కామవాంఛ తీర్చుకొని.. ఆపై ఫేస్‌బుక్‌లో దృశ్యాలు | boy friend cheating in Girlfriend | Sakshi
Sakshi News home page

కామవాంఛ తీర్చుకొని.. ఆపై ఫేస్‌బుక్‌లో దృశ్యాలు

Published Thu, Sep 29 2016 2:11 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

కామవాంఛ తీర్చుకొని.. ఆపై ఫేస్‌బుక్‌లో దృశ్యాలు - Sakshi

కామవాంఛ తీర్చుకొని.. ఆపై ఫేస్‌బుక్‌లో దృశ్యాలు

బెంగళూరు(బనశంకరి) :  తను ప్రేమించిన యువతి మరొకరికి సొంతమవుతుండటాన్ని జీర్ణించుకోలేని యువకుడు     ప్రియురాలిని లాడ్జికి తీసుకెళ్లి  కామవాంఛ తీర్చుకున్నాడు. అనంతరం ఆ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక వెబ్‌సైట్లలో ఉంచాడు. అయితే యువతి స్థానికంగా ఉన్న సంఘాల నాయకులను ఆశ్రయించింది. వారు గాలింపు చేపట్టి అతన్ని పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.   
 
 ఈ ఘటన ఉడుపి జిల్లా కార్కళ తాలూకాలో  బుధవారం చోటు చేసుకుంది.  కార్కళ తాలూకా శివపురకు చెందిన  యువకుడు ప్రైవేటు బస్సుడ్రైవరుగా విధులు నిర్వహిస్తున్నాడు.  ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ఇతడికి పరిచయమై  ప్రేమగా మారింది. అనంతరం యువతికి ఇటీవల మణిపాల్ హోటల్‌లో  క్యాషియర్‌గా ఉద్యోగం ఇప్పించాడు.  కులాలు వేరు  కావడంతో  వివాహానికి కుటుంబసభ్యుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది.
 
  దీంతో యువతి కుటుంబసభ్యులు వేరే యువకుడితో వివాహం చేయడానికి నిశ్చయించారు. పసిగట్టిన ప్రియుడు యువతి పరువు తీయాలనే ఉద్దేశంతో ఉడుపిలోని ఓ లాడ్జీకి   తీసుకెళ్లి రాసలీలలు జరిపాడు.  ఆ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించి  వాట్సాప్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.    యువతి ఈ విషయాన్ని హిందూ సంఘటనకార్యకర్తలకు తెలపడంతో వారు ఆ యువకుడిని   పట్టుకుని   హెబ్రి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇరు కుటుంబ సభ్యులను వివాహానికి ఒప్పించి నిరాడంబరంగా వీరి వివాహం జరిపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement