సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ వాహన తయారీ దిగ్గజం పియాజియో ఆటోఎక్స్‌పో 2020లో ద్విచక్రవాహనాల లాంచింగ్‌తో సందడి చేసింది. ఇటలీకి చెందిన పియాజియో తన ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్‌లో ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ను ఆవిష్కరించింది. అలాగే వెస్పా ఎలెట్రికా అనే ఎలక్ట్రిక్ స్కూటీని కూడా ఈ సంస్థ ప్రదర్శించింది. కొత్త ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ -160 బారామతి ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసినట్టు కంపెనీ తెలిపింది. ఇది అక్టోబర్-డిసెంబర్, 2020లో మార్కెట్లోకి వస్తుందని అంచనా.
రానున్న ఐదేళ్లలో ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్‌ను అనుసరించాలని కంపెనీ యోచిస్తోంది. స్థానిక వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని భారతదేశంలో వినూత్న ఎలక్ట్రిక్-మొబిలిటీ వాహనాలను లాంచ్ చేయనుంది. పియాజియో ఇండియా సీఎండీ డియెగో గ్రాఫి మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలను తీర్చగల కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం గర్వంగా ఉందన్నారు. ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 బైక్, 160 సీసీ, 125 సీసీ బీఎస్-6 ఇంజన్ ఆప్షన్లలో వస్తుంది. ఎల్‌ఈడీ హెడ్, టైల్ లైట్స్, యుఎస్‌బి ఛార్జింగ్ ఉన్న స్ప్లిట్ గ్లోవ్ బాక్స్, డిజిటల్ క్లస్టర్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే క్రోమ్ గార్నిష్ ఎగ్జాస్ట్‌తో పాటు 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ ను జోడించింది. బ్లూ, వైట్, రెడ్, బ్లాక్ అనే నాలుగు వేర్వేరు రంగులలో లభిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా బుకింగ్‌లు ఆగస్టు 2020లో ప్రారంభమవుతాయి.
చదవండి : మారుతి విటారా బ్రెజ్జా సరికొత్తగా
Comments
Please login to add a commentAdd a comment