Renault Rafale Revealed: అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాన్స్ వాహన తయారీ సంస్థ 'రెనాల్ట్' (Renault) యూరప్ మార్కెట్లో కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యువి 'రఫెల్' (Rafale) ఆవిష్కరించింది. మార్కెట్లో అడుగెట్టిన ఈ కొత్త కారు ఆధునిక డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
డిజైన్ & కొలతలు
కొత్త రెనాల్ట్ రఫెల్ CMF-CD ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారైంది. ఇందులో అద్భుతమైన గ్రిల్, ఫాస్ట్‌బ్యాక్ రూఫ్, స్లోపింగ్ రూఫ్‌లైన్, పెద్ద బానెట్, వైడ్ ఎయిర్ వెంట్, మాట్రిక్స్ షేప్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్ వంటివి ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. టెయిల్ లైట్, బ్రాండ్ లోగో, స్పాయిలర్ వంటివి ఉన్నాయి.
ఈ SUV పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 4.7 మీ, ఎత్తు 1.61 మీ, వీల్‌బేస్ 2.74 మీ వరకు ఉంటుంది. కావున ఇది ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది.
ఫీచర్స్
ఫీచర్స్ విషయానికొస్తే.. రెనాల్ట్ రఫేల్ పానోరమిక్ సన్‌రూఫ్, ఆర్మ్‌రెస్ట్‌తో కూడిన భారీ సెంటర్ కన్సోల్, ఫ్లాట్ బాటమ్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, 9.3 ఇంచెస్ హెడ్అప్ డిస్ప్లే, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.0 ఇంచెస్ వర్టికల్లీ ఓరియెంటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి వాటితో పాటు ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ కూడా లభిస్తాయి.
(ఇదీ చదవండి: ఇండియన్ ఆర్మీలోకి మహీంద్రా ఆర్మడో కార్లు - వైరల్ వీడియో)
ఇంజిన్
రెనాల్ట్ కొత్త కారు 1.2 లీటర్ టర్బోఛార్జ్డ్ 3 సిలిండర్, పెట్రోల్ ఇంజిన్ కలిగి 2 ఎలక్ట్రిక్ మోటార్స్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. సాధారణంగా 130 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే ఈ ఇంజిన్.. ఎలక్ట్రిక్ మోటార్లను కనెక్ట్ చేస్తే 200 హెచ్‌పీ కంటే ఎక్కువ ఔట్పుట్ అందిస్తుంది.
(ఇదీ చదవండి: ఐఐటీ చదివి యంగెస్ట్ బిలియనీర్ అయ్యాడిలా.. సంపాదనలో మేటి ఈ అంకిత్ భాటి!)
భారతదేశంలో ఈ ఎస్‌యువి బహుశా విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ 2025 నాటికి రెనాల్ట్ డస్టర్ అప్డేట్ మోడల్ రూపంలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్విడ్, ట్రైబర్, కైగర్ వంటి మోడల్స్ మాత్రమే అమ్మకానికి ఉన్నాయి. కాగా యూరప్ మార్కెట్లో విడుదలకానున్న ఈ రఫెల్ ధర 55,000 యూరోలు వరకు ఉండవచ్చు. దీని విలువ భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 49.3 లక్షల వరకు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment