vespa new scooter
-
పాప్ స్టార్ బీబర్ స్పెషల్ స్కూటర్.. ధర రూ. 6.45 లక్షలు!
ముంబై: వెస్పా స్కూటర్ల తయారీ సంస్థ పియాజియో వెహికల్స్ తాజాగా జస్టిన్ బీబర్ ఎక్స్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఈ స్కూటర్ ధర రూ. 6.45 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్). కెనడాకు చెందిన పాప్ స్టార్ జస్టిన్ బీబర్ పేరిట ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్‌ను (పది లోపే) ప్రీ–ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఇవి పూర్తిగా అసెంబుల్ చేసిన యూనిట్‌గా దిగుమతి అవుతాయి. 150 సీసీ ఇంజిన్‌తో ఈ లిమిటెడ్ ఎడిషన్ ఉంటుందని పియాజియో వెహికల్స్ సీఎండీ డీగో గ్రాఫీ తెలిపారు. జస్టిన్ బీబర్ రూపొందించిన కొత్త వెస్పా వైట్ కలర్ ఆప్షన్లో మోనోక్రోమ్ స్టైల్ ఫీచర్‌తో వస్తుంది. ఇందులోని శాడిల్, గ్రిప్స్, రిమ్స్ స్పోక్స్ వంటి ఎలిమెంట్స్ అన్నీ వైట్‌లోనే ఉన్నాయి. బ్రాండ్ లోగో, వెహికల్ బాడీపై ఫ్లేమ్స్ కూడా టోన్-ఆన్-టోన్ తెలుపు రంగులో ఉంటాయి. -
ఇప్పుడు మరింత అందంగా మారిన వెస్పా.. కొత్త కలర్స్ అదుర్స్!
Vespa Dual Tone: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు మాత్రమే కాకుండా అప్డేటెడ్ వాహనాలు కూడా విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ్ టూ వీలర్ తయారీ సంస్థ 'పియాజియో ఇండియా' తన అప్డేటెడ్ వెస్పా స్కూటర్ భారతీయ విఫణిలో అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనమూ తెలుసుకుందాం. వెస్పా డ్యుయల్ సిరీస్ పేరు విడుదలైన ఈ స్కూటర్ పేరుకు తగ్గట్టుగానే ఇప్పుడు కొత్త డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్ పొందుతుంది. ఇందులో సీటు, ఫుట్‌బోర్డ్ మాత్రమే కాకుండా పిలియన్ రైడ్‌ను అనుకూలంగా ఉండే రెస్ట్ కూడా కొత్త కలర్ ఆప్షన్ పొందుతుంది. వేరియంట్స్ & ధరలు: పెర్ల్ వైట్ + అజురో ప్రోవెంజా కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ విఎక్స్ఎల్ 125 ధర రూ. 1.32 లక్షలు కాగా, విఎక్స్ఎల్ 150 ధర రూ. 1.46 లక్షలు. పెర్ల్ వైట్ + బీజ్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ విఎక్స్ఎల్ 125 రూ. 1.32 లక్షలు కాగా, విఎక్స్ఎల్ 150 ధర రూ. 1.46 లక్షలు. పెర్ల్ వైట్ + మ్యాట్ రెడ్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ ఎస్ఎక్స్ఎల్ 125 ధర రూ. 1.37 లక్షలు కాగా, ఎస్ఎక్స్ఎల్ 150 ధర రూ. 1.49 లక్షలు. పెర్ల్ వైట్ + మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ ఎస్ఎక్స్ఎల్ 125 ధర రూ. 1.37 లక్షలు కాగా, ఎస్ఎక్స్ఎల్ 150 ధర రూ. 1.49 లక్షలు. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ మహారాష్ట్ర) (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..) కలర్ ఆప్షన్ కాకుండా ఈ స్కూటర్లలో పెద్దగా ఆశించిన మార్పుయ్లు లేదు. 125 సీసీ వేరియంట్ 7,000 rpm వద్ద 9.65 bhp పవర్, 5,600 rpm వద్ద 10.11 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 150 సీసీ వేరియంట్ 7,400 rpm వద్ద 10.64 bhp పవర్, 5,300 rpm వద్ద 11.26 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్లు రెండూ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ పొందాయి. కావున ఉత్తమ పనితీరుని అందిస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
కొత్త రంగుల్లో వెస్పా ఎస్ఎక్స్ఎల్
పుణే: వాహన తయారీ సంస్థ పియాజియో.. వెస్పా ఎస్ఎక్స్ఎల్ వేరియంట్లలో కొత్తగా నాలుగు రంగులను పరిచయం చేసింది. వీటిలో మిడ్నైట్ డిసర్ట్, టస్కనీ సన్‌సెట్, జేడ్ స్ట్రీక్, సన్నీ ఎస్కపేడ్ ఉన్నాయి. ఇప్పటికే ఇవి మార్కెట్లో లభ్యం అవుతున్నాయని కంపెనీ తెలిపింది. ధర తెలంగాణ ఎక్స్‌షోరూంలో రూ.1.32 లక్షల నుంచి రూ.1.51 లక్షల వరకు ఉంది. చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
ఎల్ఎంఎల్ మళ్లీ వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన రంగంలోకి తిరిగి ప్రవేశించనున్నట్టు ఎల్ఎంఎల్ వెల్లడించింది. ఎలక్ట్రిక్ టూ వీలర్లతో రంగ ప్రవేశం చేయనున్నట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించింది. ఓ భాగస్వామి భారీ పెట్టుబడులతో బ్రాండ్‌ను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపింది. అత్యుత్తమ సాంకేతికతతో కూడిన వినూత్న ఉత్పత్తిని పరిచయం చేయడానికి అభివృద్ధి వ్యూహాలపై చురుకుగా పనిచేస్తున్నట్టు ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ ఎండీ యోగేశ్ భాటియా తెలిపారు. కాగా, ఇటలీకి చెందిన పియాజియో భాగస్వామ్యంతో ఎల్ఎంఎల్ వెస్పాను కంపెనీ గతంలో తయారుచేసి విక్రయించింది. 1983లో 100 సీసీ స్కూటర్ల ఉత్పత్తి ప్రారంభించింది. 1999లో పియాజియోతో భాగస్వామ్యం తెగిపోయాక కంపెనీ పతనం ప్రారంభమైంది. 2006లో కాన్పూర్ ఫ్యాక్టరీ లాకౌట్ అయింది. -
భారత మార్కెట్లో విడుదలైన వెస్పా 75వ ఎడిషన్ స్కూటర్
ప్రముఖ ఇటాలియన్ వాహన సంస్థ పియాజియో భారతీయ మార్కెట్లోకి వెస్పా 75వ ఎడిషన్ 125 సీసీ, 150 సీసీ స్కూటర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిని ₹1.26 లక్షలు (125 సీసీ, ఎక్స్ షోరూమ్ పూణే), ₹1.39 లక్షల(150 సీసీ, ఎక్స్ షోరూమ్ పూణే)కు విడుదల చేసింది. ఈ రెండు స్కూటర్లు కంపెనీ పోర్టల్, డీలర్స్ వద్ద బుకింగ్స్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్ల సైడ్ ప్యానెల్స్ పై '75' డెకాల్స్ అనే ప్రత్యేక నంబర్ ఉంటుంది.(చదవండి: తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్...!) ఈ స్కూటర్లలో ఒరిజినల్ ఫీచర్లు, మెకానికల్ టెక్ స్పెసిఫికేషన్ లను కలిగి ఉంటాయి. చిన్న 125సీసీ మోడల్ 7,500 ఆర్ పీఎమ్ వద్ద 9.93హెచ్ పీ పవర్, 5,500ఆర్ పీఎమ్ వద్ద 9.6ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 150 సీసీ సామర్థ్యం గల స్కూటర్ 7,600 ఆర్ పీఎమ్ వద్ద 10.4 హెచ్ పీ పవర్, 5,500 ఆర్ పీఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వీటిలో ముందు వైపున 200మిమి డిస్క్, వెనుక వైపున 140మిమి డ్రమ్ బ్రేక్స్ తో వస్తాయి. 125 సీసీ మోడల్ లో సీబిఎస్ సిస్టమ్ వస్తుంది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 190 నగరాల్లో వెస్పా ఉనికిని కలిగి ఉంది. అయితే డీలర్‌షిప్‌లు త్వరలో 300 నగరాలకు విస్తరించడానికి కంపెనీ యోచిస్తోంది.(చదవండి: Wikipedia:హ్యాక్..! లిస్ట్‌లో టాప్ సెలబ్రిటీలు..!) -
సరికొత్త స్కూటర్ వెస్పా అర్బన్ క్లబ్
సాక్షి, న్యూఢిల్లీ: పియాజియో ఇండియా మార్కెట్లోకి సరికొత్త స్కూటర్‌ను లాంచ్ చేసింది. 125సీసీ ఇంజిన్ సామర్థ్యంతో వెస్పా అర్బన్ క్లబ్ పేరుతో ఆవిష్కరించింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.73,733 ( ఎక్స్‌షోరూమ్,ఢిల్లీ)గా నిర్ణయించింది. ఈ కొత్త వేరియంట్ అజౌరో ప్రొవెన్జా, మాజ్గ్రే, గ్లూసీ ఎల్లో, గ్లూసీ రెడ్, గ్లూసీ బ్లాక్ రంగుల్లో లభిస్తోంది. ఫీచర్లు : 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజీన్, 9.5 బీహెచ్పీ, 6250ఆర్పీఎం వద్ద 9.9 గరిష్ట టార్క్‌ను అందిస్తోంది. ఇంకా గ్రాబ్ రెయిల్, బ్రేక్ లివర్, వీల్స్‌లో మార్పులు చేసింది. 10 అంగుళాల నలుపు రంగు అలాయ్ వీల్స్, డ్రమ్ బ్రేక్స్, కంబైన్డ్ బ్రేకింగ్సిస్టమ్ అమర్చింది. అలాగే పియోజియో మొబైల్ కనెక్టివిటీ ఫీచర్‌ను కూడా జోడించింది. భారత్‌లో విస్పా అర్బన్ క్లబ్‌ను విడుల చేయడం సంతోషంగా ఉందని పియాజియో ఇండియా సీఎండీ డియాగో గ్రిఫ్ తెలిపారు. సరికొత్త ట్రెండ్స్, సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతికత మేళవింపుతో తమ కొత్త వెస్పా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశం తమకు ముఖ్యమైన మార్కెట్.. టూ వీలర్ సెగ్మెంట్లో తమ బ్రాండ్లు ఏప్రిల్లా స్టామ్, వెస్సా అర్బన్ రెండింటినీ గతంలానే మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. -
ఈ స్కూటర్ ధర.. రూ. 12 లక్షలు!
-
ఈ స్కూటర్ ధర.. రూ. 12 లక్షలు!
ఒకప్పుడు భారతదేశంలో స్కూటర్ అంటే.. బజాజ్ చేతక్ మాత్రమే. ఆ తర్వాత ఎల్ఎంఎల్ వెస్పా వచ్చింది. అప్పట్లో అదో సంచలనం. మంచి లుక్‌తో, డిఫరెంట్ స్టైలుతో ఉన్న ఆ స్కూటర్‌ను బాగానే ఆదరించారు. కొన్నాళ్ల పాటు వినిపించని వెస్పా పేరు ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చింది. వెస్పా 946 ఎంపోరియో అర్మానీ పేరుతో ఇప్పుడు విడుదల చేసిన ఈ స్కూటర్ ధర.. ఏకంగా రూ. 12 లక్షల పైమాటే. దానికి మళ్లీ పన్నులు అదనం. జార్జియో అర్మానీ 40వ వార్షికోత్సవం, పియాజియో గ్రూపు 130వ వ్యవస్థాపక దినం సందర్భంగా గత సంవత్సరం ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ప్రీమియం మోడల్‌తో పాటు, వెస్పా 70వ వార్షికోత్సవ ఎడిషన్‌ను కూడా రూ. 96,500 ధరతో విడుదల చేసింది. దేశంలో ఇది రెండో అత్యంత ఖరీదైన స్కూటర్‌గా నిలుస్తుంది. ఏప్రియాలా ఎస్ఆర్వి 850 ఏబీఎస్ అనేది ఇప్పటివరకు దేశంలో అత్యంత ఖరీదైన స్కూటర్. దాని ధర రూ. 14.39 లక్షలు. ఇప్పుడు విడుదల చేసిన వెస్పా ప్రీమియం స్కూటర్ లుక్ కూడా చాలా విభిన్నంగా ఉంది. ఇప్పటికే ఈ స్కూటర్‌కు భారతదేశం నుంచి రెండు ఆర్డర్లు వచ్చాయి. స్కూటర్ల టెక్నాలజీలో దీనిది అత్యంత ఆధునికమైనదని చెబుతున్నారు. హెడ్‌లైట్ పైన గద్ద లోగో ఉంటుంది. హెడ్ ల్యాంప్, టైల్ లైట్, ఇండికేటర్లు అన్నీ ఎల్ఈడీవే. దీనికి 125 సీసీ సింగిల్ సిలిఒడర్ ఇంజన్ ఉంటుంది. 11.7 బీహెచ్పీ పవర్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటాయి. అంటే గేర్లను మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. 220 ఎంఎం డబుల్ డిస్క్ బ్రేకులు, డ్యూయల్ చానల్ ఏబీఎస్ మరియు ఏఎస్ఆర్ నియంత్రణలు ఉంటాయి. వెస్పా డీలర్లతో పాటు పియాజియో మోటోప్లెక్స్ షోరూంలలో కూడా ఇవి లభ్యమవుతాయి. ఇవి లిమిడెట్ ఎడిషన్.. అంటే కొన్ని మాత్రమే తయారుచేస్తారు. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.