ఏటీఎంలలో విత్డ్రా పరిమితి పెంపు | ATM withdrawal limits enhanced from current limit of Rs 4500 to Rs 10,000 per day, per card. | Sakshi
Sakshi News home page

ఏటీఎంలలో విత్డ్రా పరిమితి పెంపు

Published Mon, Jan 16 2017 5:35 PM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

ఏటీఎంలలో విత్డ్రా పరిమితి పెంపు

ఏటీఎంలలో విత్డ్రా పరిమితి పెంపు

ఏటీఎం నుంచి ఇక 10 వేలు
అయితే.. వారానికి 24 వేలే!
కరెంట్‌ అకౌంట్ల పరిమితి రూ. లక్షకు పెంపు
పాత నోట్లు డిపాజిట్‌ చేసుకునేందుకు ఎన్నారైలకు అదనపు సమయం


ముంబై: ఏటీఎంల్లో విత్‌డ్రా పరిమితిని రూ. 10 వేలకు పెంచుతూ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అయితే వారంలో విత్‌డ్రా పరిమితి రూ. 24 వేలను కొనసాగించింది. అలాగే కరెంట్‌ అకౌంట్ల నుంచి వారానికి రూ. లక్ష వరకు తీసుకోవచ్చని వెల్లడించింది. దీంతో చిన్న స్థాయి వర్తకులకు కాస్త ఊరట లభించనుంది.

ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. అలాగే పెద్ద నోట్ల రద్దు సమయంలో విదేశాల్లో ఉన్న ఎన్నారైలు, దేశ పౌరులకు తమ వద్ద ఉన్న పాత రూ. 500, రూ. 1,000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకునేందుకు ఆర్బీఐ అదనపు సమయం ఇచ్చింది. నవంబర్‌ 9న పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ. 2,500గా ఉన్న విత్‌డ్రా పరిమితిని ఆర్బీఐ జనవరి 1 నుంచి రూ. 4,500కు పెంచిన సంగతి తెలిసిందే.

కరెంట్‌ అకౌంట్లలో వారానికి రూ. 50 వేలుగా ఉన్న పరిమితిని ప్రస్తుతం రూ. లక్షకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్లు రద్దు అయ్యి డిసెంబర్‌ 30కు 50 రోజులు పూర్తయినా ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ప్రస్తుతం ఆర్బీఐ నిర్ణయంతో ప్రజలకు కాస్త ఊరట లభించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement