Rs 10
-
ట్రాయ్ కొత్త రూల్స్.. రూ.10తో రీఛార్జ్
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) 2G సేవలను ఉపయోగిస్తున్న దాదాపు 150 మిలియన్ల భారతీయ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ వంటి వాటికోసం మాత్రమే మొబైల్ ఉపయోగించేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కీప్యాడ్ మొబైల్స్ లేదా 2జీ మొబైల్స్ వాడేవారికి డేటాతో పనిలేదు. అయినప్పటికీ వారు రీఛార్జ్ చేసుకోవాలంటే డేటాకు కూడా కలిపి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ట్రాయ్ కొత్త మార్గదర్శకాలను రూపొందించడంతో.. టెలికాం కంపెనీలు సరసమైన ప్లాన్స్ ప్రారంభించాల్సి ఉంది.రీఛార్జ్ ప్లాన్లు రూ. 10 నుంచికొత్త నిబంధనల ప్రకారం Airtel, Jio, BSNL, Vodafone Idea (Vi) 10 రూపాయల ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉండే టాప్ అప్ వోచర్లను పరిచయం చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా.. ట్రాయ్ రూ. 10 డినామినేషన్‌కు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని తొలగించింది. దీంతో ఏదైనా విలువ కలిగిన టాప్ అప్ వోచర్లను జారీ చేయడానికి ఆపరేటర్లను అనుమతిస్తుంది.ఆన్లైన్ రీఛార్జ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యతకు దృష్టిలో ఉంచుకుని.. కలర్ కోడెడ్ ఫిజికల్ రీఛార్జ్ సిస్టమ్‌ను తొలగించాలని రెగ్యులేటర్ నిర్ణయించింది. ప్రత్యేక టారిఫ్ వోచర్ల చెల్లుబాటును కూడా 90 రోజుల నుంచి 365 రోజులకు పెంచింది. ఇంటర్నెట్ సేవలు అవసరం లేని 2G ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాయిస్.. ఎస్ఎంఎస్ ప్లాన్లను రూపొందించాలని టెలికాం ఆపరేటర్లకు సూచించింది.ఇదీ చదవండి: సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. అదిరిపోయే ఆఫర్స్: రూ. 209తో..ట్రాయ్ మార్గదర్శకాలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. కానీ కంప్లైంట్ రీఛార్జ్ ప్లాన్లను రూపొందించడానికి టెలికాం కంపెనీలకు కొన్ని వారాల సమయం ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక లాంచ్ తేదీని ప్రకటించనప్పటికీ, జనవరి చివరి నాటికి సరసమైన రీఛార్జ్ ప్లాన్లు మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. -
మొన్న జొమాటో.. నేడు స్విగ్గీ: పెరిగిన ప్లాట్‌ఫామ్ ఫీజు
జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచిన తరువాత.. స్విగ్గీ కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. ఇప్పటికే 7 రూపాయలుగా ఉన్న ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 10లకు చేసింది. అంటే మూడు రూపాయలు పెంచిందన్నమాట. కాబట్టి ఇకపైన స్విగ్గీ ప్రతి ఆర్డర్ మీద రూ. 10 ఫీజు వసూలు చేస్తుంది.జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచిన తరువాత స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇప్పటికే యాప్‌లో కనిపిస్తున్నాయి. పండుగ సమయంలో సేవలను నిర్వీరంగా అందించడానికి ఈ ఫీజులను పెంచినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఇప్పుడు జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు కూడా రూ. 10లకు చేరింది.ఫుడ్ డెలివరీ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచడంతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫుడ్ ఆర్డర్ ఉచిత డెలివరీతో ప్రారంభమైంది, ఇప్పుడు జీఎస్టీ, డెలివరీ, ప్యాకింగ్ ఛార్జీలు, ప్లాట్‌ఫారమ్ ఫీజు ఇలా భారీగా పెంచేశారు అని వెల్లడించారు. డెలివరీ చార్జీలకంటే కూడా ప్లాట్‌ఫారమ్ ఫీజు భవిష్యత్తులో ఎక్కువవుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.🚨 Swiggy Also Increased Platform Fee To ₹10This Happened Right After Zomato’s HikeFood Ordering Started With Free Delivery, Now GST, Delivery & Packing Charges, Platform FeeZomato & Swiggy Does 3.5 Million Orders Daily— Ravisutanjani (@Ravisutanjani) October 23, 2024 -
ఫ్లైఓవర్ పైనుంచి కరెన్సీ నోట్లు.. తీసుకునేందుకు ఎగబడ్డ జనం..
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. కేఆర్ మార్కెట్ ప్రాంతంలోని ఫ్లైఓవర్ పై నుంచి కరెన్సీ నోట్లు వెదజల్లాడు. దీంతో వీటిని తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. ఫలితంగా కేఆర్ మార్కెట్ సిగ్నల్ వద్ద వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కోటు ధరించి ఫ్లై ఓవర్‌పైకి వెళ్లిన ఈ యువకుడు ఓ సంచిలో రూ.10 నోట్లు తీసుకెళ్లాడు. అనంతరం వాటిని పైనుంచి కిందకు విసిరేశాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. పోలీసులు అతడి కోసం పైకి వెళ్లగా అప్పటికే అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే అతడ్ని కాసేపటికే మళ్లీ పట్టుకున్నారు. యువకుడి మతిస్తిమితం సరిగ్గా లేనట్లుందని పోలీసులు చెప్పారు. #Bizarre in #Bengaluru#Traffic came to halt on #Sirsi Circle #flyover and the road below it (#KRMarket) after a well-dressed youth went about throwing currency notes. Who was he and why did he do it is not known. @NammaBengaluroo @WFRising @TOIBengaluru @peakbengaluru pic.twitter.com/zXB6mndKm6 — Rakesh Prakash (@rakeshprakash1) January 24, 2023 చదవండి: మరో వివాదంలో డేరా బాబా.. తల్వార్‌తో కేక్ కట్టింగ్.. వీడియో వైరల్.. -
రూ.10 కోసం గొడవ.. ఫ్రెండ్‌ను బండరాయితో కొట్టి దారుణంగా..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సిలీగుడిలో దారుణం జరిగింది. రూ.10 ఇవ్వమని గొడవపడిన స్నేహితుడ్ని ఓ యువకుడు బండరాయితో కొట్టి చంపాడు. వైకంఠపూర్ అడవిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడ్ని రామ్‌ప్రసాద్ సాహాగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ అడిక్ట్.. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రామ్‌ప్రసాద్(20) మత్తుపదార్థాలకు బానిసయ్యాడు.స్నేహితులతో కలిసి తరచూ అడవికి గంజాయి కొనుగోలు చేసేవాడు. సోమవారం కూడా సుబ్రతా దాస్(22), అజయ్ రాయ్(24)తో కలిసి వైకుంఠపూర్ ఫారెస్ట్‌కు వెళ్లారు. మత్తుపదార్థాలు కొనుగోలు చేశారు. అయితే తనకు ఇంకా గంజాయి కావాలని, కొనుగోలు చేసేందుకు రూ.10 ఇవ్వాలని రామ్‌ప్రసాద్ సుబ్రతా దాస్‌ను అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రామ్‌ప్రసాద్‌ను సుబ్రతా దాస్ బండరాయితో కొట్టి చంపాడు. అనంతరం అడవి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు బుధవారం రాత్రి సుబ్రతా దాస్, అజయ్‌ను అరెస్టు చేశారు. ఈ హత్య కేసులో అజయ్ పాత్ర కూడా ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చదవండి: Viral Video: బైకర్ మెడకు చుట్టుకున్న తాడు.. అమాంతం గాల్లో ఎగిరి.. -
పతంజలి వార్షిక టర్నోవర్ @ 10,000 కోట్లు
►ఏపీలోని విజయనగరంలో పతంజలి ఉత్పత్తుల ప్లాంట్ ఏర్పాటు ►యోగా గురు బాబా రాందేవ్ సాక్షి, న్యూఢిల్లీ: ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి సంస్థ వార్షిక టర్నోవర్ రూ. 10,000 కోట్లు దాటిందని, ప్రతి ఏడాది వంద శాతం వృద్ధితో ముందు కెళుతున్న పతంజలి రానున్న ఏడాదిలో రూ. 20 వేల కోట్ల రూపాయలకు మించగలదని ఆ సంస్థ వ్యవస్థాపకుడు యోగా గురు బాబా రాందేవ్ చెప్పారు. గురువారం ఢిల్లీలో పతంజలి సీఈఓ ఆచార్య బాలకిషన్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీ లోని విజయనగరంలో పతంజలి ఉత్పత్తుల ప్లాంట్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. అమర సైనికుల పిల్లల కోసం పతంజలి రెసిడెన్షియల్ సైనిక్ స్కూళ్ల ను ఈ ఏడాది ఏర్పాటు చేస్తామని బాబా రాందేవ్ వెల్లడించారు. 2016–17 కు గాను పతంజలి సంస్థ రూ. 10, 561 కోట్ల టర్నోవర్ సాధించిందని వంట నూనెలు, నెయ్యి, తేనె, గోధుమపిండి లాంటి అనేక విభాగాలలో మార్కెట్ లీడర్‌గా ఎదిగిందని రాందేవ్ చెప్పారు. రాబోయే ఒకటి,రెండేళ్లలో పతంజలి దేశంలోనే అతి పెద్ద బ్రాండ్ అవుతుందని రాందేవ్ ధీమా వ్యక్తం చేశారు. పతంజలి ఆవు నెయ్యి రూ.1,467 కోట్ల టర్నోవర్ సాధించిందని, నెయ్యి ఉత్పత్తుల మార్కెట్లో పతంజలి అగ్రగామిగా నిల్చిందని రాందేవ్ చెప్పారు. విస్తరణ ప్రణాళిక.. ప్రస్తుతం ఉన్న రూ. 35 వేల కోట్ల రూపాయల మేరకు ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని రూ. 60 వేల కోట్ల మేరకు పెంచాలన్నది లక్ష్యమని బాబా రాందేవ్ వివరించారు.అందు కోసం త్వరలో నోయిడా, నాగ్‌పూర్,ఇండోర్, విజయనగరంలలో భారీ సామర్ద్యంతో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే దిశలో ముందు కెళుతున్నామన్నారు. ప్రత్యేకించి విజయనగరంలో సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులతో పాటుగా ఆహార ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. మసాలా దినుసుల రంగంలో పతంజలి సంస్థ ఇంతవరకూ పూర్తిగా దృష్టి సారించలేదని, అయితే దక్షిణాది రాష్ట్రాల మార్కెట్ లక్ష్యంగా విజయనగరంలో పతంజలి ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటవుతుందని బాబా రాందేవ్ చెప్పారు. పతంజలి సంస్థకు ప్రస్తుతం 6 వేల మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని, వచ్చే సంవత్సరానికి వీరి సంఖ్యను 12 వేలకు పెంచుతామన్నారు. 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం... ప్రస్తుత పతంజలి సంస్థ వద్ద లక్ష మంది ఉద్యోగులు పని చేస్తున్నారని,త్వరలోనే 5 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తామని రాందేవ్ చెప్పారు. పరిశోధనకు పతంజలి పెద్ద పీట వేస్తోందని, ఆయుర్వేదంలో 200 మంది నిపుణులు పరిశోధనలు జరుపుతున్నారన్నారు. త్వరలోనే పతంజలి రెస్టారెంట్లు, జీన్స్ ప్రవేశపెట్టడానికి మార్కెట్ రీసెర్చ్ కొనసాగుతోందన్నారు. ఈ విలేకరుల సమావేశం సందర్భంగా బేబి కేర్, బియ్యం, నూనె తదితర ఉత్పత్తుల కొత్త బ్రాండ్లను రాందేవ్ ఆవిష్కరించారు. -
‘ఆ వీడియోలతో వస్తే రూ.పది వేలు ఇస్తాం’
గ్వాలియర్: అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వివాహ కార్యక్రమాలు ఇతర ఉత్సవాల్లో సెలబ్రిటీలు తుపాకులు పేల్చడం పరిపాటి అవుతోంది. ఆ తుపాకులు కావాలని పేలుస్తున్నవి కాదని, అనుకోకుండా జరుగుతున్న సంఘటనలని చెబుతూ వారు తప్పించుకుంటున్నారు. ఇలాంటివి గ్వాలియర్ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో అక్కడి జిల్లా యంత్రాంగం ఒక వినూత్న ఆలోచన చేసింది. పెళ్లి తదితర వేడుకల్లో ఎవరైతే తుపాకీ పేలుస్తారో ఆ చర్యలను వీడియో రికార్డింగ్ చేసి ఆధారాలుగా సమర్పించే వ్యక్తులకు రూ.10 వేలను రివార్డుగా ఇస్తామని ప్రకటించింది. గ్వాలియర్ ప్రాంతంలో విందు, వినోదాలే కాకుండా తమకు సంతోషం కలిగించే ఏ సందర్భాల్లోనైనా మరోమారు ఆలోచించకుండా గాల్లోకి తుపాకులు పెట్టి కాలుస్తుంటారు. దీని వల్ల చాలా సార్లు ప్రాణనష్టం కూడా చోటు చేసుకుంది. ఇలాంటి చర్యలు చట్ట ప్రకారం తప్పు. అయినా, అలాంటి వారిని నిలువరించేందుకు ఆధారాలు సరిగా లభ్యం కావు. దీంతో ఆ చర్యలను అడ్డుకునేందుకు తాజాగా పదివేల రివార్డును ప్రకటించింది. -
ఏటీఎంలలో విత్‌డ్రా పరిమితి పెంపు
-
ఏటీఎంలలో విత్‌డ్రా పరిమితి పెంపు
► ఏటీఎం నుంచి ఇక 10 వేలు ► అయితే.. వారానికి 24 వేలే! ► కరెంట్ అకౌంట్ల పరిమితి రూ. లక్షకు పెంపు ► పాత నోట్లు డిపాజిట్ చేసుకునేందుకు ఎన్నారైలకు అదనపు సమయం ముంబై: ఏటీఎంల్లో విత్‌డ్రా పరిమితిని రూ. 10 వేలకు పెంచుతూ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అయితే వారంలో విత్‌డ్రా పరిమితి రూ. 24 వేలను కొనసాగించింది. అలాగే కరెంట్ అకౌంట్ల నుంచి వారానికి రూ. లక్ష వరకు తీసుకోవచ్చని వెల్లడించింది. దీంతో చిన్న స్థాయి వర్తకులకు కాస్త ఊరట లభించనుంది. ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. అలాగే పెద్ద నోట్ల రద్దు సమయంలో విదేశాల్లో ఉన్న ఎన్నారైలు, దేశ పౌరులకు తమ వద్ద ఉన్న పాత రూ. 500, రూ. 1,000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు ఆర్బీఐ అదనపు సమయం ఇచ్చింది. నవంబర్ 9న పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ. 2,500గా ఉన్న విత్‌డ్రా పరిమితిని ఆర్బీఐ జనవరి 1 నుంచి రూ. 4,500కు పెంచిన సంగతి తెలిసిందే. కరెంట్ అకౌంట్లలో వారానికి రూ. 50 వేలుగా ఉన్న పరిమితిని ప్రస్తుతం రూ. లక్షకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్లు రద్దు అయ్యి డిసెంబర్ 30కు 50 రోజులు పూర్తయినా ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ప్రస్తుతం ఆర్బీఐ నిర్ణయంతో ప్రజలకు కాస్త ఊరట లభించనుంది. -
ఎన్ఎస్ఈ ఐపీఓ రూ. 10,000 కోట్లు!
11 కోట్ల షేర్లు(20–25% వాటా) జారీ పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి దరఖాస్తు.. న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) పత్రాలను సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించాలని ఎన్ఎస్ఈ భావిస్తోంది. ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద ఐపీఓ కానున్నది. ఈ ఐపీఓలో భాగంగా ఎన్ఎస్ఈలో 20–25 శాతం వాటా(సుమారుగా 11 కోట్ల షేర్ల)ను ఎన్ఎస్ఈలో ప్రస్తుతం వాటా కలిగిన సంస్థలు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నాయి. ఎన్ఎస్ఈ విలువ రూ.50,000–55,000 కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ ఐపీఓ ప్రక్రియ కోసం ఒక లిస్టింగ్ కమిటీని కూడా ఎన్ఎస్ఈ ఏర్పాటు చేసింది. ఐపీఓ సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఎన్ఎస్ఈ ఎండీ, సీఈఓ చిత్ర రామకృష్ణ అనూహ్యంగా రాజీనామా చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికి ఎన్ఎస్ఈ రూ.588 కోట్ల నికర లాభాన్ని, రూ.1,344 కోట్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించింది. బీఎస్ఈ కూడా... బీఎస్ఈ కూడా ఐపీఓ పత్రాలను ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే సెబీకి సమర్పించింది. రూ.1,500 కోట్లు సమీకరించాలనేది ప్రణాళిక. బీఎస్ఈ ప్రమోట్ చేసిన సీడీఎస్ఎల్(సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్) కూడా తాజాగా ఐపీఓ పత్రాలను దాఖలు చేసింది. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్(ఎంసీఎక్స్)...భారత్‌లో ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్లో లిస్టయిన స్టాక్ ఎక్సే్చంజ్ ఇదొక్కటే. -
జన్‌ధన్ విత్‌డ్రా పై ఆర్బీఐ మార్గదర్శకాలు
-
రిలయన్స్ అధినేతకు భారీ షాక్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీకి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తన బావుల పక్కనే ఉన్న ఓఎన్జీసీ బావుల నుంచి గ్యాస్‌ను తోడివేయడంపై వివాదంలో ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి భారీ పరిహారాన్ని విధించింది. ఈ వివాదంలో 1.55 బిలియన్ డాలర్లు( సుమారు 10వేల312 కోట్లు) జరిమానా విధించింది. ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్-జీసీ -రిలయెన్స్ సంస్థకు చెందిన కేజీ- డీ 6 బ్లాక్ మధ్య నడుస్తున్న గ్యాస్ వివాదంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడు సంవత్సరాలుగా కేజీ బేసిన్లో సహజవాయువును తోడుకుంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వాముల నుంచి ఈ పరిహారాన్ని కోరుతూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది కాగా ఓఎన్జీసీ గ్యాస్‌ను ఆర్ఐఎల్ ఉత్పత్తి చేసినందున అందుకు పరిహారంగా చెల్లించాల్సిన మొత్తాన్ని చమురు మంత్రిత్వ శాఖకు చెందిన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్)1 బిలియన్ డార్లుగా ( సుమారు రూ. 6652.75 కోట్లుగా) లెక్క కట్టింది. ఈ అంచనాలను ఆయిల్ మంత్రిత్వ శాఖకు అందచేసిన సంగతి తెలిసిందే. -
బడ్జెట్ ఫ్రెండ్లీ కూల్ ప్యాడ్ నోట్ 5 వచ్చేసింది
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ కూల్ ప్యాడ్ మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. కూల్ ప్యాడ్ నోట్ లతో మార్కెట్లో హల్ చల్ చేస్తున్న సంస్థ ఈ సిరీస్ లో ఇపుడు 'కూల్ ప్యాడ్ నోట్ 5'ను విడుదల చేసింది. ఈ 4 జీ ఎనేబుల్డ్ స్మార్ట్ ఫోన్ ధరను రూ.10,999 గా కంపెనీ నిర్ణయించింది. తక్కువ వెలుగులోకూడా మంచి ఫోటోల అనుభవాన్ని మిగిల్చే తమ తాజా డివైస్ ను అమెజాన్ ద్వారా అక్టోబర్ 18 ఓపెన్ సేల్ అందుబాటులో ఉంచినట్టు కంపెనీ తెలిపింది.భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కూల్ ప్యాడ్ నోట్ 5 లాంచ్ చేయడం సంతోషంగాఉందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ లువో జాంగ్ షెంగ్ విలేకరులకు తెలిపారు. ప్రస్తుత పోటీ మార్కెట్లో అత్యధికంగా విక్రయిస్తున్న ఫోన్లలో ఇది కూడా ఒకటన్నారు. 'కూల్ ప్యాడ్ నోట్ 5' ఫీచర్లు 5.5 అంగుళాల డిస్ ప్లే క్వాల్కం ఎస్డీ 617 ఆక్టాకోర్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ 64 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ ఈడీ ఫ్లాష్, 13ఎంపీ వెనుక కెమెరా, విత్ ఎల్ ఈడీ ఫ్లాష్, 4010 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆకర్షణీయమైన ఫీచర్స్ తో తమ బడ్జెట్ ఫ్రెండ్లీ, పవర్ ప్యాక్డ్ డివైస్ వినియోగదారులకు ఆకట్టుకుంటుందని కూల్ ప్యాడ్ సీఈవో సయ్యద్ తాజుద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ , బెంగళూరు, చెన్నైలలో ఆఫ్ లైన్ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం తర్వాత మరో రెండు మూడు నెలల్లోమరో 13 నగరాల్లో లాంచ్ చేయనున్నట్టుచెప్పారు. -
టాటా పవర్ రూ. 10 వేల కోట్ల భారీ డీల్
రూ.10వేల కోట్ల భారీ డీల్ న్యూఢిల్లీ : వెల్స్ పన్ ఎనర్జీ రెన్యూవబుల్స్ ఆస్తులను టాటా పవర్ భారీ డీల్‌కు చేజిక్కించుకుంది. దాదాపు రూ.10 వేల కోట్లకు గ్రీన్ ఎనర్జీలో వెల్స్పన్ ఆస్తులను కొనుగోలు చేసింది. ఆదివారం రాత్రి ఈ ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ఓ ప్రకటనలో తెలిపింది. షేర్ కొనుగోలు ఒప్పందంపై వెల్స్పన్ రెన్యూవబుల్ ఎనర్జీల 1.1 జీడబ్ల్యూ రెన్యూవబుల్ పోర్ట్ ఫోలియోను కొనుగోలు చేసినట్టు తెలిపింది. విలీనం, కొనుగోలు ఒప్పందాల్లో దేశంలో జరిగిన అతి పెద్ద ఒప్పందం ఇదేనని ప్రకటించింది. దేశంతో పాటు ఆసియాలోనూ ఇదే అతి పెద్ద డీల్ అని పేర్కొంది. వెల్స్పన్ ఎనర్జీలో వెల్స్పన్ రెన్యూవబుల్స్ 100 శాతం సబ్సిడీ ఇస్తున్నాయి. 1,140 మెగా వాట్ ల రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టులను ఈ కంపెనీ కలిగిఉంది. వాటిలో 990 మెగావాట్ల సోలార్ పవర్ కూడా ఉంది. దేశంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్స్ గా ఇవి పేరు తెచ్చుకున్నాయి. 150 మెగా వాట్ల విండ్ పవర్‌ను దేశం మొత్తం మీద పది రాష్ట్రాల్లో విస్తరించాయి. అయితే ఈ ఒప్పంద ఫైనాన్షియల్ వివరాలను బయటకు పొక్కనీయలేదు. కేవలం రూ.10 వేల కోట్లకు మాత్రమే కొనుగోలు చేసినట్టు ప్రకటించాయి. ఈక్విటీ కాంపొనెంట్ కింద రూ. 3,650 కోట్లను టాటా పవర్ చెల్లించనుంది. మిగతా బాకీని రుణదాతల సమ్మతితో రీఫైనాన్స్ చేయాలని టాటా పవర్ చూస్తోంది. -
'అమరావతి'కి తలా రూ.10 ఇవ్వండి..
- రాజధాని నిర్మాణం కోసం విద్యార్థుల నుంచి విరాళాలు కోరిన ప్రభుత్వం - సేకరణ బాధ్యతలు డీఈవోలకు అప్పగిస్తూ జీవో జారీ హైదరాబాద్: రాజధాని భూములను విదేశీ ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయాలని భావిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు అమరావతి నిర్మాణం కోసమని విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు విధిగా రూ. 10 విరాళాన్ని ఇవ్వాలి. విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా విరాళం ఇవ్వాల్సిందే. విరాళాలు సేకరించే బాధ్యత డీఈవోలది. ఒక్క పాఠశాలలే కాక ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి కూడా విరాళం సేకరించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. అన్ని స్థాయిల్లో కలిపి ఏపీలో దాదాపు 50 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో చాలా మంది నిరుపేద విధ్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఉపకారవేతనమే ఆధారం. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణం కోసమంటూ విద్యార్థుల నుంచి విరాళాలు కోరడంపై పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. -
అమరావతి ఇటుక ధర రూ.10
-
అమరావతి ఇటుక ధర రూ.10
‘మై బ్రిక్-మై అమరావతి’ వెబ్సైట్ ప్రారంభం సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతి నిర్మాణంలో అందరి సహకారం తీసుకొనేందుకు ఈ-బ్రిక్స్ పోర్టల్ ప్రారంభమైంది. ‘మై బ్రిక్-మై అమరావతి’ పేరుతో ఈ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. ఒక డిజిటల్ ఇటుక ధర రూ.10గా నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కనీసం ఒక ఇటుకనైనా విరాళంగా ఇచ్చేందుగా వీలుగా ఈ ఆన్లైన్ ఇటుకల అందజేత విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎవరైనా రూ.10 చెల్లించి ఒక డిజిటల్ ఇటుకను కొనుగోలు చేయవచ్చు. ఈ సొమ్మును రాజధాని నిర్మాణానికి ఖర్చు చేసా ్తరు. అమరావతి ఇటుకను కొనుగోలు చేసిన వారికి సీఎం సంతకంతో ఉన్న సర్టిఫికెట్‌ను పంపిం చాలని నిర్ణయించారు. ఠీఠీఠీ.్చఝ్చట్చఠ్చ్టిజీ.జౌఠి.జీ వెబ్సైట్లో కి వెళ్లి డిజిటల్ ఇటుకలను కొనుక్కోవచ్చు. వెబ్సైట్ ప్రారంభించిన తర్వాత ఏపీ సీఆర్డీఏ అధికారులు, ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ.5.22 లక్షలతో 52 వేల ఈ-బ్రిక్స్‌ను కొనుగోలు చేశారు. సింగపూర్‌కు చెందిన శ్రీనివాస్ 108 ఇటుకలను కొనుగోలు చేశారు. తొలిరోజు సాయంత్రం 7 గంటల వరకూ 72 మంది 62,576 ఈ-బ్రిక్స్‌ను కొనుగోలు చేశారు. శంకుస్థాపన ఖర్చు రూ.10 కోట్లే రాష్ట్ర రాజధాని శంకుస్థాపనకు రూ.వందల కోట్లు ఖర్చు పెడుతున్నామనడం నిజం కాదని, రూ.10 కోట్లతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ చెప్పారు. వారు గురువారం విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలోని మీడియా పాయింట్ వద్ద మా ట్లాడారు. విమానాలు, హెలికాప్టర్లను చాలామంది స్పాన్సర్ చేస్తున్నారని, వాటికి హెలిప్యాడ్లు, పార్కింగ్ వసతిని మాత్రమే ప్రభుత్వం సమకూరుస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం తరుపున కేవలం ఒకట్రెండు విమానాలు మాత్రమే ఏర్పాటు చేస్తున్నామన్నారు. జగన్‌ను సీఎం స్వయంగా ఆహ్వానిస్తారు రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిస్తారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల తరపున ప్రభుత్వం ఆయనను ఆహ్వానిస్తుందని చెప్పారు.