రోజురోజుకు టెక్నాలజీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది.ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ వాహనాల్ని నడుపుతున్న వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల్ని నడిపేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. వారి ఉత్సాహం,వినియోగానికి అనుగుణంగా ఆయా ఆటోమొబైల్ సంస్థలు కొత్త కొత్త మోడళ్లతో, సరికొత్త హంగులతో టెక్నాలజీని జోడించి ఎలక్ట్రిక్ వాహనాల్ని మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఓలా, అథెర్స్‌లాంటి కంపెనీలు ఇండియన్ ఈవీ మార్కెట్‌లో సత్తా చాటుతుండగా..ఇటలీకి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం పియాజియో కంపెనీ... పియాజియో వన్,పియాజియో వన్ యాక్ట్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇండియాలో విడుదల చేయనుంది.
పియాజియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్
ఇండియన్ మార్కెట్‌లో పియాజియో వన్, పియాజియో వన్ యాక్ట్ రెండు వేరియంట్లలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ వెహికల్స్‌లో సౌకర్యవంతమైన రైడ్‌ను అందించేందుకు ఫ్లాట్‌గా విశాలమైన ఫుట్‌రెస్ట్‌ను అందిస్తున్నట్లు పియాజియో ప్రతినిధులు తెలిపారు.అంతేకాదు అవసరం అనుకున్నప్పుడు వెహికల్ ఎక్కేందుకు అనువుగా ఉండేలా ఫుట్‌బోర్డ్‌లను అమర్చింది. వద్దనుకుంటే వాటిని తొలగించుకోవచ్చు. హెల్మెట్ పెట్టుకునేందుకు పెద్ద కంపార్ట్‌మెంట్‌తో వచ్చిన సెగ్మెంట్‌లో ఇదే ఏకైక స్కూటర్ ఇదేనని తెలుస్తోంది.
చదవండి: ఫెస్టివల్ ఆఫర్, ఈ బైక్ కొంటే లక్ష వరకు..
ఇక ఈ స్కూటర్ లో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే..ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీని తొలగించుకోవచ్చు. ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీని తొలగించి..ఫుల్ ఛార్జింగ్ ఉన్న మరో బ్యాటరీని తగిలించుకోవచ్చు.ఈ బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టుకునేందుకు ప్రత్యేకమైన సాకెట్‌లు అవసరం లేదు. ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేందుకు వినియోగించే సాధారణ ప్లగ్‌లతోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పియాజియో వన్ వేరియంట్ వెహికల్‌కు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 55 కిలోమీటర్లు ప్రయాణించే సౌకర్యం ఉండగా.. పియాజియో వన్ యాక్టీవ్ వెహికల్‌పై 85కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చు.
పియాజియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు
పియాజియో వన్ 1.2kw (1.6bhp) మోటార్, టాప్ స్పీడ్ 27మైల్ పర్ అవర్(ఎంపీహెచ్) నుంచి 34 మైల్స్ వరకు వెళ్లొచ్చు. ఇక దీని ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 2,54,308.21 లక్షలు ఉండగా, పియాజియో వన్ యాక్టీవ్ వెహికల్ 2.6 బీపీహెచ్ మోటార్, 37 మైల్ పర్ అవర్(ఎంపీహెచ్) నుంచి 41 మైల్స్ వరకు వెళ్లొచ్చు. ఇక దీని ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 3,05,169.86 వరకు ఉంటుందని అంచనా.
ఇప్పటికే ఇండియన్ 3వీలర్ ఆటో మార్కెట్ లో
ఇప్పటికే ఇటలి లగ్జరీ ఆటోమొబైల్ సంస్థ పియాజియో ఇండియన్ 3వీలర్ ఆటో మార్కెట్ లో 42శాతం మార్కెట్ తో బజాజ్ ఆటో, టీవీఎస్ తరువాత మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇప్పుడు అదే పియాజియో టూవీలర్ మార్కెట్‌లో సత్తా చాటేందుకు వెస్పా పేరుతో ఇండియన్ మార్కెట్‌లో స్కూటర్లను విడుదల చేసింది. ఆ స్కూటర్లు వినియోగదారుల్ని ఆకట్టుకోగా.. మరో అడుగు ముందుకేసి ఎలక్ట్రికల్ వెహికల్‌ను విడుదల చేయనుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment