సాక్షి, హైదరాబాద్: ఎంజీ కాలేజీ విద్యార్థి నవీన్ దారుణ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు హరిహరకృష్ణను అరెస్ట్ చేశారు. అనంతరం, నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో, కోర్టు హరిహరకృష్ణకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. ఇక, హయత్‌నగర్ కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నారు.
హత్యకు తర్వాత జరిగింది ఇదే..
హత్య తర్వాత హరిహరరావు వరంగల్‌కు పరారీ అయ్యాడు. హత్య జరిగిన రెండు రోజులు నవీన్ స్నేహితులకు నిందితుడు ఫోన్ చేశాడు. తర్వాత.. నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది.. నవీన్ మిస్ అయ్యాడంటూ కట్టుకథ అల్లాడు. దీంతో, వారు హరిహరకృష్ణ ప్రవర్తనపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే తనకు తానుగా నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. స్టేషన్‌లో హత్యకు ముందు.. తర్వాత జరిగిన పరిణామాలను వెల్లడించాడు. కాగా, విచారణలో భాగంగా నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులు నిర్ఘాంతపోయారు.
కాగా, నవీన్ హత్య కోసం హరహరకృష్ణ మూడు నెలల క్రితమే ప్లాన్ చేశాడు. రెండు నెలల క్రితం కత్తిని కొనుగోలు చేశాడు. హత్యకు ముందు క్రైమ్ వెబ్ సిరీస్, సోషల్ మీడియాలో సెర్చ్ చేశాడు. హత్య తర్వత శరీర భాగాలను పాశవికంగా వేరు చేశాడు. మృతదేహంపై దుస్తులను తొలగించినట్టు తెలిపాడు. అయితే, ఈ హత్యపై పోలీసులు ఘటనా స్థలంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment