Vespa Dual Tone: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు మాత్రమే కాకుండా అప్డేటెడ్ వాహనాలు కూడా విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ్ టూ వీలర్ తయారీ సంస్థ 'పియాజియో ఇండియా' తన అప్డేటెడ్ వెస్పా స్కూటర్ భారతీయ విఫణిలో అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనమూ తెలుసుకుందాం.
వెస్పా డ్యుయల్ సిరీస్ పేరు విడుదలైన ఈ స్కూటర్ పేరుకు తగ్గట్టుగానే ఇప్పుడు కొత్త డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్ పొందుతుంది. ఇందులో సీటు, ఫుట్‌బోర్డ్ మాత్రమే కాకుండా పిలియన్ రైడ్‌ను అనుకూలంగా ఉండే రెస్ట్ కూడా కొత్త కలర్ ఆప్షన్ పొందుతుంది.
వేరియంట్స్ & ధరలు:
- పెర్ల్ వైట్ + అజురో ప్రోవెంజా కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ విఎక్స్ఎల్ 125 ధర రూ. 1.32 లక్షలు కాగా, విఎక్స్ఎల్ 150 ధర రూ. 1.46 లక్షలు.
- పెర్ల్ వైట్ + బీజ్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ విఎక్స్ఎల్ 125 రూ. 1.32 లక్షలు కాగా, విఎక్స్ఎల్ 150 ధర రూ. 1.46 లక్షలు.
- పెర్ల్ వైట్ + మ్యాట్ రెడ్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ ఎస్ఎక్స్ఎల్ 125 ధర రూ. 1.37 లక్షలు కాగా, ఎస్ఎక్స్ఎల్ 150 ధర రూ. 1.49 లక్షలు.
- పెర్ల్ వైట్ + మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ ఎస్ఎక్స్ఎల్ 125 ధర రూ. 1.37 లక్షలు కాగా, ఎస్ఎక్స్ఎల్ 150 ధర రూ. 1.49 లక్షలు. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ మహారాష్ట్ర)
(ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..)
కలర్ ఆప్షన్ కాకుండా ఈ స్కూటర్లలో పెద్దగా ఆశించిన మార్పుయ్లు లేదు. 125 సీసీ వేరియంట్ 7,000 rpm వద్ద 9.65 bhp పవర్, 5,600 rpm వద్ద 10.11 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 150 సీసీ వేరియంట్ 7,400 rpm వద్ద 10.64 bhp పవర్, 5,300 rpm వద్ద 11.26 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్లు రెండూ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ పొందాయి. కావున ఉత్తమ పనితీరుని అందిస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment