న్యూడిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ కూల్ పాడ్ తాజా స్మార్ట్ ఫోన్ నోట్ 5 లైట్ ఇక మీదట ఓపెన్ సేల్ లో లభ్యం కానుంది. ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ చేసిన కూల్ పాడ్ నోట్5 లైట్ స్మార్ట్ ఫోన్ ను ఇపుడు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్ రీటైలర్ అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తోంది. ఫ్రీ డెలివరీ, క్యాష్ ఆన్‌డెలివర్, ఈఎంఐ సదుపాయంతో పాటు, కొనుగోలు చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం తయారీదారు వారంటీ, ఆరు నెలలు ఇన్‌బ్యాక్స్ (బ్యాటరీలు సహా లో ఇతర యాక్ససరీస్) వారంటీ అందిస్తోంది. వైఫై,బ్లూ టూత్,డ్యూయల్ సిం,ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్లతో లాంచ్ అయిన స్పేస్ గ్రే కలర్స్ వేరియంట్ అందుబాటులో ఉంది. రూ.8,199 ధరలో ఈ కూపాడ్ నోట్ 5లైట్ ఫోన్ అందుబాటు ఉంచింది. దీంతోపాటూ రూ.6,395 ల దాకా ఎక్సేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఒక కస్టమర్‌కు ఒక యూనిట్ మాత్రమే .
కూల్ పాడ్ నోట్ 5లైట్ ఫోన్ ఫీచర్స్
5ఇంచెస్ హెచ్ది డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం,
3 జీబీ రామ్
16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,
64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13ఎంపీ రియర్ కెమెరా,
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
2500ఎంఏహెచ్‌బ్యాటరీ
కూల్ పాడ్ నోట్ 5లైట్ ఫోన్ ఫీచర్స్
5ఇంచెస్ హెచ్ది డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం,
3 జీబీ రామ్
16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,
64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13ఎంపీ రియర్ కెమెరా,
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
2500ఎంఏహెచ్‌బ్యాటరీ