scooter
-
ఓలా ఎలక్ట్రిక్.. 95% షోరూమ్‌లకు ట్రేడ్ సర్టిఫికేట్లు లేవు!
ఓలా ఎలక్ట్రిక్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీకి చెందిన 95 శాతం షోరూమ్‌లకు ట్రేడ్ సర్టిఫికేట్లు లేవని బ్లూమ్‌బర్గ్ న్యూస్ వార్తలు ప్రచురించింది. అందులోని వివరాల ప్రకారం మొత్తం 4,000 షోరూమ్‌ల్లో 3,400లకు సంబంధించిన డేటా అందుబాటులో ఉండగా వాటిలో కేవలం 100 షోరూమ్‌లకు మాత్రమే భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రేడ్ సర్టిఫికేట్లు ఉన్నట్లు గుర్తించారు. దీని అర్థం ఓలా ఎలక్ట్రిక్ 95 శాతం స్టోర్లలో నమోదుకాని ద్విచక్ర వాహనాలను ప్రదర్శించడానికి, విక్రయించడానికి, టెస్ట్ రైడ్లను అందించడానికి లేదా రవాణా చేయడానికి అవసరమైన ధృవీకరణ లేదు. ఈ సర్టిఫికేట్లు లేకపోవడం రెగ్యులేటరీ నిబంధనలకు కంపెనీ కట్టుబడి ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.2022 నుంచి ఓలా ఎలక్ట్రిక్ తన షోరూమ్‌లను విస్తరించడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. డిజిటల్-ఓన్లీ సేల్స్ మోడల్(భౌతికంగా షోరూమ్ ఉండకుండా కేవలం డిజిటల్ ద్వారానే ఉత్పత్తులను విక్రయించడం) నుంచి బ్రిక్-అండ్-మోర్టార్(షోరూమ్‌లను ఏర్పాటు చేయడం) వంటి విధానానికి మారింది. ఈ మార్పువల్ల కస్టమర్ అనుభవాన్ని పెంచడం, సేవా సంబంధిత సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో భారతదేశం అంతటా సుమారు 4,000 ప్రదేశాలకు విస్తరించింది.రెగ్యులేటరీ చర్యలుఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని రవాణా అధికారులు చర్యలు చేపట్టారు. సంబంధిత రాష్ట్రాల్లోని కంపెనీ షోరూమ్‌ల్లో దాడులు నిర్వహించి, వాటిని మూసివేసి, వాహనాలను సీజ్ చేసినట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అదనంగా ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ రాష్ట్ర స్థాయి రవాణా అధికారుల నుంచి షోకాజ్ నోటీసులను అందుకుంది.ఇదీ చదవండి: రూ.115-125 లక్షల కోట్ల రుణ సమీకరణ.. ఎందుకంటే..ఓలా ఎలక్ట్రిక్ స్పందన..ఓలా ఎలక్ట్రిక్ దర్యాప్తు ఫలితాలను ఖండించింది. కంపెనీ కార్యకలాపాలపై మార్కెట్లో వస్తున్న వార్తలు పూర్తిగా తప్పు అని, పక్షపాతంతోనే ఇలాంటి వార్తలను వైరల్ చేస్తున్నారని తేల్చి చెప్పింది. కంపెనీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, గోదాములు మోటారు వాహనాల చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే షోరూమ్‌ల్లో అవసరమైన ట్రేడ్ సర్టిఫికేట్లు ఉన్నాయో లేదో మాత్రం నేరుగా ప్రస్తావించలేదు. -
టీవీఎస్ జూపిటర్ కొత్త బండి లాంచ్
టీవీఎస్ మోటార్ కంపెనీ 2025 టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ తాజా ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. అధునాతన ఎమిషన్ టెక్నాలజీలను ఇందులో టీవీఎస్ వినియోగించింది. కొత్త టీవీఎస్ జూపిటర్ 110 బేస్ డ్రమ్ వేరియంట్ ప్రారంభ ధరను రూ .76,691గా (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది.వేరియంట్లు.. ధరలు2025 టీవీఎస్ జూపిటర్ 110 విభిన్న కస్టమర్ ప్రాధాన్యతలను తీర్చడానికి నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ డ్రమ్ వేరియంట్ ధర రూ.76,691. ఇది అన్నింటిలో కాస్త తక్కువ ఖరీదు మోడల్. డ్రమ్ అల్లాయ్ వేరియంట్ ధర రూ.82,441. ఇది మెరుగైన లుక్, మన్నిక కోసం అల్లాయ్ వీల్స్ ను అందిస్తుంది. డ్రమ్ ఎస్ఎక్స్సీ వేరియంట్ ధర రూ.85,991. ఇందులో అదనపు స్టైలింగ్, కన్వీనియన్స్ ఫీచర్లు ఉన్నాయి. డిస్క్ ఎస్‌ఎక్స్‌సి వేరియంట్ రూ .89,791 ధరతో మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో వస్తుంది.OBD-2B ప్రయోజనాలుOBD-2B (ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్స్) టెక్నాలజీ అనేది సరికొత్త అప్ గ్రేడ్. ఇది క్లిష్టమైన ఇంజిన్ ఉద్గార పారామీటర్ల రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తుంది. అధునాతన సెన్సార్లతో కూడిన టీవీఎస్ జూపిటర్ 110 థ్రోటిల్ రెస్పాన్స్, ఎయిర్-ఫ్యూయల్ రేషియో, ఇంజిన్ టెంపరేచర్, ఫ్యూయల్ క్వాంటిటీ, ఇంజిన్ వేగాన్ని ట్రాక్ చేయగలదు. ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU) సరైన పనితీరు, మెరుగైన మన్నిక, తక్కువ ఉద్గారాలను ధృవీకరించడానికి ఈ డేటాను రియల్ టైమ్ లో ప్రాసెస్ చేస్తుంది. ఇది స్కూటర్ ను దాని జీవితచక్రం అంతటా క్లీనర్‌గా, మరింత పర్యావరణ అనుకూలమైనదిగా చేస్తుంది.ఇంజిన్, పనితీరుకొత్త టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్లో 113.3సీసీ, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజన్ ఇచ్చారు. ఇది 6,500 ఆర్పీఎం వద్ద 5.9 కిలోవాట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ అసిస్ట్ తో 5,000 ఆర్పీఎం వద్ద 9.8 ఎన్ఎం టార్క్, 5,000 ఆర్పీఎం వద్ద 9.2 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్మూత్ యాక్సిలరేషన్, ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. సౌకర్యవంతమైన, స్థిరమైన రైడ్ కోసం రూపొందించిన ఈ స్కూటర్లో 1,275 మిమీ వీల్ బేస్, 163 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది.ఇదీ చదవండి: నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త మైలురాయిడిజైన్, ఫీచర్లుటీవీఎస్ జూపిటర్ 110లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, డీఆర్ఎల్లతో కూడిన ఎల్ఈడీ హెడ్లైట్లు, కాల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, నావిగేషన్, ఐగో అసిస్ట్, హజార్డ్ ల్యాంప్స్, వాయిస్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది రెండు వైపులా 12-అంగుళాల వీల్స్ ఉంటాయి. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు , వెనుక భాగంలో మోనో-షాక్ ను కలిగి ఉంది. రెండు వీల్స్‌కు డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ లు అధిక ట్రిమ్ లలో లభిస్తాయి. -
ఒక స్కూటర్ ట్రాఫిక్ చలాన్లు 311
బెంగళూరు: అరవీర భయంకరంగా బ్యాటింగ్ చేసే బ్యాటర్ క్రికెట్ మైదానంలో 300 పరుగులు చేస్తే అద్భుతం అంటాం. అయితే ఒక గేర్‌లెస్ స్కూటర్ యజమాని క్రికెట్ గ్రౌండ్లో కాకుండా నడిరోడ్డుపై ట్రిపుల్ సెంచరీచేశాడు. అయితే అది పరుగుల రూపంలో కాకుండా ట్రాఫిక్ చలాన్ల రూపంలో. ఒకే స్కూటర్‌పై ఏకంగా 311 ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు ఉండటం చూసి కర్ణాటకలోని వాహన వినియోగదారులు ఔరా అని అచ్చెరువొందారు. ఈ ఘటనకు బెంగళూరు మహానగరం వేదికైంది. సోమవారం బెంగళూరు సిటీ మార్కెట్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఈ స్కూటర్ యజమాని ఈ 311 చలాన్లకు జరిమానా కింద రూ.1,61,500 కట్టేసి జప్తులో ఉన్న వాహనాన్ని తీసుకెళ్లడంతో ఈ కథ సుఖాంతంగా ముగిసింది. ఇన్ని చలాన్లు ఎలా ? కలాసిపాళ్య ప్రాంతానికి చెందిన పెరియస్వామికి ఒక గేర్‌లెస్ స్కూటర్ ఉంది. ఇతను ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారం చేస్తాడు. ఇతనికి సమీప బంధువు సుదీప్ వ్యాపార భాగస్వామిగా ఉన్నాడు. సుదీప్‌కు తరచూ స్కూటర్‌పై వెళ్తూనే ఫోన్ మాట్లాడే అలవాటు ఉంది. హెల్మెట్ అస్సలు ధరించడు. ట్రావెల్ ఏజెన్సీ వ్యవహారాలన్నీ బండితోపాటే ఫోన్లోనే నడిపిస్తాడు. అత్యధికంగా ఇతను నడిపేటప్పుడు ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు నమోదయ్యాయి. రెడ్ సిగ్నల్ దాటి వెళ్లడం, రాంగ్ రూట్, హెల్మెట్ ధరించకపోవడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ ఇలా పలు రకాల చలాన్లు అలా పడుతూనే ఉన్నాయి. సుదీప్గానీ, స్కూటర్ యజమాని పెరియస్వామిగానీ ఏనాడూ ఈ చలాన్లు కట్టలేదు. దీంతో చలాన్లు చాంతాడంత పెరిగిపోయాయి. పెరియస్వామి, సుదీప్, మరో వ్యక్తి ఈ స్కూటర్‌ను వాడినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి ఫిర్యాదుతో శిభమ్ అనే వ్యక్తి సరదాగా చలాన్లను ఆన్లైన్లో చెక్ చేస్తున్న సమయంలో ఈ స్కూటర్ నంబర్‌ప్లేట్ మీద వేల రూపాయల చలాన్లు నమోదైన విషయం గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో శిభమ్ ఇటీవల ఒక భారీ పోస్ట్ పెట్టారు. ‘‘ఈ స్కూటర్‌పై నమోదైన చలాన్ల సంఖ్యను గత ఏడాది కాలంగా గమనిస్తూ ఉన్నా. ఎప్పటికప్పుడు కొత్త చలాన్లు వస్తూనే ఉన్నాయి. కట్టాల్సిన జరిమానా పెరుగుతూనే ఉంది. ఇప్పుడది రూ.1లక్ష నుంచి రూ.1,60,000 దాటింది. ఇప్పటికైనా పోలీసులు మేలుకొని దానిని సీజ్ చేస్తారా? లేదంటే కొత్త రికార్డ్ సృష్టించేదాకా అలాగే రోడ్లపై తిరగనిస్తారా?’’అంటూ అతను చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. విషయం చివరకు పోలీసులకు తెలియడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఓనర్‌ను పిలిపించి స్కూటర్‌ను స్వాదీనం చేసుకున్నారు. అప్పటికిగానీ ఓనర్‌కు ఈ విషయం తెలియలేదు. పోలీస్‌స్టేషన్‌కు బంధువు సుదీప్‌ను రప్పించి వాళ్ల ముందే చీవాట్లు పెట్టినట్లు వార్తలొచ్చాయి. 311 చలాన్లను ఒకేసారి ప్రింట్ తీస్తే 20 అడుగుల పొడువు పేపర్ బయటికొచి్చంది. ఎట్టకేలకు హెల్మెట్ వందల చలాన్ల గేర్‌లెస్ స్కూటర్ అంశం నగరంలో హాట్‌టాపిక్‌గా మారడంతో పోలీసులు వెంటనే యజమానితో జరిమానా మొత్తాన్ని కట్టేలా ఒప్పించినట్లు వార్తలొచ్చాయి. సోమవారం సుదీప్ ఈ మొత్తాన్ని కట్టేసి వాహనాన్ని వెంటతీసుకెళ్లారు. ఈ సందర్భంగా సుదీప్ ఒక కొత్త హెల్మెట్‌ను ధరించారు. ‘‘ఇకనైనా చలాన్ల సెంచరీలు కొట్టడం ఆపండి’’అని పోలీసులు అతనికి హితబోధ చేసి పంపించారు. జరిమానా కట్టించుకుని ఊరకే వదిలేయకుండా ఇలాంటి వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కొందరు నెటిజన్లు డిమాండ్‌చేశారు. -
తక్కువ ధర.. మంచి మైలేజ్: ఇదిగో టాప్ 5 స్కూటర్స్
చాలామంది తక్కువ ధర వద్ద ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ఈ తరహా వాహనాలను మార్కెట్లో లాంచ్ చేశాయి. ఈ కథనాల్లో రూ. 1 లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే.. మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్లను గురించి తెలుసుకుందాం.యమహా రే జెడ్ఆర్ 125 (Yamaha Ray ZR 125)యమహా కంపెనీ మార్కెట్లో లాంచ్ చేసిన 'రే జెడ్ఆర్ 125' రూ.1 లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే స్కూటర్లలో ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 87,800 (ఎక్స్ షోరూమ్). 52 కిమీ / లీ మైలేజ్ ఇచ్చే ఈ స్కూటర్ 125 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 8.2 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 5.2 లీటర్ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఇందులో ఉంటుంది.సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 125 (Suzuki Burgman Street 125)రూ. 96,800 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న.. సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 125 ఒక లీటరుకు 50 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో 124 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ 8.7 పీఎస్ పవర్ అందిస్తుంది. మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్న బర్గ్‌మన్ స్ట్రీట్ 125 ఏకంగా 5.5 లీటర్ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది మార్కెట్లోని ఇతర స్కూటర్ల కంటే భిన్నంగా ఉంటుంది.యమహా ఫాసినో 125 (Yamaha Fascino 125)యమహా ఫాసినో 125 ధర రూ. 83000 నుంచి రూ. 97500 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఆరు వేరియంట్లలో లభించే ఈ స్కూటర్ 49 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 125 సీసీ ఇంజిన్ 6500 rpm వద్ద 8.2 పీఎస్ పవర్ అందిస్తుంది. రోజువారీ వినియోగానికి ఉపయోగపడే స్కూటర్లలో ఇది కూడా ఒకటి.హీరో ప్లెజర్ ప్లస్ (Hero Pleasure Plus)హీరో ప్లెజర్ ప్లస్ ధర రూ. 70,500 నుంచి రూ. 74,000 (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. 50 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ స్కూటర్ 4.8 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. 110 సీసీ ఇంజిన్ ద్వారా ఇది 8.15 పీఎస్ పవర్ అందిస్తుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్.. రైడర్లకు కావలసిన ఫీచర్స్ కలిగి ఉంటుంది.సుజుకి అవెనిస్ 125 (Suzuki Avenis 125)మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో సుజుకి అవెనిస్ 125 ఒకటి. ఇది 49.6 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 94,500 నుంచి రూ. 95,300 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ స్కూటర్ 124 సీసీ ఇంజిన్ కలిగి 8.7 పీఎస్ పవర్ అందిస్తుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది. -
60 కిమీ మైలేజ్: రూ. లక్ష కంటే తక్కువే..
భారతదేశంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో చాలామంది ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో లక్ష రూపాయల కంటే తక్కువ ధరలో లభించే.. అధిక మైలేజ్ ఇచ్చే స్కూటర్లను గురించి తెలుసుకుందాం.టీవీఎస్ జుపీటర్ 125 (TVS Jupiter 125)మార్కెట్లో అధిక అమ్మకాలను పొందుతూ.. ఎందోమందిని ఆకర్షిస్తున్న టీవీఎస్ జుపీటర్ 125 ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్ల జాబితాలో ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 96000 (ఎక్స్ షోరూమ్). ఇది 60 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 124.8 సీసీ ఇంజిన్ ద్వారా 8.15 Bhp పవర్, 10.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులో స్టోరేజ్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రత్యేకించి రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.యమహా ఫాసినో 125 (Yamaha Fascino 125)రూ.79990 ప్రారంభ ధర వద్ద లభించే యమహా ఫాసినో 125 సీసీ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. కాబట్టి ఇది పెట్రోల్, విద్యుత్ రెండింటిలోనూ నడుస్తుంది. ఇది 66 కిమీ / లీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇది మంచి డిజైన్, రైడర్లకు కావలసిన ఫీచర్స్ పొందుతుంది.ఇదీ చదవండి: రూ. 22.95 లక్షల బీఎండబ్ల్యూ బైక్హోండా యాక్టివా 6జీ (Honda Activa 6G)భారతదేశంలో యాక్టివా 6జీ అనేది హోండా మోటార్‌సైకిల్ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లలో ఒకటిగా ఉంది. ఇది 109.51 సీసీ ఇంజిన్ ద్వారా 7.73 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు. దీని టాప్ స్పీడ్ గంటకు 85 కిమీ. 106 కేజీల బరువున్న ఈ స్కూటర్ 60 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 78000 నుంచి రూ. 84000 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. -
మార్కెట్లోకి హీరో కొత్త స్కూటర్
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp).. న్యూ డెస్టినీ 125 (New Destini 125) స్కూటర్‌ను విడుదల చేసింది. దీంతో 125సీసీ స్కూటర్ మార్కెట్లో విస్తృత మార్పులకు శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సాంకేతికత, అసాధారణమైన మైలేజ్, టైమ్‌లెస్ డిజైన్‌ను మిళితం చేస్తూ పట్టణ వాహనదారుల కోసం దీన్ని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.హీరో న్యూ డెస్టినీ 125 స్కూటర్.. డెస్టిని 125 వీఎక్స్, డెస్టిని 125 జెడ్ఎక్స్, డెస్టిని 125 జెడ్ఎక్స్ ప్లస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ప్రారంభ ధరలు (ఢిల్లీ ఎక్స్-షోరూమ్) వరుసగా రూ.80,450, రూ.89,300, రూ.90,300.ప్రత్యేకంగా పట్టణ వాహనదారుల అవసరాలను తీర్చడానికి రూపొందించిన న్యూ డెస్టినీ 125.. వాహనదారుల భద్రత, సౌలభ్యం కోసం 30 పేటెంట్ అప్లికేషన్లతోపాటు ఇల్యూమినేటెడ్ స్టార్ట్ స్విచ్‌లు, ఆటో-కాన్సల్ వింకర్ల వంటి సరికొత్త ఫీచర్లతో వచ్చింది.‘హీరో డెస్టిని 125 అనేది మా ఆవిష్కరణ-ఆధారిత విధానానికి, పర్యావరణ అనుకూల చైతన్యాన్ని అందించడంలో మా నిబద్ధతకు నిదర్శనం. 59 కి.మీ మైలేజ్, అధునాతన ఫీచర్లతో ఈ స్కూటర్ ఆధునిక రైడర్లకు గేమ్-ఛేంజర్’ హీరో మోటోకార్ప్ ఇండియా బిజినెస్ యూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ పేర్కొన్నారు. -
సరికొత్తగా హోండా యాక్టివా 125
గురుగ్రామ్: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా అధునాతన ఫీచర్లతో సరికొత్త యాక్టివా 125 స్కూటర్‌ను విడుదల చేసింది. రూ.94,422 ధరతో డీఎల్ఎక్స్, రూ.97,146 ధరతో హెచ్–స్మార్ట్ అనే రెండు వేరియంట్లలో ఇది లభిస్తుంది. బ్లూటూత్ అనుసంధానంతో 4.2 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే కలిగి ఉంది. 123.99 సీసీ సామర్థ్యం కలిగిన సింగిల్ సిలిండర్ పీజీఎం–ఎఫ్ఐ ఇంజిన్‌తో తయారైంది. ఇది 6.20 కిలోవాట్ల శక్తిని, 10.5ఎన్ఎం టార్క్ విడుదల చేస్తుంది. యూఎస్బీ టైప్–సీ చార్జింగ్ సదుపాయం ఉంది. పర్ల్ ఇగ్నోస్ బ్లాక్, మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పర్ల్ సిరెన్ బ్లూ, రెబల్ రెడ్ మెటాలిక్, పర్ల్ ప్రీసియఎస్ వైట్ రంగుల్లో లభిస్తుంది. ఈ సరికొత్త 2025 హోండా యాక్టివా 125 స్కూటర్ దేశవ్యాప్తంగా అన్ని డీలర్ల వద్ద అందుబాటులో ఉందని హెచ్ఎంఎస్ఐ తెలిపింది. -
బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్లు.. చవక మాత్రమే కాదు!
ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయల స్కూటర్ లభిస్తోంది. రూ.14.90 లక్షలకు కూడా స్కూటర్ లభిస్తోంది. దేశీయ విఫణిలో ఎన్నెన్ని స్కూటర్లు అందుబాటులో ఉన్నా.. కొనుగోలుదారులు మాత్రం తక్కువ ధర వద్ద లభించే స్కూటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కథనంలో సరసమైన టాప్ 5 స్కూటర్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.హీరో ప్లెజర్ ప్లస్మహిళలకు ఇష్టమైన స్కూటర్ల జాబితాలో ఒకటైన 'హీరో ప్లెజర్ ప్లస్' సరసమైన స్కూటర్లలో ఒకటి. దీని ధర రూ. 70577. రెండు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్కూటర్ 110 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 Bhp పవర్, 8.7 Nm టార్క్ అందిస్తుంది. దీనిని మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా రోజువారీ వినియోగం కోసం కొనుగోలు చేస్తారు.టీవీఎస్ జెస్ట్ 110టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన జెస్ట్ 110 స్కూటర్ ధర మార్కెట్లో రూ. 73728 మాత్రమే. ఇది కూడా రెండు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.7 Bhp పవర్, 8.8 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన స్కూటర్ల జాబితాలో ఒకటిగా ఉంది.హోండా డియోఅతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన లేదా అత్యధిక అమ్మకాలు పొందిన స్కూటర్ల జాబితాలో ఒకటి ఈ హోండా డియో. ఈ స్కూటర్ ధర రూ. 75409. ఇది మూడు వేరియంట్లు, తొమ్మిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్కూటర్లోని 109 సీసీ ఇంజిన్ 7.75 Bhp, 9.03 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మార్కెట్లో ఇప్పటికి 30 లక్షల కంటే ఎక్కువ హోండా డియో స్కూటర్లు అమ్ముడైనట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే దీనికి భారతదేశంలో ఎంత డిమాంద్ ఉందో అర్థం చేసుకోవచ్చు.హీరో జూమ్ (Hero Xoom)హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన జూమ్ స్కూటర్ 110 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.05 Bhp పవర్, 8.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 75656. ఈ స్కూటర్ చూడటానికి కొంత ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది. ఇది నాలుగు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: తక్కువ ధరతో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే CNG కార్లుహీరో డెస్టినీ ప్రైమ్ఇక చివరగా మన జాబితాలో చివరి సరసమైన స్కూటర్ 'హీరో డెస్టినీ ప్రైమ్'. ఈ స్కూటర్ ధర రూ. 76,806. ఇందులో 124.6 సీసీ ఇంజిన్ 9 Bhp పవర్, 10.36 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం ఒక వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. కానీ మూడు కలర్ ఆప్షన్స్ పొందుతుంది. -
టాప్ 10 స్కూటర్లు..
టూవీలర్లలో స్కూటర్లది ప్రత్యేకమైన విభాగం. అన్నివర్గాల వారూ స్కూటర్లను నడిపేందుకు ఇష్టపడతారు. ఈ క్రమంలో వాటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన అక్టోబర్‌లో జరిగిన విక్రయాల ఆధారంగా టాప్ 10 స్కూటర్లు ఏవో ఇక్కడ తెలుసుకుందాం..ఆటో న్యూస్ వెబ్సైట్ రష్లేన్ నివేదిక ప్రకారం.. గత అక్టోబర్‌లో టాప్ 10 స్కూటర్ల అమ్మకాలు 6,64,713 యూనిట్లతో ఏడాది ప్రాతిపదికతోపాటు అంతక్రితం నెలతో పోల్చి చేసినా మెరుగయ్యాయి. ఇవి గతేడాది అక్టోబర్‌లో 5,22,541 యూనిట్లు, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 6,05,873 యూనిట్లు అమ్ముడుపోయాయి.ఇక అక్టోబర్ నెలలో ఏ స్కూటర్ ఎన్ని యూనిట్లు అమ్ముడుపోయాయో పరిశీలిస్తే.. 2,66,806 యూనిట్లతో హోండా యాక్టివా అగ్ర స్థానంలో ఉంది. మరోవైపు కస్టమర్ల నుంచి ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా ఓలా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ఓలా ఎస్1 గత అక్టోబర్‌లో 41,651 యూనిట్లు అమ్ముడుపోయింది. మొత్తం స్కూటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఎలక్ట్రిక్ విభాగంలో టాప్‌లో నిలిచింది.ఏ స్కూటర్ ఎన్ని?» హోండా యాక్టివా 2,66,806» టీవీఎస్ జూపిటర్ 1,09,702» సుజుకి యాక్సెస్ 74,813» ఓలా ఎస్1 41,651» టీవీఎస్ ఎన్‌టార్క్ 40,065» హోండా డియో 33,179» బజాజ్ చేతక్ 30,644» టీవీఎస్ ఐక్యూబ్ 28,923» సుజుకి బర్గ్‌మన్ 20,479» యమహా రేజర్ 18,451 -
బాక్స్ అనుకుంటున్నారా? ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ - రేటెంతో తెలుసా?
-
ప్రాణం నిలిపి.. ప్రాణాలకు తెగించి
మన్షిదా బాను మంగుళూరులోని కద్రి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్. ఈమధ్యే కొత్తగా ఉద్యోగంలో చేరారు. అక్టోబర్ 23 తెల్లవారు జామున 3.40 కి ఆ స్టేషన్ కి కాల్ వచ్చింది. అక్కడికి దగ్గర్లోని పాలిటెక్నిక్ కాలేజీ సెంటర్లో పెద్ద ఆక్సిడెంట్ అయింది. పికప్ వెహికల్, కంటైనర్ ట్రక్కు డీ కొట్టుకున్నాయి. ఇదీ ఆ కాల్. వెంటనే మన్షిదా తన స్కూటీ పై ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె వెళ్ళేటప్పటికి ఆ వాహనాలు తుక్కు తుక్కు అయి ఉన్నాయి. ఒక వ్యక్తి రక్తపు మడుగులో చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు. ఆ రెండు వాహనాలలో ఒకదాని క్లీనర్ అతను. మన్షిదా అతడి పరిస్థితిని గమనించారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అతడిని అతి కష్టమ్మీద లేపి, తన స్కూటర్ పై నేరుగా ఆ దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి మోసుకెళ్లారు. అతడి ప్రాణాలని నిలబెట్టగలిగారు.ఆమె టైమ్ సైన్స్ ఆమె వేగం, ఆమె ధైర్యం, ఆమెలోని కారుణ్యం, ఆమె యూనిఫామ్.. అన్నీ పంచభూతాల్లా ఒకటై ఆ వ్యక్తి ్రపాణాలను కాపాడాయనే అనుకోవాలి. అదే కనుక.. పోలీస్ కాకుండా ఒక మామూలు వ్యక్తి ఎవరైనా అంతలా గాయపడిన వారిని తీసుకెళితే ప్రైవేటు హాస్పిటల్స్ చేర్చుకుని ఉండేవా?! ‘మేం అడ్మిట్ చేసుకోడానికి లేదు. ఇది పోలీస్ కేస్..‘ అని ఉండేవి.‘వాయు వేగంగా స్పందించి ఒకరి ప్రాణాన్ని నిలబెట్టిన కద్రి స్టేషన్ మహిళా పోలీస్ కానిస్టేబుల్ మన్షిదా బానుకు‘ అభినందనలు అంటూ తెల్లారగానే మంగుళూరు సిటీ పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ ట్వీట్ పెట్టారు. మంగుళూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా మన్షిదాకు ప్రశంసలు అందాయి.డ్యూటీ మైండెడ్ మాత్రమే అయి ఉంటే ఘటనా స్థలానికి వెళ్ళగానే ఫార్మాలిటీస్ లో పడి ఉండేవారు మన్షిదా. కానీ ఆమె అలా చేయలేకపోయారు. ఆమెలోని మానవతా హృదయం.. ఉద్యోగ విధి విధానాలను దాటి మరీ స్పందించింది. అందుకు ‘తగిన శిక్ష‘ ఏదైనా ఉందంటే.. అది ప్రమోషనో, ప్రశంసాపత్రమో తప్ప మరొకటి అవుతుందా?! మన్షిదా మాత్రం.. ‘నేను చేసింది ఏముందీ..!‘ అని చిరునవ్వుతో అంటున్నారు.. తనపై కురుస్తున్న అభినందనల జల్లులలో తడిసి ముద్ద అవుతూ.సాహసాన్ని వెన్నెముకగా ధరించే వాళ్లకు అసాధ్యం ఉండదు. హై–రిస్క్ అనేది ఉండదు. ఈ విషయాన్ని మరోసారి అక్షరాలా నిరూపించింది పైలట్ రీనా వర్గీస్. అడవిలో, అత్యంత ప్రతికూల పరిస్థితులలో ప్రాణాపాయంలో ఉన్న జవాన్‌ను ఆస్పత్రికి తరలించింది. రీనా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన కొత్తలో... 2009లో సీనియర్ పోలీసు అధికారులను తీసుకు వెళుతున్న హెలికాప్టర్‌ను మావోయిస్ట్‌లు కూల్చివేశారు. తాను చేస్తున్న ఉద్యోగం ఎంత రిస్క్ అనేది అర్థం చేసుకోవడానికి ఆ సంఘటన రీనాకు ఉపయోగపడింది.తాజా విషయానికి వస్తే...మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కమాండోలు, మావోయిస్ట్‌లకు మధ్య ఎనిమిది గంటల పాటు జరిగిన భీకరమైన ఎదురుకాల్పుల్లో ఒక కమాండో తీవ్రంగా గాయపడ్డాడు. మావోయిస్ట్‌ల రాకెట్ దాడులకు అవకాశం ఉన్న ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో గాయపడిన కమాండోను అక్కడి నుంచి తరలించడం అంటే ్రపాణాలను పణంగా పెట్టడమే. ఉన్నతాధికారుల నుంచి సమాచారాన్ని అందుకున్న రీనా వర్గీస్ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా హన్స్ హెలికాప్టర్‌తో రంగంలోకి దిగింది. కో–పైలట్‌కు కమాండ్స్ అందజేసి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో హెలికాప్టర్‌ను వీలైనంత వరకు దించి కిందికి దూకింది.తాడు సహాయంతో గాయపడిన కమాండోను హెలికాప్టర్లోకి తీసుకువచ్చింది. 30 నిమిషాలలో గడ్చిరోలికి అక్కడి నుండి నాగ్‌పూర్ తరలించింది. మూడు బుల్లెట్లు తగిలిన కమాండోకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో బి.టెక్ చేసిన రీనా వర్గీస్ గతంలో ఎన్నో ముఖ్యమైన రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంది. కోవిడ్ మహమ్మారి సమయంలో బాధితులను లక్షద్వీప్ నుంచి కొచ్చికి తరలించే రెస్క్యూ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొని ప్రశంసలు అందుకుంది. -
జుపీటర్ 125 Vs యాక్టివా 125: ఏది బెస్ట్?
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గవి ''టీవీఎస్ జుపీటర్ 125, హోండా యాక్టివా 125''. ఈ రెండూ 125సీసీ విభాగంలోనే స్కూటర్లు. కాబట్టి ఈ రెండు స్కూటర్లలో ఏ స్కూటర్ కొనుగోలు చేయాలి?, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ధరలు, మైలేజ్ వంటి విషయాలు కొంత గందరగోళాన్ని కలిగించే అవకాశం ఉంది. అలాంటి వారికోసం ఈ కథనం ఓ చక్కని పరిష్కారం..టీవీఎస్ జుపీటర్ 125, హోండా యాక్టివా 125 స్కూటర్స్ రెండూ డిజైన్, ఫీచర్స్ పరంగా కూడా ఉత్తమంగా ఉంటాయి. కాబట్టి ధర, మైలేజ్, కలర్ ఆప్షన్స్ అన్నీ బేరీజు వేసుకుని.. అవసరాలకు దృష్ట్యా నచ్చిన స్కూటర్ ఎంచుకోవడం అనేది పూర్తిగా కొనుగోలు చేసే వ్యక్తి మీదనే ఆధారపడి ఉంటుంది. -
‘హెల్మెట్ లేకుండా స్కూటర్‌పై మొసలి’
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎప్పుడు ఎలాంటి విచిత్రాలు కనిపిస్తాయో ఎవరూ చెప్పలేరు. కడుపుబ్బా నవ్వించే వీడియోలతో పాటు కంగుతినిపించే వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంటాయి. ఇదేకోవకు చెందిన ఒక వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.గుజరాత్‌కు చెందిన ఈ వీడియో ఒక పట్టాన నమ్మేలా లేదు. ఈ వీడియోను చూసినవారంతా తెగ ఆశ్చ్యపోతున్నారు. భారీ వర్షాలకు నదిలో నుంచి మొసళ్లు బయటకు రావడాన్ని చూసిన జనం.. అలాంటి మొసలి స్కూటర్‌పై వెళ్లడాన్ని చూసి కంగుతింటున్నారు. ఈ వీడియోలో ఇద్దరు యువకులు స్కూటర్‌పై వెళుతుండటాన్ని చూడవచ్చు. వారి మధ్య ఓ మొసలి కూడా ఉంది. ఒకరు స్కూటర్ నడుపుతుండగా, మరొకరు ఆ భారీ మొసలిని ఒడిలో పెట్టుకుని కూర్చున్నారు. కుక్కలను, పిల్లులను ఇలా స్కూటర్‌పై ఎక్కించుకుని తీసుకుని వెళ్లడాన్ని ఎప్పుడో ఒకప్పుడు చూసేవుంటాం. కానీ ఇలా మొసలిని బండిపై తీసుకువెళ్లడాన్ని ఎప్పుడూ చూడలేదని ఈ వీడియో చూసినవారు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ వీడియోను @gharkekalesh అనే ఖాతా ద్వారా మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియో క్యాప్షన్‌లో ‘వడోదరలోని విశ్వామిత్ర నది నుంచి బయటకు వచ్చిన ఒక మొసలిని ఇద్దరు యువకులు స్కూటర్‌పై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్యాలయానికి తీసుకెళ్లారు’ అని రాసివుంది. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘ మొసలిని నీటిలో నుంచి బయటకు తీసి, దాని నోటిని తాడుతో కట్టేస్తే అది బలహీనపడిపోతుంది’ అని రాశారు. మరొక యూజర్ ‘సోదరుని ధైర్యానికి వందనం’ అని రాయగా, ఇంకొకరు ‘హెల్మెట్ లేకుండా స్కూటర్‌పై మొసలి ఎలా వెళుతుంది? అని రాశారు. Two young men took a crocodile found in Vishwamitra river in Vadodara to the forest department office on a scooter🫡pic.twitter.com/IHp80V9ivP— Ghar Ke Kalesh (@gharkekalesh) September 1, 2024 -
మరో స్కూటర్ లాంచ్‌కు సిద్దమవుతున్న జర్మన్ కంపెనీ
బీఎండబ్ల్యూ మోటోరాడ్ దేశీయ విఫణిలో తన ఉనికిని విస్తరించడంతో బిజీ అయిపోయింది. ఇటీవల సీఈ04 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇప్పుడు సీఈ 02ను లాంచ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. రూ. 14.90 లక్షలు ఖరీదైన సీఈ04 ప్రస్తుతం దేశంలో ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా అవతరించింది.బీఎండబ్ల్యూ సీఈ 02 అనేది సీఈ04 కంటే సరసమైనదిగా ఉండనున్నట్లు సమాచారం. ఇది ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది ఎలక్ట్రిక్ కారు స్కూటర్ కాదని కంపెనీ వెల్లడించింది. అయితే 310 సీసీ విభాగంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.సీఈ02 స్కూటర్ మంచి డిజైన్, ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. అయితే కంపెనీ లాంచ్ చేయనున్న ఈ వెహికల్స్ ధరలు, ఇంజిన్ వంటి మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. అయితే ఇది సీబీయూ మార్గం ద్వారా దేశానికి దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. -
సుజుకీ స్కూటర్ ఓనర్లకు అలర్ట్.. 4 లక్షల వాహనాలు రీకాల్!
ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రై. లిమిటెడ్ భారత్‌లో దాదాపు నాలుగు లక్షల ద్విచక్ర వాహనాలకు రీకాల్ జారీ చేసింది. వీటిలో సుజుకీ యాక్సెస్ 125, అవెనిస్ 125, బర్గ్మాన్ స్ట్రీట్ మోడల్ వాహనాలు ఉన్నాయి.సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం యాక్సెస్ 125 అత్యధికంగా 2,63,788 యూనిట్లు, అవెనిస్ 125 మోడల్ 1,52,578 యూనిట్లు, బర్గ్మాన్ స్ట్రీట్ వాహనాలు 72,045 యూనిట్లను ఇగ్నిషన్ కాయిల్‌లోని హై-టెన్షన్ వైర్ లోపం కారణంగా కంపెనీ రీకాల్ చేసింది. ఈ వాహనాలు 2022 ఏప్రిల్ 30 నుంచి 2022 డిసెంబర్ 3 మధ్య కాలంలో తయారయ్యాయి. ఆయా మోడల్ స్కూటర్లు కొనుగోలు చేసినవారిని సంప్రదించే పనిలో కంపెనీ ఉంది. సమీపంలోని సర్వీస్ సెంటర్లో లోపభూయిష్ట భాగాన్ని కంపెనీ ఉచితంగా రీప్లేస్ చేసిస్తుంది.సమస్య ఇదే..వెబ్సైట్లో పేర్కొన్న దాని ప్రకారం.. డ్రాయింగ్ అవసరాలకు సరిపోని హై టెన్షన్ వైర్‌ను ఇగ్నిషన్ కాయిల్‌కు అమర్చడం వల్ల రన్నింగ్ సమయంలో వైర్ కోతలు పడటం, తెగిపోవడం జరుగుతోంది. దీంతో ఇంజన్ ఆగిపోవడం, స్టార్ట్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కోతలు పడిన హై టెన్షన్ వైర్ నీటితో తడిసినప్పుడు వాహనం స్పీడ్ సెన్సార్, థొరెటల్ పొజిషన్ సెన్సార్ లీక్ దెబ్బతినే అవకాశం ఉంది.కాగా సుజుకీ మోటర్‌సైకిల్ కంపెనీ మిడిల్ వెయిట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ వీ-స్ట్రోమ్ 800 డీఈ (V-Strom 800 DE)కి సంబంధించిన 67 యూనిట్లను కూడా రీకాల్ చేసింది. లోపభూయిష్టమైన వెనుక టైర్ దీనికి కారణంగా కంపెనీ చెబుతోంది. బైక్ వెనుక వెనుక టైర్‌పై పగుళ్లు వస్తున్నాయని, టైర్ ట్రెడ్ బయటకు వచ్చేస్తోందని, టైర్ రూపం దెబ్బతింటోందని కంపెనీ పేర్కొంది. ఆయా వాహనాల యజమానులకు సంప్రదిస్తున్నమని అవసరమైతే వెనుక టైర్ రీప్లేస్ చేస్తామని వివరించింది. ఈ వాహనాలు 2023 మే 5 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 23 మధ్య కాలంలో తయారయ్యాయి. -
‘స్కూటర్ షవర్’.. మండుడెండల్లో మంచులాంటి ఐడియా!
మనిషి కష్టం వచ్చినప్పుడు వెంటనే పరిష్కారాన్ని కనుగొంటాడు. అయితే ఒక్కొక్కరికి ఒక్కో విధమైన పరిష్కార మార్గాలు కనిపిస్తుంటాయి. ఇదే కోవలో వేసవి నుంచి తప్పించుకునేందుకు ఓ కుర్రాడు చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఉత్తరాదిన భానుడు భగభగ మండుతున్నాడు. జనం కూలర్లు, ఏసీలను అశ్రయిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు వెంట గొడుగును తీసుకు వెళుతున్నారు. అయితే రాజస్థాన్‌కు చెందిన ఒక యువకుడు మండుతున్న ఎండల నుంచి ఉపశమనానికి ‘స్కూటర్ షవర్’ తయారు చేసి, ఎండల్లో చల్లగా తిరుగుతున్నాడు. స్కూటర్‌కి షవర్‌ను అమర్చడం వల్ల ఎక్కడికెళ్లినా కూల్‌గా ఉంటున్నదని ఆ యువకుడు కనిపించిన అందరికీ చెబుతున్నాడు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఈ క్లిప్‌ను ఇన్స్టాగ్రామ్ పేజీ ‘ఫన్ విత్ సింగ్’లో షేర్ చేశారు. ఈ స్కూటర్ షవర్ తయారు చేసిన వ్యక్తి తన స్కూటర్ లెగ్ స్పేస్‌లో వాటర్ కంటైనర్‌ను ఉంచాడు. దానిని నీటితో నింపాడు. దానికి ఒక గొట్టం అమర్చి ట్యాప్ ఫిట్ చేశాడు. చిన్నపాటి మోటారు అమర్చి పైన షవర్ నుంచి నీటి జల్లులు కురిసేలా ఏర్పాటు చేశాడు. ఆ వ్యక్తి స్కూటర్‌పై వెళుతున్నప్పుడు షవర్ నుంచి చిరు జల్లులు అతనిపై పడటాన్ని వీడియోలో మనం గమనించవచ్చు. India is not for beginners 😅#heatwave #Garmi pic.twitter.com/FiXHhOkhQ3— Sneha Mordani (@snehamordani) June 17, 2024 -
భారత్‌లో జపనీస్ బ్రాండ్ స్కూటర్ లాంచ్ - ధర ఎంతో తెలుసా?
జపనీస్ టూ వీలర్ తయారీ సంస్థ యమహా దేశీయ మార్కెట్లో 'ఫాసినో ఎస్' వేరియంట్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ స్కూటర్ ధర ధర రూ. 93730 (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త స్కూటర్ ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఆన్సర్ బ్యాక్ అనే ఫైండ్ మై స్కూటర్ యాప్ కూడా ఉంది.యమహా ఫాసినో ఎస్ వేరియంట్ 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.2 హార్స్ పవర్ మరియు 10.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని బరువు కేవలం 99 కేజీలు మాత్రమే. ఇది 21 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది.యమహా ఫాసినో ఇప్పుడు డ్రమ్, డిస్క్, ఎస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 79900, రూ. 91130, రూ. 93730 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఈ స్కూటర్ దేశీయ మార్కెట్లో సుజుకి యాక్సెస్ 125, హోండా యాక్టివా 125, టీవీఎస్ జుపీటర్ 125, యమహా రే జెడ్ఆర్ 125 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
ప్రముఖ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల రీకాల్
టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఐకూబ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. జులై 10, 2023 నుంచి సెప్టెంబర్ 9, 2023 మధ్య తయారు చేసిన వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..‘ప్రోయాక్టివ్ ఇన్స్పెక్షన్’ కోసం ఐకూబ్ మోడల్ ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేస్తున్నారు. వాహనాల సామర్థ్యం ఎలాఉందో నిర్థారించుకోవడానికి బ్రిడ్జ్ ట్యూబ్‌ను తనిఖీ చేయనున్నారు. అందులో ఏదైనా సమస్యలుంటే కస్టమర్లకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగానే సర్వీసు చేస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకు సంబంధించి డీలర్ భాగస్వాములు వ్యక్తిగతంగా కస్టమర్లను సంప్రదిస్తారని సంస్థ పేర్కొంది. -
స్కూటర్‌పై తిరుగుతూ.. స్మృతీ ఇరానీ సందడి!
ఉత్తరప్రదేశ్‌లోని తన లోక్‌సభ నియోజకవర్గం అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్కూటర్‌పై తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. అలాగే పలువురితో సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ మీడియాకు కనిపించారు. బీజేపీ కార్యకర్తలతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు.స్మృతి ఇరానీ ఈరోజు (సోమవారం) అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. 2019లో ఆమె కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఓడించి, ఈ సీటును సొంతం చేసుకున్నారు. స్మృతి ఇరానీ ఆదివారం నాడు అయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకున్నారు. కాగా అమేథీ నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేయనున్నారనే విషయాన్ని కాంగ్రెస్ ఇంతవరకూ వెల్లడించలేదు. అమేథీ.. కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందింది. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. -
FM Nirmala Sitharaman: దేశ ఆర్థికమంత్రికి అప్పులు.. మరి ఆస్తులెంతో తెలుసా?
కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కావలసినంత డబ్బు తన దగ్గర లేదని ఇప్పటికే పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనని, ప్రచారంలో మాత్రం పాల్గొంటానని స్పష్టం చేశారు. ఒక ఆర్థిక మంత్రి దగ్గర డబ్బు లేదు అన్న మాటలు కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ.. అది నిజమే అని తాజాగా వెల్లడైన కొన్ని విషయాల ద్వారా తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రికి కొంతవరకు ఆస్తులు ఉన్నప్పటికీ.. అప్పులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో రాజ్యసభ సభ్యురాలిగా నామినేషన్ వేసిన సమయంలో ఆమె దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆమె ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం ఈమె మొత్తం ఆస్తుల విలువ రూ. 2.53 కోట్లుగా ఉంది. నిర్మలా సీతారామన్‌కు ఉన్న మొత్తం ఆస్తిలో రూ. 1.87 కోట్ల స్థిరాస్థులు, రూ.65.55 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు సమాచారం. అప్పు రూ.26.91 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. 2016లో సీతారామన్ ఆస్తి విలువ రూ. 99.36 లక్షలు కాగా, 2022 నాటికి రూ. 1.7 కోట్లకు పెరిగింది. 2024 నాటికి ఈ ఆస్తి విలువ కొంత వరకు పెరిగి ఉండవచ్చు. 2016, 2022 డిక్లరేషన్ల ప్రకారం నిర్మలా సీతారామన్‌కు ఒక 'బజాజ్ చేతక్' స్కూటర్ ఉన్నట్లు సమాచారం. 2016లో రూ.7.87 లక్షల విలువైన 315 గ్రాముల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. 2022 నాటికి బంగారం పరిమాణం పెరగలేదు, కానీ పెరిగిన ధరల కారణంగా ఆ బంగారం విలువ దాదాపు రెండింతలు పెరిగి రూ.14.49 లక్షలకు చేరుకుంది. ఇప్పటి ధరల ప్రకారం బంగారం విలువ రూ. 19.4 లక్షల నుంచి రూ. 21.18 లక్షల వరకు ఉంటుంది. -
డ్రైవింగ్ మణి @ 71
వయసు అరవై దాటిందంటే చాలు ‘ఇంకా ఏం పనులు చేస్తావు, విశ్రాంతి తీసుకో..’ అనే సలహాలు ఇస్తుంటారు. కొందరు ఆ సలహాలను కూడా సవాళ్లుగా తీసుకుంటారు. కొన్ని అభిరుచులను జీవితకాల సాధనగా మార్చుకుంటారు. ఈ మాటలను నిజం చేస్తోంది 71 ఏళ్ల రాధామణి. ఇప్పటివరకు 11 హెవీ వాహనాల లైసెన్స్‌లను పొంది మూస పద్ధతులను బద్దలు కొట్టి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అందరూ మణి అమ్మ అని పిలుచుకునే రాధామణి కేరళవాసి. సాధనమున ఏవైనా సమకూరుతాయి అని నిరూపిస్తున్న రాధామణి ఇప్పుడు ఇంజినీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ ఈ రంగంలో ఎదగడానికి చేస్తున్న కృషి అందరికీ ఓ స్ఫూర్తి మంత్రం. 1984లో కేరళలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందిన రాధామణి ఇప్పటికీ ‘వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు’ అని, అందుకు తన జీవితమే ఓ ఉదాహరణగా చూపుతుంది. స్కూటర్ నుంచి జేసీబీ వరకు సాధారణంగా మహిళలు స్కూటర్, కార్ డ్రైవింగ్‌తో సరిపెట్టేస్తారు. రాధామణి మాత్రం అంతటితో ఆగలేదు. డ్రైవింగ్ పట్ల తనకు ఆసక్తి కలగడానికి ప్రోత్సాహాన్నిచ్చిన భర్తను గర్తుచేసుకుంటూ ‘‘1981లో మొదటిసారి ఓ అంబాసిడర్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఐదేళ్లలోపు ఫోర్ వీలర్ లైసెన్స్ పొందాను. ఆ విధంగా కేరళలో హెవీ వెహికల్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా కూడా గుర్తుంపు పొందాను. ఎ టు జెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్ అనే డ్రైనింగ్ స్కూల్నుప్రారంభించాను’ అని వివరిస్తుంది. ఈ వెంచర్‌ను రాధామణి భర్త పదేళ్లకు ముందుగానే ప్రారంభించాడు. అక్కడ నుంచే ఈ జంట డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ రాధామణి పేరుతో లైసెన్స్ పొందడానికి స్కూల్ రిజిస్టర్ చేయడానికి కష్టంగా మారింది. దీంతో రాధామణి హెవీ డ్రైనింగ్ లైసెన్స్‌లు పొందాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్నేళ్ల న్యాయ ΄ోరాటం తర్వాత ఈ జంట కేరళలో హెవీ వెహికల్ డ్రైవింగ్ లెర్నింగ్ స్కూల్‌ను రాధామణి పేరుతో రిజిస్టర్ చేయగలిగారు. సంకల్పంతో నిలబెట్టింది.. రాధామణి భర్త 2004లో మరణించాడు. ఆ తర్వాత ఈ వెంచర్ మరింతప్రాముఖ్యతను నింపుకుంది. మణి అమ్మ సంకల్పం ఆ ట్రైనింగ్ స్కూల్‌ను నిలబెట్టడం ఒక్కటే కాదు, దానిని ఒక సంస్థగా మార్చేందుకు కృషి చేయడం కూడా! అందుకే ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏ రంగమైనా హెవీ డ్రైవింగ్ అంటే ముందు పురుషులే గుర్తుకు వస్తారు. అలాంటి ఆలోచనకు తావు ఇవ్వకుండా, వయసు నింబధనలను కూడా ధిక్కరిస్తూ ఈ డ్రైవింగ్ స్కూల్‌ను రాధామణి నడుపుతోంది. అందుకు మరింతగా ఎదగడానికి కావాల్సిన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇంజనీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. రికార్డ్ల చక్రం ఆమె అద్భుతమైన నైపుణ్యాలు, అంకితభావాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. ‘ఇన్సి ్పరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని ఇచ్చి తనను తాను గౌరవించుకుంది సంస్థ. రాధామణి అంతటితో ఆగలేదు. సోషల్ మీడియాలో కూడా తన ఉనికిని చాటుతోంది. అక్కడ ఆమె తన డ్రైవింగ్ అనుభవాలను పంచుకుంటుంది. వయసు లేదా జెండర్‌తో సంబంధం లేకుండా కలలను పండించుకునేందుకు తగిర ప్రేరణను ఇస్తోంది రాధామణి. సోషల్ మీడియాలో.. రాధామణి ఇన్స్టాగ్రామ్ పేజీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. జేసీబీలు, ఫోర్క్‌లిఫ్ట్‌లు, క్రేన్లు, ఫెరారీలు, పడవలు, ట్యాంకర్లు, జిప్సీ, పెద్ద పెద్ద ట్రక్కుల వరకు ప్రతి వాహనాన్ని డ్రైవ్ చేస్తూ కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్కు ఉన్న 19కె ఫాలోవర్లు మణి అమ్మను ప్రశంసిస్తుంటారు. ఎంతోమంది చేత సత్కారం పొందుతుంటారు. చాలా మంది మహిళలకు హెవీ డ్రైవింగ్ పరికరాల గురించి చెప్పడం, నేర్పడం చూడచ్చు. రాధామణి అమ్మ అంటే ఆవేశం, పట్టుదల, శక్తికి నిదర్శనం. ఆమె కేవలం రోడ్డుపైనే కాదు అడ్డంకులను ఛేదించి చక్రాన్ని చేరుకోవడానికి తగిన స్ఫూర్తిని ఇచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. -
ఈ యమహా స్కూటర్లలో ప్రాబ్లమ్.. 3 లక్షల యూనిట్లు రీకాల్!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారు సంస్థ యమహా ( Yamaha ) తమ కస్టమర్లకు అత్యవసర సమాచారం ఇచ్చింది. 2022 జనవరి 1 నుంచి 2024 జనవరి 4 మధ్య కాలంలో తయారు చేసిన దాదాపు 3 లక్షల యూనిట్ల 125cc స్కూటర్లను తక్షణమే అమలులోకి వచ్చేలా స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ స్కూటర్లు ఇవే.. కంపెనీ వెల్లడించిన ప్రకారం.. ఎంపిక చేసిన యూనిట్లలో బ్రేక్ లివర్ ఫంక్షన్లో సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. Ray ZR 125 Fi హైబ్రిడ్, Fascino 125 Fi హైబ్రిడ్ స్కూటర్ మోడల్స్ (2022 జనవరి తరువాతి మోడల్స్) ఎంపిక చేసిన యూనిట్లలో బ్రేక్ లివర్ ఫంక్షన్లో ఉన్న సమస్యను పరిష్కరించడమే రీకాల్ లక్ష్యంగా యమహా చెబుతోంది. ఉచితంగానే రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ పార్ట్ కస్టమర్‌కు ఉచితంగా అందించనున్నట్లు యమహా కంపెనీ వెల్లడించింది. రీకాల్ కోసం అర్హతను ధ్రువీకరించడానికి కస్టమర్లు ఇండియా యమహా మోటర్ వెబ్సైట్లోకి వెళ్లి సర్వీస్ సెక్షన్‌లోని 'SC 125 వాలంటరీ రీకాల్'ని క్లిక్ చేయాలి. ఇక్కడ బండి ఛాసిస్ నంబర్, వివరాలు నమోదు చేస్తే తదుపరి దశలు వస్తాయి. యమహా 2023 కొత్త 125 cc హైబ్రిడ్ స్కూటర్ శ్రేణి BS-VI OBD2 & E-20 ఫ్యూయల్ కంప్లైంట్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ (FI), 125 cc బ్లూ కోర్ ఇంజన్‌తో 8.2 PS @ 6,500 RPM పవర్ అవుట్‌పుట్, 10.3 NM @ 5,000 RPM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. యమహా అంతర్జాతీయ పరిశోధన, అభివృద్ధితో ఈ 125 Fi హైబ్రిడ్ ఇంజన్ తయారు చేశారు. -
స్కూటర్‌పై రూ.3.20 లక్షల చలానాలు
కర్ణాటక: ఒక స్కూటర్‌పై వందలాది ట్రాఫిక్ చలానాలు ఉన్నాయి, మొత్తం జరిమానాలను లెక్కిస్తే రూ. 3.20 లక్షలుగా తేలింది. హెల్మెట్ లేకుండా, సిగ్నల్ జంప్, వన్‌వేలో, మొబైల్లో మాట్లాడుతూ తదితర ధిక్కారాలకు పాల్పడడం వల్ల ఈ చలానాలు పడ్డాయి. వివరాలు.. సుధామనగరవాసి వెంకటరామన్‌కు చెందిన కేఏ 05 కేఎఫ్ 7969 నంబరు కలిగిన యాక్టివా స్కూటర్ ఈ ఘనతను సాధించింది. దీనిపై 300 కు పైగా చలానాలు ఉండగా, వాటిని కట్టాలంటే రూ.3.20 లక్షలు కావాలి. స్కూటర్ వద్దు, డబ్బు కట్టు వెంకటరామన్ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఎస్ఆర్నగర, విల్సన్గార్డెన్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో యథేచ్ఛగా తిరిగేవాడు. ట్రాఫిక్ పోలీసులు అతని ఇంటికి వెళ్లి జరిమానాలను చెల్లించాలని సూచించారు. దీనికి వెంకటరామన్ ఇంత మొత్తంలో డబ్బు కట్టలేనని, స్కూటర్‌ను తీసుకెళ్లవచ్చని చెప్పాడు. మాకు స్కూటర్ వద్దు, డబ్బు కట్టు, లేదంటే కేసు పెడతామని పోలీసులు హెచ్చరించి నోటీస్ ఇచ్చారు. గతేడాది రూ.3.22 లక్షలు గతంలో ఆర్టీ.నగరలోని గంగానగరలో ఒక స్కూటీ పెప్పై 2023 డిసెంబరులో రూ.3.22 లక్షల జరిమానాలు ఉన్నట్లు తేలింది. మాలా అనే మహిళకు చెందిన స్కూటీ పై 643 చలానాలు ఉన్నాయి. రూ.50 వేల కంటే అధిక జరిమానా ఉంటే ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల ఇళ్లకు వెళ్లి జరిమానా వసూలు చేస్తున్నారు. -
న్యూ ఇయర్లో లాంచ్ అయిన కొత్త వెహికల్స్ - వివరాలు
గత ఏడాది భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన వాహనాలు లాంచ్ అయ్యాయి, ఈ ఏడాది కూడా కొన్ని లాంచ్ అయ్యాయి.. లాంచ్ అవ్వడానికి సిద్దమవుతున్నాయి. ఈ కథనంలో న్యూ ఇయర్లో విడుదలైన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కవాసకి జెడ్ఎక్స్-6ఆర్ కవాసకి కంపెనీ 2024 ప్రారంభంలో రూ. 11.09 లక్షల 'జెడ్ఎక్స్-6ఆర్' బైక్ లాంచ్ చేసింది. బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్స్ పొందిన ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇందులోని 636 సీసీ ఇంజిన్ 129 హార్స్ పవర్, 69 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కవాసకి ఎలిమినేటర్ 500 ఈ ఏడాది ప్రారంభంలోనే కవాసకి 'ఎలిమినేటర్ 500' అనే మరో బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 5.62 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇందులోని 451 సీసీ ఇంజిన్ 45 హార్స్ పవర్, 42.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్లిప్/అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ వెనుక చక్రానికి డెలివరీ చేస్తుంది. ఇదీ చదవండి: టిప్స్ అక్షరాలా రూ.97 లక్షలు - సీఈఓ రియాక్షన్ ఏంటంటే? బజాజ్ చేతక్ ప్రీమియం ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ చేతక్.. సరికొత్త అప్డేట్లతో ప్రీమియం అనే పేరుతో లాంచ్ అయింది. రూ. 1.35 లక్షల ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జితో 157 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. నావిగేషన్ అప్డేట్లు, నోటిఫికేషన్ అలర్ట్ వంటి కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో గమనించవచ్చు. ఏథర్ 450 అపెక్స్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఇటీవల 450 అపెక్స్ అనే పేరుతో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 3.7 కిలోవాట్ బ్యాటరీ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ రేంజ్ అందించేలా తయారైంది. ఈ స్కూటర్ రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్‌తో పాటు వేణు భాగం పనారదర్శకంగా ఉంటుంది. -
సింగిల్ ఛార్జ్‌తో 160 కిమీ రేంజ్ అందించే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో సర్వ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'డాట్ వన్' (Dot One) లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు, ఆఫర్ వివరాలు వంటి వాటితో పాటు రేంజ్ గురించి కూడా ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ విఫణిలో విడుదలైన కొత్త 'డాట్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99,999 (ఎక్స్ షోరూమ్, బెంగళూరు). ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందస్తు డెలివరీలు ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. పరిచయ ధరలు ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ధరల పెరుగుదల జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. నాలుగు కలర్ఆప్షన్లలో లభించే ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 160 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. వాస్తవ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఈ స్కూటర్ రేంజ్ 151 కిమీ వరకు ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా? 3.7 కిలోవాట్ బ్యాటరీ కలిగిన సింపుల్ ఎనర్జీ కొత్త స్కూటర్ కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ 72 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మొత్తం మీదే పనితీరు పరంగా ఇచ్చి చాలా ఉత్తమంగా ఉంటుంది. డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 35 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి.. మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త స్కూటర్ భారతీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయానికి ఉన్న ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
రాహుల్ గాంధీ రూటే వేరు
-
ఇంట్లో పేలిన స్కూటర్ బ్యాటరీ
హోసూరు: హోసూరు సమీపంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలడంతో ఇంట్లోని వస్తువులు ధ్వంసమయ్యాయి. దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. వివరాల మేరకు సూళగిరి ప్రాంతానికి చెందిన మునిరాజ్ (38)తన కుటుంబసభ్యులతో కలిసి హోసూరు సమీపంలోని కళుగొండపల్లి సుభాష్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ అదే ప్రాంతంలో సూపర్ మార్కెట్‌ను నిర్వహిస్తున్నాడు. గత మూడేళ్లుగా బ్యాటరీ స్కూటర్‌ను ఉపయోగిస్తున్నాడు. అర్ధరాత్రి విస్ఫోటం శుక్రవారం రాత్రి 10 గంటలకు షాపును మూసివేసి ఇంటికి వచ్చిన దంపతులు స్కూటర్ బ్యాటరీని విప్పి ఇంట్లో చార్జింగ్కు పెట్టారు. అర్ధరాత్రి బ్యాటరీ గట్టి శబ్దంతో పేలడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. టీవీ, ఫ్యాన్, బల్పులతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. ఇంటి పైకప్పు కూడా చీలిపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న మంజునాథ్, భార్య మాల (33), కొడుకు రక్షణ్ (11), కూతురు జయ్గంగ (8)లు విషవాయువుల మధ్యలో చిక్కుకుని ఉండగా, చుట్టుపక్కల వారు చేరుకొని ఇంటి తలుపులు బద్దలగొట్టి మంటలార్పి ప్రమాదంలో ఇరుక్కుపోయిన దంపతులను, పిల్లలను బయటకు తీశారు. అదృష్టవశాత్తు వారందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దుర్ఘటనపై బాధితుడు మత్తిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
డివైడర్‌ను ఢీకొన్న స్కూటర్.. ఇద్దరి దుర్మరణం
కాకినాడ రూరల్: అతి వేగం ఇద్దరు స్నేహితులను బలిగొంది. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సినిమాకు వెళ్తున్నామని ఇంటి వద్ద చెప్పి, స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన కొడుకు.. రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఒక కుటుంబం.. బయటకు వెళ్లిన కొడుకు ఇక తిరిగి రాడని తెలిసి మరో కుటుంబం తల్లడిల్లిపోయాయి. రెండు కుటుంబాలకు పుత్రశోకం మిగిల్చిన ఈ ప్రమాదం వివరాలివీ.. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద సూపర్ బజార్ ఎదురుగా ఆదివారం అర్ధరాత్రి డివైడర్‌ను స్కూటర్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులను కాకినాడ రూరల్ మండలం వలసపాకల బాలాజీ నగర్‌కు చెందిన కర్నాటి షణ్ముఖ గణేష్ (17), ములికి శివసత్య(17)గా గుర్తించారు. వారిద్దరూ స్కూటర్‌పై సర్పవరం జంక్షన్ నుంచి మితిమీరిన వేగంతో నాగమల్లితోట జంక్షన్ వైపు వస్తూండగా ఈ ప్రమాదం జరిగింది. స్కూటర్‌ను శివసత్య నడుపుతూండగా వెనుక షణ్ముఖ గణేష్ కూర్చున్నాడు. అతి వేగంతో డివైడర్‌ను స్కూటర్ ఢీకొనడంతో వెనుక కూర్చున్న గణేష్ తూలిపోయి రోడ్డు అవతలివైపు పడ్డాడు. వేగాన్ని నియంత్రించలేక కొద్ది దూరం వెళ్లిన తరువాత శివసత్య రోడ్డుపై పడిపోయాడు. అతడి తల వెనుక భాగం రోడ్డుకు బలంగా తగలడంతో తీవ్ర గాయంతో రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెండాడు. గణేష్ కూడా తలకు గాయమవడంతో దుర్మరణం పాలయ్యాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు సర్పవరం పోలీసులకు, 108కు సమాచారం అందించారు. సర్పవరం సీఐ ఆకుల మురళీకృష్ణ, సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అప్పటికే శివసత్య, గణేష్ మాట్లాడకపోవడంతో తట్టి లేపే ప్రయత్నం చేశారు. వారిద్దరినీ 108 అంబులెన్స్ సిబ్బంది పరిశీలించి, మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో ఆ ఇద్దరి మృతదేహాలను పోలీసులు ఆటోలో జీజీహెచ్‌కు తరలించారు. ఏమాత్రం కొన ఊపిరి ఉన్నా బతికే అవకాశం ఉంటుందని వైద్యం కోసం ప్రయత్నం చేశారు. అయితే, ఆ ఇద్దరు యువకులూ మృతి చెందారని ప్రభుత్వాస్పత్రి వైద్యులు మరోసారి నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి, జీజీహెచ్‌కు తరలివచ్చారు. షణ్ముఖ గణేష్ తండ్రి పెంటయ్యకు ఐదు ట్రాక్టర్లు ఉన్నాయి. వీటిని అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. పదో తరగతి వరకూ చదువుకున్న గణేష్ తండ్రికి అండగా ఉంటున్నాడు. రాత్రి సినిమాకు వెళ్తున్నట్టు తండ్రి వద్ద రూ.500 తీసుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన శివసత్యను తీసుకుని బయటకు వెళ్లాడు. ఇద్దరూ సినిమాకు వెళ్లకుండా చాలాసేపు సర్పవరం జంక్షన్లో గడిపారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు స్కూటర్‌పై అతి వేగంగా వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. మరో మృతుడు శివసత్య తాపీమేస్త్రిగా జీవనోపాధి పొందుతున్నాడు. తొమ్మిదో తరగతి వరకూ చదువుకున్నాడు. ఇద్దరు యువకుల మృతితో బాలాజీ నగర్లో విషాదం అలుముకుంది. అంది వచ్చిన కొడుకులు అర్ధాంతరంగా మృతి చెందడంతో గణేష్ తల్లిదండ్రులు పెంటయ్య, సత్యవతి.. శివసత్య తల్లిదండ్రులు సత్తిబాబు, సూకరత్నం కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలకు సోమవారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. సర్పవరం ఎస్సై మురళీకృష్ణ కేసు నమోదు చేశారు. సీఐ ఎ.మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. -
హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్.. రూ.80 వేలకే!
ఏదైనా స్కూటర్ తక్కువ ధరలో కొనాలనుకుంటున్నవారికి శుభవార్త ఇది. దేశంలో స్కూటర్లలో ప్రముఖంగా పేరొందిన హోండా యాక్టీవా (Honda Activa) లిమిటెడ్ ఎడిషన్ తాజాగా మార్కెట్లో లాంచ్ అయింది. హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్ (Honda Activa Limited Edition) ఎక్స్ షోరూమ్ ధర రూ.80,734 మాత్రమే. ఇది డీఎల్ఎక్స్ ట్రిమ్ మోడల్ ధర. ఇక స్మార్ట్ ట్రిమ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.82,734. లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి తక్కువ యూనిట్స్ అందుబాటులో ఉంటాయి. కావాలనుకున్నవారు దేశవ్యాప్తంగా ఉన్న హోండా రెడ్ వింగ్ డీలర్‌షిప్‌ల వద్ద వీటిని బుక్ చేసుకోవచ్చు. ఈ పరిమిత ఎడిషన్ స్కూటర్లో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్, పెరల్ సైరన్ బ్లూ రంగుల్లో ఇది లభ్యమవుతుంది. ఇందులో డార్క్ కలర్ థీమ్, బ్లాక్ క్రోమ్ ఎలిమెంట్లు ఉంటాయి. DLX వేరియంట్లో అల్లాయ్ వీల్స్ ఉండగా, స్మార్ట్ వేరియంట్లో హోండా స్మార్ట్ కీ ఫీచర్ ఉంటుంది. -
ఇదేందిది.. కారు కాని కారు.. బానే పోతోందే..!
ఎక్కడ ఏకాస్త ప్రతిభ ఉన్నా అది సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. కొందరు కార్లు, హెలికాప్టర్ల తయారు చేస్తుండగా, మరికొందరు స్కూటర్లు, ఇటుకలతో కూలర్లు తయారు చేస్తున్నారు. ఇదే కోవలోకి చెందిన ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో నాలుగు చక్రాలతో కూడిన విచిత్ర వాహనం కనిపిస్తుంది. వాహనానికి బైక్ ఇంజిన్ అమర్చారు. స్టీరింగ్ కోసం ప్రత్యేక డిజైన్ చేశారు. పాత వస్తువులతో వాహనం బాడీ తయారు చేశారు. అలాగే పాత టైర్లను అమర్చి వాహనానికి ఫినిషింగ్ ఇచ్చారు. దీనిని చూసినవారికి మొదట నవ్వు వస్తుంది. తరువాత ఈ వినూత్న వాహన తయారీదారులను మెచ్చుకోకుండా ఉండలేరు. వైరల్ అవుతున్న ఈ వీడియోను ట్విట్టర్లో @being_happyyy అనే పేరు కలిగిన అకౌంట్లో పోస్ట్ చేశారు. క్యాప్షన్‌లో దేశీయ ఆవిష్కరణ అని రాశారు. 29 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో ఇద్దరు యువకులు, ఇద్దరు పిల్లలు వాహనం మీద కూర్చుని కనిపిస్తారు. ఈ వీడియోకు వేలకొద్దీ లైక్స్ లభిస్తున్నాయి. ఇది కూడా చదవండి: 10 ఏళ్ల క్రితం మాయమై.. బిచ్చగానిగా భర్త కనిపించడంతో.. Desi jugaad or desi innovation? #jugaad #innovation pic.twitter.com/CwxFCmjjsD — Neeraj M (@being_happyyy) July 27, 2023 -
లెక్ట్రిక్స్ కొత్త స్కూటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విభిన్న వ్యాపారాల్లో ఉన్న ఎస్ఏఆర్ గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ లెక్ట్రిక్స్ ఈవీ.. కొత్త స్కూటర్‌ను రెండు వేరియంట్లలో ఎల్ఎక్స్ఎస్ జీ3.0, ఎల్ఎక్స్ఎస్ జీ2.0 ట్రిమ్స్‌లో ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.97,999. తొలిసారిగా 12 రకాల ఫీచర్లతో కలుపుకుని మొత్తం 93 రకాల హంగులను జోడించినట్టు లెక్ట్రిక్స్ ప్రకటించింది. ఎమర్జెన్సీ ఎస్‌వోఎస్ అలర్ట్, నావేగిషన్ అసిస్ట్, ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్ వంటివి ఇందులో ఉన్నాయి. 3 కిలోవాట్ బ్యాటరీతో రూపొందిన ఎల్ఎక్స్ఎస్ జీ3.0 ఒకసారి చార్జింగ్‌తో 105 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని 9 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. 2.3 కిలోవాట్ అవర్ బ్యాటరీతో ఎల్ఎక్స్ఎస్ జీ2.0 తయారైంది. ఒకసారి చార్జింగ్‌తో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 10.2 సెకన్లలో గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు. హర్యానాలోని మనేసర్ వద్ద ఉన్న ప్లాంటు సామర్థ్యం ఏటా 1.5 లక్షల యూనిట్లు. ఇప్పటికే లెక్ట్రిక్స్ ఈవీ కోసంఎస్ఏఆర్ గ్రూప్ రూ.300 కోట్లు ఖర్చు చేసింది. లుమినస్, లివ్‌గార్డ్, లివ్‌ఫాస్ట్, లివ్‌ప్యూర్ బ్రాండ్లను సైతం ఈ గ్రూప్ ప్రమోట్ చేస్తోంది. -
ఆస్ట్రేలియా రోడ్లపై దూసుకుపోనున్న మేడిన్ ఏపీ ఈ-స్కూటర్లు
సాక్షి, అమరావతి: ఆస్ట్రేలియా రోడ్లపై మేడిన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు దూసుకుపోనున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నున్న సమీపంలోని విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ‘అవేరా’ తమ వ్యాపార విస్తరణలో భాగంగా ఆ్రస్టేలియాలో అడుగుపెడుతోంది. కాన్బెర్రా రాష్ట్రానికి పైలట్ ప్రాజెక్టు కింద 100 ఎలక్ట్రిక్ స్కూటర్లను అవేరా సంస్థ ఎగుమతి చేయబోతోంది. ఈ విషయాన్ని అవేరా వ్యవస్థాపక సీఈవో డాక్టర్ వెంకటరమణ ‘సాక్షి’ కి తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై చర్చలు జరిగాయని చెప్పారు. కాన్బెర్రా సీఎం ఆండ్రూ భారత్ పర్యటనలో భాగంగా వచ్చే ఏడాది ఏపీకి వస్తారని, అప్పుదీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. చదవండి: వైఎస్సార్ షాదీ తోఫాలో మార్పులు.. సీఎం జగన్ కీలక నిర్ణయం -
పరమ చెత్త కుక్క..!
కాలిఫోర్నియా: చైనా జాతికి చెందిన ఒక కుక్క ప్రపంచంలో పరమ చెత్తగా, అందవిహీనంగా కనిపించే కుక్కగా కిరీటం సాధించింది. ప్రతీ ఏడాది అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే అందవిహీనమైన శునకాల పోటీలో స్కూటర్ అనే పేరు ఉన్న ఏడేళ్ల వయసు శునకానికి ఈ పురస్కారం దక్కింంది. అవార్డు కింద ఒక ట్రోఫి, 1500 డాలర్లు బహుమానాన్ని ఆ కుక్కని పెంచుతున్న యజమానురాలికి ఇచ్చారు. కుక్కల పెంపకం, వాటిలో లోపాలున్న ప్రేమను పంచడం, జంతుప్రేమపై అవగాహన పెంచడం కోసం సొనొమా –మారిన్ ఫెయిర్‌లో ఈ పోటీలు జరుగుతూ ఉంటాయి. -
ఇది స్కూటీ ఆ..? స్కూల్ బస్ ఆ..?
-
వెస్పా మిక్కీ మౌస్ ఎడిషన్ వచ్చేస్తోంది - వివరాలు
Vespa Mickey Mouse Edition: భారతదేశంలో వెస్పా స్కూటర్లకున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మహిళల మనసుదోచే ఈ స్కూటర్ ఇప్పుడు కొత్త ఎడిషన్ రూపంలో విడుదల కావడానికి సన్నద్ధమవుతోంది. దీని కోసం వెస్పా డిస్నీతో చేతులు కలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిస్నీతో చేతులు కలిపిన వెస్పా మిక్కీ మౌస్ అనే స్పెషల్ ఎడిషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ స్కూటర్ మిక్కీ మౌస్ మాదిరిగానే కలర్స్ కలిగి ఉంటుంది. బూట్లను పోలిన పసుపు రంగు వీల్స్, చెవులును తలిపించే మిర్రర్స్, బాడీని గుర్తు చేయడానికి రెడ్ కలర్ ఇక్కడ గమనించవచ్చు. అంతే కాకుండా మిక్కీ మౌస్ సంతకం కూడా ఈ స్కూటర్ మీద ఉండటం గమనార్హం. (ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!) డిజైన్ పరంగా ఎటువంటి మార్పులు లేదు, కానీ ఇందులో కాస్మొటిక్ డిజైన్స్ మాత్రం గమనించవచ్చు. అదే ఇంజిన్ కలిగి ఉంటుంది కాబట్టి అదే పర్ఫామెన్స్ అందిస్తుంది. కాగా ఈ లేటెస్ట్ ఎడిషన్ ఎప్పుడు మార్కెట్లో విడుదలవుతుంది, దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
హోండా డియో కొనాలా.. కొత్త ధరలు తెలుసుకోండి!
Honda Dio H Smart: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ఇటీవల డియో హెచ్-స్మార్ట్ను సైలెంట్‌గా ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ స్కూటర్ ధరలు కంపెనీ అధికారిక వెబ్సైట్లో రూ. 77,712 (ఎక్స్-షోరూమ్) వద్ద ఉన్నాయి. ఇది బిఎస్ 6 స్టేజ్ 2 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ పొందిన కారణంగా దాని స్టాండర్డ్ మోడల్ కంటే కొంత ఎక్కువ ధర పొందింది. హోండా డియో స్టాండర్డ్ అండ్ డిఎల్ఎక్స్ వేరియంట్ల ధరలు గతంలో రూ. 68,625 & రూ. 72,626 వద్ద ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్2 (OBD2) కారణంగా ఈ రెండు వేరియంట్ల ధరలు రూ. 1,586 వరకు పెరిగాయి. ధరల పెరుగుదల కాకుండా ఇందులో ఎటువంటి మార్పులు జరగలేదు. ధరల పెరుగుదల తరువాత 110సీసీ విభాగంలో అత్యంత ఖరీదైన స్కూటర్ల జాబితాలో డియో ఒకటిగా చేరింది. (ఇదీ చదవండి: రూ. 500 నోట్ల రద్దుపై షికార్లు కొడుతున్న పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన శక్తికాంత దాస్!) హోండా డియో స్కూటర్ 109 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ కలిగి.. లేటెస్ట్ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్స్ పొందింది. ఇది 7.8 బిహెచ్పి పవర్ 9 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కొత్త హోండా స్మార్ట్ కీ స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ సేఫ్ వంటి ఫంక్షన్లను పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్నాయి. -
సూర్యుడికి పంచ్.. వీళ్లకి పోలీసుల పంచ్
సూర్యుడు, జనం ‘యూ హౌమచ్ అంటే యూ హౌమచ్’ అనుకుంటున్నారు. ‘అంతు చూస్తా’ అని ఎండలాయన అంటుంటే ‘మగ్గు తీస్తా’ అని సామాన్యుడు కౌంటర్ వేస్తున్నాడు. ఈసారి ఎన్నడూ లేనంతగా వేడి ఉండటంతో జనం బయటకు బయలుదేరుతూ బకెట్ నీళ్లు, మగ్గు తీసుకెళుతున్నారు. మధ్య దారిలో మగ్గుడు నీళ్లు కుమ్మరించుకుని సూర్యుడికి పంచ్ ఇస్తున్నారు. అయితే ఇలా చేసే వారికి పోలీసులు వేసే పంచ్ వెరైటీగా ఉందనుకోండి. ఈ వైరల్ విశేషాలు... మనకు ఎండలు, ఉష్ణం ఎక్కువ కనుకనే ‘చల్లగా బతుకు’ అనే ఆశీర్వాదం పుట్టింది. కాని వేసవిలో ఎంత కాకలు తీరిన వారైనా– ఏసిలు, కూలర్లు పెట్టుకున్నా– ఇష్షో బుష్షో అంటూ ఉబ్బరింతతో తబ్బిబ్బరింత అవడం సర్వసాధారణం అయింది. ఏ ఏడుకాయేడు ఎండలు పెరగడమే తప్ప కూల్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ సంవత్సరమైతే ఉడుకు పీక్ మీద ఉంది. కాని బయటకు వెళ్లక తప్పదు. పనులు చేసుకోక తప్పదు. ఈ ఎండ దెబ్బకు కొందరైతే తిక్క వేషాలు కూడా వేస్తున్నారు. తమిళనాడులోని తంజావూరులో అరుణాచలం అనే కుర్రాడు స్కూటర్ ముందు నీళ్ల బకెట్ పెట్టుకొని ఒక చేత్తో నడుపుతూ మరో చేత్తో మగ్గుతో నీళ్లు కుమ్మరించుకుని వైరల్ అయ్యాడు. ఆరాటంలో నీళ్లు కుమ్మరించుకోవడం అతనికి సరదాగానే ఉన్నా పోలీసులు మాత్రం ‘అలా చేయకూడదు నాన్నా’ అని ముద్దు చేశారు. వారు ముద్దు చేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా? 2000 ఫైన్ పడుద్ది. నీళ్లు కుమ్మరించుకున్నందుకు అరుణాచలం, ఆ వీడియో తీసినందుకు అతని స్నేహితుడు ప్రసన్న చెరో వెయ్యి వేసుకుని లాఠీ సెగ తగలకుండా బయటపడ్డారు. థానేలో జంట... ఇటు అరుణాచలం ఫీట్ వార్తల్లో ఉండగానే అటు ముంబై సమీపంలోని థానేలో ఆదర్శ్ శుక్లా అనే యూ ట్యూబర్‌కు కూడా ఎండ వల్ల మైండ్ బెసికింది. ఒక నీళ్ల బకెట్టును, స్నేహితురాలిని స్కూటర్ మీద కూచోబెట్టుకుని చౌరాస్తాకు చేరుకుని ఆమె చేత మగ్గుల కొద్దీ నీళ్లు కమ్మరించుకున్నాడు. జనానికి కాలక్షేపం, తనకు నాలుగు సబ్స్క్రిప్షన్లు అనుకున్నాడేమో కాని పోలీసులు వెంటనే స్పందించి ‘తగిన చర్య తీసుకొనబడును’ అని సందేశం పంపారు. దాంతో బేర్మన్న యూ ట్యూబర్ ‘సారీ... హెల్మెట్ లేకుండా ప్రయాణించడం తప్పే. ఫైన్ కడతా’ అని వీడియో రిలీజ్ చేశాడు. కాని ట్రాఫిక్‌లో తనకు, ఎదుటివారికి ప్రాణాంతకం కాగల ఫీట్ చేసినందుకు కదా పోలీసులు ఫైన్ వేస్తారు. అది మర్చిపోయాడు. ఎండలకు వీలైనంత చల్లగా ఉండండి. ఇలాంటి క్రేజీ ఐడియాల జోలికి పోకండి. -
ఇప్పుడు మరింత అందంగా మారిన వెస్పా.. కొత్త కలర్స్ అదుర్స్!
Vespa Dual Tone: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు మాత్రమే కాకుండా అప్డేటెడ్ వాహనాలు కూడా విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ్ టూ వీలర్ తయారీ సంస్థ 'పియాజియో ఇండియా' తన అప్డేటెడ్ వెస్పా స్కూటర్ భారతీయ విఫణిలో అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనమూ తెలుసుకుందాం. వెస్పా డ్యుయల్ సిరీస్ పేరు విడుదలైన ఈ స్కూటర్ పేరుకు తగ్గట్టుగానే ఇప్పుడు కొత్త డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్ పొందుతుంది. ఇందులో సీటు, ఫుట్‌బోర్డ్ మాత్రమే కాకుండా పిలియన్ రైడ్‌ను అనుకూలంగా ఉండే రెస్ట్ కూడా కొత్త కలర్ ఆప్షన్ పొందుతుంది. వేరియంట్స్ & ధరలు: పెర్ల్ వైట్ + అజురో ప్రోవెంజా కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ విఎక్స్ఎల్ 125 ధర రూ. 1.32 లక్షలు కాగా, విఎక్స్ఎల్ 150 ధర రూ. 1.46 లక్షలు. పెర్ల్ వైట్ + బీజ్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ విఎక్స్ఎల్ 125 రూ. 1.32 లక్షలు కాగా, విఎక్స్ఎల్ 150 ధర రూ. 1.46 లక్షలు. పెర్ల్ వైట్ + మ్యాట్ రెడ్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ ఎస్ఎక్స్ఎల్ 125 ధర రూ. 1.37 లక్షలు కాగా, ఎస్ఎక్స్ఎల్ 150 ధర రూ. 1.49 లక్షలు. పెర్ల్ వైట్ + మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ ఎస్ఎక్స్ఎల్ 125 ధర రూ. 1.37 లక్షలు కాగా, ఎస్ఎక్స్ఎల్ 150 ధర రూ. 1.49 లక్షలు. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ మహారాష్ట్ర) (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..) కలర్ ఆప్షన్ కాకుండా ఈ స్కూటర్లలో పెద్దగా ఆశించిన మార్పుయ్లు లేదు. 125 సీసీ వేరియంట్ 7,000 rpm వద్ద 9.65 bhp పవర్, 5,600 rpm వద్ద 10.11 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 150 సీసీ వేరియంట్ 7,400 rpm వద్ద 10.64 bhp పవర్, 5,300 rpm వద్ద 11.26 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్లు రెండూ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ పొందాయి. కావున ఉత్తమ పనితీరుని అందిస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
రెండింతలకు చేతక్ స్కూటర్ల ఉత్పత్తి
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని జూన్ నాటికి రెండింతలకు చేర్చనున్నట్టు ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫేమ్–2 పథకం పొడిగింపు విషయంలో నెలకొన్న అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని ఎక్స్‌క్లూజివ్ స్టోర్ల విస్తరణ చేపడుతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం నెలకు 5,000 యూనిట్లను తయారు చేస్తున్నట్టు కంపెనీ ఈడీ రాకేశ్ శర్మ తెలిపారు. ‘విడిభాగాలు సరఫరా చేసే కొందరు వెండార్లపై పెద్ద ఎత్తున ఆధారపడ్డాం. వారు సకాలంలో సరఫరా చేయకపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నాం. సరఫరా సమస్యల నుంచి గట్టెక్కాం. అది మాకు కొంత విశ్వాసాన్ని ఇస్తోంది. మే నెలలో ఉత్పత్తి 7,000 యూనిట్లకు, జూన్‌లో 10,000 యూనిట్లకు చేరనుంది. డిమాండ్‌నుబట్టి భవిష్యత్‌లో ఉత్పత్తి ఏ స్థాయిలో ఉండాలో నిర్ణయిస్తాం. ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 105 నుంచి సెప్టెంబర్‌కల్లా సుమారు 150 తాకనుంది. సరఫరా సమస్యలు తొలగిపోయి డిమాండ్ కొనసాగి, నెట్వర్క్ విస్తరణతో 2023–24లో బజాజ్ ఆటో చేతక్తోపాటు ‘యూలుకు’ సరఫరా చేసిన వాహనాలతో కలిపి విక్రయాలు ఒక లక్ష యూనిట్లకు ఎగుస్తుంది’ అని వివరించారు. సబ్సిడీ పొడిగించాల్సిందే.. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంపొందించే పథకం ఫేమ్–2 పొడిగింపుపై ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉందని బజాజ్ ఆటో అర్బనైట్ బిజినెస్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ పేర్కొన్నారు. ‘పొడిగింపు నిర్ణయానికి ముడిపడి చాలా అంశాలు ఉన్నాయి. సబ్సిడీని నిలిపివేస్తే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు గణనీయంగా పెరుగుతాయి. ’ అని తెలిపారు. -
ఓలా స్కూటర్ పోయింది... ఈ టెక్నాలజీతో దొరికింది
-
కుక్కలు వెంటపడుతున్నాయన్నా టెన్షన్లో.. స్పీడ్ పెంచిందంతే..
ఇటీవల కాలంలో కుక్కల దాడులు ఎక్కువ అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక ప్రభుత్వాస్పత్రిలో కుక్క పసిబిడ్డను నోట కరుచుకున్న ఉదంతం మరువక మునుపే మరో ఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తుండగా కుక్కలు వెంటపడటంతో వేగం పెంచేశారు. పాపం సమీపంలో పార్క్ చేసి ఉన్న కారుని గమనించకుండా ఢీ కొట్టారు. అంతే ఒక్కసారిగా కింద పడిపోయారు. ఈ ఘటన ఒడిశాలోని బెరహంపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఒక చిన్నారితో సహా ఇద్దరు మహిళలు స్కూటీపై గుడికి వెళ్లి వస్తున్నారు. ఇంతలో ఆరు కుక్కలు వారి వెంట పడ్డాయి. దీంతో ఆ మహిళ భయంతో స్పీడ్ పెంచేసింది. మరోవైపు ఆమె ముందు వైపు చూడకుండా వాటి వైపే చూస్తుండటంతో అక్కడ పార్క్ చేసి ఉన్న కారుని గమనించలేదు. దీంతో బండి ఆ కారుని నేరుగా ఢీ కొట్టడంతో ఒక్కసారిగా అంతా కింద పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ ముగ్గురులో కనీసం ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించలేదని మండిపడుతుండగా, మరికొందరు ఇలాంటి ఘటనలు తలెత్తకుండా బెరహంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ట్వీట్ చేశారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: డీజే సౌండ్ తగ్గించమన్నందుకు..గర్భిణి అని చూడకుండా..) -
పేలిన బ్యాటరీ స్కూటర్
మండ్య(బెంగళూరు): మండ్య జిల్లా మళవళ్లి తాలూకా కిరుగావలు గ్రామంలో ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి కాలిపోయింది. శుక్రవారం నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కాగా, స్థానిక పరీక్షా కేంద్రానికి ప్రకాశ్ అనే ఉపాధ్యాయుడు తన బ్యాటరీ స్కూటర్లో వచ్చాడు. దానిని బయట పార్కు చేసి ఉంచాడు. సుమారు 12 గంటల సమయంలో బ్యాటరీ స్కూటర్ పెద్ద శబ్ధంతో పేలిపోయి మంటల్లో చిక్కుకుంది. పక్కనున్న మరో నాలుగు పెట్రోల్ బైక్‌లకు మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు. బూడిదగా మారిన తమ వాహనాలను చూసి యజమానులు లబోదిబోమన్నారు. -
వచ్చే నెలలో విడుదలకానున్న టూ వీలర్స్, ఇవే!
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను వినియోగించాలనే ఆసక్తికలిగిన కస్టమర్ల కోసం కంపెనీలు కూడా ఆధునిక వెహికల్స్ విడుదల చేస్తూనే ఉన్నాయి. ఎప్పటిలాగే వచ్చే నెలలో కూడా కొన్ని లేటెస్ట్ కార్లు, బైకులు దేశీయ విఫణిలో అడుగుపెట్టనున్నాయి. వచ్చే నెల నుంచి బీఎస్6 పేస్-2 ఎమిషన్ నిబంధనలు అమలులోకి రానున్నాయి. కొత్తగా విడుదలయ్యే వాహనాలు తప్పకుండా దానికి లోబడి ఉండాలి. సింపుల్ వన్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు విడుదలైన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికీ విక్రయానికి రాలేదు, ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో గొప్ప ఆదరణ పొందిన ఈ టూ వీలర్ బుకింగ్స్ పరంగా కూడా ఉత్తమ వృద్ధిని కనపరిచింది. కాగా ఈ స్కూటర్ వచ్చే నెల ప్రారంభం నుంచి విక్రయానికి రానున్న సమాచారం. డుకాటీ మాన్స్టర్ ఎస్పీ: ద్విచక్ర వాహన ప్రియులకు ఎంతగానో ఇష్టమైన బైకులతో ఒకటైన డుకాటీ 2023 ఏప్రిల్ చివరి నాటికి తన మాన్స్టర్ ఎస్పీ బైక్ విడుదల చేయాలని ఆలోచిస్తోంది. కంపెనీ గతంలోనే 9 బైకులను విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో మరిన్ని డుకాటీ బైకులు విడుదలయ్యే అవకాశం ఉంది. హోండా యాక్టివా 125 హెచ్- స్మార్ట్: హోండా మోటార్‌సైకిల్ దేశీయ మార్కెట్లో వచ్చే నెలలో ఇప్పటికే విక్రయానికి ఉన్న యాక్టివా స్కూటర్లో కొత్త వెర్షన్ విడుదల చేయనుంది. దీని పేరు 'హోండా యాక్టివా 125 హెచ్-స్మార్ట్'. దీనికి సంబంధించిన చాలా వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. కావున డిజైన్ పరంగా పెద్ద తేడా లేనప్పటికీ.. రిమోట్ ఇంజిన్ స్టార్ట్, కీలెస్ ఇగ్నీషన్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉంటాయని తెలిసింది. 2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ & ఆర్ఎస్: ఇప్పటికే భారతదేశంలో విడుదల కావాల్సిన 2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ & ఆర్ఎస్ బైకులు కొన్ని అనివార్య కారణాల వల్ల లాంచ్ కాలేదు. అయితే ఇవి రెండూ వచ్చే నెలలో విడుదలకానున్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ బైకులకు సంబంధిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
River Indie: ఎక్కువ రేంజ్ అందించే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతో తెలుసా?
బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ రివర్ తన 'ఇండీ' (Indie) ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ఎక్కువ స్టోరేజ్ స్పేస్, ఫ్రంట్ ఫుట్‌పెగ్‌లు, క్రాష్ గార్డ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ.1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది, డెలివరీలు 2023 ఆగష్టులో ప్రారంభమవుతాయి. రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ 4kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఒక ఛార్జ్‌పై 150 కి.మీ పరిధిని అందిస్తుంది, అయితే వివిధ వాతావరణ పరిస్థితుల్లో 120 రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ కేవలం 5 గంటలలో 0-80 శాతం ఛార్జ్ చేసుకోగలదు, ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. రివర్ ఇండీ బ్యాటరీ ప్యాక్ 8.98 బిహెచ్పి పవర్, 26 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 3.9 సెకన్లలో గంటకు 90 కిమీ వేగంతో ముందుకు వెళ్తుంది. ఇందులో ఎకో, రైడ్, రష్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక ట్విన్ హైడ్రాలిక్ షాక్ ఉన్నాయి. ఈ లేటెస్ట్ స్కూటర్ ఒక ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది, కావున లో మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టైల్లైట్ వంటి వాటితో పాటు కాంట్రాస్ట్ డిస్ప్లే, ఛార్జింగ్ పోర్ట్ పొందుతుంది. ఇందులోని పన్నీర్ మౌంట్స్ లగేజ్ మోయడానికి సహాయపడతాయి. రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అందిస్తుంది, కావున ఇందులో 12 లీటర్ల గ్లోవ్ బాక్స్, 43 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి. ఇది మాన్సూన్ బ్లూ, సమ్మర్ రెడ్, స్ప్రింగ్ ఎల్లో వంటి మూడు కలర్ ఆప్సన్స్‌లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ బ్యాటరీ, స్కూటర్ రెండింటికీ 5 సంవత్సరాల/50,000 కిమీ వారంటీ అందిస్తోంది. -
యమహా త్రీ వీల్ స్కూటర్.. కొత్త లుక్ & అదిరిపోయే ఫీచర్స్
అంతర్జాతీయ మార్కెట్లో మూడు చక్రాల స్కూటర్లు చాలా అరుదు, అయితే ప్రపంచం ప్రగతి మార్గంలో పరుగులు పెడుతున్న తరుణంలో ఆధునిక వాహనాల ఉత్పత్తి, వినియోగం చాలా అవసరం. ఇందులో భాగంగా యమహా కంపెనీ ఇప్పుడు జపనీస్ మార్కెట్లో ట్రైసిటీ స్కూటర్ విడుదల చేసింది. యమహా విడుదల చేసిన ట్రైసిటీ స్కూటర్ 125 సీసీ, 155 సీసీ విభాగంలో అందుబాటులో ఉన్నాయి. నిజానికి కంపెనీ ఇలాంటి స్కూటర్ 2014 లో గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసినప్పటికీ భారతీయ మార్కెట్లో అందుబాటులోకి తీసుకురాలేదు. ఇది సాధారణ స్కూటర్ మాదిరిగా ఉన్నప్పటికీ ముందు భాగంలో రెండు చక్రాలు, వెనుక ఒక చక్రం పొందుతుంది. ట్రైసిటీ స్కూటర్ LED డేటైమ్ రన్నింగ్ లైట్స్, సెంటర్ సెట్ LED హెడ్‌లైట్, LCD సెంటర్ కన్సోల్ వంటి వాటితో పాటు సింగిల్ సీట్‌తో ఇంటిగ్రేటెడ్ గ్రాబ్ రైల్ పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్స్, రెండు వైపులా డిస్క్ బ్రేకులు, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక డ్యూయెల్ షాక్ అబ్జార్బర్ కలిగి ఉంటుంది. ట్రైసిటీ స్కూటర్లోని 125 సీసీ ఇంజిన్ 12.06 బిహెచ్పి పవర్, 11.2 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, అదే సమయంలో 155 సీసీ ఇంజిన్ 14.88 బిహెచ్పి పవర్ మరియు 14 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. జపనీస్ మార్కెట్లో విడుదలైన ట్రైసిటీ 125 స్కూటర్ 125 ధర రూ. 4,95,000 యెన్లు (సుమారు రూ. 3.10 లక్షలు) 155 స్కూటర్ ధర 5,56,500 యెన్లు (సుమారు రూ. 3.54 లక్షలు). డెలివరీలు ఫిబ్రవరి, ఏప్రిల్ సమయంలో మొదలవుతాయి. ఈ మోడల్ స్కూటర్ మన దేశంలో విడుదలవుతుందా.. లేదా అనే విషయాన్నీ యమహా ధ్రువీకరించలేదు. -
హీరో జూమ్ బుక్ చేసుకున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్!
హీరో మోటోకార్ప్ ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త 'జూమ్' (Xoom) స్కూటర్ తన తొలి డెలివరీలను ముంబైలో ప్రారంభించింది. కంపెనీ ఈ స్కూటర్ని ఎల్ఎక్స్ (LX), విఎక్స్ (VX), జెడ్ఎక్స్ (ZX) వేరియంట్స్‌లో అందిస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 72,349 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). హీరో లేటెస్ట్ జూమ్ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న హోండా డియోకి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది. ఇది 110 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 8.05 బిహెచ్పి పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ i3S ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ కలిగి ఉండటం వల్ల స్కూటర్ కెపాసిటీ మరింత మెరుగ్గా ఉంటుంది. జూమ్ స్కూటర్ రైడర్, పిలియన్‌కి సౌకర్యవంతంగా ఉన్న విశాలమైన సీటు కలిగి ఉంటుంది. ముందువైపు మంచి లైటింగ్ సెటప్, వెనుక హెచ్ షేప్ టైల్లైట్ కలిగి 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇందులో పొందుపర్చింది. ఫీచర్స్ పరంగా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జర్, గ్లోవ్ బాక్స్ లాంటివి ఉన్నాయి. ఈ స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ సెటప్ వంటి సస్పెషన్ సెటప్ & ఫ్రంట్ డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ తో మంచి బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది. కస్టమర్ల అభిరుచికి తగిన విధంగా కంపెనీ తన కొత్త స్కూటర్ని పోలెస్టార్ బ్లూ, స్పోర్ట్స్ రెడ్, మాట్ అబ్రాక్స్ ఆరెంజ్, పెర్ల్ సిల్వర్ వైట్, బ్లాక్ అనే కలర్ ఆప్సన్స్ అందిస్తోంది. -
75 ఏళ్ల వృద్ధుడిని స్కూటీతో ఈడ్చుకెళ్లిన యువకుడు
-
పట్టపగలే దారుణం..వృద్ధుడిని బైక్‌తో ఈడ్చుకెళ్లి..
బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కారుని ర్యాష్‌గా వచ్చి ఢీ కొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ కారు యజమాని వృద్ధుడుని ఆపేందుకు యత్నించాడంతో ఈడ్చుకెళ్లిపోయాడు. దీంతో పలువురు అతన్ని వెంబడించి అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకెళ్తే..బెంగళూరులోని ముత్తప్ప అనే వ్యక్తి కారుని సాహిల్ అనే వ్యక్తి బైక్‌తో ఢీ కొట్టాడు. దీంతో ఆ వ్యక్తి కారులోంచి దిగి మాట్లాడాదాం అనుకుంటుండగా.. సాహిల్ తన బైక్‌తో పారిపోయేందుకు యత్నించాడు. ఐతే వృద్ధుడు అతన్ని ఆపాలనే ఉద్దేశంతో అతని బైక్ బ్యాక్ సైడ్ గట్టిగా పట్టుకున్నాడు. కానీ సాహిల్ వృద్ధుడన్న కనికరం లేకుండా బైక్‌ని ఆపకుండా ఈడ్చు కెళ్లిపోయాడు. పట్టపగలే అందరూ చూస్తుండగా 71 ఏళ్ల వృద్ధుడుని దాదాపు ఒక కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లాడు. ఇంతలో అటుగా వస్తున్న ఆటో రిక్షా వాలా, ఒక ద్విచక్ర వాహనదారుడు ఆ వ్యక్తిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో ఆ వృద్ధుడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. click here: viral Video (చదవండి: జల్లికట్టు పోటీలో అపశ్రుతి..నలుగురు మృతి) -
అంజలి కారు ముందు పడిపోయింది.. భయంతో పారిపోయా: స్నేహితురాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అంజలి(20) అనే యువతిని కారుతో ఢీకొట్టి లాక్కెళ్లిన ఘటనలో ఆమెతోపాటు తన స్నేహితురాలు కూడా ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు కారు ఢీకొట్టిన సమయంలో అంజలి ఒకరే ఉన్నారని అనుకున్నారు కానీ హోటల్ ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా పార్కింగ్ నుంచి స్కూటీ తీస్తుండగా పక్కన మరో యువతి కూడా కనిపించింది. ఆమే అంజలి స్నేహితురాలు నిధి. ఇద్దరు స్నేహితులు శనివారం సాయంత్రం సుల్తాన్‌పురిలో న్యూ ఇయర్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 1.45 గంటలకు హోటల్ నుంచి అంజలి స్కూటర్‌పై బయలుదేరారు. ముందుగా స్కూటీ డ్రైవ్ చేసే విషయంలో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. టూవీలర్‌ను మొదట నిదీనే డ్రైవ్ చేయగా కొంత సమయం తర్వాత అంజలి డ్రైవింగ్ తీసుకుంది. నిధి వెనకాల కూర్చుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మద్యం మత్తులో అయిదుగురు వ్యక్తులతో వెళ్తున్న కారు స్కూటీని ఢీకొట్టింది. దీంతో అంజలి కారు ముందు పడిపోగా.. నిధి మరోవైపు పడింది. అదృశవశాత్తు ఆమెకు గాయాలేవి అవలేదు. కానీ అంజలి కారు ముందు చక్రాల్లో ఇరుక్కుపోయింది. దీంతో ఆమెను కారుతోపాటే వీధుల గుండా 13 కిమీ ఈడ్చుకెళ్లారు. #WATCH | Kanjhawala death case: CCTV footage of that night shows the presence of another girl with the girl who died after being dragged for a few kilometres by a car that hit her in Sultanpuri area. (CCTV visuals confirmed by police) pic.twitter.com/nd1NUBQVze — ANI (@ANI) January 3, 2023 డ్డ్రైవర్ తప్పిదం వల్లే నిధిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణకు ఆమె సహకరిస్తోందని తెలిపారు. మంగళవారం నిధిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ప్రమాదం జరిగిన తర్వాత భయంతో అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపింది. భయంతో ప్రమాదం గురించి ఎవరికీ చెప్పలేదని ఆమె పేర్కొన్నారు. కారు డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగినట్లు నిధి కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. స్కూటర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని నిందితులు పేర్కొన్నారు. మరోవైపు ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు సైతం ప్రకటించారు. అత్యాచారం జరగలేదు మరోవైపు అంజలిపై హత్యాచారం జరిగినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఢిల్లీ ఆందోళనలు చేపట్టారు. అయితే అంజలిపై అత్యాచారం జరగలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇక కారు డ్రైవ్ చేసిన వ్యక్తితోపాటు మొత్తం అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు నిందితులు అంగీకరించారు. వారిపై నేరపూరిత హత్య అభియోగం, ర్యాష్ డ్రైవింగ్ వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా ఈవెంట్ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న అంజలి సింగ్‌ను ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో జనవరి 1వ తేదీ తెల్లవారు జామున కొంతమంది యువకులు కారుతో ఢీకొట్టి కొన్ని కిలోమీటర్ల మేర ఆమెను ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. స్కూటర్‌ను ఢీకొట్టడంతో భయంతో అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే మహిళ శీరరం కారు చక్రాలకు చిక్కుకుందన్న విషయం వారికి తెలియలేదు. సుల్తాన్పూరి నుంచి కంజావాలా వరకు 13 కిలోమీటర్ల మేరకు ఆమెను అలాగే ఈడ్చుకెళ్లారు. చివరికి కంజావాలా వద్ద యూ టర్న్ తీసుకునే సమయంలో మహిళ కారుతోపాటు రావడాన్ని గమనించిన కారులోని ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే కారు ఆపడంతో ఆమె శరీరం పడిపోయింది. దీంతో మళ్లీ అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. అయితే కారుతోపాటు రోడ్డుపై మహిళ శరీరం ఈడ్చుకెళ్లడం చూసిన ప్రత్యక్ష సాక్షులు పోలీసులుకు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నెంబర్ ప్లేట్ ఆధారంగా కారును ట్రేస్ చేసిన పోలీసులు అదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దీపక్ ఖన్నా(26), అమిత్ ఖన్నా(25), క్రిష్ణణ్(27), మిథున్(26), మనోజ్ మిత్తల్‌గా గుర్తించారు. వీరకి కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. దీపక్ ఖన్నా అనే వ్యక్తి కారు డ్రైవ్ చేస్తుండగా.. స్కూటీనిని ఢీ కొట్టిన సమయంలో దేని మీద నుంచో కారు ఎక్కించినట్లు అనిపించిందని దీపక్ పోలీసుల ఎదుట అంగీకరించాడు, అయితే మిగతావాళ్లు మాత్రం తామకు అలాంటిది ఏం అనిపించలేదని తెలిపారు. స్కూటీని ఢీకొట్టిన తర్వాత అక్కడి నుంచి భయంతో పారిపోయినట్లు తెలిపారు. -
హీరో ఎలక్ట్రిక్ వెహికల్ డెలివరీలు షురూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటో కార్ప్ విదా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ప్రారంభించింది. బెంగళూరుతో మొదలుకుని దశలవారీగా ఇతర నగరాల్లో డెలివరీలు చేపడతారు. 2022 అక్టోబరులో విదా వీ1 వాహనాన్ని కంపెనీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఒకసారి చార్జింగ్ చేస్తే 163 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. వేరు చేయగలిగే బ్యాటరీ, మూడు రకాల చార్జింగ్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. ఢిల్లీలో ఆన్‌రోడ్ ధర విదా వీ1 ప్లస్ రూ.1.35 లక్షలు, విదా వీ1 ప్రో రూ.1.46 లక్షలు ఉంది. -
అయ్యో తల్లి.. ఎంత ఘోరం జరిగిపోయింది
సాక్షి, చెన్నై(అన్నానగర్): ఆర్టీసీ బస్సు ఢీకొని స్కూటర్‌పై వెళుతున్న అమ్మమ్మ, మనవరాలు మృతిచెందిన ఘటన తేనిలో జరిగింది. చిన్నారి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వివరాలు.. తేని జిల్లా వరుసనాడు సమీపంలోని మురుకోడై గ్రామానికి చెందిన అమావాసై, భార్య రాణి (44) కేరళ మున్నార్ సమీపంలోని బూపరాయ్ ప్రాంతంలో ఉంటూ తోట పని చేసేవారు. వీరి కుమారుడు సత్యరాజ్, కుమార్తె యోగాన కుటుంబం కూడా బూపరాయ్ ప్రాంతంలోనే ఉంటోంది. కొద్ది రోజుల క్రితం రాణి, ఆమె కుమారుడు కుమార్తె కుటుంబంతో కలిసి స్వగ్రామమైన తేని జిల్లా మురుకోడై వచ్చారు. మంగళవారం మోటారు సైకిల్, స్కూటర్‌పై బూపరాయ్ బయలుదేరారు. మోటారు సైకిల్‌ను రాణి అల్లుడు జయప్రకాష్ నడుపుతున్నాడు. అక్కడ అతని భార్య, కూతురు రుద్రశ్రీ (04), బంధువు జగతీశ్వరన్ (15) ఉన్నారు. స్కూటర్లో రాణి, ఆమె కోడలు వానతి (25), వానతి కుమారుడు ఉద్గేశ్వరన్ (07)లు వున్నారు. వానతి స్కూటర్ నడిపింది. తేని బోడి రోడ్డులోని తీర్థతొట్టి సమీపంలోని ఓ దుకాణం వద్ద ఆపి టీ తాగారు. తరువాత రుద్రశ్రీ అమ్మమ్మతో కలిసి స్కూటర్‌పై వెళ్లింది. తొప్పుపట్టి సమీపంలో రోడ్డు మలుపు వద్ద పెరియకుళం నుంచి వచ్చిన ప్రభుత్వ బస్సు వెనుక నుంచి ఢీకొంది. బస్సు చక్రం ఎక్కిదిగడంతో రాణి, రుద్రశ్రీ అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని తల్లిదండ్రులు రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. 108లో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పళని శెట్టిపట్టి పోలీసులు తామరైకులంకు చెందిన బస్సు డ్రైవర్ అయ్యన్న స్వామి (52)పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. వదిలేయాలని వేడుకున్నా..) -
అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Cheapest Electric Scooters: దేశంలో గత పది ఏళ్లలో ద్విచక్ర వాహన విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో ఇంధన వాడకం కూడా అదే స్థాయిలో పెరుగుతూ వచ్చింది. దీంతో వాటి డిమాండ్ పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం తెరపైకి వచ్చింది. దీనికి తోడు కేంద్రం ఈ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు పోత్సాహకాలు కూడా అందిస్తోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే వీటితో ప్రయోజనాలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు కూడా ఈవీల కొనుగోలు వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది గానీ ఈవీ మార్కెట్లో వస్తున్న స్కూటర్లు కొన్ని ఖరీదుగా ఉండడం, కస్టమర్ల బడ్జెట్‌కు సరిపోనివి రావడంతో ఈ విషయమై సామాన్యుల్లో కాస్త ఆందోళన మొదలైంది. అటువంటి వారి కోసం చౌకగా వారి బడ్జెట్‌కు సరిపోయే చౌకైన ఎలక్ట్రిక్ వాహనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. Bounce Infinity E1 ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.45,099(బ్యాటరీ లేని వేరియంట్) నుంచి ప్రారంభమవుతుంది. ఒక వేళ మీకు బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కావాలనుకుంటే దాని ధర రూ.68,999. ఇది 2kWh/48V బ్యాటరీతో కంపెనీ అందిస్తోంది. కంపెనీ తెలిపిన ప్రకారం దీని గరిష్ట వేగం 65kmph, 85km రేంజ్ కలిగి ఉంటుంది. Hero Electric Optima CX ఈ ఈవీ స్కూటర్(సింగిల్ బ్యాటరీ వేరియంట్) ధర రూ.62,190గా ఉంది. దీని గరిష్ట వేగం 45 KM/H & 82KM రేంజ్ కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఇది మూడు కలర్స్‌లో కస్టమర్లకు లభిస్తుంది. ఇది 51.2V/30Ah బ్యాటరీతో కంపెనీ అందిస్తోంది. కేవలం 4 నుంచి 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. Avon E Scoot ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కంపెనీ తెలిపిన ప్రకారం.. ఈ స్కూటర్ 65 కి.మీల రేంజ్ ఇస్తుంది. గరిష్ట వేగం 24KMPH, 215W BLDC మోటార్ & 48V/20AH బ్యాటరీతో వస్తుంది. కేవలం 6 నుంచి 8 గంటల సమయంలో దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. Ampere Magnus EX ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో LCD స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ USB పోర్ట్, కీలెస్ ఎంట్రీ మరియు యాంటీ-థెఫ్ట్ అలారం ఉన్నాయి. ఇది 1.2 kW మోటార్‌తో వస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 55 కి.మీ. ఇది 60V, 30Ah బ్యాటరీతో వస్తుంది, ఇది 121 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. దీని ధర రూ.73,999. Hero Electric Photon హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ స్కూటర్ 1200W మోటార్‌తో జతచేసిన 72V, 26 Ah బ్యాటరీ ప్యాక్ ద్వారా ఎనర్జీని పొందుతుంది. ఇది 90 కి.మీల రేంజ్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 45 కి.మీగా ఉంది. ఫీచర్ల పరంగా ఇది LED హెడ్‌లైట్, టెయిల్ లైట్‌తో పాటు అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. కేవలం 5 గంటల్లో దీని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కానుంది. -
కొత్త రంగుల్లో వెస్పా ఎస్ఎక్స్ఎల్
పుణే: వాహన తయారీ సంస్థ పియాజియో.. వెస్పా ఎస్ఎక్స్ఎల్ వేరియంట్లలో కొత్తగా నాలుగు రంగులను పరిచయం చేసింది. వీటిలో మిడ్నైట్ డిసర్ట్, టస్కనీ సన్‌సెట్, జేడ్ స్ట్రీక్, సన్నీ ఎస్కపేడ్ ఉన్నాయి. ఇప్పటికే ఇవి మార్కెట్లో లభ్యం అవుతున్నాయని కంపెనీ తెలిపింది. ధర తెలంగాణ ఎక్స్‌షోరూంలో రూ.1.32 లక్షల నుంచి రూ.1.51 లక్షల వరకు ఉంది. చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
సుజుకి కొత్త స్కూటర్, అదిరే ఫీచర్స్, ప్రీమియం లుక్, ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: మారుతి సుజుకి ద్విచక్ర వాహన అనుబంధ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా సరికొత్త స్కూటర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. బర్గ్‌మన్ స్ట్రీట్ ఈఎక్స్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. బర్గ్‌మన్ స్ట్రీట్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ ఈఎక్స్ మోడల్‌ను విడుదలచేసింది. లేటెస్ట్ టెక్నాలజీ,నయా ఫీచర్లతో ప్రీమియం లుక్‌లో ఆకట్టుకునేలా ఆవిష్కరించింది. (వాట్సాప్ అవతార్ వచ్చేసింది..మీరూ కస్టమైజ్ చేసుకోండి ఇలా!) ధర: సుజుకీ బర్గ్‌మన్ స్ట్రీమ్ ఈఎక్స్ ధరను రూ.1,12,300 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. మారుతి సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ స్టాండర్డ్ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 89,900 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ), సుజుకి బర్గ్మాన్ స్ట్రీట్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ రూ. 93,300 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)కి అందుబాటులో ఉంది.మెటాలిక్ మ్యాట్ ప్లాటినమ్ సిల్వర్, మెటాలిక్ రాయల్ బ్రాంజ్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్ లభ్యం. సుజుకీ బర్గ్‌మన్ స్ట్రీమ్ ఈఎక్స్ ఇంజీన్ ఫీచర్లు ఎఫ్ఐ టెక్నాలజీతో పాటు ఎకో పర్ఫార్మెన్స్ ఆల్ఫా (SEP-a) ఇంజిన్‌తో 124cc సీసీ మోటార్‌ను అమర్చింది. ఇది 8.6PS గరిష్ట శక్తిని ,10Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఆటో స్టాప్-స్టార్ట్ సిస్టమ్ ,సైలెంట్ స్టార్టర్ సిస్టమ్ ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. వెనుక 12 అంగుళాల వెడల్పైన, పెద్ద టైర్‌ను అమర్చింది. సుజుకీ రైడ్ కనెక్ట్ బ్లూటూత్ డిజిటల్ ఎనేబుల్డ్ కన్సోల్‌తో కూడిన సుజుకీ రైడ్ కనెక్ట్ ఫీచర్ ను సుజుకీ బర్గ్‌మన్ స్ట్రీట్ ఈఎక్స్ మరో ఫీచర్. ఇది స్మార్ట్‌ఫోన్‌ను సింక్ చేసే సౌలభ్యాన్ని రైడర్‌కు అందిస్తుంది. నావిగేషన్, ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ అలెర్ట్స్ ఈ బైక్ డిస్ప్లేలో చూడవచ్చు. స్పీడ్ ఎక్సీడింగ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవల్స్ కూడా డిజిటల్ కన్సోల్‌లో కనిపిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లను ఈ స్కూటర్ కన్సోల్కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్పీడ్ ఎక్సీడింగ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ లాంటి వివరాలు కూడా ఈ బైక్ డిజిటల్ కన్సోల్‌లో కనిపిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లను ఈ స్కూటర్ కన్సోల్కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. -
Viral Video : వాటే ఐడియా.. స్కూటర్ని ఇలా కూడా వాడేయొచ్చా..!
-
స్కూటర్ని ఇలా కూడా వాడేయొచ్చా!: మహీంద్రా మెచ్చిన ఆవిష్కరణ
మనసు పెడితే దేన్నైనా మనకు సహాయకారిగా ఉపయోగించవచ్చు. కొంచెం కామెన్సెన్స్ ఉంటే దానికి కాస్త తెలివి తోడైతే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. అందుకు ఉదాహరణ ఇక్కడొక వ్యక్తి నిర్మాణ పనులకు స్కూటర్ని ఉపయోగిస్తున్న విధానమే నిదర్శనం. ఇలా కూడా స్కూటర్ని వాడేయొచ్చా అని ఆశ్చర్యం కలిగించేలా ఉపయోగించాడు. వివరాల్లోకెళ్తే...ఇది వరకు 90లలో ఉపయోగించే స్కూటర్ని సిమ్మెంట్ బస్తాలను చేరవేసే సాధనంగా ఉపయోగించాడు ఒక వ్యక్తి . స్కూటర్ మోటారుకి తాడు చివర భాగాన్ని ఇంజన్‌కి జోడించడంతో..దాని సాయంతో సిమ్మెంట్ బస్తాలను నిర్మాణంలో ఉన్న భవనంపైకి తరలిస్తున్నారు. స్కూటర్ హ్యాండిల్‌ని రైజ్ చేయగానే బస్తా పైకెళ్లుతుంది. ఎంచక్కా మనుషుల సంఖ్య, ఖర్చు తగ్గుతుంది కూడా. పని కూడా ఎంతో సులభంగా అయిపోతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అంతేగాదు ఈ సరికొత్త ఆవిష్కరణను ఆనంద్ మహీంద్ర మెచ్చుకుంటూ ట్విట్టర్లో... వీటిని పవర్ రైళ్లు అని పిలుస్తాం. ఇంజన్ల శక్తిని ఉపయోగించడానికి అనేక మార్గాలు. ఈ స్కూటర్ మెరుగ్గా ఉంటుంది. నిశబ్దంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఇవి సెక్హ్యాండ్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు మహీంద్ర. 👏🏽👏🏽👏🏽 I guess that’s why we call them ‘power’trains. Many ways to utilise the power of vehicle engines. This would be even better ( and quieter!) with an e-scooter, once their cost is brought down or they are available second-hand. pic.twitter.com/Xo6WuIKEMV — anand mahindra (@anandmahindra) December 6, 2022 (చదవండి: ఒక వ్యక్తినే పెళ్లాడిన ట్విన్ సిస్టర్స్: వీడియో వైరల్) -
ఓలా ఎలక్ట్రిక్ బైక్.. ఊహించని అమ్మకాలు, మళ్లీ అదే సీన్ రిపీట్!
ప్రముఖ విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ నవంబర్‌లో 20 వేల యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. పండుగ సీజన్ తర్వాత కూడా తమ విక్రయాలు జోరు ఏ మాత్రం తగ్గలేదని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలు జనాదరణ పొందుతున్న తరుణంలో ఓలా కంపెనీ విడుదల చేసిన ఈవీ బైకలు అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయి. సేల్స్‌లో మరో సారి 20వేల మార్క్‌ను అందుకున్నట్లు ఓలా సహ వ్యవస్థాపకుడు సీఈఓ భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. కాగా గత అక్టోబర్‌లోనూ సేల్స్ 20 వేలు దాటాయంటూ ఓలా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో.. తమ ద్విచక్ర వాహన బ్రాండ్ మెరుగైన వృద్ధిని సాధించింది. స్కూటర్ మార్కెట్ వాటాలో 50 శాతం సొంతం చేసుకున్నాం. నవంబర్‌లో మా అమ్మకాలు మళ్లీ 20,000 యూనిట్లను దాటాయి. భారతదేశంలో అతిపెద్ద ఈవీ కంపెనీగా మార్చిన మా కస్టమర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. జూన్ 2021లో 1,400 EVల నుంచి ప్రస్తుతం 90 శాతం ఈవీ సెగ్మెంట్ షేర్ కలిగి ఉంది. 2025 చివరి నాటికి అన్ని 2W విభాగాలలో EVలకు 100 శాతం షేర్ ఉండబోతోందని ట్వీట్ చేశారు. నవంబర్‌లో ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి అనే డేటాను ఓలా కంపెనీ స్పష్టంగా వెల్లడించలేదు. 20,000 యూనిట్లు అమ్మకాలను మరో సారి అందుకున్నట్లు మాత్రమే ప్రకటించింది. ఓలా ప్రస్తుతం భారత్‌లో S1 ఎయిర్, S1, S1 ప్రోల పేరుతో విక్రయాలు జరుపుతోంది. దీని ధరలు రూ. 84,999 నుంచి రూ. 1.39 లక్షలుగా ఉంది( ఎక్స్-షోరూమ్). వీటిలో ఎస్1 ప్రో ఒక సారి ఫుల్ చార్జింగ్‌తో 116kmph అత్యధిక వేగంతో 180km వరకు ప్రయాణించగలదు. Our sales crossed 20000 again in Nov. Largest EV company in India by a margin! Huge thanks to our customers. From 1400 EVs in June 2021, to 90% EV share today, #EndIceAge is complete in the premium scooter segment! Transition to EVs will be 100% in all 2W segments by end 2025! pic.twitter.com/8dRHcxaxnd — Bhavish Aggarwal (@bhash) December 1, 2022 చదవండి: విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్ కంపెనీ -
బైక్ కొనాలనుకునే వారికి షాక్.. ధరలు పెంచిన ప్రముఖ కంపెనీ!
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ మోటర్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను రూ. 1,500 వరకూ పెంచనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1 నుండి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. మోడల్స్, మార్కెట్లను బట్టి పెంపు పరిమాణం ఉంటుందని సంస్థ వివరించింది. ‘ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్ల కారణంగా మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచక తప్పడం లేదు’ అని హీరో మోటోకార్ప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా తెలిపారు. ధరల భారం ప్రభావం కస్టమర్లపై ఎక్కువగా పడకుండా వినూత్న ఫైనాన్సింగ్ ఆప్షన్లు కూడా అందించడం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ మెరుగుపడే సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో పరిశ్రమ అమ్మకాలు పుంజుకోగలవని ఆశిస్తున్నట్లు గుప్తా వివరించారు. చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! -
మరీ ఇంత దారుణమా.. అప్పు చెల్లించకపోతే ఇలా చేస్తారా?
భువనేశ్వర్: ఒడిశా కటక్ నగరంలో అమానవీయ ఘటన జరిగింది. అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో ఓ యువకుడ్ని స్కూటర్‌కు కట్టేసి పరుగెత్తించింది ఓ గ్యాంగ్. అతని చేతులకు తాడు కట్టి నడిరోడ్డుపై చాలా దూరం లాక్కెల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WatchVideo l Youth tied to scooter dragged along road in #Odisha pic.twitter.com/2idf9dAMrI — Prameya English (@PrameyaEnglish) October 17, 2022 వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. యువకుడు తనకు తెలిసిన వాళ్ల దగ్గరే కొంతడబ్బు అప్పుగా తీసుకున్నాడని, కానీ వాళ్లు తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా అతను ఇవ్వకపోవడంతో ఇలా చేశారని తెలిపారు. ప్రాథమిక విచారణలో ఈ విషయం తెలిసిందని వివరించారు. ఇది చాలా సున్నితమైన కేసు అయినందున నిందితుల వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు. విచారణ పూర్తయ్యక అన్ని వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఒడిశాలో ఇలాంటి ఘటనలు జరగడం కొత్తేం కాదు. గతంలోనూ ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగిలించాడని అతడ్ని లారీ ముందుభాగంలో కట్టేసి, మెడలో చెప్పుల దండవేసి ఊరేగించారు. జగత్సింగ్పుర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చదవండి: అత్యాచార కేసులో నిందితుడికి బెయిల్.. కానీ.. పెళ్లిపై షరతు! -
టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ లాంచ్.. ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: ప్రముఖ టూవీలర్ సంస్థ టీవీఎస్ కొత్తగా అప్డేట్ చేసిన జూపిటర్ వెహికల్నులాంచ్ చేసింది. దేశంలో 50 లక్షల స్కూటర్ల మైలు రాయిని చేరుకున్న సందర్భానికి గుర్తుగా స్పెషల్ ఎడిషన్‌గా ‘‘ ఫాస్టెస్ట్ ఫైవ్ మిలియన్ వెహికిల్స్ ఆన్ రోడ్’’ అంటూ టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ స్కూటర్‌ను తెచ్చింది. ఈ స్కూటర్లు మిస్టిక్ గ్రే, రీగల్ పర్పుల్ రంగుల్లో లభ్యం. క్లాసిక్ టాప్-స్పెక్ ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధరను రూ. 85,866 (ఎక్స్ షోరూం) గా కంపెనీ నిర్ణయించింది. కాస్మెటిక్ మార్పులు, ఇంజీన్ జూపిటర్ క్లాసిక్ ఇతర వేరియంట్లతో పోల్చినప్పుడు అది ప్రత్యేకంగా కనిపించేలా పలు బ్యూటీ అప్డేట్స్ ఇచ్చింది. ముందు ,బ్రౌన్ బాడీ ప్యానెల్ల వద్ద లేతరంగు గల విజర్‌ను పొందుతుంది (ఇతర వేరియంట్లు బ్లాక్ ప్యానెల్). మిర్రర్లు ఇతర వేరియంట్లలో క్రోమ్‌తో పోలిస్తే బ్లాక్ ఫినిషింగ్‌ను ఇచ్చింది. ఫ్రంట్ ఆప్రాన్ న్యూ గ్రాఫిక్స్, పైనుంచి కిందికి జుపిటర్ బ్యాడ్జింగ్ లాంటివి యాడ్ చేసింది. జూపిటర్ క్లాసిక్ నెక్స్ట్ జెన్ అల్యూమినియం, 109.7 సిసి, సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజన్ 7.47 పిఎస్ పవర్, 8.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మోటార్ పేటెంట్ ఎకోనోమీటర్తో కూడా వస్తుంది, ఇది 'ఎకో మోడ్' ,'పవర్ మోడ్' రెండింటిలోనూ రైడర్లను గైడ్ చేస్తుంది. ఎలక్ట్రిక్ స్టార్టర్,కిక్ స్టార్టర్ రెండింటితోపాటు, బ్రేకింగ్ హార్డ్‌వేర్, ముందు డిస్క్, రియర్ డ్రమ్ బ్రేక్‌ను కలిగి ఉంటుంది. టెలిస్కోపిక్ఫోర్క్, త్రిస్టెప్ ఎడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్ ఇందులో ఉన్నాయి. -
40 ఏళ్ల కిత్రం ఆ స్కూటర్ క్రేజ్ వేరబ్బా.. మళ్లీ స్టైలిష్ లుక్‌తో వచ్చేస్తోంది!
ఒకప్పుడు ఆటో మొబైల్ రంగాన్ని ఏలిన లాంబ్రెట్టా స్కూటర్ కంపెనీ మరోసారి భారత్‌లో తన మార్క్‌ని చూపెట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం 1970లో కస్టమర్లను తనవైపు తిప్పుకుని భారత రోడ్లపై రయ్ రయ్ మంటూ తిరిగిన లాంబ్రెట్టా స్కూటర్లును .. 2023లో లేటెస్ట్ మోడల్‌తో తిరిగి అందుబాటులోకి తీసుకురానుంది. కొత్తగా రానున్న మోడల్స్‌లో 200, 350సీసీ ఇంజిన్స్‌తో ఈ స్కూటర్లు రానున్నాయి. వీటితో పాటు 2024 చివరి నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. బర్డ్ గ్రూప్‌తో జాయింట్ వెంచర్లో భాగంగా ఈ కంపెనీ మార్కెట్లోకి ఈ స్కూటర్లను తీసుకురాబోతున్నాయి. కంపెనీ ముఖ్య అధికారి మాట్లాడుతూ.. బర్డ్ గ్రూప్‌తో కలిసి వచ్చే 5 సంవత్సరాలలో $200 మిలియన్లకు పైగా ఈ రంగంలో పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. 1970లో భారత్ మార్కెట్లో ఈ స్కూటర్ బ్రాండ్‌కి ప్రత్యేక గుర్తింపుతో పాటు కస్టమర్లలో వీటికి విపరీతమైన క్రేజ్ ఉండేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కొత్త రకం స్కూటర్ల మోడళ్లను డిజైన్, లుక్, ఫీచర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో విడుదల కానున్న స్కూటర్లతో కంపెనీకి భారత్‌లో ఉన్న గత వైభవాన్ని తిరిగి తీసుకురావడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ స్కూటర్లు హై-ఎండ్ మోడల్స్‌గా, మార్కెట్లో ప్రస్తుతం ఉన్న అత్యంత ఖరీదైన మోడల్‌ల కంటే దాదాపు 20% ఖరీదు ఉంటుందని అంచనా. ఈ జాయింట్ వెంచర్లో లాంబ్రెట్టా 51% వాటా ఉండగా, మిగిలిన 49% బర్డ్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఎలక్ట్రిక్ లాంబ్రెట్టా స్కూటర్ 2023లో మిలన్ మోటార్‌సైకిల్ షోలో ప్రజలకు ప్రదర్శించబోతోంది. అదే మోడల్‌ను భారత్‌లో స్థానికంగా ఉత్పత్తి చేయాలని చూస్తోంది. లాంబ్రెట్టా ప్రస్తుతం దాదాపు 70 దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. -
మార్కెట్లోకి ఓలా న్యూ వెర్షన్ స్కూటర్, అదిరే ఫీచర్లు, కేవలం రూ.499తో మన ఇంటికి!
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఓలా మరో సంచలనానికి సై అంది. ఇప్పటికే దేశం నలుమూలలా విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు రయ్ రయ్ మంటూ రోడ్లపై పరుగులు పెడుతుండగా ఆగస్టు 15న ఈ కంపెనీ నుంచి రెండో ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 (Ola S1)ని కూడా రిలీజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో నావిగేషన్, సహచర యాప్, రివర్స్ మోడ్ వంటి సాఫ్ట్వేర్ ఫీచర్లు ఉన్నాయి. లేటస్ట్ టెక్నాలజీ, సౌకర్యవంతమైన రైడ్‌ని అందివ్వగల ఈ స్కూటర్ ధరని రూ.99,000గా నిర్ణయించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం రూ.499 చెల్లించి కస్టమర్లు ఈ స్కూటర్ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఆగస్టు 15 నుంచి 31 వరకు బుక్ చేసుకున్న వారికి మాత్రమే. ఈ తేదీలో బుక్ చేసుకున్న కస్టమర్లకు సెప్టంబర్ 7 నుంచి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. Ola S1 బ్యాటరీ 3KWh సామర్థ్యం ఉండగా, ఒక సారి చార్జ్ చేస్తే 141 కిలోమిటర్లు ప్రయాణించవచ్చు. ఇందులో 3 రకాల డ్రైవింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎకో మోడ్‌లో 128 కిలోమిటర్లు , సాధారణ మోడ్ (నార్మల్ మోడ్) 101 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్‌లో 90కి.మీ వరకు ప్రయాణించవచ్చు. దీని టాప్ స్పీడ్ 95kmphగా ఉంది. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఐదు కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. చదవండి: ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ: మూడు నెలల్లో మూడోసారి -
వావ్...హోండా యాక్టివా 7జీ కమింగ్ సూన్..!
సాక్షి,ముంబై: హోండా 2వీలర్స్ తన కస్టమర్లకు మరో చక్కటి స్కూటర్‌ను అందించనుందా. కంపెనీ విడుదల చేసిన తాజా టీజర్ ఈ అంచనాలనే బలపరుస్తోంది. “కమింగ్ సూన్” అంటూ రానున్న హోండా యాక్టివా స్కూటర్‌పై వినియోగదారులను ఆకట్టుకుంటోంది. రానున్న కొత్త స్కూటర్ ఫీచర్లు లాంటి విషయాలపై హోండా ఎలాంటి ధృవీకరణ చేయనప్పటికీ టీజర్‌లోని సిల్హౌటీని చూసి హోండా యాక్టివా 7జీ కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా యాక్టివా 6జీని తీసుకొచ్చింది. ఫ్రంట్ టర్న్ ఇండికేటర్లు, హెడ్‌ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్స్, హ్యాండిల్ బార్స్తోపాటు, కొత్త డిజైన్, ఫీచర్ అప్గ్రేడ్లతో హోండా యాక్టివా 7జీ రానుంది. అయితే యాక్టివా 6 జీ మోడ్‌తో పోలిస్తే ఫీచర్లను మరింత అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలున్నాయి. (జియో మెగా ఫ్రీడం ఆఫర్, ఏడాది ఉచిత సబ్స్క్రిప్షన్) BS6-కంప్లైంట్ 109.51cc, ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ సింగిల్-సిలిండర్ ఇంజన్ని ఉపయోగిస్తుంది. ఈ మోటార్ 8,000rpm వద్ద 7.79bhpను, 5,250rpm వద్ద 8.79Nm శక్తిని అందిస్తుంది. 'సైలెంట్ స్టార్ట్' సిస్టమ్, పాస్ లైట్ స్విచ్, 12 అంగుళాల ఫ్రంట్ వీల్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, సాంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ యూనిట్‌తో సహా చాలా ఫీచర్లు యథావిధిగా ఉంటాయని అంచనా. అలాగే టీవీఎస్ జూపిటర్ వంటి ప్రత్యర్థులు కూడా అందిస్తున్న బ్లూటూత్ కనెక్టివిటీ వంటి కొత్త ఫీచర్లను వచ్చే దీపావళి నాటికి లాంచ్ అవుతుందని సమాచారం. చదవండి : Revised ITR: రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు? రాబోయే హోండా హోండా యాక్టివా 7జీ ఖరీదైనదిగా ఉండనుందట. ప్రస్తుత స్టాండర్డ్ మోడల్ ధర రూ. 72,400, డీలక్స్ వేరియంట్‌కు రూ. 74,400 వద్ద విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇది హీరో ప్లెజర్ ప్లస్, టీవీఎస్ జూపిటర్ప్లస్, హీరో Maestro Edge 110, యమహా ఫాసినోలాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. Raise the bar with style that is unlike any other. Stay tuned! pic.twitter.com/u9RwNWe48F — Honda 2 Wheelers (@honda2wheelerin) August 9, 2022 -
హోండా డియో స్పోర్ట్స్ లాంచ్, ఆశ్చర్యంగా ధర తక్కువే!
సాక్షి,ముంబై: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త స్పోర్టీ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. హోండా డియో స్పోర్ట్స్ పేరుతో రెగ్యులర్ డియో మోటో-స్కూటర్ స్పోర్టీ వెర్షన్‌గా లాంచ్ చేసింది. అయితే లిమిటెడ్ ఎడిషన్‌గా తీసుకొచ్చిన హోండా స్పోరర్ట్స్ పరిమిత కాలంలోనే అందుబాటులో ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్ ధర 68,317/- (ఎక్స్-షోరూమ్). టాప్-ఎండ్ డీలక్స్ వేరియంట్ ధర రూ. 73,317 (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ ప్రకటించింది. రెగ్యులర్ డియో స్టాండర్డ్ , డీలక్స్ ధర రూ. 73,599, రూ. 77,099 (ఎక్స్-షోరూమ్)ధరలతో పోలిస్తే కొత్త లిమిటెడ్ ఎడిషన్ ధరలు చౌకగా ఉండటం విశేషం. ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ స్పోర్టీ రెడ్ రియర్ సస్పెన్షన్‌తో తీసుకొచ్చిన హోడా డియో స్పోర్ట్స్ స్కూటర్ బ్లాక్‌తో స్ట్రోంటియమ్ సిల్వర్ మెటాలిక్ ,స్పోర్ట్స్ రెడ్ విత్ బ్లాక్ 2 కలర్ స్కీమ్‌లలో వస్తుంది. డీలక్స్ వేరియంట్ అదనంగా అల్లాయ్ వీల్స్‌ను అందిస్తుంది. 110 cc PGM-FI ఇంజిన్‌తో మెరుగైన స్మార్ట్ పవర్ (eSP) సాంకేతికతను అందిస్తుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ ఫంక్షన్ స్విచ్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లిడ్, పాస్ స్విచ్ , ఇంజన్ కట్-ఆఫ్‌తో కూడిన సైడ్ స్టాండ్ ఇండికేటర్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఇంకా డియో స్పోర్ట్స్‌లో హోండా కాంబి-బ్రేక్ సిస్టమ్ (CBS) ఈక్వలైజర్, 3-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్, మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం 3-స్టెప్ ఎకో ఇండికేటర్‌ని జోడించింది. -
స్కూటర్ని ఢీ కొట్టిన మోటార్ బైక్: షాకింగ్ వీడియో
అతి వేగం ప్రమాదకరం అని చెబుతూ ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ఇంకా ఎక్కడో ఒకచోటా ఏదో ఒక ప్రమాదం జరగుతూనే ఉంటుంది. మనం బాగా నడిపిన అవతల నుంచి వచ్చే వ్యక్తి సరిగి డ్రైవ్ చేయకపోయితే ఇకా అంతే పరిస్థితి. మైనర్లు బండి నడపకూడదని సూచనలు సైతం ఇస్తూన్నా వాటిని సైతం పెడచెవిని పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కూడా అచ్చం అలానే ఒక మైనర్ మోటార్ బైక్‌ని అతి వేగంగా నడిపి ఘోరమైన రోడ్డు ప్రమాదానిక కారకుడయ్యాడు. వివరాల్లోకెళ్తే....పాట్నాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న మోటార్ బైక్ ఎదురుగా వస్తున్న స్యూటర్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదం పాట్నాలోని గంగా మార్గంలో జరిగింది. దీంతో స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరికి, బైక్ నడిపిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు క్షతగాత్రులను ఆస్పుత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐతే మోటార్ బైక్‌ని నడిపిన వ్యక్తి మైనర్ని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. #WATCH | A speeding motorcycle rider hits a scooty coming from the opposite direction at Ganga Pathway in Patna. Scooty riders hospitalised. Police say, "FIR registered. The biker is a minor & hospitalised too. Both vehicles confiscated, investigation on." (Source: Viral video) pic.twitter.com/LyLHK1URa0 — ANI (@ANI) June 8, 2022 (చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల పార్కింగ్‌లో అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన వాహనాలు, ఫొటోలు వైరల్) -
సెట్ దోశ కాదు.. సీటుపై దోశ
ఎండలు ఎలా మండుతున్నాయో తెలుసుగా.. అయితే.. కొందరు వామ్మో ఎండలు అని చిరాకు పడకుండా.. తమలోని క్రియేటివిటీకి ఇలా పదును పెడుతున్నారు. పెనంలా బాగా వేడెక్కిన తన స్కూటర్ సీటుపై ఓ వ్యక్తి ఇదిగో ఇలా దోశ వేసేశాడు.. ఈ వీడియోను ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ గొయెంకా ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట హల్చల్ చేస్తోంది. పునరుత్పాదక శక్తిని అద్భుతంగా వినియోగించుకుంటున్నాడని కొందరు వ్యాఖ్యానించగా.. ఇంధనాన్ని ఆదా చేస్తూ.. దేశంలో ధరలను తగ్గించడంలో, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ప్రభుత్వానికి సాయపడుతున్నాడంటూ మరికొందరు సరదాగా కామెంట్ చేశారు. వీడియోను చూడాలంటే ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి.. -
సెంచరీ దాటింది, సరికొత్త మైలురాయి చేరుకున్న ఈవిట్రిక్!
ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ ఈవిట్రిక్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. దేశ వ్యాప్తంగా 100 డీలర్ షిప్‌లను పూర్తి చేసుకుందని ఆ సంస్థ ఫౌండర్ మనోజ్ పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈవిట్రిక్ మోటార్స్ 6 నెలల కాలంలోనే దేశ వ్యాప్తంగా 100కు పైగా డీలర్ షిప్‌ను చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈవీట్రిక్ స్కూటర్లు రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, వెస్ట్ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలలో లభిస్తున్నాయని తెలిపారు. మెట్రో నగరాలకు అతీతంగా ఆగ్రా, వారణాసి, అలీఘర్, జోధ్‌పూర్, బికనీర్, సూరత్ తో పాటు ఇతర ప్రాంతాల్లో సత్తా చాటుందని అన్నారు. ఇక దేశంలో పెరిగిపోతున్న పెట్రో ధరల కారణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరిగిపోతుందని, డిమాండ్‌కు అనుగుణంగా వెహికల్స్‌ను కొనుగోలు దారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈవిట్రిక్ ఫౌండర్ మనోజ్ పాటిల్ చెప్పారు. -
ఓలా స్కూటర్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన భవీశ్ అగర్వాల్
ఓలా స్కూటర్ యూజర్లకు ఆ కంపెనీ సీఈవో భవిశ్ అగర్వాల్ శుభవార్త చెప్పారు. గత ఆర్నేళ్లుగా ఎదురు చూస్తున్న కీలక ఫీచర్‌కి సంబంధించిన అప్డేట్ను వెల్లడించారు. అతి త్వరలోనే యూజర్లకు మూవ్ఓఎస్2 అప్డేట్ అన్‌లాక్ అవుతుందని తెలిపారు. ఓలా స్కూటర్ ప్రీ పొడక్షన్లో ఉండగానే దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. లక్షన్నర ప్రీ బుకింగ్స్‌తో సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా వచ్చిన బూమ్‌తో స్కూటర్ డెలివరీ ఒత్తిడిలో పడిపోయింది ఓలా సంస్థ. ఆగష్టు 15న ప్రీ బుకింగ్స్ ప్రారంభమైతే అక్టోబరు చివరి వారం నాటికి గానీ డెలివరీ చేయలేకపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా కస్టమర్లకు బైకులు డెలివరీ అవుతున్నాయి. అయితే యూజర్లకు డెలివరీ అయిన బైకుల్లో చాలా ఆప్షన్లో లాక్‌మోడ్‌లోనే ఉండిపోయాయి. డిజిటల్ కీ, మూవ్ఓస్ లాంటి ఫీచర్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. క్రమంగా ఒక్కో ఫీచర్‌ను అన్‌లాక్ చేస్తూ వస్తోంది ఓలా. దీనిపై ఇప్పటికే అనేక విమర్శలు ఓలాను చుట్టుముట్టాయి. ఈ తరుణంలో భవీశ్ అగర్వాల్ త్వరలోనే మూవ్ఓస్ 2 అందుబాటులోకి వస్తోందంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఓలా స్కూటర్ డిజటల్ కన్సోల్‌లో నావిగేషన్ మ్యాప్ అందుబాటులోకి రానుంది. Taking the wife out for some ice cream! Navigation on MoveOS 2 working great 👌🏼Coming very soon to all. pic.twitter.com/CUXh2mOQYQ — Bhavish Aggarwal (@bhash) April 18, 2022 చదవండి: ఓలా మరో సంచలనం! 5 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. 160 కి.మీ ప్రయాణం.. -
మంటల్లో చిక్కుకున్న ఓలా స్కూటర్.. క్షణాల్లో బుగ్గి..
పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గిస్తుందంటూ చెబుతూ వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయా? అంటే అవును అనేట్టుగా వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వేసవి కాలం మొదలైందో లేదో ఒకే రోజు తమిళనాడు, మహారాష్ట్రలలో రెండు చోట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. పూనే నగరంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1 ప్రో బైకు అగ్నికి ఆహుతయ్యింది. రోడ్డు పక్కన ఓ షాపు ముందు నిలిపి ఉంచిన స్కూటరు నుంచి ఉన్నట్టుండి పొగలు రావడం మొదలైంది. క్షణాల్లోనే దట్టమైన పొగలు కాస్తా మంటలుగా మారింది. నిమిషాల వ్యవధిలోనే ఓలా స్కూటర్ అగ్ని కీలల్లో చిక్కుకుని కాలి మసయ్యింది. అక్కడే ఉన్న స్థానికులు ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. A @OlaElectric scooter starts burning out of nowhere in front of our society. The scooter is totally charred now. Point to ponder.#safety #Pune @Stockstudy8 @MarketDynamix22 @LuckyInvest_AK pic.twitter.com/C1xDfPgh6p — funtus (@rochakalpha) March 26, 2022 దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉన్న ఓలా స్కూటర్ మంటల్లో చిక్కుకుని తగలబడి పోవడం సంచలనంగా మారింది. ఈ స్కూటరులో అమర్చిన లిథియం ఐయాన్ బ్యాటరీలో ఎక్సోథెర్మిక్ రియాక్షన్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని.. స్కూటరు డిజైనులో లోపాలు ఉంటే వెంటనే సరి చేయాలని ఓలా స్కూటర్ యూజర్లు డిమాండ్ చేస్తున్నారు. As summer arrives, it’s a real test for survival of #EV in India. #EVonFire #BatteryMalfunction pic.twitter.com/Xxv9qS4KSu — Saharsh Damani, MBA, CFA, MS (Finance) (@saharshd) March 26, 2022 మరోవైపు ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైకు మంటల్లో చిక్కుకోవడం కారణంగా ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన శనివారం తమిళనాడులోని వెల్లూర్‌లో చోటు చేసుకుంది. దురైవర్మ అనే ఫోటోగ్రాఫర్ ఇటీవలే ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నాడు. రాత్రి ఛార్జింగ్ పెట్టి నిద్రకు ఉపక్రమించాడు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా స్కూటర్‌కు మంటలు అంటున్నాయి. ఇళ్లంతా పొగ వ్యాపించడంతో దుర్మైవర్మ అతని కూతురు ప్రీతీ మోహాన ఇద్దరు నిద్రలోనే చనిపోయారు. ఎలక్ట్రిక్ బైకుల తయారీలోకి కొత్త కంపెనీలు తామరతంపలా వచ్చి పడుతున్నాయి. స్కూటర్ల తయారీలో నాసిరకం వస్తువులు వాడటం, ఛార్జింగ్ పాయింట్లు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే అనుమానాలు ఉన్నాయి. ఇకనైనా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్, తయారీ చేస్తున్న కంపెనీలపై నజర్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
బతుకు బండి: బామ్మ స్టీరింగ్... బంగారు డ్రైవింగ్
భర్త చనిపోయిన దుఃఖం నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న రాధామణి, బతుకు మార్గంపై దృష్టి పెట్టింది. వ్యాపారం చేసిన అనుభవం లేదు. ఆర్థిక స్థోమత అంతకంటే లేదు. తనకు తెలిసిన ఏకైక విద్య డ్రైవింగ్. ముప్పై సంవత్సరాల వయసులో భర్త లలాన్ దగ్గర స్కూటర్ డ్రైవింగ్ నేర్చుకుంది రాధామణి. మొదట్లో ఎంత భయమేసిందో! అయితే ఆ భయం కొన్ని రోజులే. ఆ తరువాత భయం స్థానంలో ఇష్టం ఏర్పడింది. స్కూటర్ డ్రైవింగ్‌ను పర్ఫెక్ట్గా నేర్చుకుంది. కేరళలోని తొప్పుంపేడి పట్టణానికి చెందిన రాధ స్కూటర్ డ్రైవింగ్ దగ్గర మాత్రమే ఆగిపోలేదు. కారు, బస్, లారీ, ట్రాక్టర్, ఆటో–రిక్షా, క్రెన్, రోడ్ రోలర్ అండ్ జేసిబి, కంటేనర్ ట్రక్...ఇలా 11 వాహనాలను నడపడంలో లైసెన్స్ తీసుకుంది. కేరళలో హెవీ వెహికిల్ లైసెన్స్ తీసుకున్న తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది రాధామణి. కొన్ని సంవత్సరాల క్రితం... తొప్పుంపేడి నుంచి చెర్తాలం వరకు రాధామణి బస్సు నడిపినప్పుడు, ప్రజలు పరుగెత్తుకుంటూ వచ్చి చూశారు. ‘నా దృష్టిలో ఒక కొత్త వాహనం నేర్చుకోవడం అంటే, కొత్త బడిలో చేరడం లాంటిది. అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ వయసులోనూ ఇంత చురుగ్గా ఎలా ఉండగలుగుతున్నారు? అని చాలామంది నన్ను అడుగుతుంటారు. దీనికి ఏకైక కారణం డ్రైవింగ్ అని చెబుతుంటాను’ అంటుంది 71 సంవత్సరాల రాధామణి. ఆమెను అందరూ ‘మణియమ్మ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. తన పిల్లలతో కలిసి తొప్పుంపేడిలో మొదలు పెట్టిన డ్రైవింగ్ స్కూల్‌కు అనూహ్యమైన ఆదరణ ఏర్పడింది. కాలేజి స్టూడెంట్ రీతిక ఇలా అంటుంది... ‘గతంలో డ్రైవింగ్‌పై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. కాలేజీలో చేరిన తరువాత మాత్రం బండి నేర్చుకోవడం తప్పనిసరి అనిపించింది. వెంటనే మణియమ్మ డ్రైవింగ్ స్కూల్ గుర్తొచ్చి చేరిపోయాను. అమ్మాయిలు ఇక్కడ సేఫ్టీగా ఫీలవుతారు. మణియమ్మ దగ్గరికి వెళితే డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లినట్లు అనిపించదు. బామ్మ దగ్గరకు వెళ్లినట్లు అనిపిస్తుంది. చాలా సరదాగా ఆమె డ్రైవింగ్ నేర్పిస్తుంది. ఇప్పుడు నేను టూవీలర్స్ మాత్రమే కాదు కారు కూడా నడుపుతున్నాను’ మణియమ్మ భర్త కోచిలో ‘ఏ టు జెడ్’ అనే డ్రైవింగ్ స్కూల్ నడిపేవాడు. ఆయన చనిపోయిన తరువాత ఆ స్కూల్ మూతపడింది. అయితే ఇప్పుడు తొప్పుంపేడిలోని ‘డ్రైవింగ్ స్కూల్’లో అడుగడుగునా భర్తను చూసుకుంటుంది మణియమ్మ! -
నాన్న.. నేను.. ఓ స్కూటర్
కనిపించే దేవత అమ్మ.. నడిపించే దైవం నాన్న. నాన్నంటే భద్రత, భరోసా, బాధ్యత.. నాన్నంటే ఓ రిలేషన్ మాత్రమే కాదు.. ఎప్పటికీ అర్థం కాని ఎమోషన్. అలాంటి ఓ నాన్న ఎమోషన్‌ను అర్థం చేసుకున్నాడో కుమారుడు. తండ్రి ఎంతో ఇష్టంగా చూసుకున్న స్కూటర్‌ను జ్ఞాపకంగా మార్చుకునేందుకు ఆరేళ్లు తపన పడ్డాడు. స్కూటర్‌కు కొత్త రూపు తీసుకొచ్చేందుకు ఇంటర్నెట్లో శోధించాడు. ఆ రంగంలో నిష్ణాతులను కలిశాడు. వివిధ విభాగాల కోసం పలు రాష్ట్రాలకు వెళ్లాడు. అనుకున్నది సాధించాడు. అద్భుతమైన స్కూటర్ తయారు చేశాడు. తండ్రి జ్ఞాపకంగా ఆ స్కూటర్‌పై రయ్ రయ్‌మంటూ దూసుకుపోతున్నాడు. అతనే జీవీఎంసీ 52వ వార్డు శాంతినగర్‌కు చెందిన స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి బి.కె.రమేష్. – గోపాలపట్నం(విశాఖ పశ్చిమ) సాధారణంగా తుప్పుపట్టిన వస్తువులను పాత సామాన్ల వారికి అమ్మేస్తుంటాం. కానీ తన తండ్రి ఇష్టపడి కొనుక్కున్న లాంబ్రెట్టా మోడల్ లాంబీ 150 స్కూటర్ పూర్తిగా మరమ్మతులకు గురైనా.. రమేష్ దాన్ని విక్రయించాలని అనుకోలేదు. మూలన పడేయనూ లేదు. ఆ కాలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ స్కూటర్‌ను మళ్లీ కొత్త బండిలా తయారు చేయాలని భావించారు. తానే సొంతంగా బాగు చేయాలని నిర్ణయించుకున్నారు. డిప్లమో ఇంజినీరింగ్ చేసిన రమేష్ దీన్ని తీర్చిదిద్దడానికి నడుంకట్టారు. సుమారు ఆరేళ్ల పాటు స్కూటర్‌కు కావాల్సిన స్పేర్ పార్ట్స్ కోసం అన్వేషణ సాగించారు. స్కూటర్ల వాడకం కనుమరుగైన కాలంలో.. లాంబీ విడి పార్టుల కోసం నానా పాట్లు పడ్డారు. ఒరిజినల్ పార్ట్స్ కోసం విశాఖపట్నంతో పాటు కర్నాటక, ఢిల్లీ, ముంబయి, కేరళ తదిత ర ప్రాంతాల్లో తిరిగారు. ఇంటర్నెట్ ద్వారా లాంబీ స్కూటర్‌పై అభిమానమున్న వ్యక్తులను కలుసుకొని కొన్ని పార్టులు సంపాదించారు. స్కూటర్ ఆయిల్ ట్యాంక్, ఫోర్కు, ఫోర్క్ బాల్స్ సెట్ తదితర పార్టులు మార్కెట్లో దొరక్క పోవడంతో.. తానే సొంతంగా డిజైన్ చేసి తయారు చేసుకున్నారు. ఇలా ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి.. చివరకు స్పేర్ పార్ట్స్ సంపాదించారు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఆరు నెలల పాటు శ్రమించి అద్భుతంగా స్కూటర్ తయారు చేశారు. లాంబీ.. ఓ సెంటిమెంట్ ‘లాంబీ స్కూటర్ పార్టుల కోసం తిరుగుతుంటే దీని విలువ తెలిసింది. విశాఖలోనే ఓ పెద్ద షాపు యజమాని ఒకప్పుడు లాంబీ స్కూటర్ స్పేర్ పార్టులు అమ్మేవాడని తెలిసి.. ఆయన్ని కలిశాను. ఆయన దగ్గర ఈ స్కూటర్‌కు సంబంధించిన అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. ఎంత బతిమలాడినా ఆయన పార్ట్స్ ఇవ్వలేదు. ఎందుకని ప్రశ్నిస్తే వాటి ద్వారానే ఇంతటి వాడినయ్యానని.. ఆ పార్టులు తనకు సెంటిమెంట్ అని చెప్పారు. నేను తిరిగిన చోట్ల ఇలాంటి వ్యక్తులు చాలా మంది తారసపడ్డారని’ రమేష్ తెలిపారు. నాన్న జ్ఞాపకాలు పదిలం ‘మా నాన్న అప్పలస్వామి ఆర్మీలో పనిచేశారు. ఆయనకు లాంబ్రెట్టా స్కూటరంటే చాలా ఇష్టం. 1971లో తొలిసారిగా లాంబీ స్కూటర్ కొన్నారు. కొన్నాళ్లు దానిపై తిరిగాక.. అమ్మేశారు. ఆ స్కూటర్‌పై మక్కువ తీరక మళ్లీ 1994లో లాంబ్రెట్టా మోడల్ స్కూటర్ కొన్నారు. అదే ఈ స్కూటర్. రిటైర్ అయ్యాక వాడడం మానేశారు. తర్వాత అది పూర్తిగా పాడైంది. దాన్ని పూర్వం మాదిరిగా తయారు చేశాను. ఆ తర్వాత కొన్నాళ్లు ఆ బండి నడిపారు. ఇప్పుడు ఆ బండిని మరింత మెరుగ్గా తీర్చి దిద్దే పనిలో ఉన్నాను.’ అని రమేష్ వివరించారు. స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం ప్రస్తుతం రమేష్ స్టీల్‌ప్లాంట్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ స్కూటర్ తయారీలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆటో మొబైల్ రంగంలో చాలా విజ్ఞానాన్ని సముపార్జించానని రమేష్ చెబుతున్నారు. ఇంటర్నెట్ ద్వారా, కొందరు మెకానిక్‌లకు సంప్రదించడం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నట్లు వెల్లడించారు. బండికి కావాల్సిన కొత్త వస్తువును తయారు చేసే ముందు ఆ వస్తువుకు సంబంధించి కొలతలన్నీ రాసుకోవడంతో పాటు డయాగ్రమ్ గీసుకునేవారు. ఆ వస్తువు మార్కెట్లో దొరక్కపోతే సొంతంగా తయారు చేసుకునేవారు. అనుభవం వల్లే ఈ విజ్ఞానం సాధించినట్లు చెప్పారు. ఆరు నెలల పాటు స్కూటర్ తయారీలో ప్రతి అంశాన్ని తన యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేసినట్లు వివరించారు. లాంబ్రెట్టా రమేష్ పేరుతో యూట్యూబ్ చానల్లో ఆటో మొబైల్‌కు సంబంధించిన చాలా విషయాలు వివరించినట్లు చెప్పారు. నాన్న సెంటిమెంట్‌ను నిలబెట్టాను ఈ స్కూటర్ మా నాన్నకు ఎంతో ఇష్టమైనది. అరుదైనది. అందుకే దీన్ని బాగు చేశాను. లాంబీ–150 మోడల్ స్కూటర్లు 1977 నుంచి 86 మధ్య కాలంలో మన దేశంలో అధిక సంఖ్యలో అమ్ముడుపోయాయి. ఇది ఇటలీ వెర్షన్లో తయారైన బండి. ఒక్కో పార్టును అధిక ధర ఇచ్చి కొనుగోలు చేశాను. రూ.70 ఖరీదు గల లాంబీ–150 మోనోగ్రామ్ రూ.300 ఇచ్చి కొనాల్సి వచ్చింది. పెట్రోల్ ట్యాంకును కేరళలో కొన్నాను. ఇంజిన్లోకి అవసరమయ్యే పార్టులను ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేశాను. దాదాపు రూ.4.50 లక్షలు వెచ్చించి స్కూటర్‌ను తయారు చేశాను. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే దేశం మొత్తం మీద 10 లోపు స్కూటర్లు మాత్రమే ఉన్నట్లుగా గుర్తించాను. ఇప్పుడు ఈ బండిపై వెళ్తుంటే ఆరేళ్ల పాటు నేను పడిన కష్టం మర్చిపోతున్నా.. ప్రస్తుతం ఈ స్కూటర్‌ను మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తున్నా. – బి.కె.రమేష్, స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి -
వాళ్ల సంతోషం కంటే ఏదీ ఎక్కువ కాదన్న ఓలా సీఈవో.. మండిపడుతున్న కస్టమర్లు
OLA CEO Bhavish Aggarwal: ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎప్పుడూ లేనంత హైప్ క్రియేట్ చేసింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్. రికార్డు స్థాయిలో ప్రీ బుకింగ్స్ సాధించింది. రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌ని సరిగా ఉపయోగించుకోవడంలో ఓలా విఫలమైంది. డెలివరీలు ఆలస్యంగా జరుగుతున్నాయి. దీంతో సందర్భం ఏదైనా సరే ఓలా స్కూటర్స్ సీఈవో భవిష్య అగర్వాల్‌పై కస్టమర్లు విరుచుకు పడుతున్నారు. ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ తల్లిదండ్రులు పంజాబ్‌లోని లుథియానాలో నివసిస్తున్నారు. దేశంలో మిగిలిన కస్టమర్లలాగే 2021 ఆగస్టు 15న వారు కూడా ఓలా స్కూటర్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇంచు మించు ఆరు నెలల తర్వాత ఆ స్కూటర్ని లుథియానాలో భవీష్ అగర్వాల్ తల్లిదండ్రులకు డెలవరీ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో ఎంతో సంతోషంగా తెలిపారు భవీష్ అగర్వాల్. @OlaElectric @varundubey No updates regarding dispatch by taking amount early and customer support wont reply those people paid after me got delivered.why to show first come first serve when r not following it.and you people only reply for good response who will ans complaints? — ashwin (@ashwinas92) February 25, 2022 భవీష్ అగర్వాల్ ట్వీట్‌కి నెటిజన్ల నుంచి నెగటివ్ స్పందన వచ్చింది. ఆరు నెలలుగా ఇంచుమించు లక్షన్న రూపాయలు చెల్లించి స్కూటర్ కోసం ఎదురు చూస్తున్నామని ఇంత వరకు ఎందుకు డెలివరీ చేయడం లేదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రస్టేట్ అవకుండా ఓలా స్కూటర్ అందుకోవడం కష్టమంటున్నారు. My dad is waiting for his @OlaElectric scooter too. Super frustrated by seeing those copy-paste tweet replies from you people. I was a fool to pay money every time in first place when you people opened the payment windows 3 times. The limit is reached now. @consumerforum_ — अभिषेक राय (@Abhishek_Rai555) February 25, 2022 మేము చెల్లించిన డబ్బలుకు వడ్డీ ఎవరు ఇస్తారు ? ఎన్ని సార్లు అడిగినా కాపీ పేస్ట్ సమాధానాలు తప్పితే మీ నుంచి ఏమీ రావడం లేదు ? ఒక మోడల్ బుక్ చేస్తే మరో మోడల్ డెలివరీ చేశారంటూ ఒకరి తర్వాత ఒకరుగా నెటిజన్లు భవీష్ అగర్వాల్‌పై మండిపడుతున్నారు. -
బస్తా చిల్లర పైసలతో షోరూంకి వెళ్లాడు.. ఆ తర్వాత
stationary shopkeeper bought a new scooter: ఇటీవలే మహీంద్రా షోరూమ్‌లోని ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ రైతుని అవమానించి క్షమాపణలు చెప్పుకున్న కథ గురించి విన్నాం. అయితే ఇక్కడొక వ్యక్తి స్కూటర్ కొనక్కునేందుకు బస్తా చిల్లరతో షోరూమ్‌కి వెళ్లాడు. స్కూటర్ని మొత్తం ఆ చిల్లర నాణేలతోనే కొనుగోలు చేశాడు. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...అస్సాంలో హిరాక్ జె దాస్ అనే చిల్లర వ్యాపారి కొత్త స్కూటర్ని కొనుగోలు చేసేందుకు నెలలు తరబడి నాణేలను పొదుపు చేశాడు. అంతేకాదు ఎనిమిది నెలలు తరబడి పోగుచేసిన నాణేలన్నింటిన ఒక బస్తాలో వేసి షోరూంకి తీసుకువెళ్లాడు. అక్కడ ఆ షోరూం వాళ్లు ఆ నాణేలను ఒక ప్లాస్టిక్ బుట్టల్లో వేసుకుని లెక్కించారు. ఆ తర్వాత అతను తనకు నచ్చిన స్కూటర్ని కొనుకున్నాడు. అయితే అతను స్కూటర్ని మొత్తం చిల్లర నాణేలతోనే కొనుగోలు చేయడం విశేషం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: "భార్యలను కొట్టండి" భర్తలకు సలహాలిచ్చిన మహిళా డిప్యూటి మంత్రి!) -
స్కూటర్ల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన యమహా మోటార్స్..!
ప్రముఖ టూవీలర్ దిగ్గజం యమహా మోటార్ ఇండియా పలు స్కూటర్స్‌పై క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. కాగా ఈ ఆఫర్స్ ఎంపిక చేయబడిన ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండనున్నాయి. ఈ మోడల్స్‌పై..! యమహా మోటార్స్ శ్రేణిలోని హైబ్రిడ్ మోడల్స్‌పై క్యాష్‌బ్యాక్ రానుంది. యమహా ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్, యమహా రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్స్‌పై ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కొనుగోలుదారులకు క్యాష్‌బ్యాక్ రానుంది. ఆయా రాష్ట్రాల వారు ఫిబ్రవరి నెల మొత్తం ఈ ఆఫర్‌ను పొందవచ్చును. యమహా అందిస్తోన్న ఆఫర్స్‌లో భాగంగా... Yamaha Fascino 125 Fi హైబ్రిడ్ స్కూటర్‌పై అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాలు , పశ్చిమ బెంగాల్లో రూ. 2,500 వరకు క్యాష్ బ్యాక్ రానుంది. మహారాష్ట్రలో...Fascino 125 FI హైబ్రిడ్, RayZR 125 FI హైబ్రిడ్ స్కూటర్లపై రూ. 2,500 వరకు క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది. ఈ రెండు స్కూటర్లపై తమిళనాడులో రూ. 5,000 వరకు క్యాష్ బ్యాక్ రానుంది. ఇక విభిన్న రాష్ట్రాల్లో క్యాష్‌బ్యాక్‌ను యమహా అందిస్తోంది. ఈ హైబ్రిడ్ స్కూటర్స్ 125సీసీ ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజిన్‌తో పనిచేయనున్నాయి. ఇది 6,500 rpm వద్ద 8 bhp సామర్థ్యాన్ని, 5,000 rpm వద్ద 10.3 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ స్కూటర్లలో హైబ్రిడ్ పవర్ అసిస్ట్ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. SMG ఆన్‌బోర్డ్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఇది మెరుగైన పుల్లింగ్ పవర్ కోసం అదనపు టార్క్‌ను అందిస్తోంది. Fascino 125 FI హైబ్రిడ్, అలాగే RayZR FI 125 హైబ్రిడ్ స్కూటర్స్ రెండూ కూడా సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, ఆటోమేటిక్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌తో వస్తాయి.Yamaha Fascino 125 FI, Yamaha Ray ZR 125 FI స్కూటర్స్ రెండూ కూడా ప్రామాణికంగా సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్‌ను కలిగి ఉన్నాయి. చదవండి: మహీంద్రా అండ్ మహీంద్రా కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు!! -
రికార్డు స్థాయిలో విదేశాలకు హీరో ద్విచక్ర వాహనాల ఎగుమతులు
ద్విచక్ర వాహనాల ఎగుమతుల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 2021లో కొత్త రికార్డు సృష్టించింది. 2021 ఏడాది కాలంలో భారతీయ, ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమకు సవాళ్లు ఎదురైనప్పటికి హీరో మోటోకార్ప్ అత్యధిక సంఖ్యలో 2.89 లక్షల యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఏ సంవత్సరంలో నమోదు చేయని విధంగా భారత్‌తో సహా, ఇతర దేశాల్లో అత్యధిక విక్రయాలను నమోదు చేసింది. హీరో మోటోకార్ప్ గత సంవత్సరంలో ఆసియా, ఆఫ్రికా, దక్షిణ & మధ్య అమెరికా, కరేబియన్ ప్రాంతంలో తన మార్కెట్ విస్తరించింది. ఈ మార్కెట్ విస్తరణ వల్ల భారతదేశం వెలుపల మార్కెట్లలో అమ్మకాల పరంగా 71 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2020లో విదేశీ మార్కెట్లలో 1.69 లక్షల యూనిట్లతో పోలిస్తే ఈ సంఖ్య (2.89 లక్షల యూనిట్లు) చాలా ఎక్కువ. కానీ, హీరో మోటోకార్ప్ తన పనితీరుతో సంతృప్తిగా లేదు. "ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా గ్లోబల్ లాజిస్టిక్స్, సప్లై ఛైయిన్ లో ఉన్న అడ్డంకులను దృష్టిలో ఉంచుకొని ఈ క్యాలెండర్ సంవత్సరంలో ప్రపంచ మార్కెట్లలో విక్రయాలు ప్రణాళికలకు అనుగుణంగా ఉన్నాయి" అని సంజయ్ భాన్, హెడ్ - గ్లోబల్ బిజినెస్, హీరో మోటోకార్ప్ అన్నారు. "2025 నాటికి గ్లోబల్ బిజినెస్ అమ్మకాల వాటా కంపెనీ మొత్తం వాటాలో 15% చేరుకోవడానికి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు" తెలిపారు. హీరో మోటోకార్ప్ ప్రస్తుతం 42 దేశాలకు ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేస్తుంది. భారత్‌తో సహా గ్లోబల్ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసేందుకు హీరో మోటోకార్ప్ ప్రణాళికలను రచిస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నెలలో తన మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ (EV)ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. ఈ వాహనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులోని కంపెనీ తయారీ కేంద్రంలో ఉత్పత్తి కానున్నట్లు తెలుస్తోంది. డిసెంబరులో, హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో 3,94,773 యూనిట్లను విక్రయించింది. (చదవండి: భారత మార్కెట్లలో కియా మోటార్స్ ప్రభంజనం..!) -
ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్‌న్యూస్! ఈ పెట్రోల్ బంకుల్లో ఛార్జింగ్ ఫ్రీ
ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికల్స ట్రెండ్ నడుస్తోంది. క్రమంగా పెట్రోలు, డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వైపు ప్రజలు మళ్లుతున్నారు. అయితే ఈ చేంజింగ్ ట్రెండ్‌కి ఛార్జింగ్ పాయింట్ల షార్టేజీ పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమించేందుకు ఈవీ తయారీ సంస్థలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఓలా మరో అడుగు ముందుకు వేసింది. పెట్రోలు బంకుల్లో పెట్రోల్ బంకుల తరహాలోనే ఎలక్ట్రిక్ వెహికల్ యూజర్లకు ఛార్జింగ్ సౌకర్యం అందించే లక్ష్యంతో భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్‌తో ఓలా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా ఉన్న భారత్ పెట్రోల్ బంకుల్లో ఓలా సంస్థ హైపర్ ఎలక్ట్రిక్ ఛార్జర్లను ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఓలా స్కూటర్స్ సీఈవో భవీశ్ అగర్వాల్ ట్విట్టర్లో స్వయంగా ప్రకటించారు. రెండు నెలల్లో భారత్ పెట్రోలు బంకుల్లో హపర్ ఛార్జింగ్ పాయింట్లు 6 నుంచి 8 వారాల్లోగా అందుబాటులోకి వస్తాయంటూ భవీశ్ తెలిపారు. పెట్రోలు బంకులతో పాటు ఇళ్ల సముదాయల దగ్గర కూడా హైపర్ ఛార్జింగ్ పాయింట్లు తెస్తామంటూ శుభవార్త తెలిపారు. ఛార్జింగ్ ఫ్రీ ఇక పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి తెస్తున్న సందర్భంగా భవీశ్ అగర్వాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. భారత్ పెట్రోలు బంకులు, రెసిడెన్షియల్ కాంప్లెక్సుల దగ్గర ఓలా సంస్థ నెలకొల్పే హైపర్ ఛార్జింగ్ పాయింట్ల దగ్గర ఉచితంగా ఛార్జింగ్ చేసుకోవచ్చని తెలిపింది. 2022 జూన్ 30 వరకు ఈ ఆఫర్‌ని అందిస్తున్నారు. ఈవీ ఛార్జింగ్ పాయింట్లకు సంబంధించి ఒక యూనిట్ కరెంట్‌కి రూ. 12 నుంచి రూ.15 వరకు విద్యుత్ సంస్థలు ఛార్జ్ చేస్తున్నాయి. Hypercharger roll out has begun across cities. At key BPCL pumps as well as residential complexes. 4000+ points up through next year. We’re installing across India and will make them operational in 6-8 weeks. Will be free for use till end June 22 for all customers. pic.twitter.com/WKEzok4E98 — Bhavish Aggarwal (@bhash) December 28, 2021 అథర్కి పోటీగా ఓలా కంటే ముందే ఈవీ మార్కెట్లో ఉన్న అథర్ సంస్థ సైతం పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఫ్రీ ఛార్జింగ్ పెసిలిటీని కల్పించింది. 2021 డిసెంబరు 31తో ఈ గడువు ముగియగా తాజాగా 2022 జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఆ వెంటనే ఓలా నుంచి పబ్లిక్ హైపర్ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు ప్రకటన వచ్చింది. చదవండి:విశాఖలో ఓలా స్కూటర్ల డెలివరీ.. గెట్ రెడీ అంటున్న భవీశ్ అగర్వాల్ -
స్పైడర్‌మ్యాన్ క్రేజ్..! మార్కెట్లలోకి సూపర్ హీరోస్ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్స్
Tvs Ntorq 125 Price And Mileage: ప్రపంచవ్యాప్తంగా మార్వెల్స్ హీరోస్‌పై క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ క్రేజ్‌ను సొంతం చేసుకునేందుకు పలు కంపెనీలు మార్వెల్స్ హీరోస్ స్ట్రాటజీతో తమ వ్యాపారాలకు మరింత ఆదాయాలను సంపాదించుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 16 న రిలీజైన స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్ వెండి తెర సంచలనం సృష్టిస్తోంది. భారత్‌లో కూడా స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్ క్రేజ్ మామూలుగా లేదు. మార్వెల్స్ హీరోస్ లవర్స్ కోసం ప్రముఖ టూవీలర్ ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ మార్వెల్స్ సూపర్ హీరోస్ ఎడిషన్ స్కూటర్లను లాంచ్ చేసింది. చదవండి: సోనీ ఉత్పత్తులపై 60 శాతం మేర తగ్గింపు..! అందులో టీవీలు, హెడ్‌ఫోన్స్, ఇంకా మరెన్నో..! టీవీఎస్ మోటార్ కంపెనీ టీవీఎస్ NTORQ 125 సూపర్‌స్క్వాడ్ ఎడిషన్‌లో భాగంగా మరో రెండు మార్వెల్ సూపర్ హీరోస్ స్పైడర్ మ్యాన్, థోర్ ప్రేరేపిత స్కూటర్లను కంపెనీ విడుదల చేసింది. గత ఏడాది సూపర్ స్క్వాడ్ ఎడిషన్‌లో భాగంగా మార్వెల్ సూపర్ హీరోస్ - ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్, కెప్టెన్ అమెరికా ఎడిషన్ టీవీఎస్ Ntorq 125బైక్‌లను ప్రారంభించింది. భారత్‌లోకి RT-Fi సాంకేతికతతో వచ్చిన మొట్టమొదటి బ్లూటూత్ కనెక్ట్ చేయబడిన స్కూటర్‌గా టీవీఎస్ Ntorq 125 నిలుస్తోంది. సూపర్ హీరోస్ ఫీచర్స్‌తో..! కొత్త మార్వెల్ స్పైడర్ మ్యాన్ , థోర్ వెర్షన్లు స్కూటర్స్ సూపర్ హీరోల ముఖ్య లక్షణాలను టీవీఎస్ Ntorq 125 ఏర్పాటుచేశారు. స్పైడర్ మ్యాన్, థోర్ కు సంబంధించిన విషయాలను ఇందులో ఉండేలా టీవీఎస్ డిజైన్ చేసింది. ఈ స్కూటర్లలోని స్మార్ట్‌కనెక్ట్ యాప్ స్పైడర్ మ్యాన్ లోగో , థోర్స్ హమర్ వంటి సంబంధిత పాత్రల చిహ్నాల సిల్హౌట్‌తో ఒపెన్ కానుంది.ఈ స్కూటర్లు మార్వెల్ సూపర్ హీరోస్ అనుభూతిని అందిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ధర ఎంతంటే..! టీవీఎస్ NTORQ 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 84,850 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ స్కూటర్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు... స్కూటర్ మొదటి-రకం వాయిస్ అసిస్ట్ ఫంక్షన్, మొదటి-ఇన్-సెగ్మెంట్ డ్యూయల్ రైడ్ మోడ్‌లను అందించే వేరియంట్‌తో రానుంది. చదవండి: మల్టీప్లెక్సుల బిజినెస్ అదరహో.. సాయం చేసిన స్పైడర్‌మ్యాన్- భరోసా ఇచ్చిన పుష్ప -
తాళం చెవితో పనిలేదు.. ‘సెల్ఫీ’ కొడితే స్కూటర్ రయ్ రయ్..
సాక్షి, హైదరాబాద్: తాళం చెవితో పనిలేదు.. ఈ–స్కూటర్ వద్దకు వెళ్లి యాప్‌ను ఆన్‌చేసి సెల్ఫీ తీస్తే చాలు.. అది స్టార్ట్ అయిపోతుంది. యాప్ ద్వారానే స్కూటర్ నడిపిన తర్వాత పేమెంట్ కూడా చేయొచ్చు. ఈ మేరకు రూపొందించిన ‘హల’మొబిలిటీ యాప్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రయాణం, అద్దె, చార్జింగ్ స్టేషన్లు తదితర సేవలను వినియోగదారులు తెలుసుకోవచ్చు. పలు విద్యాసంస్థల ఆవరణలో ఒకే సీటు ఉన్న ‘ఈ స్కూటర్’సేవలను ఇప్పటికే ‘హల’అందిస్తోంది. తాజాగా ఆవిష్కరించిన ‘హల’మొబిలిటీ యాప్ సేవలను ఈ నెల నుంచే హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఆవరణలో అందుబాటులోకి తేనున్నారు. ఇక్కడ ‘ఈ స్కూటర్’సేవలను 3 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. స్మార్ట్ బ్యాటరీతో పనిచేసే ఈ–స్కూటర్ల కోసం ట్రిపుల్ ఐటీ ఆవరణలో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ వాహనాల్లో బ్లూ టూత్ కనెక్షన్, జీపీఎస్ వంటి టెక్నాలజీ ఉండటంతో మొబైల్ ఫోన్లోని హల మొబిలిట్ యాప్ ద్వారా డిజిటల్ తాళాన్ని తెరిచి ప్రయాణించొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ యాప్ ప్రయాణికుడి సెల్ఫీ, ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు వివరాలు క్షణాల్లో సేకరించి ‘ఈ స్కూటర్’పై ప్రయాణానికి అనుమతిస్తుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో పెరుగుతున్న ప్రయాణ అవసరాలను ‘హల’తీరుస్తుందని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రయాణాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే 12 నెలల్లో ఆరు నగరాల్లో ‘హల’యాప్ ద్వారా పనిచేసే 15వేల స్కూటర్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇదిలాఉంటే, టి హబ్‌లోని ‘ల్యాబ్ 32 ప్రాజెక్టు’ కింద ‘హల మొబిలిటీ యాప్’ పురుడుపోసుకున్నట్లు టీ హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాస్‌రావు వెల్లడించారు. -
Scooter Trolley: ఐడియా అదిరింది
రోజువారీ రవాణా ఖర్చులు పెరుగుతుండటంతో ఈ యువ రైతు కొత్తగా ఆలోచించాడు. వనపర్తి జిల్లా అమరచింత మండలం నాగల్‌కడ్మూర్‌కు చెందిన జానకి రాంరెడ్డి తమకున్న ఆరెకరాల పొలంలో బొప్పాయి తోటను సాగు చేశాడు. ఈ పండ్లను అమ్మడానికి అమరచింత, ఆత్మకూర్‌కు రావడానికి ఆటోకు రోజుకు రూ.600 చెల్లించేవాడు. ఇది భారంగా మారింది. అతను స్వతహాగా బైక్ మెకానిక్ కావడంతో దాన్నుంచి బయటపడే ఆలోచన చేశాడు. స్కూటర్‌కు ట్రాలీని జతపరిచాడు. తన భార్యతో కలిసి బొప్పాయిలను విక్రయిస్తున్నాడు. – అమరచింత పరుగో పరుగు జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో భవానీమాత జాతర సందర్భంగా ఆదివారం నిర్వహించిన శునకాల పరుగుపందెం పోటీలు ఆకట్టుకున్నాయి. మొదటి బహుమతిని గద్వాలకు చెందిన శునకం దక్కించుకుంది. – గద్వాల (గట్టు) చిలుకమ్మ పలికింది.. విజయవాడ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన డాగ్ షోలో రెండు చిలుకలు సందడి చేశాయి. ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన తోకటూ(తెల్ల రంగులో ఉన్నది), అమెరికా నుంచి తెచ్చిన మకావ్ చిలుకలు సందర్శకుల మాటలకు బదులిస్తూ వారిని ఆశ్చర్యచకితులను చేశాయి. దీంతో డాగ్‌షోకు వచ్చిన పలువురు ఈ చిలుకలతో సరదాగా మాట కలిపి ఆనందంలో మునిగితేలారు. – సాక్షి, విజయవాడ -
అప్రీలియా ఎస్ఆర్ కొత్త వెర్షన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న పియాజియో ఇండియా అప్రీలియా ఎస్ఆర్ 125, ఎస్ఆర్ 160 స్కూటర్స్ కొత్త వర్షన్స్ విడుదల చేసింది. పుణే ఎక్స్‌షోరూంలో ఎస్ఆర్ 160 ధర రూ.1.17 లక్షలు, ఎస్ఆర్ 125 ధర రూ.1.07 లక్షలు ఉంది. ఫీచర్స్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్, సింగిల్ చానెల్ ఏబీఎస్‌తో డిస్క్, డ్రమ్ బేక్స్, డ్యూయల్ సీట్స్, నకిల్ గార్డ్స్, అలాయ్ వీల్స్, వి–షేప్డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎక్స్–షేప్డ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్ పొందుపరిచారు. ఎస్ఆర్ 160 స్కూటర్ 160 సీసీ 3వీ టెక్ ఈఎఫ్ఐ ఎయిర్‌కూల్డ్ ఇంజన్‌తో తయారైంది. -
మార్కెట్లోకి రెండు శక్తివంతమైన స్కూటర్లు లాంఛ్ చేసిన పియాజియో
ప్రముఖ వాహన తయారీ సంస్థ పియాజియో ఇండియా భారత్‌లో అప్ డేట్ చేసిన అప్రిలియా న్యూ ఎస్ఆర్ 160, ఎస్ఆర్ 125 స్కూటర్లను లాంఛ్ చేసింది. న్యూ ఎస్ఆర్ 160 మోడల్ ధర ₹.1,17,494(ఎక్స్ షోరూమ్ పూణే)గా ఉంటే, ఎస్ఆర్ 125 మోడల్ ధర ₹1,07,595(ఎక్స్ షోరూమ్ పూణే)గా ఉంది. డిజైన్ సహా పలు ఫీచర్లను అప్డేట్ చేయడంతో పాటు నూతన శ్రేణి వాహనాలు బీఎస్6 ప్రమాణాలతో కస్టమర్ల ముందుకు వచ్చాయి. రూ 5000 టోకెన్ అమౌంట్‌తో న్యూ ఎస్ఆర్ రేంజ్ బైక్‌లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. కొత్త ఎస్ఆర్ 160 రేంజ్ వైట్, బ్లూ, గ్రే, రెడ్, మాట్ బ్లాక్ రంగులలో లభ్యం కానుంది. అప్రిలియా ఎస్ఆర్ 160 కొత్త హెడ్ ల్యాంప్, కొత్త ఎల్ఈడి హెడ్ లైట్ తో వస్తుంది. ఎస్ఆర్ 160 స్కూటర్లో ఎబిఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), 160 సీసీ 3వీ టెక్ ఎఫ్ఐ, హైటెక్, హై-పెర్ఫార్మెన్స్ ఇంజిన్ తో వస్తుంది. ఇందులో 160 సీసీ ఎయిర్ కూల్డ్ త్రీ వాల్వ్ ఇంజిన్ సహాయం చేత పనిచేస్తుంది. ఇది 7600 ఆర్ పిఎమ్ వద్ద 10.84 బిహెచ్ పఈ పవర్, 6000 ఆర్ పిఎమ్ వద్ద 11.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. (చదవండి: భారీగా పడిపోయిన బిట్‌కాయిన్ ధర) -
యువత కోసం మార్కెట్లోకి హోండా గ్రాజియా లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్
ఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామిగా ఉన్న హోండా మోటార్ సైకిల్ ఇండియా మార్కెట్లోకి గ్రాజియా 125 సీసీ రెప్సోల్ హోండా టీమ్ ఎడిషన్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. గుర్గావ్ ఎక్స్‌షోరూంలో దీని ధర రూ.87,138 ఉంది. రెప్సోల్ హోండా రేసింగ్ టీమ్ డిజైన్ థీమ్, గ్రాఫిక్స్ స్ఫూర్తితో గ్రేజియా 125 రెప్సాల్ హోండా టీమ్ ఎడిషన్‌ను రూపొందించినట్లు కంపెనీ ఎండీ, ప్రెసిడెంట్, సీఈఓ అత్సుషి ఒగాటా వెల్లడించారు. ఈ స్కూటర్‌ను దేశీయంగా యువత ఔత్సాహికుల కోసం విడుదల చేసినట్లు తెలిపారు. ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్((పీజీఎం-ఎఫ్ఐ) ఇంజన్, ఐడ్లింగ్ స్టాప్ వ్యవస్థ, ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ (ఈఎస్పీ), మల్టీ-ఫంక్షన్ స్విచ్, ఇంజిన్-కటాఫ్‌తో సైడ్ స్టాండ్ ఇండికేటర్, మూడు దశల్లో సర్దుబాటు చేసే రేర్ సస్పెన్షన్, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వంటి సదుపాయాలు ఈ స్కూటర్‌ను రూపొందించారు. (చదవండి: ఇక టెస్లా పని అయిపోయినట్లే.. రంగంలోకి మెర్సిడెస్ బెంజ్!) -
పుదుచ్చేరి: బైకులో తీసుకేళుతుండగా పేలిన నాటుబాంబులు
-
టపాకాయలు తీసుకుని గంటలో వస్తానన్నారు.. అంతలోనే..
పుదుచ్చేరి: దీపావళి పండుగ రోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన పుదుచ్చేరి లోని విల్లుపురం జిల్లాలో జరిగింది. కూనిమెడు గ్రామానికి చెందిన కలైనేషన్, తన కొడుకు ప్రదీప్‌తో కలసి టపాకాయలు కొనుగోలు చేసి స్కూటర్‌పై.. తన స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో విల్లుపురం రహదారిపై ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ద్విచక్ర వాహనం పెద్ద ఎత్తున పేలిపోయి.. కలైనేషన్, ప్రదీప్‌లు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో వీరితో పాటు మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి.. ఒక లారీతోపాటు, రెండు ద్విచక్రవాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒక గంటలో వస్తామని చెప్పిన భర్త.. కొడుకు చనిపోయారని తెలియడంతో.. వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, పేలుడుకి గల కారణాలు తెలియాల్సిఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: భార్యకు వీడియో కాల్ చేసి జైలు వార్డెన్ ఆత్మహత్య -
ప్రియాంక దూకుడు: అమ్మాయిలకు స్మార్ట్ఫోన్లు, స్కూటీలు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి , ఇన్ఛార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా దూకుడు మీద ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటను ఎలాగైనా తిరిగి సొంతం చేసుకోవాలనే వ్యూహంలో శరవేగంగా కదులుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా విద్యార్థినులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. యూపీలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 12వ తరగతి అమ్మాయిలకు స్మార్ట్ఫోన్లు, గ్రాడ్యుయేట్‌లకుఎలక్ట్రానిక్ స్కూటీలను అందిస్తామని ప్రియాంక గురువారం ప్రకటించారు. వారి చదువుకు, భద్రతకు స్మార్ట్ఫోన్లు అవసరమని పేర్కొన్నారు. ఇందుకు మ్యానిఫెస్టో కమిటీ అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లను రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.మహిళల ఓట్లను ఆకర్షించేలామహిళలకు 40 శాతం టిక్కెట్లను కేటాయించనున్నట్టు ప్రియాకం ప్రకటించారు. వ్యవస్థలో మార్పు తీసుకురావాలనుకునే మహిళలు ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. పోటీ చేయాలనుకునే ఏ స్త్రీ అయినా నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని విలేకరుల సమావేశంలో ప్రకటించారు.దీనికి రాహుల్‌గాంధీ కూడా మద్దతుగా నిలిచారు. కాగా దేశంలో అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన, సంక్లిష్టమైన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. యూపీలో 1989 నుండి అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి తన పట్టు సాధించాలని కోరుకుంటోంది. -
ఉడెన్ కిక్ టు ఎలక్ట్రిక్ దాకా.. స్కూటర్ పుట్టుక, పరిణామ క్రమం గురించి తెలుసా?
Scooter History And Evolution: స్కూటర్.. సామాన్యుడికి ఇష్టమైన మోతబండి. మార్కెట్లో భారత వాహన రంగాన్ని సైతం ఏలే దమ్ముంది ఈ బండికి. అయితే కాలం మారినట్లే.. ఇందులోనూ కొత్త కొత్త అప్డేట్ వెర్షన్లు వస్తున్నాయి. మరి దీని పరిణామా క్రమంలో కొన్ని మార్పులు ఎలా జరిగాయి.. ఆ కథ ఏంటో ఒక్కసారి స్కూటర్బండిపై కాలంలో వెనక్కి వెళ్లి చూద్దాం. స్కూటర్.. జర్మనీలో 18వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ బండి ప్రయాణం ఇప్పటికీ అప్రతిహతంగా సాగుతోంది. ఆధునిక కాలంలోనూ తన రూపం మార్చుకుని సామాన్యుడి జీవితంలో మమేకమవుతోంది. 19వ శతాబ్దంలో భారత్‌లోకి ప్రవేశించిన స్కూటర్లు రోడ్లపై ఎటు చూసినా దర్శనమిచ్చేవి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్క్‌లు వంటి జనసమ్మర్థ ప్రాంతాల్లో అవే ఎక్కువగా కనిపించేవి. సినిమాల్లో హీరోల ఎంట్రన్స్‌లు కూడా వాటి పైనే ఎక్కువగా ఉండేవి. వ్యవసాయ పనులు చేసుకునే వారు, ఉద్యోగస్తులే కాకుండా దాదాపు అన్ని వర్గాల వారితో స్కూటర్ తన బంధాన్ని పెనవేసుకుంది. ద్విచక్ర వాహనదారుల అభిరుచులలో మార్పులు రావడంతో కాలక్రమేణా స్కూటర్లు తన రూపును మార్చుకున్నాయి. ఇప్పుడు మార్కెట్లో ఎలక్ట్రికల్ స్కూటర్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ పెట్రోలు వాహనాలు ఎక్కువగా రోడ్లపై తిరుగుతుండటం, శబ్ధ కాలుష్యం తదితర కారణాలతో వాహనదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించారు. ఎలక్ట్రికల్ స్కూటర్లే కాకుండా స్పోర్ట్స్ బైక్‌లు, బుల్లెట్లపై యువతలో క్రేజ్ ఉండటంతో వాటిని కూడా కంపెనీలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే ఒక్కసారి బ్యాటరీ రీచార్జ్ చేస్తే వందకుపైగా కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉండటం, పెట్రోల్ ఖర్చు తప్పుతుండటం, కాలుష్య రహిత వాహనం కావడంతో ఎక్కవమంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఎలక్ట్రికల్ స్కూటర్ల హవా నడుస్తోంది. వీటి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో చాలా కంపెనీలు ఆన్లైన్లో ప్రీబుకింగ్‌ను ఓపెన్ చేస్తున్నాయి. అట్లాంట భారత్‌లో తయారైన మొట్టమొదట స్కూటర్ ఇదే. ఎన్‌హెచ్ రాజ్‌కుమార్ అనే వ్యక్తి కేరళలోని తిరువనంతపురంలో దీన్ని రూపొందించడాన్ని మొదలుపెట్టారు. సుదీర్ఘకాలం పాటు శ్రమించి 1976లో తొలిసారిగా మీడియా ముందు అట్లాంట స్కూటర్‌ను ప్రవేశపెట్టారు. గంటకు 70 కిలో మీటర్ల వేగం, లీటర్‌కు 60 కిలోమీటర్ల మేరకు ప్రయాణం దీని సొంతం. అప్పట్లో దీని ధర రూ.2,300 ఉండేది. ఈ స్కూటర్‌ను తయారు చేయడానికి వాడిన భాగాల్లో 75 శాతం మన దేశంలో తయారు చేసినవే. కొన్నాళ్ల అనంతరం కేంద్ర ప్రభుత్వం దీన్ని టేకోవర్ చేయడం ప్రారంభించింది. రాజకీయ కారణాలు, కార్మికుల సమస్యలతో ‘అట్లాంట’ తన ఉనికిని కోల్పోయింది. లూనా 1972లో 50సీసీ ఇంజన్‌తో కెనిటిక్ ఇంజనీరింగ్ సంస్థ మోపెడ్‌ను భారత ఆటోమెబైల్ మార్కెట్లోకి విడుదల చేసింది. 2000 సంవత్సరం వరకు వీటి ఉత్పత్తి జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయదారులు దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పటికీ రూరల్ ప్రాంతాల్లో లూనాలు కనిపిస్తుండటం విశేషం. చేతక్ 1972లో బజాజ్ కంపెనీ చేతక్ బండిని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 15వ శతాబ్దానికి చెందిన రాజస్థాన్ రాజు మహారాణ ప్రతాప్ తన గుర్రానికి పెట్టుకున్న పేరు (చేతక్)నే బజాజ్ కంపెనీ ఈ బండికి పెట్టింది. గంటలకు 90 కిలోమీటర్ల వేగం, లీటర్‌కు 62 కిలోమీటర్ల ప్రయాణం దీని సొంతం. 2006 వరకు దీని హవా సాగింది. ఆ తరువాత బజాజ్ కంపెనీ బైక్‌లపై దృష్టి సారించి చేతక్‌ల ఉత్పత్తిని నిలిపివేసింది. ఇలా 1950లో మొదలైన స్కూటర్ కాలాంతరంగా పలు రూపాలను మార్చుకుంటూ వస్తోంది. ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఎలక్ట్రికల్ స్కూటర్లపై వాహనదారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వాటి తయారీకి కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. కొన్ని కంపెనీలు మహిళల కోసం ప్రత్యేకంగా స్కూటర్లు డిజైన్ చేస్తున్నాయి. ప్రస్తుతం రోడ్లపై అవే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. లంబ్రెట్టా 1920ల అనంతరం ఆటోపెడ్ కన్నా మెరుగ్గా 1952లో లంబ్రెట్టా అనే స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. దీని భాగాలను ఇటలీ నుంచి భారత్‌కు తీసుకువచ్చి ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండియా (ఏపీఐ) అసెంబ్లింగ్ చేసేది. దీని ఇంజన్ కెపాసిటీ 48సీసీ. ఎల్ఐ 150 సీరీస్ 2 అనే పేరుతో ఏపీఐకి లైసెన్స్ మంజూరు అయ్యింది. 1976 వరకు వీటి అమ్మకాలు జరగ్గా ఆ తరువాత న్యాయపరమైన సమస్యలు తలెత్తడంతో వీటిని మార్కెట్లోకి విడుదల చేయడాన్ని ఏపీఐ నిలిపివేసింది. ఆటోపెడ్ దీన్నే క్రప్–రోలర్ అని కూడా పిలిచేవారు. 1915–1921 వరకు ఇవి ప్రపంచ మార్కెట్లో ఉన్నాయి. గంటకు 32 కిలోమీటర్ల వేగంతో దీనిపై ప్రయాణించవచ్చు. దీని టైర్లు 10 ఇంచులకు పైగా ఉండేవి. ఉడెన్ కిక్ స్కూటర్ 1894లో హిల్డర్ బ్రాండ్ అండ్ ఓల్ఫ్ ముల్లర్ మోటర్ సైకిల్‌ను రూపొందించినా పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. వారు రూపొందించిన మోటర్‌సైకిల్ స్ఫూర్తితో అర్థర్ హుగో సీసెల్గిబ్జన్ స్కేటింగ్‌కి ఉపయోగించే చక్రాలు, చెక్కతో 1913లో ఉడెన్ కిక్ స్కూటర్‌ను రూపొందించారు. మార్కెట్లోకి ఇది 1916లో వచ్చింది. అయితే అప్పటికే ప్రపంచవ్యాప్తంగా స్కూటర్ల తయారీకి విస్తృత స్థాయిలో పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఆటోపెడ్ మార్కెట్లోకి వచ్చింది. –సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ -
బీఎండబ్ల్యూ సి–400 జీటీ స్కూటర్
ద్విచక్ర వాహన రంగంలో ఉన్న జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూ మోటరాడ్ భారత్‌లో సి–400 జీటీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.9.95 లక్షలు. పూర్తిగా తయారైన స్కూటర్‌ను కంపెనీ భారత్‌కు దిగుమతి చేస్తోంది. బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. నగరంతోపాటు సుదూర ప్రాంతాలనూ ఈ స్కూటర్‌పై సులభంగా ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 34 హెచ్‌పీ పవర్‌తో వాటర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ 350 సీసీ ఇంజన్‌ను పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 9.5 సెకన్లలో అందుకుంటుంది. గంటకు 139 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. చదవండి : పండుగ స్పెషల్ ఆఫర్.. డాట్సన్ కార్లపై భారీగా డిస్కౌంట్ -
ఒక్క వాహనం కూడా లేదు..‘ఈటల’ స్కూటర్లు ఏమైనట్టు..?
సాక్షి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు బజాజ్ చేతక్ స్కూటర్లంటే సెంటిమెంట్. తన వద్ద ఏకంగా మూడు స్కూటర్లు ఉండేవి. ఆ స్కూటర్ల నంబర్లు కూడా సీరియల్‌గా ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. ఏపీ28 ఏఏ 4818, ఏపీ 28 ఏఏ 4819, ఏపీ 28 ఏఏ 4820 సీరియల్ నంబర్లుగా ఉండేవి. ఒకేసారి రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఇలా సీరియల్ నంబర్లు పొందగలిగారు. ఇంత ప్రేమతో, సీరియల్ నంబర్లతో కొనుగోలు చేసిన స్కూటర్లు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదని తెలుస్తోంది. 2014 ఎన్నికల అఫిడవిట్లో 3 స్కూటర్లు తన వద్ద ఉన్నాయని, వాటి విలువ రూ.20 వేలు ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: అన్నా.. ఎవరు గెల్తరంటవే? కానీ, ప్రస్తుతం జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల అఫిడవిట్లో ఈటల పేరిట స్కూటర్, కారు ఇలా ఒక్క వాహనం కూడా లేదని చూపించారు. ఈటలకు సెంటిమెంట్‌గా ఉన్న స్కూటర్లు ఏమయ్యాయనే చర్చ జరుగుతోంది. పాతవి కావడం వల్ల స్క్రాప్‌నకు వేశారా.. లేదా తమ కార్యకర్తలకు ఎవరికైనా గిఫ్ట్‌గా తన సెంట్మెంట్ స్కూటర్లు ఇచ్చారా.. అనే ఆసక్తికర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం సమర్పించిన అఫిడవిట్లో రూ.16.12 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చూపించిన ఈటల రాజేందర్ తన పేరిట ఒక్కæ వాహనం కూడా లేదని తెలుపడం గమనార్హం. చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: వెజ్ రూ.40.. నాన్‌వెజ్ రూ.100 -
భారత్‌లో అత్యంత ఖరీదైన స్కూటర్ ఇదే, ధర ఎంతంటే?
మీరిప్పటి వరకు ఖరీదైన కార్‌ను చూసుంటారు. ఖరీదైన బైక్‌ను చూసుంటారు. కానీ కాస్ట్లీ స్కూటర్‌ను చూసి ఉండరు. అయితే వచ్చే వారం మన దేశంలో అత్యంత ఖరీదైన స్కూటర్ విడుదల కానుంది. ఈ స్కూటర్‌ను జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బీఎండబ్ల్యూ విడుదల చేయనుంది. అక్టోబర్12, మంగళవారం రోజు దేశీయ మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ద్విచక్ర వాహన విభాగం బీఎండబ్ల్యూ మోటరాడ్ 'బీఎండబ్ల్యూ సీ 400 జీటీ' స్కూటర్‌ను లాంఛ్ చేయనున్నట్లు బీఎండబ్ల్యూ ప్రతినిధులు తెలిపారు. బీఎండబ్ల్యూ సీ 400 జీటీ ఫీచర్స్ సీ 400 జీటీ 350సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూలెడ్ ఇంజిన్, సీవీటీ ట్రాన్స్‌మెషిన్, 33.5బీహెచ్పీ పవర్, 35ఎన్ఎం టారిక్, యాంగులర్ బాడీ ప్యానెల్స్, పొడవైన విండ్‌స్క్రీన్, పుల్-బ్యాక్ హ్యాండిల్‌బార్,స్టెప్డ్ సీట్, డ్యూయల్ ఫుట్‌రెస్ట్ ప్రొవిజన్లతో సౌకర్యంగా ఉంటుంది. ఎల్ఈడీ లైటింగ్, కీలెస్ ఇగ్నిషన్, హీటెడ్ గ్రిప్స్, హీటెడ్ సీట్, ఏబీఎస్, యాంటీ-థెఫ్ట్ అలారం సిస్టమ్,బ్లూటూత్-ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అట్రాక్టీవ్ ఫీచర్లు ఉన్నాయి. ధర ఎంతంటే? బీఎండబ్ల్యూ సీ400 జీటీ బ్లూమ్యాక్సీ (ఫీచర్స్ పెద్దగా ఉండే) స్కూటర్. హైవేపై సుధీర్ఘ ప్రయాణానికి అనువుగా ఉండే బైక్ ఎక్స్ షోరూం ధర రూ.5లక్షలని బీఎండబ్ల్యూ సంస్థ తెలిపింది. స్కూటర్ ప్రీ బుకింగ్ కోసం లక్షరూపాయిలు కట్టాల్సి ఉంది. ఇప్పటికే భారత్‌లో అత్యంత ఖరీదైన స్కూటర్' అనే ప్రచారం జరగడంతో దేశంలో ఇప్పటి వరకు 100 బుకింగ్‌లు పూర్తయ్యాయని నిర్వాహకులు చెబుతున్నారు. చదవండి: కారుని ఇలా కూడా తయారు చేస్తారా! -
భారీగా పెరిగిన హీరో మోటోకార్ప్ బైక్ ధరలు...! కొత్త ధరలు ఇవే...!
భారత టూవీలర్ రంగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్ప్లెండర్ బైక్ ధరలను పెంచుతూ హీరో మోటోకార్ప్ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు సెప్టెంబర్ 20 నుంచి అమలుల్లోకి వచ్చాయి. భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన స్ప్లెండర్ బైక్ ధరలను హీరో మోటోకార్ప్ సవరించింది. పెరుగుతున్న ముడి సరుకుల ధరలను దృష్టిలో ఉంచుకొని బైక్‌ల ధరలను పెంచినట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. స్ప్లెండర్ బైక్ ధరలు సుమారు వెయ్యి నుంచి రెండు వేల వరకు హీరో మోటోకార్ప్ పెంచింది. అంతేకాకుండా మాస్ట్రో ఎడ్జ్, డెస్టినీ 125 , ప్లెజర్ ప్లస్ స్కూటీ ధరలు కూడా పెరిగాయి. చదవండి: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!! హీరో మోటోకార్ప్ బైక్‌ల కొత్త ధరలు క్రమసంఖ్య మోడల్ కొత్త ధర(రూ.) పాత ధర(రూ.) 1. స్ప్లెండర్ ఐస్మార్ట్ డ్రమ్/అల్లాయ్ 69,650 68,650 2. స్ప్లెండర్ ప్లస్ సెల్ఫ్/డ్రమ్/అల్లాయ్ 67,160 66,050 3. స్ప్లెండర్ ప్లస్ సెల్ఫ్/డ్రమ్/అల్లాయ్/i3S 68,360 67,210 4. స్ప్లెండర్ ప్లస్ బ్లాక్ అండ్ అసెంట్ సెల్ఫ్ / డ్రమ్ / అల్లాయ్ 68,860 67,260 5. సూపర్ స్ప్లెండర్ డ్రమ్/అల్లాయ్ 73,900 72,600 6. సూపర్ స్ప్లెండర్ డిస్క్/అల్లాయ్ 77,600 75,900 7. మాస్ట్రో ఎడ్జ్ 125 అల్లాయ్ డ్రమ్ 73,450 72,250 8. మాస్ట్రో ఎడ్జ్ 125 అల్లాయ్ డిస్క్ 77,900 76,500 9. మాస్ట్రో ఎడ్జ్ 125 అల్లాయ్ డిస్క్ ప్రిస్మాటిక్ కనెక్ట్ 81,900 79,750 10. డెస్టినీ 125 స్టీల్ డ్రమ్ 70,400 69,500 11. డెస్టినీ 125 100 మిలియన్ ఎడిషన్ 75,500 74,750 12. డెస్టినీ 125 అల్లాయ్ డ్రమ్ VX ప్లాటినం 75,900 74,700 13. మాస్ట్రో ఎడ్జ్ 110 అల్లాయ్ డ్రమ్ VX 65,900 64,250 14. ప్లెజర్ ప్లస్ స్టీల్ డ్రమ్ LX 61,900 60,500 15. ప్లెజర్ ప్లస్ అల్లాయ్ డ్రమ్ VX 64,200 62,850 16. ప్లెజర్ ప్లస్ ప్లాటినం అల్లాయ్ డ్రమ్ ZX 66,400 64,950 చదవండి: Stangest Thing I Have Ever Worked On: నా కెరియర్లో విచిత్రమైన ఒప్పందం : సత్య నాదేళ్ల -
హార్లే-డేవిడ్సన్ స్కూటర్ ఎలా ఉంటుందో చూశారా...!
హార్లే-డేవిడ్సన్ ఈ పేరు వినగానే మనకు గుర్తువచ్చేవి ప్రీమియం లగ్జరీ మోటార్స్ బైక్స్. అమెరికాకు చెందిన హార్లే-డేవిడ్సన్ బైక్స్ మోడళ్ల ప్రారంభ ధరలు పది లక్షల నుంచి మొదలై 40 లక్షల వరకు ఉంటాయి. 1950లో హోండాకు పోటీగా హార్లే-డేవిడ్సన్ టాపర్ అనే స్కూటర్‌ను ఉత్పత్తి చేసింది. హార్లే-డేవిడ్సన్ బైక్‌ల స్థానంలో స్కూటర్లను ఉత్పత్తి చేస్తోందని ఎవరు ఊహించలేరు. చదవండి: ఇప్పుడు ఫేవరెట్ టెస్లా కాదు..! ఇండియన్ కంపెనీ కోసం క్యూ! హార్లే-డేవిడ్సన్ కేవలం ఐదు ఏళ్ల పాటు మాత్రమే ఈ స్కూటర్లను ఉత్పత్తి చేసింది. ఈ స్కూటర్ ధర రూ. 9 లక్షలకు విక్రయించింది. రానున్న రోజుల్లో మెకమ్ లాస్ వేగాస్ మోటార్ సైకిల్స్-2022 షోలో హార్లే-డేవిడ్సన్ స్కూటర్ టాపర్‌ను వేలం వేయాలని కంపెనీ భావిస్తోంది. హార్లీ డేవిడ్సన్ టాపర్ స్కూటర్లు అంతగా ఆదరణ లభించలేదు. హార్లే-డేవిడ్సన్ టాపర్ మూడు మోడళ్లలో దేనిని వేలం వేస్తుందనే విషయంపై అస్పష్టంగా ఉంది. వేలం వచ్చే ఏడాది జనవరి 25 నుంచి జనవరి 29 వరకు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ రెట్రో స్కూటర్ వేలంపై ఇప్పటికే భారీ అంచనాలు నమోదవుతున్నాయి. హార్లే-డేవిడ్సన్ టాపర్ స్కూటర్ ప్రత్యేకతుల ఇవే...! హార్లే-డేవిడ్సన్ టాపర్ స్కూటర్లో సింగిల్ సిలిండర్, ఫ్లాట్-మౌంటెడ్ టూ-స్ట్రోక్ ఇంజిన్ ఏర్పాటుచేశారు. ఐదు నుంచి తొమ్మిది హార్స్పవర్ల పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ స్కూటర్ 20-అంగుళాల రియర్టైర్లను కలిగి ఉంది. ఈ స్కూటర్ సుమారు గంటకు 74 కిలోమీటర్ల గరిష్టవేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ఇంకో ప్రత్యేకత ఎంటంటే..దీనికి మరో సీట్ క్యాబిన్‌ను అమర్చుకోవచ్చును. చదవండి: వీటిపై ఇన్వెస్ట్ చేస్తే లాభాలే..లాభాలు...! -
బైక్ కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ షాక్!
మీరు పండుగ సమయంలో కొత్తగా బైక్ లేదా స్కూటర్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీరు చేదు వార్త. దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. ఈ పెరిగిన ధరలు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 20 నుంచి అమలులోకి రానున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న విడిభాగాల వస్తువుల ధరల వల్ల ద్విచక్ర వాహన ధరలను పెంచాల్సి వస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరల పెంపు అనేది రూ.3,000 వరకు ఉండనుంది. బైక్, స్కూటర్ వేరియంట్ బట్టి ధరలు పెరగనున్నాయి. త్వరలో రోబోయే పండుగ సీజన్ ముందు ధరలు పెంచడం విశేషం. ఈ పండుగ సీజన్లో డిమాండ్ ఆశాజనకంగా ఉంటుంది అని కంపెనీ భావిస్తుంది. హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో 1.80 మిలియన్ యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాది క్రితం కాలంలో విక్రయించిన 1.61 మిలియన్ యూనిట్లకంటే సుమారు 12శాతం ఎక్కువ. ఈ ఏడాది కూడా గత ఏడాది మాదిరిగానే ఉత్పత్తి, అమ్మకాలు కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితం చెందాయి. (చదవండి: ఐపీఎల్ ప్రియులకు ఎయిర్టెల్ శుభవార్త!) -
ఫెస్టివల్ ఆఫర్, ఈ బైక్ కొంటే లక్ష వరకు..
బైక్ లవర్స్‌కు యమహా ఇండియా మోటార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా పలు వాహనాలపై గిఫ్ట్ ఓచర్లు, రూ.1లక్ష విలువైన బంపర్ ఫ్రైజ్లను అందిస్తున్నట్లు యమహా ప్రకటించింది. యమహా ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్, రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్, యమహా ఫాసినో 125ఎఫ్ఐ వాహనాలపై ఆఫర్స్ ప్రకటించింది. ఈ ఆఫర్లు దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఇటీవల యమహా ఇండియా లాంఛ్ చేసిన ఐబ్రిడ్ వెర్షన్ టూవీలర్స్ ఫాసినో 125ఎఫ్ఐ, రెడ్జేఆర్ 125ఎఫ్ఐ వాహనాలపై తమిళనాడు మినహాయించి మిగిలిన రాష్ట్రాల్లో వివిధ ఆఫర్లను పొందవచ్చు. తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాల్లో యమహా ఫాసినో 125 ఎఫ్ఐ (నాన్ ఐబ్రిడ్),యమహా రేజడ్ఆర్ ఎఫ్ఐ(నాన్ ఐబ్రిడ్)వెర్షన్ వెహికల్స్ పై రూ.3,786 ఇన్సూరెన్స్ బెన్ఫిట్స్,రూ.999కే లో డౌన్ పేమెంట్స్ తో బైక్ ను సొంతం చేసుకోవచ్చు.అంతేకాదు రూ. 2,999 విలువైన గిఫ్ట్‌ను అందిస్తుంది. తమిళనాడులో యమహా బైక్ కొనుగోలుపై బంపర్ ఆఫర్ కింద రూ.1లక్ష రూపాయల్ని సొంతం చేసుకోవడమే కాదు...ఇన్య్సూరెన్స్ బెన్ఫిట్ కింద రూ.3,876, రూ.999కే డౌన్ పేమెంట్, రూ .2,999 విలువైన బహుమతుల్ని అందిస్తున్నట్లు యమహా ఇండియా ప్రకటించింది. కాగా ఈ ఆఫర్ సెప్టెంబర్ 30వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. -
World EV Day 2021: దూసుకొస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు
-
దూసుకొస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్
సాక్షి, ముంబై: దేశంలో ఒక వైపు 100 రూపాయల దాటేసిన పెట్రోలు ధర వాహనదారులను భయపెడుతోంది. మరోవైపు బయో, సాంప్రదాయ ఇంధన వాహనాలను మార్కెట్లోకి తీసుకు రావాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పలు ఆటో కంపెనీలకు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న పెట్రో వాతల నుంచి విముక్తి కలిగించే ఎలక్ట్రిక్ వాహనాలు శరవేగంగా దూసుకొస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, సమర్థత, ఉపాధి కల్పన అంటూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓలా, టీవీఎస్, అథెర్స్ లాంటి కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న జరుపుకుంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ మార్కెట్‌గా చైనా ఉండగా, రెండవ ఈవీ మార్కెట్ హబ్‌గా ఇండియా అవతరించనుంది. ఈ సందర్బంగా మార్కెట్లోకి హల్చల్ చేయనున్న వాహనాలపై స్పెషల్ స్టోరీ మీ కోసం.. -
ఢాకాలో విడుదలైన టీవీఎస్ ఎన్ టోర్క్ 125 స్కూటర్
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు సంస్థ టీవీఎస్ మోటారు తన ఎన్ టోర్క్ 125 రేస్ ఎడిషన్ స్కూటర్‌ను బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో లాంచ్ చేసినట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్ స్కూటర్ మార్కెట్లో ఇదివరకెన్నడూలేని కొత్త ఫీచర్లను జోడించి మరీ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఇంజిన్, స్మార్ట్‌ఫీచర్లు, అత్యాధునిక సౌకర్యాలు, స్టయిలిష్ లుక్ దీని సొంతం. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తున్న మొట్టమొదటి స్కూటర్ ఇదే. భారతదేశంలో ఈ టీవీఎస్ ఎన్ టోర్క్ 125 రేస్ ఎడిషన్ ధర రూ.80,325(ఎక్స్ షోరూమ్, ఇండియా).(చదవండి: రైల్వే రిజర్వేషన్ టికెట్ బదిలీ చేసుకోవచ్చు ఇలా..!) స్కూటర్ సెగ్మెంట్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టీవీఎస్ అధునాతన 'స్మార్ట్జోనెక్ట్' టెక్నాలజీ ప్లాట్‌ఫాంతో దీన్ని రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది. 125 సీసీ ఇంజిన్ 9.4 పీఎస్ పవర్, 10.5ఎన్ ఎం టార్క్, బ్లూ టూత్ కనెక్టివిటీ ప్రధాన పీచర్లుగా ఉన్నాయి. అంతేకాదు కాలర్ఐడీ, పార్కింగ్ లోకేషన్ అసిస్టెంట్, ఫుల్లీ-డిజిటల్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా నావిగేషన్ సహాయాన్ని అందిస్తుంది. షార్ప్ హెడ్ లాంప్, డే టైం రన్నింగ్ లైట్ లాంప్, ఎల్ఈడీ టెయిల్ ట్యాంప్, 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ లాంటి ఫీచర్లు, డ్యుయల్ టోన్ పెయింట్ వల్ల మొత్తం డిజైన్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది. 100 కిలోమీటర్ల వేగాన్ని 9 సేకన్లలో తాకగలదు అని సంస్థ పేర్కొంది ఈ కొత్త స్కూటర్ ఫుల్ డిజిటల్ స్పీడోమీటర్ తో వస్తుంది. ఇందులో నావిగేషన్ అసిస్ట్, టాప్ స్పీడ్ రికార్డర్, ఇన్-బిల్ట్ ల్యాప్-టైమర్, ఫోన్-బ్యాటరీ డిస్ ప్లే, చివరి పార్క్ చేసిన లొకేషన్ అసిస్ట్, సర్వీస్ రిమైండర్, ట్రిప్ మీటర్, స్ట్రీట్ అండ్ స్పోర్ట్ వంటి మల్టీ రైడ్ స్టాటిస్టిక్ మోడ్లతో సహా 55 ఫీచర్లను కలిగి ఉంది. -
Ola Electric Scooter:వచ్చేసిందోచ్... ఓలా.. ఆసక్తికరమైన ఫీచర్లు ఇవే
హైదరాబాద్: నెల రోజులుగా ఊరిస్తున్న ఓలా ఎలక్ట్రిక్ ధర గురుంచి నేడు తెలిసిపోయింది. పెట్రోలు ధరల బాదుడు నుంచి ఉపశమనం కలిగించే ఈ స్కూటర్ ను సొంతం చేసుకోవాలంటే ఎంత సొమ్ము చెల్లించాలనే విషయం వెల్లడైంది. ఓలా వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. S1, S1 Pro ప్రొ పేరుతో ఓలా రెండు మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొనివచ్చింది. ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 మోడల్ ధర రూ.99,999గా ఉంటే ఎస్1 ప్రో మోడల్ ధర రూ.1,29,999గా నిర్ణయించారు. ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఓలా ఎలక్ట్రిక్ లాంఛింగ్ ఈవెంట్లో ఈ వివరాలు వెల్లడించారు. . ఔరా అనిపిస్తున్న ఓలా - ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ S1, S1 ప్రో అనే రెండు విభిన్న వేరియంట్లలో విడుదల అయ్యింది. - S1 ఎలక్ట్రిక్ స్కూటర్ 50-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, ఎల్ఈడీ లైటింగ్ అధునాత ఫీచర్లు అందిస్తోంది. - ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పది రంగుల్లో లభిస్తోంది. - ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్స్ మోడ్‌లో కూడా పరుగులు తీస్తుంది. - ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 90, ఫుల్ ఛార్జ్ చేస్తే 121 కిమీల దూరం వెళ్లనుంది. - ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ 3.6 సెకన్లలో 0-40 వేగాన్ని అందుకుంటుంది. - ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 115 కి.మీ. ఫుల్ ఛార్జ్ చేస్తే 181 కి.మీ. దూరం వెళ్లనుంది. - ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ 3 సెకన్లలో 0-40 కిమీ/గం చేయగలదని పేర్కొంది. - స్కూటర్ ఎస్1లో 7 అంగుళాల డిస్ప్లే ఉంది. ఇది 3 జీబీ ర్యామ్‌తోపాటు ఆక్టా కోర్ చిప్సెట్తో పనిచేస్తుంది. - ప్రత్యేక అప్లికేషన్ ఉపయోగించి స్కూటర్‌ను ఆటోమేటిక్‌గా లాక్, లేదా అన్‌లాక్ చేయవచ్చు. - ఓలా ఎస్1 లోకల్ నావిగేషన్ అప్లికేషన్‌తో వస్తుంది. - ఓలా స్కూటర్ 3.9 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది 8.5 కిలోవాట్ పీక్ పవర్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ కు పవర్ అందిస్తుంది. - ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 18 నిమిషాల్లో 0 నుండి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. - లక్షకు పైగా ప్రీ బుకింగ్స్‌ను సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది. కోటి స్కూటర్ల తయారీ - ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హోం డెలివరీ పద్దతిలో కస్టమర్లకు అందివ్వనున్నారు. ఇప్పటికే టెస్లా ఇదే పద్దతిలో తన కార్ల అమ్మకాలు చేపడుతోంది. ఆన్లైన్లో స్కూటర్ బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికి వచ్చేస్తుంది. షోరూమ్‌ల వ్యవస్థ ప్రస్తుతానికి అందుబాటులో లేనట్టే. - 2021 ఫిబ్రవరిలో మొదటి స్కూటర్ని తయారు చేయడం ప్రారంభించగా ఫస్ట్ స్కూటర్ తయారీకి ఆరు నెలల సమయం పట్టింది. - తమిళనాడులో ఉన్న ఓలా మెగా ఫ్యాక్టరీలో స్కూటర్లు తయారవుతున్నాయి. ప్రారంభ దశలో ఏడాదికి 20 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసే అవకాశం ఉంది. గరిష్టంగా ఏడాదికి కోటి స్కూటర్ల తయారీ లక్క్ష్యంగా ఇక్కడ విస్తరణ పనులు జరుగుతున్నాయి. - స్కూటర్ సింపుల్ వన్, బజాజ్ చేతక్, ఏథర్ 450X, TVS iQubeలు ఓలా కంటే ముందే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మార్కెట్లో ఉన్నాయి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మొదటి ఓలా స్కూటర్ ఇదే... ఓ లుక్కేయ్యండి !
ప్రీ బుకింగ్స్‌తోనే వరల్డ్ రికార్డు సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ లుక్‌ని ఆ కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ రివీల్ చేశారు. తమిళనాడులో ఉన్న ఫ్యాక్టరీలో తయారైన మొట్ట మొదటి ఓలా మొదటి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశారు. ఫిబ్రవరిలో స్కూటర్ తయారీ పనులు మొదలు పెట్టామని, కంపెనీ ఉద్యోగులు ఎంతో శ్రమించి ఈ స్కూటర్ని తయారు చేశారని ఆయన వెల్లడించారు. పెట్రోలు ధరల పెరుగుదలతో ప్రత్యామ్నాయ వాహనాల వైపు చూస్తున్న వారికి ఓలా ఊరట ఇచ్చింది. దీంతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ స్కూటర్‌కి సంబంధించిన ఒక్కో ఫీచర్‌ని ట్విట్టర్ ద్వారా భవీష్ అగర్వాల్ వెల్లడిస్తూ వస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ స్కూటర్‌కి సంబంధించిన అన్ని వివరాలను ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడించనున్నారు. Built the first scooter in our Futurefactory today! From barren land in Feb to this in under 6 months despite a pandemic!! The @OlaElectric team is just amazing❤️👍🏼 pic.twitter.com/B0grjzWwVC — Bhavish Aggarwal (@bhash) August 14, 2021 -
ఆ స్కూటర్ ధరలు భారీగా పెంచిన టీవీఎస్ మోటార్
ప్రముఖ టీవీఎస్ మోటార్ కంపెనీ 110సీసీ టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధరలను భారీగా పెంచింది. ఈ స్కూటర్ ఐదు వేరియెంట్లలో లభిస్తుంది. కనిష్ఠంగా రూ.736 పెంచితే, గరిష్టంగా రూ.2,336 పెంచింది. షీట్ మెటల్ వీల్ వేరియెంట్ స్కూటర్ కొత్త ధర ఇప్పుడు ₹65,673, స్టాండర్డ్ మోడల్ స్కూటర్ ధర ₹67,398(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. జడ్ ఎక్స్ డ్రమ్, జడ్ఎక్స్ డిస్క్ ట్రిమ్ స్కూటర్ ధరలు వరుసగా ₹71,973, ₹75,773గా ఉన్నాయి. అయితే, క్లాసిక్ మోడల్ స్కూటర్ ధర ఇప్పుడు ₹75,743గా ఉంది. జూపిటర్ మోడల్ స్కూటర్ కొత్త ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. TVS Jupiter variant Revised price Sheet metal wheel variant ₹65,673 Standard Variant ₹67,398 ZX Drum ₹71,973 ZX Disc ₹75,743 Classic Variant ₹75,743 టీవీఎస్ జూపిటర్ 109.7సీసీ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది 7.37బిహెచ్ పీ పవర్, 8.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. జూపిటర్ స్కూటర్ ఎకోత్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్(ఈటి-ఫై) టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల 15 శాతం మెరుగైన మైలేజీ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. టీవీఎస్ జూపిటర్ లో డిస్క్-డ్రమ్ కాంబో బ్రేకింగ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ 6 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కలిగి ఉంది. స్కూటర్లో ఫ్రంట్ యుటిలిటీ బాక్స్, మొబైల్ ఛార్జర్ కూడా ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ జెడ్ఎక్స్ డిస్క్ వేరియంట్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైడ్ అనుభవాన్ని అందించడానికి టీవీఎస్ ఇన్ టెల్లిగో టెక్నాలజీ కలిగి ఉంది. -
ఎలక్ట్రిక్ బైక్ ఐడియా.. భలే ఉంది కదూ!
ఒంటెద్దు బళ్లు చూశాం గాని, ఒంటిచక్రం బండేమిటి? ఇదేదో సర్కస్ వ్యవహారం కాబోలనుకుంటున్నారా? ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న వాహనం అచ్చంగా ఒంటిచక్రం బండి. ఇది మోనోవీల్ ఎలక్ట్రిక్ బైక్. హోండా కంపెనీకి చెందిన డిజైనర్ నాషో ఆల్ఫోన్సో గార్షియా దీనికి రూపకల్పన చేశాడు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే నగరాల్లో ఇరుకిరుకు సందుల్లో కూడా తేలికగా ప్రయాణాలు సాగించడానికి ఈ వాహనం భేషుగ్గా ఉపయోగపడుతుందని గార్షియా చెబుతున్నాడు. దీనిని నడపడం పెద్దకష్టమేమీ కాదు. ఇందులో కాళ్లు మోపడానికి ఉండేచోటులో నిలుచుని, స్టార్ట్ చేస్తే చాలు. పడిపోతుందేమోననే భయం అక్కర్లేదు. ఇది పూర్తిగా సెల్ఫ్బ్యాలెన్సింగ్ వాహనం. హోండా సంస్థ ప్రస్తుతానికి దీనిని నమూనాగా మాత్రమే తయారు చేసింది. దీనిపై మరిన్ని పరీక్షలు విజయవంతమైతే, పూర్తిస్థాయి ఉత్పాదన ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. -
వచ్చేస్తున్నాయ్! ఆగస్టులో రయ్‌రయ్‌మంటూ...
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశమంతా ఆగస్టులో ఆజాదీ కా అమృత్ వేడుకలకు ముస్తాబవుతోంది. మరోవైపు ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఓలా స్కూటర్ కూడా ఇదే నెలలో డెలివరీకి రెడీ అవుతోంది. ఓలాతో పాటు ఈ నెలలో రిలీజ్ కాబోతున్న ముఖ్యమైన వెహికల్స్ గురించి క్లుప్తంగా ఓలా పెరిగిన పెట్రోలు ధరలతో జనమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూస్తున్నారు. దీంతో లక్ష ప్రీ బుకింగ్స్ సాధించి ఓలా రికార్డు సృష్టించింది. పది రంగుల్లో వంద కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ స్కూటర్ రాబోతుందని అంచనా. ఇంకా తేది ఖరారు కానప్పటికీ ఆగస్టులోనే ఓలా స్కూటర్ రోడ్లపై పరుగులు పెడుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 సక్సెస్ ఫుల్ మోడల్ క్లాసిక్ 350కి మరిన్ని హంగులు జోడించి న్యూజెనరేషన్ మోడల్ని ఆగస్టులో మార్కెట్లోకి తెస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ తెస్తోంది. న్యూ ఇంజన్, ఫ్రేమ, టెక్నాలజీ, అధునాత ఫీచర్లను రాయల్‌ఎన్‌ఫీల్డ్ జోడించింది. ఇప్పటి వరకు ఉపయోగించిన ఇంజన్ స్థానంలో మెటియోర్ 350లో వాడే ఇంజన్‌ను ఆర్ఈ తెచ్చింది. సీటు, లైటు, హ్యాండిల్ బార్, పెయింట్ స్కీం, డిస్క్ బ్రేకుల్లో మార్పులు చేసింది. బీఎండబ్ల్యూ సీ 400 జీటీ బీఎండబ్ల్యూ మోటారడ్ నుంచి సరికొత్త సీ 400 జీటీ మ్యాక్సీ స్కూటర్ని మార్కెట్లో ప్రవేశపెట్టబోతుంది. ఈ ప్రీమియం మోడల్ స్కూటర్ ధర రూ. 5 లక్షల దగ్గర ఉండవచ్చని అంచనా. సింపుల్‌వన్ ఎమర్జింగ్ మార్కెట్‌గా భావిస్తోన్న ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది సింపుల్ వన్ స్కూటర్. ఆగస్టు 15న ఈ స్కూటర్ ఇండియా మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టీవీఎస్ ఐక్యూబ్, అథర్‌లకు పోటీగా ఇది మార్కెట్లోకి వస్తోంది. హోండా హర్నెట్ 2.0 బేస్డ్ ఏడీవీ ఈ నెలలో హార్నెట్ 2.0 ఏడీవీ మోడల్ రిలీజ్ చేసేందుకు హోండా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. హోండాకి చెందిన రెడ్ వింగ్ లైన్ డీలర్షిప్ ద్వారా ఇవి మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ బైకు ధర రూ.1.20 నుంచి 1.50ల మధ్య ఉండవచ్చు. -
ఓలా స్కూటర్... వామ్మో ఇంత స్పీడా !
హైదరాబాద్: ప్రీ బుకింగ్‌లో ఇప్పటికే ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఓలా మరో సారి మార్కెట్ దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో అత్యధిక స్పీడ్‌తో రాబోతున్నట్టుగా సంకేతాలు ఇచ్చింది. ఓలా సీఈవో హింట్స్ ఓలా స్కూటర్ సీఈవో భవీశ్ అగర్వాల్ గత కొద్ది కాలంగా ఓలా స్కూటర్‌కి సంబధించిన కీలక సమాచారాన్ని ఒక్కొక్కటిగా సోలష్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తాజాగా ఓలా స్కూటర్ టాప్ స్పీడ్ ఎంత ఉండాలని మీరు కోరుకుంటున్నారో చెప్పండి అంటూ ట్విట్టర్ వేదికగా ఓ ప్రశ్న సంధించారు. కింద ఆప్ఫన్లుగా గంటకి 80 కి,మీ, 90 కి,మీ, 100కు పైగా కి,.మీలతో పాటు స్పీడ్‌తో పని లేదన్నట్టుగా నాలుగు ఆప్ఫన్లు ఇచ్చారు. ఈ పోల్‌లో సగం మంది వందకు పైగా స్పీడ్ కావాలంటూ సమాధానం ఇచ్చారు. అంచనాలకు మించి గతంలో ఓలా స్కూటర్ ఎన్ని రంగుల్లో వస్తే బాగుంటుందో చెప్పాలంటూ ప్రశ్నించారు భవీష్. దానికి సమాధానంగా 9 రంగుల్లో వస్తే బాగుంటుందని నెటిజన్లు సమాధానం ఇచ్చారు. అయితే వారి అంచనాలను మించి ఏకంగా 10 రంగుల్లో ఓలా స్కూటర్ని మార్కెట్లోకి తేబోతున్నట్టు ఆయన ప్రకటించారు. కచ్చితంగా వందకు పైనే ఓలాకు సంబంధించి కీలక అప్డేట్స్ను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వస్తోన్న భవీష్ ఈసారి స్పీడ్‌కు సంబంధించిన విషయం బయట పెట్టారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓలా స్కూటర్ గరిష్ట వేగం గంటకు వంద కిలోమీటర్లకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం వందకు పైగా ఉండటం అనేది రికార్డేనని చెప్పుకుంటున్నారు. దీనిపై మరింత క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ప్రపంచ రికార్డు ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ బూమ్ నడుస్తోంది. పెరుగుతున్న పెట్రోలు ధరలతో క్రమంగా ఈవీలపైపు ప్రజలు మళ్లుతున్నారు. ఈ తరుణంలో మార్కెట్లోకి వస్తోన్న ఓలా ఆది నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. సరికొత్త పంథాలో మార్కెట్లో తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవల మొదలైన ప్రీ బుకింగ్స్‌లో ఏకంగా లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించింది. What top speed would you want for the Ola Scooter? — Bhavish Aggarwal (@bhash) July 24, 2021 -
భారత మార్కెట్లోకి రానున్న తొలి బీఎండబ్ల్యూ మాక్సి స్కూటర్..!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ భారత మార్కెట్లోకి కొత్త మ్యాక్సీ-స్కూటర్‌ను టీజ్ చేసింది. ఈ బైక్ భారత్‌లో తొలి మ్యాక్సి-స్కూటర్ అని కంపెనీ పేర్కొంది. బీఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ ఇండియా మ్యాక్సి స్కూటర్ పేరును ఇంకా వెల్లడించలేదు. కొత్త మాక్సి-స్కూటర్ కంపెనీ గ్లోబల్ పోర్ట్‌ఫోలియో నుంచి రెండు మిడ్-సైజ్ మ్యాక్సీ-స్కూటర్లలో ఒకటిగా ఉంటుందని తెలుస్తోంది. బీఎండబ్యూ మోట్రాడ్ తన పోర్ట్‌ఫోలియోలో బీఎండబ్యూ సీ400ఎక్స్,బీఎండబ్యూ సీ400జీటీలను కలిగి ఉంది. ఈ బైక్‌లను ఈ సంవత్సరం ప్రారంభంలో అప్డేట్ చేశారు. రెండు స్కూటర్లు 350 సిసి ఇంజన్లను కలిగి ఉంది, కాగా భారత్‌లో బీఎండబ్యూ మాక్సి-స్కూటర్లో భాగంగా బీఎండబ్యూ సీ400జీటీను మార్కెట్లలోకి విడుదల చేయవచ్చునని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు. 2018లో బీఎండబ్యూ సీ400జీటీ మ్యాక్సి బైక్‌ను లాంఛ్ చేసింది. భారత మార్కెట్లో బైక్ ఎక్స్ షో రూమ్ ధర 6 లక్షలపైనా ఉంటుందని తెలుస్తోంది. బీఎండబ్యూ మ్యాక్సి బైక్ సింగిల్ సిలిండర్, 350సీసీ ఇంజన్ సామర్థ్యంతో రానుంది. బైక్‌లో అప్డేటేడ్ త్రోటెల్ బై వైర్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. 33.5 బీహెచ్పీ ఇంజన్ 35ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. Are you ready to rise to the next level of urban riding? BMW Motorrad India’s first Maxi-scooter is debuting soon. Watch this space for more! #UrbanMobility#MakeLifeARide #BMWMotorradIndia #BMWMotorrad pic.twitter.com/Yu3wLbrUTF — BMWMotorrad_IN (@BMWMotorrad_IN) July 16, 2021 -
టీవీఎస్ నుంచి హై స్పీడ్ స్కూటర్
ముంబై: టీవీఎస్ మోటార్ మంగళవారం ఎన్‌టార్క్ 125సీసీ రేస్ ఎక్స్పీ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. తెలంగాణలో ఎక్స్ షోరూంలో దీని ధర రూ.89,192 గాఉంది. 125 సీసీ సిగ్మెంట్లో 10 పీఎస్ పైగా పవర్‌తో భారత్‌లో రూపొందిన ఏకైక స్కూటర్ ఇదే అని కంపెనీ తెలిపింది. రేస్, స్ట్రీట్ అనే రెండు డ్రైవింగ్ మోడ్ ఆప్షన్లను కలిగి ఉంది. ఎన్‌టార్క్ 125సీసీ రేస్ ఎక్స్పీ బైక్‌లో అధునాత ఫీచర్లను టీవీఎస్ జత చేసింది. అందులో వాయిస్ అసిస్టెంట్, కనెక్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ రేస్ మోడల్లో గంటకు 98 కిలోమీటర్ల వేగం ప్రయాణిస్తుంది. -
ప్రపంచ అమ్మకాల్లో రికార్డ్ సృష్టించిన టీవీఎస్ స్కూటర్
టీవీఎస్ మోటార్స్ ఎన్టీఓఆర్క్యూ(NTORQ) 125 స్కూటర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ స్కూటర్ అంతర్జాతీయ మార్కెట్లలో తక్కువ కాలంలో లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటినట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రకటించింది. ఎన్టీఓఆర్క్యూ దక్షిణ ఆసియా, పశ్చిమ ఆసియా, ఆసియాన్, లాటిన్ అమెరికాలోని 19 దేశాలలో తమకు కొనుగోలుదారులు ఉన్నట్లు పేర్కొంది. టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్, సీఈఓ కెఎన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. మా స్మార్ట్ స్కూటర్ టీవీఎస్ ఎన్టీఓఆర్క్యూ 125 అంతర్జాతీయ మార్కెట్లలో 1 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది. ఈ స్కూటర్ ప్రారంభించినప్పటి నుంచి స్కూటర్ ప్రపంచవ్యాప్తంగా జెన్ జెడ్ కస్టమర్లను భాగ ఆకర్షిస్తుంది. దీనికి ప్రధాన కారణం స్కూటర్ అద్భుతమైన ప్రదర్శన, అందులో ఉన్న సాంకేతికత, ఉన్నతమైన పనితీరు వంటి అంశాలు అందరికి చేరుకోవడానికి దోహదపడ్డాయి అని చెప్పారు. ఆవిష్కరణలో బెంచ్‌మార్క్‌లను అందుకోవడం, కస్టమర్ల ఆకాంక్షను నెరవర్చడం ద్వారా టీవీఎస్ ఎన్టీఓఆర్క్యూ బ్రాండ్‌ను పెంచుకోవాలనే మా నిబద్ధతకు ఇది ఒక ఉదాహరణ అని కూడా అన్నారు. దీనిలో మంచి పనితీరు కోసం టీవీఎస్ రేసింగ్ పెడిగ్రీ సపోర్ట్, రేస్-ట్యూన్డ్ ఇంధన ఇంజెక్షన్ (RT-Fi) కలిగి ఉంది. టీవీఎస్ ఎన్టీఓఆర్క్యూలో ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఈ కారణం వల్ల స్కూటర్‌ను స్మార్ట్‌ఫోన్‌కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చెయ్యవచ్చు. అలాగే, నావిగేషన్ అసిస్ట్, టాప్ స్పీడ్ రికార్డర్, ఇంటర్నల్ ల్యాప్-టైమర్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, లొకేషన్ అసిస్ట్, సర్వీస్ రిమైండర్, ట్రిప్ మీటర్, రెడ్ కలర్ హాజార్డ్ స్విచ్, ఇంజిన్ కిల్ స్విచ్, లెడ్ లైటింగ్, స్ట్రీట్ - స్పోర్ట్ వంటి మల్టీ-రైడ్ స్టాటిస్టిక్స్ మోడ్లు వంటి ఫీచర్స్ ఉన్నాయి. బీఎస్-VI స్కూటర్ డిస్క్, డ్రమ్ రేస్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇది మాట్టే రెడ్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ రెడ్, మెటాలిక్ బ్లూ కలర్ వేరియంట్లలో వస్తుంది. రేస్ ఎడిషన్ రెడ్-బ్లాక్, ఎల్లో-బ్లాక్‌లలో లభిస్తుంది. చదవండి: మరో కీలక ప్రాజెక్టుకు రిలయన్స్ జియో శ్రీకారం -
లిఫ్ట్ అడిగి స్కూటర్‌పై.. ప్రాణం తీసిన ఫ్లెక్సీ
సాక్షి, చెన్నై: స్కూటర్‌పై వెళ్తున్న ఓ మహిళ ఫ్లెక్సీ రూపంలో ప్రాణాలు కోల్పోయారు. పుదుకోట్టై జిల్లా తిరుబువనం సమీపంలోని కరంపకుడి అమ్మనిపేటకు చెందిన స్వామికన్ను భార్య విజయరాణి మేల్మెట్టనూరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగుపయనంలో ఎంతకు బస్సు రాకపోవడంతో అటు వైపు స్కూటర్లో వచ్చిన యువకుడ్ని లిఫ్ట్ అడిగారు. అతడు లిఫ్ట్ ఇవ్వడంతో ఇద్దరు స్కూటర్‌పై అమ్మని పేటకు బయలుదేరారు. మార్గ మధ్యంలో ఓ చోట రవిచంద్రన్ అనే వ్యక్తి తన తండ్రి మరణించడంతో నివాళులర్పించే రీతిలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఉండడం, అది గాలికి స్కూటర్‌పై పడడం చోటుచేసుకుంది. స్కూటర్ వెనుక ఉన్న విజయరాణిపై ఫ్లెక్సీ పడడంతో ఆమె రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించగా మరణించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం చెన్నైలో అన్నాడీఎంకే వర్గాలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పడి రోడ్డుపై స్కూటర్లో వెళ్తున్న ఓ యువతి మరణించిన విషయం తెలిసిందే. -
యాక్టింగ్ ఇరగదీశాడు.. అయినా పోలీసులకు దొరికిపోయాడు..
కేరళ : సినిమాల్లో నటించకపోయినా కొందరు ఆస్కార్ నటులు మన మధ్యలోనే ఉన్నారని అప్పడప్పుడు మన స్నేహితులనో , బంధువులనో చూస్తే అనిపిస్తుంది. అలాంటి ఆస్కార్ ఆర్టిస్ట్ నటనే ఇప్పుడు వీడియో రూపంలో వైరల్‌గా మారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీడియో చూసిన వారందరు ఆ వ్యక్తి నటనకు 'ఏం నటన గురూ.. ఇరగదీశావ్'.. ‘నువ్వు కేక అంతే’ అంటూ కితాబిస్తున్నారు. నెటిజన్లేంటి ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ పొగుడుతోంది. ఇంతకీ అసలేం అక్కడ ఏం జరిగింది. అంతటి ఆస్కార్ నటన ఎవరిదీ అనుకుంటున్నారా.... అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. కేరళ పోలీస్ శాఖ తమ ఫేస్ బుక్ ఖాతాలో శుక్రవారం ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్తా ఫన్నీగా ఉండటం, ఆ ఫన్నీ వీడియోకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తమదైన శైలిలో సెటైరికల్ కామెంట్స్, బ్యాక్ గ్రౌండ్ జోడించడంతో ఇట్టే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఏప్రిల్ 15వ తారీఖున మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో ముగ్గురు వ్యక్తులు ఒకే స్కూటీపై వెళ్తున్నారు. వాళ్లకు కొద్ది దూరంలోనే ఎదురుగా ఓ పోలీస్ వ్యాన్ వస్తోందని గ్రహించారు. ఆ స్కూటీని నడిపే వ్యక్తికి హెల్మెట్ లేదు. ఏ ఒక్కరూ మాస్క్ ధరించలేదు. పోలీసులకు చిక్కితే వాళ్ల లాఠీలకు పని చెబుతారని గ్రహించి, ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా అందులో ఇద్దరు పరారయ్యారు. ఓ వ్యక్తి మాత్రం సాధారణ పౌరుడిగా వెనక్కు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో తన జేబులో ఉండే మాస్కును తీసి పెట్టుకున్నాడు. పోలీస్ వ్యాన్ అతడి పక్కగా వచ్చి ఆగింది. ఆ వ్యక్తి పోలీస్ వ్యాన్ దగ్గరకు వెళ్లి ఏమీ తెలియనట్లు వారితో మాట్లాడాడు. ఇంకేముంది హమ్మయ్యా బతికి పోయామని అనుకున్నాడు. కానీ ఈ తతంగమంతా సీసీ కెమెరాల్లో రికార్డవడంతో అతడు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ వీడియోను పోలీసులు 'అమాయకుడిగా నటిస్తున్న ఓ బ్రదర్‌ను చూడండంటూ' శీర్షిక పెట్టి నెట్టింట పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి నటనకు.. నువ్వు కేక అంటూ ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ( చదవండి: సెలవు కోసం భార్యకు విడాకులిచ్చిన భర్త...అది కూడా 3 సార్లు ) -
దేశంలోనే తొలి ‘స్కూటర్’ ఉమన్
మధుమిత బయోటెక్నాలజీ చదివారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. ‘లా’ కూడా! ఇప్పుడిక మీరు చెప్పండి. ఆమె ఏ రంగాన్ని ఎన్నుకుని ఎటువైపు వెళితే రాణిస్తారు? కేవలం తను రాణించడం కోసం అయితే మనం ఏది చెప్పినా కరెక్ట్ అవుతుంది. ఇండియాలో ఒక కొత్త ఆవిష్కరణ చేయాలని అనుకున్నారు కనుకనే ఈవీ స్కూటర్‌పై ఆమె ఇండియాను రైడ్ చేయించబోతున్నారు! బిజినెస్ ఏదైనా పెడితే గట్టిగా ఉండాలి. గట్టిగా మాట్లాడాలి. గట్టిగా నిలబడాలి. బిజినెస్‌లో ఒక్కరే సీట్లో కూర్చొని ఉండరు. అసలు సీట్లో కూర్చొనే ఉండరు. బిజినెస్ మొదలు పెట్టినవారు మొదటి రోజు నుంచే సిబ్బందిలో సిబ్బందిగా కలిసిపోయి పని చేయిస్తుండాలి. పని చేస్తుండాలి. అనుకోని సమస్యలు వస్తే ధైర్యంగా పరిష్కరించుకోవాలి. ఇక అది యంత్రాలను తయారు చేసి, విక్రయించే బిజినెస్ అయితే, వాటి మార్కెటింగ్ పెద్ద పని. కోట్లలో లాభం రావడానికి ముందు కనీసం లక్షల్లోనైనా నష్టం రావచ్చు. తట్టుకోవాలి. ఇంతగా పడీపడీ చేసే శక్తి, పడి లేచే యుక్తి మహిళలకు ఉంటాయా? ఉండవని సమాజంలో అపోహ. చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేసే వరకు మహిళలు తమను తాము నిరూపించుకోగలరు కానీ.. బిజినెస్‌లో పెట్టుబడి పెట్టి, బిజినెస్‌కు పెట్టుబడులు సమీకరించి, బిజినెస్‌ను లాభాల్లో నడపడం మహిళల్లో నూటికో కోటికో ఒక్కరికే సాధ్యం అనే మాట నేటికీ వినిపిస్తూనే ఉంది. అయితే మధుమిత చక్కగా చదువుకోవడమే కాదు, చదువుకు తగ్గ బిజినెస్‌ను ఎంచుకుని ‘లాంచింగ్’కి సిద్ధంగా ఉన్నారు. ‘ఒబెన్’ పేరుతో ఆమె ఉత్పత్తి చేస్తున్న ఈవీ స్కూటర్లు వచ్చే మే నెలలో మార్కెట్లోకి రాబోతున్నాయి! ఈవీ అంటే.. ఎలక్ట్రిక్ వెహికల్. మధుమితా అగర్వాల్ డిజైన్ చేసిన ఈవీ స్కూటర్ మార్కెట్లోకి వచ్చిందంటే.. ఆ స్కూటర్‌తో పాటే, దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఓనర్‌గా ఆమెకూ గుర్తింపు వస్తుంది. అవును. ఇండియాలో ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ విదేశీ ఔట్‌సోర్సింగ్‌తో తయారైన ఈవీలే. ‘ఒబెన్’ కంపెనీ కో–ఫౌండర్ మధుమిత. ఈ సార్టప్కు ముఖ్య వ్యవస్థాపకురాలు కూడా మధుమితే అని చెప్పాలి. ఇండియాలో ఒక ఈవీ స్కూటర్ల ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రారంభించాలన్న ఆలోచన ఆమెదే కనుక. ఒబెన్ బెంగళూరులో ఉంది. ఆ నగరంలోనే ఉన్న ‘ఐపెక్సెల్’ అనే టెక్నాలజీ, ఇన్నొవేషన్ కన్సల్టేషన్ సంస్థ కూడా మధుమత స్థాపించినదే! ఐఐటి, ఐఐఎం లలో చదివాక ఆమె ఏ కాస్తయినా విరామం తీసుకున్నట్లు లేరు. ఒడిశాలోని రూర్కెలాలో మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి, బెంగళూరులో ఒక యువ పారిశ్రామిక వేత్తగా ఎదిగారు మధుమిత. ‘ఐపెక్సెల్’ మిలియన్ డాలర్ల కంపెనీ. మధుమిత చూస్తే ఈ ఏడాదే యూనివర్సిటీ చదువు ముగించుకుని బయటికి వచ్చినట్లుగా ఉంటారు. మధుమిత ‘లా’ కూడా చదివారు! తర్వాతే వ్యాపారవేత్తగా తన దారి మార్చుకున్నారు. ఇప్పుడిక నిరాటంకంగా సాగే ఒక ప్రీమియం స్కూటర్ని భార తీయులకు అందించేందుకు ఆఖరి దశ ప్రయోగాల్లో ఉన్నారు. ‘‘ఏదైనా ఒక పరిశ్రమకు యజమానిగా ఉన్నది మహిళ అని తెలియగానే.. ముందుకు రాబోయిన పెట్టబడి దారులు కూడా వెనక్కి తగ్గిపోతారు. ఇక ఆ పరిశ్రమ ఉత్పత్తుల పని తీరు సామర్థ్యంపై వినియోగదారుల నమ్మకాన్ని పొందాలంటే ఆ మహిళ, ఆమె నేతృత్వంలోని తక్కిన శాఖల సిబ్బంది ఎంతో కష్టపడాలి. ముఖ్యంగా.. ఆమె ఎంత బిజినెస్‌ఉమన్ అయినప్పటికీ ఆమెకు ఆమె కుటుంబం మద్దతు ఉండాలి. కుటుంబం ఒక్కటి పక్కన నిలిస్తే చాలు ఆమె తన పరిశ్రమను నిలబెట్టగలదు. పది మందికి ఉపాధిని ఇవ్వగలదు’’ అంటారు మధుమితా అగర్వాల్. ఆమెకు ఆమె భర్త దినకర్ అగర్వాల్ నుంచి పూర్తి సహకారం ఉంది. ‘ఒబెన్’లో ఆయన ఆమె భాగస్వామి కూడా! ఖరగ్‌పూర్‌లో ఐఐటి., బెంగళూరులో ఐఐఎం చదివారు మధుమిత. 2020 ఆగస్టులో ‘ఒబెన్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. ఇండియాలో ఈవీ కంపెనీ ప్రారంభించిన తొలి మహిళ మధుమిత. ఈ కంపెనీ నుంచే మరో రెండు నెలల్లో తొలి స్కూటర్ బయటికి వస్తోంది. బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చదివాక, మధుమిత ‘లా’ వైపు రావడానికి కారణం కెరీర్ ఎంపికకు సంబంధించిన ఊగిసలాట కాదు. పేటెంట్ చట్టాల మీద ఆసక్తి కొద్దీ చదివారు. అందులో ఆమె స్పెషలైజేషన్ ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ’. ఖరగ్‌పూర్ ఐఐటిలో మధుమిత చదివింది ఈ కోర్సునే. ఇంటెర్న్‌షిప్‌లో ఉన్నప్పుడే 2016లో ఆమెకు ‘ఐపెక్సెల్’ను ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. కంపెనీలు తమ ఉత్పత్తులను ఎలా మెరుగుపరుచుకోవాలి, కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడానికి మార్కెట్‌ను ఎలా స్టడీ చేయాలని అని ఐపెక్సెల్ సలహాలు ఇస్తుంటుంది. ఇప్పుడైతే మధుమిత తన పూర్తి సమయాన్ని ‘ఒబెన్’కే కేటాయించారు. నిజానికి గత నాలుగేళ్లుగా ఒబెన్ కోసమే పని చేస్తున్నారు. ఈవీ స్కూటర్‌కు ప్రాథమికంగా ఒక డిజైన్‌ను రూపొందించేందుకు మధుమిత సుదీర్ఘమైన అధ్యయనమే చేశారు. చివరికి భారతీయ రహదారులకు తట్టుకుని, నిరంతరాయంగా నడిచే ప్రీమియర్ స్కూటర్‌ను తయారు చేశారు. ఆ నమూనాను పరీక్షించి, ఫైనల్ చేసుకున్నారు. మన రోడ్ల మీద తిరుగుతున్న విదేశీ ఈవీలకు దీటుగా, అంతకన్నా మెరుగ్గా మన దేశవాళీ ఈవీ ఉండాలన్న ఏకైక లక్ష్యంతో ఇందులోకి దిగాం’’ అని మధుమిత చెబుతున్నారు. -
టీచర్ ఐడియా సూపర్: విద్యార్థుల వద్దకే పాఠాలు
ప్రభుత్వ స్కూళ్లలో సరిగ్గా చదువు చెప్పరని చాలామంది అభిప్రాయం. ప్రభుత్వ టీచర్లు అందరూ అలా లేకపోయినప్పటికీ కొంతమంది వల్ల ఏర్పడిన అభిప్రాయంతో తల్లిదండ్రులు పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లల్లో చదివించడానికే ఇష్టపడుతుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తోన్న మాష్టారు ‘ప్రజలవద్దకే పాలన’ లాగా విద్యార్థుల ఇళ్లవద్దకు వెళ్లి చదువు చెబుతున్నారు. కరోనా కారణంగా విద్యాసంస్థలన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆన్లైన్ క్లాస్‌లు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలామంది ఆన్లైన్ తరగతులను వింటున్నప్పటికీ, ఆర్థిక స్థితిగతులు సహకరించని కారణంగా కొంతమంది వీటికి హాజరు కాలేకపోతున్నారు. ఆన్లైన్ క్లాసుల ఖర్చు భరించలేని నిరుపేద పిల్లలకు విద్యనందించాలనే ఉద్దేశ్యంతో చంద్ర శ్రీవాత్సవ అనే టీచర్ వినూత్న ఐడియాతో.. విద్యార్థుల ఇళ్లవద్దకు వెళ్లి పాఠాలు చెబుతున్నారు. దీనికోసం ఆయన తన స్కూటర్ మీద మినీ స్కూల్, లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నారు. స్కూటర్‌కు గ్రీన్బోర్డు తగిలించి, మినీ లైబ్రరీలో పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ పెట్టుకుని సాగర్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో స్కూటర్ స్కూల్ మీద ప్రయాణిస్తూ విద్యార్థులకు బోధిస్తున్నారు. అయితే కరోనా వ్యాపించకుండా ఉండేందుకు ఆయన విద్యార్థుల ఇళ్ల పరిసర ప్రాంతాల్లోని చెట్ల కింద బ్లాక్‌బోర్డును ఏర్పాటు చేసి మైక్‌లో పాఠాలు చెబుతున్నారు. అంతేగాకుండా కొన్ని పాఠ్య పుస్తకాలు, కథల పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నారు. విద్యార్థులు ఆ పుస్తకాలు చదవడం అయిపోయిన తరువాత వాటిని తిరిగి మాష్టారికి ఇచ్చేస్తున్నారు. మైక్‌లో పాఠాలు చెప్పడం, వారు వాటిని తిరిగి పలకడం వంటివి పిల్లలకు చాలా సరదాగా ఉండడంతో ఎంతో ఆసక్తిగా మాష్టారు చెప్పే పాఠాలు వింటున్నారు. ‘‘తమ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని.. రోజూ తమ పిల్లలకు తరగతులు బోధిస్తున్న చంద్ర శ్రీవాత్సవ మాష్టారుకు రుణపడి ఉంటాము’’ అని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. చంద్ర శ్రీవాత్సవ మాట్లాడుతూ..‘‘ఎక్కువ మంది విద్యార్థులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. స్మార్ట్‌ఫోన్ కొనుక్కోలేని పరిస్థితి వారిది. అందువల్ల వారు ఆన్లైన్ తరగతులు వినలేకపోతున్నారు. అంతేగాకుండా విద్యార్థులు నివసించే కొన్ని ప్రాంతాల్లో నెట్వర్క్ సదుపాయం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో వారు చదువుకోవడం కష్టం. అందుకే ఇలా స్కూటర్ మీద తిరుగుతూ పాఠాలు చెబుతున్నాను’’ అని ఆయన చెప్పారు. ఈ మాష్టారు పిల్లలకేగాక ఎంతో మంది టీచర్లకు, తల్లిదండ్రులకు ప్రేరణగా నిలుస్తున్నారు. ఇటువంటి మాష్టార్లు ఊరికి ఒకరిద్దరున్నా.. నేటి బాలలు రేపటి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. -
బైక్ ధరలను పెంచేసిన హీరో మోటో
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బైక్ లవర్స్‌కి షాకిచ్చింది. వచ్చే నెలనుంచి తన మోటార్ సైకిళ్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులరీత్యా తమ అన్ని మోడళ్ల బైక్‌లు, స్కూటర్ల ధరలను పెంచాల్సి వస్తోందని ప్రకటించింది. సవరించిన ధరలు అన్ని షోరూంలలో 2021 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో సంస్థ వెల్లడించింది. (మారుతి కార్ల ధరలకు రెక్కలు) వినియోగదారుల మీద తక్కువ భారం పడేలా, తమ ఖర్చులను తగ్గించుకునే కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్టు హీర మోటో తెలిపింది. అయితే ధరల పెరుగుదల పరిమాణంపై కంపెనీ నిర్దిష్ట వివరాలు ఇవ్వలేదు. కానీ, ఈ పెరుగుదల రూ .2500 వరకు ఉంటుందని, మోడల్, నిర్దిష్ట మార్కెట్ ఆధారంగా ఉంటుందని హీరో తెలిపింది. కాగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇన్పుట్ ఖర్చుల భారం నేపథ్యంలో అన్నిమోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
లాంబ్రెటా కంపెనీ ఇక కనుమరుగు..
న్యూఢిల్లీ: లాంబ్రెటా.. విజయ్ సూపర్ .. కొన్ని దశాబ్దాల క్రితం స్కూటర్లకు పర్యాయపదంగా నిల్చాయీ బ్రాండ్లు. అప్పట్లో ఓ ఊపు ఊపిన లాంబ్రెటా స్కూటర్లంటే ఇప్పటికీ ఒక వింటేజ్ బ్రాండ్‌గా ప్రత్యేక గుర్తింపు ఉంది. కాలక్రమేణా లాంబ్రెటా, విజయ్ సూపర్ ఇతర వాహనాల పోటీ దెబ్బకు కనుమరుగయ్యాయి. ఇప్పుడిక వీటిని తయారు చేసిన కంపెనీ స్కూటర్స్ ఇండియా (ఎస్ఐఎల్) వంతు వచ్చింది. నష్టాల భారంతో కుదేలవుతున్న ఎస్ఐఎల్ను విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలేమీ ఫలించకపోవడంతో దీన్ని మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. మూసివేతకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తదుపరి ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదన ప్రకారం స్కూటర్స్ ఇండియా బ్రాండ్ పేరును విడిగా విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్యాబినెట్ ముందు ఉంచిన ప్రణాళిక ప్రకారం కంపెనీ మూసివేతకు రూ. 65.12 కోట్లు అవసరమయ్యే నిధులను రుణం కింద కేంద్రం సమకూర్చాలి. తగు స్థాయిలో నిధులు సమకూరిన తర్వాత అదనంగా ఉన్న రెగ్యులర్ సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ స్కీమును (వీఆర్ఎస్/వీఎస్ఎస్) ఆఫర్ చేయనున్నారు. లక్నో కేంద్రంగా కార్యకలాపాలు సాగించే స్కూటర్స్ ఇండియాలో సుమారు 100 మంది ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు, కంపెనీకి చెందిన 147.49 ఎకరాల స్థలాన్ని పరస్పర ఆమోదయోగ్య రేటు ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామికాభివృద్ధి ప్రాధికార సంస్థకు అప్పజెబుతారు. ఇక, స్టాక్ ఎ క్సే్చంజీల నుంచి షేర్లను కూడా డీలిస్ట్ చేయాల్సి ఉంటుంది. 1972 నుంచి.. స్కూటర్స్ ఇండియా (ఎస్ఐఎల్) 1972లో ఏర్పాటైంది. వివిధ రకాల ఇంధనాలతో పనిచేసే త్రిచక్ర వాహనాల డిజైనింగ్, అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్ కోసం దీన్ని నెలకొల్పారు. 1975లో దేశీ మార్కెట్ కోసం విజయ్ సూపర్ బ్రాండ్‌తోనూ, విదేశీ మార్కెట్ల కోసం లాంబ్రెటా పేరుతోనూ ఎస్ఐఎల్ స్కూటర్లను తయారు చేయడం మొదలు పెట్టింది. అటు పైన విక్రమ్/లాంబ్రో పేరిట త్రిచక్ర వాహనాలను కూడా ఉత్పత్తి చేసింది. 1997లో ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని నిలిపివేసిన ఎస్ఐఎల్ .. విక్రమ్ బ్రాండు కింద వివిధ త్రిచక్ర వాహనాల తయారీ, మార్కెటింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టింది. కంపెనీ నష్టాల్లో కూరుకుపోతుండటంతో కేంద్రం గతంలో దీన్ని విక్రయించే ప్రయత్నాలు చేసింది. యాజమాన్య హక్కుల బదలాయింపుతో పాటు తనకున్న పూర్తి వాటాలను విక్రయించేందుకు 2018 లో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానించింది. కానీ, విక్రయ యత్నాలు కుదరకపోవడంతో చివరికి మూసివేత నిర్ణ యం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
హీరో మాస్ట్రో ఎడ్జ్ స్కూటర్, ధర ఎంతంటే..
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బుధవారం మాస్ట్రో ఎడ్జ్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద దీని ధర రూ.72,950 గా ఉంది. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేసిన ఈ 125 సీసీ మోడల్ 8 బ్రేక్ హార్స్ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ‘‘మా స్కూటర్ బ్రాండ్ మాస్ట్రో ఎడ్జ్‌కు మార్కెట్లో మంచి పేరుంది. ఈ కొత్త మోడల్ చేరికతో బ్రాండ్ ఆకర్షణ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాము’’ అని హీరో మోటోకార్ప్ సేల్స్ విభాగపు అధిపతి నవీన్ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆటో మార్కెట్ కోలుకునేందుకు రానున్న వారాల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తామని చౌహాన్ పేర్కొన్నారు. -
చూస్తుండగానే పైనుంచి దూసుకెళ్లిన కారు!
-
చూస్తుండగానే పైనుంచి దూసుకెళ్లిన కారు!
సాక్షి, బెంగుళూరు: కర్ణాటకలోని మంగుళూరులో ఓ మహిళ మృత్యు ముఖంలోకి వెళ్లి ప్రాణాలతో బయటపడింది. కాద్రి కంబ్లా జంక్షన్ గుండా స్కూటర్ వెళ్తున్న వాణిశ్రీ అనే మహిళను ఓ కారు అడ్డుగా వచ్చి ఢీకొట్టింది. దాంతో ఆమె ఎగిరి కారు బానెట్‌పై పడి.. అక్కడి నుంచి కింద పడింది. అయినా కూడా ఆ సోయితప్పిన కారు డ్రైవర్ అదేమీ గమనించలేదు. కారుని అలానే ముందుకు పోనిచ్చాడు. దాంతో కారు ఆమె మీదుగా వెళ్లింది. అయితే, రోడ్డు పక్కనే ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై కారును అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. డ్రైవర్ కారు నిలపడంతో స్థానికులు వెంటనే కారుని అమాంతం పెకెత్తి మహిళను బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించారు. వాణిశ్రీకి ఎలాంటి అపాయం లేదని, చిన్న గాయాలే తగిలాయని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంపై కామెంట్ల వర్షం కురుస్తోంది. -
ఈ స్కూటర్ ఎవరిదో!
రంగారెడ్డి,శంషాబాద్ రూరల్: మండల పరిధిలోని కేబీదొడ్డి–రాయన్నగూడ రోడ్డు పక్కన ఓ స్కూటర్ పది రోజులుగా అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉంది. ఏపీ 28 ఏఫ్ 9124 నంబర్ గల బజాజ్ చేతక్ వాహనం కేబీ దొడ్డి వైపు వచ్చే మార్గంలో నిలిపి ఉంది. సుమారు పది రోజులవుతున్నా వాహనాన్ని ఎవరూ తీసుకెళ్లడం లేదని స్థానికులు చెబుతున్నారు. -
అపర శ్రవణుడు తిరిగిరాక
కర్ణాటక, తుమకూరు: తల్లితో కలిసి దేశంలోని పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లిన అపర శ్రవణ కుమారుడు సొంత రాష్ట్రం కర్ణాటకకు తిరిగి వచ్చాడు. శనివారం సాయంత్రం జిల్లా సరిహద్దులోకి రాగానే నేలను ముద్దాడి తమ మాతృభూమిపై ఉన్న ప్రేమను చాటారు. మైసూరుకు చెందిన కృష్ణకుమార్ ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజనీరు. తన 70 ఏళ్ల తల్లి చూడా రత్నను తీర్థయాత్రలకు తీసుకెళ్లాలని తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 2018 జనవరి నుంచి యాత్ర ఆ తర్వాత తన తల్లితో కలసి స్కూటర్‌పై గత 2018 జనవరి 14న మైసూరు నుంచి తన యాత్రను ప్రారంభించారు. సుమారు 5600 కిలోమీటర్లు ప్రయాణించారు. వీరిద్దరు ఉత్తర భారతదేశంలోని కైలాస పర్వతం, నేపాల్, మానస సరోవరం, భూటాన్, టిబెట్‌లలోని పుణ్యక్షేత్రాలను సందర్శించారు. కరోనా వైరస్ నేపథ్యంలో యాత్రను ముగించుకుని వచ్చారు. సరిహద్దు చెక్‌పోస్టులో ఆరోగ్య శాఖ అధికారులు వీరిరువురికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రాష్ట్రానికి ఆహ్వానించారు. తహశీల్దార్ డాక్టర్ విశ్వనాథ్, కొడిగెనహళ్లి పోలీసు స్టేషన్ పీఎస్ఐ పాలాక్ష ప్రభు తల్లీ కుమారులకు స్వాగతం పలికారు. -
స్కూటర్ డిక్కీలో మటన్.. జరిమానా
నల్లగొండ, మిర్యాలగూడ : నాలుగు రోజుల క్రితం కోసిన మటన్‌ను పాత వ్యవసాయ మార్కెట్లో విక్రయించేందుకు స్కూటర్ డిక్కీలో తీసుకొస్తున్న వ్యాపారిని ఆదివారం పట్టుకున్నారు. ఈ విషయాన్ని మార్కెట్ కార్యదర్శి శ్రీధర్, చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆ వ్యాపారికి మూడు వేల రూపాయల జరిమానా విధించారు. మటన్ మార్కెట్లో మరో 16 పొట్టేళ్లను పశువైద్యాధికారులు రిజెక్ట్ చేశారు. మరోవైపు భౌతిక దూరం పాటించకుండానే వినియోగదారులు మాంసం కొనుగోలు చేశారు. మాంసం మార్కెట్‌ను మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. నాణ్యమైన మాంసం విక్రయించాలని వ్యాపారులకు సూచించారు. ఆయన వెంట మార్కెట్ కార్యదర్శి శ్రీధర్, సూపర్వైజర్ సైదులు, సిబ్బంది పురం రవి, రమేశ్, సైదులు, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. -
‘ఈఫ్లూటో’ స్కూటర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ బ్యాటరీల తయారీకి కీలకమైన లిథియం పదార్థాన్ని దక్షిణ అమెరికా దేశాలైన అర్జెంటీనా, చిలీ, బొలీవియా నుంచి సేకరించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్డీవో మాజీ డైరెక్టర్ డాక్టర్ వి.కె.సారస్వత్ తెలిపారు. ప్యూర్ ఈవీ అనే సంస్థ ఐఐటీ–హైదరాబాద్ సాయంతో అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సారస్వత్, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. అనం తరం సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ఐఐటీ హైదరాబాద్ వంటి సంస్థలు రక్షణ రంగానికి ఉపయోగపడే పరికరాలు, టెక్నాలజీ అభివృద్ధికి ప్రయత్నించాలన్నారు. ఈప్లూటో 7జీ ప్రత్యేకమైంది.. ఐఐటీ హైదరాబాద్ సహకారంతో తాము అభివృద్ధి చేసిన ఈ ప్లూటో 7జీ విద్యుత్ స్కూటర్ ప్రత్యేకమైందని ప్యూర్ ఈవీ సీఈవో రోహిత్ వడేరా తెలిపారు. బ్యాటరీ విడిభాగాలను దిగుమతి చేసుకున్నప్పటికీ మిగిలిన అన్ని టెక్నాలజీలను ఇక్కడే అభివృద్ధి చేశామని చెప్పారు. ఐఐటీ హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న ఫ్యాక్టరీలో ఈప్లూటో 7జీని తయారు చేస్తున్నామని చెప్పారు. ఈ స్కూటర్ ధర రూ. 79,999లని తెలిపారు. -
అదరగొడుతున్న పియాజియో స్కూటీలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ వాహన తయారీ దిగ్గజం పియాజియో ఆటోఎక్స్‌పో 2020లో ద్విచక్రవాహనాల లాంచింగ్‌తో సందడి చేసింది. ఇటలీకి చెందిన పియాజియో తన ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్లో ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ను ఆవిష్కరించింది. అలాగే వెస్పా ఎలెట్రికా అనే ఎలక్ట్రిక్ స్కూటీని కూడా ఈ సంస్థ ప్రదర్శించింది. కొత్త ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ -160 బారామతి ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసినట్టు కంపెనీ తెలిపింది. ఇది అక్టోబర్-డిసెంబర్, 2020లో మార్కెట్లోకి వస్తుందని అంచనా. రానున్న ఐదేళ్లలో ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్‌ను అనుసరించాలని కంపెనీ యోచిస్తోంది. స్థానిక వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని భారతదేశంలో వినూత్న ఎలక్ట్రిక్-మొబిలిటీ వాహనాలను లాంచ్ చేయనుంది. పియాజియో ఇండియా సీఎండీ డియెగో గ్రాఫి మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలను తీర్చగల కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం గర్వంగా ఉందన్నారు. ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 బైక్, 160 సీసీ, 125 సీసీ బీఎస్-6 ఇంజన్ ఆప్షన్లలో వస్తుంది. ఎల్ఈడీ హెడ్, టైల్ లైట్స్, యుఎస్బి ఛార్జింగ్ ఉన్న స్ప్లిట్ గ్లోవ్ బాక్స్, డిజిటల్ క్లస్టర్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే క్రోమ్ గార్నిష్ ఎగ్జాస్ట్‌తో పాటు 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ ను జోడించింది. బ్లూ, వైట్, రెడ్, బ్లాక్ అనే నాలుగు వేర్వేరు రంగులలో లభిస్తుంది. ఆన్లైన్ ద్వారా బుకింగ్‌లు ఆగస్టు 2020లో ప్రారంభమవుతాయి. చదవండి : మారుతి విటారా బ్రెజ్జా సరికొత్తగా ఆటో ఎక్స్పో సందడి షురూ: కార్ల జిగేల్.. జిగేల్ -
బీఎస్–6 సుజుకీ యాక్సెస్ వచ్చేసింది
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా (ఎస్ఎంఐపీఎల్).. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న యాక్సెస్ 125 స్కూటర్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ అధునాతన మోడల్.. అల్లాయ్ డ్రమ్ బ్రేక్, అల్లాయ్ డిస్క్ బ్రేక్, స్టీల్ డ్రమ్ బ్రేక్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 64,800 (ఎక్స్‌షోరూం–ఢిల్లీ) వద్ద నిర్ణయించింది. స్పెషల్ ఎడిషన్ ధర రూ. 69,500గా కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ కొయిచిరో హిరావ్ మాట్లాడుతూ.. ‘ఎస్ ఎంఐపీఎల్ వృద్ధి బాటలో ఈ స్కూటర్ పాత్ర కీలకంగా కొనసాగుతోంది. నూతన ఆవిష్కరణతో కస్టమర్ల అంచనాలను అందుకోగలమని భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించా రు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన నిబంధనలు అమలుకానుండగా.. గడువు కంటే ముం దుగానే తాజా ఫ్యామిలీ స్కూటర్‌ను విడుదల చేయగలిగామని అన్నారు. -
ఆ ఫైన్ నేనే కడతా..
లక్నో: నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇటీవల లక్నోలో ద్విచక్రవాహనంపై ప్రయాణించిన సంగతి తెలిసిందే. పోలీసులను తప్పించుకొని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురి నివాసానికి వెళ్లేందుకు ఆమె అనూహ్యంగా స్కూటీని ఎంచుకున్నారు. అయితే, ఈ స్కూటీని నడిపిన కాంగ్రెస్ నేత ధీరజ్ గుర్జర్ ఆ సమయంలో హెల్మెట్ ధరించలేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనంపై రూ.6,300 జరిమానా విధించారు. దీనిపై వాహన యజమాని రాజ్‌దీప్ సింగ్ స్పందించారు. తన వాహనంపై విధించిన జరిమానాను తానే చెల్లిస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, ప్రియాంకగాంధీ నుంచి కానీ ఆ డబ్బులు తీసుకోనని రాజ్‌దీప్ తెలిపారు. ఎస్ఆర్ దారాపురి నివాసానికి ప్రియాంకగాంధీని తీసుకెళ్లేందుకు వాహనం కావాలని కాంగ్రెస్ నేత ధీరజ్ గుర్జర్ అడిగారని, దాంతో వెంటనే తాను స్కూటీని ఇచ్చానని ఆయన తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల సందర్భంగా గాయపడ్డవారిని పరామర్శించేందుకు ప్రియాంకగాంధీ ఇటీవల లక్నోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, దారాపురి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు తన మెడ పట్టుకొని చేయి చేసుకున్నారని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నాటకీయ పరిణామాల మధ్య పోలీసుల కళ్లుగప్పి ఆమె స్కూటీ మీద వెళ్లి దారాపురి కుటుంబసభ్యులను పరామర్శించారు. -
యమహా నుంచి 125 సీసీ స్కూటర్లు
చెన్నై: యమహా మోటార్ ఇండియా కంపెనీ 125 సీసీ స్కూటర్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఈ సెగ్మెంట్లో రెండు కొత్త మోడళ్లు– ఫ్యాసినో 125ఎఫ్ఐ, రేజర్125ఎఫ్‌ఐలను అందుబాటులోకి తెచ్చింది. ఫ్యాసినో స్కూటర్ ధరను రూ.67,430(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ గ్రూప్) రవీందర్ సింగ్ తెలిపారు. త్వరలో స్ట్రీట్ ర్యాలీ 125ఎఫ్ఐ మోడల్ స్కూటర్‌ను కూడా మార్కెట్లోకి తెస్తామని చెప్పారు. 110సీసీ స్కూటర్ మోడళ్లను దశలవారీగా మార్కెట్ నుంచి ఉపసంహరిస్తామని, భవిష్యత్తులో 125 సీసీ మోడళ్లను మాత్రమే విక్రయిస్తామని వివరించారు. ఈ ఏడాది 6.24 లక్షల టూవీలర్లను విక్రయిస్తామన్న అంచనాలున్నాయని సింగ్ చెప్పారు. వచ్చే ఏడాది 6.50 లక్షల టూవీలర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న తమ మార్కెట్ వాటాను 2025కల్లా పది శాతానికి పెంచుకోవడం లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలోనే ఎమ్15, ఆర్ 15 బైక్ మోడళ్లలో బీఎస్–సిక్స్ వేరియంట్లను కూడా కంపెనీ ఆవిష్కరించింది. ప్రస్తుత మందగమనం తాత్కాలికమేని, వాహన విక్రయాలు పుంజుకుంటాయని సింగ్ అభిప్రాయపడ్డారు. -
కొత్త జూపిటర్.. మైలేజీ సూపర్
సాక్షి, న్యూఢిల్లీ: బీఎస్ -6 బైక్స్ మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలతో పాటు, తాజాగా టీవీఎస్ మోటార్ కంపెనీ బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కొత్త జూపిటర్ క్లాసిక్ ఈటీ-ఎఫ్ఐ మోడల్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఆర్టీ-ఎఫ్ఐ (రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్), ఈటీ-ఎఫ్ఐ (ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్) టెక్నాలజీ అనే రెండు వెర్షన్లను డెవలప్ చేసినప్పటికీ, ప్రస్తుతం ఈటీ-ఎఫ్ఐ టెక్నాలజీని పరిచయం చేసింది. ఈ స్కూటర్ ఎక్స్‌షోరూం ధరను రూ. 67,911గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్ 1, 2020 నుంచి అమలులోకి రానున్న బీఎస్-6 ప్రమాణాలను అందుకోవడంలో భాగంగా దీన్ని బుధవారం లాంచ్ చేసింది. బీఎస్-6 కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈటీ-ఎఫ్ఐ టెక్నాలజీ మెరుగైన పనితీరు, అధిక మైలేజీ ఇస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త జూపిటర్ క్లాసిక్ 15 శాతం అధిక మైలేజీని ఇస్తుందని పేర్కొంది. జూపిటర్ క్లాసిక్‌లో 110 సీసీ బీఎస్-6 ఇంజిన్‌తోపాటు ఫ్రంట్ ప్యానెల్లో మొబైల్ కోసం ప్లేస్, యుఎస్బీ ఛార్జర్, టిన్టెడ్ విండ్‌స్ర్కీన్ వంటి ఫీచర్లను జోడించారు. ఇది 7500 ఆర్పీఎం వద్ద 7.9 బీహెచ్పీ శక్తిని, 5500 ఆర్పీఎం వద్ద 8ఎన్ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ‘ఈటీ-ఎఫ్ఐ టెక్నాలజీని భారత వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేశాం. జూపిటర్ క్లాసిక్ ఈటీ-ఎఫ్ఐ అధిక మైలేజీతో పాటు సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంద’ని టీవీఎస్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అనిరుధ్ హల్దార్ తెలిపారు. -
మార్కెట్లోకి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ ‘డాష్’
న్యూఢిల్లీ: ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్.. ఫాస్ట్ చార్జింగ్ ఈ–స్కూటర్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘డాష్’ పేరిట విడుదలైన తాజా ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 4 గంటల్లోనే పూర్తి చార్జింగ్ అవుతుంది. మొత్తం చార్జింగ్‌తో 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని ప్రారంభ ధర రూ.62,000 (ఢిల్లీ–ఎక్స్‌షోరూం)గా కంపెనీ నిర్ణయించింది. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ.. ‘శక్తివంతమైన, పోర్టబుల్ లి–అయాన్ బ్యాటరీని తాజా ఈ–స్కూటర్లో అమర్చాం. పనితీరు, స్టైల్ పరంగా మరింత ఆకట్టుకుంటోంది’ అని వ్యాఖ్యానించారు. ఇక గతవారంలోనే కంపెనీ ఆప్టిమా, ఎన్వైఎక్స్ పేర్లతో రెండు ఈ–స్కూటర్లను కంపెనీ విడుదలచేసింది. వీటి ధరల శ్రేణి రూ.68,721–రూ.69,754 వద్ద నిర్ణయించిన సంగతి తెలిసిందే. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా.. ప్రస్తుతం 615గా ఉన్న టచ్–పాయింట్లను 2020 చివరి నాటికి 1,000కి చేర్చనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఏడాదికి లక్ష యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కంపెనీకి ఉండగా.. వచ్చే మూడేళ్లలో 5 లక్షల యూనిట్లకు పెంచనుంది. -
స్కూటర్ ఇంజిన్‌తో గుంటుక యంత్రం
సాక్షి, చిట్యాల : అందుబాటులోని పాత స్కూటర్ ఇంజిన్, ఇతర విడి భాగాలను సేకరించిన చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ రాచకొండ లింగస్వామి పత్తి చేలలో గుంటుక తీసేందుకు ఉపయోగించే యంత్రాన్ని తయారు చేశాడు. ఈ యంత్రంతో లీటర్ పెట్రోల్‌తో ఎకరం భూమిలో గుంటుక తీసే పనులు చేస్తున్నాడు. దీంతో అతి తక్కువ ఖర్చుతో పెద్దగా శ్రమ లేకుండా పత్తి చేలలో గుంటుకలు తీయడం సులవుతుందని ఆయన పేర్కొంటున్నాడు. ప్రస్తుతానికి తనకి వ్యవసాయం ఉన్నప్పటికీ సాగుబడి చేయడం లేదని ఆయన తెలిపారు. ఆయన తన స్నేహితుడు గాదరి లింగస్వామి కోరిక మేరకు ఈ గుంటుక యంత్రాన్ని తయారు చేసినట్లు ఆయన వివరించారు. -
యూతే టార్గెట్: హీరో రెండు స్కూటర్లు
సాక్షి, ముంబై : ప్రముఖ ద్విచక్ర తయారీదారు హీరో మోటో కార్ప్ మోట్సా కొత్త వాహనాన్ని లాంచ్ చేసింది. మాస్ట్రోఎడ్జ్ అనే స్కూటర్‌తోపాటు, ప్లెజర్ ప్లస్‌ను అప్డేట్ చేసి 2019 వెర్షన్‌ను లాంచ్ చేసింది. ప్రధానంగాయువతే టార్గెట్‌గా మాస్ట్రో 125’, ‘ప్లెజర్ 110’ మోడల్ స్కూటర్లను సోమవారం విడుదల చేసింది. హీరో మోటో కార్ప్స్ నుంచి 125 సీసీ స్కూటర్ సెగ్మెంట్లో వస్తున్న స్కూటర్ హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్. 125 సీసీ ఎనర్జీ బూస్ట్ మేకర్ 6750 ఆర్పీఎం వద్ద 8.7 బీహెచ్పీ, 5000 ఆర్పీఎం వద్ద 10.2 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. హీరో న్యూ ప్లెజర్ ప్లస్ స్కూటర్ ఇది రెండు వేరియంట్లలో లభ్యం. రీ ఫర్బిష్డ్ హెడ్ ల్యాంప్, టెయిల్ లైట్స్, 102 సీసీ మోటార్ కలిగి ఉంటుంది. ఇది 7000 ఆర్పీఎం వద్ద 6.9 బీహెచ్పీ, 5000 ఆర్పీఎం వద్ద 8.1 ఎన్ఎం టార్క్ ఆవిష్కరిస్తుంది. ధరలు : మాస్ట్రో ఎడ్జ్ ధర రూ. 62,700(ఎక్స్‌షో రూం, న్యూఢిల్లీ) మాస్ట్రో ఎడ్జ్ : మే16వ తేదీనుంచి బుకింగ్స్ ప్రారంభం. హీరో ప్లెజర్ ప్లస్ రూ. 49, 300 (ఎక్స్‌షో రూం ,న్యూఢిల్లీ) బుకింగ్స్ జూన్ మొదటి వారంలోప్రారంభం కానున్నాయి. -
హీరోమోటో కొత్త బై బ్యాక్ స్కీం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన వినియోగదారుల కోసం ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది. స్కూటర్ కొనుగోలుదారుల కోసంబైస్యూరెన్స్ పేరుతో ఇప్పటికే పుణే మార్కెట్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ పథకాన్ని కంపెనీ తాజాగా ఢిల్లీ, బెంగళూరు మార్కెట్లలో ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద, కొత్త హీరో స్కూటర్ కొనుగోలు చేసే ప్రతి కస్టమర్‌కు ఒక గ్యారంటీడ్ బై బ్యాక్ సర్టిఫికెట్ ఇస్తుంది. టూవీలర్ బ్రాండ్ క్రెడర్ ద్వారా ఈ సర్టిఫికెట్‌ను అందిస్తుంది. రాబోయే ఐదేళ్లలో ఆరునెలల్లో వ్యవధిలో ఈ బై బ్యాక్‌ను ఆఫర్ చేస్తుంది. భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఇదే మొదటి సారని హీరో మోటో కార్ప్ హెడ్ (అమ్మకాలు మరియు సేల్స్ తర్వాత) సంజయ్ భన్ చెప్పారు. దీని ద్వారా హీరో మోటో కార్ప్ వినియోగదారులకు రీ సేల్‌పై భరోసా లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ప్రణాళిక పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్న ఈ పథకాన్ని త్వరలోనే దేశంలో టాప్ 10 మార్కెట్లలో కూడా కలిస్తామన్నారు. -
మార్కెట్లోకి ‘ట్రెండ్ ఈ’ ఎలక్ట్రిక్ స్కూటర్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అవన్ మోటార్స్.. ‘ట్రెండ్ ఈ’ పేరుతో నూతన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను శుక్రవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. సింగిల్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ.56,900 కాగా, డబుల్ బ్యాటరీ స్కూటర్ ధర రూ.81,269. రెండు నుంచి నాలుగు గంటల్లో పూర్తిగా చార్జయ్యే విధమైన లిథియం–అయాన్ బ్యాటరీని ఈ స్కూటర్లలో అమర్చినట్లు తెలిపింది. సింగిల్ బ్యాటరీ స్కూటర్ గంటకు 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, డబుల్ బ్యాటరీ స్కూటర్ 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదని సంస్థ ప్రకటించింది. రూ.1,100 చెల్లించి స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ పంకజ్ తివారీ మాట్లాడుతూ.. ‘ప్రీ–బుకింగ్స్ సమయంలో ఈ స్కూటర్స్‌కు విశేష స్పందన మాకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ స్కూటర్ ఫీచర్లు కస్టమర్లకు బాగా నచ్చుతాయని భావిస్తున్నాం’ అని అన్నారు. -
బస్సు ఢీకొని మహిళ మృతి
పశ్చిమగోదావరి, పాలకొల్లు అర్బన్: బ్యాంక్ పని ముగించుకుని స్కూటర్‌పై ఇంటిముఖం పట్టిన భార్యాభర్తలను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో భార్య అక్కడికక్కడే మృతిచెందగా భర్తకు తీవ్రగాయాలైన ఘటన పూలపల్లిలో గురువారం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్ రైటర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, పాలకొల్లు మండలం వెలివెల గ్రామానికి చెందిన కొప్పినీడి పద్మ ఆంజనేయులు, అతడి భార్య సరోజిని (43) బ్యాంక్ పనిమీద స్కూటర్‌పై పాలకొల్లు వచ్చారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా పూలపల్లి వద్ద భీమవరం నుంచి పాలకొల్లు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో సరోజిని అక్కడికక్కడే మృతి చెందగా ఆంజనేయులు వెన్నెముక జారిపోవడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె సాయిరత్నం గ్రామంలో డ్వాక్రా యానిమేటర్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమార్తె వెంకట దుర్గ డిగ్రీ పాసై ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. స్టేషన్ రైటర్ నాగేశ్వరరావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
జలప్రస్థానం
ఒంటరిగా నేను. ఒకప్పుడు ఇక్కడ గుంపులుగా జనం. చుట్టూ జల అగాథం. కాలం వేగంగా పరుగులు తీసింది. నా ముందు జలనిధి ఉంది. అయినా కనిపించదు. మనిషి ముందు పుట్టాడా! జలం ముందా! మనిషి ప్రస్థానం జలప్రస్థానం సమాంతరంగా సాగాయా! ప్రకృతిలోని ప్రతి జీవికి జలం అవసరం. చివరికి నిర్జీవమనుకుంటున్న రాతిలోనూ చెమ్మ ఉంది. రాళ్ళ మధ్య మొక్కలు రెండు ఆకులు తొడుగుతాయి. ఇదే జలం ప్రాణాల్నే కాదు అడ్డువచ్చిన ప్రతీదాన్నీ కూల్చేస్తుంది. జలానిది ముందుకే కాదు ప్రయాణం వెనక్కి కూడా. శతాబ్దాల సహస్ర సహస్ర శతాబ్దాల వెనక్కి ...అవును. జలం మనకు గత చరిత్రను చెపుతుంది. కొన్ని శతాబ్దాల జలం నిశ్చలంగా ఉంటుంది. అది కొన్నిచోట్ల ఆవిరి కావచ్చు...ఇంకొన్ని చోట్ల అస్తిత్వం నిలబెట్టుకుంటుంది. ఎప్పటికయినా జలరహస్యం విడిపోతుందా! అందుకు అడ్డంగా ఉన్నవాటిని దారితప్పిస్తుందా! నా ఆలోచనలను తెంపుతూ అప్పుడు ఫోన్ మోగింది. కొత్త నెంబర్. ‘‘హలో’’ అన్నాను.‘‘వికాస్ గారా?’’ ‘‘అవును మీరు?’’ ‘‘నేను మహేష్‌ని ... మహీని ... గుర్తున్నానా!మనం చిన్ననాటి స్నేహితులం.’’ ‘‘గుర్తున్నావు మిత్రమా ... ఎక్కడినించి?’’ ‘‘ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నాను. నిన్ను కలవటానికి మీ ఊరు వస్తున్నాను. నీ ఫోన్ నెంబర్ సంపాదించటానికి చాలా కష్టపడ్డాను. మిగతా విషయాలు మనం కలుసుకున్నాక.’’ ‘‘నీకోసం ఎదురుచూస్తుంటాను’’ ఫోన్ కట్ అయింది. ‘‘మహీ చిన్ననాటి స్నేహితుడు. మేము ఆరో తరగతిలో విడిపోయాం. అయినా వాడికి నేను, నేను వాడికి గుర్తున్నాం. వాడేం చేస్తున్నాడో తెలియదు. ఇంకొన్ని గంటల్లో అన్ని రహస్యాలూ విడిపోతాయి కదా! దుమ్ము రేపుకుంటూ బస్సు వచ్చి ఆగింది. చేతిలో పెట్టెతో దిగుతున్న స్నేహితుడికి ఎదురెళ్లి, పెట్టె అందుకుని నవ్వుతూ కౌగిలించుకుని స్కూటర్ వైపుకి నడిచాం. ఇద్దరికీ చాలా ఆనందంగా ఉంది. ఇద్దరికీ మదినిండా బోలెడు కుశలప్రశ్నలు, ఇంకా బోలెడు కబుర్లు. భూషయ్యకి పెట్టె అందించి, వాణ్ణి చెయ్యి పట్టుకుని, మండువా లోకి తీసుకెళ్ళేటప్పటికి అమ్మ ఎదురొచ్చింది. ‘‘నమస్తే అమ్మా, నా పేరు మహీ’’. ‘‘అయ్యో, నీ గురించి ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు. నిన్ను చూడ్డం ఇదే అయినా మాకందరికీ నువ్వు బాగా తెలుసునయ్యా. అబ్బాయ్ వికాస్, బాబుకి ఏం కావాలో చూడు. స్నానం చేస్తాడేమో’’. ‘‘అలాగే అమ్మా, పది నిముషాల్లో సిద్ధం అవుతాం. భోజనానికి వచ్చేస్తాం’’ అన్నాను అమ్మతో.మాఘమాసం చివరికొచ్చింది. పగలు ఎండ చుర్రుమంటోంది. రాత్రుళ్ళు మాత్రం చలి, పొగమంచూనూ. భోజనాలు అయ్యాక ఇద్దరం గదిలో పడుకున్నాం. మా కాలేజీ సంగతులు, మిగతా స్నేహితులు, సినిమాలు, షికార్లు అలా ప్రవాహం లా సాగిపోతూనే ఉన్నాయ్ మా కబుర్లు. ఇంక ఎంతసేపటికీ మా కబుర్లు అయ్యేటట్టు లేవు. ‘‘ఒరేయ్, కొద్దిసేపు కునుకు తియ్యరా. కొంచెం ఎండ తగ్గాక ఊరి మీదకు వెళ్దాం. ఇక్కడ ఒక విశేషం, నీకు బాగా నచ్చే చోటు చూపిస్తాను సాయంత్రం’’ అన్నాను.పాలకోవా, కజ్జికాయలు, జంతికలు పెట్టింది అమ్మ. ‘‘చాలా బావున్నాయిరా’’ అంటూ ఇష్టంగా తిన్నాడు. ‘‘అబ్బ, ఎంత రుచిగా ఉన్నాయిరా. పొట్ట ఖాళీ లేకపోయినా ఆపలేకపోతున్నానురా బాబూ! ఆ జంతికలేంట్రా అంత కమ్మగా అమృతంలా ఉన్నాయి!’’ ‘‘అన్నీ అమ్మే స్వయంగా చేస్తుందిరా. అమ్మ చేతి రుచులంటే మా బంధువులందరికీ ఎంత ఇష్టమో తెలుసా’’ అన్నాను కాస్త గర్వంగానే.బయటకొచ్చి స్కూటర్ తియ్యబోతూ అడిగాను, ‘‘ఒరేయ్ మహీ! నిన్నో విచిత్రమైన చోటికి తీసుకెళ్లుతున్నాను. మరి వెళ్దామా! స్కూటర్ పై చుట్టూ తిరిగి వెళితే మూడు కిలోమీటర్లు ఉండొచ్చు. కానీ నీకు ఫరవాలేదంటే పొలాల్లోంచి అడ్డదారిన నడిచివెళితే ఒక కిలోమీటరు ఉండొచ్చు. నీ ఇష్టం మరి. ఎలా వెళ్దాం?’’ అన్నాడు. వాడు ఏమాత్రం ఆలోచించకుండా, ‘‘పొలాల్లోంచి వెళదాం’’ అన్నాడు. స్కూటర్ వదిలేసి బయలుదేరాం. మా కంకరరోడ్డు వదిలి పొలం గట్లపై నడక సాగించాం. వరి కోతలయిపోయి నెల దాటింది. ఖాళీ చెలకల్లో కొన్ని పెసర, కొన్నింట జనుము వేసినవి పెరిగి పచ్చగా పరుచుకుని ఉన్నాయి. ఆ తరువాత మామిడితోటల్లోంచి వెళుతుంటే మావాడు చుట్టూ చూసుకుంటూ మైమరిచిపోతున్నాడు. ‘‘ఎన్నాళ్ళయ్యిందిరా ఇలా పచ్చని పొలాల్లో తిరిగి. నేను ఢిల్లీలో ఆర్కిలాజికల్ డిపార్టుమెంట్లో చేరినాక ఈ మూడేళ్ళలో ఇదే ఇంత ప్రశాంతమయిన చోటులో తిరగడం. అందునా నా ప్రియమిత్రుడితో, మీ అమ్మగారి ప్రేమాదరాలతో, నాకు చాలా సంతోషంగా ఉందిరా వికాస్! వీలు చేసుకుని రెండేళ్ళకోసారయినా మీ ఊరికి రావాలనుందిరా!’’ ‘‘రెండేళ్ళకేం ఖర్మ, ప్రతి ఏడూ రారా. సెలవు దొరకబుచ్చుకుని సంక్రాంతికి రా.ఇంకా ఎంత సందడిగా ఉంటుందో తెలుసా ఇక్కడ?’’ అన్నాను. ‘‘అది సరే ఈ ఊర్లో ఏదో విచిత్రమైన చోటు అన్నావు, ఏమిటిరా విశేషం?’’ ‘‘నువ్వు పెద్దగా ఊహించుకోకు. అదొక చరిత్రకీ, విశ్వాసానికీ సంబంధించిన ‘జీవజల’ తో కూడిన కొలను గురించి. నాలుగుతరాల కంటే ముందునుండీ దీనిపై చాలా ఆసక్తికరమయిన విషయాలను ఊరంతా చెప్పుకుంటారు. నాకు తెలిసి ప్రభుత్వ శాఖలు, పురావస్తు శాఖ తవ్వకాలు చెయ్యాలని ప్రయత్నించినప్పుడల్లా ఊరంతా ఒక్కటై అది జరగనివ్వలేదు. ఆ ‘జీవజల’ కు సంబంధించిన ఆ పెద్ద బావి లాంటి పాడుపడిన కొలనులోకి ఎవరూ దిగే ప్రయత్నం చెయ్యరు.చెయ్యనివ్వరు. ఆ కొలను విషయంలో ఊరందరిదీ ఒకే మాట, కట్టుబాటు. అందులోకి ఎవరు దిగే ప్రయత్నం చేసినా ఊరికి కీడు జరుగుతుందని పండితులూ, పామరులూ అందరూ విశ్వసిస్తారు.దాని లోతుగానీ, అందులో ఉన్న జలచరాల గురించి కానీ ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. ఇంకో మూడు నెలల తరువాత వైశాఖ పూర్ణిమకు ఇక్కడ ఒకరోజు కార్యక్రమం మా ఊరికి చాలా ముఖ్యమయిన ఘట్టం’’.‘‘చాలా ఆసక్తికరంగా ఉందిరా వికాస్! నాకు పరిశోధనకు మంచి ముడిసరుకు దొరికినట్టే అయితే ...’’ అనగానే, నేను కంగారుగా, ‘‘ఆ ఆలోచనా, ప్రయత్నమూ మాత్రం పెట్టుకోకురా నాయనా! మా ఊరునుంచి నన్ను తరిమేస్తారు అంతా ... ఏకగ్రీవంగా’’ అన్నాను. ‘‘సరే, దాని చరిత్ర అంతా చెప్పు’’ అని అడిగాడు మా మహీ చాలా ఉత్సుకతతో.‘‘అదిగో ... ఆ ఎత్తుగా కనబడుతున్న గట్టు దిగితే ఆ పక్క నీకు ఆ కోనేరు కనిపిస్తుంది’’ అన్నాను, పిల్లకాలువ పైన వేసిన తాటిపట్టెల పైనుంచి వాణ్ణి మెల్లగా చెయ్యిపట్టి దాటిస్తూ ... కట్ట దాటి కొంచెం కిందకు దిగి పెద్ద చెట్లతోనూ, ముళ్ళకంపల పొదలతోనూ, అడవిపూల తీగెలతోనూ దట్టంగా ఉన్న చిట్టడవి లాంటి ప్రదేశాన్ని చుట్టూతిరిగి దాటుతుండగా చెప్పాను, ‘‘ఇదేరా! ఆ కొలను’’ అని.‘‘కొలను ఎక్కడరా, నీళ్ళు ఏవీ?’’ అడుగుతున్నాడు గుబురుపొదల్లోంచి ఏవన్నా కనబడుతుందేమోనని, గట్టు చివరన వంగిచూస్తూ ... ‘‘ఇంకా ఆ వైపుకి వెళ్దాం రా. తూర్పువైపున ఇప్పుడు సాయంత్రపు ఏటవాలు, నీరెండలో కొంచెం కనబడొచ్చు’’ అని అటువైపు దారితీసాం. దారి కూడా లేకుండా అంతా పిచ్చిమొక్కలతో నిండిపోయి ఉంది.కొలనుకు తూర్పుగట్టు వైపుకు చేరుకున్నాక, అక్కడ ఒక నాలుగు రాతిస్థంభాల మీద ఏ చెక్కుడూ లేని రాళ్ళతోనే పైకప్పు కూడా పరిచిన మండపం లాంటి కట్టడం ఉంది. అందులో కూడా మొక్కలు మొలిచి, ఎండుటాకులు కుప్పలుగా చేరి దుమ్మూ, ధూళితో చాలాకాలం మానవ సంచారం లేని పాతరాతియుగపు శిథిలకట్టడం లా నిలబడిఉంది. ఆ మండపానికి ముందు ఓ ఇరవై అడుగుల దూరంలో పెద్ద రాతిపలకతో కొలనుపైకి పేర్చినట్టు పరిచిఉంది. నేను చుట్టూ తలతిప్పి చూసి, ఏ మానవ సంచారం లేదని నిర్ధారణ చేసుకుని మావాణ్ణి చెయ్యిపట్టుకుని ఆ రాయిపైకి తీసుకెళ్ళాను. వాడు ఆ మండపాన్ని,ఇంకా అక్కడ కనిపించే రాయిని పరిశీలనగా చూస్తున్నాడు. ‘‘అదిగో... ఆ కొమ్మల మధ్యనుంచి చూడు, నీళ్ళు కనబడతాయి’’ అన్నాను కొంచెం బెరుకుగా. ఆ వైపునే ఆ చెట్ల కొమ్మలపై పడిన నీరెండ కిరణాలు ముదురాకుపచ్చ ఆకుల గుబురులోంచి కొలనులోకి పడుతున్నాయి.‘‘నీళ్ళెక్కడ, రాతిబండలే కనిపిస్తున్నాయి’’ అన్నాడు మహీ కళ్ళు చిట్లించి, దీర్ఘంగా పరిశీలించి చూస్తూ. ‘‘ఒక్క నిముషం’’ అని నేను చుట్టూ చూసుకుంటూ జడుస్తూనే ఒక గులకరాయి వేశాను ఆ గుబుర్ల మధ్యలో ఖాళీలోంచి.‘‘బుడుంగు’’మని నీళ్ళ శబ్దం వినిపించింది. ‘‘చూడు చూడు’’ అని మావాణ్ణి కంగారుగా కిందికి తలపట్టుకు వంచాను. రాయి విసిరిన ఫలితంగా ఏర్పడిన అలలు లేతకిరణాల కాంతికి బంగారు రంగులు మెరుస్తూ లీలగా కనిపించాయి. మహి ఆశ్చర్యపోయి చూస్తున్నాడు.‘‘ఇంత స్వచ్ఛమయిన నీరా! నువ్వు కదిలించకపోతే, అవి నీళ్ళు అనే తెలియడం లేదు. ఎక్కడో కింద ఉన్న బండరాళ్ళు అంత స్వచ్ఛంగా, తేటగా కనిపిస్తున్నాయి. ఇన్ని చెట్ల ఆకులు రాలుతూ, పొదల మధ్యన వాడకంలో లేని కొలనులో నీరు ఇంత స్వచ్ఛంగా ఉండడం నిజంగా నమ్మశక్యం కావడం లేదురా వికాస్’’. అప్పటికే సూర్యుడు నారింజ రంగుకు మారుతున్నాడు. ‘‘మహీ! చీకటి పడితే మనం వచ్చిన తోటదారి వెంట వెళ్ళడం కష్టం. రోడ్డు మీదుగా పోవాలంటే దగ్గరలో ఓ గంట పడ్తుంది. పోతూ పోతూ నీకు ఈ కొలను గురించిన విశేషం చెబుతాను. బయల్దేరు’’ అని వాణ్ణి బలవంతంగా బయలుదేరదీశాను.‘‘మా నాన్నకు ముత్తాతగారి చిన్నతనంలో ఇది జరిగింది. బ్రిటిష్‌వారి పాలనలో ఉన్ననాటి సంగతి. ఇప్పటికి నూరు సంవత్సరాల కంటే కిందటి మాట. ఈ కొలను చిన్న తేటనీటి గుంటగా ఉండేది. అప్పట్లో మా ఊరికి మంచినీటి అవసరాలకు మొత్తం ఇదే వాడుకునేవారు. కొలనులో దిగటానికి ఏర్పాటు చేసుకున్న దిగుడు మెట్లేమీ లేవు. సహజంగానే ఏర్పడిన రాళ్ళ వరసలు చిన్నపిల్లలు కూడా దిగడానికి అనువుగా ఉండేవి. బిందెలతో, కుండలతో ఒకరి తరువాత ఒకరుగా నీళ్ళు తెచ్చుకునేవారు. ఎప్పుడూ నీరు అంతే తేటగా, అంతే లోతులో ఉండేవి. వర్షాకాలంలో అయినా నీటిమట్టం పెరిగేది కాదు. ఎంత వేసవిలోనైనా, చివరికి మాకు దగ్గరలో ఉన్న గోదావరి బాగా తరిగిపోయినప్పుడు కూడా ఈ కొలనులో మాత్రం అంతే నీరు ఉండేది. అదొక అద్భుతమయిన ‘జీవజల’ గా మా ఊరి అవసరాల కోసం పుట్టిన పాతాళగంగగా అందరూ ఎంతో పవిత్రంగా పూజించుకునేవారు. ఆ నీటిని బిందెల్లో నింపుకునే దగ్గరగానే నీటిలో నుండే ఒక నిలువెత్తు రాయి నిటారుగా ఉండేది. నీళ్ళు నింపుకున్న ప్రతివాళ్ళూ వంగి బాగా సాగి ఆ రాయిని చేతితో తాకి కళ్ళ కద్దుకుని అప్పుడు నీళ్ళబిందెతో పైకి వచ్చేవాళ్ళు. ఊరి వాళ్ళందరూ ఈ కొలను దగ్గర మాత్రం ఎంతో ప్రశాంతంగా, పవిత్రంగా ప్రవర్తించేవారు. అప్పటికి పదేళ్ళపైగా దక్షిణభారతంలో పనిచేస్తున్న బ్రిటిష్ అధికారి హైడెన్ గత మూడేళ్ళుగా ఆంధ్రరాష్ట్రంలో పదోన్నతి పొంది రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నాడు. ఒకసారి పన్ను వసూళ్ళ నిమిత్తం మా ఊరిమీదుగా పోతూ, మధ్యాహ్న భోజనానికి ఆగాడు. ఉన్నవాటిలో పెద్దదయిన మునసబు ఇంటివద్ద బస ఏర్పాటుచేశారు. ముందుగానే చేరుకున్న రెవెన్యూ సిబ్బంది. హైడెన్ వంటమనిషి పట్నం నుండి వచ్చి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఉన్నారు. మొత్తం పటాలానికి, మందీమార్బలానికి సరిపడా మాంసాహారం కోసం మేకలూ, కోళ్ళూ బంట్రోతుల ద్వారా సేకరించి, అన్ని ఏర్పాట్లూ ఎంతో శ్రద్ధగా నిర్వహించిన కరణాన్ని దొరవారు చాలా మెచ్చుకున్నారు. మునసబు గారి పట్ల కృతజ్ఞత తెలియజేశారు. భోజనానంతరం విశ్రమించడానికి మాత్రం కొంచెం ఇబ్బందిపడ్డారు. వేడి, ఉక్కబోతకు చాలా నొచ్చుకోసాగారు హైడెన్ దొరవారు. గమనించిన కరణం ఊరి బయట ఉన్న కొలను దగ్గర చల్లగా ఉంటుందని చెప్పి ఒప్పించి వారిని గుర్రాల మీద బయలుదేరించి, వెనుక పరిమిత పరివారం, మునసబు, కరణం వగైరాలు బయలుదేరారు. కొలను గట్టున పెద్ద రావిచెట్టు నీడన అప్పటికే పరచిఉంచిన పడకపై విశ్రమించిన హైడెన్ దొర గాఢనిద్రలోకి వెళ్ళిపోయాడు. సుమారు రెండు గంటల తరువాత మెలకువ వచ్చిన దొరగారు ఆ సౌకర్యానికి, నిద్ర సౌఖ్యానికి ఉబ్బితబ్బిబ్బైపోయారు. కరణం దొరవారిని సంతోషపెట్టిన సంబరంలో ఆ కొలనులో నీళ్ళు చాలా బావుంటాయనీ, తాగి చూడవలసిందనీ అభ్యర్థించాడు. ఆరోగ్యసూత్రాలు పక్కనబెట్టి, కడవతో తెస్తామంటే వద్దని, వెనక ఇద్దరు సహాయంగా నడవగా తనే స్వయంగా కిందికి దిగాడు. ఎడమచేత్తో కొంచెం నీటిని తీసుకుని నోట్లో పోసుకున్నాడు. పుక్కిలించి, పక్కకు ఊసి, దోశెడు నీళ్ళు తీసుకుని, మరోసారి నోట్లో పోసుకుని ఒక క్షణం పుక్కిటబట్టి మళ్ళీ ఊసేశాడు. అయితే ఈసారి అవి ఆ నిలువెత్తు శిలపైన పడ్డాయి. గట్టుపైనుండి చూస్తున్న అందరూ నిర్ఘాంతబోయి ‘అపచారం అపచారం’ అంటూ గొణుక్కున్నారు. మునసబుగారు కొంచెం ధైర్యంచేసి, ‘‘దొరగారూ! ఒక్కసారి ఆ శిలకు మొక్కి లెంపలేసుకోండి. అది మాకు చాలా విశ్వాసపాత్రమయిన శక్తిరూపం. చెప్పండయ్యా మీరు’’ అన్నాడు కరణాన్నీ, దొర వెంబడి వచ్చిన దుబాసీనీ ఉద్దేశించి. వాళ్ళు చెప్పబోతుంటే హైడెన్ దొర చెయ్యి ఊపి అవసరం లేదు, అర్థం అయ్యింది అన్నట్టు సైగ చేశాడు. అందరూ నిశ్శబ్దం అయిపోయారు. జనం అంతా బిక్కచచ్చిపోయారు.మునసబు తలవంచుకుని దొర పైకిరాకముందే ఇంటిదారి పట్టి వెళ్ళిపోయాడు.ఇది జరిగిన నెల రోజులకే కరణాన్ని కబురుపెట్టి పట్టణంలో తన ఆఫీసులో మంతనాలు చేసి తన నిర్ణయం చెప్పి ఊరిలో అందరికీ, ముఖ్యంగా మునసబుకి తెలియచెయ్యమని, తను పదిరోజుల్లో వస్తాననీ చెప్పి పంపించాడు. కరణం మునసబుకు మాత్రమే విషయం చెప్పి, జనానికి ఆయన్నే చెప్పమన్నారని దొరగారి ఉత్తర్వు అన్నట్టుగా చెప్పాడు. మునసబు హతాశుడైపోయి, మార్గం తోచక, వైద్యానికి తన మామగారి ఊరెళుతున్నట్టు, రెండు నెలలు ఊరికి రాలేనని చెప్పి, గ్రామనౌకరుతో హైడెన్ దొరగారికి కబురెట్టి, కుటుంబంతో సహా ఊరినుంచి పలాయనం చిత్తగించాడు.పట్నం నుండి వచ్చిన రెవెన్యూ సిబ్బంది కరణంతో కలిసి ఊరి జనానికి దొరగారి ప్రణాళిక వివరించే ప్రయత్నం చేశారు. ‘‘ఆ కొలనుని పెద్దదిగా చేసి చుట్టూ ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని దొరగారి ఉత్తర్వు’’ అని చెప్పారు. ‘‘కాదు దొరలకోసం ఇక్కడ బంగ్లా కట్టుకుంటారు’’ అని జనంలోంచి కొందరు గట్టిగానే అన్నారు. కొలనును మరింత లోతు చెయ్యడానికి ఉప్పరివాళ్ళను పనికి దిగమన్నారు అధికారులు. కరణం పేరు పేరునా పిలుస్తూ వివరాలు వ్రాసుకుంటూ కొలనులోకి దిగమని పురమాయిస్తున్నాడు. అయిష్టంగానే ఒక్కొక్కరూ దిగినాక పైనుండి ‘‘ఆ రాళ్ళను ఒక్కొక్కటీ పగలగొట్టండి. ముక్కల్ని గంపలకెత్తండి’’ అని చెప్పగానే పలుగులతో, పారలతో దిగినవాళ్ళంతా ‘‘ఇయ్యి రాళ్ళు కాదు పెబూ, మా ఊరిని కాపాడే ఇలవేలుపులు బాబు ఇయ్యి. వాటిని ఏం సెయ్యకూడదు దొరలారా. ఆటికి మొక్కటవే కానీ మేం ముట్టను కూడా ముట్టం బాబులూ. వొదిలెయ్యండి’’ అనుకుంటూ అందరూ పైకివచ్చి మిగతా ఊరిజనంతో కలిసి, కరణం ఎంత అరుస్తున్నా వినకుండా విసుక్కుంటూ వెళ్ళిపోయారు.నాలుగురోజుల్లో మందీమార్బలంతో హైడెన్ దొరవారే కదిలివచ్చి కొలను దగ్గరే డేరాలు వేసి, క్యాంపు వేశారు. ఊరిలోని పెద్దలు వచ్చి దొర దగ్గర మొర పెట్టుకున్నారు. ఈ పవిత్ర ‘జీవజల’ ను అలాగే కాపాడుకోవాలనీ, అక్కడ శక్తి స్వరూపాలైన ఆ సహజ శిలలు తాము కొలుచుకునే దైవాలనీ, దయచేసి కొలనును ఏమాత్రం కలకలం చేయొద్దనీ బ్రతిమిలాడారు. హైడెన్ దొర ఆగ్రహోదగ్రుడైపోయాడు. ‘‘అందరూ వినండి. ఇది బ్రిటిష్ ప్రభుత్వ ఉత్తర్వు. ఇక్కడ రహదారి బంగళా నిర్మిస్తారు. ఈ చుట్టుప్రక్కల ఉన్న పధ్నాలుగు గ్రామాలకూ ఇది ముఖ్య రెవెన్యూ తహశీల్ గా చేస్తాం. గ్రామాన్ని వృద్ధి చేస్తాం. ఈ కొలనును విశాలం చేసి సుందరంగా తీర్చిదిద్దుతాం. అక్కడి శిలల్ని తొలగించకపోతే నీటి ఊట పూర్తిస్థాయిలో పైకిరాదు. అందుకే ముందు ఈ పని మొదలుపెట్టాం. అప్పుడు మొత్తం కొలను పైదాకా నిండేంత నీరు వస్తుంది. ఎవరికి అభ్యంతరాలున్నా ఈ పని ఆగదు. అందరూ సహకరించండి. ప్రభువులను ప్రసన్నం చేసుకోండి. ఇది ఆర్డరు’’ అని ముగించాడు. ‘‘ఊరికే కాదు, ప్రభువులకు కూడా అరిష్టం అనీ, ఈ పవిత్రమైన కొలనును ఏమీ చెయ్యవద్దనీ మళ్ళీ చెప్ప ప్రయత్నించారు ఊరిపెద్దలు. హైడెన్ దుబాసీ వంక తిరిగి ‘వ్వాట్ పవిత్రత’ అని అడిగాడు. ‘సేక్రెడ్నెస్’ అని జవాబు. హైడెన్ తనలో తాను గొణుక్కుంటున్నట్టుగా ‘‘వ్వాట్ బ్లడీ సేక్రెడ్నెస్ ఇన్ దీజ్ స్టోన్స్’’ అన్నాడు.కరణం ఊరివాళ్ళకు నచ్చజెప్పి పంపించివేసి, దొర దగ్గర చేరి, ‘‘అయ్యా, ప్రభువులు తలచుకుంటే అసంభవం ఏముంటుంది? ఊరివాళ్ళకి నేను చెప్పుకుంటాను. కానీ ఒక్క శిస్తులు వసూలు మాత్రమే చేసేనన్ను వారెవ్వరూ ఖాతరు చెయ్యరు. అదీ చిక్కు’’ అన్నాడు నర్మగర్భంగా.హైడెన్ తల పంకించాడు.ఒకసారి చెయ్యి గడ్డం కింద ఆనించి కళ్ళు మూసుకున్నాడు. ఒక నిమిషం తరువాత, ‘‘మీకు మునసబు అధికారాలను కూడా కట్టబెడుతున్నాం. దోషులను నిర్ణయించి ప్రభువులదగ్గర హాజరు పరిచే అధికారం మీకుంటుంది. అంతేకాదు, ఇక్కడ రహదారి బంగళా నిర్మించి ఎదురుగా ఈ కొలనుని ఈతకొలను గా మార్చి సిద్ధం చేసాక, ఈ ఫిర్కాకి మిమ్మల్ని ముఖ్య అధికారిగా చేసే బాధ్యత నాది. రేపే కొలనులో రాళ్ళు తీసే పని ప్రారంభం కావాలి. సరేనా!’’ అని కరణాన్ని కరుణ, కాఠిన్యం కలిపిన చూపుతో కట్టడి చేసాడు. కరణం వంగి వంగి, ‘‘చిత్తం, చిత్తం ప్రభువుల మనసెరిగి మసలుకోగలను. అన్ని విషయాలు సానుకూలం చేసుకునే బాధ్యత నాది. ఆపై మీ దయ’’ అంటూ నిష్క్రమించాడు.ఊరంతా అట్టుడికిపోతోంది. ఎవరికివారే గుబులు పడుతున్నారు కాని పైకి చెప్పుకోలేకపోతున్నారు. రాత్రి కరణం చేసిన హెచ్చరికలు, ప్రభువుల శక్తి సామర్థ్యాలను వివరిస్తూ, వారికి ఆగ్రహం వస్తే ఊరికి సంభవించబోయే గండం గుర్తుకుతెచ్చుకొని వణికిపోతున్నారు. అంతకుమించి కొలనులో, తాము పవిత్రంగా చూసుకునే శిలారూపాలకు ఏమైనా అపచారం జరుగుతుందేమోనన్న భయాందోళనలు వారిని ఎక్కువ కలవరపెడుతున్నాయి. హైడెన్ మాత్రం రెట్టించిన పట్టుదలతో పొద్దుపొడిచి పొడవకముందే కొలను పక్కన కుర్చీ వేయించుకుని ఉప్పరివాళ్ళ పనిని స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. వాతావరణం గంభీరంగా ఉంది. కరణంతో బాటు వచ్చిన కొద్దిమంది ఏమి జరుగుతుందోనని, ఏమీ జరక్కూడదనీ మనసులోనే మొక్కుకుంటూ శిలల్లా కొలను చుట్టూచేరి ఉన్నారు. ఇష్టం లేకపోయినా ఆతృతకొద్దీ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ మిగతా గ్రామస్థులు ఒకరి వెంబడి ఒకరు వచ్చి కొలను చుట్టూ చేరుతున్నారు. పట్నం నుంచి వచ్చిన దొరవారి పటాలం కాకుండా కరణం, అతని తైనాతీలు మాత్రమే హైడెన్ కి దగ్గరలో నించున్నారు. కొలను లోపల ఏడెనిమిది మంది ఉప్పరివాళ్ళు నీటిలో సగం మునిగిన శిలల దగ్గర ఉన్నారు. లోనికి దిగే రాళ్ళపై సగంలో ఇద్దరు ప్రభుత్వోద్యోగులు ఇంజనీరింగ్ శాఖకు సంబంధించినవారు అసహనంగా నిలబడి ఉన్నారు.నలుగురు పెద్ద కడవలతో నీళ్ళు వంతులువారీగా పైకి మోస్తున్నారు. ఠక్కుఠక్కున పైపైన తగిలే గునపం దెబ్బలకు శిలలు ఏమాత్రం చలించడంలేదు. హైడెన్ కి మాత్రం చలనం వచ్చింది అసహనంతో.వాళ్ళెవరూ మనస్ఫూర్తిగా ఆ పని చెయ్యడంలేదని అర్థం అయిన హైడెన్ కి మొహం ఎర్రబడుతోంది. అప్పుడప్పుడే పెరుగుతున్న ఉదయపు సూర్యుని తీక్షణత హైడెన్ కళ్ళల్లో ప్రతిబింబిస్తోంది. కరణం పసిగట్టి ‘‘గునపం పోటు గట్టిగా వెయ్యండిరా, వొంట్లో చేవలేనట్టు ఏంటిరా ఆ మెతక పని? అలా మెత్తగా తాకిస్తే రాళ్ళు పగులుతాయిరా?’’ అని అరుస్తున్నాడు మధ్యమధ్యలో దొరగార్ని పరిశీలిస్తూ, ‘‘అయ్యి ఉత్త రాల్లేటండె పగిలిపోతాకి?’’ అన్నాడొక మనిషి గునపానికి గెడ్డం ఆనించి అనాసక్తంగా. ఇక ఉండబట్టలేకపోయాడు హైడెన్. దిగ్గున కుర్చీలోంచి లేచాడు. దెబ్బతిన్న క్రూరజంతువు లాగ ఒక్కబిగిన నాలుగంగలుగా కొలనులోకి దిగేశాడు. ఒకని చేతిలోని గునపాన్ని లాక్కుని ఆ మహాశిలపై, ఎంతో కాలంగా ఊరికంతటికీ శక్తిస్వరూపంగా నిలిచిన ఆ మహిమాన్వితమయిన శిలపై, అక్కడి యావన్మంది విశ్వాసానికి, నమ్మకానికి ప్రతిరూపమయిన ఆ శిలపై, అందరి మొక్కులూ అందుకుంటున్న ప్రకృతి చెక్కిన ఆ మూర్తిపై అహంకారంతో, అధికారమదంతో హైడెన్ దెబ్బ వెయ్యబోయాడు. ఆ వెర్రి ఆవేశంలో అతని కాలు పట్టుతప్పింది. నీరు తోడిన బురదగుంట లోకి అతని బూటుకాలు దిగబడిపోయింది. చేతిలోని గునపాన్ని పక్కకు విసిరేంతలో ఆ బరువే అతని రెండో కాలునూ పట్టుతప్పించి వెనక్కిపడేట్టు చేసింది. అందరూ అయ్యో, అయ్యో పట్టుకోండి లాంటి అరుపులు వినిపిస్తుండగా, ఎవరూ ఊహించని ఒక మహాద్భుతం జరిగింది. నిలువెత్తు ఆ మూర్తి, ఎప్పుడూ ఊరిని చల్లగా చూసే ఆ గంభీర రూపం గర్జించకుండానే దుర్గాదేవి వాహనం పులిలాగా, అప్పటికే బురదలోకి దిగిపోయిన హైడెన్ దొరపై విరుచుకుపడిపోయింది. అదే సమయలో ఆ మహామూర్తి ఇంతకాలం ధీమాగా నిల్చున్న పీఠం దగ్గర నుండి ఒక్కసారిగా పెల్లుబుకి వెల్లువలా వచ్చింది ప్రళయరూపంలో జల. ఆకాశంలోకి ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిరిపడ్డాయి ఆ జీవజలాలు. ఊరందరి పైనా అవి వర్షించాయి. కొలనులో ఉన్నవారంతా హాహాకారాలతో పైకి వచ్చేశారు. ఇంకా ప్రాణభీతితో చేస్తున్న ఒక ఆర్తనాదం మాత్రం హోరున ప్రతిధ్వనిస్తోంది. అదే హైడెన్ చించుకుంటున్న గొంతు. క్రమంగా ఆ గొంతు నీళ్ళల్లో ఉక్కిరిబిక్కిరి అయినట్టు వినిపించింది. జల తాలూకు నీరు ఉబికివస్తూ కొలనును నింపేస్తోంది. మెల్లమెల్లగా హైడెన్ నీ, అతని అహంకారాన్నీ, అధికార దౌష్ట్యాన్నీ, జనుల అచంచల విశ్వాసాన్ని కించపర్చిన హేళననీ శాశ్వతంగా జలసమాధి చేసేసింది. జనం అంతా స్థాణువులైపోయి చూస్తున్నారు. తాము చేయని తప్పుకు లెంపలు వేసుకుంటూ, దణ్ణాలు పెడుతూ, ఎవరికి వారు కొలనుకీ, ఒరిగిపోయిన ఆ మహామూర్తికి మొక్కుతున్నారు. అప్రయత్నంగానే ప్రణమిల్లుతున్నారు. ఇంతలో వారి మధ్య దబ్బున పడిన శబ్దానికి అందరూ అటు చూశారు. కరణం కిందపడి గిలగిల కొట్టుకుంటున్నాడు. జరిగిన ప్రళయం అతన్ని నిశ్చేష్టుణ్ణి చేయడమే కాదు, అపరాధ భావన అతన్ని హతాశుణ్ణి చేసింది. నోరు వంకరపోయి కాలూ చెయ్యీ మెలికలు తిరిగిపోయాయి. అందరూ తేరుకుని నిశ్శబ్దంగానే ఒక మూకుమ్మడి నిర్ణయానికి వచ్చారు. చేతులెత్తి ఆ జల తల్లికి, ఆ కొలనుకూ, ఆ మహా విరాట్స్వరూపమైన ప్రకృతిశిలకూ మొక్కుతూ వెనుదిరిగారు. అహంతో కళ్ళు మూసుకుపోయిన హైడెన్ దొర చచ్చిపడి ఉన్న, జలసమాధి అయిన ఆ కొలనును మైలపడిపోయినదిగా మనసులో నిర్ధారించుకున్నారు యావత్తు ఊరి జనమూ. అప్పటినుండి ఇక ఎవరూ ఆ నీటిని తాకలేదు. సంవత్సరంలో వైశాఖపూర్ణిమ నాడు ఒక్కరోజు మాత్రం ఊరంతా వచ్చి ఎవరికి వారు కడవలతో గోదావరీ జలాల్ని మోసుకొచ్చి, ఆ కొలనులో పోసి జలశుద్ధి చేసి, కొలనుకు ప్రణమిల్లి వెనుదిరుగుతారు.’’ నేను మహీని చూస్తూ అడిగాను.‘‘ఇప్పుడు ఈ రహస్యాన్ని శోధించాలని ఉందా!’’నిలువుగా తలూపాడు చిన్నగా.‘‘ఇదివరకటి మనుషులు ఇప్పుడు లేరు. అయినా అలాంటి పరిశోధనకు అంగీకరించరు.చుట్టుప్రక్కల వారిని కలుపుకుని పెద్ద ఉద్యమం చేస్తారు.’’ అన్నాను.‘‘ఈదేశంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ పరిశోధించడానికి చాలా పెద్దమొత్తం కావాలి. మనం అనవసరంగా కోట్లు తగలేస్తాం.మనుషుల ప్రకృతి పరిణామాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడరు. అయితే ఈ స్థితి ఇలానే ఉంటుందని అనుకోను’’‘‘అంటే ...’’ అన్నాను.‘‘నడుస్తూ మాట్లాడుకుందాం’’ అన్నాడు. ఇద్దరం వచ్చిన దారిలో నడుస్తున్నాం.‘‘నేనిక్కడ ప్రజల సెంటిమెంట్ గురించి మాట్లాడటంలేదు. అలా వాళ్ళ వ్యతిరేకత వల్ల జరగబోయే పరిణామాల గురించి కూడా అప్పటి బ్రిటిష్వారిలా ఇక్కడ ఒక వర్గం తయారయింది. అది కార్పొరేట్ వర్గం.’’ఆశ్చర్యంగా చూస్తున్నాను. ‘‘ఏదోఒక రోజు బ్రిటిష్‌వారు సాధించలేనిది కార్పొరేట్ రంగం చేయగలదు. అందులోను ఈ ప్రాంతానికి విలువ పెరుగుతుంది. అది ఈరోజు జరుగుతుందా ... కొన్ని సంవత్సరాల తరవాతా అన్నది వేరే విషయం. ఏ రహస్యమైనా ప్రగతికోసం, పరిశోధన కోసం అయివుంటే ప్రయోజనం ఉంటుంది. అది కొందరు వ్యక్తులకు, సంస్థలకు మాత్రమే ఉపయోగపడినంతకాలం ఘర్షణలుంటాయి. ప్రకృతి రహస్యాలను అర్థం చేసుకోవడానికి మనిషి జరిపే అన్వేషణ లాభాల కతీతంగా ఉండే మంచిరోజు కోసం ఎదురుచూద్దాం. ఈ ప్రయాణం నాకు కొత్త పాఠాల్ని నేర్పింది’’ అన్నాడు మహి. పొత్తూరి సీతారామరాజు -
‘వోగో’లో ఓలా రూ.720 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: క్యాబ్ సేవల సంస్థ ఓలా, స్కూటర్ల షేరింగ్ ప్లాట్‌ఫామ్ ‘వోగో’లో 100 మిలియన్ డాలర్లను (రూ.720 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ పెట్టుబడులను నేరుగా అందించకుండా, లక్ష స్కూటర్లను వోగోకు అందించనుంది. దీనివల్ల వోగో తన కార్యకలాపాల విస్తరణకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం రాకుండా స్కూటర్ల సరఫరాను పెంచుకోనుంది. వోగో స్కూటర్ల సేవలు ఓలా ప్లాట్‌ఫామ్‌పై ఉన్న 15 కోట్ల మంది కస్టమర్లకు త్వరలో అందుబాటులోకి రానున్నట్టు ఓలా ప్రకటించింది. -
ఈ–స్కూటర్లు వచ్చేస్తున్నాయ్..!
తిరుపతి స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. గడిచిన మూడేళ్లుగా ప్రతిపాదనలతో నెట్టుకొస్తున్న యంత్రాం గం ఎట్టకేలకు మరో ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ స్కూటర్ కొనుగోలుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం బుధవారం జీఓ జారీ చేసింది. చిత్తూరు, తిరుపతి తుడా: పెట్రోల్ ఖర్చులతో పాటు నగరంలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అడుగులు వేస్తోంది. విద్యుత్ ఆదాకోసం ఇప్పటికే సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న కార్పొరేషన్ యంత్రాంగం కాలుష్య నివారణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ బైక్‌లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కార్పొరేషన్ అధికారులు పంపిన ప్రతిపాదనలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల్వల్లవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటి కొనుగోలుకు రూ.2,05,76,220 మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. ఈ మొత్తంతో 100 స్కూటర్లను కొనుగోలు చేయనున్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయింది. మరో 20 రోజుల్లో వర్క్ ఆర్డర్‌ను విడుదల చేసి, జపాన్‌కు చెందిన ఓకినోవా కంపెనీకి చెందిన న్యూవర్షన్ ఈ–స్కూటర్లను తీసుకురానున్నారు. సంక్రాంతి కల్లా ఈ స్కూటర్లను తీసుకురావడానికి కమిషనర్ విజయ్‌రామరాజు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వార్డులు, కాలనీల్లో పర్యటించేందుకు వీటిని ఉపయోగించనున్నారు. దేశంలోనే తొలిసారి.. జపాన్‌కు చెందిన ఓకినోవా కంపెనీ ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ–స్కూటర్లను తొలిసారిగా తిరుపతి నగరానికి పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే అనేక నగరాలు స్మార్ట్‌సిటీల్లో భాగంగా ఆయా నగరాలు ఈ–స్కూటర్ల కోసం ప్రతిపాదనలు పంపినా తిరుపతికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఇక్కడే ప్రారంభించాలని కంపెనీ ప్రతినిధులు భావించారు. దీంతో దేశంలోనే తొలిసారిగా ఈ స్కూటర్లతో ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. వీటి ప్రత్యేకత.. జపాన్‌కు చెందిన ఓకినోవా ఈ స్కూటర్లను అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించింది. మూడునెలల క్రితం కలెక్టర్ ప్రద్యుమ్న, కమిషనర్ విజయరామరాజు వీటి సామర్థ్యాన్ని పరిశీలించారు. టెస్ట్ డ్రైవ్ నిర్వహించి ఉద్యోగుల విధుల నిర్వహణకు అనువుగా ఉందని అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే కమిషనర్ విజయ్‌రామరాజు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయించారు. లి«థియా బ్యాటరీతో ఈ స్కూటర్ రూపొందింది. 4 గంటలు చార్జింగ్ చేస్తే 230 కి.మీ తిరగవచ్చు. ప్రతి స్కూటర్కూ జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేస్తారు. ఉద్యోగులను మానిటరింగ్ చేసేందుకు అ«ధికారులకు జీపీఎస్ విధానం దోహదపడనుంది. ఎక్కడ తిరుగుతున్నారు, ఏ వీ«ధికి వెళ్లారు, ఎన్ని కిలోమీటర్లు తిరిగారు అనే విషయాలను సులువుగా అంచనా వేయనున్నారు. -
మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్లు !
న్యూఢిల్లీ: వాతావరణ కాలుష్యం నివారణకు ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్లు మంచి పరిష్కారమని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. భారత్‌లోని ఢిల్లీ తదితర పెద్ద నగరాల్లో కాలుష్యం సమస్య మరింత తీవ్రమవుతోందని, దీని నుంచి గట్టెక్కేందుకు భారత్‌లో ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్లను అందించే విషయమై కసరత్తు చేస్తున్నామని వివరించారు. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేసే ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్ గంటకు 25 కిమీ. దూరం గరిష్ట వేగంతో ప్రయాణిస్తుందని వివరించారు. మడవగలిగే వీలున్న ఛాసిస్, దీనిపై పొడవైన డెక్ ఉంటుందని, స్కూటర్ పయ్యల కంటే చిన్న సైజు పయ్యలతో ఉండే ఈ ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్‌పై వ్యక్తి నిలబడి నడపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటిని నడపటానికి శిక్షణ అవసరమని, వీటిని దశలవారీగా ప్రవేశపెడతామని, తగిన శిక్షణను కూడా ఇస్తామని ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ వివరించారు. -
మదినిండా పెద్దాయనే..
సాక్షి, చంద్రశేఖర్‌కాలనీ: ఆయన మదినిండా వైఎస్సారే కొలువయ్యారు.. వైఎస్సార్‌పై ఉన్న అభిమానం తో తన స్కూటర్ రిపేరింగ్ దుకాణానికి వైస్సార్ స్కూటర్ రిపేరింగ్ వర్క్స్ అని పెట్టుకున్నారు. ఆయనే నగరంలోని బడాబజార్‌కు చెందిన భిక్షపతి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆయన చేసిన సేవలను ముగ్ధుడైన భిక్షపతి ఆయననే దేవుడిగా ఇప్పటికీ కొలుస్తున్నారు. వైఎస్‌పై ఉన్న అభిమానం.. ఆయన చేసిన సేవలను నలుగురికీ చెబుతూ అందరినోటా ‘వైఎస్సార్ భిక్షపతి’గా నిలిచిపోయారు. నగరరంలోని బడాబజార్‌లో వైఎస్సార్ స్కూటర్ రిపేరింగ్ వర్క్స్ పేరుతో షాప్ నిర్వహిస్తున్న నూరి భిక్షపతికి వైఎస్సార్ అంటే ఎనలేని అభిమానం. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్, ఆరోగ్యశ్రీ, విద్యార్థులక ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్లు ఇలా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించగా వాటిని ముగ్ధుడైన భిక్షపతి అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ప్రవేశపెట్టిన పథకాలను పదిమందికీ వివరిస్తూ ఉంటారు. వైఎస్ పేరునే స్కూటర్ రిపేరింగ్ షాప్‌ను పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. సుమారు 25ఏళ్లుగా స్కూటర్ మెకానిక్‌గా పనిచేస్తున్న భిక్షపతి తన షాప్‌లో ప్రతిఏటా వైఎస్ జయంతి, వర్ధంతులను సొంత ఖర్చుతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. గాంధీ జయంతి, రిపబ్లిక్ దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తాడు. స్థోమత లేకున్నప్పటికీ తనకు ఉన్నదాంట్లోనే కార్యక్రమాలు నిర్వహిస్తూ వైఎస్‌పై తన అభిమానాన్ని చూపుతున్నాడు. ఇప్పటికే పులివెందుల, హైదరాబాద్‌లో వైఎస్ కుటుంబసభ్యులతో, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన కలిశారు. -
మార్కెట్లోకి హీరో ‘డెస్టినీ 125’
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్.. దేశీ మార్కెట్లో ‘డెస్టినీ 125’ పేరిట సరికొత్త స్కూటర్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ మోడల్ ధరల శ్రేణి రూ.54,650–రూ.57,500గా ఉన్నట్లు ప్రకటించింది. ఢిల్లీ/ఎన్సీఆర్లో విక్రయాలు ప్రారంభం కాగా, దేశవ్యాప్త అమ్మకాలు వచ్చే 3–4 వారాల్లో ప్రారంభంకానున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ సందర్భంగా సంస్థ గ్లోబల్ ప్రోడక్ట్ ప్లానింగ్ హెడ్ మాలో లీ మాసన్ మాట్లాడుతూ.. ‘125–సీసీ విభాగానికి చెందిన స్కూటర్ మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. ఏడాది ప్రాతిపదికన 75 శాతం వృద్ధిరేటును నమోదుచేసింది. ఈ విభాగంలో బహుళ బ్రాండ్ విధానాన్ని అనుసరిస్తున్నాం. ఈ ఏడాది చివరినాటికి మరో స్కూటర్‌నూ విడుదలచేయనున్నాం’’ అని వివరించారు. -
మార్కెట్లోకి టీవీఎస్ సరికొత్త ‘వీగో’
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటార్స్ అధునాతన ‘వీగో’ స్కూటర్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. నూతన వెర్షన్లో 20 లీటర్ల యుటిలిటీ బాక్స్, స్పోర్టి వీల్–రిమ్ స్టిక్కర్స్, పాస్–బై స్విచ్, నిర్వహణ అవసరంలేని బ్యాటరీ వంటి నూతన ఫీచర్లు ఉన్నట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ అనిరుధ్ హల్దార్ వివరించారు. 110 సీసీ, పూర్తి మెటల్ బాడీ, అధునాతన డిజిటల్ స్పీడోమీటర్ కలిగిన ఈ స్కూటర్ ధర రూ.53,027 వద్ద నిర్ణయించినట్లు తెలిపారు. ప్రత్యేకించి మారుతున్న యువత అభిరుచులకు తగినట్లుగా స్కూటర్ డిజైన్ అయిందని వ్యాఖ్యానించారు. -
అంత జరిమానా కట్టలేను.. స్కూటరే తీసుకోండి !
మైసూరు : పలుమార్లు ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన ఓ స్కూటర్ యజమానికి రాచనగరి పోలీసులు షాకిచ్చారు. ఏకంగా రూ. 63,500 ఫైన్ కట్టమని నోటీసు జారీ చేశారు. దీంతో సదరు వాహనదారుడు స్కూటర్ విక్రయించినా అంత ధర రాదు, వాహనం మీరో ఉంచుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు... కర్ణాటకలోని మైసూరు నగరానికి చెందిన మధుకుమార్ కొన్నాళ్లుగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. శుక్రవారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా కే.ఏ.09 హెచ్డి.4732 నంబర్ కలిగిన స్కూటర్‌ను గుర్తించారు. అప్పటి నంచి లెక్క కట్టగా 635 కేసులు ఆ స్కూటర్‌పై నమోదు కావడంతో పోలీసులు ఏకంగా లెక్కకట్టి రూ. 63,500 ఫైన్ కట్టమని రశీదు ఇచ్చారు. దీంతో నివ్వెరపోయిన సదరు స్కూటర్ యజమాని వాహనం అమ్మినా అంత ధర రాదని, వాహనం మీరో ఉంచుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు ఏమి చేయాలో దిక్కుతోచక నిలబడిపోయారు. -
ఈ– స్కూటర్, విత్తనాల మిషన్
శివాజీనగర: సప్తగిరి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు బ్యాటరీతో నడిచే స్కూటర్, రైతులకు ఉపయోగపడే పంట విత్తనాల మిషన్‌ను మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ప్రదర్శించారు. పాత బజాజ్ చేతక్‌ను ఈ–స్కూటర్‌గా మార్చేశారు. ఇందుకు సుమారు రూ.12 వేలు ఖర్చు అయింది. ఎలాంటి కాలుష్యం వెదజల్లదు. గంటకు 30– 35 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. ఒకసారి బ్యాటరీని చార్జ్ చేయటానికి 4– 5 గంటల సమయం పడుతుంది. కేవలం 3.5 యూనిట్ల విద్యుత్ చాలని చెప్పారు. ఇక వ్యవసాయ పరికరంతో బహుళ ప్రయోజనాలున్నాయి. సులువుగా విత్తనాలు వేయవచ్చు. దీని వ్యయం రూ.600–800 మాత్రమేనని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు బీ.భరత్‌కుమార్, బీ.హేమంత్‌కుమార్, వీ.లోకనాథ్, పీ.మంజునాథ్, కాలేజీ అధ్యాపకులు పాల్గొన్నారు. -
హోండా ఫోర్జా 125 డబుల్ పవర్‌తో
సాక్షి,ముంబై: హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ సరికొత్త యాక్టివాను లాంచ్ చేయనుంది. హోండా స్కూటర్లతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన హోండా ఇపుడు కొత్త అప్డేటెడ్ స్కూటర్‌ను తీసుకు రానుంది. హోండా ఫోర్జా 125 లో న్యూ జనరేషన్ టూవీలర్ ను ఆవిష్కరించనుంది. తమ తాజా స్కూటర్ దాదాపు హోండా యాక్టివాకు డబుల్ పవర్ కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. రెండు ఫుల్ ఫేస హెల్మెట్స కొత్త వెర్షన్ ఫోర్జా సీటు కింద సరిపోతుందని, స్మార్ట్ కీ ఆపరేటెడ్ 45 లీటర్ టాప్ బాక్స్ సామర్ధ్యం పెరుగుతుందని చెబుతోంది. హోండా ఫోర్జా డిజైన్ , ఎలక్ట్రానిక్ డివైజ్ లో మార్పులతోపాటు మరికొన్ని హంగులతో మార్కెట్ లోకి విడుదల చేయనుంది. అయితే ఇంజిన్, చాసెస్ లో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా ఉంచింది. ఒకసారి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయిస్తే 486 కి.మీ. ప్రయాణించవచ్చని హోండా కంపెనీ చెబుతోంది. హోండా ఫోర్జాకు 125 సీసీ కెపాసిటీ సింగిల్ ఇంజిన్ అమర్చారు. 8750 ఆర్పీఎం వద్ద 14.75 బీహెచ్పీని, 8250 ఆర్పీఎం వద్ద 12.5 ఎన్ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. డిజిటల్ డిస్‌ప్లేతోపాటు అనలాగ్ స్పీడోమీటర్, టాకోమీటర్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో పొందుపర్చింది. ఇంకా కొత్త తరం హోండా ఫోర్జాలో అడ్జెస్టబుల్ విండ్ స్క్రీన్ , ఎల్ ఈ డీ ఇండికేటర్స్ , క్లస్టర్, అనలాగ్ స్పీడో మీటర్ అదనంగా జోడించింది. హ్యాండిల్ బార్ ను అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవచ్చని కంపెనీ చెబుతోంది. 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో హోండాకు యాక్టివా , గ్రాజియా పాపులర్ మోడల్స్. అయితే మ్యాక్సీ-స్కూటర్ డిజైనర్ కలిగి ఉన్నది మాత్రం హోండా ఫోర్జా. అలాగే యాక్టివా పోలిస్తే యాక్టివా 125 8.5 బీహెచ్పీ అని అందిస్తోంటే...ఫోర్జా 14.75 పవర్‌ను అందిస్తుంది. కాగా యూరప్‌లో చాలా పాపులర్ అయిన ఈ స్కూటర్ 2015లో సుమారు 30వేల యూనిట్లను విక్రయించిందట కంపెనీ. అయితే ధర వివరాలు, ఎపుడు లాంచ్ చేసేది అధికారికంగా వెల్లడించలేదు. -
ఈ స్కూటర్‌ను నడపాల్సిన అవసరం లేదు!
ముందుగా కార్లు అన్నారు.. ఆ తరువాత లారీలు వచ్చేశాయి... మేమేం తక్కువ తిన్నామా? అని విమానాలూ రంగంలోకి దిగాయి. తాజాగా డ్రైవర్ లేదా డ్రైవింగ్ అవసరం లేని స్కూటర్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఫొటోలో కనిపిస్తున్నది అదే. ఏబీ డైనమిక్స్ అనే సంస్థ తయారు చేసింది దీన్ని. బీఎండబ్ల్యూ సీ1 స్కూటర్‌కు కాస్తా మార్పులు చేసి డ్రైవర్ అవసరం లేనిదానిగా మార్చారు. రోడ్డును, ట్రాఫిక్‌ను గమనించేందుకుబోలెడన్ని సెన్సర్లు, చక్రాలు ఒరిగిపోకుండా ఉండేందుకు కొన్ని ప్రత్యేకమైన ఔట్ రిగ్గర్లు దీంట్లో ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. విషయం చాలా సింపుల్. ఈ బైక్ ప్రత్యేకంగా నడపాల్సిన అవసరం లేదు. సీట్లో కూర్చోవడం మాత్రమే మనం చేయాల్సిన పని. గేర్లు మార్చడం మొదలుకొని యాక్సలరేటర్‌ను నియంత్రించడం వరకూ అన్ని పనులను కంప్యూటర్ సాఫ్ట్వేర్ చేసుకుంటుంది. ఇటీవల జరిగిన పరీక్షల్లో ఈ స్కూటర్ అన్ని రకాలుగా విజయవంతమమైనట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అతితక్కువ వేగంలోనూ తనను తాను సంభాళించుకుంటూ చక్కర్లు కొట్టడమే కాకుండా తనకంటే ముందు వెళుతున్న వాహనాలను అతి జాగ్రత్తగా ఓవర్ టేక్ చేసింది కూడా. కారులాంటి నిర్మాణం కారణంగా తాము అన్ని రకాల సెన్సర్లను అక్కడ ఏర్పాటు చేయగలిగామని కంపెనీ ప్రతినిధి రిచర్డ్ సింప్సన్ చెప్పారు. ఉమ్మనీటిలో తేడాలతో బిడ్డలో మానసిక సమస్యలు! గర్భంలో ఉండగా ఉమ్మనీటిపై పర్యావరణ లేదా ఇతర ఒత్తిళ్లు పడితే పుట్టబోయే బిడ్డకు పలు నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముందని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేస్తోంది. స్క్రిజోఫ్రేనియా వంటి మానసిక సమస్యల మూలాలు తెలుసుకునేందుకు ‘లైబర్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్’ శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాల్లో ఈ విషయం తెలిసింది. ఈ వ్యాధికి ఇప్పటికే కొన్ని జన్యుపరమైన కారణాలు ఉన్నట్లు స్పష్టమైనప్పటికీ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఉమ్మనీరు కూడా ప్రభావం చూపుతుందని తెలియడం ఇదే తొలిసారి. గర్భధారణ సమయంలో వచ్చే ఇబ్బందుల వల్ల ఉమ్మనీటిలో కొన్ని జన్యువులు చైతన్యవంతమై బిడ్డ మెదడు ఎదుగుదుల పనితీరుపై ప్రభావం చూపుతోందని ఫలితంగానే స్క్రిజోఫ్రేనియా వంటి సమస్యలు ఎదురవుతున్నట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వెయిన్‌బర్గ్ తెలిపారు. ఈ జన్యుమార్పులు కూడా ఆడ పిండాల కంటే మగ పిండాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని మగాళ్లలో ఈ సమస్య రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఎందుకు ఉంటోందనేందుకు ఇదే కారణం కావచ్చునని వివరించారు. గర్భం దాల్చినప్పుడు ఉమ్మనీటి పరిస్థితిపై మరింత జాగ్రత్త వహించేందుకు తద్వారా శిశువుల్లో నాడీ సంబంధిత సమస్యలు ఎదురు కాకుండా చూసుకునేందుకు తమ అధ్యయనం పనికొస్తుందని వెయిన్‌బర్గ్ అంచనా వేస్తున్నారు. సముద్రపు ప్లాస్టిక్ టీషర్ట్ అయింది! ప్లాస్టిక్ చెత్త సమస్యను అధిగమించేందుకు బోలెడంతమంది బోలెడన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్లాస్టిక్ చెత్తను ఇంధనంగా మార్చే ప్రయత్నం చేస్తూంటే ఇంకొందరు టీషర్ట్లు తయారు చేస్తున్నారు. ఫొటోలో కనిపిస్తున్నది అదే. కాకపోతే దీన్ని అంతర్జాతీయ కంపెనీ అడిడాస్ తయారు చేసింది. మాంఛెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాళ్లు ఇకపై దీన్ని వాడనున్నారు. సముద్రాల్లోకి చేరిపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి వీటిని తయారు చేస్తూండటం విశేషం. ప్రజల్లో ప్లాస్టిక్ సమస్యపై అవగాహన మరింత పెరిగేందుకు తమ ఆవిష్కరణ ఉపయోగపడుతుందని అడిడాస్ అంటోంది. ఈ ఏడాది అమెరికాలో జరిగే టోర్నీలో తొలిసారి క్రీడాకారులు ఈ రీసైకిల్డ్ ప్లాస్టిక్ టీషర్ట్లను వాడతారని చెప్పారు. అడిడాస్ ఇలా ప్లాస్టిక్ చెత్తతో కొత్త ఉత్పత్తులను తయారు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అందమైన కాలిజోళ్లను తయారు చేసిన విషయం తెలిసిందే. రీసైకిల్డ్ ప్లాస్టిక్ షూలు, వస్త్రాలు మీకూ కావాలా? అడిడాస్ వెబ్సైట్ నుంచి నేరుగా కొనుగోలు చేయవచ్చు. కాకపోతే కాస్తా ఖరీదు ఎక్కువగా ఉండే అవకాశముంది. -
స్కూటర్స్ ఇండియా పునర్వ్యవస్థీకరణకు ఆమోదం
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ స్కూటర్స్ ఇండియా సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు తోడ్పడే దిశగా ఖాతాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నష్టాలకు ప్రతిగా ప్రభుత్వ ఈక్విటీని రూ.85.21 కోట్ల మేర తగ్గించడం ద్వారా ఖాతాలను పునర్ వ్యవస్థీకరించనున్నట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. దీనికి అనుగుణంగా 2012–13 తర్వాత నుంచి స్కూటర్స్ ఇండియా బ్యాలెన్స్ షీట్లను క్రమబద్ధీకరించడం జరుగుతుందని పేర్కొంది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ వ్యూహంలో భాగంగా.. స్కూటర్స్ ఇండియాలో 100 శాతం వాటాలను విక్రయించేందుకు భారీ పరిశ్రమల శాఖ బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. -
ఇప్పుడు స్పోర్టీ స్కూటర్ల వంతు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహనాల్లో స్కూటర్లు సౌకర్యవంతంగా ఉంటాయన్నది వాస్తవం. ఇప్పుడు ఈ స్కూటర్ మార్కెట్ కాస్తా స్పోర్టీ, స్మార్ట్ వైపు దూసుకెళ్తోంది. సాధారణ స్కూటర్లతో పోలిస్తే ఈ స్పోర్టీ వేరియంట్ల అమ్మకాలు రెండింతల మేర వృద్ధి చెందుతున్నాయంటే ట్రెండ్‌ను అర్థం చేసుకోవచ్చు. మెట్రోలు, పెద్ద పట్టణాలే కాకుండా చిన్న పట్టణాల్లోనూ యువత వీటికి దాసోహం అంటున్నారు. అటు తయారీ కంపెనీలు సైతం వినూత్న డిజైన్లతో ఒకదాని వెంట ఒకటి పోటీపడుతున్నాయి. ఈ ఏడాది మరిన్ని మోడళ్లు కస్టమర్ల కోసం రెడీ అవుతున్నాయి. స్పోర్టీ మోడళ్లకు సై.. విభిన్న డిజైన్లు, మల్టీ కలర్, స్పోర్టీ లుక్ స్కూటర్లకు యువత సై అంటున్నారు. స్కూటర్ల విభాగం ఏటా 18 శాతం వృద్ధి చెందితే, స్పోర్టీ మోడళ్లు 35 శాతం వృద్ధి నమోదవుతున్నాయని టీవీఎస్ సేల్స్ జీఎం బినయ్ ఆంథోని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ‘‘స్కూటర్లలో స్పోర్టీ మోడళ్ల వాటా 10 శాతం దాకా ఉంది. 18 నుంచి 24 ఏళ్ల కుర్రకారే ఈ విభాగాన్ని నడిపిస్తున్నారు’’ అని ఆథోని వివరించారు. ద్విచక్ర వాహన రంగంలో అధిక మైలేజీ ఇచ్చే ఇంజన్ల అభివృద్ధికి కంపెనీలు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయి. ఒకప్పుడు మైలేజీ లీటరు పెట్రోలుకు 30 లోపే ఉండేది. ఇప్పుడు 55 కిలోమీటర్ల దాకా ఇచ్చే మోడళ్లూ వచ్చాయి. బైక్‌ల మైలేజీ కూడా ఇదే స్థాయిలో ఉండటంతో స్కూటర్ల అమ్మకాలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. పోటాపోటీగా మోడళ్లు.. ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు పోటాపోటీగా స్పోర్టీ మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. హోండా నుంచి గ్రేజియా, డియో. హీరో మోటోకార్ప్ నుంచి మాయెస్ట్రో ఎడ్జ్. యమహా నుంచి రే–జడ్ఆర్, రే–జడ్, ఆల్ఫా. అప్రీలియా నుంచి ఎస్ఆర్ 150 రేస్, ఎస్ఆర్ 150 వంటివి ఇప్పటికే మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. మహీంద్రా తన గస్టో మోడల్‌ను స్పోర్టీ లుక్‌తో తీర్చిదిద్దింది. వీటికి పోటీ ఇచ్చేందుకు తాజాగా టీవీఎస్ మోటార్ కంపెనీ ఎన్‌టార్క్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇతర కంపెనీలకు భిన్నంగా కనెక్టెడ్ స్కూటర్‌గా దీనిని అభివర్ణిస్తోంది. సుజుకీ ఈ ఏడాదే బ్రౌనీ 125, బర్గ్‌మన్ స్ట్రీట్ 125 మోడల్స్‌ను తీసుకొస్తోంది. ఇక కంపెనీలన్నీ రెగ్యులర్ మోడళ్లను సైతం మల్టీ కలర్, స్పోర్టీ లుక్ వచ్చే విధంగా రీలాంచ్ చేస్తుండటం ప్రస్తుత ట్రెండ్‌కు అద్దం పడుతోంది. మూడింట ఒకటి స్కూటర్.. దేశవ్యాప్తంగా 2016–17లో 1.75 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం నెలకు అమ్ముడవుతున్న యూనిట్లలో 34 శాతం వాటా స్కూటర్లు చేజిక్కించుకున్నాయి. అంటే మూడు వాహనాల్లో ఒకటి స్కూటర్ అన్నమాట. గేర్లు మార్చాల్సిన అవసరం లేకపోవడం, స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఉపయోగపడే విధంగా వాహన డిజైన్ ఉండటం, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతి వంటి కారణాలతో స్కూటర్లు పాపులర్ అవుతున్నాయి. స్కూటర్ల విభాగం అయిదేళ్లుగా ఏటా 18 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. 2012–13లో దేశీయంగా 1.38 కోట్ల యూనిట్ల టూవీలర్లు విక్రయమయ్యాయి. ఇందులో స్కూటర్ల వాటా 20 శాతం లోపే ఉంది. కాగా, భారత్‌లో ఈ ఏడాది అన్ని కంపెనీల నుంచి 150 సీసీ స్కూటర్లు మార్కెట్లో అడుగు పెడతాయని సమాచారం. -
టీవీఎస్ కొత్త స్కూటర్... ప్రత్యేకతలివే
సాక్షి, ముంబై: ద్విచక్ర వాహన తయారీదారు టీవీఎస్ మోటారు కొత్త స్కూటర్‌ను లాంచ్ చేసింది. టీవీఎస్ ఎన్ టాక్ పేరుతో తీసుకొచ్చిన ఫ్లాగ్షిప్ కొత్త స్పోర్టీ స్కూటర్ ధరను రూ. 58,750 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. ఇండియన్ స్కూటర్ మార్కెట్లో ఇదివరకెన్నడూలేని కొత్త ఫీచర్లను జోడించి మరీ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఇంజిన్, స్మార్ట్‌ఫీచర్లు, అత్యాధునిక సౌకర్యాలు, స్టయిలిష్ లుక్ దీని సొంతం. ముఖ్యంగా బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తున్న మొట్టమొదటి స్కూటర్ ఇదే. స్కూటర్ సెగ్మెంట్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టీవీఎస్ అధునాతన 'స్మార్ట్జోనెక్ట్' టెక్నాలజీ ప్లాట్‌ఫాంతో దీన్ని రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది. 125 సీసీ ఇంజిన్ 9.4 పీఎస్ పవర్, 10.5ఎన్ ఎం టార్క్, బ్లూ టూత్ కనెక్టివిటీ ప్రధాన పీచర్లుగా ఉన్నాయి. అంతేకాదు కాలర్ఐడీ, పార్కింగ్ లోకేషన్ అసిస్టెంట్, ఫుల్లీ-డిజిటల్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా నావిగేషన్ సహాయాన్ని అందిస్తుంది. షార్ప్ హెడ్ లాంప్, డే టైం రన్నింగ్ లైట్ లాంప్, ఎల్ఈడీ టెయిల్ ట్యాంప్, 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ లాంటి ఫీచర్లు, డ్యుయల్ టోన్ పెయింట్ పథకాలతో మొత్తం డిజైన్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఇక పోటీపరంగా చూస్తే 2018 ఆటో షోలో లాంచ్ చేయనున్న హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్‌కి గట్టి పోటీ కానుంది. -
పల్లెల్లోనూ స్కూటర్ల హవా!
(సాక్షి, బిజినెస్ విభాగం) : గ్రామాల్లో స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. గ్రామీణులు మెల్లగా రోజువారీ అవసరాల కోసం కూడా స్కూటర్లపై ఆధారపడుతుండటంతో స్కూటర్ల విక్రయాల్లో పల్లెల వాటా పెరుగుతోంది. ద్విచక్ర వాహన పరిశ్రమ విక్రయాల్లో మిగిలిన మోడళ్లతో పోలిస్తే స్కూటర్ల వృద్ధి ఎంతో అధికంగా ఉంటుండగా... ఇటీవలి కాలంలో పల్లెలు, సెమీ అర్బన్ (చిన్న పట్టణాలు) ప్రాంతాల్లోనూ వీటికి డిమాండ్ పుంజుకుందని ఆటో మొబైల్ సంస్థలు చెబుతున్నాయి. గేర్లు లేకపోవడం, ఎవరైనా నడిపేందుకు అనుకూలంగా ఉండటం, బైక్ ధరకే స్కూటర్ కూడా వస్తుండడం, ఆర్జించే మహిళలు పెరుగుతుండడం వెరసి స్కూటర్ల మార్కెట్ వేగం పుంజుకుంటోంది. హోండా... ప్రతి ఏడింట్లో మూడు స్కూటర్ విక్రయాల్లో పరిశ్రమలోనే నంబర్ 1 స్థానంలో ఉన్న హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాను విక్రయించే ప్రతి 7 మోటారు సైకిళ్లకు గ్రామీణ, సెబీ అర్బన్ ప్రాంతాల్లో 3 స్కూటర్లుంటున్నాయి. ఐదేళ్ల క్రితం ఈ మార్కెట్లలో ప్రతి 9 బైకులకు ఒక్క స్కూటరే అమ్ముడయ్యేది. స్కూటర్ల విక్రయాలు వేగాన్ని అందుకున్నాయనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల విక్రయాల్లో (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) స్కూటర్ల విక్రయాలు 18.5 శాతం అధికంగా నమోదైతే, ఇదే కాలంలో బైకుల విక్రయాల వృద్ధి 11.5 శాతంగానే ఉంది. ముఖ్యంగా ప్రారంభ స్థాయి మోటారు బైకుల మార్కెట్ స్కూటర్లకు మళ్లిపోతోంది. 100–110సీసీ బైకుల వినియోగదారులు స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బైకులు, స్కూటర్ల మధ్య మార్కెట్ వాటా పరంగా ఉన్న అంతరం తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రారంభ స్థాయి మార్కెట్‌కు గండి 2017 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు చూస్తే మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాల్లో స్కూటర్ల వాటా 33.7 శాతంగా ఉంది. 100–110సీసీ బైకుల వాటా 36.5 శాతం. ఈ రెండింటి మధ్య అంతరం 2.8 శాతానికి తగ్గిపోయింది. ఏడేళ్ల క్రితం ఈ రెండింటి మధ్య అమ్మకాల్లో వ్యత్యాసం 28–30 శాతం స్థాయిలో ఉన్నట్టు పరిశ్రమ వర్గాల సమాచారం. స్కూటర్ల మార్కెట్లో లీడర్‌గా ఉన్న హోండా ఈ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ఆ అవకాశాలను సొంతం చేసుకునేందుకు అవసరమైన విధానాలను ఆచరణలో పెట్టింది. 2017లో గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ప్రత్యేకంగా క్లిక్ పేరుతో ఓ స్కూటర్‌ను కూడా హోండా ప్రవేశపెట్టింది. అంతేకాదు, 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రారంభమైన కొత్త సబ్ డీలర్షిప్ నెట్‌వర్క్‌లో 70 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండడం కంపెనీ ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. హోండాకు గ్రామీణ ప్రాంతాల్లో వాటా 15 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఐదేళ్ల క్రితం ఈ వృద్ధి రేటు ఒక్క అంకె స్థాయిలోనే ఉంది. పట్టణ, నగర మార్కెట్లో మాత్రం హోండా వేగంగా 25 శాతం చొప్పన వృద్ధిని నమోదు చేస్తోంది. టీవీఎస్ ద్విచక్ర వాహన విక్రయాల్లో స్కూటర్ల వాటా 38 శాతంగా ఉంటే, సుజుకి మోటార్ సైకిల్ ఇండియా విక్రయాల్లో 84 శాతం స్కూటర్లే కావడం గమనార్హం. నడపడంలో వెసులుబాటు 110సీసీ సామర్థ్యం కలిగిన హోండా క్లిక్ స్కూటర్ ఇప్పటి వరకు 12,000 యూనిట్లు అమ్ముడుపోయి ఉండొచ్చని అంచనా. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.42,000 స్థాయిలో ఉంది. దీని టైర్లు అదనపు గ్రిప్‌తో, గతుకుల రోడ్లలోనూ మరింత నియంత్రణకు, గ్రామీణ రోడ్లపై ప్రయాణానికి అనువుగా ఉంటాయని కంపెనీ చెబుతోంది. ‘‘మరింత మంది మహిళలు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల నుంచి పనుల్లో చేరుతుండటంతో వాహనాలకు డిమాండ్ పెరిగింది’’ అని హెచ్ఎంఎస్ఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వైఎస్ గులేరియా తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువ శాతం మంది రెండు వాహనాలను (పురుషులకు బైక్, స్త్రీలకు స్కూటర్) భరించలేరని, దీంతో స్కూటర్ వారి ఎంపికగా ఉంటోందని చెప్పారాయన. గతంలో ఆటోమేటిక్ స్కూటర్ (రూ.48,000)కు 100–110 సీసీ బైక్‌కు (రూ.44,000) మధ్య ధరల పరంగా వ్యత్యాసం ఉండడంతో స్కూటర్ల కొనుగోలుకు ముందుకొచ్చేవారు కాదని, దీన్ని తాము గుర్తించి రూ.42,000 స్థాయిలో క్లిక్ స్కూటర్‌ను తీసుకొచ్చినట్టు గులేరియా తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని వృద్ధి అవకాశాలు టైర్–3 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనుంచి మరింత మంది మహిళలు ఉద్యోగాల్లో చేరుతుండడంతో స్కూటర్ల వృద్ధికి అవకాశాలు ఏర్పడినట్టు యమహా మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాయ్కురియన్ చెప్పారు. 2020 నుంచి అమల్లోకి రానున్న బీఎస్–6 కాలుష్య ప్రమాణాలు 100–110సీసీ బైక్ మార్కెట్‌కు మరింత విఘాతం కలిగిస్తుందన్నారు. దీన్నుంచి స్కూటర్ మార్కెట్ లబ్ది పొందుతుందని, ధరల పరంగా మరింత పోటీగా మారడం, గేర్లు లేకపోవడం ఇందుకు కారణాలుగా పేర్కొన్నారు. ముఖ్యంగా అధిక మైలేజీనిచ్చే 100 సీసీ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతుందన్నారు. -
దూసుకెళ్తోన్న హోండా ‘గ్రేజియా’
ముంబై: దేశీ రెండో అతిపెద్ద టూవీలర్ల తయారీ సంస్థ ‘హోండా స్కూటర్ అండ్ మోటార్‌సైకిల్ ఇండియా’ (హెచ్ఎంఎస్ఐ) ఇటీవల మార్కెట్లోకి తీసుకువచ్చిన ‘గ్రేజియా’ స్కూటర్ల అమ్మకాలు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. 75 రోజుల్లోనే 50,000లకు పైగా యూనిట్లు విక్రయమైనట్లు కంపెనీ తెలిపింది. అతి తక్కువ కాలంలో ఈ స్థాయి విక్రయాలు సాధించిన తొలి స్కూటర్ ఇదేనని పేర్కొంది. గ్రేజియా దేశవ్యాప్తంగా కస్టమర్లకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో రానున్న కాలంలో నెలకు 20,000కు పైగా విక్రయాలు సాధిస్తామని హెచ్ఎంఎస్ఐ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) వై.యస్.గులెరియా ధీమా వ్యక్తంచేశారు. ‘మార్కెట్లోకి వచ్చిన తొలి నెలలోనే 17,047 యూనిట్ల అమ్మకాలతో టాప్–10 సెల్లింగ్ స్కూటర్ల జాబితాలో స్థానం పొందింది. తర్వాతి నెలలో 19,000లకుపైగా యూనిట్ల అమ్మకాలు సాధించి టాప్–5లోకి ఎంట్రీ ఇచ్చింది’ అని వివరించారు. 125 సీసీ ఆటోమేటిక్ స్కూటర్ ‘గ్రేజియా’ ప్రారంభ ధర రూ.58,133 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). -
హోండా కొత్త స్కూటర్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: హోండా మోటార్ సైకిల్,స్కూటర్ ఇండియా కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. 125సీసీ సామర్ధ్యంతో అడ్వాన్స్డ్ అర్బన్ స్కూటర్‌ను బుధవారం దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది.‘గ్రాజియా’ పేరుతో తీసుకొన్తున్న ఈ స్కూటర్‌ను రూ. 57,897 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరకే విడుదల చేసింది. ఆటోమేటిక్ స్కూటర్ల సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న హోండా మోటార్స్ గ్రాజియో మరో అడుగు ముందుకు వేసిందని హోండా మోటార్స్ అండ్ స్కూటర్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు. కంపెనీ ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆరు స్కూటర్ మోడళ్లలో అతి పెద్ద పోర్ట్‌ఫోలియో హోండాదే. 125 సీసీ బీ-4 (హోండా ఎకో టెక్నాలజీ) ఇంజిన్, సీబీఎస్ (కాంబి బ్రేకింగ్ సిస్టం) తో వస్తోంది. ఇతర ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ , త్రీ స్టెప్ ఎకో స్పీడ్ ఇండికేటర్ ప్రధాన ఫీచర్లను కలిగి ఉంది. ఇది వాస్తవిక మైలేజ్ సమాచారాన్ని చూపించే మొట్టమొదటి ఆవిష్కరణ అని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. -
సూపర్ సుప్రా
♦ రాష్ట్రంలో తొలి స్కూటర్ బొటిక్ ప్రారంభం ♦ ప్రత్యేక ఆకర్షణగా మిస్ సుప్రానేషనల్ ఆశాభట్ విశాఖసిటీ : ఆధునిక రవాణా వ్యవస్థకు అనుగుణంగా డిజైన్, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ నూతన ఆవిష్కరణలు చేస్తున్నామని యమహా మోటార్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మసాకీ అసానో అన్నారు. ప్రపంచంలోనే రెండోది, రాష్ట్రంలో మొదటి యమహా స్కూటర్ బొటిక్‌ను నగరంలోని బిర్లా జంక్షన్ సమీపంలో ఎండీ అసానోతోపాటు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాయ్ కురియన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో మిస్ సుప్రా నేషనల్–2014 ఆశాభట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఎండీ మసాకీ అసానో మాట్లాడుతూ స్కూటర్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో స్కూటర్ బొటిక్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మహిళల్లో స్కూటర్ సవారీపై ఆసక్తి ఎక్కువైందనీ.. ఈ సమయంలో వారికి సేవలందించేందుకు బొటిక్‌లో స్కూటర్ క్లినిక్ సైతం ఉంటుందని వివరించారు. స్కూటర్ మోడల్, కొనుగోలు చేసిన వ్యక్తిని బట్టి.. ఫ్యాషన్ ప్రపంచం బొటిక్‌లో అందుబాటులో ఉంటుందని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాయ్ కురియన్ తెలిపారు. అత్యుత్తమ కస్టమర్ అనుసంధానంతో యంగ్ బ్రాండ్‌గా, ఫ్యాషన్, లైఫ్స్టైల్లో యమహా వాహనాల పాత్ర శ్లాఘనీయమని కొనియాడారు. డీలర్ల ఆసక్తి, వారి అంకిత భావాన్ని దృష్టిలో పెట్టుకొని నగరాల్లో బొటిక్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బొటిక్‌లో కొనుగోలు చేసిన ఇద్దరు కస్టమర్లకు డెలివరీ అందించారు. ఈ కార్యక్రమంలో వైష్ణవీ ఆటోమొబైల్స్ ప్రొప్రైటర్ దశరధరామిరెడ్డి, యమహా సిబ్బంది పాల్గొన్నారు. -
రాత్రిపూట స్కూటర్‌పై సీఎం చక్కర్లు
సాక్షి, కేకే.నగర్ (చెన్నై): పుదుచ్చేరి శివారు ప్రాంతాల్లో వీధిలైట్లు వెలగడం లేదని ఫిర్యాదు రావడంతో సీఎం వి. నారాయణస్వామి బుధవారం రాత్రి వీధుల్లో స్కూటర్‌పై తిరిగి పరిశీలించారు. బుధవారం రాత్రి 8.30 గంటలకు పుదుచ్చేరి ఎల్లయమ్మన్ కోవిల్ వీధిలోని తన ఇంటి నుంచి సీఎం స్కూటర్‌పై బయల్దేరారు. ఆయనతో పాటు మరో స్కూటర్లో మంత్రి కమలకన్నన్ వెళ్లారు. మిషన్ వీధి, పుస్కి వీధి, ఆంబూర్ రోడ్డు, అరవిందర్ వీధి, అన్నాసాలై, ఎస్పీ పటేల్ రోడ్డు సహా పలు ప్రాంతాల్లో వీధిలైట్లు పనిచేస్తున్నాయా.. లేదా అని రాత్రి 11 గంటల వరకు ఆయన పరిశీలించారు. ఆ సమయంలో పలు ప్రాంతాల్లో వీధి లైట్లు వెలగకుండా ఉండడం చూసిన సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే వాటిని సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి స్కూటర్‌పై రావడంతో స్థానికులు ఆసక్తిగా చూశారు. ఆయనతో పాటు స్కూటర్లపై తిరిగిన వారెవరూ హెల్మెట్ ధరించకపోవడం గమనార్హం. వీధిలైట్లు, మహిళల భద్రత గురించి తెలుసుకునేందుకు మంత్రి కమలకన్నన్, అధికారులతో కలిసి 25 కిలోమీటర్లు స్కూటర్‌పై ప్రయాణించినట్టు సీఎం నారాయణస్వామి ట్విటర్లో పేర్కొన్నారు. తాను స్కూటర్‌పై వెళుతున్న ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. రాత్రి సమయంలో మహిళలకు ఏ విధమైన రక్షణ ఉందో పరిశీలించటానికి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కూడా గత నెల 18న స్కూటర్‌పై పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేయడంతో ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. -
మా ఇష్టం.. ఆపేదెవరు?
ముగ్గురు వ్యక్తులు పాతకాలం నాటి స్కూటర్లను బయటకు తీశారు. ఒక్కదానికీ నెంబర్ ప్లేట్ లేదు. ఒక్కరూ హెల్మెట్ కూడా ధరించలేదు. పైగా బరువైన బస్తాలతో దూసుకెళుతున్నారు. పోలీసులు సాధారణ వాహనదారులను రకరకాల కారణాలతో నిలపడమో.. హెల్మెట్ లేకుంటే చలాన్ విధించడమో చేస్తారు. లేదంటే వేగంగా వెళ్లేవారిని ఫొటో తీసి ఆన్లైన్లో చాలాన్ పంపిస్తారు. వీరు వెళ్లే మార్గంలో అనేక ట్రాఫిక్ సిగ్నళ్లు ఉన్నాయి.. అక్కడ పోలీసు సిబ్బందీ ఉన్నారు. కానీ ఒక్కరూ నిలువరించలేదు. ఇదేంటని అడగనూ లేదు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై కనిపిందీ దృశ్యం. – ఫొటో: గడిగె బాలస్వామి -
హ్యాపీగా... జాలీగా...
సందర్భం తెలీదు. కానీ, సంతోషం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది... అల్లు స్నేహ ముఖంలో, ఆమెను పట్టుకుని వెనుక సీటులో కూర్చున్న కుమారుడు అయాన్ నవ్వులో, వీళ్లిద్దరి కంటే ముఖ్యంగా స్కూటర్‌ను పట్టుకుని గాల్లో ఎగురుతూ అల్లు అర్జున్ ఇచ్చిన ఫోజులో. అర్హ (అల్లు అర్జున్ కుమార్తె) చిన్న పిల్ల కదా... ఏం జరుగుతుందో పసిగట్టలేని పసిపిల్ల. ముద్దుగా అమ్మ ఒడిలో కూర్చుంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోకున్న మరో స్పెషాలిటీ ఏంటంటే... స్నేహ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు, అయాన్ పుట్టిన తర్వాత సేమ్ టు సేమ్ ఇలాంటి ఫొటోలే దిగారు. ఇప్పుడు అర్హతో కలసి మళ్లీ ఫొటోలు దిగారు. హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు కదూ!