piaggio
-
చెన్నైలో పియాజియో తొలి ఎలక్ట్రిక్ వాహన అవుట్ లెట్
చెన్నై: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నైలో తన మొదటి ఎలక్ట్రిక్ వాహన అవుట్ లెట్ ఏర్పాటు చేసింది. తమిళనాడు వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎం.ఎ.సుబ్రమణియం ఈ ఎక్స్ పీరియన్స్ సెంటర్(ఈవీ షోరూమ్) ప్రారంభించారు. పియాజియో ఎలక్ట్రిక్ వాహనాలను ఈ ఈవీ షోరూమ్ లో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు అని అన్నారు."చెన్నైలో తమిళనాడులో మా మొదటి ఈవీ ప్రత్యేక షోరూమ్ ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది. చెన్నై ఒక పెద్ద మెట్రో & ప్రధాన వ్యాపారలకు కేంద్రంగా ఉంది" అని ఈవీపీ, కమర్షియల్ వేహికల్ బిజినెస్ హెడ్, పియాజియో ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సాజు నాయర్ అన్నారు. చెన్నై తరువాత, కంపెనీ తమిళనాడులోని ఇతర నగరాలలో ఈవీని విస్తరించాలని చూస్తున్నట్లు నాయర్ తెలిపారు. పియాజియో ఇటీవల కార్గో, ప్యాసింజర్ సెగ్మెంట్లలో ఈవీల ఎఫ్ఎక్స్ రేంజ్(ఫిక్సిడ్ బ్యాటరీ)ని లాంఛ్ చేసింది. ఈ కొత్త ఉత్పత్తులు కొత్త చెన్నై అవుట్ లెట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. "పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాలపై తమిళ నాడు ప్రభుత్వం దృష్టి సారించడంతో, ఈవీ వాహనాలు భవిష్యత్తులో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉండబోతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి & మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందడానికి మా కొత్త ఈవీ విధానం రూపొందించబడింది" అని సుబ్రమణియం తెలిపారు.(చదవండి: జేమ్స్ బాండ్‌కు శ్రీరామరక్ష ఏదో తెలుసా?) -
ఇండియన్ మార్కెట్లో మరో ఎలక్ట్రికల్ వెహికల్
రోజురోజుకు టెక్నాలజీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది.ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ వాహనాల్ని నడుపుతున్న వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల్ని నడిపేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. వారి ఉత్సాహం,వినియోగానికి అనుగుణంగా ఆయా ఆటోమొబైల్ సంస్థలు కొత్త కొత్త మోడళ్లతో, సరికొత్త హంగులతో టెక్నాలజీని జోడించి ఎలక్ట్రిక్ వాహనాల్ని మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఓలా, అథెర్స్లాంటి కంపెనీలు ఇండియన్ ఈవీ మార్కెట్లో సత్తా చాటుతుండగా..ఇటలీకి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం పియాజియో కంపెనీ... పియాజియో వన్,పియాజియో వన్ యాక్ట్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇండియాలో విడుదల చేయనుంది. పియాజియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ ఇండియన్ మార్కెట్లో పియాజియో వన్, పియాజియో వన్ యాక్ట్ రెండు వేరియంట్లలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ వెహికల్స్‌లో సౌకర్యవంతమైన రైడ్‌ను అందించేందుకు ఫ్లాట్‌గా విశాలమైన ఫుట్‌రెస్ట్‌ను అందిస్తున్నట్లు పియాజియో ప్రతినిధులు తెలిపారు.అంతేకాదు అవసరం అనుకున్నప్పుడు వెహికల్ ఎక్కేందుకు అనువుగా ఉండేలా ఫుట్బోర్డ్లను అమర్చింది. వద్దనుకుంటే వాటిని తొలగించుకోవచ్చు. హెల్మెట్ పెట్టుకునేందుకు పెద్ద కంపార్ట్మెంట్తో వచ్చిన సెగ్మెంట్లో ఇదే ఏకైక స్కూటర్ ఇదేనని తెలుస్తోంది. చదవండి: ఫెస్టివల్ ఆఫర్, ఈ బైక్ కొంటే లక్ష వరకు.. ఇక ఈ స్కూటర్ లో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే..ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీని తొలగించుకోవచ్చు. ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీని తొలగించి..ఫుల్ ఛార్జింగ్ ఉన్న మరో బ్యాటరీని తగిలించుకోవచ్చు.ఈ బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టుకునేందుకు ప్రత్యేకమైన సాకెట్లు అవసరం లేదు. ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేందుకు వినియోగించే సాధారణ ప్లగ్లతోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పియాజియో వన్ వేరియంట్ వెహికల్‌కు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 55 కిలోమీటర్లు ప్రయాణించే సౌకర్యం ఉండగా.. పియాజియో వన్ యాక్టీవ్ వెహికల్‌పై 85కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చు. పియాజియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు పియాజియో వన్ 1.2kw (1.6bhp) మోటార్, టాప్ స్పీడ్ 27మైల్ పర్ అవర్(ఎంపీహెచ్) నుంచి 34 మైల్స్ వరకు వెళ్లొచ్చు. ఇక దీని ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 2,54,308.21 లక్షలు ఉండగా, పియాజియో వన్ యాక్టీవ్ వెహికల్ 2.6 బీపీహెచ్ మోటార్, 37 మైల్ పర్ అవర్(ఎంపీహెచ్) నుంచి 41 మైల్స్ వరకు వెళ్లొచ్చు. ఇక దీని ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 3,05,169.86 వరకు ఉంటుందని అంచనా. ఇప్పటికే ఇండియన్ 3వీలర్ ఆటో మార్కెట్ లో ఇప్పటికే ఇటలి లగ్జరీ ఆటోమొబైల్ సంస్థ పియాజియో ఇండియన్ 3వీలర్ ఆటో మార్కెట్ లో 42శాతం మార్కెట్ తో బజాజ్ ఆటో, టీవీఎస్ తరువాత మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇప్పుడు అదే పియాజియో టూవీలర్ మార్కెట్లో సత్తా చాటేందుకు వెస్పా పేరుతో ఇండియన్ మార్కెట్లో స్కూటర్లను విడుదల చేసింది. ఆ స్కూటర్లు వినియోగదారుల్ని ఆకట్టుకోగా.. మరో అడుగు ముందుకేసి ఎలక్ట్రికల్ వెహికల్‌ను విడుదల చేయనుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఇండియన్ మార్కెట్లో..వరల్డ్ ఫేమస్ సూపర్ బైక్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న పియాజియో నూతన సూపర్‌బైక్స్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. వీటిలో అప్రీలియా ఆర్ఎస్ 660, టూవోనో 660, అప్రీలియా ఆర్ఎస్వీ4, టూవోనో వీ4, మోటో గుజ్జి వీ85టీటీ ఉన్నాయి. ధరలు రూ.13.09 లక్షల నుంచి రూ.23.69 లక్షల వరకు ఉంది. మోటోప్లెక్స్ డీలర్షిప్స్ వద్ద ఇవి లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ బైక్స్‌కు మంచి ఫాలోయింగ్ ఉందని కంపెనీ తెలిపింది. ధర 660 సీసీ అప్రీలియా ఆర్ఎస్ 660 రూ.13.39 లక్షలు, టూవోనో 660 రూ.13.09 లక్షలు, 1078 సీసీ ఆర్ఎస్వీ4 రూ.23.69 లక్షలు, 1077 సీసీ టూవోనో వీ4 రూ.20.66 లక్షలు, 850 సీసీ మోటోగుజ్జి వీ85టీటీ రూ.15.4 లక్షలు ఉంది. -
అదరగొడుతున్న పియాజియో స్కూటీలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ వాహన తయారీ దిగ్గజం పియాజియో ఆటోఎక్స్‌పో 2020లో ద్విచక్రవాహనాల లాంచింగ్‌తో సందడి చేసింది. ఇటలీకి చెందిన పియాజియో తన ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్లో ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ను ఆవిష్కరించింది. అలాగే వెస్పా ఎలెట్రికా అనే ఎలక్ట్రిక్ స్కూటీని కూడా ఈ సంస్థ ప్రదర్శించింది. కొత్త ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ -160 బారామతి ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసినట్టు కంపెనీ తెలిపింది. ఇది అక్టోబర్-డిసెంబర్, 2020లో మార్కెట్లోకి వస్తుందని అంచనా. రానున్న ఐదేళ్లలో ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్‌ను అనుసరించాలని కంపెనీ యోచిస్తోంది. స్థానిక వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని భారతదేశంలో వినూత్న ఎలక్ట్రిక్-మొబిలిటీ వాహనాలను లాంచ్ చేయనుంది. పియాజియో ఇండియా సీఎండీ డియెగో గ్రాఫి మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలను తీర్చగల కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం గర్వంగా ఉందన్నారు. ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 బైక్, 160 సీసీ, 125 సీసీ బీఎస్-6 ఇంజన్ ఆప్షన్లలో వస్తుంది. ఎల్ఈడీ హెడ్, టైల్ లైట్స్, యుఎస్బి ఛార్జింగ్ ఉన్న స్ప్లిట్ గ్లోవ్ బాక్స్, డిజిటల్ క్లస్టర్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే క్రోమ్ గార్నిష్ ఎగ్జాస్ట్‌తో పాటు 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ ను జోడించింది. బ్లూ, వైట్, రెడ్, బ్లాక్ అనే నాలుగు వేర్వేరు రంగులలో లభిస్తుంది. ఆన్లైన్ ద్వారా బుకింగ్‌లు ఆగస్టు 2020లో ప్రారంభమవుతాయి. చదవండి : మారుతి విటారా బ్రెజ్జా సరికొత్తగా ఆటో ఎక్స్పో సందడి షురూ: కార్ల జిగేల్.. జిగేల్ -
చిల్లింగ్ వీడియో: అమాంతం ఆటోను ఢీకొట్టింది!
రోడ్డు పక్కన ఓ ఆటో ఆగి ఉంది. అక్కడే ఓ వ్యక్తి చేతితో బాలుడిని పట్టుకొని రోడ్డు దాటాలా? వద్దా? అన్న సంశయంలో ఉన్నాడు. ఇంతలో ర్యాష్‌గా డ్రైవింగ్‌తో దూసుకొచ్చిన ఓ హ్యుండయ్ క్రెటా కారు.. అమాంతం రోడ్డుపక్కన ఉన్న ఆటోను ఢీకొట్టేసింది. ఆ దెబ్బకు ముందుకు దూసుకొచ్చిన ఆటో బాలుడిని బలంగా తగిలిదే. కానీ బాలుడిని చేతిలో పట్టుకున్న వ్యక్తి సమయస్ఫూర్తితో వ్యవహరించి.. క్షణాల్లో బాలుడిని తనవైపు లాక్కోవడంతో.. అతనికి పెద్ద ప్రమాదమే తప్పింది. కానీ కారు వేగంగా ఆటోను ఢీకొంటున్న సమయంలో ఆటో పక్కనుంచి వెళుతున్న వ్యక్తి అమాంతం ఎగిరిపడ్డాడు. ఆ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. కేరళలో జరిగినట్టు భావిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హ్యుండయ్ క్రెటా కంటే పియాజియో ఆటోలో ప్రయాణించడం సురక్షితమని నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేసుకుంటున్నారు. వెనుక నుంచి క్రెటా వచ్చి ఢీకొట్టిన ఆటోకు పెద్ద నష్టం జరగకపోగా.. ఆటోతోపాటు.. చెట్టును కూడా ఢీకొట్టిన క్రెటా వాహనం తీవ్రంగా దెబ్బతినడంతో నెటిజన్లు ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు. -
పియాజియో.. కొత్త వాణిజ్య వాహనం
‘పోర్టర్–700’ విడుదల ∙ధర రూ.3.18 లక్షలు ముంబై: ఇటలీకి చెందిన దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘పియాజియో’ భారత విభాగమైన ‘పియాజియో వెహికల్స్’ తాజాగా కొత్త స్మాల్ కమర్షియల్ వెహికల్ (చిన్నతరహా వాణిజ్య వాహనం) ‘పోర్టర్–700’ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.3.18 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ మహారాష్ట్ర) ఉంది. మెరుగైన ఇంధన సామర్థ్యంతో ఆధునిక టెక్నాలజీతో స్టైలిష్ డిజైన్‌తో ఈ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చామని కంపెనీ పేర్కొంది. పోర్టర్–700 వాహనంపై రెండేళ్లు లేదా 75,000 కిలోమీటర్ల వరకు వారంటీ పొడిగింపు అందిస్తున్నామని తెలిపింది. ఫోర్–వీల్ కార్గో (సరుకు) మార్కెట్లో కార్యకలాపాల విస్తరణకు పోర్టర్–700 ఒక వ్యూహాత్మక అడుగని పియాజియో వెహికల్స్ చైర్మన్ రవి చోప్రా తెలిపారు. కాగా తేలికపాటి/చిన్నతరహా వాణిజ్య వాహన మార్కెట్లో పియాజియో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. -
ఆన్లైన్లో పియాజియో యాక్సెసరీలు
అమెజాన్ ఇండియాతో ఒప్పందం న్యూఢిల్లీ: పియాజియోకు చెందిన అప్రిలియా, వెస్పా బ్రాండ్ స్కూటర్లు ఇక నుంచి ఆన్లైన్లో కూడా లభ్యమవుతాయి. ఈ మేరకు పియోజియో కంపె నీ అమెజాన్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. ఇందులోలో భాగంగా అప్రిలియా, వెస్పా బ్రాండ్ల షర్ట్లు, టీ–షర్ట్లు, జాకెట్స్, ఐపాడ్ స్లీవ్స్, ఫోన్ బ్యాక్ కవర్స్, హెల్మెట్స్ అమెజాన్ ఇండియా నుంచి వినియోగదారులు కొనుగోలు చేయవచ్చని పియాజియో వెహికల్స్ ఎండీ, సీఈఓ స్టెఫానో పేర్కొన్నారు. అమెజాన్‌డాట్‌ఇన్‌లో ఆటోమోటివ్ కేటగిరీ వస్తువుల విభాగం వేగంగా వృద్ధి చెందుతోందని అమెజాన్ ఇండియా ఆటోమోటివ్ కేటగిరీ లీడర్సుచిత్ సుభాశ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ కేటగిరిలో మరిన్ని ఉత్తమమైన వస్తువులను వినియోగదారులకు అందించడానికి మరిన్ని ఒప్పందాలను కుదుర్చుకుంటామని తెలియజేశారు. -
ఈ స్కూటర్ ధర.. రూ. 12 లక్షలు!
-
ఈ స్కూటర్ ధర.. రూ. 12 లక్షలు!
ఒకప్పుడు భారతదేశంలో స్కూటర్ అంటే.. బజాజ్ చేతక్ మాత్రమే. ఆ తర్వాత ఎల్ఎంఎల్ వెస్పా వచ్చింది. అప్పట్లో అదో సంచలనం. మంచి లుక్‌తో, డిఫరెంట్ స్టైలుతో ఉన్న ఆ స్కూటర్‌ను బాగానే ఆదరించారు. కొన్నాళ్ల పాటు వినిపించని వెస్పా పేరు ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చింది. వెస్పా 946 ఎంపోరియో అర్మానీ పేరుతో ఇప్పుడు విడుదల చేసిన ఈ స్కూటర్ ధర.. ఏకంగా రూ. 12 లక్షల పైమాటే. దానికి మళ్లీ పన్నులు అదనం. జార్జియో అర్మానీ 40వ వార్షికోత్సవం, పియాజియో గ్రూపు 130వ వ్యవస్థాపక దినం సందర్భంగా గత సంవత్సరం ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ప్రీమియం మోడల్‌తో పాటు, వెస్పా 70వ వార్షికోత్సవ ఎడిషన్‌ను కూడా రూ. 96,500 ధరతో విడుదల చేసింది. దేశంలో ఇది రెండో అత్యంత ఖరీదైన స్కూటర్‌గా నిలుస్తుంది. ఏప్రియాలా ఎస్ఆర్వి 850 ఏబీఎస్ అనేది ఇప్పటివరకు దేశంలో అత్యంత ఖరీదైన స్కూటర్. దాని ధర రూ. 14.39 లక్షలు. ఇప్పుడు విడుదల చేసిన వెస్పా ప్రీమియం స్కూటర్ లుక్ కూడా చాలా విభిన్నంగా ఉంది. ఇప్పటికే ఈ స్కూటర్‌కు భారతదేశం నుంచి రెండు ఆర్డర్లు వచ్చాయి. స్కూటర్ల టెక్నాలజీలో దీనిది అత్యంత ఆధునికమైనదని చెబుతున్నారు. హెడ్‌లైట్ పైన గద్ద లోగో ఉంటుంది. హెడ్ ల్యాంప్, టైల్ లైట్, ఇండికేటర్లు అన్నీ ఎల్ఈడీవే. దీనికి 125 సీసీ సింగిల్ సిలిఒడర్ ఇంజన్ ఉంటుంది. 11.7 బీహెచ్పీ పవర్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటాయి. అంటే గేర్లను మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. 220 ఎంఎం డబుల్ డిస్క్ బ్రేకులు, డ్యూయల్ చానల్ ఏబీఎస్ మరియు ఏఎస్ఆర్ నియంత్రణలు ఉంటాయి. వెస్పా డీలర్లతో పాటు పియాజియో మోటోప్లెక్స్ షోరూంలలో కూడా ఇవి లభ్యమవుతాయి. ఇవి లిమిడెట్ ఎడిషన్.. అంటే కొన్ని మాత్రమే తయారుచేస్తారు. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. -
వెస్పా స్కూటర్ @12 లక్షలు!
భారత్‌లో వెస్పా 946 ఎంపోరియో అర్మానీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం ఇటలీకి చెందిన పియాజియో ‘వెస్పా 946 ఎంపోరియో అర్మానీ’ స్కూటర్‌ను భారత్‌లో మంగళవారం విడుదల చేసింది. పుణే ఎక్స్‌షోరూంలో దీని ధర రూ.12.04 లక్షలు. దేశంలో అప్రీలియా ఎస్ఆర్ఎస్ 850 ఏబీఎస్ తర్వాత అత్యంత ఖరీదైన స్కూటర్ ఇదే. వెస్పా బ్రాండ్‌లో సైతం ఇదే ప్రీమియం మోడల్. తొలిసారిగా 2011 మిలన్ మోటార్షోలో దర్శనమిచ్చిన వెస్పా 946 ప్రపంచవ్యాప్తంగా వాహన ప్రియులను ఆకట్టుకుంది. ఇక 70వ వార్షికోత్సవం సందర్భంగా పియాజియో ఇండియా కొత్త ఎడిషన్ వెస్పా స్కూటర్‌ను రూ.96,500 ధరలో ప్రవేశపెట్టింది. ఈ మోడల్లో 500 యూనిట్లనే భారత్‌లో విక్రరుుంచనున్నారు. ఇదీ 946 ప్రత్యేకత..: విభిన్న హ్యాండిల్‌బార్, పైకి తేలినట్టుండే విశాలమైన సీటు ఇటాలియన్ దర్పం ఉట్టిపడేలా ఉంటుంది. 4స్ట్రోక్ 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఇందులో పొందుపరిచారు. ఎలక్ట్రానిక్ ఇంజెక్షన్, 3వాల్వ్ డిస్ట్రిబ్యూషన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎల్ఈడీ లైట్లు, డబుల్ డిస్క్ బ్రేక్స్, 12 అంగుళాల చక్రాలు ఇతర ఫీచర్లు. యాంటీ బ్రేకింగ్ సిస్టమ్తోపాటు వాహనం జారిపోకుండా నియంత్రించే వ్యవస్థా ఇందులో ఉంది. లెదర్ హ్యాండిల్ గ్రిప్స్‌ను కుట్టడం మొదలు తుది పాలిష్ వరకు చేతితో చేసిందే. -
పియాజియో నుంచి ‘అప్రీలియా ఎస్ఆర్ 150’ స్కూటర్
ధర రూ.65,000 ముంబై: వెస్పా స్కూటర్లను తయారు చేసే ఇటలీకి చెందిన టూవీలర్ కంపెనీ ‘పియాజియో’ తాజాగా ‘అప్రీలియా ఎస్ఆర్ 150’ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చే సింది. దీని ప్రారంభ ధర రూ.65,000గా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఇందులో సింగిల్ సిలిండర్ 150 సీసీ ఇంజిన్‌ను అమర్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పియాజియో షోరూమ్‌లలో ఈ స్కూటర్లు అందుబాటులో ఉంటాయి. -
70వ వసంతంలో స్కూటర్ ప్రియుల ఐకానిక్
టూవీలర్ పరిశ్రమలో ఐకానిక్ బ్రాండ్ గా నిలిచిన ఇటాలియన్ స్కూటర్ బ్రాండ్ వెస్పా ను స్కూటర్ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత ద్విచక్ర వాహన మార్కెట్లో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టిన ఈ ఇటాలియన్ బ్రాండ్ తన 70వ వసంతాన్ని ఘనంగా జరుపుకుంది. దీన్ని పురస్కరించుకుని కొత్త వెస్పా సెట్టాన్ టెసిమో లిమిటెడ్ వెర్షన్ ప్రిమ అవెరా 50, ప్రిమ అవెరా 150, జీటీఎస్ 300 మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రైల్వే క్యారేజీలు, లోకోమోటివ్ తయారీదారుగా ప్రపంచం ముందుకు వచ్చిన వెస్పా పేరెంట్ కంపెనీ ఫియాజ్జియో , రెండో ప్రపంచ యుద్ధం అనంతరం వెస్పా బ్రాండుకు శ్రీకారం చుట్టింది. కేవలం రెండు లాభాలతో వెస్పా బ్రాండ్ ను 1946 నుంచి తయారీ చేయడం ప్రారంభించింది. ఒకటి చౌకైన రవాణాకు, రెండు ఉద్యోగులు, యంత్రాలు ఎల్లప్పుడూ పనిచేసేలా ఉంచడం కోసం ఈ స్కూటర్ ను తయారీని ఫియాజ్జియా చేపట్టింది. ఏప్రిల్ 26, 1946లో కంపెనీ వ్యవస్థాపకులు ఎన్రికో పియాజ్జియో ఇటాలియన్ సెంట్రల్ పేటెంట్ ఆఫీస్‌లో విభిన్న మోటార్‌సైకిల్ మోడళ్లను తయారు చేసేందుకు తన పేటెంట్‌ను ఫైల్ చేశారు. ఫియోజ్జియో ఇంజనీర్లు అప్పుడే కొత్తగా ఏమీ స్కూటర్ ను కనుగొనలేదు. కానీ దాన్ని ఐకానిక్ బ్రాండ్ గా రూపొందించడానికి మాత్రం అహర్నిశలు కృషిచేశారు. నాటి నుంచి నేటి వరకూ అనేక రకాల వెస్పా స్కూటర్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. పియాజ్జియో మొట్టమొదటిగా 'వెస్పా ఎమ్‌పి6' ప్రోటోటైప్‌ను సృష్టించారు. ఈ ప్రోటోటైప్ విభిన్న వెస్పా స్కూటర్లకు పునాదిగా నిలిచింది. 1953 వరకూ తన ఉనికి చాటుకోవడానికి వెస్పా ఎంతలా ప్రయత్నించిందంటే చెప్పలేం. కానీ ఒక్కసారిగా రాత్రికి రాత్రే 1953లో విలియం వైలర్ చిత్రం 'రోమన్ హాలిడే' తో వెస్సా బ్రాండ్ సంచలనాన్ని సృష్టించింది. ఒక్క గంట 59 నిమిషాల వరకూ సాగే ఆ చిత్రంలో, హీరో హీరోయిన్లు గ్రెగరి పెక్, ఆడ్రీ హెప్బర్న్ లు వెస్పా 125 స్కూటర్ పైనే కనిపిస్తారు. దీంతో ఈ స్కూటర్ కు ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. ఆ ఏడాది వెస్పా అమ్మకాలు లక్ష మార్కును టచ్ చేసి రికార్డు సృష్టించాయి. ఈ హిట్ తో ఫియోజ్జియో ఈ స్కూటర్లను వివిధ మోడల్స్ లో, స్టైలిస్ డిజైన్ రీ బ్రాండ్ చేయడం ప్రారంభించింది. ఇప్పటికీ ఓ స్పెషల్ బ్రాండ్ గానే వెస్పా మార్కెట్లో నిలుస్తోంది. సెయింట్ ట్రోపెజ్ లో జరిగిన ఈ నెల మొదట్లో జరిగిన వెస్పా వరల్డ్ డేస్ ప్రోగ్రామ్ లో..10వేలకు పైగా వెస్పిస్టిలను గ్యాలరీగా ప్రదర్శించింది. 1960లో ప్రాంతంలో వెస్పా స్కూటర్ల ఇండియాలోకి ప్రవేశించాయి. దేశీయ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో ఇటలీకు చెందిన పియాజ్జియో నుంచి లైసెన్సు పొంది, భారత్‌లో స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. అయితే, పియాజ్జియోతో బజాజ్ ఆటో ఈ కాంట్రాక్ట్‌ను 1971లో రెన్యువల్ చేసుకోలేదు. దీంతో 1983లో వెస్పా స్వతహాగా ఇండియాలోకి ప్రవేశించి ఎల్ఎమ్ఎల్, పి-సిరీస్ స్కూటర్ల విక్రయాన్ని ప్రారంభించింది. కానీ 1999లో ఎల్ఎమ్ఎల్, వెస్పాల భాగస్వామ్యం ముగిసిపోయింది. ప్రస్తుతం తన స్కూటర్లు మాత్రమే భారత్ లో విక్రయిస్తోంది. త్వరలోనే వెస్పా 300 జీటీఎస్ ను, వెస్పా 946 లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు ఫియాజ్జియో సిద్ధమైంది. -
పియాజియో స్కూటర్ ‘కొత్త వెస్పా ఎస్’