Coolpad Note 5
-
కూల్‌ప్యాడ్ స్మార్ట్ఫోన్లపై ధర తగ్గింపు
కూల్‌ప్యాడ్ అధికారికంగా మూడు స్మార్ట్ఫోన్లపై భారత్‌లో ధరలు తగ్గించింది. కూల్‌ప్యాడ్ కూల్ 1 డ్యూయల్పై 6వేల రూపాయలు, కూల్‌ప్యాడ్ నోట్ 5 స్మార్ట్‌ఫోన్‌పై 4వేల రూపాయల వరకు, కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్ స్మార్ట్‌ఫోన్‌పై 4వేల రూపాయల వరకు ధర తగ్గిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. కూల్ 1 డ్యూయల్, నోట్ 5 లైట్ స్మార్ట్ఫోన్లపై అదనంగా 500 రూపాయల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా అందించనున్నట్టు పేర్కొంది. ఈ మూడు స్మార్ట్ఫోన్లు అమెజాన్.ఇన్‌లో అందుబాటులో ఉన్నాయి. 0 శాతం ఈఎంఐ కొనుగోళ్లు కూడా అమెజాన్ ఆఫర్ చేస్తుంది. జనవరి 29 నుంచి కూల్‌ప్యాడ్ కూల్ 1 డ్యూయల్(3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్) రూ.7999కే అందుబాటులో ఉండనుంది. లాంచింగ్ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర 11,999 రూపాయలు. అదేవిధంగా 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ కలిగిన కూల్ 1 డ్యూయల్ 8,999 రూపాయలకే అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర అంతకముందు రూ.14,999గా ఉంది. నోట్ 5 స్మార్ట్‌ఫోన్ ధర రూ.11,999 నుంచి రూ.7,9999కు, నోట్ 5 లైట్ స్మార్ట్‌ఫోన్ ధర 8,999 రూపాయల నుంచి 5,999 రూపాయలకు తగ్గించింది. ఈ మూడు స్మార్ట్ఫోన్లకు ముందు నుంచి మంచి స్పందన వస్తుందని కంపెనీ తెలిపింది. సరసమైన ధరల్లో మంచి నాణ్యతను, అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నామని, దీంతో కస్టమర్లు తమ డివైజ్‌లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది. ఈ ధర తగ్గింపుతో సరసమైన ధరల్లో కూల్‌ప్యాడ్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్లకు ఇది గొప్ప అవకాశమని కూల్‌ప్యాడ్ ఇండియా సీఈవో సయ్యద్ చెప్పారు. డిస్కౌంట్ ఆఫర్‌తో అద్భుతమైన స్పందనను తాము పొందనున్నట్టు ఆశాభావం వ్యక్తంచేశారు. కూల్‌ప్యాడ్ కూల్ 1 డ్యూయల్ స్మార్ట్‌ఫోన్... క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 652 ఎస్ఓసీ, 3జీబీ/4జీబీ ర్యామ్, 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 13 మెగాపిక్సెల్ సెన్సార్లలతో డ్యూయల్ రియర్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. కూల్‌ప్యాడ్ నోట్ 5 స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 617 ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్, 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4010 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్ స్మార్ట్‌ఫోన్‌కు 5 అంగుళాల హెచ్డీ 2.5డీ ఐపీఎస్ డిస్ప్లే, మీడియాటెక్ ఎంటీ6735 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 16జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉన్నాయి. -
ఆ ఫోన్లపై అమెజాన్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్స్
కూల్ ప్యాడ్ స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ డిస్కౌంట్లను, ఎక్స్చేంజ్ ఆఫర్లను ప్రకటించింది. క్యూల్ ప్యాడ్ కూల్1 డ్యూయల్, కూల్ ప్యాడ్ నోట్5, కూల్ ప్యాడ్ నోట్5 లైట్ స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ ఈ ఆఫర్లను అందిస్తున్నట్టు తెలిసింది. 3జీబీ, 32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ కలిగిన కూల్ ప్యాడ్ కూల్1 డ్యూయల్ స్మార్ట్ ఫోన్ ను రూ.9999కే అమెజాన్ అందిస్తోంది. దీని అసలు ధర 11,999రూపాయలు. అదేవిధంగా ఈ స్మార్ట్ ఫోన్ పై 7,712 రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందిస్తోంది. ఇదే స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్, 32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ వేరియంట్ కూడా అమెజాన్ ప్లాట్ ఫామ్ పై రూ.11,999కు దొరుకుతోంది. ఇది లాంచింగ్ సమయంలో 14,999రూపాయల ధర కలిగి ఉంది. దీనిపై కూడా గరిష్టంగా 9,412రూపాయల వరకు ఎక్స్చేంజ్ ను ఆఫర్ చేస్తోంది. 3జీబీ, 4జీబీ వేరియంట్లలో కూల్ ప్యాడ్ కూల్1 డ్యూయల్ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు వేరియంట్లకు వెనుకవైపు రెండు కెమెరాలు కలిగిఉన్నాయి. కూల్ ప్యాడ్ నోట్5(32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ఫోన్)ను 9,999రూపాయలకు అమెజాన్ తన ప్లాట్ ఫామ్ పై విక్రయిస్తోంది. 5.5అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ ప్లే, 4010 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ ర్యామ్ కలిగిన ఈ ఫోన్ అసలు ధర 10,999 రూపాయలు. అంతేకాక ఎక్స్చేంజ్ పై 7,712 రూపాయల వరకు డిస్కౌంట్ ను అమెజాన్ అందుబాటులో ఉంచింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లపైనే కాకుండా కూల్ ప్యాడ్ నోట్5 లైట్ ను డిస్కౌంట్ ధరలో 7,499 రూపాయలకు విక్రయిస్తోంది. దీని అసలు ధర 8,999 రూపాయలు. కానీ ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే అవుట్ ఆఫ్ స్టాక్ అయినట్టు తెలిసింది. -
బడ్జెట్ ఫ్రెండ్లీ కూల్ ప్యాడ్ నోట్ 5 వచ్చేసింది
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ కూల్ ప్యాడ్ మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. కూల్ ప్యాడ్ నోట్ లతో మార్కెట్లో హల్ చల్ చేస్తున్న సంస్థ ఈ సిరీస్ లో ఇపుడు 'కూల్ ప్యాడ్ నోట్ 5'ను విడుదల చేసింది. ఈ 4 జీ ఎనేబుల్డ్ స్మార్ట్ ఫోన్ ధరను రూ.10,999 గా కంపెనీ నిర్ణయించింది. తక్కువ వెలుగులోకూడా మంచి ఫోటోల అనుభవాన్ని మిగిల్చే తమ తాజా డివైస్ ను అమెజాన్ ద్వారా అక్టోబర్ 18 ఓపెన్ సేల్ అందుబాటులో ఉంచినట్టు కంపెనీ తెలిపింది.భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కూల్ ప్యాడ్ నోట్ 5 లాంచ్ చేయడం సంతోషంగాఉందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ లువో జాంగ్ షెంగ్ విలేకరులకు తెలిపారు. ప్రస్తుత పోటీ మార్కెట్లో అత్యధికంగా విక్రయిస్తున్న ఫోన్లలో ఇది కూడా ఒకటన్నారు. 'కూల్ ప్యాడ్ నోట్ 5' ఫీచర్లు 5.5 అంగుళాల డిస్ ప్లే క్వాల్కం ఎస్డీ 617 ఆక్టాకోర్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ 64 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ ఈడీ ఫ్లాష్, 13ఎంపీ వెనుక కెమెరా, విత్ ఎల్ ఈడీ ఫ్లాష్, 4010 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆకర్షణీయమైన ఫీచర్స్ తో తమ బడ్జెట్ ఫ్రెండ్లీ, పవర్ ప్యాక్డ్ డివైస్ వినియోగదారులకు ఆకట్టుకుంటుందని కూల్ ప్యాడ్ సీఈవో సయ్యద్ తాజుద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ , బెంగళూరు, చెన్నైలలో ఆఫ్ లైన్ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం తర్వాత మరో రెండు మూడు నెలల్లోమరో 13 నగరాల్లో లాంచ్ చేయనున్నట్టుచెప్పారు.