![Vespa disney Mickey Mouse Edition unveiled design and details - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/22/mickey-mouse-special-edition-coming-soon.jpg.webp?itok=cSwHaU23)
Vespa Mickey Mouse Edition: భారతదేశంలో వెస్పా స్కూటర్లకున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మహిళల మనసుదోచే ఈ స్కూటర్ ఇప్పుడు కొత్త ఎడిషన్ రూపంలో విడుదల కావడానికి సన్నద్ధమవుతోంది. దీని కోసం వెస్పా డిస్నీతో చేతులు కలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
డిస్నీతో చేతులు కలిపిన వెస్పా మిక్కీ మౌస్ అనే స్పెషల్ ఎడిషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ స్కూటర్ మిక్కీ మౌస్ మాదిరిగానే కలర్స్ కలిగి ఉంటుంది. బూట్లను పోలిన పసుపు రంగు వీల్స్, చెవులును తలిపించే మిర్రర్స్, బాడీని గుర్తు చేయడానికి రెడ్ కలర్ ఇక్కడ గమనించవచ్చు. అంతే కాకుండా మిక్కీ మౌస్ సంతకం కూడా ఈ స్కూటర్ మీద ఉండటం గమనార్హం.
(ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!)
డిజైన్ పరంగా ఎటువంటి మార్పులు లేదు, కానీ ఇందులో కాస్మొటిక్ డిజైన్స్ మాత్రం గమనించవచ్చు. అదే ఇంజిన్ కలిగి ఉంటుంది కాబట్టి అదే పర్ఫామెన్స్ అందిస్తుంది. కాగా ఈ లేటెస్ట్ ఎడిషన్ ఎప్పుడు మార్కెట్లో విడుదలవుతుంది, దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment