Friend killed
-
నవీన్ హత్యకు ముందు జరిగింది ఇదే.. పోలీసుల సీన్ రీకన్స్ట్రక్షన్?
సాక్షి, హైదరాబాద్: ఎంజీ కాలేజీ విద్యార్థి నవీన్ దారుణ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు హరిహరకృష్ణను అరెస్ట్ చేశారు. అనంతరం, నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో, కోర్టు హరిహరకృష్ణకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. ఇక, హయత్‌నగర్ కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నారు. హత్యకు తర్వాత జరిగింది ఇదే.. హత్య తర్వాత హరిహరరావు వరంగల్‌కు పరారీ అయ్యాడు. హత్య జరిగిన రెండు రోజులు నవీన్ స్నేహితులకు నిందితుడు ఫోన్ చేశాడు. తర్వాత.. నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది.. నవీన్ మిస్ అయ్యాడంటూ కట్టుకథ అల్లాడు. దీంతో, వారు హరిహరకృష్ణ ప్రవర్తనపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే తనకు తానుగా నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. స్టేషన్లో హత్యకు ముందు.. తర్వాత జరిగిన పరిణామాలను వెల్లడించాడు. కాగా, విచారణలో భాగంగా నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులు నిర్ఘాంతపోయారు. కాగా, నవీన్ హత్య కోసం హరహరకృష్ణ మూడు నెలల క్రితమే ప్లాన్ చేశాడు. రెండు నెలల క్రితం కత్తిని కొనుగోలు చేశాడు. హత్యకు ముందు క్రైమ్ వెబ్ సిరీస్, సోషల్ మీడియాలో సెర్చ్ చేశాడు. హత్య తర్వత శరీర భాగాలను పాశవికంగా వేరు చేశాడు. మృతదేహంపై దుస్తులను తొలగించినట్టు తెలిపాడు. అయితే, ఈ హత్యపై పోలీసులు ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. -
ఆమె కేవలం ఫ్రెండ్ అంతే!: నవీన్ తండ్రి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ ఎంజీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ దారుణ హత్యోదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తాను ప్రేమించిన అమ్మాయితో.. చనువుగా ఉండటం భరించలేకే స్నేహితుడిని దారుణంగా హతమార్చినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు నిందితుడు హరిహర కృష్ణ. అయితే స్నేహితుడే తన కొడుకుపై ఇంతటి ఘాతుకానికి పాల్పడతాడని ఊహించలేదని నవీన్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి టీవీతో మృతుడు నవీన్ తండ్రి శంకర్ నాయక్ పోలీసులతో మాట్లాడుతూ.. గెట్ టు గెదర్ పేరుతో నా కొడుకుని పిలిచి హత్య చేశాడు. కాకపోతే.. హరిహర కృష్ణ పద్ధతి నచ్చక ఆ అమ్మాయి దూరం అయిందని అంతా చెప్తున్నారు. మా అబ్బాయి నవీన్ ఆ అమ్మాయితో ప్రేమలో లేడు. వాళ్లిద్దరూ కేవలం స్నేహితులే. నవీన్‌కు ఆ అమ్మాయి దగ్గర అవుతుందేమో అనే అనుమానంతోనే హత్య చేశాడు. ఈ హత్యలో ఆ అమ్మాయి ప్రేమేయం ఉందో, లేదో కూడా మాకు తెలియదు అని చెప్పారాయన. ఏది ఏమైనా తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న వాడిని కఠినంగా శిక్షించాలి అని కోరుతోంది బాధిత కుటుంబం. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీలో పూర్తి సమాచారం పొందుపరిచారు. నిందితుడు పేరాల హరిహర కృష్ణ, మలక్‌పేట పరిధిలోని మూసారాంబాగ్‌కు చెందినవాడు. నిందితుడు తనంతట తానే పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. నేరాన్ని అంగీకరించే సమయంలో అతనిచ్చిన స్టేట్మెంట్ ఇలా ఉంది. నవీన్ , నేను దిల్షుక్ నగర్లో ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నాం. ఆ సమయంలో నేను ఒక స్నేహితురాలిని ప్రేమించా. కొన్ని కారణాల వల్ల ఆమె నాకు దూరం అయ్యింది. కానీ, నవీన్ దానిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆమెను ప్రేమించాడు!. ఆ అమ్మాయి కూడా నవీన్‌తో సన్నిహితంగా మెలిగింది. వాళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని తట్టుకోలేక.. మూడు నెలల కిందట నవీన్‌ను చంపాలని నిర్ణయించుకున్నా. కొద్దీ రోజుల్లోనే బీటెక్ పూర్తి చేసుకొని హైదరాబాద్ కి నవీన్ కోచింగ్ రాబోతున్నట్లు తెలుసుకున్నా. హైదరాబాద్ వస్తే నా లవర్‌కు మరింత దగ్గర అవుతాడేమో అనిపించింది. అందుకే టైం కోసం ఎదురు చూశా. ఫిబ్రవరి 17వ తేదీన.. నేనూ, నవీన్ ఎల్బీ నగర్లో కలుసుకున్నాం. కాసేపు అలా తిరిగాం. ఆ తర్వాత మూసారాంబాగ్‌లోని మా ఇంటికి వెళ్లాం. రాత్రి కాగానే.. తాను హాస్టల్ వెళ్తానని చెప్పాడు. దీంతో బైక్‌పై ఇద్దరం బయల్దేరాం. పెద్ద అంబర్‌పేటకు చేరుకోగానే మా ఇద్దరి మధ్య ఆ యువతి విషయమై గొడవ మొదలైంది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. కత్తితో దాడి చేశా. నవీన్‌ను చంపేసి ప్రైవేట్ భాగం, గుండె, తన, చేతి వేళ్లు, చేతులు.. అన్నింటిని కత్తితో వేరు చేసి.. అక్కడి నుంచి పరారయ్యాను. విజయవాడ హైవే పక్కన పడేశాను.. ఇది ఈ కేసులో నిందితుడు హరిహర కృష్ణ పోలీసుల ముందు ఒప్పుకున్న విషయాలు. ఈ మేరకు విషయాలన్ని ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు స్నేహితులు. నిందితుడు హరిహర కృష్ణ పై సెక్షన్ 302, 201 ఐపీసీ , 5(2) (V) , SC ,St, POA act 2015 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఇక.. తన మీదకు అనుమానం రాకూడదనే ఉద్దేశంతో ఘటన తర్వాత నవీన్ స్నేహితులకు కాల్ చేశాడు హరి. నవీన్ మొబైల్ స్విచ్ఛాఫ్ వస్తోందని డ్రామాలాడాడు. అమ్మాయి పాత్రపై విచారణ చేపట్టాం అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన నవీన్ హత్య కేసుపై సాక్షీ టీవీ తో ఎల్బీనగర్ డీసీపి సాయి శ్రీ మాట్లాడారు. నల్గొండ ఎంజీ యూనివర్సిటీ కి చెందిన నవీన్ హత్య కేసులో దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే నిందితుడు హరిహరకృష్ణ ను అరెస్ట్ చేశాము. సాంకేతిక ఆధారాలతో కేసును విచారణ చేస్తున్నాము . హత్యలో ఎవరెవరు పాల్గొన్నారనేది తేలాల్సి ఉంది. ఇది ఒక పథకం ప్రకారం చేసిన హత్య గా స్పష్టమైంది. నవీన్ ను అతి కిరాతకంగా పొడిచి చంపిన నిందితుడు హరిహరకృష్ణ. ఇందులో అమ్మాయి పాత్ర ఎంత వరకు ఉందో తేల్చాల్సి ఉంది. నవీన్ , హరిహరకృష్ణ ఇద్దరూ మంచి స్నేహితులు అని తెలిపారాయన. ఒత్తిడి తట్టుకోలేకే.. నేనావత్ నవీన్‌ది నాగర్‌కర్నూల్ జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్ల గ్రామం. నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) నాలుగో ఏడాది చదువుతున్నాడు. నాలుగు రోజులైనా కళాశాలకు, ఇంటికి నవీన్ రాకపోవడంతో ఈ నెల 22న తండ్రి శంకర్ నాయక్ నార్కట్‌పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నార్కట్‌పల్లి ఎస్సై రామకృష్ణ ఎంజీయూలో విద్యార్థులను, హరి స్నేహితులను విచారించారు. అయితే.. అదేరోజు సాయంత్రం నుంచి హరి ఫోన్ స్విఛ్చాఫ్ రావడంతో వారి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి అతని గురించి వాకబు చేశారు. కుటుంబ సభ్యులు, పోలీసులు, స్నేహితుల నుంచి ఒత్తిడి పెరగడంతో హరి శుక్రవారం రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు హరిహర కృష్ణ. -
రూ.10 కోసం గొడవ.. ఫ్రెండ్‌ను బండరాయితో కొట్టి దారుణంగా..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సిలీగుడిలో దారుణం జరిగింది. రూ.10 ఇవ్వమని గొడవపడిన స్నేహితుడ్ని ఓ యువకుడు బండరాయితో కొట్టి చంపాడు. వైకంఠపూర్ అడవిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడ్ని రామ్‌ప్రసాద్ సాహాగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ అడిక్ట్.. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రామ్‌ప్రసాద్(20) మత్తుపదార్థాలకు బానిసయ్యాడు.స్నేహితులతో కలిసి తరచూ అడవికి గంజాయి కొనుగోలు చేసేవాడు. సోమవారం కూడా సుబ్రతా దాస్(22), అజయ్ రాయ్(24)తో కలిసి వైకుంఠపూర్ ఫారెస్ట్‌కు వెళ్లారు. మత్తుపదార్థాలు కొనుగోలు చేశారు. అయితే తనకు ఇంకా గంజాయి కావాలని, కొనుగోలు చేసేందుకు రూ.10 ఇవ్వాలని రామ్‌ప్రసాద్ సుబ్రతా దాస్‌ను అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రామ్‌ప్రసాద్‌ను సుబ్రతా దాస్ బండరాయితో కొట్టి చంపాడు. అనంతరం అడవి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు బుధవారం రాత్రి సుబ్రతా దాస్, అజయ్‌ను అరెస్టు చేశారు. ఈ హత్య కేసులో అజయ్ పాత్ర కూడా ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చదవండి: Viral Video: బైకర్ మెడకు చుట్టుకున్న తాడు.. అమాంతం గాల్లో ఎగిరి.. -
ఫ్రెండే కదా అని ఇంటి పిలిస్తే.. దోస్తు భార్యతో అసభ్య ప్రవర్తన!
యశవంతపుర: తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన స్నేహితుడిని భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కరోశి గ్రామానికి చెందిన సునీల్ (25), జైనాపురకు చెందిన మహంతేశ్‌లు మంచి స్నేహితులు. ఇటీవల మహంతేశ్ భార్యతో సునీల్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో, ఆగ్రహానికి గురైన మహంతేశ్ ఈ నెల 2న మాట్లాడాలి అని చెప్పి అతడిని ఇంటికి పిలుపించుకున్నాడు. అనంతరం, కరోశి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పీకల దాక సునీల్‌కు మద్యం తాగించాడు. అప్పటికే ఆగ్రహంతో రగలిపోతున్న మహంతేశ్.. మద్యం మత్తులో ఉన్న సునీల్ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం, ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో, మహంతేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. -
రూ.50 ఇవ్వలేదని అంతమొందించారు
కర్ణాటక ,యశవంతపుర : గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు రూ.50 కోసం స్నేహితుడినే అంతమొందించారు. ఈ ఘటన డీజేహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. హతుడిని మహమ్మద్ వాసీం(16)గా గుర్తించారు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో నిందితులు వాసీం వద్దకు బైక్‌పై వచ్చారు. రూ.50 ఇవ్వాలని అడిగారు. తన వద్ద డబ్బు లేదని పేర్కొనడంతో గంజాయి మత్తులో ఉన్న నిందితులు వాగ్వాదానికి దిగి కత్తులతో పొడిచి ఉడాయించారు. తీవ్రంగా గాయపడిన వాసీం అక్కడికక్కడే మృతి చెందాడు. బెంగళూరు తూర్ప విభాగం డీసీపీ డాక్టర్ శరణప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హంతకుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు విలేకరులకు తెలిపారు. -
స్నేహితుడే నిందితుడు..!
నార్కట్‌పల్లి మండలం ఎనుగులదోరి గ్రామంలో ఈ నెల 7వ తేదీన వెలుగుచూసిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హోమోసెక్స్‌కు ఒత్తిడి చేయడంతోనే స్నేహితుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సుధాకర్ కేసు వివరాలు వెల్లడించారు. నార్కట్‌పల్లి (నకిరేకల్) : నార్కట్‌పల్లి మండలం ఎనుగులదోరి గ్రామానికి చెందిన జాన్‌రెడ్డి (25), చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన మాదాసు ఆరోగ్యం ఇద్దరూ స్థానిక ఐడియల్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరిద్దరు బావ, బావమరుదుల వరసతో పిలుచుకుంటూ తిరిగేవారు. వీరు తమ ఫోన్లలో పలుమార్లు అశ్లీల చిత్రాలు చూసేవారు. అందులో ఇద్దరు మగవారు కలిసి చేసుకునే హోమోసెక్స్‌కు ఆకర్షితులై కొంత కాలంగా పలుమార్లు ఆ విధంగా కలుసుకున్నారు. స్నేహితుడిని ఓదార్చేందుకు.. గత నెల 13న ఆరోగ్యం చిన్న కూతురు మృతిచెందింది. ఆ బాధలో ఉన్న ఆరోగ్యాన్ని స్నేహితులు ఓ దార్చే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగానే ఆరోగ్యాన్ని స్నేహితులందరూ కలిసి ఆరోగ్యాన్ని జాన్‌పహాడ్ దర్గా వద్దకు తీసుకెళ్లి పార్టీ చేస్తున్నారు. బెదిరించి.. జానపహాడ్ నుంచి తిరిగి వచ్చిన అనంతరం జాన్‌రెడ్డి ఫోన్‌చేసి ఆరోగ్యాన్ని కలుసుకోవాలని ఒత్తిడి చేశాడు. అతను రానని చెప్పడంతో అసహనానికి గురైన జాన్‌రెడ్డి వారిద్దరి మధ్య ఉన్న సంబంధం బయటపెడతానని బెదిరించాడు.తన భార్యని కూడా కలవాలని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన ఆరోగ్యం జాన్‌రెడ్డి బతికిఉంటే ఎప్పటికైన ప్రమాదమే అనుకుని చంపాలని పథకం వేశాడు. ఒత్తిడి చేసి పిలిపించుకుని.. జాన్‌రెడ్డి పలుమార్లు ఫోన్‌చేసి ఒత్తిడి చేయడంతో ఆరోగ్యం విసిగిపోయాడు. దీంతో అతడిని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.అప్పటికే తాగి ఉన్న జాన్‌రెడ్డిని చంపడానికి అనుకూల సమయమని నిర్ధారించుకున్న ఆరోగ్యం తనతో పాటు చిన్నకత్తిని వెంట తెచ్చుకున్నాడు. ఎప్పటిలాగే వ్యవసాయబావి వద్ద మంచంపై దుస్తులు లేకుండా మంచానికి జాన్‌రెడ్డిని కట్టివేసి ఆరోగ్యం తనతో తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి చంపాడు. మృతుడి కాల్‌డేటా ఆధారంగా నిందుతుడిని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితున్ని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో శా లిగౌరారం సర్కిల్ సీఐ క్యాస్ట్రోరెడ్డి, ఎస్ఐ గోవర్థ న్, సిబ్బంది మధు, రమేష్, జనార్ధన్ ఉన్నారు. -
సెల్‌ఫోన్ కోసం స్నేహితుని హత్య
-
గర్ల్‌ఫ్రెండ్‌ను పోక్ చేశాడని.. స్నేహితుడి హత్య
ఫేస్బుక్లో 'పోకింగ్' అనే ఆప్షన్ ఒకటుంది. దీని ద్వారా ఎవరైనా.. ఎవరినైనా పోక్ చేయొచ్చు. కానీ తన గర్ల్‌ఫ్రెండ్‌ను పోక్ చేశాడని బ్రిటన్‌లో ఓ వ్యక్తి తన స్నేహితుడినే చంపేశాడు. దాంతో అతడిని అరెస్టుచేసి జైలుకు పంపారు. స్కాట్ హంఫ్రీ (27) అనే వ్యక్తి.. రిచర్డ్ రావెటో (29) అనే తన స్నేహితుడిని క్యాబ్‌లో గట్టిగా కొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంతకుముందు కూడా రావెటో తన స్నేహితురాలిని పదే పదే ఫేస్బుక్లో పలకరించాడని హంఫ్రీ ఆరోపించాడని, అతడిని గట్టిగా కొట్టడంతో అతడు పడిపోయాడని, తల నేలకేసి కొట్టుకుందని క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. అయితే, ఆమెకు హంఫ్రీతో ఇప్పటికే సంబంధం ఉందన్న విషయం తనకు తెలియదని రావెటో చెప్పాడట. అయినా ఆగ్రహం పట్టలేక కొట్టడంతో రావెటో చనిపోయాడు. దాంతో హంఫ్రీకి నాలుగేళ్ల నాలుగు నెలల పాటు జైలుశిక్ష పడింది. -
బ్లాక్ మెయిల్ చేశాడని చంపేశాడు
చెన్నై: మహిళతో సన్నిహితంగా ఉన్న మిత్రుడిని సెల్ఫోన్లో చిత్రించి బ్లాక్మెయిల్ చేసి, డబ్బులు గుంజిన స్నేహితున్ని హతమార్చిన విద్యార్థి పోలీసులకు సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. ధర్మపురి జిల్లా పాపిరెడ్డి పట్టి సమీపాన అన్భు(52)కు చెందిన అల్లుగడ్డల తోటలో హనుమన్ తీర్థంకు చెందిన గోపినాథ్(25) కొన్ని రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. సమీపంలో అతని స్నేహితుడు విమల్(25) కూడా గాయంతో ప్రాణాలతో పోరాడ సాగాడు. పళ్లిపట్టు పోలీసులు విచారణ జరిపి విమల్‌ను సేలం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. పోలీసుల విచారణలో గోపినాథ్ హత్యలో తోట యజమాని అన్భు కుమారుడు అన్భుమణి(22)కి సంబంధం ఉన్నట్లు తెలిసింది. కోయంబత్తూరులో ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న అన్భుమణి ఈ సంఘటన తర్వాత అదృశ్యమయ్యాడు. అతన్ని సోమవారం ఆరూర్‌లో అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద విచారణ జరిపారు. పోలీసులకు అతడు ఇచ్చిన వాంగ్మూలంలో గోపినాథ్ తన స్నేహితుడని ఇద్దరం కలిసి హనుమాన్ తీర్థంలో ఒక మహిళతో గడిపామన్నారు. తనకు తెలియకుండా గోపినాథ్ సెల్ఫోన్లో చిత్రీకరించాడని, అంతేకాకుండా ఆరు నెలలుగా తనను బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్నాడని చెప్పారు. గత నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు గోపినాథ్ విమల్‌ను తీసుకొని మద్యం మత్తులో వచ్చాడన్నారు. ఆ సమయంలో గోపినాథ్, విమల్‌పై గడ్డపారతో అన్బుమణి దాడి చేసినట్లు తెలిపాడు. దీంతో అతడు స్పృహ తప్పాడన్నారు. తండ్రి అన్భు ఆ సమయంలో అక్కడికి రాగా గోపినాథ్‌ను హతమార్చినట్టు తెలిపారు. ఇద్దరం కలిసి గోపినాథ్, విమల్‌ను తమ తోటలో విసిరేశామన్నారు. ఆ తర్వాత విమల్ పరిస్థితి ఏమైంది తెలియలేదన్నారు. అనంతరం తాను పరారయ్యానని ఆరూర్ బస్టాండ్‌లో పోలీసులు తనను అరెస్టు చేశారన్నారు. దీంతో హత్యకు సహకరించిన తండ్రి అన్భును పాపిరెడ్డి పట్టి పోలీసులు అరెస్టు చేశారు. వీరిని పాపిరెడ్డి పట్టి సెషన్స్ కోర్టులో హాజరు పరిచి సేలం జైలుకు తరలించారు.