కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్ లాంచ్... ధర ఎంత?
న్యూడిల్లీ: చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ దిగ్గజ సంస్థ కూల్ ప్యాడ్ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో గురువారం లాంచ్ చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల స్మార్ట్‌ఫోన‍్లను విక్రయించిన సంస్థ ఆ సిరీస్ లో కూల్ ప్యాడ్ నోట్ 5 లైట్ ను విడుదల చేసింది. కూల్ ప్యాడ్ నోట్ 5 తో తొలి స్మార్ట్‌పోన్‌ను భారత మార్కెట్టో ప్రవేశపెట్టిన సంస్థ ఆ సిరీస్ లో పోటీ ధరలోదీన్ని పరిచయం చేసింది. స్టయిలిష్ లుక్ లో ఫుల్‌మెటల్‌బాడీతో రూపొందించిన గ్రే అండ్ బ్లాక్ కలర్స్‌లో లాంచ్ చేసింది. కూల్ ప్యాడ్ నోట్ 5 లైట్ ధరను రూ.8199గా కంపెనీ నిర్ణయించింది. మార్చి 21నుంచి ప్రత్యేకంగా అమెజాన్‌లో విక్రయానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్ ఫీచర్స్
5.0 అంగుళాల ఐపీఎస్ హెచ్‌డీ డిస్‌ప్లే
3జీబీ ర్యామ్,
16జీబీస్టోరేజ్
64 జీబీమైక్రోస్టాఫ్ట్ కార్డ్ ద్వారా ఎక్స్‌పాండబుల్ మెమొరీ,
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
13 ఎంపీ రియర్ కెమెరా,
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో, 200 గంటల స్టాండ్‌బై బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ ప్రత్యేకతగా కంపెనీ చెబుతోంది.
Presenting the #CoolpadNote5Lite which comes with 13+8 MP with Front Flash, 3GB+16GB ROM, FP Scanner, Metal body & more @ Rs. 8199 only! pic.twitter.com/V9dJ5NgAgW
— Coolpad India (@CoolpadInd) March 16, 2017