ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వారిలో స్మృతి ఇరానీ ఒకరు. ఓటమి తర్వాత ఆమె చాలా అరుదుగా బహిరంగంగా కనిపించారు. ఈ నేపధ్యంలో స్మృతి ఇరానీ ప్రస్తుతం ఎక్కడున్నారని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నారు. అక్కడ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ‘మోడీ 3.0’ విజయోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్మృతీ ఇరానీ లండన్ చేరుకున్నారు. అక్కడి అభిమానులు ఆమెకు ఘస స్వాగతం పలికారు. ఈ సమయంలో పలు దేశభక్తి నినాదాలు చేశారు.
స్మృతి ఇరానీ సభలో మాట్లాడుతూ తనకు ఇక్కడ బెంగాలీ, గుజరాతీ స్నేహితులు ఉన్నారని తెలిపారు. తరువాత మలయాళంలో మాట్లాడుతూ కేరళకు చెందినవారిని పలుకరించారు. అలాగే మహారాష్ట్ర ప్రజలను మరాఠీలో పలకరించారు. ఈ సమయంలో అక్కడున్న వారిలో కొందరు జై మహారాష్ట్ర, జై శివాజీ మహారాజ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్మృతి మాట్లాడుతూ భారతదేశం విభిన్న భాషలు, సంస్కృతుల మిళితం అని, తాను భారతీయురాలిని అయినందుకు గర్వపడుతున్నానని అన్నారు.
#WATCH लंदन, ब्रिटेन: भाजपा नेता स्मृति ईरानी ने कहा, "...विभिन्न आवाजों और संस्कृतियों के इस सम्मिश्रण के बावजूद, एक आवाज ही आवाज गूंज रही है, 'मैं भारतीय हूं'..." https://t.co/U6IBYD822w pic.twitter.com/P9ZCATcHJx
— ANI_HindiNews (@AHindinews) June 23, 2024
Comments
Please login to add a commentAdd a comment