా మాలిని, ఆమె కూమార్తె ఇషా డియోల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.#WATCH | Mumbai, Maharashtra: Actress and BJP MP Hema Malini, her daughter and actress Esha Deol show indelible ink marks on their fingers after casting their votes at a polling booth in Mumbai #LokSabhaElections2024 pic.twitter.com/T3I2wmA0H0— ANI (@ANI) May 20, 2024 ఉత్తర ప్రదేశ్:కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.లక్నోలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరూ కుటుంబసభ్యులతో వచ్చిన ఓటు వేయాలని కోరుతున్నా.#WATCH | Lucknow, Uttar Pradesh: "I appeal to the voters of the country to cast their vote along with their family members...," says Defence Minister and BJP candidate from Lucknow Lok Sabha seat, Rajnath Singh after casting his vote #LokSabhaElections2024 pic.twitter.com/tf5Pz7hjO8— ANI (@ANI) May 20, 2024 ఉత్తర ప్రదేశ్: అమేథీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.అమేథీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Uttar Pradesh: BJP MP and candidate from Amethi Lok Sabha seat, Smriti Irani arrives at a polling station in Amethi to cast her vote for #LokSabhaElections2024Congress has fielded KL Sharma from this seat. pic.twitter.com/yAeOMBZZxP— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Bollywood actor Paresh Rawal shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/5FVCXjNMqn— ANI (@ANI) May 20, 2024 ఢిల్లీ: ఐదో విడత పోలింగ్ కొనసాగుతోందిప్రజలు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు.ఉదయం 9 గంటల వరకు 49 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదైన పోలింగ్ శాతం 10.28 శాతం బీహార్ - 8.86% జమ్మూ-కాశ్మీర్ - 7.63% జార్ఖండ్ - 11.68% లఢఖ్ - 10.61% మహారాష్ట్ర - 6.33% ఒడిస్సా- 6.87% ఉత్తరప్రదేశ్ - 12.89% పశ్చిమబెంగాల్ - 15.35% #LokSabhaElections2024 | 10.28% voter turnout recorded till 9 am, in the fifth phase of elections.Bihar 8.86% Jammu & Kashmir 7.63%Jharkhand 11.68%Ladakh 10.51%Maharashtra 6.33%Odisha 6.87%West Bengal 15.35% pic.twitter.com/bNP5RqOg7d— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ హీరోయిన్లు జాన్వీ కపూర్, సాన్య మల్హోత్రా ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Actor Sanya Malhotra shows the indelible ink mark on her finger after casting her vote at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/ajbM69mtqJ— ANI (@ANI) May 20, 2024మహారాష్ట్ర: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం మీడియాలో మాట్లాడారు.ఈ ఎన్నికల నాకు గొప్ప అవకాశం ఇచ్చాయి. ప్రజలను కలిసి.. ఆశీస్సులు తీసుకున్నా.#WATCH | Union Minister and BJP candidate from Mumbai North Lok Sabha seat, Piyush Goyal shows his inked finger after casting his vote at a polling station in Mumbai.#LokSabhaElections2024Congress has fielded Bhushan Patil from the Mumbai North seat. pic.twitter.com/81pfeAEiav— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబై పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు.భారత్ అభివృద్ధి చెందాలిదానిని దృష్టితో పెట్టుకొని ఓటు వేశానుప్రజలు ఓటు వేయడానికి భారీ సంఖ్యలో వస్తున్నారు.#WATCH | Actor Akshay Kumar shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Mumbai.He says, "...I want my India to be developed and strong. I voted keeping that in mind. India should vote for what they deem is right...I think voter… pic.twitter.com/mN9C9dlvRD— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్, డైరెక్టర్ జోయా అక్తర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Maharashtra: Actor Farhan Akhtar and Director Zoya Akhtar show their inked fingers after casting their votes at a polling station in Mumbai.#LokSabhaElections pic.twitter.com/ESpxvZNuGN— ANI (@ANI) May 20, 2024 ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. రికార్డు సంఖ్యలో ఓటు వేయండి: ప్రధాని మోదీప్రజాస్వామ్య పండుగలో ఓటు హక్కు వినియోగించుకోండిఓటర్లకు ప్రధాని మోదీ విజ్ఞప్తి"Vote in record numbers": PM Modi appeals voters to cast franchise in festival of democracyRead @ANI Story | https://t.co/CDSpNQxl1l#PMModi #LokSabhaElection2024 pic.twitter.com/pQIC7v0YRP— ANI Digital (@ani_digital) May 20, 2024 మహారాష్ట్ర: వ్యాపారవేత్త అనిల్ అంబాని ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Industrialist Anil Ambani casts his vote at a polling booth in Mumbai, for the fifth phase of #LokSabhaElections2024 pic.twitter.com/2CpXIZ6I0l— ANI (@ANI) May 20, 2024ఉత్తర ప్రదేశ్:మాజీ సీఎం, బీఎస్పీ చీఫ్ మాయావతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.లక్నోలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని కోరారు. ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది.ప్రజలు ఓటు వేయడానికి క్యూలైన్లో నిల్చుంటున్నారు.#WATCH | Former Uttar Pradesh CM and BSP chief Mayawati shows her inked finger after casting her vote for #LokSabhaElections2024 at a polling station in Lucknow. pic.twitter.com/ZmtmwJg8Yq— ANI (@ANI) May 20, 2024 బిహార్‌బిహార్‌లోని ముజఫర్ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద భారీ సంఖ్యలో ఓటు వేయడానికి మహిళలు క్యూలైన్లో నిల్చున్నారు. #WATCH | Bihar: Women queue up in large numbers at a polling booth in Muzaffarpur as they wait for voting to begin. #LokSabhaElections2024 pic.twitter.com/AgOrKHB8FX— ANI (@ANI) May 20, 2024 ఐదో విడత పోలింగ్ ప్రారంభమైందిVoting for the fifth phase of #LokSabhaElections2024 begins. Polling being held in 49 constituencies across 8 states and Union Territories (UTs) today.Simultaneous polling being held in 35 Assembly constituencies in Odisha. pic.twitter.com/EZ1yEm7LJG— ANI (@ANI) May 20, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 49 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, స్మృతి ఇరానీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, తదితర కీలక నేతలు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఈరోజే పోలింగ్ చేపడుతున్నారు. ఏడు దశలను చూస్తే ఈ ఐదో దశలోనే అత్యంత తక్కువ(49) స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ 49 స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ 40కిపైగా చోట్ల విజయం సాధించడం విశేషం. దీంతో ఈ దశ బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈసారైనా మెరుగైన ఓటింగ్ సాధించేలా ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో భారీగా పాలుపంచుకోవాలని ముంబై, థానె, లక్నో నగర ఓటర్లకు ఈసీ ఆదివారం విజ్ఞప్తి చేసింది. బరిలో కీలక నేతలుకేంద్ర మంత్రులు రాజ్‌నాథ్(లక్నో), పియూశ్ గోయల్( నార్త్ ముంబై), కౌశల్ కిశోర్(మోహన్‌లాల్‌గంజ్), సాధ్వి నిరంజన్ జ్యోతి(ఫతేపూర్), శంతను ఠాకూర్ (పశ్చిమబెంగాల్లోని బంగావ్), ఎల్జేపీ(రాంవిలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ (బిహార్‌లోని హాజీపూర్), శివసేన శ్రీకాంత్ షిండే(మహారాష్ట్రలోని కళ్యాణ్), బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య( బిహార్‌లోని సరణ్), ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్(ముంబై నార్త్ సెంట్రల్)ల భవితవ్యం సోమవారమే ఈవీఎంలలో నిక్షిప్తం కాబోతోంది. విపక్షాలు అధికారంలోకి వస్తే అయోధ్య బాలరామాలయం పైకి బుల్డోజర్లను పంపిస్తారని మోదీ తీవ్ర విమర్శలు, ఎన్డీఏ 400 చోట్ల గెలిస్తే రాజ్యాంగాన్ని ఇష్టమొచ్చినట్లు మారుస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తుందని కాంగ్రెస్ విమర్శలతో ఐదో దశ ప్రచారపర్వంలో కాస్తంత వేడి పుట్టించింది. ఒడిశాలో ఐదు లోక్‌సభ స్థానాలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ కింద 35 ఎమ్మెల్యే స్థానాల్లోనూ సోమవారం పోలింగ్ జరగనుంది. బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పోటీచేస్తున్న హింజీలీ అసెంబ్లీ స్థానంలో ఈరోజే పోలింగ్ ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగోదశ ముగిశాక 543 స్థానాలకుగాను 23 రాష్ట్రాలు,యూటీల్లో ఇప్పటిదాకా 379 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది.ఆరో దశ పోలింగ్ మే 25న, ఏడో దశ జూన్ ఒకటిన జరగనుంది. -
అమేథీలో బీజేపీకి ఎదురుగాలి?
యూపీలోని అమేథీలో బీజేపీ మహిళానేత స్మృతి ఇరానీపై వివిధ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయా? అంటే అవుననే సమాధానమే విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. అమేథీలో స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు ఇటీవల పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. ఈసారి బీజేపీకి ఓటేయబోమని ప్రతిజ్ఞ కూడా చేశారు. ఇంతకీ వీరు స్మృతీ ఇరానీపై ఎందుకు ఆగ్రహంతో ఉన్నారు?కొంతకాలం క్రితం కాంగ్రెస్ నేత దీపక్ సింగ్‌పై అక్రమంగా కేసు పెట్టడంపై వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీజేపీలో తమ సామాజికవర్గానికి ప్రాధాన్యత తగ్గుతున్నదని వారు వాపోతున్నారు. మహిళలను గౌరవించని ఏ పార్టీనైనా వ్యతిరేకిస్తామని కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు మహిపాల్ సింగ్ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా ఆయన మహాభారత కాలంలో ద్రౌపది అపహరణను ఉదహరిస్తూ.. ద్రౌపదిని అవమానించనప్పుడు కొంతమంది మౌనంగా కూర్చున్నారని, వారంతా ఆ తరువాత బాధ పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈసారి దేశవ్యాప్తంగా రాజ్‌పుత్ సమాజానికి చెందినవారెవరూ బీజేపీకి ఓటు వేయరని తెలిపారు.స్మృతి ఇరానీని ఉద్దేశించి మహిపాల్ సింగ్ మాట్లాడుతూ మహిళా ఎంపీగా ఆమె మహిళల గౌరవం గురించి ఎప్పుడూ మాట్లాడలేదని, ఆమె పార్లమెంట్లో మహిళల సమస్యలను లేవనెత్తలేదని, అలాంటప్పుడు మహిళల గౌరవం కోసం పోరాడుతున్నామని చెప్పే హక్కు ఆమెకు లేదన్నారు. యోగి ఆదిత్యనాథ్‌ను కట్టడి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, వసుంధర రాజేను తొలగించారని, మధ్యప్రదేశ్ సీఎం పదవి నుంచి శివరాజ్సింగ్ను కూడా తొలగించారని, హర్యానాలో మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కూడా తొలగించారని, రమణ్‌సింగ్ పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందేనని అన్నారు.బీజేపీలో క్షత్రియ సామాజికవర్గం స్థాయి తగ్గుతోందని, బీజేపీకి మంచి చేసిన రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆ పార్టీ పక్కన పెట్టిందని అన్నారు. బీజేపీలో క్షత్రియ సామాజికవర్గం స్థాయి తగ్గుతోందనడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని అన్నారు. అందుకే కర్ణిసేన సామాజిక వర్గం వారంతా బీజేపీని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. -
‘అమేథీలో నా ప్రత్యర్థి ప్రియాంకానే’
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. తనకు చిన్న పిల్లల వలే రాజకీయాలు చేయటం ఇష్టం లేదని తెలిపారు. స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంకా గాంధీపై విమర్శలు చేశారు.‘ఈ ఎన్నికల్లో అమేథీలో నా ప్రత్యర్థి.. ప్రియాంకా గాంధీ వాద్రా. నాపై ఆమె తెర వెనక నుంచి పోరాటం చేస్తున్నారు. కనీసం ఆమె సోదరుడు రాహుల్ గాంధీ నయం. ఆయన ప్రత్యక్షంగా పోటీలో ఉన్నారు. 2014లో రాహుల్ 1.07 లక్షల మెజార్టీతో గెలుపొందారు’ అని ప్రియాంకా గాంధీని ఎద్దేవా చేశారు.ఇక.. కాంగ్రెస్ పార్టీ అమేథీ పార్లమెంట్ స్థానంలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మను బరిలో నిలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా కాంగ్రెస్ కంచుకోట స్థానమైన రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ కేరళలోని వాయ్‌నాడ్‌లో సైతం పోటీ చేసిన విషయం తెలిసిందే.ఇక.. అమేథీ, రాయ్ బరేలీ స్థానాలు ప్రియాంకా గాంధీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ రెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆమె కృషి చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలో అన్ని తానై నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దుసూకువెళ్తున్నారు.అమేథీ, రాయ్‌బరేలీ సెగ్మెంట్లలో ఐదో విడత మే 20న పోలింగ్ జరగనుంది. ఇక.. గతంలో రాయ్‌బరేలీలో సోనియా గాంధీ చేతీలో ఓడిపోయిన దినేష్ ప్రతాప్ సింగ్‌ను మళ్లీ బీజేపీ బరిలోకి దించింది. -
Amethi: స్మృతి వర్సెస్ కిశోరీ
అమేథీ. ఉత్తరప్రదేశ్‌లోని ఈ లోక్‌సభ స్థానం గాంధీ కుటుంబానికి పెట్టని కోట.. కాంగ్రెస్‌కు కంచుకోట. అలాంటి దీర్ఘకాల రాజకీయ వారసత్వానికి 2019లో బీజేపీ గట్టి షాకే ఇచి్చంది. ఏకంగా గాంధీ కుటుంబ వారసుడు రాహుల్‌గాంధీనే ఓడించి కాంగ్రెస్ కుంభస్థలం మీద కొట్టింది. పార్టీ తరఫున నెగ్గి జెయింట్ కిల్లర్‌గా అవతరించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈసారి కూడా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రాహుల్‌కు బదులు గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీలాల్ శర్మ బరిలోకి దిగారు. ఓటమి భయంతోనే అమేథీని వదిలి రాయ్‌బరేలీకి మారారంటూ సోషల్ మీడియాలో రాహుల్ ఒక రేంజ్లో ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈ నెల 20న ఐదో విడతలో పోలింగ్ జరగనున్న అమేథీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.గాందీల అనుబంధం అమేథీ లోక్‌సభ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. నాటినుంచీ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. 1977 ఎన్నికల్లో మాత్రం ఎమర్జెన్సీ ప్రభావంతో జనతా పారీ్టకి చెందిన రవీంద్ర ప్రతాప్ సింగ్ గెలుపొందారు. ఇందిరాగాంధీ రెండో కుమారుడు సంజయ్ గాం«దీని 75,000కు పైగా ఓట్లతో ఓడించారు. 1980 ఎన్నికల్లో సంజయ్ పుంజుకుని రవీంద్ర ప్రతాప్ సింగ్‌ను 1,28,545 తేడాతో ఓడించారు. అదే ఏడాది జూన్‌లో సంజయ్ విమాన ప్రమాదంలో మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో రాజీవ్ గాంధీ 2,37,696 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్‌పై సంజయ్ భార్య మేనకా గాంధీ స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగారు. రాజీవ్ దేశవ్యాప్త ప్రచారంలో బిజీగా ఉండటంతో ఆయన తరపున భార్య సోనియాగాంధీ తొలిసారి ఎన్నికల ప్రచార బరిలో దిగారు. తలపై చీరకొంగు, నుదుటన బొట్టు, చేతికి ఎర్రటి గాజులు, స్వచ్ఛమైన హిందీతో సామాన్యులను బాగానే ఆకట్టుకున్నారు. పెద్ద పెద్ద ప్రసంగాలు చేయకున్నా ఇటు పార్టీ నాయకులకు, అటు ప్రజలకు చేరువయ్యారు. ప్రధానిగా రాజీవ్ అసలు నియోజకవర్గాన్ని పట్టించుకోరన్న ప్రచారం జరిగినా అమేథీ ప్రజలు ఆయనవైపే నిలిచారు. మేనకపై ఏకంగా 3.14 లక్షల మెజారిటీతో రాజీవ్ ఘనవిజయం సాధించారు. అమేథీలో నేటికీ అదే రికార్డు మెజారిటీ. రాజీవ్ మరణించేదాకా అమేథీ నుంచే ప్రాతినిధ్యం వహించారు. తరవాత ఆయన స్థానంలో గాంధీ కుటుంబ సన్నిహితుడు సతీశ్ శర్మ విజయం సాధించి పీవీ కేబినెట్లో పెట్రోలియం మంత్రిగా కూడా చేశారు. బీజేపీ ఎంట్రీ... 1998లోనే బీజేపీ అమేథీలో పాగా వేసింది. సతీశ్ శర్మ రెండుసార్లు గెలిచిన తర్వాత 1998లో బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్ చేతిలో ఓటమి చవిచూశారు. 1999లో సోనియా అమేథీ నుంచే గెలిచి ఎన్నికల అరంగేట్రం చేశారు. తర్వాత 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ రాహుల్ గెలిచారు. 2019 దాకా దశాబ్దన్నర పాటు ఆయన హవాయే సాగింది. 2014 ఎన్నికల్లో రాహుల్ చేతిలో ఓడిన స్మృతి వ్యూహాత్మకంగా నియోజకవర్గంపై బాగా దృష్టి పెట్టారు. దీనికి మోదీ మేనియా తోడై 2019లో రాహుల్‌ను స్మృతీ ఓడించగలిగారు. ఎస్పీ పూర్తి మద్దతు అమేథీలో కాంగ్రెస్ నుంచి రాహుల్ బరిలో దిగుతారా, లేదా అన్నదానిపై చిట్టచివరి నిమిషం దాకా ఉత్కంఠే కొనసాగింది. ఒకానొక దశలో అమేథీ నుంచి రాహుల్, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక బరిలోకి దిగుతారన్న ప్రచారమూ జరిగింది. ఎట్టకేలకు నామినేషన్ల దాఖలుకు చివరి రోజున రాహుల్ రాయ్‌బరేలీ నుంచి బరిలో దిగడం ఖాయమైంది. అ మేథీ నుంచి పార్టీ సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కిశోరీ లాల్ శర్మను కాంగ్రెస్ పోటీకి దింపింది. 40 ఏళ్లుగా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న శర్మ అందరికీ సుపరిచితుడు. దీనికి తోడు ఇండియా కూటమి భాగస్వామి సమాజ్‌వాదీ ఈసారి కాంగ్రెస్‌కు అన్నివిధాలా దన్నుగా నిలుస్తోంది. అమేథీ, రాయ్‌బరేలీల్లో కాంగ్రెస్ విజయం కోసం రెండు పారీ్టల కార్యకర్తలు కలసికట్టుగా పని చేస్తున్నారు. కుల సమీకరణాలు కూడా పని చేస్తున్నాయి. ఈ సారి యాదవులంతా ఒక్కతా టిపైకి వచ్చారు. అఖిలేశ్ చెప్పినవైపే తమ ఓటంటున్నారు. ఈ సానుకూలత సాయంతో కాంగ్రెస్ తన కంచు కోటను తిరిగి కైవసం చేసుకుంటుందా, స్మృతీయే మళ్లీ గెలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.ఓటర్లు.. ఓట్ల శాతం..అమేథీ లోక్‌సభ స్థానం పరిధిలో జిల్లాలోని అమేథీ, తిలోయి, జగదీశ్‌పూర్, గౌరీగంజ్, రాయ్‌బరేలి జిల్లాలోని సలోన్ అసెంబ్లీ స్థానాలున్నాయి. నియెజకవర్గ జనాభా 20 లక్షల పై చిలుకు. 1999, 2004, 2009ల్లో కాంగ్రెస్ అత్యధిక ఓట్ల శాతంతో గెలిచింది. 2014లో బొటా»ొటిగా గట్టెక్కింది. 2019లో 49.7 శాతం ఓట్లతో బీజేపీ గెలిచింది. స్మృతి ఇరానీ 55,000 ఓట్ల మెజారిటీతో రాహుల్‌ను ఓడించారు. అమేథీలో ఏకంగా 96 శాతం ఓటర్లు గ్రామీణులే!స్మృతి టెంపుల్ రన్...ఇక ఈసారి స్మృతి ఇరానీ ఆరునెలల ముందునుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. అమేథీలో అత్యధిక సంఖ్యాకులైన గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునేందుకు నవరాత్రి సందర్భంగా ఆలయాలు సందర్శించారు. అమేథీలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న ప్రముఖ దేవాలయాలన్నీ దర్శించుకున్నారు. నియోజకవర్గంలోని దాదాపు 42 దేవాలయాలకు తన ఫొటోతో కూడిన బహుమతి ప్యాక్‌లను పంపి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో ఉంటూ అమేథీకి ప్రాతినిధ్యం వహించబోనంటూ గతంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఇటీవలే అమేథీలో ఇల్లు కొని గృహ ప్రవేశం చేశారు. నియోజకవర్గంలో శాశ్వత చిరునామా ఏర్పాటు చేసుకున్నారు. నెహ్రూ–గాంధీ కుటుంబం వల్లే నియోజకవర్గం ఇంతకాలం వెనుకబడి ఉందంటూ ప్రత్యరి్థపై మాటల దాడి తీవ్రతరం చేశారు. బీజేపీ అయితే రాహుల్ తమకు భయపడే అమేథీ వదిలి రాయబరేలీ పారిపోయారంటూ ప్రచారం చేస్తోంది. -
మీరేమైనా ప్రధాని అభ్యర్థినా?.. రాహుల్‌పై స్మృతి ఇరానీ విమర్శలు
ఢిల్లీ: ఎన్నికల అంశాలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో డిబేట్ చేయడానికి రాహుల్ గాంధీ ఏమైనా విపక్షాల కూటమికి పీఎం అభ్యర్థిగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఆమె ఓ జాతీయా మీడియాతో మాట్లాడారు. ‘మొదటిగా.. తమ కంచుకోట అని భావించే స్థానంలో ఓ సాధారణ బీజేపీ కార్యకర్తపై కూడా పోటీ చేసే ధైర్యం లేనివ్యక్తి ప్రగల్భాలు పలకడం మానుకోవాలి. రెండోది.. ప్రధానిమోదీతో భేటీ అయిన ఆయనతో డిబేట్ చేసే స్థాయి రాహల్ గాంధీకి ఉందా?. నేను సూటిగా అడుగుతున్నా.. రాహల్ గాంధీ ఏమైనా విపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థినా?’’ అని స్మృతి ఇరానీ నిలదీశారు.పలు లోక్‌సభ న్నికల అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో బహిరంగ చర్చ ఆహ్వానానికి తాను సిద్ధమేనని శనివారం రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘మా పార్టీ విజన్‌ను ప్రజలు అర్థం చేసుకోవడానికి ఈ డిబేట్ సాయం చేస్తుంది. సరైన సమాచారం ప్రజలకు చేరుతుంది’ అని రాహల్ గాంధీ అన్నారు. ఈ డిబేట్లో తాను లేదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొనడానికి సిద్ధమని తెలిపారు. ఇక.. ఈ బహిరంగ చర్చకు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బీ లోకూర్, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా, సీనియర్ జర్నలిస్టు ఎన్ రామ్ ఆహ్వానం పలికారు. -
స్మృతితో రాహుల్ ఎందుకు పోటీ పడలేదు?.. గెహ్లాట్ వివరణ!
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం 2024- లోక్‌సభ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా ఏళ్లుగా కాంగ్రెస్, రాహుల్ గాంధీలకు కంచుకోటగా ఉన్న ఈ స్థానం ఆ తరువాత బీజేపీకి దక్కింది. ఇక్కడి నుంచి స్మృతి ఇరానీ ఎంపీ అయ్యారు. ఈసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరిగి అమేథీ నుంచి పోటీ చేయనున్నారనే ప్రచారం గతంలో జోరుగా సాగినా అది కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ హైకమాండ్ స్మృతి ఇరానీ ఎదుట కేఎల్ శర్మను తమ అభ్యర్థిగా ప్రకటించింది. రాహుల్ గాంధీకి రాయ్ బరేలీ స్థానాన్ని అప్పగించింది. అదిమొదలు బీజేజీ ప్రతిపక్ష పార్టీపై మాటల దాడి చేస్తూనే ఉంది. స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఎందుకు పోటీకి దిగలేదంటూ ప్రశ్నిస్తోంది.దీనికి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సమాధానం ఇచ్చారు. కేఎల్ శర్మ 40 ఏళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నారని, గాంధీ కుటుంబం ఆధ్వర్యంలో పగలు రాత్రి పనిచేసిన శర్మను అమేథీ అభ్యర్థిగా ఎంపిక చేయడంలో తప్పేముంది? రాహుల్ గాంధీనే అమేథీకి ఎందుకు వెళ్లాలని, కేఎల్ శర్మ సరిపోతారని గెహ్లాట్ అన్నారు.రాహుల్ గాంధీని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయించాలని పార్టీ భావించిందని, అక్కడ రాహుల్ గెలుస్తారని అన్నారు. అమేథీలో కెఎల్ శర్మ విపక్షాలను ఎదుర్కొంటారని పేర్కొన్నారు. శర్మ అటు పార్టీ కోసం ఇటు ప్రజల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. సోనియా గాంధీ కూడా శర్మను మెచ్చుకున్నారని, అతనికి అమేథీ ప్రజల సమస్యల గురించి తెలుసని, అక్కడి సమస్యల పరిష్కారానికి ఆయన ఒక ప్రణాళిక రూపొందించారని గెహ్లాట్ వివరించారు. -
‘ డిబేట్‌కి ఎక్కడైనా రెడీ’.. ప్రియాంకా గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
లక్నో: కేంద్రమంత్రి, బీజేపీ అమేథీ అభ్యర్థిని స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీకి సవాల్ విసిరారు. ఏ ఛానెల్ అయినా, హోస్ట్ ఎవరైనా, టైం, ప్రదేశం, అంశం ఏదైనా తాను డిబేట్లో మాట్లాడటానికి బీజేపీ సిద్ధంగా ఉందని స్మృతి ఇరాని ప్రియాంకా గాంధీకి ఛాలెంజ్ చేశారు.‘‘నేను ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరికీ ఛాలెంజ్ చేస్తున్నా. ఛానెల్, యాంకర్, ప్రదేశం, టైం విషయం ఏదైనా డిబేట్ చేయడానికి బీజేపీ సిద్ధం. ఒకవైపు.. సోదరుడు, సోదరీ. మరోవైపు.. బీజేపీ అధికార ప్రతినిధి ఉంటారు. మా పార్టీ నుంచి అయితే సుధాంశు త్రివేది చాలు. వాళ్లకు అన్ని సమాధానాలు చెబుతారు’’అని స్మృతి ఇరానీ బుధవారం అమేథీలో సవాల్ చేశారు.దేశంలోని ముఖ్యమన అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెదవి విప్పరని ప్రియాంకా గాంధీ చేసిన ఆరోపణల నేపథ్యంలో స్మృతి ఇరానీ పైవిధంగా ఛాలెంజ్ విసిరారు. 2019లో స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 55 వేల మేజార్టీతో ఓడించారు. మరోసారి బీజేపీ స్మృతి ఇరానీకి అమేథీ టికెట్ కేటాయించింది. ఇప్పటికే స్మృతి ఇరానీ అమేథీ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం తిరిగి ప్రచాం చేశారు. మరోవైపు.. కాంగ్రెస్‌కు కంచుకోట స్థానమైన అమేథీలో నామినేషన్ల చివరి రోజు గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ సింగ్‌ను బరిలోకి దిపింది. ఇక.. అమేథీ, రాయ్ బరేలీలో గెలుపే లక్ష్యంగా ప్రియాంకా గాంధీ శరవేంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. -
పాక్‌తో రాహుల్‌కు సంబంధం ఏంటి: స్మృతి ఇరానీ
లక్నో: పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ ప్రశంసల అంశంపై స్పందిసస్తూ.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. మంగళవారం ఓ ర్యాలీలో పాల్గొన్న స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. అమెథీలో ప్రస్తుతం ఏకే 203 రైఫిల్స్ ఫ్యాక్టరీ ఉందని అన్నారు. వాటిని ఉపయోంగించి దేశ సరిహద్దుల వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదలను అంతం చేస్తామని తెలిపారు.‘‘పాక్ మాజీ మంత్రి ఆయన దేశం గురించి ఆందోళన పడాలి కానీ, అమేథీ కోసం కాదు. లోక్‌సభ ఎన్నికల్లో నేను కాంగ్రెస్ నేతతో పోటీ పడుతుంటే.. పాకిస్తాన్ నేత మాత్రం నన్ను ఓడించాలంటున్నారు. పాకిస్తాన్‌ను పాలించటం చేతకాని వాళ్లు.. అమేథీ గురించి ఆందోళన పడుతున్నారు.నా మాటలు పాక్ మంత్రికి చేరితే.. నేను ఒక్కటి చెప్పదల్చుకున్నా. అమేథీలో ప్రధాని మోదీ ఏకే 203 రైఫిల్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. వాటితో హరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదులను అంతం చేస్తాం’’ అని స్మృతి ఇరానీ అన్నారు. పాకిస్తాన్ మాజీ మంత్రి వ్యాఖ్యల రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పాకిస్తాన్‌తో రాహుల్ గాంధీకి ఉన్న సంబంధం ఏంటని నిలిదీశారు. భారత్‌లో ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు పొరుగు దేశాల మద్దతు కోరుతున్నారని విమర్శించారు. అమేథీలో స్మృతి ఇరానీకి పోటీగా కాంగ్రెస్ పార్టీ కిషోరి లాల్ సింగ్‌ను బరిలోకి దించిన విషయం తెలిసిందే. -
భయపడకు.. పారిపోకు: రాహుల్‌పై ప్రధాని మోదీ సెటైర్లు
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాయ్ బరేలీ పోటీ నిర్ణయంపై బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పశ్చిమ బెంగాల్లో ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. వయనాడ్‌లో ఓడిపోతాడని తెలిసే రాహుల్ రాయ్‌బరేలీకి పారిపోయారన్నారు. ఇవాళ ఆయనకు ఒక్కటే చెప్పదల్చుకున్నా. భయం వద్దు(డరో మత్).. పారిపోవద్దు(భాగో మత్).. అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. (బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని ఆరోపించే క్రమంలో తరచూ ‘భయం వద్దు డరో మత్’ అంటూ రాహుల్ గాంధీ చెబుతుంటారు).‘‘వాళ్ల అగ్రనేత పోటీకి భయపడతాడని నేను ముందే చెప్పా. ఆయన మాత్రమే కాదు.. ఆమె (సోనియా గాంధీ) కూడా పోటీ చేయడానికి ధైర్యం చేయలేదు. అందుకే ఆమె రాజ్యసభ వంకతో రాజస్థాన్ పారిపోయారు. ఇదే జరిగింది. ఇంతలా భయపడే వీళ్లు దేశమంతా తిరుగుతూ ప్రజల్ని భయపడొద్దని చెబుతున్నారు.వయనాడ్‌లో ఆయన ఓడిపోతారని నేను చెప్పా. ఆయన తన ఓటమిని గానే గుర్తించారు. అందుకే ఇప్పుడు మరో చోట పోటీ చేస్తున్నారు. నేను చెబుతున్నా.. భయపడకు, పారిపోకు’’ అంటూ ప్రధాని మోదీ ప్రసంగించారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి కాకుండా రాయ్ బరేలీ నుంచి పోటీ చేయడంపై బీజేపీ నేతలంతా స్పందిస్తున్నారు . అమేథీలో ఏం చేయని వారు.. రాయ్ బరేలీలో ఏం చేస్తారు? అని బీజేపీ అమేథీ అభ్యర్థి స్మృతి ఇరానీ నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమేథీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. అది చూసే సోనియా కుటుంబం పోటీ చేయకుండా పారిపోయింది. -
స్కూటర్‌పై తిరుగుతూ.. స్మృతీ ఇరానీ సందడి!
ఉత్తరప్రదేశ్‌లోని తన లోక్‌సభ నియోజకవర్గం అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్కూటర్‌పై తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. అలాగే పలువురితో సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ మీడియాకు కనిపించారు. బీజేపీ కార్యకర్తలతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు.స్మృతి ఇరానీ ఈరోజు (సోమవారం) అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. 2019లో ఆమె కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఓడించి, ఈ సీటును సొంతం చేసుకున్నారు. స్మృతి ఇరానీ ఆదివారం నాడు అయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకున్నారు. కాగా అమేథీ నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేయనున్నారనే విషయాన్ని కాంగ్రెస్ ఇంతవరకూ వెల్లడించలేదు. అమేథీ.. కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందింది. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. -
నేడు అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్
ఈరోజు (ఆదివారం) భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మహిళా నేత స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ లోక్‌సభ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు ఆమె అయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకోనున్నారు. అనంతరం ఆమె తన లోక్‌సభ నియోజకవర్గానికి వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం (ఏప్రిల్ 26) ప్రారంభమైంది. ఐదో దశలో మొత్తం 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది.అమేథీలో నామినేషన్‌కు చివరి తేదీ మే 3. దీంతో కాంగ్రెస్‌కు ఈ సీటు నుంచి పోటీచేయబోయే అభ్యర్థిని ప్రకటించడానికి ఎక్కువ సమయం లేదు. కాంగ్రెస్ పార్టీ అమేథీలో తన అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు. అయితే రాహుల్ గాంధీ ఈ స్థానం నుండి మరోసారి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమేథీ నియోజకవర్గం చాలాకాలంపాటు గాంధీ కుటుంబం ఆధీనంలో ఉంది. అయితే 2019లో రాహుల్‌ను ఓడించడం ద్వారా స్మృతి ఇరానీ ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యానికి స్వస్తి పలికారు. అయితే ఇప్పుడు స్మృతిని ఓడించి, కాంగ్రెస్ కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందేందుకు రాహుల్ ప్రయత్నించనున్నారని సమాచారం.అమేథీతో పాటు రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ఎవరికీ టిక్కెట్ కేటాయించలేదు. ఈ సీటు కూడా కాంగ్రెస్ సంప్రదాయ సీటు. 2019లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే. సోనియాగాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమె ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు నుంచి సోనియా కుమార్తె ప్రియాంక ఎన్నికల బరిలో దిగవచ్చని తెలుస్తోంది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తున్నప్పటికీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
సీటు కోసం కర్చీఫ్ వేసుకోవాలేమో.. రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ సెటైర్లు
లక్నో : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై అమేథీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన బావ రాబర్ట్ వాద్రాపై విమర్శలు గుప్పించారు. 15ఏళ్ల పాటు ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ గాంధీ అమోథీలో ఎలాంటి అభివృద్ది చేయలేదు. అలాంటిది రాబర్ట్ వాద్రా వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అధికారంలో ఉండగా చేయంది.. తాను కేవలం ఐదేళ్లలో చేసినట్లు తెలిపారు. బస్సులో సీటు కోసం ఖర్చీఫ్ వేసుకున్నట్లు అమోథీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్మృతి ఇరానీ మాట్లాడారు. జమనాలో బస్సు ప్రయాణంలో మరొకరు కూర్చోకుండా సీట్లలో కర్చీఫ్ వేసేవాళ్లు. రాహుల్ గాంధీ కూడా తన అమోథీ ఎంపీ సీటు కోసం కర్చీఫ్ వేయాల్సి ఉంటుందేమో.. ఎందుకంటే రాబర్ట్ వాద్రా అదే సీటుపై కన్నేశారని ఎద్దేవా చేశారు. పట్టుమని నెలరోజులు లేవు అమోథీలో ఎన్నికల పోలింగ్ సమయం పట్టుమని నెలరోజుల కూడా లేదు. కాంగ్రెస్ ఇంతవరకు అభ్యర్ధిని నిలబెట్టలేదు. ఇలాంటి చోద్యం ఎప్పుడూ చూడలేదు. ఎస్. రాహుల్ గాంధీ 15 ఏళ్లలో చేయంది నేను కేవలం ఐదేళ్లలో చేశాను అని స్మృతి ఇరానీ అన్నారు. పార్టీ ఆదేశిస్తే.. నేను ఆచరిస్తా అంతకుముందు.. కేరళలోని వయనాడ్ లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రాహుల్ గాంధీని పలు మీడియా ప్రతినిధులు ‘మీరు అమేథీ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? అని ప్రశ్నించారు. అందుకు పార్టీ ఆదేశాలకు ప్రకారం తాను పనిచేస్తాను’ అని బదులిచ్చారు. అమోథీలో నేనూ పోటీ చేస్తా రాబర్ట్ వాద్రా సైతం ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడితే అది అమోథీని ఎంచుకుంటానని తెలిపారు. ఆ నియోజకవర్గ ప్రజలు కూడా గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులే కావాలని కోరుకుంటారని వాద్రా అన్నారు. నా ఎంట్రీతో.. ఓటర్లు చేసిన తప్పును ఈ సందర్భంగా అమేథీలో పోటీ చేస్తే.. ప్రస్తుతం అమేథీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీని ఎన్నుకుని తప్పు చేశామని భావిస్తున్న ఓటర్లు.. నేను అమోథీ నుంచి పోటీ చేస్తే వారు చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. నేను పోటీ చేస్తే ఓటర్లు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వరుస రాజకీయ పరిణామాలపై స్మృతి ఇరానీ తాజాగా స్పందించారు. -
అమేథీ నుంచి బరిలోకి.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే!
దేశంలో ప్రస్తుతం ఎన్నికల సందడి నెలకొంది. లోక్‌సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయ వేడి నెలకొంది. నువ్వా-నేనా అన్నట్లు అధికార ప్రతిపక్షాలు పోటీపడుతున్నాయి. అభ్యర్ధుల ప్రకటన, ప్రచారాలో పార్టీలో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానం నుంచి పోటీపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీలోక్సభ స్థానానికి హస్తం పార్టీ ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ మీళ్లీ పోటీ చేస్తారా లేదా అనేది సస్పెన్స్ నెలకొంది. ఈ సందర్భంగా ఓ మీడియా సమావేశంలో అమేథీలో బీజేపీ నుంచి బరిలో దిగిన స్మృతి ఇరానీపై పోటీకి కాంగ్రెస్ నుంచి ఎవరూ నిలబడుతున్నారనే ప్రశ్న రాహుల్‌కు ఎదురైంది. దీనిపై ఆయన మాట్లాడుతూ... తాను పార్టీలో ఓ సైనికుడు మాత్రమేనని తెలిపారు. ఎన్నికల్లో పోటీ నిర్ణయాలు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తీసుకుంటుందని అన్నారు. ‘ఇది బీజేపీ ప్రశ్న. చాలా బాగుంది. పార్టీ అధిష్టానం నుంచి వచ్చినా ఏ ఆదేశాన్ని అయినా నేను అనుసరిస్తాను. మా పార్టీలో అభ్యర్థుల ఎంపిక నిర్ణయాలు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తీసుకుంటుంది’ అని తెలిపారు. కాగా ఒకప్పుడు అమేథీ గాంధీ కుటుంబానికి కంచుకోట. గతంలో రాహుల్ చిన్నాన్న సంజయ్ గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, ఆ తర్వాత తల్లి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో రాహుల్ హాట్రిక్ విజయం సాధించారు అయితే 2019 ఎన్నికల్లో ఫలితాలు తారుమరయ్యాయి. కాంగ్రెస్ నుంచి పోటీకి దిగిన రాహుల్‌పై బీజేపీ నుంచి స్మృతి ఇరానీ గెలుపొందారు. అయితే కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ అక్కడ గెలిచి.. పార్లమెంట్లో అడుగుపెట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ.. అమేథీ నుంచి కూడా పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.మరోవైపు దమ్ముంటే అమేథీ నుంచి పోటీ చేయాలంటూ రాహుల్‌కు స్మృతి ఇరానీ సవాల్ విసురుతున్నారు.ఇక కాంగ్రెస్ కంచుకోటలో ఎవరూ బరిలో దిగుతారో? మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. -
Smriti Zubin Irani: క్యోం కి స్మృతీ భీ కభీ అభినేత్రీ థీ
స్మృతి జుబిన్ ఇరానీ. ఇప్పుడు కేంద్ర మంత్రిగా సుపరిచితులు. ఒకప్పుడు హిందీ టీవీ సీరియల్ వీక్షకుల అభిమాన నటి. సంప్రదాయ కుటుంబం నుంచి వచి్చనా మోడల్‌గా, నటిగా రాణించారు. రాజకీయాల్లో స్వయంకృషితో ఎదిగారు. కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్‌గాందీనే మట్టికరిపించారు. ఈసారి కూడా అమేథీలో కాంగ్రెస్‌కు సవాల్ విసురుతున్నారు... రాజకీయ ప్రయాణం.. నటనతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న స్మృతీ 2003లో బీజేపీలో చేరారు. మహారాష్ట్ర బీజేపీ యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా చేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్పై ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి పోటీ చేసి ఓడారు. 2011లో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో యూపీలోని అమేథీ నుంచి రాహుల్ గాం«దీపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2017లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అమేథీపై బాగా దృష్టి పెట్టారు. నిత్యం స్థానికంగా ప్రజల్లో ఉన్నారు. కాంగ్రెస్‌పై, రాహుల్‌పై విమర్శలతో హోరెత్తించారు. 2019లో అమేథీలో రాహుల్‌ను ఓడించి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. అమేథీలో స్థిర నివాసం ఏర్పరుచుకుని అక్కడే ఉంటానని ప్రకటించారు. 2021లో మావాయి గ్రామంలో ఇల్లు కట్టుకున్నారు. ఇటీవలే గృహప్రవేశం చేశారు. ‘దమ్ముంటే అమేథీ నుంచి పోటీ చేయండి’ అంటూ మళ్లీ రాహుల్‌కు సవాలు విసురుతున్నారు. కేంద్రంలో మానవ వనరులు, సమాచార–ప్రసార, జౌళి శాఖ మంత్రిగా చేశారు. ప్రస్తుతం మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల మంత్రి. బహుభాషా ప్రావీణ్యం... స్మృతి 1976 మార్చి 23న ఢిల్లీలోని పంజాబీ కుటుంబంలో జని్మంచారు. తండ్రి అజయ్ కుమార్ మల్హోత్రా వ్యాపారి. తల్లి శిబానీ నే బాగ్చీ బెంగాలీ. ఢిల్లీలోని హోలీ చైల్డ్ ఆగ్జీలియమ్ స్కూల్లో చదివారు. తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా పాఠశాల విద్య కాగానే మోడలింగ్ వైపు వెళ్లారు. తర్వాత నటనలో అదృష్టం పరీక్షించుకునేందుకు ముంబైలో అడుగుపెట్టారు. పలు ఉత్పత్తులకు మోడల్‌గా చేస్తూనే నటిగా ప్రయతి్నంచారు. ఆ క్రమంలో సినిమా కష్టాలు పడ్డారు. పెద్ద కూతురుగా ఇంటి బాధ్యతలను తలకెత్తుకున్నారు. పలు సీరియళ్లలో నటించారు. క్యోం కీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్‌తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఒక టీవీ సీరియల్‌కు సహదర్శకత్వంతో పాటు పలు టీవీ షోలకు హోస్ట్‌గా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘జై బోలో తెలంగాణ’ సినిమాతో తెలుగు ప్రజలకూ పరిచయమయ్యారు. 2001లో జుబిన్ ఇరానీని పెళ్లాడారు. వీరికి కొడుకు జోహార్, కూతురు జోయిష్ ఉన్నారు. వైవిధ్యమైన కుటుంబ, సినీ నేపథ్యం కారణంగా ఆమె హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. వివాదాలకు కేరాఫ్ రకరకాల కారణాలతో స్మృతి తరచూ వివాదాల్లో పడుతుంటారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో చాందినీచౌక్ నుంచి పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్లో ఢిల్లీ యూనివర్సిటీ (స్కూల్ ఆఫ్ కరస్పాండెన్స్)లో 1996లో బీఏ చదివానని పేర్కొన్నారు. 2014, 2019ల్లో అమేథీ నుంచి పోటీ చేసినప్పుడేమో 1994లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌లో చేరినట్టు వెల్లడించారు. దాంతో ఆమె డిగ్రీలో చేరింది 1994లోనా, 1996లోనా, చదివింది బీఏనా, కామర్సా అనే విమర్శలొచ్చాయి. 2014లో మానవ వనరుల మంత్రి కావడంతో కనీసం డిగ్రీ లేని వ్యక్తి దేశానికి విద్యా మంత్రా అంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. సమస్య కోర్టు దాకా వెళ్లింది. ఈ వివాదాల నేపథ్యంలో ఆమె మానవ వనరుల నుంచి జౌళి శాఖకు మారారు. -
స్మృతి ఇరానీ Vs ప్రియాంక.. యూపీలో ఆసక్తికర సమరం!
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అంశంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి ఎవరు పోటీ చేస్తారనేది తేలియాల్సి ఉంది. కాగా, ముందు నుంచి ఈ స్థానంలో రాబర్ట్ వాద్రా పోటీ ఉంటారనే వార్తలు వినిపించినప్పటికీ అది జరగపోవచ్చు అని సమాచారం. కాగా, గాంధీ కుటుంబంతో విడదీయరాని బంధం ఉన్న అమేథీ, రాయబరేలీ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే అంశం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని ఈ విషయంలో ఒక హింట్ ఇచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలో ఉంటారని వెల్లడించారు. కాగా, ఆంటోని బుధవారం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమేథీ, రాయబరేలీ సీట్లపై ఎలాంటి ఊహాగానాలు వద్దు. యూపీ నుంచి గాంధీ కుటుంబమే పోటీ చేస్తారు. రాబర్ట్ వాద్రా అక్కడ పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు అని కామెంట్స్ చేశారు. దీంతో, ప్రియాంక లేదా రాహుల్ గాంధీ యూపీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రాహుల్ ఇప్పటికే కేరళలోని వయనాడ్ నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇక, అమేథీలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీని ఢీకొట్టేందుకు ప్రియాంకు బరిలోకి దింపుతారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ప్రియాంక కనుక అమేథీ నుంచి పోటీలో నిలిస్తే రాజకీయం ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది. మరోవైపు.. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా అమేథీ స్థానం కాంగ్రెస్‌కు దక్కిన విషయం తెలిసిందే. -
స్మృతి ఇరానీని ప్రశంసిస్తూ అరుణ్ గోవిల్ ఏమన్నారు?
రామాయణం సీరియల్లో రాముని పాత్రలో నటించి జనాదారణ పొందిన నటుడు అరుణ్ గోవిల్ యూపీలోని మీరట్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. తనకు ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నని అరుణ్ గోవిల్ తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ప్రశంసించారు. ఆమెను కలుసుకోవడం ఆనందంగా ఉందని, ఆమె మంచి వక్తగా రాణిస్తున్నారని అన్నారు. మీరట్‌లో బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన సునీతా వర్మ, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి దేవవ్రత్ త్యాగి (బీఎస్పీ) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఏప్రిల్ 26న మీరట్‌లో రెండో దశలో లోక్‌సభ ఓటింగ్ జరగనుంది. మీరట్‌లో సమాజ్‌వాదీ పార్టీ తన అభ్యర్థిని రెండుసార్లు మార్చింది. ముందుగా భాను ప్రతాప్ సింగ్‌ను రంగంలోకి దించింది. తరువాత అతుల్ ప్రధాన్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. చివరిగా సునీతా వర్మకు టికెట్ కన్ఫర్మ్ చేసింది. #WATCH | Meerut, Uttar Pradesh: BJP leader Arun Govil says, "I am getting very good response from the public..." On his meeting with Union Minister Smriti Irani, he says, "It was nice to meet her... She is a very good speaker..." pic.twitter.com/vDybXaoMH7 — ANI (@ANI) April 7, 2024 అరుణ్ గోవిల్ టీవీ సీరియల్ రామాయణంలో శ్రీరాముని పాత్రను పోషించారు. ఈ సీరియల్ తర్వాత, అరుణ్ గోవిల్ ప్రేక్షకాదరణ పొందారు. ముగ్గురు దిగ్గజ నేతలు బరిలోకి దిగిన మీరట్ లోక్‌సభ స్థానానికి గట్టిపోటీ నెలకొనే అవకాశం ఉంది. ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మ మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ భార్య. సునీతా వర్మ 2017లో బీఎస్పీ నుంచి మీరట్ మేయర్‌గా ఎన్నికయ్యారు. త్యాగి వర్గం నుండి వచ్చిన దేవవ్రత్ త్యాగిని బిఎస్పీ తన అభ్యర్థిగా ఎన్నిక చేసింది. -
రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు
చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ గెలుపొందే దిశగా కీలక నేతలు, అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్ మొదలైనవారు బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి కీలకోపన్యాసాలు చేస్తున్నారు. తాజాగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి 'స్మృతి ఇరానీ' చెన్నైలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చెన్నైలోని వెప్పేరి జిల్లాలోని వైఎంసీఏ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ చెన్నై బీజేపీ అభ్యర్థి వినోజ్ పీ సెల్వంకు మద్దతుగా స్మృతి ఇరానీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగిస్తూ స్మృతి ఇరానీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రాహుల్ గాంధీ మాదిరిగా ఎందరో వచ్చారు, పోయారు. అయితే హిందూస్తాన్ మాత్రం అలాగే ఉందని స్మృతి ఇరానీ అన్నారు. జై శ్రీరామ్ అంటూనే ప్రజలను చంపినవారు ఇండియా కూటమిలో ఉన్నారు. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా వీరు దూరంగా ఉన్నారని అన్నారు. బీజేపీతోనే దేశం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. దేశం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా అది బీజేపీతోనే సాధ్యమవుతుంది. భారతదేశం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ దేశాన్ని మోదీ చేతికి అప్పగించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 'యోగి ఆదిత్యనాథ్' కూడా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్నారు. -
వయనాడ్‌లో బీజేపీకి మద్దతుగా స్మృతి ఇరానీ ప్రచారం!
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సురేంద్రన్ నామినేషన్ కార్యకమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పాల్గొననున్నారు. నామినేషన్‌కు ముందు జరిగే రోడ్ షోలో స్మృతి ఇరానీ కూడా పాల్గొననున్నారు. అలాగే బీజేపీ అభ్యర్థికి మద్దతుగా స్మృతి ఇరానీ ప్రచారం చేయనున్నారు. వయనాడ్ నుంచి సీపీఐ డి రాజా భార్య అన్నీ రాజాను ఎన్నికల బరిలో నిలిపింది. దీంతో వయినాడ్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. వయనాడ్ నుండి కె సురేంద్రన్ అభ్యర్థిత్వాన్ని గత వారం బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్నారు. బుధవారం ఆయన ఇక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. 2019లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి గెలిచారు. అదేసమయంలో యూపీలోని అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయాడు. కోజికోడ్ జిల్లాలోని ఉలయేరి నివాసి అయిన కున్నుమేల్ సురేంద్రన్ 2020 నుంచి కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. భారతీయ జనతా యువమోర్చా వయనాడ్ జిల్లా అధ్యక్షునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో పతనంతిట్ట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కె సురేంద్రన్ కేంద్ర మంత్రి వి మురళీధరన్‌కు అత్యంత సన్నిహితుడు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మంజేశ్వరం నియోజకవర్గం నుంచి కేవలం 89 ఓట్ల తేడాతో సురేంద్రన్ ఓడిపోయారు. -
ఇల్లు.. ఓటు.. మాట నిలబెట్టుకున్న స్మృతి ఇరానీ!
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుని స్థానిక ఓటరుగా మారారు. ఎంపీ ప్రతినిధి విజయ్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. గౌరీగంజ్‌లోని మెదన్ మావాయి గ్రామంలో ఇల్లు కట్టుకున్న స్మృతి ఇరానీ అక్కడ ఓటరు కావడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడామె ఆ గ్రామంలో ఓటరుగా మారారని విజయ్ గుప్తా తెలిపారు. స్మృతి ఇరానీ అమేథీని తన కుటుంబంగా భావిస్తారు. అమేథీ కుటుంబం మధ్య నివసించేందుకు ఆమె ఇక్కడే తన నివాసాన్ని నిర్మించుకున్నారని తెలిపారు. ఇంటి నిర్మాణంతో ఆమె అమేథీ నుంచి ఓటరుగా నిలిచే ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం లాంఛనాలు పూర్తయ్యాయని గుప్తా తెలిపారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని గౌరీగంజ్ అసెంబ్లీ స్థానంలోని మెదన్ మావాయి గ్రామంలోని బూత్ నంబర్ 347లో ఓటరుగా మారారు. గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇంట్లోకి స్మృతి ఇరానీ గత ఫిబ్రవరి 22న గృహ ప్రవేశం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి స్మృతి ఇరానీని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. 2019లో ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని సుమారు 55,000 ఓట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించారు. కాగా కాంగ్రెస్ ఇప్పటి వరకు ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. మే 20న అమేథీలో ఐదో దశలో పోలింగ్ జరగనుంది. -
ఎవరు నిజమైన రాహుల్ గాంధీ?: స్మృతి ఇరానీ
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ద్వంద వైఖరిపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై సంఘీభావం తెలుపుతారు. అదేవిధంగా తెలంగాణలో మాట్లాడినప్పుడు మాత్రం కేజ్రీవాల్ అవినితీ పరుడని అంటారని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. ‘రాహుల్ గాంధీ ద్వంద వైఖరిలో మాట్లాడానికి సంబంధించి నేను ఆధారాలు ఇవ్వగలను. కేజ్రీవాల్‌తో పాటు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అవినీతిపరుడని 2, జూలై, 2023లో తెలంగాణ రాహుల్ మాట్లాడుతూ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి అన్ని విషయాలు దర్యాప్తు సంస్థలకు తెలుసన్నారు. అవినీతి సొమ్మును ఆప్ గోవా ఎన్నికలకు వినియోగించిందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అన్నారు. వీరిలో ఎవరు నిజం చెబుతున్నారు?’ అని స్మృతి ఇరానీ నిలదీశారు. Smt. @smritiirani addresses a press conference at party headquarters in New Delhi. https://t.co/jITZyxd3dL — BJP (@BJP4India) March 22, 2024 ఎవరు నిజమైన రాహుల్ గాంధీ? తెలంగాణలో మాట్లాడే రాహుల్ గాంధీ? లేదా ఢిల్లీలో మాట్లాడే రాహుల్ గాంధీ? అని ఆమె ప్రశ్నించారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి, అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఎంతటి అవినీతికి పాల్పడతారో అరవింద్ కేజ్రీవాల్‌ను చూస్తే తెలుస్తోందని స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావటంతో రాహుల్ శుక్రవారం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆయన్ను అరెస్ట్ చేశారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ ఈడీ రిమాండ్‌లో ఉన్నారు. అదేవిధంగా ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏడురోజుల రిమాండ్ పూర్తి చేసుకోగా... తాజాగా (శనివారం) రౌస్ అవెన్యూ కోర్టు మరో మూడురోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది.