ఉత్తరప్రదేశ్‌లోని తన లోక్‌సభ నియోజకవర్గం అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్కూటర్‌పై తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. అలాగే పలువురితో సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ మీడియాకు కనిపించారు. బీజేపీ కార్యకర్తలతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు.
స్మృతి ఇరానీ ఈరోజు (సోమవారం) అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. 2019లో ఆమె కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఓడించి, ఈ సీటును సొంతం చేసుకున్నారు. స్మృతి ఇరానీ ఆదివారం నాడు అయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకున్నారు. కాగా అమేథీ నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేయనున్నారనే విషయాన్ని కాంగ్రెస్ ఇంతవరకూ వెల్లడించలేదు. అమేథీ.. కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందింది. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది.