నవీన్‌ హత్యకేసు నిందితుడు హరిహర ఫోన్‌ కాల్‌ వైరల్‌ | Naveen Assassination Case Suspect Harihara Phone Call Viral | Sakshi
Sakshi News home page

నవీన్‌ హత్యకేసు నిందితుడు హరిహర ఫోన్‌ కాల్‌ వైరల్‌

Published Sun, Feb 26 2023 10:48 AM | Last Updated on Sun, Feb 26 2023 11:14 AM

Naveen Assassination Case Suspect Harihara Phone Call Viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్‌ హత్యకేసులో ఫోన్‌ కాల్‌ రికార్డ్‌ కలకలం రేపుతోంది. నవీన్‌ను హత్యచేసిన అనంతరం హరిహర తన ఫ్రెండ్‌తో ఫోన్‌తో మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది. నవీన్‌ను హత్య చేసి ఏమి తెలియనట్లుగా హరి మాట్లాడిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. తన ప్రేయసి విషయంలో తగాదా వచ్చిందని డ్రగ్స్‌ తాగుతానని నవీన్‌ అన్నట్లు.. నవీన్‌ ఫ్రెండ్‌తో హరిహర సంభాషించాడు. నవీన్‌పై మిస్సింగ్‌ కేసు పెడతామంటూ నవీన్‌ ఫ్రెండ్‌కు హరిహర సలహా కూడా ఇచ్చాడు.

కాగా, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో శనివారం దారుణ ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాను ప్రేమించిన యువతికి స్నేహితుడు దగ్గర అవడాన్ని హరిహర జీర్ణించుకోలేకపోయాడు.. మనసులో కక్ష పెంచుకున్నాడు.. ఫ్రెండ్స్‌తో గెట్‌ టుగెదర్‌ ఉంది రమ్మని పిలిచాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు..

తర్వాత గుండె, తల, మొండెం, కాళ్లు చేతులను వేరుచేసి.. వాటి ఫొటోలను వాట్సాప్‌ ద్వారా ప్రియురాలికి పంపి పైశాచికానందం పొందాడు. హతుడు, నిందితుడు ఇద్దరూ స్నేహితులు, ఇంజనీరింగ్‌ విద్యార్థులు కావడం, ప్రేమ విషయం హత్యకు దారితీయడం కలకలం రేపింది.
చదవండి:  స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement