Renault
-
రెనో సీఎన్జీ వేరియంట్స్ వస్తున్నాయ్..
చెన్నై: వాహన తయారీలో ఉన్న ఫ్రెంచ్ కంపెనీ రెనో.. భారత మార్కెట్లో సీఎన్జీ వేరియంట్లను త్వరలో పరిచయం చేయనుంది. తొలుత ట్రైబర్, కైగర్ ఆ తర్వాత క్విడ్ సీఎన్జీ రానున్నాయి. కొన్ని నెలల్లో కంపెనీ ప్రవేశపెట్టదలచిన ఆరు కొత్త మోడళ్ల కంటే ముందే ఈ సీఎన్జీ వేరియంట్లు దర్శనమీయనున్నాయని రెనో ఇండియా ఆపరేషన్స్ సీఈవో, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు.భారత్‌లో 2023లో సీఎన్జీ ఆధారిత ప్యాసింజర్ వెహికిల్స్ 5.24 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ సంఖ్య 4.8 లక్షల యూనిట్లు రోడ్డెక్కాయి. కాగా, కంపెనీ విడుదల చేయనున్న మోడళ్లలో సరికొత్త బి–సెగ్మెంట్ ఎస్యూవీ, సి–సెగ్మెంట్ ఎస్యూవీ, రెండు ఈవీలతోపాటు ఆధునీకరించిన ట్రైబర్, కైగర్ ఉన్నాయి.రెనో ఇండియా ప్రత్యేక ఫీచర్లతో ట్రైబర్, కైగర్, క్విడ్ మోడళ్లలో నైట్ అండ్ డే లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లను బుధవారం ప్రవేశపెట్టింది. లిమిటెడ్ ఎడిషన్‌లో 1,600 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంచామని వెంకట్రామ్ తెలిపారు. గతేడాది మాదిరిగానే 2024లో 53,000 యూనిట్లను విక్రయించే అవకాశం ఉందని రెనో ఇండియా అంచనా వేస్తోంది. -
రెనో కార్లలో కొత్త వేరియంట్లు వచ్చాయి.. చూశారా?
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనో తాజాగా మూడు మోడల్స్ కార్లలో అయిదు కొత్త వేరియంట్లను దేశీ మార్కెట్లో తాజాగా ప్రవేశపెట్టింది. క్విడ్, ట్రైబర్, కైగర్ మోడల్స్ వీటిలో ఉన్నాయి. వీటి ధర రూ. 4.69 లక్షల నుంచి రూ. 10.99 లక్షల వరకు (ఎక్స్ షోరూం) ఉంటుందని సంస్థ తెలిపింది. మూడు మోడల్స్‌లో కలిపి మొత్తం మీద పది కొత్త ఫీచర్లను జోడించినట్లు రెనో ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. మరోవైపు, రెనో, రెనోయేతర యూజ్డ్ కార్ల విక్రయాలు, కొనుగోళ్ల కోసం రెన్యూ పేరిట కొత్త బ్రాండ్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. వచ్చే మూడేళ్లలో భారత మార్కెట్లో అయిదు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు వెంకట్రామ్ తెలిపారు. వీటిలో కొత్త మోడల్స్‌తో పాటు కైగర్, ట్రైబర్‌లో కొత్త వేరియంట్లు కూడా ఉంటాయని చెప్పారు. వివిధ సవాళ్ల కారణంగా గతేడాది అమ్మకాలు ఒక మోస్తరుగానే నమోదైనప్పటికీ కొత్త మోడల్స్ ఊతంతో ఈ ఏడాది రెండంకెల స్థాయి వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెనో గతేడాది దేశీయంగా 49,000 కార్లను విక్రయించగా, 28,000 వాహనాలను ఎగుమతి చేసింది. ఇక ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాలు మందగిస్తున్న నేపథ్యంలో చిన్న కారు క్విడ్ విక్రయాలను కొనసాగిస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. నిబంధనలు అనుమతించే వరకు సదరు సెగ్మెంట్లో అమ్మకాలను కొనసాగిస్తామని వెంకట్రామ్ స్పష్టం చేశారు. -
ఈ కార్ల కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్స్ - పూర్తి వివరాలు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'రెనాల్ట్ ఇండియా' ఈ ఏడాది బ్రాండ్ కార్లను కొనుగోలు చేసేవారి కోసం అద్భుతమైన ఆఫర్లను తీసుకువచ్చింది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్ వంటి వున్నాయి. కంపెనీ అందించే ఈ బెనిఫిట్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రెనాల్ట్ కైగర్ కంపెనీ తన రెనాల్ట్ కైగర్ కొనుగోలుపైన రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 స్పెషల్ కస్టమర్ లాయల్టీ బోనస్‌లు, రూ.12,000 కార్పొరేట్ బెనిఫిట్స్ మొదలైనవి ఉన్నాయి. 1.0 లీటర్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభించే ఈ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. రెనాల్ట్ ట్రైబర్ రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలుపైన కంపెనీ రూ.50000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, రూ.10,000 లాయల్టీ కస్టమర్ ప్రయోజనాల కింద తగ్గింపు ఉన్నాయి. రూ.6.34 లక్షల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారును ఈ నెలలో కొనుగోలు చేస్తే రూ.50,000 వరకు సేవ్ అవుతుంది. ఇదీ చదవండి: 2024లో మరింత వేగంగా భారత్ వృద్ధి - అసోచామ్ రెనాల్ట్ క్విడ్ ప్రారంభం నుంచి అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న రెనాల్ట్ క్విడ్ కొనుగోలుపైన కంపెనీ ఇప్పుడు రూ. 50000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్ వంటివి ఉన్నాయి. రూ.4.5 లక్షల ప్రారంభ ధరలో లభించే ఈ కారుని ఇప్పుడు రూ.50,000 తగ్గింపుతో ఈ నెలలో కొనుగోలు చేయవచ్చు. Note: రెనాల్ట్ కంపెనీ అందిస్తున్న ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కంపెనీ అందించే తగ్గింపులు కేవలం మరో రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి వినియోగదారులు సమీపంలోని అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవాలి. -
దుమ్ము రేపిన రెనో-నిస్సాన్ , సరికొత్త రికార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ రెనో-నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా 25 లక్షల యూనిట్ల తయారీ పూర్తి చేసి కొత్త రికార్డు నమోదు చేసింది. 600 ఎకరాల్లోని చెన్నై ప్లాంటు నుంచి విదేశాలకూ కార్లు ఎగుమతి అవుతున్నాయి. అంతర్జాతీయంగా 108 ప్రాంతాలకు ఇక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి. ఇప్పటి వరకు 10 లక్షల పైచిలుకు కార్లు విదేశీ గడ్డపై అడుగు పెట్టాయి. 13 ఏళ్లుగా ఈ కేంద్రం ద్వారా రెనో, నిస్సాన్ బ్రాండ్లలో సుమారు 20 మోడళ్లు భారత మార్కెట్లో ప్రవేశించాయి. -
ప్రత్యర్థులను రఫ్ఫాడించడానికి సిద్ధమైన రెనో రఫెల్ - వివరాలు
Renault Rafale Revealed: అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాన్స్ వాహన తయారీ సంస్థ 'రెనాల్ట్' (Renault) యూరప్ మార్కెట్లో కొత్త ఫ్లాగ్షిప్ ఎస్యువి 'రఫెల్' (Rafale) ఆవిష్కరించింది. మార్కెట్లో అడుగెట్టిన ఈ కొత్త కారు ఆధునిక డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిజైన్ & కొలతలు కొత్త రెనాల్ట్ రఫెల్ CMF-CD ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారైంది. ఇందులో అద్భుతమైన గ్రిల్, ఫాస్ట్‌బ్యాక్ రూఫ్, స్లోపింగ్ రూఫ్‌లైన్, పెద్ద బానెట్, వైడ్ ఎయిర్ వెంట్, మాట్రిక్స్ షేప్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్ వంటివి ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. టెయిల్ లైట్, బ్రాండ్ లోగో, స్పాయిలర్ వంటివి ఉన్నాయి. ఈ SUV పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 4.7 మీ, ఎత్తు 1.61 మీ, వీల్‌బేస్ 2.74 మీ వరకు ఉంటుంది. కావున ఇది ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. ఫీచర్స్ ఫీచర్స్ విషయానికొస్తే.. రెనాల్ట్ రఫేల్ పానోరమిక్ సన్‌రూఫ్, ఆర్మ్‌రెస్ట్‌తో కూడిన భారీ సెంటర్ కన్సోల్, ఫ్లాట్ బాటమ్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, 9.3 ఇంచెస్ హెడ్అప్ డిస్ప్లే, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.0 ఇంచెస్ వర్టికల్లీ ఓరియెంటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి వాటితో పాటు ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ కూడా లభిస్తాయి. (ఇదీ చదవండి: ఇండియన్ ఆర్మీలోకి మహీంద్రా ఆర్మడో కార్లు - వైరల్ వీడియో) ఇంజిన్ రెనాల్ట్ కొత్త కారు 1.2 లీటర్ టర్బోఛార్జ్డ్ 3 సిలిండర్, పెట్రోల్ ఇంజిన్ కలిగి 2 ఎలక్ట్రిక్ మోటార్స్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. సాధారణంగా 130 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే ఈ ఇంజిన్.. ఎలక్ట్రిక్ మోటార్లను కనెక్ట్ చేస్తే 200 హెచ్‌పీ కంటే ఎక్కువ ఔట్పుట్ అందిస్తుంది. (ఇదీ చదవండి: ఐఐటీ చదివి యంగెస్ట్ బిలియనీర్ అయ్యాడిలా.. సంపాదనలో మేటి ఈ అంకిత్ భాటి!) భారతదేశంలో ఈ ఎస్యువి బహుశా విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ 2025 నాటికి రెనాల్ట్ డస్టర్ అప్డేట్ మోడల్ రూపంలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్విడ్, ట్రైబర్, కైగర్ వంటి మోడల్స్ మాత్రమే అమ్మకానికి ఉన్నాయి. కాగా యూరప్ మార్కెట్లో విడుదలకానున్న ఈ రఫెల్ ధర 55,000 యూరోలు వరకు ఉండవచ్చు. దీని విలువ భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 49.3 లక్షల వరకు ఉంటుంది. -
రెనో, నిస్సాన్‌ల ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే?
చెన్నై: వాహన తయారీలో ఉన్న రెనో, నిస్సాన్‌ల సంయుక్త భాగస్వామ్య కంపెనీ నుంచి తొలి కారు భారత మార్కెట్లో 2025లో అడుగుపెట్టనుంది. ఈ మోడల్ 4 మీటర్లకుపైగా పొడవు ఉండనుంది. రూ.5,300 కోట్లతో రెండు చిన్న ఎలక్ట్రిక్ కార్లతోసహా ఆరు కొత్త ఉత్పత్తులను తేనున్నట్టు ఇరు సంస్థలు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించాయి. అలాగే చెన్నై సమీపంలోని ప్లాంటును ఆధునీకరించనున్నారు. ఆరు మోడళ్లలో రెనో నుంచి మూడు, నిస్సాన్ నుంచి మూడు రానున్నాయి. జేవీలో నిస్సాన్‌కు 51, రెనోకు 49 శాతం వాటా ఉంటుంది. ‘ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశిస్తున్నాం. అలాగే నాలుగు మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న పెద్ద వాహనాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తాం. భారత్‌లో క్విడ్, కైగర్, ట్రైబర్ ప్యాసింజర్ కార్లను విక్రయిస్తున్నాం. 2022లో దేశీయంగా 84,000 యూనిట్లు రోడ్డెక్కాయి. 28,000 యూనిట్లు ఎగుమతి చేశాం. 2023లోనూ ఇదే స్థాయిలో అమ్మకాలు ఉంటాయి’ అని రెనో ఇండియా ఆపరేషన్స్ సీఈవో, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. -
అమ్మకాల్లో అదరగొట్టిన రెనో.. ఏకంగా 9 లక్షల యూనిట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న ఫ్రెంచ్ కంపెనీ రెనో.. భారత మార్కెట్లో 9 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును చేరుకుంది. 11 ఏళ్లలో ఈ ఘనతను సాధించామని కంపెనీ తెలిపింది. మేడ్ ఇన్ ఇండియా వాహనాల విక్రయాలను రెనో ఇండియా 2012లో భారత్‌లో ప్రారంభించింది. (ఇదీ చదవండి: ఈరోజే కొంటే రూ.32 వేల వరకు ఆదా! రేపటి నుంచి పెరగనున్న ధరలు) ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ క్విడ్, కాంపాక్ట్ ఎస్యూవీ కైగర్, మల్టీపర్పస్ వెహికిల్ ట్రైబర్ మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. ‘టాప్–5 మార్కెట్లలో గ్రూప్ రెనో సంస్థకు భారత్ ఒకటి. భారత్ కోసం స్పష్టమైన దీర్ఘకాలిక వ్యూహాన్ని దృష్టిలో ఉంచుకున్నాము. బలమైన ఉత్పత్తి, ప్రణాళికను రూపొందించాము. భవిష్యత్తు ఉత్పత్తుల శ్రేణిలో స్థానికీకరణకు అధిక ప్రాధాన్యతనిచ్చాం’ అని రెనో ఇండియా ఆపరేషన్స్ సీఈవో, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లి ఈ సందర్భంగా తెలిపారు. -
రెనాల్ట్ డస్టర్ కమింగ్ సూన్: సేల్స్‌లో దూకుడు! ఎన్ని కార్లు అమ్మిందంటే!
సాక్షి, ముంబై: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా విక్రయాల్లో సరికొత్త మైలురాయిని అధిగమించింది. దేశంలో 9 లక్షల వాహనాల విక్రయాలను అధిగమించినట్లు రెనాల్ట్ ప్రకటించింది. తద్వారా ఈ ఘనతను సాధించిన దేశంలోని స్మాలెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ కార్ మేకర్లలో ఒకటిగా అవతరించింది. గత ఫిబ్రవరిలో 8 లక్షల సేల్స్ మార్క్‌ను తాకింది. త్వరలోనే కొత్త డస్టర్ లాంచ్‌కు సన్నద్ధమవుతున్న క్రమంలో ఈ కీలక విక్రయ మైలురాయిని చేరుకోవడం విశేషం. (AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత) పదకొండేళ్ల క్రితం 2012లో భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది రెనాల్ట్. కైగర్, ట్రైబర్, క్విడ్ లాంటి కార్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా 2015లో క్విడ్ రాకతో మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం భారతదేశంలో సేల్ అవుతున్న మూడు రెనాల్ట్ కార్లలో క్విడ్ ఒకటి. త్వరలోనే డస్టర్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. అంతేకాదు రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. (యాపిల్ లవర్స్ బీ రెడీ: రూ. 8,900కే యాపిల్ ఐప్యాడ్ ) ఇండియా తమకు టాప్ 5 మార్కెట్లలో ఒకటి, గతకొన్నేళ్లుగా దేశంలో బలమైన మార్కెట్‌ను సాధించామని రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. కేంద్రం'మేక్ ఇన్ ఇండియా' కు కట్టుబడి ఉన్నామని, రానున్న ఉత్పత్తుల్లో 90 శాతం స్థానికీకరణను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. కాగా ప్రస్తుతం, రెనాల్ట్ 450 ప్లస్ సేల్స్, 530 సర్వీస్ టచ్‌పాయింట్స్ ద్వారా సేవలందిస్తోంది. మరిన్ని ఆటో, టెక్ వార్తలకోసం చదవండి: సాక్షిబిజినెస్ -
రెనాల్ట్ కైగర్ కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఆర్ఎక్స్జెడ్ వెర్షన్‌పై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: ప్రముఖ వాహన సంస్త రెనాల్ట్ కైగర్ కాంపాక్ట్ ఎస్ యూవీనికొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. రెనాల్ట్ XT (O) MT వేరియంట్ ధరను 7.99 (ఎక్స్ షోరూం) లక్షలుగా నిర్ణయించింది. రెనాల్ట్ కైగర్ ఎక్స్‌టీ(ఓ) ఎ ంటీ ఇంజీన్, ఫీచర్లు 1.0 టర్బో పెట్రోల్ ఇంజన్ 99bhp, 152Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు రెనాల్ట్ కైగర్ గ్లోబల్ ఎన్‌సిఎపి ద్వారా అడల్ట్ ఆక్యుపెంట్ సేఫ్టీకి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా అందుకుంది, డ్రైవర్ ఫ్రంట్ ప్యాసింజర్ భద్రత కోసం, నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రీ-టెన్షనర్లతో కూడిన సీట్‌బెల్ట్‌లు, స్పీడ్ అండ్ క్రాష్-సెన్సింగ్ డోర్ లాక్‌లు , ISOFIX చైల్డ్ సీట్ యాంకర్ లాంటివి ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (IBM To Freeze Hiring: వేలాది ఉద్యోగాలకు ఏఐ ముప్పు: ఐబీఎం షాకింగ్ న్యూస్) వైర్లెస్ కనెక్టివిటీతో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్, ఎన్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్ , హై సెంటర్ కన్సోల్ వంటి ఫీచర్లున్నాయి.ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి వినూత్న ఫీచర్లను అందిస్తోంది. (మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!) రెనాల్ట్ ఆర్ఎక్స్ జెడ్‌పై డిస్కౌంట్ కొత్త వేరియంట్ లాంచ్‌తో పాటు, Renault RXZ ట్రిమ్‌పై డిస్కౌంట్లను అందిస్తోంది. ఆర్ఎక్స్జెడ్ వెర్షన్ కొనుగోలపై రూ. 10వేల నగదు, రూ. 20వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 12వేల వరకు కార్పొరేట్ బెనిఫిట్స్‌తోపాటు రూ. 49వేల లాయల్టీ ప్రయోజనాలు లాంటి ఆఫర్లను కూడా ప్రకటించింది ఇదీ చదవండి: దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ! -
వెబ్సైట్లో మాయమైన క్విడ్, ఇక కావాలన్నా కొనలేరు!
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన 'రెనాల్ట్ క్విడ్' (Renault Kwid) ఇప్పుడు కంపెనీ అధికారిక వెబ్సైట్లో మాయమైంది. ఇటీవల అమలులోకి వచ్చిన రియల్ డ్రైవింగ్ ఎమిషన్ ఉద్గార ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ మోడల్ని నిలిపివేసింది. నివేదికల ప్రకారం.. క్విడ్ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతున్నప్పటికీ కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయడం ఖర్చుతో కూడుకున్న పని. ఈ హ్యాచ్‌బ్యాక్ ఏ విధమైన అప్డేట్ పొందినప్పటికీ ధరల పెరుగుదల పొందుతుంది. అప్పుడు అమ్మకాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే కంపెనీ ఈ 800cc వెర్షన్‌ను తొలగించింది. రెనాల్ట్ క్విడ్ 0.8 లీటర్ వెర్షన్ RXL, RXL(O) వేరియంట్లలో అందుబాటులో ఉంది. 800cc వేరియంట్ నిలిపివేయడంతో, రెనాల్ట్ ఇప్పుడు ఐదు వేరియంట్లలో 1.0 లీటర్ వెర్షన్‌ను మాత్రమే అందిస్తుంది. క్విడ్ 800 సీసీ వేరియంట్ త్రీ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 52 బిహెచ్పి పవర్, 72 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: HYD ORR: ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకి రూ. 8వేల కోట్లు: రేసులో ఆ నాలుగు కంపెనీలు) రెనాల్ట్ కంపెనీ కంటే ముందు మారుతి సుజుకి తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టో 800ని నిలిపివేసింది. అంతే కాకుండా స్కోడా నుంచి ఆక్టావియా, హోండా జాజ్, 4వ తరం హోండా సిటీ ఉత్పత్తి కూడా నిలిపేయడం జరిగింది. నిజానికి కొత్త నిబంధనలు అమలులోకి రావడం వల్ల ఈ ఉత్పత్తులు నిలిచిపోయాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఉత్పత్తులు నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
బంపరాఫర్..! కారు కొనుగోలుపై ఏకంగా రూ. లక్షకు పైగా తగ్గింపు..!
ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. రెనాల్ట్ పోర్ట్‌ఫోలియోలోని పలు కార్లపై ఏకంగా రూ. లక్షకు పైగా తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపు నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ బోనస్‌లు , కార్పొరేట్ డిస్కౌంట్స్గా కొనుగోలుదారులకు లభించనున్నాయి. రెనాల్ట్ అందిస్తోన్న డిస్కౌంట్ ఆఫర్ల వివరాలు: రెనాల్ట్ క్విడ్ రెనాల్ట్ క్విడ్ పాత వెర్షన్ కార్‌పై రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్ , కొత్త అప్‌గ్రేడ్ వెర్షన్‌పై రూ. 5,000 వరకు నగదు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. రెనాల్ట్ క్విడ్ కారుపై రూ. 38,000 వరకు లాయల్టీ బోనస్ ఉండనుంది. ఇతర కారు ఎక్స్ఛేంజ్పై రూ. 15,000 ఉండనుంది. రెనాల్ట్ ట్రైబర్, కైగర్. ఏప్రిల్ నెలలో కొన్ని రెనాల్ట్ ట్రైబర్‌కు సంబంధించిన పలు ట్రిమ్స్‌పై రూ. 10,000 నగదు తగ్గింపుతో లభిస్తోంది. ఎక్సేచేంజ్ ఇన్వెంటివ్ రూ. 20,000, లాయల్టీ బోనస్ రూ. 44,000 వరకు అందిస్తోంది. రెనాల్ట్ కైగర్ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీపై రూ. 55,000 వరకు లాయల్టీ బోనస్ లభిస్తుంది. రెనాల్ట్ డస్టర్ భారత్‌లో రెనాల్ట్ డస్టర్ నిలిపివేస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దీంతో డీలర్లు మిగిలిన స్టాక్‌పై భారీ తగ్గింపులను అందిస్తున్నారు. రూ. 50,000 విలువైన నగదు తగ్గింపు, రూ. 50, 000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్ కొనుగోలుదారులకు లభిస్తోంది. అంతేకాకుండా రూ. 1.1 లక్షల లాయల్టీ బోనస్ కూడా అందుబాటులో ఉండనుంది. ఇక అన్నీ కార్ల స్క్రాపింగ్ పాలసీపై కొనుగోలుదారులకు రూ. 10,000 వరకు లభించనుంది. చదవండి: రూ. 1.2 కోట్ల జాక్‌పాట్..! ట్రిపుల్ఐటీ చరిత్రలోనే రికార్డు సృష్టించిన విద్యార్థి..! -
సరికొత్తగా రెనో కైగర్.. అదిరిపోయిన ఫీచర్స్!
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనో తాజాగా ఆధునీకరించిన కాంపాక్ట్ ఎస్యూవీ కైగర్‌ను విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.5.84 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో 1.0 లీటర్ టర్బో ఇంజిన్, కారు లోపల స్వచ్ఛమైన గాలి కోసం పీఎం2.5 అట్మాస్ఫెరిక్ ఫిల్టర్, క్రూజ్ కంట్రోల్, మల్టీ సెన్స్ డ్రైవింగ్ మోడ్స్ వంటి హంగులు ఉన్నాయి. అలాగే, ఇందులో వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ సదుపాయం కూడా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు తొలి అయిదు మార్కెట్లలో భారత్‌ను నిలపడంలో ఈ మోడల్ కీలకంగా ఉందని కంపెనీ ప్రకటించింది. ఫ్రెంచ్, భారత బృందాలు కారు రూపకల్పనలో పాలుపంచుకున్నాయని వివరించింది. ప్రపంచంలో ఇతర దేశాల్లో విడుదలకు ముందే రెనో నుంచి తొలిసారిగా భారత్‌లో పరిచయం అయిన మూడవ మోడల్ ఇది. 2021 ప్రారంభంలో దేశంలో అడుగుపెట్టింది. నేపాల్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియాకు భారత్ నుంచి ఎగుమతి అవుతోంది. (చదవండి: సామాన్యుడు బతికేది ఎలా?.. మోత మోగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు!) -
అదిరిపోయిన రెనాల్ట్ కొత్త హైబ్రిడ్ కారు.. మైలేజ్ కూడా చాలా ఎక్కువే..!
ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీసంస్థ రెనాల్ట్ సీ-సెగ్మెంట్ వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం ఆస్ట్రల్ పేరుతో కొత్త ఎస్యువీ మోడల్ కారునీ ప్రపంచ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న కడ్జార్ ఎస్యువీ స్థానంలో కొత్తగా ఆస్ట్రల్ ఎస్యువీ కారును తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారు వోల్వో ఎక్స్ సీ40, వోక్స్ వ్యాగన్ టి-రోక్, ఫోర్డ్ కుగా, టయోటా ఆర్ఎవీ4 వంటి వాటితో పడనుంది. రెనాల్ట్ సీఈఓ లూకా డీ మియో మాట్లాడుతూ.. "సరికొత్త రెనాల్ట్ ఆస్ట్రల్ అనేది సీ-సెగ్మెంట్ ఎస్యువీ. రెనాల్ట్ తన పూర్తి సామర్థ్యం మేరకు తీసుకొచ్చిన ఒక ప్రతిరూపం" అని అన్నారు. జపాన్ దేశానికి చెందిన మిత్సుబిషి, నిస్సాన్ కంపెనీలతో కలిసి ఆస్ట్రల్ కారుని అభివృద్ధి చేసినట్లు తెలిపింది. థర్డ్ జనరేషన్ సీఎంఎఫ్-సీడీ ప్లాట్ ఫారమ్ వినియోగించిన సంస్థ మొదటి కారు ఇది. ఇది ఒక హైబ్రిడ్ కారుగా సంస్థ పేర్కొంది. ఐసీఈ వాహనంలో రెండు పెట్రోల్ ఇంజిన్లు ఉన్నాయి. 130 హెచ్‌పీ 48 మైల్డ్ హైబ్రిడ్ అడ్వాన్స్డ్ ఇంజిన్, 140 హెచ్‌పి/160 హెచ్‌పి సామర్ధ్యం గల 12వీ మిల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఇందులో ఉంది. కొత్త రెనాల్ట్ ఆస్ట్రల్ టర్బోఛార్జ్డ్ 1.2-లీటర్ త్రీ-సిలిండర్ ఇంజిన్'ను ఒక మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్'తో జత చేశారు. ఇది "డీజిల్ వాహనాలకు నిజమైన ప్రత్యామ్నాయం" అని కంపెనీ పేర్కొంది. రెనాల్ట్ ఆస్ట్రల్ ఎస్యువీ 48వి మైల్డ్ హైబ్రిడ్ అడ్వాన్స్ డ్ వేరియెంట్ 48వీ లిథియం-అయాన్ బ్యాటరీ, స్టార్టర్ మోటార్ సహాయంతో 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. ఈ మైల్డ్ హైబ్రిడ్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆస్ట్రల్ ఎస్యువీ కారు ఇంధన వినియోగం 100 కిలోమీటర్లకు 5.3 లీటర్ల వరకు తక్కువగా ఉండవచ్చని రెనాల్ట్ పేర్కొంది. ఈ మోడల్ కార్లలో ఈ మైలేజ్ చాలా ఎక్కువ అని చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. రెనాల్ట్ ఆస్ట్రల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్, 1.3 లీటర్ 4-సిలిండర్ టర్బోఛార్జ్డ్ డైరెక్ట్-ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజిన్ సహాయంతో పనిచేస్తుంది. దీనిని మెర్సిడెస్ బెంజ్ సహ-అభివృద్ధి చేసింది. దీనిలో 9.3 అంగుళాల హెడ్స్-అప్ డిస్ ప్లే, యాక్టివ్ డ్రైవర్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ సెంటరింగ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటెడ్ పార్క్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్, రియర్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, మ్యాట్రిక్స్ ఎల్ఈడీ విజన్ స్మార్ట్ లైటింగ్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. (చదవండి: ఫ్యూచర్‌కు షాక్! లీగల్ నోటీసులు పంపిన రిలయన్స్!) -
Electric vehicle: కేవలం ఈవీ టెక్నాలజీ కోసమే లక్షాఎనభై వేల కోట్లు!
రాబోయేది ఈవీల కాలమే. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అందుకే ఆటోమొబైల్‌తో పాటు మొబైల్ మేకింగ్, ఇతర కంపెనీలు సైతం ఈవీల తయారీ వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ తరుణంలో కేవలం ఈవీ టెక్నాలజీ కోసమే లక్షా ఎనభై వేల కోట్ల ఖర్చుకు సిద్ధమయ్యాయి రెనాల్డ్ నిస్సాన్ కంపెనీలు. ఫ్రెంచ్ జపనీస్ ఆటోమొబైల్‌ల కూటమి ‘ఈవీ టెక్నాలజీ’ కోసం 26 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో లక్షా 82 వేల కోట్ల రూపాయలకు పైనే) పెట్టుబడి పెట్టబోతున్నాయి. ఈ మేరకు గురువారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది ఈ కూటమి. వచ్చే ఐదేళ్లకు ఈమేర ఖర్చు చేయనున్న కంపెనీలు పనిలో పనిగా జపాన్ ఆటోమేకర్ మిట్సుబిషి మోటార్స్ కార్పొరేషన్‌ను తమతో భాగస్వామిగా చేర్చుకున్నాయి. ఈవీలకు సంబంధించి పరిశోధనతో పాటు ఆటో పార్ట్లు, ధరలను తగ్గించే టెక్నాలజీ తదితరాల ఆధారంగా 35 కొత్త మోడల్స్‌తో ఈవీలను రూపొందించనున్నాయి. ఈ మేరకు 2030 ఏడాదిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఐదు మోడల్స్‌కు ఒకే విధమైన ప్రధాన విభాగాల్ని ఉపయోగించాలని ప్లాన్ చేశాయి. నిస్సాన్ తర్వాతి తరం బ్యాటరీల మీద ఫోకస్ చేస్తుండగా.. రెనాల్ట్ ఈవీలను అభివృద్ధి చేయడం, సాఫ్ట్వేర్, డిజిటల్ సేవలు, ఫీచర్స్ మీద దృష్టి సారించనున్నట్లు కూటమి చైర్మన్ జీన్ డోమినిక్యూ సెనార్డ్ ప్రకటించారు. రెనాల్ట్కు నిస్సాన్‌లో 43 శాతం వాటా ఉంది, అలాగే రెనాల్ట్‌లో నిస్సాన్‌కు 15 శాతం వాటా ఉంది. టోక్యోకు చెందిన మిట్సుబిషిలో నిస్సాన్(యోకోహామా కేంద్రంగా)కు 34 శాతం వాటా ఉంది. ఇక ఫ్రెంచ్ ప్రభుత్వానికి రెనాల్ట్‌లో 15 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చిప్ షార్టేజ్ కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇలా కొన్ని కంపెనీలు చేతులు కలిపి ఈవీ మార్కెట్లో రాణించాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే ఏ భాగస్వామి లేకుండా ప్రపంచంలో నెంబర్ వన్‌గా, ఈవీ కింగ్‌గా కొనసాగుతోంది మాత్రం అమెరికన్ ఆటో మేకర్ టెస్లానే. -
కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లు, రైతులకు అదనంగా!
కార్ల కొనుగోలు దారులకు బంపర్ ఆఫర్. మన దేశంలో ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఫ్రాన్స్ కార్ల కంపెనీ రెనాల్ట్' రెనాల్ట్ ఇండియా' కార్ల కొనుగోలు దారులకు కళ్లు చెదిరేలా డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. జనవరి ఫెస్టివల్ సీజన్ సందర్భంగా రెనాల్ట్ ఇండియా పలు కార్లపై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఇక రెనాల్ట్ ఇండియా కార్లపై డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రెనాల్ట్ క్విడ్ రెనాల్ట్ క్విడ్ రెండు వెర్షన్ల కారు కొనుగోలు దారులు డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. మోడల్ 1.0-లీటరు వెర్షన్ కారు కొనుగోలుపై రూ 5,000 మై 2022 మోడళ్ల (08.లీటర్ వెర్షన్లు తప్ప)పై రూ 10,000 డిస్కౌంట్‌తో పాటు అదనంగా రూ.15,000 వరకు ఎక్ఛేంజ్ బోనస్‌ను దక్కించుకోవచ్చు.కార్పొరేట్, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10,000, రూ. 5,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఆర్ఎక్స్ఈ 0.8 లీటర్ వేరియంట్ పై రూ.10,000 లాయల్టీ ప్రయోజనాల్ని పొందవచ్చు. రెనాల్ట్ కిగర్ రెనాల్ట్ కిగర్ కారు కొనుగోలు దారులకు లాయల్టీ బెన్ఫిట్ కింద రూ.10వేల వరకు తగ్గింపు పొందవచ్చు.దీంతో పాటు కార్పొరేట్ డిస్కౌంట్, గ్రామీణ ప్రాంతాల్లో ఈ కారు కొనుగోలు దారులకు రూ.10,000, రూ.5,000 డిస్కౌంట్ పొందవచ్చు. రెనాల్ట్ ట్రైబర్ రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలు దారులు ఎంవై 2021 మోడల్‌పై రూ. 10,000 (ఆర్ఎక్స్ఈ వేరియంట్ మినహా) డిస్కౌంట్, ఎక్ఛేంజ్ కింద రూ.20,000 వరకు ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎక్స్ఈ వేరియంట్‌పై లాయల్టీ బోనస్ రూ.10,000, రైతులు, సర్పంచ్, గ్రామ పంచాయితీ సభ్యులకు రూ.5,000 డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. సెలక్ట్ చేసిన వేరియంట్లపై కార్పొరేటర్లు,పీఎస్‌యూల(ప్రభుత్వ ఉద్యోగస్తులకు) రూ.10,000 వరకు కార్పొరేట్ తగ్గింపును కూడా ఎంచుకోవచ్చు రెనాల్ట్ డస్టర్ రెనాల్ట్ డస్టర్ అన్ని వేరియంట్లపై (ఆర్ఎక్స్ జెడ్1.5 ట్రిమ్ మినహా) రూ.50,000 ఎక్ఛేంజ్ ఆఫర్, రూ.50,000 డిస్కౌంట్ పొందవచ్చు. కార్పొరేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపిక చేసిన వేరియంట్లలో రూ.30,000, గ్రామీణ ప్రాంతాల కొనుగోలు దారులు రూ.15,000 వరకు సొంతం చేసుకోవచ్చు. చదవండి: బంపరాఫర్..! మహీంద్రా కార్లపై రూ. 82 వేల వరకు భారీ తగ్గింపు.! -
2022లో కొత్త కారు కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్!
మీరు రాబోయే కొత్త సంవత్సరం 2022లో కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక షాకింగ్ న్యూస్. టాటా మోటార్స్, హోండా, రెనాల్ట్ వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు వచ్చే ఏడాది జనవరి నుంచి వాహన ధరలను పెంచాలని చూస్తున్నాయి. ఇప్పటికే కార్ల మార్కెట్ లీడర్ మారుతి సుజుకి, ఆడీ, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు వచ్చే నెల నుంచి వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి. జనవరి 2022లో ధరల పెరుగుదల అనేది మోడల్స్ బట్టి ఉంటుందని మారుతి చెప్పగా, మెర్సిడెస్ బెంజ్ పెరుగుతున్న ఇన్ పుట్ ఖర్చుల కారణంగా ఎంపిక చేసిన మోడల్స్ కార్లపై ధరల పెంపు అనేది 2 శాతం వరకు ఉంటుందని తెలిపింది. మరోవైపు, ఇన్ పుట్, కార్యాచరణ ఖర్చుల కారణంగా జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వచ్చే ధరల పెరుగుదల అనేది మొత్తం మోడల్ శ్రేణిలో 3 శాతం వరకు ఉంటుందని ఆడీ తెలిపింది. ఈ ధరల పెంపు విషయంపై టాటా మోటార్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. "సరుకులు, ముడిపదార్థాలు, ఇతర ఇన్ పుట్ ఖర్చుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఖర్చుల పెరుగుదలను కనీసం పాక్షికంగా తగ్గించడానికి ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది" అని అన్నారు. ఈ సంస్థ దేశీయ మార్కెట్లో పంచ్, నెక్సన్, హారియర్ వంటి మోడల్ కార్లను విక్రయిస్తుంది."కమోడిటీ ధరల పెరుగుదల కారణంగా ఇన్ పుట్ ఖర్చుపై తీవ్రమైన ప్రభావం ఉంది. ఎంత వరకు ధరల పెంచాలో అనే దానిపై అధ్యయనం చేస్తున్నాము" అని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. (చదవండి: సామాన్యుడి షాక్..క్యూ కట్టిన బ్యాంకులు..!) సిటీ, అమేజ్ వంటి బ్రాండ్ల తయారీదారు చివరిసారిగా ఈ ఏడాది ఆగస్టులో వాహన ధరలను పెంచింది. ధరల పెరుగుదలను తాము కూడా పరిశీలిస్తున్నట్లు రెనాల్ట్ పేర్కొంది. ఫ్రెంచ్ కంపెనీ క్విడ్, ట్రైబ్ర్, కిగర్ వంటి మోడల్ కార్లను భారతీయ మార్కెట్లో విక్రయిస్తుంది. గత ఏడాది కాలంలో ఉక్కు, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్, విలువైన లోహాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరగడంతో కంపెనీలు ధరల పెంచాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా, ఇటీవలి కాలంలో రవాణా ఖర్చు పెరిగింది, ఇది ఒరిజినల్ ఎక్విప్ మెంట్ తయారీదారుల(ఓఈఎమ్) మొత్తం వ్యయ నిర్మాణాలను ప్రభావితం చేస్తుంది. (చదవండి: Ola Electric Car: ఓలా తొలి ఎలక్ట్రిక్ కారు వచ్చేది అప్పుడే!) -
కార్ల కొనుగోలుపై లక్షకు పైగా భారీ డిస్కౌంట్లు, రైతులకు అదనంగా
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. న్యూఇయర్ సందర్భంగా రెనాల్ట్ ఇండియా కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులకు, సర్పంచ్, గ్రామ పంచాయతీ సభ్యులకు క్యాష్ డిస్కౌంట్లు,ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు వెల్లడించింది. రెనాల్ట్ ట్రైబర్ ప్రీ ఎంఐ 2021, ఎంఐ 2021 రెనాల్ట్ ట్రైబర్ ఎంఐ 2021 మోడల్ కొనుగోలుపై రూ.25,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ (కార్పొరేట్, ప్రభుత్వ రంగ సంస్థల జాబితా) పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, సర్పంచ్, గ్రామ పంచాయతీ సభ్యులకు ప్రీ ఎంఐ 2021, ఎంఐ 2021 మోడల్‌లపై రూ.5,000 తగ్గింపు పొందవచ్చు. రెనాల్ట్ డస్టర్ నవంబర్ 2021 లో డస్టర్ ఆఫర్లలో రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 50,000 నగదు తగ్గింపు, రూ. 30,000 వరకు కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. రైతులు, సర్పంచ్ గ్రామ పంచాయతీ సభ్యులకు రూ.15,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, డస్టర్ 1.5 ఆర్ ఎక్స్ జెడ్ ట్రిమ్ ఇటీవల రూ. 46,060 ధర తగ్గింపును పొందింది. ఈ విధంగా, ఈ వేరియంట్‌పై ఆఫర్ రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 30,000 కార్పొరేట్ తగ్గింపును అందిస్తుంది. రెనాల్ట్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 10,000 వరకు నగదు తగ్గింపు, రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ (1.0-లీటర్ మోడల్‌కు రూ. 15,000 మరియు 0.8-లీటర్ వెర్షన్లకు రూ. 10,000), రూ. 10,000 వరకు కార్పొరేట్ తగ్గింపు ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాహనం కొనుగోలుపై రూ. 5,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. స్టాక్ సప్లయ్ డిమాండ్‌కు తగ్గట్లు 2020 మోడల్లకు రూ. 10,000 తగ్గింపు వర్తిస్తుంది. రెనాల్ట్ కిగర్ రెనాల్ట్ కిగర్, కాంపాక్ట్ ఎస్యూవీ రూ 10,000, రూ 10,000 వరకు ఒక కార్పొరేట్ డిస్కౌంట్ ,రూ 5,000 గ్రామీణ ఆఫర్ వరకు ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. పైన పేర్కొన్న ఆఫర్లు 31 డిసెంబర్ 2021 మాత్రమే అందుబాటులో ఉంటాయని రెనాల్ట్ ప్రతినిధులు వెల్లడించారు. చదవండి: సర్వే: యువతకు ఏ కార్లు అంటే ఇష్టం, వాళ్లకి కారు కొనే సామర్ధ్యం ఉందా?! -
దేశంలో అత్యంత సురక్షితమైన టాప్-10 కార్లు ఇవే!
దేశంలో కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు కంపెనీలు కూడా కార్లను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. 10 లక్షల రూపాయల ధరలో మంచి కార్లు అందుబాటులో ఉండటం, మధ్యతరగతి ఆదాయం పెరగడం చేత కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. అయితే, చాలా మంది వినియోగదారులు కారు కొనేముందు ఆ ఫీచర్ ఉందా? ఈ ఫీచర్ ఉందా? అని అడుగుతున్నారే కానీ, అన్నిటికంటే ముఖ్యమైన ఫీచర్ భద్రత పరంగా ఈ కారు ఎంత రేటింగ్ పొందింది అనేది ఎవరు తెలుసుకోవడం లేదు. ఇంకొంత మంది రూ.2 లక్షలు తక్కువకు వస్తుంది కదా అని తక్కువ సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్లను కొంటున్నారు. కానీ, అన్నింటికంటే సేఫ్టీ రెంటింగ్ చాలా ముఖ్యం. గ్లోబల్ కార్ సేఫ్టీ ఏజెన్సీ గ్లోబల్ ఎన్సీఏపీ గత కొన్ని ఏళ్లుగా భారతీయ వాహనాలకు రేటింగ్ ఇస్తూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం రాబోయే టాటా పంచ్ ఎస్యువి కారుకు భద్రతా పరీక్ష నిర్వహించిన తర్వాత భద్రతా సంస్థ భారతదేశంలో ఉత్తమమైన రేటింగ్ పొందిన కార్ల జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో దేశీయ ఆటోమేకర్లు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా పై చేయి సాధించాయి. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న 10 కార్లు ఏవి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.. (చదవండి: కష్టాల్లో ఉన్నాం కాపాడమంటూ భారత్‌ను కోరిన శ్రీలంక) 1. టాటా పంచ్ యూకేకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం(ఎన్సీఏపీ)ను నిర్వహిస్తుంది. మనదేశంలో 'సేఫర్ కార్స్ ఫర్ ఇండియా' పేరుతో పలు కార్లపై టెస్టులు నిర్వహిస్తుంది. ఆ టెస్టుల్లో కార్ల సేఫ్టీని బట్టి స్టార్ రేటింగ్‌ను అందిస్తుంది. తాజాగా నిర్వహించిన సేఫర్ కార్స్ క్యాంపెయినింగ్లో టాటా పంచ్ కారు 5 స్టార్ రేటింగ్((16.453), పిల్లల సేప్టీ విషయంలో 4 స్టార్((40.891) రేటింగ్ సాధించింది. 2. మహీంద్రా ఎక్స్యువి300 గ్లోబల్ ఎన్సీఏపీ జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో తన స్థానాన్ని నిలుపుకున్న మహీంద్రా ఎక్స్యువి300, అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలను పాటించినందుకు సేఫ్టీ ఏజెన్సీ మొట్టమొదటి 'సేఫర్ ఛాయిస్' అవార్డును కూడా అందుకుంది. ఇది వయోజనుల రక్షణ కోసం 5 స్టార్ భద్రతా రేటింగ్, పిల్లల రక్షణ కోసం 4 స్టార్ రేటింగ్ పొందింది. 3. టాటా ఆల్ట్రోజ్ టాటా మోటార్స్ కంపెనీకు చెందిన ప్రముఖ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు క్రాష్ టెస్ట్ సమయంలో గ్లోబల్ ఎన్సీఏపీ ద్వారా వయోజనుల రక్షణ కోసం 5 స్టార్ రేటింగ్, పిల్లల సేప్టీ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. (చదవండి: సేఫ్టీలో టాటా మోటార్స్ కార్లకు తిరుగులేదు) 4. టాటా నెక్సన్ టాటా మోటార్స్ కంపెనీకు చెందిన నెక్సన్ వయోజనుల రక్షణ కోసం 5 స్టార్ రేటింగ్, పిల్లల సేప్టీ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. నెక్సన్ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఫ్రంటల్ డబుల్ ప్రెటెన్షన్ లు, ఏబిఎస్ బ్రేకులు వంటివి ఉన్నాయి. 5. మహీంద్రా థార్ మహీంద్రా కంపెనీకు చెందిన ఆఫ్ రోడర్ ఎస్యువి వయోజనులు, పిల్లల సేఫ్టీ విషయంలో 4 స్టార్ రేటింగ్ పొందింది. భద్రతా రేటింగ్ పరంగా థార్ ఎస్యువి జాబితాలో ఐదువ స్థానంలో ఉంది.(చదవండి: క్రిప్టోకరెన్సీపై బిలియనీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!) 6. టాటా టిగోర్ ఈవీ గ్లోబల్ ఎన్సీఏపీ మొట్టమొదటిసారి పరీక్షించిన ఎలక్ట్రిక్ వాహనం(ఈవీ)గా టిగోర్ ఈవీ నిలిచింది. వయోజనులు, పిల్లల సేఫ్టీ విషయంలో టాటా టిగోర్ ఈవీ 4 స్టార్ రేటింగ్ పొందింది. దీనిలో రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ఈఎస్ సీ), సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, వేహికల్ లో అన్ని సీటింగ్ పొజిషన్లలో త్రీ పాయింట్ బెల్ట్ ఫీచర్స్ ఉన్నాయి. 7. టాటా టిగోర్ టాటా మోటార్స్ టిగోర్ కంబస్టివ్-ఇంజిన్ వెర్షన్ కారు వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. 8. టాటా టియాగో మరో ప్రముఖ హ్యాచ్ బ్యాక్ టియాగో భద్రతా ప్రమాణాల పరంగా టాటా టిగోర్ తో సమానంగా ఉంది. టియాగో కూడా వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. దీనిలో కూడా రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. 9. వోక్స్ వ్యాగన్ పోలో వోక్స్ వ్యాగన్ ఇండియాకు చెందిన హ్యాచ్ బ్యాక్ 2014లో గ్లోబల్ ఎన్సీఏపీ సేఫ్టీ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు ఇది వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. డ్యాష్ బోర్డ్ లోని ప్రమాదకరమైన నిర్మాణాల కారణంగా ముందు ప్రయాణీకుల మోకాళ్లు ప్రమాదానికి గురవుతాయని భద్రతా నివేదిక పేర్కొంది. (చదవండి: ఆపిల్..గూగుల్..శాంసంగ్..! ఎవరు తగ్గేదెలే...!) 10. రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివి రెనాల్ట్ ఇండియా ఫ్లాగ్ షిప్ ట్రైబర్ ఎమ్‌పివి వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించిన తర్వాత ఈ ఏడాది జూన్ లో సురక్షితమైన కార్ల జాబితాలోకి ప్రవేశించింది. -
ఈ కంపెనీ కార్లపై భారీగా డిస్కౌంట్లు
న్యూఢిల్లీ: మీరు తక్కువ ధరలో మంచి కారు కొనాలని చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు రెనాల్ట్, డాట్సన్ తమ కార్లపై భారీగా డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ డిస్కౌంట్లో భాగంగా కస్టమర్లు రూ.45,000 వరకు తగ్గింపు పొందవచ్చు. డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పీవీవిని జపాన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ డాట్సన్ తయారు చేసింది. ఈ కారు మొత్తం 5 వేరియంట్లను కంపెనీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కారులో కంపెనీ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇది 68 పీఎస్ నుంచి 77 పీఎస్ వరకు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 5 స్పీడ్ మాన్యువల్, సీవీటి ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ ఉన్నాయి. డాట్సన్ తన వినియోగదారులకు రూ.40,000 వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద కంపెనీ వినియోగదారులకు రూ.20,000 వరకు నగదు తగ్గింపును అందిస్తోంది. అదే సమయంలో, వినియోగదారులు కూడా రూ.20,000 వారి పాత కారు స్థానంలో కొత్త కారును తీసుకోవడం ద్వారా పొందవచ్చు. మార్కెట్లో డాట్సన్ గో ప్లస్(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర రూ.4.25 లక్షల నుంచి రూ. 6.99 లక్షలుగా ఉంది. అలాగే రెనో ట్రైబర్ - ఈ 7 సీట్ల కారు 4 వేరియంట్లు (RXE, RXL, RXT, RXZ) మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిలో 1.0-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్‌ను ఉంది. ఇది 96 ఎన్ఎమ్ టార్క్, 72 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కారు యొక్క రెండవ వేరియంట్లో కంపెనీ 1.0-లీటర్ సామర్థ్యం గల టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇది 160 ఎన్ఎమ్ టార్క్, 100 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుపై కంపెనీ 45,000 రూపాయల వరకు డిస్కౌంట్లను వినియోగదారులకు అందిస్తోంది. ఈ చౌకైన ఎంపీవీపై రూ.15 వేల వరకు నగదు తగ్గింపు, రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌ను కంపెనీ అందిస్తోంది. మార్కెట్లో రెనాల్ట్ ట్రైబర్ ప్రారంభ(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర రూ. 5.30 లక్షల నుంచి రూ.7.65 లక్షలుగా ఉంది. చదవండి: వాహనదారులకు అదిరిపోయే శుభవార్త! -
రెనాల్ట్ : 15 వేల మంది తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సంక్షోభంగా కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ చేరింది. అమ్మకాలు మందగించడంతో 15 వేల మందిని తొలగిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అలాగే కొన్ని ప్లాంట్లను పునర్వవస్థీకరణ చేయనున్నామనీ, ఇందుకు యూనియన్లతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 15 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. వీరిలో ప్రధానంగా ఫ్రాన్స్‌కు చెందిన 4,600 మంది ఉన్నారు. ఇతర దేశాల్లో 10 వేల మందికి పైగా ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా1.80 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చేమూడేళ్లలో దాదాపు రూ.16,800 కోట్ల మేర ఖర్చులు తగ్గించుకోవాలనుకున్నట్టుగా వెల్లడించింది. ప్రస్తుత 40 లక్షల కార్ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని 2024 నాటికి 33 లక్షలకు తగ్గించే యోచనలో ఉన్నట్టు వెల్లడించింది. ఉత్పత్తిలో కోత విధించి, మరింత లాభదాయకమైన మోడళ్లపై దృష్టిపెట్టనుంది. (12 వేల మందిని తొలగించనున్న బోయింగ్) కాగా కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా చిన్నా, పెద్ద వ్యాపార సంస్థలు ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. దీంతో నష్టాలను పూడ్చుకోవడానికి, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో జీతాలలో కోత ఉద్యోగులను తొలగించడం చేస్తున్న సంగతి తెలిసిందే. (కోవిడ్-19: రోల్స్ రాయిస్‌లో వేలాదిమందికి ఉద్వాసన) -
ప్రేమికులు మెచ్చే: ‘ట్విజీ’ బుల్లి కారు
సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో15 వ ఎడిషన్‌గా కొనసాగుతున్న ఆటో ఎక్స్పో 2020లో ఫ్రెంచ్ కార్ల తయారీ దారు రెనాల్ట్ ప్రేమికులను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన కారును తీసుకొచ్చింది. ట్విజీ పేరుతో మైక్రో ఎలక్ట్రిక్ వాహనం ఈ వాలెంటైన్స్ డే సీజన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. యూరోపియన్ మార్కెట్లో ట్విజీకి మంచి ఆదరణ లభించిందని కంపెనీ తెలిపింది. రెనాల్ట్ ట్విజీ టాటా నానో కంటే చిన్నది. ఇద్దరు వ్యక్తులకు సరిపోతుంది. ఈ టూ సీటర్ ట్విజీలో 6.1 కిలోవాట్ బ్యాటరీని అమర్చింది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు గంటలు పడుతుంది. ఒకసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. విండ్‌స్క్రీన్, ఇరుకైన బాడీ, డోర్స్ , పనోరమిక్ సన్‌రూఫ్ ఇలా క్రేజీ లుక్స్‌తో ప్రేమికులనుఆకట్టుకోవడం ఖాయం. ఈ కారు సింగిల్ డిజిటల్ కన్సోల్‌ను అమర్చారు. ఈ కారును ఇండియాలో లాంచ్ చేసే ప్రణాళిలేవీ కంపెనీ వెల్లడించలేదు. అయితే రెండవ సీటు చాలా ఇరుకుగా వుండటంతో ఆరడుగుల బులెట్‌లాంటి అబ్బాయిలకు, పొడుగు కాళ్ల సుందరిలకు కొంచెం కష్టమే. చదవండి : ఆటో ఎక్స్పో 2020 : టాప్ ఎలక్ట్రిక్ వాహనాలు, కొత్త ఇంజీన్‌తో ఆకర్షణీయంగా మారుతి ఇగ్నిస్ -
ఆటో ఎక్స్పో: టాప్ ఎలక్ట్రిక్ వాహనాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2020లో దేశ, విదేశాల కార్లు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో త్వరలో అమల్లోకి రానున్న బీఎస్-6 నిబంధనల నేపథ్యంలో బీఎస్-6 ఆధారిత బైక్‌లు, ఎలక్ట్రిక్ కార్లపై ఆయా కంపెనీలు ఎక్కువగా దృష్టి పెట్టాయి. టాటా మోటార్స్, మహీంద్రా వంటి స్వదేశీ వాహన తయారీదారుల నుంచి మొదలు గ్లోబల్ బ్రాండ్లు రెనాల్ట్ , కియా మోటార్స్ వరకు, అనేక మంది తయారీదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించాయి. కొత్త లాంచింగ్ దగ్గర నుంచి తొలిసారి ప్రదర్శన వరకు, 2020 ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వాహనాల సందడే సందడి. ఈ సందర్భంగా ఇప్పటివరకు ప్రదర్శించిన ఈ వాహనాల్లో ప్రముఖంగా నిలిచిన అయిదుకార్లపై ఓ లుక్కేద్దాం. టాటా ఆల్ట్రోజ్ ఈవీ ( ఎలక్ట్రిక్ వాహనం) 2019 జెనీవా మోటార్ షోలో తొలిసారిగా ప్రపంచానికి ఆవిష్కరించిన టాటా ఆల్ట్రోజ్ ఈవీ ఎట్టకేలకు ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో భారత్‌లోకి అడుగుపెట్టింది. టైగర్ ఇ.వి . నెక్సాన్ ఈవీ, ఆల్ట్రోజ్ ఈవీ తరువాత ఇది మూడవ ఎలక్ట్రిక్ కారు.అంతేకాదు భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కానుంది. ఈ ఏడాది చివర్లో లాంచ్ కానున్న టాటా ఆల్ట్రోజ్ ఈవీ .. జిప్ట్రాన్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ టెక్నాలజీతో రానుంది, అంటే ఈ కారు ఒక ఛార్జీతో 250 కిలోమీటర్లు దూసుకుపోతుంది. ఫీచర్లపై పూర్తి స్పష్టత రావాల్సి వుంది. రెనాల్ట్ సీటీ కే-జెడ్ఈ ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో రెనాల్ట్ ఆవిష్కరించిన కారు. సిటీ కె-జెడ్ఈ . ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్విడ్ కారు ఎలక్ట్రిక్ వెర్షన్ . చైనాలో జరిగిన 2019 షాంఘై మోటార్ షోలో మొదటిసారి ప్రదర్శించిన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కే-జెడ్ఈ కాన్సెప్ట్‌పై రూపొందించి, రెనాల్ట్కు చెందిన అతిచిన్న ఈవీ అనిచెప్పవచ్చు. క్విడ్ మాదిరిగా, రెనాల్ట్ సిటీ కే-జెడ్ఈ కూడా సీఎంఎఫ్ ప్లాట్‌ఫాం ఆధారితమే. అయితే ఎలక్ట్రిక్ మోడల్ ప్రస్తుతం చైనాలో మాత్రమే అమ్ముడవుతోంది. మహీంద్రా ఇకేయూవి 100 మహీంద్ర నుంచి అనూహ్యంగా దూసుకొచ్చిన వాహనం ఈకేయూవి 100ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ప్రీ-ప్రొడక్షన్ మోడల్‌ను 2018 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది కంపెనీ. అయితే కంపెనీ దీనిని విడుదల చేసింది, దీని ధర రూ. 8.25 లక్షలు (ఎక్స్-షోరూమ్), ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది. కొత్త స్టైలింగ్‌తో, కొత్త గ్రిల్ బ్లూ ఎలిమెంట్స్‌తో విడుదలైంది. ఎంజీ మార్వెల్ ఎక్స్ ఇది చైనాలోని సాయిక్ గ్రూప్ బ్రాండ్ క్రింద విక్రయించే పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీ. దీనిని మోరిస్ గ్యారేజ్ ఇండియా ఇండియాకు తీసుకువచ్చింది. 2017 షాంఘై ఆటో షోలో ప్రదర్శించిన విజన్ ఇ కాన్సెప్ట్ ఆధారంగా మార్వెల్ ఎక్స్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్లతో పాటు హెవీ క్రోమ్ ఎలిమెంట్స్‌ను జోడించుకుని ఎగ్రెసివ్ లుక్‌లో విడుదలైంది. సిల్వర్ స్కిడ్ ప్లేట్, స్పోర్టి అల్లాయ్ వీల్స్, ,వెనుక ఎల్ఈడీ టైలాంప్స్‌తో వస్తుంది. కియా సోల్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీతో కియా మోటార్స్ తీసుకొచ్చిన వాహనం కియా సోల్ వీవీ. ప్రస్తుతం, దక్షిణ కొరియా మరియు ఇతర గ్లోబల్ మార్కెట్లలో అమ్మకానికి ఉన్న కియా సోల్ లిక్విడ్-కూల్డ్ లిథియం-అయాన్ పాలిమర్ 64 కిలోవాట్ల బ్యాటరీతో 450 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.. 2025 నాటికి భారతదేశంలో 16 ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలని యోచిస్తున్నట్లు కియా ఇంతకుముందే ప్రకటించింది. ఇందులో భాగమే సోల్ ఈవీ. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, క్వాడ్-ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డీఆర్ఎల్లు, ఎల్ఇడి ఫాగ్ లాంప్స్ , ఎల్ఇడి టైల్ లాంప్‌లతో పాటు, హాట్ అండ్ వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ స్టార్ట్-స్టాప్ స్విచ్ ప్రధాన ఫీచర్లు. చదవండి : మారుతి విటారా బ్రెజ్జా సరికొత్తగా , అదరగొడుతున్న పియాజియో స్కూటీలు -
ఆటో ఎక్స్పో: కార్ల జిగేల్.. జిగేల్
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్పో 2020 సంరంభానికి తెరలేచింది. ఫిబ్రవరి 7 నుంచి 12వ తేదీవరకు జరగనున్న ఈ వేడుకనలో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు తమ తమ వాహనాలను ప్రదర్శనకు ఉంచుతాయి. ఈ వేడుకకు ప్రారంభ సన్నాహకం గా ఫిబ్రవరి 5, 6 తేదీల్లో మీడియాకోసం పలు వాహనాలు కొలువు దీరాయి. ముఖ్యంగా మహీంద్ర, మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్తో పాటో, ఫ్రెంచ్ తయారీ దారు రెనాల్ట్ తమ వాహనాలను ఆవిష్కరించాయి. మిషన్ గ్రీన్ మిలియన్ లో భాగంగా రానున్న సంవత్సరాల్లో 10 లక్షల గ్రీన్ కార్లను ( సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్) విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మారుతి వెల్లడించింది. ఈ రోజు మారుతి సుజుకి ఇండియా ఈ రోజు ఆటో ఎక్స్పో 2020 లో ఫ్యూటురో-ఇ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. టాటామోటార్స్ ఫ్రీడం ఇన్‌ప్యూచర్ మొబిలిటీ అనే కాన్సెప్ట్‌తో 13 కార్లను ప్రదర్శించింది. దక్షిణకొరియా దిగ్గజం కియా మోటార్స్ ప్రీమియం సెగ్మెంట్లో మల్టీ పర్పస్ వెహికల్ కార్నివాల్‌ని ఆటోఎక్స్‌పో 2020లో లాంచ్ చేసింది. దీంతోపాటు గ్లోబల్ ఎస్యూవీ ‘సోనెట్’ ను కూడా ప్రదర్శించింది. 2020 ఆటో ఎక్స్‌పోలో హ్యుందాయ్ ఇండియా లే ఫిల్ రూజ్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. -
మార్కెట్లోకి ‘రెనో ట్రైబర్’
ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ రెనో.. భారత మార్కెట్లోకి తన ‘ట్రైబర్’ కారును బుధవారం ప్రవేశపెట్టింది. ఈ కాంపాక్ట్ సెవన్ – సీటర్ మల్టీ పర్పస్ వెహికిల్ ధరల శ్రేణి రూ. 4.95 లక్షలు నుంచి రూ. 6.49 లక్షలుగా ప్రకటించింది. పొడవు 4 మీటర్ల కన్నా తక్కువ ఉన్న ఈ అధునాతన కారులో 1.0–లీటర్ 3–సిలెండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చింది. మొత్తం నాలుగు ఎయిర్ బ్యాగ్‌లు ఉన్నట్లు కంపెనీ వివరించింది. ఈ సందర్భంగా రెనో ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈఓ, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లి మాట్లాడుతూ.. ‘భారత మార్కెట్ కోసమే ప్రత్యేకంగా కార్లను అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడి మార్కెట్లో ఏడాదికి ఒక నూతన కారును ప్రవేశపెట్టనున్నాం. 2022 వరకు వీటి విడుదల ఉండేలా నిర్ణయించాం. గ్రామీణ విక్రయాలను 2022 నాటికి రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్దేశించాం’ అని వ్యాఖ్యానించారు. భారత మార్కెట్లోకి రెనో ఎలక్ట్రిక్ కారు..! ప్రణాళిక ప్రకారం తమ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు వెంకట్రామ్ మామిళ్లపల్లి ప్రకటించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని.. నాణ్యత లేని ఈవీని విడుదలచేసి, వాటిని గ్యారేజీలకు పరిమితం చేయడం కంటే, సమయం తీసుకుని అయినా పటిష్టమైన వాహనాన్ని విడుదలచేస్తామన్నారు. 2022 నాటికి రెనో ఈవీ మార్కెట్లోకి వస్తుందని ప్రకటించారు. -
బడ్జెట్ ధరలో ‘రెనాల్ట్ ట్రైబర్’ వచ్చేసింది
ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనాల్ట్ మొట్టమొదటి మల్టీపర్పస్ వెహికల్ (ఎంపివి)ని లాంచ్ చేసింది. రెనాల్ట్ ట్రైబర్ పేరుతో దీన్ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. రెనాల్ట్ క్విడ్ తరువాత రెండవ మోడల్‌గా దీన్ని తీసుకొచ్చింది. భారత్‌లో ఎక్స్ షోరూం ధర బేసిక్ మోడల్ ధర రూ.4.95 -టాప్ ఎండ్ వేరియంట్ ధర 6.49 లక్షలుగా ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడు సీట్లతో అందుబాటులోకి వచ్చిన రెనాల్ట్ ట్రైబర్‌ను నాలుగు వేరియంట్లలో ఆవిష్కరించింది. రెనాల్ట్ ట్రైబర్ నాలుగు వేరియంట్లు-ధరలు ఆర్ఎక్స్ఈ ధర రూ.4.95 లక్షలు ఆర్ఎక్స్ఎల్ ధర రూ.5.49 లక్షలు ఆర్ఎక్స్టీ ధర రూ.5.99 లక్షలు ఆర్ఎక్స్జెడ్ ధర 6.49 లక్షలు ఇక ఫీచర్ల విషయానికి వస్తే 1.0 లీటర్, 3 సిలిండర్ పెట్రోలక్ష ఇంజీన్, 5 స్పీడ్ మాన్యుల్ ట్రాన్స్మిషన్, 72 పవర్, 96 గరిష్ట్ టార్క్, నాలుగుఎయిర్బ్యాగ్స్, సులువుగా సీట్ల ఎరేంజ్మెంట్, 8 అంగుళాల మల్టీ మీడియా టచ్ స్క్రీన్ ప్రధానంగా ఉన్నాయి. 625 లీటర్ల బూట్ స్పేస్ సదుపాయం ఉండగా.. 6 సీట్ల కారులో 320 లీటర్ల బూట్ స్పేస్, 7 సీట్ల కారులో 84 లీటర్ల స్పేస్ ఉండనుంది. క్యాబిన్ స్టోరేజీ 31 లీటర్ల వరకు ఉండనుంది. డస్టర్, క్యాప్చర్ లాంటి ఎస్‌యూవీలలో అందిస్తున్న ఫీచర్లను ఎంపీవీ ట్రైబర్‌లో జోడించామని రెనాల్ట్ సీఎండీ వెంకటరాం తెలిపారు. రానున్న మూడేళ్లలో ఇండియాలో రెండు లక్షల కార్లను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కాగా రెనాల్ట్ ట్రైబర్ కారు టయోటా ఇన్నోవా, మారుతి ఎర్టిగా కు సరిపోలిన ఫీచర్లతో, వాటి ధరతో పోలిస్తే తక్కువ ధరలో అందుబాటులో గట్టి పోటీ ఇవ్వనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.