Man Kills Friend For Rs 10 In West Bengal Siliguri Forest, Details Inside - Sakshi
Sakshi News home page

రూ.10 కోసం గొడవ.. ఫ్రెండ్‌ను బండరాయితో కొట్టి దారుణంగా..

Published Thu, Dec 15 2022 4:39 PM | Last Updated on Thu, Dec 15 2022 6:43 PM

Man Kills Friend Over Rs 10 West Bengal Siliguri - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సిలీగుడిలో దారుణం జరిగింది. రూ.10 ఇ‍వ్వమని గొడవపడిన స్నేహితుడ్ని ఓ యువకుడు బండరాయితో కొట్టి చంపాడు. వైకంఠపూర్ అడవిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడ్ని రామ్‌ప్రసాద్ సాహాగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

డ్రగ్ అడిక్ట్..
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రామ్‌ప్రసాద్(20) మత్తుపదార్థాలకు బానిసయ్యాడు.స్నేహితులతో కలిసి తరచూ అడవికి గంజాయి కొనుగోలు చేసేవాడు. సోమవారం కూడా సుబ్రతా దాస్(22), అజయ్ రాయ్(24)తో కలిసి వైకుంఠపూర్ ఫారెస్ట్‌కు వెళ్లారు.  మత్తుపదార్థాలు కొనుగోలు చేశారు.

అయితే తనకు ఇంకా గంజాయి కావాలని, కొనుగోలు చేసేందుకు రూ.10 ఇవ్వాలని రామ్‌ప్రసాద్ సుబ్రతా దాస్‌ను అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రామ్‌ప్రసాద్‌ను సుబ్రతా దాస్ బండరాయితో కొట్టి చంపాడు. అనంతరం అడవి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు బుధవారం రాత్రి సుబ్రతా దాస్, అజయ్‌ను అరెస్టు చేశారు. ఈ హత్య కేసులో అజయ్ పాత్ర కూడా ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
చదవండి: Viral Video: బైకర్ మెడకు చుట్టుకున్న తాడు.. అమాంతం గాల్లో ఎగిరి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement