enhanced
-
కష్టపడినా.. ఆదాయం పెరగడం లేదా? అయితే..
రోజులో 10–12 గంటలు, ఎంతో సిన్సియర్‌గా పనిచేసినా, లాభం లేదు.. ఆదాయం అక్కడక్కడే.. ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది..! రూపాయి కూడా మిగలడం లేదు.. ఇలాంటి నిట్టూర్పు, నిరాశా వాతావరణం కొందరిలో కనిపిస్తుంటుంది. ఎప్పుడూ తమ గురించి ఇలా అనుకోవడమే కానీ, పట్టుబట్టి కారణాలేంటని? విశ్లేషించుకుని, సమీక్షించుకునేది కొద్ది మందే ఉంటారు. జీవితంలో మరింత పురోగమనం చెందాలంటే? అందుకు ఎక్కువ గంటలు పనిచేయడం ఒక్కటే ప్రామాణికం కాబోదు. తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందా..? ఆదాయం పెంచుకునే మార్గాలేంటి?.. సమీక్షించుకుని సరైన దిశలో అడుగులు వేస్తే మార్పుకు ఆహ్వానం పలికినట్టే.. వృద్ధి లేకపోవడానికి కారణాలు కొందరు వ్యయాలను నియంత్రించుకోవడంలోనే బిజీగా కనిపిస్తుంటారు. మరికొందరు ఆదాయం పెంచుకునే మార్గాలపైనే దృష్టి పెడతారు. ఖర్చుల నియంత్రణకు సమయం వృ«థా చేయకుండా, ఆదాయం పెంచుకోవడానికే ఆ సమయాన్ని ఖర్చు చేస్తారు. ఇందులో మీరు ఏ రకం అన్నది ప్రశ్నించుకోవాలి. ఆదాయం పెంచుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ, వ్యయ నియంత్రణ పూర్తిగా మన చేతుల్లో ఉండకపోవచ్చు. కూరగాయలు, గ్రోసరీ, స్కూలు ఫీజులు, పెట్రోల్ చార్జీలు, ఇంటి అద్దె వీటిల్లో ఏవీ మన నియంత్రణలో ఉండేవి కావు. ఏ మార్గంలో వెళితే, ఎలా పనిచేస్తే ఆదాయం పెరుగుతుంది? అనేది విశ్లేషించుకోవాలి. ► నిందలతో కాలయాపన చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఈ ఏడాది ‘నాకు కచ్చితంగా పదోన్నతి రావాలి. కానీ, ఆఫీసు రాజకీయాలు దానికి నన్ను దూరం చేశాయి. ఆ ఆర్డర్ నాకు రావాల్సింది. నా పోటీదారు తన్నుకుపోయాడు’ ఈ తరహా ఆక్షేపణలతో వచ్చేది ఏమీ ఉండదు. ఎందుకు రాలేదో? నిజాయితీగా విశ్లే షించుకుని, కారణాలను గుర్తించినప్పుడే అదే అనుభవం పునరావృతం కాకుండా ఉంటుంది. ► నాకేంటి? ఏ పని చేసినా అందులో నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఈ ఆలోచన కూడా ఆదాయం పెరగకపోవడానికి, అవకాశాలను గుర్తించకపోవడానికి అడ్డుగా ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణ. ఒక ఉదాహరణ చూద్దాం. ఇద్దరు మిత్రులు ఒక హోటల్‌కు వెళ్లారు. అక్కడ వెయిటర్లు కొందరు ఎవరు టిప్ ఇస్తారన్న దానిపైనే శ్రద్ధ చూపిస్తూ, టిప్ కోసమే పనిచేస్తున్నారు. కానీ, వారికి టిప్ అనుకున్నంత రావడం లేదు. కొందరు శ్రద్ధతో, గౌరవంగా, వేగంగా వచ్చిన వారికి కావాల్సినవి అందిస్తూ, వారిని సంతోష పెట్టడంపై దృష్టి పెట్టారు. వారికి బోలెడంత టిప్ వస్తోంది. ఇక్కడ కార్యాచరణే ఫలితమిస్తుంది. అంచనాలు కాదు. ఆదాయం పెంచుకోవాలని ఉంటుంది. అందుకు ఫలితం ఇవ్వని చోట వెతుక్కుంటే ప్రయోజనం ఏముంటుంది? ► అధిక ఆదాయం ఆశిస్తున్నప్పుడు మీ ఉత్పాదకత ఏ పాటిది? అని ప్రశ్నించుకున్నారా! నైపుణ్యాలు పెంచుకోకుండా వృద్ధి కోరుకోవడం అత్యాశ అవుతుందేమో ఆలోచించాలి. కొందరు తమ నైపుణ్యాలపై పెట్టుబడి పెడుతుంటారు. ఏటా కొంత మొత్తాన్ని పక్కన పెడుతూ, ఆ మొత్తాన్ని నైపుణ్యాల వృద్ధికి ఇన్వెస్ట్ చేస్తుంటారు. మారుతున్న అవసరాలకు అనగుణంగా మీ నుంచి ఉత్పత్తి ఉండాలి. అప్పుడే పురోగతి సాధ్యపడుతుందని గుర్తించాలి. ► మార్గదర్శి లేకపోవడం? చాలా మందికి జీవితంలో మంచి, చెడులు చెప్పి, సరైన మార్గంలో నడిపించే మార్గదర్శకులు ఉండరు. సొంతంగా చేయడం తప్పించి, పెద్దగా ఉండదు. ఒక మార్గదర్శి ఉంటే వచ్చే ఫలితాలు వేరు. ఒక రచయితకు మార్గదర్శి ఉంటే ఎప్పటికప్పుడు మెరుగుపడడానికి వీలుంటుంది. ఒక ఇన్వెస్టర్ తాను సొంతంగా ఇన్వెస్ట్ చేస్తే ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. అప్పటికే పెట్టుబడుల స్వరూపం పూర్తిగా అర్థం చేసుకుని, చక్కని పరిజ్ఞానం ఉన్న వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా వచ్చే ఫలితాలు భిన్నంగా ఉంటాయి. ► ఏ పని చేస్తున్నారు?.. చేసే పనులను బట్టే ఆదాయం ఆధారపడి ఉంటుంది. చేస్తున్న పనిని ఎక్కువ ఫలితం ఇచ్చేవి, తక్కువ ఫలితం ఇచ్చేవి, అసలు ఫలితం ఇవ్వనివి అంటూ మూడు రకాలుగా నిపుణులు చూస్తారు. ఆదాయం పెంచుకోలేని వారిలో ఎక్కువ మందిని గమనించినప్పుడు.. వారు చేసే పనులు ఫలితాన్ని ఇవ్వనివే ఉంటున్నాయి. మీరు చేస్తున్నది కూడా ఇదే అయితే సరిదిద్దుకోవడం ఒక మార్గం. ► మెచ్చేలా పనిచేయకపోవడం! కొందరు ఉద్యోగులు కంపెనీని వీడుతుంటే.. కంపెనీయే బతిమిలాడే సందర్భాలు కనిపిస్తాయి. కొందరు కొన్ని అవసరాలకు ఎప్పుడైనా ఒకటే దుకాణానికి వెళుతుంటారు. అక్కడ లేకపోతేనే మరొక దుకాణం చూసుకుంటారు. అక్కడ ఆ వర్తకుడు అందించే సేవలు, దుకాణాదారు నిర్వహణ, మాటతీరు, ఎక్కువ శ్రేణిలో ఉత్పత్తులు ఉండ డం కారణం ఏదైనా కావచ్చు. అలాంటి ప్రత్యేకతలు చేస్తున్న పనిలో మీరు చూపిస్తే ఆదాయం వృద్ధి చెందుతుందేమో పరిశీలించాలి. మార్పు దిశగా అడుగులు ► మీరు చేస్తున్న పనికి పారితోషికం పెరగాలంటే లేదా బ్యాంక్ బ్యాలన్స్ పెరగాలంటే ముందు ఆలోచనల పరిధిని విస్తృతం చేసుకోవాల్సి ఉంటుంది. గొప్ప ఆలోచనలకు చోటు ఇవ్వాలి. మీ పరిధిని విస్తృతం చేసి, ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించండి. ► పనికి సృజనాత్మక జోడించుకోవాలి. మీకు అప్పగించిన పనిని సాధారణంగా చేసుకుపోవడం వేరు. దాన్ని భిన్నంగా, ఆకర్షణీయంగా చేయడం వేరు. మీకు అప్పగించిన పని.. మీరేంటన్నది చూపించుకునే వేదిక. ఇచ్చిన పనికి ఎంత విలువ జోడించామన్నది కీలకం అవుతుంది. మీకు పని అప్పగిస్తే ప్రశాతంగా నిద్రపోవచ్చు? అన్న నమ్మకం కలిగించారంటే సంస్థకు విలువైన ఆస్తియే అవుతారు. అప్పుడు ఆదాయం దానంతట అదే పెరుగుతుంది. ఖర్చయినా మీకే ప్రాధాన్యం ఇస్తారు. ఆ నైపుణ్యాలు లేకపోతే వాటిని తెచ్చుకోవడంపై ఫోకస్ పెట్టాలి. పనిలో నైపుణ్యాలను పెంచుకునే మార్గాలు కచ్చితంగా ఉంటాయి. సంస్థ కంటే ముందు మీరు మీ పనిలో కొత్తదనాన్ని కోరుకోవడం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ► మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడం కూడా ఆదాయం పెంచుకోవడానికి మార్గం అవుతుంది. చేస్తున్న పనిలోనే కొత్త అవకాశాలను వెతుక్కోవాలి. వాటిని సంస్థతో పంచుకోవాలి. మీ నుంచి వచ్చే ఒక్క ఆవిష్కరణ సక్సెస్ అయినా, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ► ఎంత ప్రయత్నించినా చేస్తున్న పనిలో ఆదాయం పెంచుకోవడం సాధ్యపడడం లేదన్న వారికి మరో ఆదాయ మార్గాన్ని వెతుక్కోవడం ఒక పరిష్కారం కావచ్చు. అయితే, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం లేదా వృత్తికి అదనంగా, రెండో ఆదాయం కోసం ఎంత సమయం కేటాయించగలరనేది ఇక్కడ కీలకం అవుతుంది. ► సమయం చాలడం లేదు? ఈ డైలాగ్ ఎక్కువ మంది నుంచి వినిపిస్తుంటుంది. ఏది చేయాల న్నా వచ్చే సమాధానం ఇదే. పని ప్రదేశంలో ఉ త్పాదకతకు తోడ్పడని, అదనపు కాల హరణంతో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని గుర్తు ంచుకోవాలి. సమయాన్ని వృ«థా చేయకుండా, సద్వినియోగం చేసుకోవడం విజయానికి, అదనపు ఆదాయానికి పునాదిగా గుర్తించాలి. ► అదనపు ఆదాయ వనరులు ఎన్నో ఉన్నాయి. మీరు ఎందులో నిపుణులు అయితే ఆ విభాగానికి సంబంధించి అధ్యాపకులుగా మారొచ్చు. ఆన్లైన్ బోధన చేపట్టవచ్చు. ఫ్రీలాన్స్ వర్క్, డిజిటల్ మార్కెటింగ్ లేదా ఆలోచనలో పదునుంటే స్టార్టప్ పెట్టేయవచ్చు. ఒక్కసారి ఆలోచన చానల్ తెరుచుకుంటే రెండో ఆదాయానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. ఆదాయ మార్గాలు.. పార్ట్‌టైమ్/ఫ్రీలాన్స్ వర్క్ ద్వారా రెండో ఆదాయానికి ఎన్నో మార్గాలున్నట్టే.. అసలు కష్టపడకుండా ఆదాయం సమకూర్చి పెట్టే ‘ప్యాసివ్’ మార్గం కూడా ఒకటి ఉంది. ► రెండు ప్రాపర్టీలు ఉంటే ఒకదానిని అద్దెకు ఇ వ్వడం ద్వారా ప్యాసివ్ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. కార్యాలయ స్థలం ఉన్నా, అందులో కొత భాగాన్ని అద్దెకు ఇచ్చినట్టయితే అలా కూ డా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. లేదంటే బ్యా ంకు డిపాజిట్లలో పెద్ద మొత్తంలో ఉంటే వెన క్కి తీసుకుని ప్రాపర్టీని సమకూర్చుకోవాలి. ► బిల్డింగ్‌లో చిన్న స్పేస్‌ను ఏటీఎం కేంద్రానికి అద్దెకు ఇచ్చుకున్నా చక్కని ఆదాయ వనరు ఏర్పడుతుంది. పట్టణాల్లో ఏటీఎం కేంద్రానికి బ్యాంకులు నెలవారీగా రూ.25–50వేల వరకు చెల్లిస్తున్నాయి. ► పార్కింగ్ స్థలాన్ని అద్దెకు ఇవ్వడం కూడా మంచి ఐడియా. అదనపు పార్కింగ్ స్లాట్లను కొనుగోలు చేసి, ఇతరులకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. పట్టణాల్లో ఖాళీ ప్లాట్/స్థలం ఉన్నా అందులో రూపాయి పెట్టుబడి పెట్టుకుండా పార్కింగ్‌కు అద్దెకు ఇచ్చినా మంచి ఆదాయం సమకూరుతుంది. అందరికీ ప్రాపర్టీ ఉండాలని లేదు. కానీ, మనసుంటే మార్గం ఉంటుందన్నట్టు.. పట్టణానికి శివారులో అయినా ప్రాపర్టీని సమకూర్చుకుని, దానిపై ఆదాయం తెచ్చుకునే మార్గం గురించి ఆలోచిస్తే మార్గం కనిపించొచ్చు. ► భవనంపైన, టెర్రాస్‌లో హోర్డింగ్‌కు స్థలాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూరుతుంది. రహదారికి సమీపంలో మీకు ఇల్లు/స్థలం ఉంటే చాలు. ► వడ్డీ ఆదాయానికి ప్యాసివ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ద్రవ్యోల్బణం కంటే అధిక రాబడినిచ్చే సాధనాలనే ఎంపిక చేసుకోవాలి. బ్యాంకు సేవింగ్స్ డిపాజిట్, ► స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే డివిడెండ్ ఆదాయం మరొక మార్గం. డివిడెండ్ ఆదాయం అన్నది ఆయా కంపెనీల పనితీరు, మార్కెట్ పరిస్థితులు, దేశ ఆర్థిక పరిస్థితులకు ప్రభావితం అవుతుందని గుర్తించాలి. ► కార్లు, వ్యాన్లను కొనుగోలు చేసి, కంపెనీలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం లభిస్తుంది. ► కష్టమా, సుఖమా.. ఎంత మిగులుతుంది? ఇలాంటి వాటికి చోటు ఇవ్వకుండా కృషితో మీకు తోచినది ప్రారంభించండి. మంచి ఫలితమే ఎదురవుతుంది. -
మళ్లీ పదేళ్లు పొడిగింపు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని మళ్లీ 10 ఏళ్లు పొడిగించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. గరిష్ట వయోపరిమితి పొడిగింపు విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని వయస్సు మీరిన నిరుద్యోగ అభ్యర్థులు ఆశిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేసే పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 5 ఏళ్లు పెంచుతూ ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో జనరల్, ఇతర కేటగిరీల నిరుద్యోగుల్లో సైతం అంచనాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరింది. మరో రెండు నెలల్లో ఈ నోటిఫికేషన్లు వచ్చే అవకాశముందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆలోగా గరిష్ట వయోపరిమితి పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయనుందని ఉన్నతస్థాయి అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వంటి శారీరక దృఢత్వం అవసరమైన పోలీసు, జైళ్లు, ఎక్సైజ్, అగ్నిమాపక, అటవీ శాఖల్లోని పోస్టుల మినహా అన్ని శాఖల్లోని ఇతర పోస్టులకు గరిష్ట వయోపరిమితి పొడిగింపును ప్రభుత్వం మళ్లీ వర్తింపజేయనుంది. టీఎస్పీఎస్సీతో సహా అన్ని ప్రభుత్వ నియామక సంస్థల ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యోగాల భర్తీలో ఈ పొడిగింపు వర్తించనుంది. గడువు ముగిసి రెండేళ్లు... ప్రత్యక్ష నియామకాల విధానంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు తాత్కాలికంగా ఏడాది కాలం పాటు పొడిగిస్తూ 2015, జూలై 27న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి తోడుగా గరిష్ట వయోపరిమితిపై ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పిస్తున్న ప్రత్యేక సడలింపులు యథాతథంగా అమలవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. తదనంతర కాలంలో ఈ ఉత్తర్వుల అమలు గడువును మరో రెండు పర్యాయాలు ప్రభుత్వం పొడిగించింది. చివరిసారిగా 2019, జూలై 26తో ఈ ఉత్తర్వుల అమలు గడువు ముగిసిపోగా, మళ్లీ ఇప్పటి వరకు ప్రభుత్వం పొడిగించలేదు. ప్రజాప్రతినిధులు, నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని అప్పట్లో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి గరిష్ట వయోపరిమితి పొడిగింపుపై నిర్ణయం తీసుకుంది. గడువు తీరిన ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక సడలింపులు.. లిమిటెడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో జరిపే ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీల గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు సడలిస్తూ చివరిసారిగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలు గడువు ఈ ఏడాది మేతో ముగిసింది. మళ్లీ ప్రభుత్వం గడువు పొడిగించలేదు. త్వరలో మరో ఐదేళ్ల కాలానికి ఈ మేరకు ప్రత్యేక సడలింపులు కల్పిస్తూ ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయి. -
రెనాల్ట్ ‘కాప్చర్’ మోడర్న్ సేఫ్టీ ఫీచర్లతో
సాక్షి, న్యూఢిల్లీ : ఫ్రాన్స్ కార్ మేకర్ రెనాల్ట్ సరికొత్త సేఫ్టీ ఫీచర్ల అప్డేట్తో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ ‘కాప్చర్’ మోడల్ కారును లాంచ్ చేసింది. తాజా కేంద్ర నిబంధనలు అనుగుణంగా భద్రతా ప్రమాణాలతో మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.9.5- రూ.13 లక్షల ( ఎక్స్ షోరూం -న్యూఢిల్లీ) మధ్య ధరలను నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన ఎక్సీడ్ ఫ్రంటల్, లాటరల్, పెడెస్ట్రైన్ సేఫ్టీ ఫీచర్లను జోడించినట్లు రెనాల్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ)తోపాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), బ్రేక్ అసిస్ట్, స్పీడ్ అలర్ట్, రేర్ పార్కింగ్ సెన్సర్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ లాంటి ఫీచర్లను కొత్త కాప్చర్లో అదనంగా పొందుపర్చింది. ఈ సేఫ్టీ ఫీచర్లు అన్ని వర్షన్లతో కూడిన న్యూ రెనాల్ట్ కాప్చర్ మోడల్ కార్లలో అందుబాటులో ఉంటాయి. అంతేకాదు వీటితోపాటు పలు ప్రీమియం ఫీచర్లు కూడా చేర్చామని రెనాల్ట్ తెలిపింది. -
ఏటీఎంలలో విత్‌డ్రా పరిమితి పెంపు
-
ఏటీఎంలలో విత్‌డ్రా పరిమితి పెంపు
► ఏటీఎం నుంచి ఇక 10 వేలు ► అయితే.. వారానికి 24 వేలే! ► కరెంట్ అకౌంట్ల పరిమితి రూ. లక్షకు పెంపు ► పాత నోట్లు డిపాజిట్ చేసుకునేందుకు ఎన్నారైలకు అదనపు సమయం ముంబై: ఏటీఎంల్లో విత్‌డ్రా పరిమితిని రూ. 10 వేలకు పెంచుతూ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అయితే వారంలో విత్‌డ్రా పరిమితి రూ. 24 వేలను కొనసాగించింది. అలాగే కరెంట్ అకౌంట్ల నుంచి వారానికి రూ. లక్ష వరకు తీసుకోవచ్చని వెల్లడించింది. దీంతో చిన్న స్థాయి వర్తకులకు కాస్త ఊరట లభించనుంది. ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. అలాగే పెద్ద నోట్ల రద్దు సమయంలో విదేశాల్లో ఉన్న ఎన్నారైలు, దేశ పౌరులకు తమ వద్ద ఉన్న పాత రూ. 500, రూ. 1,000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు ఆర్బీఐ అదనపు సమయం ఇచ్చింది. నవంబర్ 9న పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ. 2,500గా ఉన్న విత్‌డ్రా పరిమితిని ఆర్బీఐ జనవరి 1 నుంచి రూ. 4,500కు పెంచిన సంగతి తెలిసిందే. కరెంట్ అకౌంట్లలో వారానికి రూ. 50 వేలుగా ఉన్న పరిమితిని ప్రస్తుతం రూ. లక్షకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్లు రద్దు అయ్యి డిసెంబర్ 30కు 50 రోజులు పూర్తయినా ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ప్రస్తుతం ఆర్బీఐ నిర్ణయంతో ప్రజలకు కాస్త ఊరట లభించనుంది. -
మైక్రో ఏటీఎంలు, 1.3 లక్షల పోస్టాఫీసులు
న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు అనంతరం దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తి కాంత్ దాస్ సోమవారం ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర తగినంత నగదు అందుబాటులో ఉందని భరోసా ఇచ్చిన ఆయన రాబోయే రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిస్థితిని అంచనా వేస్తున్నారని, పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన పరిస్థితిని తాము సమీక్షిస్తున్నామన్నారు. దేశ ప్రజలకు నగదును నేరుగా అందించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశామని, నగదును వేగంగా ఆందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని తపాల కార్యాలయాల్లోనూ నగదు డిపాజిట్ కు ఇబ్బందులు ఉండబోవని తెలిపారు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా నోట్ల మార్పిడి, విత్ డ్రా పరిమితిని పెంచామన్నారు. బ్యాంకుల్లో వారానికి నగదు విత్ డ్రా పరిమితిని రూ.24 వేలకు పెంచామని, ఈ నగదును ఖాతాదారుడు ఒకేరోజైనా లేదా వారంలో ఎప్పుడైనా సరే తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఏటీఎంల వద్ద భద్రత పెంచేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 1.3లక్షల పోస్టాఫీసులను సిద్ధంగా ఉంచనున్నట్టు ప్రకటించారు. మరోవైపు రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సమన్వయంతో ప్రత్యేక బృందాల ద్వారా నిఘాను మరింత కట్టుదిట్టం చేశామని ఆయన చెప్పారు. ప్రజలకు సులువుగా నగదు చేర్చే విధానాలను అన్వేషిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో రూ. 500 నోట్ల పంపణీని నిన్ననే ప్రారంభించామని, త్వరలోనే (రేపు లేదా నేడు) రూ.2వేల నోట్లను ఏటీంలలో అందుబాటులోఉంచుతామని చెప్పారు. అలాగే బ్యాంకింగ్ కరస్పాండెట్స్ విత్ డ్రా పరిమితి రూ. 50వేలకు, రోజువారి పరిమితి.2.5 లక్షలకు పెంచుతున్నట్టు వెల్లడించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత 18 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆయన వెల్లడించారు. -
మైక్రో ఏటీఎంలు, 1.3 లక్షల పోస్టాఫీసులు
-
'బ్లాక్ బెరీ'లో కొత్త ఫీచర్లు
న్యూఢిల్లీ: కెనడియన్ మొబైల్ తయారీ సంస్థ బ్లాక్ బెరీ ఇప్పుడు వినియోగదారులకు మరికొన్ని కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. బ్లాక్ బెరీ మొబైల్ నుంచి ఇతరులకు పంపే సందేశాల్లో గోప్యతను పెంచేందుకు, వినియోగదారులే కంటెంట్ ను నియంత్రించే మెరుగైన అవకాశాలను కల్పిస్తోంది. ఈ కొత్త సదుపాయాన్ని ఎటువంటి ఛార్జీలు, ప్రత్యేక ఫీజులు లేకుండా యూజర్లకు అందుబాటులోకి తెస్తోంది. యాండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్లలో ఎటువంటి ఫీజు లేకుండా కొత్త ఐవోఎస్ అప్ డేట్స్ అందిస్తోంది. యూజర్ల సౌకర్యార్థం వారు షేర్ చేసుకునే సందేశాలు, కంటెంట్ తమ నియంత్రణలోనే ఉంచుకునేందుకు బీబీఎం వినియోగదారులకు ఈ కొత్త అభివృద్ధి సహకరిస్తుందని బ్లాక్ బెరీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మాథ్యూటాల్బోట్ ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు తమ ఫోన్ నుంచిపొరపాటున కానీ, ఇష్టప్రకారం కానీ పంపిన మెసేజ్ లు, ఫొటోలు తిరిగి వెనక్కు రప్పించుకునే అవకాశం ఇప్పుడు బ్లాక్ బెరీలో ఉంది. అలాగే తాము పంపిన మెసేజ్ లు, ఫొటోలు ఇతరులకు ఎన్నాళ్ళ పాటు కనిపించాలో కూడా నిర్ణయించేందుకు వీలుగా టైమర్ ను సెట్ చేసుకునే అవకాశం ఇకపై అందుబాటులోకి వస్తుందని మాథ్యూ తెలిపారు. దీనికితోడు కొన్ని అదనపు కీ ఫీచర్లను కూడా బీబీఎం అందుబాటులోకి తెచ్చింది. ఒకరినుంచీ ఒకరికి ఛాట్ మెసేజ్ లను ఫార్వర్డ్ చేసే అవకాశం తోపాటు... విభిన్న వ్యక్తులతో ఛాట్ చేస్తున్నపుడు యాండ్రాయిడ్ లో మ్యూట్ నోటిఫికేషన్లు అందించే సామర్థ్యాన్ని బీబీఎం కొత్తగా కల్పించింది. అంతేకాక ఎన్నో మెరుగైన సందుపాయాలను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన బ్లాక్ బెరీ.. ఇప్పుడు వీడియో షేరింగ్ ఆప్షన్ నూ అందిస్తోంది. ఈ కొత్త పద్ధతిలో అతి పెద్ద వీడియోలను సైతం క్యాప్చర్ చేసి ఇతరులకు షేర్ చేసే అవకాశం ఉంది. ఇవే కాక కొత్త ఛాట్ స్క్రీన్ ను ఐవోఎస్ అందిస్తోంది. యాండ్రాయిడ్ మార్ష్మాల్ల (6.0) ద్వారా ఇప్పుడు బీబీఎం పని చేస్తుంది.