Piaggio India
-
అప్రీలియా ఎస్ఆర్ స్టార్మ్ 125కొత్త బైక్: ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!
Aprilia SR Storm 125 వాహన తయారీలో ఉన్న పియాజియో వెహికిల్స్ తాజాగా అప్రీలియా ఎస్ఆర్ స్టార్మ్ 125 స్కూటర్ ప్రవేశపెట్టింది. నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది.స్పోర్టీ స్టైలింగ్‌తో ఆకర్షణీయంగా ఉంది. ఇంజీన్ 125 సీసీ 3-వాల్వ్ 4-స్ట్రోక్ ఐ-గెట్ ఇంజన్ పొందుపరిచారు. గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని 9.6 సెకన్లలో అందుకుంటుంది. డిస్క్ బ్రేక్స్‌తో 12 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్స్, సెమీ డిజిటల్ క్లస్టర్, గ్రాఫిక్స్‌తో ట్యూబ్యులార్ స్టీల్ ఫ్రేమ్ వంటి హంగులు ఉన్నాయి. పరిచయ ఆఫర్ ధర ఎక్స్‌షోరూంలో రూ.1,07,999 ఉంది. -
అప్రీలియా ఎస్ఆర్ కొత్త వెర్షన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న పియాజియో ఇండియా అప్రీలియా ఎస్ఆర్ 125, ఎస్ఆర్ 160 స్కూటర్స్ కొత్త వర్షన్స్ విడుదల చేసింది. పుణే ఎక్స్‌షోరూంలో ఎస్ఆర్ 160 ధర రూ.1.17 లక్షలు, ఎస్ఆర్ 125 ధర రూ.1.07 లక్షలు ఉంది. ఫీచర్స్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్, సింగిల్ చానెల్ ఏబీఎస్‌తో డిస్క్, డ్రమ్ బేక్స్, డ్యూయల్ సీట్స్, నకిల్ గార్డ్స్, అలాయ్ వీల్స్, వి–షేప్డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎక్స్–షేప్డ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్ పొందుపరిచారు. ఎస్ఆర్ 160 స్కూటర్ 160 సీసీ 3వీ టెక్ ఈఎఫ్ఐ ఎయిర్‌కూల్డ్ ఇంజన్‌తో తయారైంది. -
మార్కెట్లోకి రెండు శక్తివంతమైన స్కూటర్లు లాంఛ్ చేసిన పియాజియో
ప్రముఖ వాహన తయారీ సంస్థ పియాజియో ఇండియా భారత్‌లో అప్ డేట్ చేసిన అప్రిలియా న్యూ ఎస్ఆర్ 160, ఎస్ఆర్ 125 స్కూటర్లను లాంఛ్ చేసింది. న్యూ ఎస్ఆర్ 160 మోడల్ ధర ₹.1,17,494(ఎక్స్ షోరూమ్ పూణే)గా ఉంటే, ఎస్ఆర్ 125 మోడల్ ధర ₹1,07,595(ఎక్స్ షోరూమ్ పూణే)గా ఉంది. డిజైన్ సహా పలు ఫీచర్లను అప్డేట్ చేయడంతో పాటు నూతన శ్రేణి వాహనాలు బీఎస్6 ప్రమాణాలతో కస్టమర్ల ముందుకు వచ్చాయి. రూ 5000 టోకెన్ అమౌంట్‌తో న్యూ ఎస్ఆర్ రేంజ్ బైక్‌లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. కొత్త ఎస్ఆర్ 160 రేంజ్ వైట్, బ్లూ, గ్రే, రెడ్, మాట్ బ్లాక్ రంగులలో లభ్యం కానుంది. అప్రిలియా ఎస్ఆర్ 160 కొత్త హెడ్ ల్యాంప్, కొత్త ఎల్ఈడి హెడ్ లైట్ తో వస్తుంది. ఎస్ఆర్ 160 స్కూటర్లో ఎబిఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), 160 సీసీ 3వీ టెక్ ఎఫ్ఐ, హైటెక్, హై-పెర్ఫార్మెన్స్ ఇంజిన్ తో వస్తుంది. ఇందులో 160 సీసీ ఎయిర్ కూల్డ్ త్రీ వాల్వ్ ఇంజిన్ సహాయం చేత పనిచేస్తుంది. ఇది 7600 ఆర్ పిఎమ్ వద్ద 10.84 బిహెచ్ పఈ పవర్, 6000 ఆర్ పిఎమ్ వద్ద 11.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. (చదవండి: భారీగా పడిపోయిన బిట్‌కాయిన్ ధర) -
చెన్నైలో పియాజియో తొలి ఎలక్ట్రిక్ వాహన అవుట్ లెట్
చెన్నై: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నైలో తన మొదటి ఎలక్ట్రిక్ వాహన అవుట్ లెట్ ఏర్పాటు చేసింది. తమిళనాడు వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎం.ఎ.సుబ్రమణియం ఈ ఎక్స్ పీరియన్స్ సెంటర్(ఈవీ షోరూమ్) ప్రారంభించారు. పియాజియో ఎలక్ట్రిక్ వాహనాలను ఈ ఈవీ షోరూమ్ లో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు అని అన్నారు."చెన్నైలో తమిళనాడులో మా మొదటి ఈవీ ప్రత్యేక షోరూమ్ ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది. చెన్నై ఒక పెద్ద మెట్రో & ప్రధాన వ్యాపారలకు కేంద్రంగా ఉంది" అని ఈవీపీ, కమర్షియల్ వేహికల్ బిజినెస్ హెడ్, పియాజియో ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సాజు నాయర్ అన్నారు. చెన్నై తరువాత, కంపెనీ తమిళనాడులోని ఇతర నగరాలలో ఈవీని విస్తరించాలని చూస్తున్నట్లు నాయర్ తెలిపారు. పియాజియో ఇటీవల కార్గో, ప్యాసింజర్ సెగ్మెంట్లలో ఈవీల ఎఫ్ఎక్స్ రేంజ్(ఫిక్సిడ్ బ్యాటరీ)ని లాంఛ్ చేసింది. ఈ కొత్త ఉత్పత్తులు కొత్త చెన్నై అవుట్ లెట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. "పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాలపై తమిళ నాడు ప్రభుత్వం దృష్టి సారించడంతో, ఈవీ వాహనాలు భవిష్యత్తులో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉండబోతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి & మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందడానికి మా కొత్త ఈవీ విధానం రూపొందించబడింది" అని సుబ్రమణియం తెలిపారు.(చదవండి: జేమ్స్ బాండ్‌కు శ్రీరామరక్ష ఏదో తెలుసా?) -
ఇండియన్ మార్కెట్లో మరో ఎలక్ట్రికల్ వెహికల్
రోజురోజుకు టెక్నాలజీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది.ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ వాహనాల్ని నడుపుతున్న వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల్ని నడిపేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. వారి ఉత్సాహం,వినియోగానికి అనుగుణంగా ఆయా ఆటోమొబైల్ సంస్థలు కొత్త కొత్త మోడళ్లతో, సరికొత్త హంగులతో టెక్నాలజీని జోడించి ఎలక్ట్రిక్ వాహనాల్ని మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఓలా, అథెర్స్లాంటి కంపెనీలు ఇండియన్ ఈవీ మార్కెట్లో సత్తా చాటుతుండగా..ఇటలీకి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం పియాజియో కంపెనీ... పియాజియో వన్,పియాజియో వన్ యాక్ట్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇండియాలో విడుదల చేయనుంది. పియాజియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ ఇండియన్ మార్కెట్లో పియాజియో వన్, పియాజియో వన్ యాక్ట్ రెండు వేరియంట్లలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ వెహికల్స్‌లో సౌకర్యవంతమైన రైడ్‌ను అందించేందుకు ఫ్లాట్‌గా విశాలమైన ఫుట్‌రెస్ట్‌ను అందిస్తున్నట్లు పియాజియో ప్రతినిధులు తెలిపారు.అంతేకాదు అవసరం అనుకున్నప్పుడు వెహికల్ ఎక్కేందుకు అనువుగా ఉండేలా ఫుట్బోర్డ్లను అమర్చింది. వద్దనుకుంటే వాటిని తొలగించుకోవచ్చు. హెల్మెట్ పెట్టుకునేందుకు పెద్ద కంపార్ట్మెంట్తో వచ్చిన సెగ్మెంట్లో ఇదే ఏకైక స్కూటర్ ఇదేనని తెలుస్తోంది. చదవండి: ఫెస్టివల్ ఆఫర్, ఈ బైక్ కొంటే లక్ష వరకు.. ఇక ఈ స్కూటర్ లో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే..ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీని తొలగించుకోవచ్చు. ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీని తొలగించి..ఫుల్ ఛార్జింగ్ ఉన్న మరో బ్యాటరీని తగిలించుకోవచ్చు.ఈ బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టుకునేందుకు ప్రత్యేకమైన సాకెట్లు అవసరం లేదు. ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేందుకు వినియోగించే సాధారణ ప్లగ్లతోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పియాజియో వన్ వేరియంట్ వెహికల్‌కు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 55 కిలోమీటర్లు ప్రయాణించే సౌకర్యం ఉండగా.. పియాజియో వన్ యాక్టీవ్ వెహికల్‌పై 85కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చు. పియాజియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు పియాజియో వన్ 1.2kw (1.6bhp) మోటార్, టాప్ స్పీడ్ 27మైల్ పర్ అవర్(ఎంపీహెచ్) నుంచి 34 మైల్స్ వరకు వెళ్లొచ్చు. ఇక దీని ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 2,54,308.21 లక్షలు ఉండగా, పియాజియో వన్ యాక్టీవ్ వెహికల్ 2.6 బీపీహెచ్ మోటార్, 37 మైల్ పర్ అవర్(ఎంపీహెచ్) నుంచి 41 మైల్స్ వరకు వెళ్లొచ్చు. ఇక దీని ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 3,05,169.86 వరకు ఉంటుందని అంచనా. ఇప్పటికే ఇండియన్ 3వీలర్ ఆటో మార్కెట్ లో ఇప్పటికే ఇటలి లగ్జరీ ఆటోమొబైల్ సంస్థ పియాజియో ఇండియన్ 3వీలర్ ఆటో మార్కెట్ లో 42శాతం మార్కెట్ తో బజాజ్ ఆటో, టీవీఎస్ తరువాత మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇప్పుడు అదే పియాజియో టూవీలర్ మార్కెట్లో సత్తా చాటేందుకు వెస్పా పేరుతో ఇండియన్ మార్కెట్లో స్కూటర్లను విడుదల చేసింది. ఆ స్కూటర్లు వినియోగదారుల్ని ఆకట్టుకోగా.. మరో అడుగు ముందుకేసి ఎలక్ట్రికల్ వెహికల్‌ను విడుదల చేయనుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఇండియన్ మార్కెట్లో..వరల్డ్ ఫేమస్ సూపర్ బైక్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న పియాజియో నూతన సూపర్‌బైక్స్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. వీటిలో అప్రీలియా ఆర్ఎస్ 660, టూవోనో 660, అప్రీలియా ఆర్ఎస్వీ4, టూవోనో వీ4, మోటో గుజ్జి వీ85టీటీ ఉన్నాయి. ధరలు రూ.13.09 లక్షల నుంచి రూ.23.69 లక్షల వరకు ఉంది. మోటోప్లెక్స్ డీలర్షిప్స్ వద్ద ఇవి లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ బైక్స్‌కు మంచి ఫాలోయింగ్ ఉందని కంపెనీ తెలిపింది. ధర 660 సీసీ అప్రీలియా ఆర్ఎస్ 660 రూ.13.39 లక్షలు, టూవోనో 660 రూ.13.09 లక్షలు, 1078 సీసీ ఆర్ఎస్వీ4 రూ.23.69 లక్షలు, 1077 సీసీ టూవోనో వీ4 రూ.20.66 లక్షలు, 850 సీసీ మోటోగుజ్జి వీ85టీటీ రూ.15.4 లక్షలు ఉంది. -
భారత మార్కెట్లో విడుదలైన వెస్పా 75వ ఎడిషన్ స్కూటర్
ప్రముఖ ఇటాలియన్ వాహన సంస్థ పియాజియో భారతీయ మార్కెట్లోకి వెస్పా 75వ ఎడిషన్ 125 సీసీ, 150 సీసీ స్కూటర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిని ₹1.26 లక్షలు (125 సీసీ, ఎక్స్ షోరూమ్ పూణే), ₹1.39 లక్షల(150 సీసీ, ఎక్స్ షోరూమ్ పూణే)కు విడుదల చేసింది. ఈ రెండు స్కూటర్లు కంపెనీ పోర్టల్, డీలర్స్ వద్ద బుకింగ్స్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్ల సైడ్ ప్యానెల్స్ పై '75' డెకాల్స్ అనే ప్రత్యేక నంబర్ ఉంటుంది.(చదవండి: తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్...!) ఈ స్కూటర్లలో ఒరిజినల్ ఫీచర్లు, మెకానికల్ టెక్ స్పెసిఫికేషన్ లను కలిగి ఉంటాయి. చిన్న 125సీసీ మోడల్ 7,500 ఆర్ పీఎమ్ వద్ద 9.93హెచ్ పీ పవర్, 5,500ఆర్ పీఎమ్ వద్ద 9.6ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 150 సీసీ సామర్థ్యం గల స్కూటర్ 7,600 ఆర్ పీఎమ్ వద్ద 10.4 హెచ్ పీ పవర్, 5,500 ఆర్ పీఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వీటిలో ముందు వైపున 200మిమి డిస్క్, వెనుక వైపున 140మిమి డ్రమ్ బ్రేక్స్ తో వస్తాయి. 125 సీసీ మోడల్ లో సీబిఎస్ సిస్టమ్ వస్తుంది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 190 నగరాల్లో వెస్పా ఉనికిని కలిగి ఉంది. అయితే డీలర్‌షిప్‌లు త్వరలో 300 నగరాలకు విస్తరించడానికి కంపెనీ యోచిస్తోంది.(చదవండి: Wikipedia:హ్యాక్..! లిస్ట్‌లో టాప్ సెలబ్రిటీలు..!) -
ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 బుకింగ్ షురూ
న్యూఢిల్లీ, సాక్షి: మ్యాక్సి స్కూటర్.. ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160కు బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు పియాజియో ఇండియా తాజాగా పేర్కొంది. విడుదలకు ముందు (ప్రీలాంచ్) బుకింగ్‌కు తెరతీసినట్లు తెలియజేసింది. రూ. 5,000 చెల్లించడం ద్వారా స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ప్రీమియం స్కూటర్‌ను ప్రస్తుతం బారామతి ప్లాంటులో తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. బీఎస్-6 ప్రమాణాలతోపాటు.. లెడ్ స్ప్లిట్ హెడ్లైట్లు, మొబైల్ కనెక్టివిటీ, సర్దుబాటుకు వీలయ్యే వెనుక సస్పెన్షన్, డిస్క్ బ్రేకులు తదితర ఫీచర్స్‌ను పొందుపరచినట్లు పియాజియో ఇండియా ఒక ప్రకటనలో వివరించింది. కంపెనీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో లేదా డీలర్ల ద్వారా దేశవ్యాప్తంగా బుకింగ్స్‌కు వీలున్నట్లు తెలియజేసింది. (హెల్మెట్ వాయిస్ కమాండ్స్‌తో ఇక బైకులు!) సవాళ్లున్నప్పటికీ 2020లో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ దేశీయంగా ప్రీమియం స్కూటర్ ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ఉత్పత్తిని చేపట్టగలిగినట్లు పియాజియో ఇండియా చైర్మన్ డీగో గ్రాఫీ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. ఆధునిక ఫీచర్లు, తరువాతి తరం డిజైన్‌తో రానున్న ప్రీమియం స్కూటర్ వినియోగదారులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది(2020) ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారి క్యాండీ రెడ్ కలర్లో మ్యాక్సి స్కూటర్‌ను పియాజియో ప్రదర్శించింది. దేశీయంగా జపనీస్ దిగ్గజం సుజుకీ తయారీ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 వాహనానికి ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ ప్రత్యక్ష 160 పోటీనివ్వగలదని ఆటో రంగ నిపుణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. (కొత్త ఏడాదిలో ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ) ఎల్సీడీ క్లస్టర్ దేశీ మార్కెట్‌కు అనుగుణంగా ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160ను పియాజియో ఇటలీలో రూపొందించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. మూడు వాల్వ్‌ల ఫ్యూయల్ ఇంజక్ట్‌డ్ మోటార్‌తో కూడిన 160 సీసీ ఇంజిన్‌ను ఆధునీకరించి మ్యాక్సీ స్కూటర్లో వినియోగించినట్లు ఆటో రంగ నిపుణులు తెలియజేశారు. ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, డిస్క్ బ్రేకులు తదితర ఫీచర్స్‌తో స్కూటర్ వెలువడనున్నట్లు చెబుతున్నారు. ట్విన్ క్రిస్టల్ హెడ్‌లైట్స్, 3 కోట్ హెచ్డీ బాడీ పెయింట్ ఫినిష్‌తో రూపొందుతున్నట్లు వివరించారు. ఎప్రిలియా ప్రీమియం స్కూటర్.. గ్లాసీ రెడ్, మ్యాట్ బ్లూ, గ్లాసీ వైట్ అండ్ మ్యాట్ బ్లాక్ కలర్స్‌లో లభ్యంకానున్నట్లు తెలియజేశారు. ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.10-1.2 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. -
కొత్త ఏడాదిలో ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160
ముంబై, సాక్షి: మ్యాక్సి స్కూటర్.. ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160ను వచ్చే ఏడాది(2021) తొలినాళ్లలో విడుదల చేసేందుకు పియాజియో ఇండియా ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది. ఇటాలియన్ కంపెనీ దేశీయంగా విడుదల చేయనున్న ఈ ప్రధాన వాహనాన్ని రెండు ప్రత్యేక కలర్స్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. కంపెనీ బారామతిలో్ ఏర్పాటు చేసిన ప్లాంటులో మ్యాక్సి స్కూటర్ తయారీకి సన్నాహాలు చేసినట్లు పియాజియో ఇటీవల తెలియజేసింది. ఈ ఏడాది(2020) ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారి క్యాండీ రెడ్ కలర్లో మ్యాక్సి స్కూటర్‌ను పియాజియో ప్రదర్శించింది. తాజాగా బ్లూకలర్‌పైనా కంపెనీ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. దేశీయంగా జపనీస్ దిగ్గజం సుజుకీ తయారీ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 వాహనానికి ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ ప్రత్యక్ష 160 పోటీనివ్వగలదని ఆటో రంగ నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి: (కార్లయిల్ చేతికి గ్రాన్సూల్స్ ఇండియా!) ఎల్సీడీ క్లస్టర్ దేశీ మార్కెట్‌కు అనుగుణంగా ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160ను పియాజియో ఇటలీలో రూపొందించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. తద్వారా ఈ విభాగంలో విలువైన బ్రాండ్లకు డిమాండ్ ఉన్నట్లు చెబుతున్నాయి. మూడు వాల్వ్‌ల ఫ్యూయల్ ఇంజక్ట్‌డ్ మోటార్‌తో కూడిన 160 సీసీ ఇంజిన్‌ను ఆధునీకరించి మ్యాక్సీ స్కూటర్లో వినియోగించినట్లు ఆటో రంగ నిపుణులు తెలియజేశారు. ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, డిస్క్ బ్రేకులు తదితర ఫీచర్స్‌తో స్కూటర్ వెలువడనున్నట్లు చెబుతున్నారు. ట్విన్ క్రిస్టల్ హెడ్‌లైట్స్, 3 కోట్ హెచ్డీ బాడీ పెయింట్ ఫినిష్‌తో రూపొందుతున్నట్లు వివరించారు. అధికారిక సమాచారం లేకున్నప్పటికీ బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా రూపొందిన ఎప్రిలియా స్కూటర్ ఖరీదు రూ. 1.1-1.2 లక్షల స్థాయిలో ఉండొచ్చని ఆటో వర్గాల అంచనా. -
సరికొత్త స్కూటర్ వెస్పా అర్బన్ క్లబ్
సాక్షి, న్యూఢిల్లీ: పియాజియో ఇండియా మార్కెట్లోకి సరికొత్త స్కూటర్‌ను లాంచ్ చేసింది. 125సీసీ ఇంజిన్ సామర్థ్యంతో వెస్పా అర్బన్ క్లబ్ పేరుతో ఆవిష్కరించింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.73,733 ( ఎక్స్‌షోరూమ్,ఢిల్లీ)గా నిర్ణయించింది. ఈ కొత్త వేరియంట్ అజౌరో ప్రొవెన్జా, మాజ్గ్రే, గ్లూసీ ఎల్లో, గ్లూసీ రెడ్, గ్లూసీ బ్లాక్ రంగుల్లో లభిస్తోంది. ఫీచర్లు : 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజీన్, 9.5 బీహెచ్పీ, 6250ఆర్పీఎం వద్ద 9.9 గరిష్ట టార్క్‌ను అందిస్తోంది. ఇంకా గ్రాబ్ రెయిల్, బ్రేక్ లివర్, వీల్స్‌లో మార్పులు చేసింది. 10 అంగుళాల నలుపు రంగు అలాయ్ వీల్స్, డ్రమ్ బ్రేక్స్, కంబైన్డ్ బ్రేకింగ్సిస్టమ్ అమర్చింది. అలాగే పియోజియో మొబైల్ కనెక్టివిటీ ఫీచర్‌ను కూడా జోడించింది. భారత్‌లో విస్పా అర్బన్ క్లబ్‌ను విడుల చేయడం సంతోషంగా ఉందని పియాజియో ఇండియా సీఎండీ డియాగో గ్రిఫ్ తెలిపారు. సరికొత్త ట్రెండ్స్, సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతికత మేళవింపుతో తమ కొత్త వెస్పా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశం తమకు ముఖ్యమైన మార్కెట్.. టూ వీలర్ సెగ్మెంట్లో తమ బ్రాండ్లు ఏప్రిల్లా స్టామ్, వెస్సా అర్బన్ రెండింటినీ గతంలానే మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. -
పియాజ్జియో కొత్త బైక్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: ఇటాలియన్ ఆటో దిగ్గజం పియాజ్జియో 125 సీసీ బైక్‌ను ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ప్రముఖ వెస్పా స్కూ టర్ల తయారీ సంస్థ పియాజియో.. దేశీయ మార్కెట్లోకి ఏప్రిలియా ఎస్ఆర్ 125ను విడుదల చేసింది. దీనికి ధరను రూ .65,310 (ఎక్స్-షోరూమ్ పూణే) గా నిర్ణయించింది. వీటితో పాటు వెస్పా స్కూటర్లను కూడా ప్రదర్శించింది. వెస్పాజీటీఎస్, ట్యునో 150, ఇ-స్కూటర్ ఎలక్ట్రికాలను 2018 ఆటో ఎక్స్‌పోలో షోకేస్ చేసింది. ఈ సందర్భంగా ఒక కొత్త మొబైల్ కనెక్టివిటీ అప్లికేషన్ కూడా సంస్థ ప్రారంభించింది. 3 వాల్వ్ ఇంజీన్, 14 అంగుళాల వీల్స్, వైడర్ టైర్లతో సరసమైన ధరలో దేశవ్యాప్త డీలర్ల ద్వారా భారతీయ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని పియాజియో సీఈఓఅండ్ ఎండీ డియాగో గ్రాఫీ వెల్లడించారు. ఈ లాంచింగ్‌లతో కొత్త కేటగిరీలలో దేశంలో తమ వారసత్వం కొనసాగుతుందన్నారు. దీంతోపాటు యూత్‌ను ఆకట్టుకునే లక్ష్యంతో స్పోర్టి వెర్షన్ ఏప్రిలియా స్టామ్ను కూడా పరిచయం చేసింది. 125సీసీ ఇంజీన్, వైడ్ టెర్రైన్ టూర్లు, 12అంగుళాల ప్రధాన ఫీచర్లతో ఈ ఏడాది చివర్లో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇక మార్కెట్ పోటీ విషయానికి వస్తే ఎస్ఆర్ 125 బైక్ ఇటీవల కొత్తగా విడుదైలన టీవీఎస్ ఎన్ టార్క్ 125 , హోండా గ్రాజియా, సుజుకి యాక్స్‌స్ లకుగట్టిపోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
హైదరాబాద్ లో మోటోప్లెక్స్ ఔట్లెట్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ పియాజియో ఇండియా దక్షిణాదిన తొలి రిటైల్ స్టోర్ మోటోప్లెక్స్ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. శ్రేయ్ ఆటోమోటివ్స్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36లో 4,134 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పింది. సినీ హీరో అక్కినేని చైతన్య చేతుల మీదుగా గురువారం ప్రారంభించింది. భారత్‌లో కంపెనీకి ఇది రెండవ స్టోర్. తొలి ఔట్‌లెట్‌ను పుణేలో 2015 నవంబర్‌లో ప్రారంభించారు. పియాజియోకు చెందిన ప్రీమియం ఇటాలియన్ బ్రాండ్స్ అయిన అప్రీలియా, మోటో గుజ్జి, వెస్పా బ్రాండ్ ద్విచక్ర వాహనాలను ఇక్కడ విక్రయిస్తారు. అలాగే యాక్సెసరీస్ కొలువుదీరాయి. డిసెంబర్‌కల్లా మరో అయిదు మోటోప్లెక్స్ స్టోర్లు నెలకొల్పుతామని పియాజియో ఎండీ, సీఈవో స్టీఫానో పెల్లె ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. కస్టమర్లకు వినూత్న అనుభూతి కలిగించేందుకు మోటోప్లెక్స్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చామన్నారు. కార్యక్రమంలో శ్రేయ్ ఆటోమోటివ్స్ సీఈవో సుశీల్ దుగ్గార్ పాల్గొన్నారు.