సరికొత్త స్కూటర్‌ వెస్పా అర్బన్‌ క్లబ్‌ | Vespa Urban Club range of new scooter launched  | Sakshi
Sakshi News home page

సరికొత్త స్కూటర్‌ వెస్పా అర్బన్‌ క్లబ్‌

Published Wed, Jun 5 2019 7:42 PM | Last Updated on Wed, Jun 5 2019 8:22 PM

Vespa Urban Club range of new scooter launched  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  పియాజియో ఇండియా మార్కెట్లోకి సరికొత్త  స్కూటర్‌ను  లాంచ్‌ చేసింది.  125సీసీ ఇంజిన్‌ సామర్థ్యంతో  వెస్పా అర్బన్‌ క్లబ్‌ పేరుతో  ఆవిష్కరించింది. ఈ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.73,733 ( ఎక్స్‌షోరూమ్‌,ఢిల్లీ)గా నిర్ణయించింది. ఈ కొత్త వేరియంట్‌ అజౌరో ప్రొవెన్జా, మాజ్‌గ్రే, గ్లూసీ ఎల్లో, గ్లూసీ రెడ్‌, గ్లూసీ బ్లాక్‌ రంగుల్లో లభిస్తోంది.
 
ఫీచర్లు : 125 సీసీ సింగిల్‌  సిలిండర్‌ ఇంజీన్‌, 9.5 బీహెచ్‌పీ, 6250ఆర్‌పీఎం వద్ద 9.9 గరిష్ట టార్క్‌ను అందిస్తోంది. ఇంకా గ్రాబ్‌ రెయిల్‌, బ్రేక్‌ లివర్‌,  వీల్స్‌లో మార్పులు  చేసింది. 10 అంగుళాల నలుపు రంగు అలాయ్‌ వీల్స్‌, డ్రమ్ బ్రేక్స్‌, కంబైన్డ్‌ బ్రేకింగ్‌సిస్టమ్‌ అమర్చింది. అలాగే పియోజియో మొబైల్‌ కనెక్టివిటీ ఫీచర్‌ను కూడా జోడించింది. 

భారత్‌లో విస్పా అర్బన్‌ క్లబ్‌ను విడుల చేయడం సంతోషంగా ఉందని పియాజియో ఇండియా సీఎండీ డియాగో గ్రిఫ్‌ తెలిపారు.  సరికొత్త ట్రెండ్స్‌, సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతికత మేళవింపుతో తమ కొత్త వెస్పా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశం తమకు  ముఖ్యమైన మార్కెట్.. టూ వీలర్‌ సెగ్మెంట్‌లో తమ బ్రాండ్లు ఏప్రిల్లా స్టామ్‌, వెస్సా అర్బన్‌  రెండింటినీ గతంలానే  మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement