కూల్‌ప్యాడ్‌ స్మార్ట్‌ఫోన్లపై ధర తగ్గింపు | Coolpad Cool 1 Dual, Note 5, Note 5 Lite Price Cut in India   | Sakshi
Sakshi News home page

కూల్‌ప్యాడ్‌ స్మార్ట్‌ఫోన్లపై ధర తగ్గింపు

Published Tue, Jan 30 2018 8:53 AM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

Coolpad Cool 1 Dual, Note 5, Note 5 Lite Price Cut in India   - Sakshi

కూల్‌ప్యాడ్‌ స్మార్ట్‌ఫోన్‌(ఫైల్‌)

కూల్‌ప్యాడ్‌ అధికారికంగా మూడు స్మార్ట్‌ఫోన్లపై భారత్‌లో ధరలు తగ్గించింది. కూల్‌ప్యాడ్‌ కూల్‌ 1 డ్యూయల్‌పై 6వేల రూపాయలు‌, కూల్‌ప్యాడ్‌ నోట్‌ 5 స్మార్ట్‌ఫోన్‌పై 4వేల రూపాయల వరకు, కూల్‌ప్యాడ్‌ నోట్‌ 5 లైట్ స్మార్ట్‌ఫోన్‌పై 4వేల రూపాయల వరకు ధర తగ్గిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. కూల్‌ 1 డ్యూయల్‌, నోట్‌ 5 లైట్‌ స్మార్ట్‌ఫోన్లపై అదనంగా 500 రూపాయల వరకు ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ కూడా అందించనున్నట్టు పేర్కొంది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు అమెజాన్‌.ఇన్‌లో అందుబాటులో ఉన్నాయి. 0 శాతం ఈఎంఐ కొనుగోళ్లు కూడా అమెజాన్‌ ఆఫర్‌ చేస్తుంది.

జనవరి 29 నుంచి కూల్‌ప్యాడ్‌ కూల్‌ 1 డ్యూయల్‌(3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌) రూ.7999కే అందుబాటులో ఉండనుంది. లాంచింగ్‌ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 11,999 రూపాయలు. అదేవిధంగా 4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ కలిగిన కూల్‌ 1 డ్యూయల్‌ 8,999 రూపాయలకే అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర అంతకముందు రూ.14,999గా ఉంది. నోట్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.11,999 నుంచి రూ.7,9999కు, నోట్‌ 5 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర 8,999 రూపాయల నుంచి 5,999 రూపాయలకు తగ్గించింది. 

ఈ మూడు స్మార్ట్‌ఫోన్లకు ముందు నుంచి మంచి స్పందన వస్తుందని కంపెనీ తెలిపింది. సరసమైన ధరల్లో మంచి నాణ్యతను, అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నామని, దీంతో కస్టమర్లు తమ డివైజ్‌లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది. ఈ ధర తగ్గింపుతో సరసమైన ధరల్లో కూల్‌ప్యాడ్‌ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్లకు ఇది గొప్ప అవకాశమని కూల్‌ప్యాడ్‌ ఇండియా సీఈవో సయ్యద్‌ చెప్పారు. డిస్కౌంట్‌ ఆఫర్‌తో అద్భుతమైన స్పందనను తాము పొందనున్నట్టు ఆశాభావం వ్యక్తంచేశారు. 

  • కూల్‌ప్యాడ్‌ కూల్‌ 1 డ్యూయల్‌ స్మార్ట్‌ఫోన్‌... క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 652 ఎస్‌ఓసీ, 3జీబీ/4జీబీ ర్యామ్‌, 32జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌, 13 మెగాపిక్సెల్‌ సెన్సార్లలతో డ్యూయల్‌ రియర్‌ కెమెరా, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉంది.
  • కూల్‌ప్యాడ్‌ నోట్‌ 5 స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 617 ఎస్‌ఓసీ, 4జీబీ ర్యామ్‌, 32జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌, 13 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా,  4010 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి.
  • కూల్‌ప్యాడ్‌ నోట్‌ 5 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌కు 5 అంగుళాల హెచ్‌డీ 2.5డీ ఐపీఎస్‌ డిస్‌ప్లే, మీడియాటెక్‌ ఎంటీ6735 ప్రాసెసర్‌, 3జీబీ ర్యామ్‌, 16జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement