Nissan Magnite Geza Special Edition: ఇప్పటికే దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న 'నిస్సాన్ మాగ్నైట్' ఇప్పుడు సరికొత్త స్పెషల్ ఎడిషన్‌లో విడుదలైంది. జపనీస్ టెక్నాలజీతో రూపొందిన ఈ కారు ఇప్పుడు కొత్త అప్డేట్స్ పొందింది. ఈ ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర & కలర్ ఆప్షన్స్
భారతదేశంలో విడుదలైన నిస్సాన్ మాగ్నైట్ స్పెషల్ ఎడిషన్ పేరు 'గెజా'. నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 7.39 లక్షలు. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఇది ఒనిక్స్ బ్లాక్, సాండ్‌స్టోన్ బ్రౌన్, స్టార్మ్ వైట్, ఫ్లేర్ గార్నెట్ రెడ్, బ్లేడ్ సిల్వర్ అనే ఐదు కలర్ ఆప్సన్లలో లభిస్తుంది.
డిజైన్ & ఫీచర్స్
కొత్త నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ దాదాపు చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. అయితే ఫీచర్స్ కొన్ని అప్డేట్ పొందాయి. ఇందులోని 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ప్లే వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ టచ్‌స్క్రీన్ దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత పెద్దదిగా ఉంటుంది. ఇందులో JBL స్పీకర్‌లు ఉన్నాయి.
(ఇదీ చదవండి: అత్యంత ఖరీదైన మెక్‌లారెన్ సూపర్‌కార్ - 330 కిమీ/గం స్పీడ్)
ఇప్పటికే నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ మార్కెట్లో విడుదలైంది. కాగా ఇప్పుడు గెజా ఎడిషన్ అడుగు పెట్టింది. ఇందులో యాంబియంట్ లైటింగ్ ఉంటుంది. దీనిని నిస్సాన్ ఫోన్ యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. అంతే కాకుండా ఇందులో బేజ్ కలర్ సీట్ కవర్స్ ఉండటం కూడా చూడవచ్చు. ఇందులో రియర్ కెమెరా, షార్క్ న్ యాంటెన్నా వంటివి కూడా ఉన్నాయి.
ఇంజిన్
కంపెనీ అందించిన సమాచారం మాగ్నైట్ గెజా స్పెషల్ ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. కావున అదే 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 72 hp పవర్ ప్రోడీసు చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కావున పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది.
(ఇదీ చదవండి: భారత్‌లో రూ. 89.30 లక్షల కారు విడుదల చేసిన బీఎండబ్ల్యూ - వివరాలు)
ప్రత్యర్థులు
కొత్త నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యువి300, మారుతి సుజుకి ఫ్రాంక్స్, రెనాల్ట్ కిగర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున మార్కెట్లో అమ్మకాల పరంగా ఇది గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment