
'అవినీతిపై కాంగ్రెస్ సమాధానం చెప్పలేదు'
రానున్న ఎన్నికలలో బీజేపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. గురువారం పశ్చిమబెంగాల్ సిలిగురిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీపై మోడీ నిప్పులు చెరిగారు.
10 ఏళ్ల యూపీఏ పాలనలో దేశంలో అవినీతి పెచ్చురిల్లిందని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిపై విపక్షాలు ప్రశ్నిస్తే కాంగ్రెస్ మాత్రం మీనమేషాలు లెక్కిస్తుందని విమర్శించారు. దేశం నుంచి కాంగ్రెస్ పార్టీని నిర్మూలించాల్సిన అవశ్యకతను మోడీ ఈ సందర్బంగా విశదీకరించారు. దేశం వెనకబాటుతనానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆయన ఆరోపించారు. బీజేపీతోనే భారత్ నవనిర్మాణం సాధ్యమని మోడీ స్పష్టం చేశారు.