
సాక్షి, న్యూఢిల్లీ : ఫ్రాన్స్ కార్ మేకర్ రెనాల్ట్ సరికొత్త సేఫ్టీ ఫీచర్ల అప్‌డేట్‌తో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ ‘కాప్చర్’ మోడల్ కారును లాంచ్ చేసింది. తాజా కేంద్ర నిబంధనలు అనుగుణంగా భద్రతా ప్రమాణాలతో మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.9.5- రూ.13 లక్షల ( ఎక్స్ షోరూం -న్యూఢిల్లీ) మధ్య ధరలను నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన ఎక్సీడ్ ఫ్రంటల్, లాటరల్, పెడెస్ట్రైన్ సేఫ్టీ ఫీచర్లను జోడించినట్లు రెనాల్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.
డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ)తోపాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), బ్రేక్ అసిస్ట్, స్పీడ్ అలర్ట్, రేర్ పార్కింగ్ సెన్సర్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ లాంటి ఫీచర్లను కొత్త కాప్చర్‌లో అదనంగా పొందుపర్చింది. ఈ సేఫ్టీ ఫీచర్లు అన్ని వర్షన్లతో కూడిన న్యూ రెనాల్ట్ కాప్చర్ మోడల్ కార్లలో అందుబాటులో ఉంటాయి. అంతేకాదు వీటితోపాటు పలు ప్రీమియం ఫీచర్లు కూడా చేర్చామని రెనాల్ట్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment