ఫేస్బుక్లో 'పోకింగ్' అనే ఆప్షన్ ఒకటుంది. దీని ద్వారా తన గర్ల్ఫ్రెండ్ను పోక్ చేశాడని బ్రిటన్లో ఓ వ్యక్తి తన స్నేహితుడినే చంపేశాడు.
ఫేస్బుక్లో 'పోకింగ్' అనే ఆప్షన్ ఒకటుంది. దీని ద్వారా ఎవరైనా.. ఎవరినైనా పోక్ చేయొచ్చు. కానీ తన గర్ల్ఫ్రెండ్ను పోక్ చేశాడని బ్రిటన్లో ఓ వ్యక్తి తన స్నేహితుడినే చంపేశాడు. దాంతో అతడిని అరెస్టుచేసి జైలుకు పంపారు. స్కాట్ హంఫ్రీ (27) అనే వ్యక్తి.. రిచర్డ్ రావెటో (29) అనే తన స్నేహితుడిని క్యాబ్లో గట్టిగా కొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇంతకుముందు కూడా రావెటో తన స్నేహితురాలిని పదే పదే ఫేస్బుక్లో పలకరించాడని హంఫ్రీ ఆరోపించాడని, అతడిని గట్టిగా కొట్టడంతో అతడు పడిపోయాడని, తల నేలకేసి కొట్టుకుందని క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. అయితే, ఆమెకు హంఫ్రీతో ఇప్పటికే సంబంధం ఉందన్న విషయం తనకు తెలియదని రావెటో చెప్పాడట. అయినా ఆగ్రహం పట్టలేక కొట్టడంతో రావెటో చనిపోయాడు. దాంతో హంఫ్రీకి నాలుగేళ్ల నాలుగు నెలల పాటు జైలుశిక్ష పడింది.