siliguri
-
Priya Chhetri: ప్రియమైన విజయం
రెండేళ్ల కిందట ... ప్రియా ఛత్రి ఒక నిస్సహాయ మహిళ. ఢిల్లీ, గుర్గావ్లో ఓ క్లినిక్ ముందు నిలబడి అగమ్యగోచరంగా ఉన్న భవిష్యత్తును ఊహించుకుంటూ కన్నీళ్ల పర్యంతమైంది. భర్త తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. పరీక్ష చేసిన డాక్టరు రాసిచ్చిన మందుల చీటీ ఆమె చేతిలో ఉంది. చీటీ అనడం అలవాటైన మాట, కానీ ఆమె చేతిలో ఉన్నది మందుల జాబితా. ఆ మందులు వాడాలంటే తను, భర్త సంపాదిస్తున్న డబ్బు చాలదు. మందులకు ఖర్చు చేస్తే ఇల్లు గడవదు. ఇల్లు గడిస్తే వైద్యం అందదు. తనేమో నాలుగు ఇళ్లలో పనులు చేస్తుంది. భర్త సంజీత్ ఒక ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి నుంచి బతుకుదెరువు కోసం దేశ రాజధాని బాట పట్టిన అనేక కుటుంబాల్లో ప్రియ కుటుంబం ఒకటి. ఇరవై నాలుగేళ్ల వయసులో జీవితం ఆమెకి పెట్టిన పరీక్ష అది. ఆ పరీక్షలో నెగ్గిన ప్రియ ఇప్పుడు సిలిగురిలో తోటి మహిళలకు రోల్ మోడల్ అయింది. ఇంతకీ ఆమె చేసిన పనేంటి అంటే... మనదేశంలో పండని పండ్లను, గింజలను ఇంటింటికీ చేర్చడమే. తాజాగా, నాణ్యంగా ఉన్న పండ్లను ఇస్తుందన్న విశ్వాసాన్ని చూరగొన్నది. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ వారి వారి పనులు చేసుకుంటూనే పండ్ల వ్యాపారం చేస్తూ నెలకు ముఫ్పైవేల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇందుకు ఆమె పెట్టుబడి తన శ్రమ మాత్రమే. ఆమెకు అండగా నిలిచింది ఆమె పని చేస్తున్న ఇంటి యజమాని రాశి సోమన్ గొప్ప మనసు. జీవితం పండింది ప్రియ తన పండ్లు, గింజల వ్యాపారానికి తాను పని చేసే ఇళ్ల నుంచే కస్టమర్లను వెతుక్కుంది. తొలి ప్రయత్నంగా ఢిల్లీ మండి నుంచి పది అవకాడోలు తెచ్చింది. మూడు వందల ఆదాయం వచ్చింది. ‘‘రాశి అక్క నాకు ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీకి తీసుకెళ్లి చూపించింది. మన దేశంలో అరుదుగా లభించే పరదేశీ పండ్ల గురించి వివరించింది. సాధారణంగా ఒక పండు హోల్‌సేట్ మార్కెట్ నుంచి తినేవారి చేతికి వచ్చే మధ్యలో ఎన్నో చేతులు మారుతుంది. అనేక దఫాలు రవాణా అవుతుంది. పండ్ల దుకాణానికి చేరి పండ్లు కొనేవారికి అందేలోపు వాడిపోయేవి, కుళ్లిపోయేవి ఎన్నో. దుకాణదారులు ఆ నష్టాలను కూడా బాగున్న పండ్ల మీదనే రాబట్టుకోవాలి. నేను మండీ నుంచి కొనే గింజలు, పండ్లు తక్కువ మోతాదులో ఉంటాయి. అవి కూడా నా కస్టమర్లకు అవసరమైన పండ్లనే తెస్తాను. కాబట్టి నా దగ్గర నిల్వ ఉండవు. తెచ్చిన రోజే కస్టమర్లకు చేరుస్తాను. అలాగే నాణ్యమైన పండ్లను మాత్రమే తెస్తాను. ఏరోజుకారోజు తాజా పండ్లను తినే వెసులుబాటును కల్పిస్తున్నాను. కాబట్టి నా దగ్గర క్రమం తప్పకుండా పండ్లు తెప్పించుకునే వాళ్లు 250 మంది ఉన్నారు. అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చాను. వారానికి ఒకసారి తెప్పించుకునే వాళ్లు ఆదివారం రోజు గూగుల్ ఫార్మ్‌లో వాళ్లకు అవసరమైనవి తెలియచేస్తారు. గురువారం వాళ్లకు అందచేస్తాను. ఇవి కాకుండా తాజా పండ్లు రోజూ తెప్పించుకునే వాళ్లకు అలాగే అందిస్తున్నాను. పండ్ల దుకాణంలో దరకంటే చాలా తక్కువగా లభిస్తుండడంతో నా ప్రయత్నం విజయవంతమైంది. రెడ్ గ్లోబ్ గ్రేప్స్, బ్లూ బెర్రీ, మాండేరియన్స్, గోల్డెన్ కివీ, గ్రీన్ కివీ వంటి పండ్లతోపాటు వాల్నట్స్, ఫిగ్, విదేశీ ఖర్జూరాలు, హాజిల్‌నట్, క్రాన్బెర్రీ, మంచి జీడిపప్పు, బాదం వంటివి 30 రకాలు అందిస్తున్నాను. నేను, సంజీత్ మా ఉద్యోగాలు చేసుకుంటూ ఈ వ్యాపారం చేస్తున్నాం. దీనిని వ్యాపారం, లాభాలు అనాలా లేక నేను అందిస్తున్న సర్వీస్‌కి లభిస్తున్న చార్జ్ అనాలో తెలియదు. కానీ నా పిల్లలు కూడా ప్యాకింగ్, డెలివరీ వంటి పనుల్లో సాయం చేస్తున్నారు. నాకు పద్దెనిమిదేళ్లకే పెళ్లయింది. దాంతో పదకొండవ తరగతితోనే చదువు ఆగిపోయింది. నాకున్న కొద్దిపాటి చదువుతో, నా శ్రమను పెట్టుబడి పెట్టాను. పెద్ద చదువులు చదివిన వాళ్లకంటే తక్కువేమీ కాదని ఈ ఏడాది మహిళాదినోత్సవం రోజు నా గురించి పేపర్లో రాశారు. అంతా మా యజమాని రాశి అక్క సహాయమే’’ అన్నది ప్రియా ఛత్రి. జీవితం ప్రతి ఒక్కరికీ పరీక్షలు పెట్టి విజేతలుగా నిలబెట్టాలని చూస్తుంది. ఆ పరీక్షలో విజయవంతమైన వాళ్లు విజేతలుగా నిలుస్తారు. పరీక్ష నుంచి పారిపోయిన వాళ్లు పరీక్షతోపాటు జీవితేచ్ఛను కూడా పోగొట్టుకున్న పరాజితులుగా మిగులుతారు. ప్రియా ఛత్రి తన జీవితానికి తానే రక్షణ గొడుగు పట్టుకుంది. -
రూ.10 కోసం గొడవ.. ఫ్రెండ్‌ను బండరాయితో కొట్టి దారుణంగా..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సిలీగుడిలో దారుణం జరిగింది. రూ.10 ఇవ్వమని గొడవపడిన స్నేహితుడ్ని ఓ యువకుడు బండరాయితో కొట్టి చంపాడు. వైకంఠపూర్ అడవిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడ్ని రామ్‌ప్రసాద్ సాహాగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ అడిక్ట్.. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రామ్‌ప్రసాద్(20) మత్తుపదార్థాలకు బానిసయ్యాడు.స్నేహితులతో కలిసి తరచూ అడవికి గంజాయి కొనుగోలు చేసేవాడు. సోమవారం కూడా సుబ్రతా దాస్(22), అజయ్ రాయ్(24)తో కలిసి వైకుంఠపూర్ ఫారెస్ట్‌కు వెళ్లారు. మత్తుపదార్థాలు కొనుగోలు చేశారు. అయితే తనకు ఇంకా గంజాయి కావాలని, కొనుగోలు చేసేందుకు రూ.10 ఇవ్వాలని రామ్‌ప్రసాద్ సుబ్రతా దాస్‌ను అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రామ్‌ప్రసాద్‌ను సుబ్రతా దాస్ బండరాయితో కొట్టి చంపాడు. అనంతరం అడవి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు బుధవారం రాత్రి సుబ్రతా దాస్, అజయ్‌ను అరెస్టు చేశారు. ఈ హత్య కేసులో అజయ్ పాత్ర కూడా ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చదవండి: Viral Video: బైకర్ మెడకు చుట్టుకున్న తాడు.. అమాంతం గాల్లో ఎగిరి.. -
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత
కోల్‌కతా: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లో గురువారం హైవేల శంకుస్థాపనకు వెళ్లిన గడ్కరీ.. దగాపూర్ మైదానం వేదికపై ఉండగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు కార్యక్రమాన్ని ఆపేశారు. కేంద్ర మంత్రిని విశ్రాంతి కోసం పక్కనన్న గ్రీన్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. సిలిగురి నుంచి డాక్టర్‌ను పిలిపించారు. ఈ మేరకు ఆయనను పరీక్షించిన వైద్యులు బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ తగ్గినట్టు తెలిపారు. వైద్యుల సూచనతో సెలైన్ ఎక్కించారు. డార్జిలింగ్ బీజేపీ ఎంపీ రాజు బిస్తా నితిన్ గడ్కరీని కారులో తన నివాసానికి తీసుకెళ్లారు. మటిగారలోని తన నివాసంలో గడ్కరీకి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్య బృందం రాజు బిస్తా నివాసానికి చేరుకుంది. కాగా రూ. 1,206 కోట్ల విలువైన మూడు నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు నితిన్ గడ్కరీ వెళ్లారు. ఈలోపే సిలిగురిలో అస్వస్థతకు లోనయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత గడ్కరీ దల్ఖోలాకు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఈవెంట్ రద్దు అయినట్లు తెలుస్తోంది. సిలిగురి నుండి అయన నేరుగా ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉంది. చదవండి: తొలిసారిగా.. 45 ఏళ్ల రాజకీయ చరిత్రకు బ్రేక్ -
ఢిల్లీ హత్య కేసు మరవకముందే.. మరో దారుణం.. ప్రియురాలిని చంపి
లక్నో: యావత్ దేశాన్ని షాక్ గురిచేసిన ఢిల్లీలో శ్రద్ధా దారుణ హత్య మరవక ముందే ఉత్తర ప్రదేశ్‌లో మరో ఘోరం వెలుగు చూసింది. భర్తను విడిచి వచ్చేందుకు నిరాకరించందని ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు ఓ ఉన్మాది. వివాహితను హత్య చేసిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో లైవ్ పెట్టి ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. ఈ ఘటన సిలిగురి ప్రాంతంలోని న్యూ జల్పైగురి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. హత్యకు గురైన యువతిని రియా బిస్వాప్, నిందితుడు కిరణ్ దేబ్‌నాథ్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్లుగా రిలేషన్ నదియా జిల్లాకు చెందిన రియా అనే మహిళ తన భర్త రోమియో బిస్వాస్‌తో కలిసి సిలిగురిలో నివసిస్తుంది. వీరికి ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే రెండేళ్లుగా కిరణ్ అనే యువకుడితో రియా రిలేషన్షిప్(వివాహేతర సంబంధం) కొనసాగిస్తుంది. భర్త లేని సమయాల్లో తరుచూగా రియాను అతడు కలిసేవాడు. గత అక్టోబర్ ఇద్దరు కలిసి ఇంటి నుంచి పారిపోయినట్లు తెలిసింది. అయితే తర్వాత రియా తన భర్త వద్దకు తిరిగి వచ్చింది. గొంతు కోసి దీంతో మళ్లీ భర్తను వదిలేసి రావాలని కిరణ్ వివాహితపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీనికి రియా అంగీకరించకపోవడంతో ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. పలుమార్లు దాడి చేశాడు. ఈ క్రమంలో భర్త ఇంట్లో లేని సమయంలో ఆదివారం రాత్రి కిరణ్ రియా ఇంటికి వెళ్లాడు. వీరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆవేశం పట్టలేని కిరణ్ అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియురాలి గొంతు కొసి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం ఉదయం పిల్లవాడు ఏడుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఇంటికి వచ్చి చూడగా రియా రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రియుడూ ఆత్మహత్య ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివాహిత మృతదేహాన్ని బాత్రూమ్లో స్వాధీనం చేసుకున్నారు. శరీరంపై కొట్టిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ప్రియురాలిని హత్య చేసిన రోజు రాత్రి.. న్యూజల్పైగురి రైల్వే స్టేషన్‌కు వెళ్లిన కిరణ్.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడు. చనిపోయే ముందు అతను ఫేస్బుక్ లైవ్ చేశాడు. నాకు మరో దారి లేదు ఇందులో ‘అవును నేను రియాను చంపాను. కానీ ఆమెను చంపకుండా ఉంటే ఇలా ఆత్మహత్య చేసుకునే వాడిని కాదు. కానీ ఆమె నాకు మరో మార్గం లేకుండా చేసింది. నాకు భయంగా ఉంది. జీవించడానికి ఇంకేం లేదు. నేను బతికితే నా జీవితాంతం జైల్లోనే గడపాల్సి వస్తుంది. అందుకే చనిపోతున్నా’ అని వీడియోలో పేర్కొన్నాడు. -
‘ఆపరేషన్ బెంగాల్’
సాక్షి , న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేడి మొదలుకావడంతో ప్రచారం జోరందుకుంది. అధికారపీఠంపై కాషాయ జెండా ఎగరనీయకుండా అడ్డుకొనేందుకు దీదీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు మమతా బెనర్జీ దూకుడును ఆపేందుకు కమలదళం తమ వ్యూహాలకు పదునుపెడుతోంది. సీపీఐ(ఎం) కంచుకోట సిలిగురిపై తమ జెండాలను ఎగురవేసేందుకు ఒకవైపు టీఎంసీ, మరోవైపు బీజేపీ ఉవ్విళ్లూరుతున్నాయి. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరమైన సిలిగురి అసెంబ్లీ నియోజవర్గంపై ప్రతీ పార్టీ ప్రత్యేకంగా దృష్టిపెట్టడంతో ఈసారి గెలుపు ఎవరిని వరిస్తుందనే దానిపై చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. 1951 నుంచి ఇప్పటి వరకు ఈ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ 6 సార్లు, వామపక్షాలు తొమ్మిదిసార్లు, టీఎంసీ ఒకసారి విజయం సాధించింది. ఇప్పటివరకు సిలిగురిలో బీజేపీ ఇంకా బోణీ కొట్టలేదు. భిన్న రాజకీయ వాతావరణం.. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిలిగురి అసెంబ్లీతో సహా డార్జిలింగ్ జిల్లాలోని మొత్తం 5 స్థానాల్లో ఐదవ దశలో ఏప్రిల్ 5 న ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఈసారి అసెంబ్లీ సీటును ఎవరు ఆక్రమించుకుంటారనే అంశంపై రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ఉన్న రాజకీయ వాతావరణం భిన్నంగా ఉండేదని, ఇప్పుడు వాతావరణం భిన్నంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 1951కి ముందు సిలిగురి, కుర్సేంగ్లతో కలిసి అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. 1951 నుండి 2016 వరకు ఈ అసెంబ్లీ స్థానంలో వామపక్షాల అభ్యర్థులు 9 సార్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 6 సార్లు గెలిచింది. పశ్చిమ బెంగాల్లో మొదటి అసెంబ్లీ ఎన్నిక 1951 లో జరిగింది. అప్పుడు ఈ సీటు నుంచి భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన టెన్జింగ్ వాగ్డి గెలిచారు. అయితే, 1957 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అప్పుడు సిపిఐ (ఎం) అభ్యర్థిగా సిలిగురి అసెంబ్లీ సీటు నుంచి జరిగిన ఎన్నికల్లో సత్యేంద్ర నారాయణ్ మజుందార్ విజయం సాధించారు. 1962, 1967 ల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్ళీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆల్ ఇండియా గూర్ఖా లీగ్‌కు చెందిన ప్రేమ్ థాపా 1969 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. అధికార మార్పిడి..: 1977 కి ముందు, సిలిగురిలో కాంగ్రెస్ తమ హవా కొనసాగించింది. 1977 లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. వామపక్షాలు అధికారాన్ని చేపట్టాయి. జ్యోతి బసు నాయకత్వంలో సిపిఐ (ఎం) బలమైన పార్టీగా అవతరించింది. 1977 ఎన్నికల తరువాత, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ హవా దాదాపుగా ముగిసింది. 1977 నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తిరిగి రాలేకపోయింది. 1977, 1982 ల్లో సిపిఐ–ఎం అభ్యర్థి వీరెన్ బోస్ సిలిగురి అసెంబ్లీ సీటు నుంచి గెలుపొందారు. ఆ తరువాత జరిగిన 1987 ఎన్నికల్లో సిపిఐ(ఎం)కు చెందిన గౌర్ చక్రవర్తి విజయం సాధించారు. అనంతరం 1991 నుండి 2006 వరకు అశోక్ భట్టాచార్య సిపిఐ (ఎం) అభ్యర్థిగా వరుసగా నాలుగుసార్లు అధికారపీఠంపై కూర్చున్నారు. అప్పటి వామపక్ష ప్రభుత్వంలో అశోక్ భట్టాచార్య 20 సంవత్సరాలపాటు మంత్రిగా పనిచేశారు. ఎత్తుకు పై ఎత్తులు..: అయితే, 2011 ఎన్నికల్లో అశోక్ భట్టాచార్య టీఎంసీ హవా ముందు నిలబడలేక ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. భట్టాచార్యను తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన డాక్టర్ రుద్రనాథ్ భట్టాచార్య ఓడించారు. అయితే 2016 ఎన్నికల్లో అశోక్ భట్టాచార్య మళ్ళీ సిలిగురి అసెంబ్లీ సీటు నుండి విజయం సాధించారు. ఏప్రిల్ 7న జరుగబోయే ఐదో దశ ఎన్నికల్లో టీఎంసీ నుంచి ప్రొఫెసర్ ఓం ప్రకాశ్ మిశ్రా బరిలో దిగనున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో సిలిగురి స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు ఒకవైపు టీఎంసీ, బీజేపీ పోటీపడుతుండగా, మరోవైపు తమ పట్టును కొనసాగించేందుకు సీపీఐ(ఎం) ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. -
హోటల్ గదిలో నటి ఆత్మహత్య?
కోల్‌కతా : ప్రముఖ బెంగాలీ సినీ, టీవీ నటి పాయెల్ చక్రబోర్తి (38) మృతిచెందారు. పశ్చిమబెంగాల్లోని సిలిగురిలోని ఓ హోటల్ గదిలో బుధవారం రాత్రి పాయెల్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. 'మంగళవారం హోటల్లో ఓ గది తీసుకున్న పాయెల్ బుధవారం గ్యాంగ్‌టక్‌కు వెళ్లాలని చెప్పారు. గదిలో దిగే ముందే తనను ఎవరు డిస్టర్బ్ చేయొద్దన్నారు. అంతేకాకుండా బుధవారం రాత్రిపూట భోజనం కూడా తీసుకోలేదు' అని హోటల్ సిబ్బంది తెలిపారు. దీంతో బుధవారం ఎంతగా డోర్ కొట్టినా తీయకపోవడంతో లోపలికి వెళ్లి చూస్తే అమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందన్నారు. పాయెల్ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే పూర్తి దర్యాప్తు చేసిన తర్వాతే హత్యా, ఆత్మహత్యా అనేది తేలుతుందన్నారు. సినిమాలు, టీవీ సీరియల్లు, పలు వెబ్ సిరీస్‌ల్లో పాయెల్ నటించారు. చోఖేర్ తారా తుయ్, గొయెండా గిన్నీ వంటి షోలను కూడా ఆమె చేస్తున్నారు. పాయోల్ మృతితో పశ్చిమబెంగాల్ సినీ ఇండస్ట్రీకి చెందిన నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె తన భర్తనుండి గత కొద్దిరోజు నుండే వేరుగా ఉంటున్నారు. పాయెల్‌కు ఓ కుమారుడు ఉన్నారు. పాయెల్ మరణ వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు సిలిగురి చేరుకొన్నారు. పాయెల్ రాంచి వెళుతున్నట్టు తనతో చెప్పిందని, ఇక్కడికి ఎందుకొచ్చిందో తనకు అర్థం కావడం లేదని ఆమె తండ్రి ప్రబిర్ గుహా తెలిపారు. -
సరిహద్దుల్లో అక్రమ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్
జల్పాయ్గురి: భారత్–నేపాల్ సరిహద్దుల్లోని పానిటంకీలో అక్రమంగా నిర్వహిస్తున్న టెలిఫోన్ ఎక్సే్ఛంజ్‌ను పోలీసులు గుర్తించారు. సిలిగురి పోలీసు కమిషనరేట్ పరిశోధనా విభాగం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి దాడులు జరిపి దీనిని గుర్తించారు. దీంతో సంబంధమున్న రన్విజయ్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఘటనా స్థలి నుంచి నేపాల్, భారత్‌లకు చెందిన 196 సిమ్ కార్డులు, 5 జీఎస్ఎమ్ గేట్‌వే మెషీన్లు, 4 ల్యాప్‌ట్యాప్‌లు, 3 ఓటర్ ఐడీలు, పెద్ద మొత్తంలో ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. -
పాము విషం: ఫ్రాన్స్ టు చైనా వయా ఇండియా
జల్పాయిగురి: అతి ప్రమాదకరమైన పాము ఒక్కకాటులో 200 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీ గ్రాముల విషాన్ని విడుస్తుంది. ఈ లెక్కన 70,00,000 మిల్లీగ్రాములు.. అంటే 7 కిలోగ్రాముల విషం పోగవ్వాలంటే ఎన్నిపాములు ఎన్నిసార్లు కాటేయాలి? ఊహించడానికే అదోలా ఉందికదా! కానీ స్మగ్లర్లకు ఇది చాలా చిన్నవిషయం. ఎక్కడో ఫ్రాన్స్ అటవీ ప్రాంతంలో విషాన్ని సేకరించి బెల్జియంలో తయారైన బుల్లెట్ ప్రూఫ్ జాడీల్లో భద్రంగా దాచి.. వేల కిలోమీటర్ల దూరంలోని చైనాకు వయా ఇండియా సరఫరా చేస్తున్నారు! ఈ అంతర్జాతీయ విషపు ముఠా గుట్టు పశ్చిమబంగాలో రట్టైంది. సిలిగురి జిల్లాలోని బెలాకోబా రేంజ్ అటవీశాఖ అధికారులు రెండు రోజులు శ్రమించి రూ.200 కోట్లు విలువచేసే పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెలాకొడా రేంజర్ సంజయ్ దత్ శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పారు.. 'సిలిగురిలోని ఓ లాడ్జిలో ఇద్దరు వ్యక్తులు బసచేశారు. సరుకులు కనేందుకు వచ్చిన బయ్యర్లమని చెప్పుకున్న ఆ ఇద్దరి కదలికలపై మాకు సమాచారం అందింది. దీంతో వారిపై నిఘా పెట్టాం. పక్కాగా ప్లాన్ చేసి స్మగ్లర్లనూ పట్టుకున్నాం. బెల్జియంలో తయారైన ఐదు బుల్లెట్ ఫ్రూఫ్ జాడీల్లో దాచిన విషాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం. దీని విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుంది. స్మగ్లర్ల విచారణలో బయటపడిందేమంటే.. ఫాన్స్ లో సేకరించిన పాము విషయం మొదట బంగ్లాదేశ్ చేరుతుంది. అక్కడి నుంచి పశ్చిమబంగా మీదుగా భూటన్ కు చేరుస్తారు. అటునుంచి ఆ విషాన్ని చైనాకు తరలిస్తారు. అక్కడ దీనికి భారీ డిమాండ్ ఉంది. కొన్నిరకాల మందులతోపాటు డ్రగ్స్ తయారీకి కూడా పాము విషాన్ని వినియోగిస్తారు. రేవ్ పార్టీల్లో వినియోగించే డ్రగ్స్ ఈ విషంతోనే తయారుచేస్తారని తెలిసింది' అని సంజయ్ దత్ వివరించారు. ఈ రాకెట్ కు సంబంధించి దినాజ్ పూర్ కు చెందిన సంజయ్ కుమార్ దాస్, బిపుల్ సర్కార్, పింటు బెనర్జీ, మాల్దాకు చెందిన అమల్ నుబియాలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని చెప్పారు. -
సిలిగురిలో మాస్టర్ షెఫ్ కుకింగ్ కాంపిటీషన్
-
భూకంప బాధితులను పరామర్శించిన మమత బెనర్జి
-
దేశాన్ని అమ్మేసేందుకు బీజేపీ కుట్ర: మమత
కోల్ కతా: పార్లమెంట్ లో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాలు కలిసికట్టుగా ఉండాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నందునే తమను బీజేపీ లక్ష్యంగా చేసుకుందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి తామే ప్రధాన ప్రత్యర్థులమని తెలుసునని, అందుకే తమను టార్గెట్ చేశారని అన్నారు. తమను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. మంగళవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో మమత మాట్లాడారు. దేశ ప్రజలను బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. దేశాన్ని అమ్మేసేందుకు కేంద్రపాలకులు ప్రయత్నిస్తున్నారని దీదీ ధ్వజమెత్తారు. బెంగాల్ లో తృణమూల్ పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు. -
'అవినీతిపై కాంగ్రెస్ సమాధానం చెప్పలేదు'
రానున్న ఎన్నికలలో బీజేపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. గురువారం పశ్చిమబెంగాల్ సిలిగురిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీపై మోడీ నిప్పులు చెరిగారు. 10 ఏళ్ల యూపీఏ పాలనలో దేశంలో అవినీతి పెచ్చురిల్లిందని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిపై విపక్షాలు ప్రశ్నిస్తే కాంగ్రెస్ మాత్రం మీనమేషాలు లెక్కిస్తుందని విమర్శించారు. దేశం నుంచి కాంగ్రెస్ పార్టీని నిర్మూలించాల్సిన అవశ్యకతను మోడీ ఈ సందర్బంగా విశదీకరించారు. దేశం వెనకబాటుతనానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆయన ఆరోపించారు. బీజేపీతోనే భారత్ నవనిర్మాణం సాధ్యమని మోడీ స్పష్టం చేశారు. -
సిలిగురిలో 17వ ఫ్యాషన్ ఈవెంట్
-
సిట్ డ్రా అంశంలో సిలిగురి రికార్డు