Vespa
-
వెస్పా మిక్కీ మౌస్ ఎడిషన్ వచ్చేస్తోంది - వివరాలు
Vespa Mickey Mouse Edition: భారతదేశంలో వెస్పా స్కూటర్లకున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మహిళల మనసుదోచే ఈ స్కూటర్ ఇప్పుడు కొత్త ఎడిషన్ రూపంలో విడుదల కావడానికి సన్నద్ధమవుతోంది. దీని కోసం వెస్పా డిస్నీతో చేతులు కలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిస్నీతో చేతులు కలిపిన వెస్పా మిక్కీ మౌస్ అనే స్పెషల్ ఎడిషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ స్కూటర్ మిక్కీ మౌస్ మాదిరిగానే కలర్స్ కలిగి ఉంటుంది. బూట్లను పోలిన పసుపు రంగు వీల్స్, చెవులును తలిపించే మిర్రర్స్, బాడీని గుర్తు చేయడానికి రెడ్ కలర్ ఇక్కడ గమనించవచ్చు. అంతే కాకుండా మిక్కీ మౌస్ సంతకం కూడా ఈ స్కూటర్ మీద ఉండటం గమనార్హం. (ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!) డిజైన్ పరంగా ఎటువంటి మార్పులు లేదు, కానీ ఇందులో కాస్మొటిక్ డిజైన్స్ మాత్రం గమనించవచ్చు. అదే ఇంజిన్ కలిగి ఉంటుంది కాబట్టి అదే పర్ఫామెన్స్ అందిస్తుంది. కాగా ఈ లేటెస్ట్ ఎడిషన్ ఎప్పుడు మార్కెట్లో విడుదలవుతుంది, దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇప్పుడు మరింత అందంగా మారిన వెస్పా.. కొత్త కలర్స్ అదుర్స్!
Vespa Dual Tone: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు మాత్రమే కాకుండా అప్డేటెడ్ వాహనాలు కూడా విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ్ టూ వీలర్ తయారీ సంస్థ 'పియాజియో ఇండియా' తన అప్డేటెడ్ వెస్పా స్కూటర్ భారతీయ విఫణిలో అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనమూ తెలుసుకుందాం. వెస్పా డ్యుయల్ సిరీస్ పేరు విడుదలైన ఈ స్కూటర్ పేరుకు తగ్గట్టుగానే ఇప్పుడు కొత్త డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్ పొందుతుంది. ఇందులో సీటు, ఫుట్‌బోర్డ్ మాత్రమే కాకుండా పిలియన్ రైడ్‌ను అనుకూలంగా ఉండే రెస్ట్ కూడా కొత్త కలర్ ఆప్షన్ పొందుతుంది. వేరియంట్స్ & ధరలు: పెర్ల్ వైట్ + అజురో ప్రోవెంజా కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ విఎక్స్ఎల్ 125 ధర రూ. 1.32 లక్షలు కాగా, విఎక్స్ఎల్ 150 ధర రూ. 1.46 లక్షలు. పెర్ల్ వైట్ + బీజ్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ విఎక్స్ఎల్ 125 రూ. 1.32 లక్షలు కాగా, విఎక్స్ఎల్ 150 ధర రూ. 1.46 లక్షలు. పెర్ల్ వైట్ + మ్యాట్ రెడ్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ ఎస్ఎక్స్ఎల్ 125 ధర రూ. 1.37 లక్షలు కాగా, ఎస్ఎక్స్ఎల్ 150 ధర రూ. 1.49 లక్షలు. పెర్ల్ వైట్ + మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ ఎస్ఎక్స్ఎల్ 125 ధర రూ. 1.37 లక్షలు కాగా, ఎస్ఎక్స్ఎల్ 150 ధర రూ. 1.49 లక్షలు. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ మహారాష్ట్ర) (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..) కలర్ ఆప్షన్ కాకుండా ఈ స్కూటర్లలో పెద్దగా ఆశించిన మార్పుయ్లు లేదు. 125 సీసీ వేరియంట్ 7,000 rpm వద్ద 9.65 bhp పవర్, 5,600 rpm వద్ద 10.11 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 150 సీసీ వేరియంట్ 7,400 rpm వద్ద 10.64 bhp పవర్, 5,300 rpm వద్ద 11.26 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్లు రెండూ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ పొందాయి. కావున ఉత్తమ పనితీరుని అందిస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఎలక్ట్రిక్ స్కూటర్లు,బైక్స్‌తో ఎల్ఎంఎల్ కొత్త ఇన్నింగ్స్
సాక్షి,ముంబై: టూవీలర్ మార్కెట్లో సంచలనం ఎల్ఎంఎల్ (లోహియా మెషీన్స్ లిమిటెడ్) స్కూటర్స్ గుర్తున్నాయా? ఇపుడు ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ-స్కూటర్లతో మళ్లీ మర్కెట్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఆధునిక డిజైన్, రెట్రో లుక్‌లో ఈ-స్కూటర్లు, బైక్స్‌ను లాంచ్ చేయనుంది. కాన్పూర్‌కు చెందిన పురాతన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఎస్జీ కార్పొరేట్ మొబిలిటీ యాజమాన్యం కింద, ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో తన కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 29న ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌తో మూడు వాహనాలను పరిచయం చేయనుంది. బైక్స్, ఇ-స్కూటర్లు రెండింటికీ సంబంధించి ప్రకటన ఉంటుందని అంచనా. ఎలక్ట్రిక్ బైక్‌లు 2023 మొదటి త్రైమాసికంలో లాంచ్ చేయనుంది. అంతేకాదు వీటిని దేశీయ మార్కెట్‌కు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేయనుంది. రానున్న 3-5 ఏళ్లలో 1000 కోట్లు పెట్టుబడి పెట్టాలని కంపెనీ భావిస్తోంది. హర్యానా మనేసర్‌లోని హార్లే-డేవిడ్సన్ తయారీ యూనిట్లోనే ఈ బైక్‌లను ఉత్పత్తి చేయనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 1000ఎల్ఎమ్ఎల్ డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తోంది. కాగా 90లలో ఎల్ఎంఎల్ వెస్పా పేరు తెలియని వారుండరు. 100 సీసీ శ్రేణితో బజాజ్ స్కూటర్లతో పెద్ద పోటీనే ఉండేది. ఈ పోటీని తట్టుకోలేక 2018లో మూతపడింది ఎల్ఎంఎల్. -
70వ వసంతంలో స్కూటర్ ప్రియుల ఐకానిక్
టూవీలర్ పరిశ్రమలో ఐకానిక్ బ్రాండ్ గా నిలిచిన ఇటాలియన్ స్కూటర్ బ్రాండ్ వెస్పా ను స్కూటర్ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత ద్విచక్ర వాహన మార్కెట్లో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టిన ఈ ఇటాలియన్ బ్రాండ్ తన 70వ వసంతాన్ని ఘనంగా జరుపుకుంది. దీన్ని పురస్కరించుకుని కొత్త వెస్పా సెట్టాన్ టెసిమో లిమిటెడ్ వెర్షన్ ప్రిమ అవెరా 50, ప్రిమ అవెరా 150, జీటీఎస్ 300 మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రైల్వే క్యారేజీలు, లోకోమోటివ్ తయారీదారుగా ప్రపంచం ముందుకు వచ్చిన వెస్పా పేరెంట్ కంపెనీ ఫియాజ్జియో , రెండో ప్రపంచ యుద్ధం అనంతరం వెస్పా బ్రాండుకు శ్రీకారం చుట్టింది. కేవలం రెండు లాభాలతో వెస్పా బ్రాండ్ ను 1946 నుంచి తయారీ చేయడం ప్రారంభించింది. ఒకటి చౌకైన రవాణాకు, రెండు ఉద్యోగులు, యంత్రాలు ఎల్లప్పుడూ పనిచేసేలా ఉంచడం కోసం ఈ స్కూటర్ ను తయారీని ఫియాజ్జియా చేపట్టింది. ఏప్రిల్ 26, 1946లో కంపెనీ వ్యవస్థాపకులు ఎన్రికో పియాజ్జియో ఇటాలియన్ సెంట్రల్ పేటెంట్ ఆఫీస్‌లో విభిన్న మోటార్‌సైకిల్ మోడళ్లను తయారు చేసేందుకు తన పేటెంట్‌ను ఫైల్ చేశారు. ఫియోజ్జియో ఇంజనీర్లు అప్పుడే కొత్తగా ఏమీ స్కూటర్ ను కనుగొనలేదు. కానీ దాన్ని ఐకానిక్ బ్రాండ్ గా రూపొందించడానికి మాత్రం అహర్నిశలు కృషిచేశారు. నాటి నుంచి నేటి వరకూ అనేక రకాల వెస్పా స్కూటర్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. పియాజ్జియో మొట్టమొదటిగా 'వెస్పా ఎమ్‌పి6' ప్రోటోటైప్‌ను సృష్టించారు. ఈ ప్రోటోటైప్ విభిన్న వెస్పా స్కూటర్లకు పునాదిగా నిలిచింది. 1953 వరకూ తన ఉనికి చాటుకోవడానికి వెస్పా ఎంతలా ప్రయత్నించిందంటే చెప్పలేం. కానీ ఒక్కసారిగా రాత్రికి రాత్రే 1953లో విలియం వైలర్ చిత్రం 'రోమన్ హాలిడే' తో వెస్సా బ్రాండ్ సంచలనాన్ని సృష్టించింది. ఒక్క గంట 59 నిమిషాల వరకూ సాగే ఆ చిత్రంలో, హీరో హీరోయిన్లు గ్రెగరి పెక్, ఆడ్రీ హెప్బర్న్ లు వెస్పా 125 స్కూటర్ పైనే కనిపిస్తారు. దీంతో ఈ స్కూటర్ కు ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. ఆ ఏడాది వెస్పా అమ్మకాలు లక్ష మార్కును టచ్ చేసి రికార్డు సృష్టించాయి. ఈ హిట్ తో ఫియోజ్జియో ఈ స్కూటర్లను వివిధ మోడల్స్ లో, స్టైలిస్ డిజైన్ రీ బ్రాండ్ చేయడం ప్రారంభించింది. ఇప్పటికీ ఓ స్పెషల్ బ్రాండ్ గానే వెస్పా మార్కెట్లో నిలుస్తోంది. సెయింట్ ట్రోపెజ్ లో జరిగిన ఈ నెల మొదట్లో జరిగిన వెస్పా వరల్డ్ డేస్ ప్రోగ్రామ్ లో..10వేలకు పైగా వెస్పిస్టిలను గ్యాలరీగా ప్రదర్శించింది. 1960లో ప్రాంతంలో వెస్పా స్కూటర్ల ఇండియాలోకి ప్రవేశించాయి. దేశీయ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో ఇటలీకు చెందిన పియాజ్జియో నుంచి లైసెన్సు పొంది, భారత్‌లో స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. అయితే, పియాజ్జియోతో బజాజ్ ఆటో ఈ కాంట్రాక్ట్‌ను 1971లో రెన్యువల్ చేసుకోలేదు. దీంతో 1983లో వెస్పా స్వతహాగా ఇండియాలోకి ప్రవేశించి ఎల్ఎమ్ఎల్, పి-సిరీస్ స్కూటర్ల విక్రయాన్ని ప్రారంభించింది. కానీ 1999లో ఎల్ఎమ్ఎల్, వెస్పాల భాగస్వామ్యం ముగిసిపోయింది. ప్రస్తుతం తన స్కూటర్లు మాత్రమే భారత్ లో విక్రయిస్తోంది. త్వరలోనే వెస్పా 300 జీటీఎస్ ను, వెస్పా 946 లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు ఫియాజ్జియో సిద్ధమైంది.