బడ్జెట్ ఫ్రెండ్లీ కూల్ ప్యాడ్ నోట్ 5 వచ్చేసింది | At Rs 10,999, Coolpad Note 5 arrives to disrupt Indian market | Sakshi
Sakshi News home page

బడ్జెట్ ఫ్రెండ్లీ కూల్ ప్యాడ్ నోట్ 5 వచ్చేసింది

Published Fri, Sep 30 2016 4:23 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

బడ్జెట్ ఫ్రెండ్లీ కూల్ ప్యాడ్ నోట్ 5 వచ్చేసింది

బడ్జెట్ ఫ్రెండ్లీ కూల్ ప్యాడ్ నోట్ 5 వచ్చేసింది

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ కూల్ ప్యాడ్ మరో స్మార్ట్ ఫోన్  ను మార్కెట్లో లాంచ్ చేసింది.  కూల్ ప్యాడ్ నోట్  లతో మార్కెట్లో హల్ చల్ చేస్తున్న సంస్థ ఈ సిరీస్ లో  ఇపుడు 'కూల్ ప్యాడ్ నోట్ 5'ను విడుదల చేసింది. ఈ 4 జీ ఎనేబుల్డ్ స్మార్ట్ ఫోన్  ధరను రూ.10,999 గా కంపెనీ నిర్ణయించింది. తక్కువ వెలుగులోకూడా మంచి ఫోటోల  అనుభవాన్ని మిగిల్చే తమ తాజా డివైస్ ను  అమెజాన్ ద్వారా అక్టోబర్ 18 ఓపెన్ సేల్ అందుబాటులో ఉంచినట్టు కంపెనీ తెలిపింది.భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కూల్ ప్యాడ్  నోట్ 5  లాంచ్ చేయడం సంతోషంగాఉందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ లువో జాంగ్ షెంగ్  విలేకరులకు తెలిపారు.  ప్రస్తుత పోటీ మార్కెట్లో అత్యధికంగా విక్రయిస్తున్న ఫోన్లలో ఇది కూడా ఒకటన్నారు.

'కూల్ ప్యాడ్ నోట్ 5' ఫీచర్లు
5.5  అంగుళాల డిస్ ప్లే
క్వాల్కం ఎస్డీ 617 ఆక్టాకోర్ ప్రాసెసర్
4జీబీ ర్యామ్,
32 జీబీ ఇంటర్నల్  మెమొరీ
64 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ,
8ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ ఈడీ ఫ్లాష్,
13ఎంపీ వెనుక కెమెరా, విత్ ఎల్ ఈడీ ఫ్లాష్,
4010 ఎంఏహెచ్ బ్యాటరీ,

ఆకర్షణీయమైన ఫీచర్స్ తో  తమ బడ్జెట్ ఫ్రెండ్లీ, పవర్ ప్యాక్డ్   డివైస్  వినియోగదారులకు ఆకట్టుకుంటుందని  కూల్ ప్యాడ్ సీఈవో సయ్యద్ తాజుద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు.  ఢిల్లీ , బెంగళూరు, చెన్నైలలో ఆఫ్ లైన్  పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం తర్వాత మరో రెండు మూడు నెలల్లోమరో 13 నగరాల్లో లాంచ్ చేయనున్నట్టుచెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement