హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన రంగంలోకి తిరిగి ప్రవేశించనున్నట్టు ఎల్‌ఎంఎల్ వెల్లడించింది. ఎలక్ట్రిక్ టూ వీలర్లతో రంగ ప్రవేశం చేయనున్నట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించింది. ఓ భాగస్వామి భారీ పెట్టుబడులతో బ్రాండ్‌ను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపింది. అత్యుత్తమ సాంకేతికతతో కూడిన వినూత్న ఉత్పత్తిని పరిచయం చేయడానికి అభివృద్ధి వ్యూహాలపై చురుకుగా పనిచేస్తున్నట్టు ఎల్‌ఎంఎల్ ఎలక్ట్రిక్ ఎండీ యోగేశ్ భాటియా తెలిపారు. కాగా, ఇటలీకి చెందిన పియాజియో భాగస్వామ్యంతో ఎల్‌ఎంఎల్ వెస్పాను కంపెనీ గతంలో తయారుచేసి విక్రయించింది. 1983లో 100 సీసీ స్కూటర్ల ఉత్పత్తి ప్రారంభించింది. 1999లో పియాజియోతో భాగస్వామ్యం తెగిపోయాక కంపెనీ పతనం ప్రారంభమైంది. 2006లో కాన్పూర్ ఫ్యాక్టరీ లాకౌట్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment