Coolpad
-
కూల్‌ప్యాడ్ స్మార్ట్ఫోన్లపై ధర తగ్గింపు
కూల్‌ప్యాడ్ అధికారికంగా మూడు స్మార్ట్ఫోన్లపై భారత్‌లో ధరలు తగ్గించింది. కూల్‌ప్యాడ్ కూల్ 1 డ్యూయల్పై 6వేల రూపాయలు, కూల్‌ప్యాడ్ నోట్ 5 స్మార్ట్‌ఫోన్‌పై 4వేల రూపాయల వరకు, కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్ స్మార్ట్‌ఫోన్‌పై 4వేల రూపాయల వరకు ధర తగ్గిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. కూల్ 1 డ్యూయల్, నోట్ 5 లైట్ స్మార్ట్ఫోన్లపై అదనంగా 500 రూపాయల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా అందించనున్నట్టు పేర్కొంది. ఈ మూడు స్మార్ట్ఫోన్లు అమెజాన్.ఇన్‌లో అందుబాటులో ఉన్నాయి. 0 శాతం ఈఎంఐ కొనుగోళ్లు కూడా అమెజాన్ ఆఫర్ చేస్తుంది. జనవరి 29 నుంచి కూల్‌ప్యాడ్ కూల్ 1 డ్యూయల్(3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్) రూ.7999కే అందుబాటులో ఉండనుంది. లాంచింగ్ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర 11,999 రూపాయలు. అదేవిధంగా 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ కలిగిన కూల్ 1 డ్యూయల్ 8,999 రూపాయలకే అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర అంతకముందు రూ.14,999గా ఉంది. నోట్ 5 స్మార్ట్‌ఫోన్ ధర రూ.11,999 నుంచి రూ.7,9999కు, నోట్ 5 లైట్ స్మార్ట్‌ఫోన్ ధర 8,999 రూపాయల నుంచి 5,999 రూపాయలకు తగ్గించింది. ఈ మూడు స్మార్ట్ఫోన్లకు ముందు నుంచి మంచి స్పందన వస్తుందని కంపెనీ తెలిపింది. సరసమైన ధరల్లో మంచి నాణ్యతను, అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నామని, దీంతో కస్టమర్లు తమ డివైజ్‌లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది. ఈ ధర తగ్గింపుతో సరసమైన ధరల్లో కూల్‌ప్యాడ్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్లకు ఇది గొప్ప అవకాశమని కూల్‌ప్యాడ్ ఇండియా సీఈవో సయ్యద్ చెప్పారు. డిస్కౌంట్ ఆఫర్‌తో అద్భుతమైన స్పందనను తాము పొందనున్నట్టు ఆశాభావం వ్యక్తంచేశారు. కూల్‌ప్యాడ్ కూల్ 1 డ్యూయల్ స్మార్ట్‌ఫోన్... క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 652 ఎస్ఓసీ, 3జీబీ/4జీబీ ర్యామ్, 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 13 మెగాపిక్సెల్ సెన్సార్లలతో డ్యూయల్ రియర్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. కూల్‌ప్యాడ్ నోట్ 5 స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 617 ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్, 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4010 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్ స్మార్ట్‌ఫోన్‌కు 5 అంగుళాల హెచ్డీ 2.5డీ ఐపీఎస్ డిస్ప్లే, మీడియాటెక్ ఎంటీ6735 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 16జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉన్నాయి. -
కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 స్మార్ట్‌ఫోన్ రేపే
కూల్‌ప్యాడ్ మరోఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ 'కూల్ ప్లే 6'ను లాంచ్ చేయనుంది. ఆగస్టు 20న దుబాయ్‌లో జరిగే ఓ స్పెషల్ ఈవెంట్లో దీన్ని విడుదల చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే మీడియాకు ఆహానాన్ని పంపింది. అలాగే ట్విట్టర్ ద్వారా కూడా కూల్‌ప్యాడ్ కస్టమర్లను ఊరిస్తోంది. గేమింగ్ఫోన్గా చెబుతున్న కంపెనీ ధర, ఫీచర్స్పై అధికారిక ప్రకటనలేనప్పటికీ రూ.14,420 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుందని అంచనా. కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 ఫీచర్లు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1 నూగట్ 6జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ Meet another trend setting smartphone from Coolpad.Launching the transformation of speed on 20th August in Dubai.#LiveToPlay #CoolpadInDubai pic.twitter.com/Si7psnvsjN — Coolpad India (@CoolpadInd) August 19, 2017 -
కూల్‌ప్యాడ్ కొత్త ఫోన్ కమింగ్..కన్ఫాం..
చైనా మొబైల్ మేకర్ కూల్ ప్యాడ్ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో త్వరలో లాంచ్ చేయనుంది. కూల్ ప్లే 6 పేరుతో ఆగస్టు 20వ తేదీన ఆవిష్కరించనున్నట్లు ఫేస్బుక్ పేజి, ట్విట్టర్ ద్వారా ధృవీకరించింది. అయితే మే నెలలో సాఫ్ట్ గోల్డ్ ,బ్లాక్ రంగులలో దీన్ని చైనాలో లాంచ్ చేసింది. ద్వంద్వ కెమెరా సెటప్, ఫింగర్ ప్రింట్‌సెన్సర్, 6 జీబీ ర్యామ్, పేరులోనే పేర్కొన్నట్టుగా గ్రేట్ గేమింగ్ డివైస్ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా చెబుతున్న కంపెనీ దీని ధరను 1,499 యెన్లు(సుమారుగా రూ .14,000)గా నిర్ణయించింది. బ్యాటరీ సామర్ధ్యం 252గంటల స్టాండ్‌బై ఉంటుందనీ, దీంతో 9గంటలపాటు ఇండర్నెట్ బ్రౌజింగ్, 8 గంటల పాటు వీడియోలు వీక్షణం, 6గంటల పాటు వీడియో గేమింగ్ సౌలభ్యం ఉంటుందని కూల్‌ప్యాడ్ ప్రకటించింది. కూల్ ప్లే 6 ఫీచర్లు 5.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ 1080x1920 పిక్సెల్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 653 ప్రాసెసర్ 6 జీబీర్యామ్, 64జీబీ స్టోరేజ్, విస్తరించుకునే సదుపాయం కూడా రెండు 13-మెగాపిక్సెల్ కెమెరాలు విత్ సోనీ సెన్సార్ 8 ఎంపీ సెల్పీ కెమెరా 4060ఎంఏహెచ్ బ్యాటరీ Get ready to witness the new era of gaming with our upcoming flagship device on 20th August. #LiveToPlay pic.twitter.com/68WlJaMRIG — Coolpad India (@CoolpadInd) August 11, 2017 -
కూల్ ప్యాడ్ కొత్త ఫోన్, ఫీచర్లెలా ఉన్నాయంటే..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ కూల్ ప్యాడ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్లోకి లాంచ్ చేసింది. కూల్ ప్యాడ్ కూల్ ప్లే6 పేరుతో బుధవారం దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర సీఎన్‌వై 1,499గా కంపెనీ ప్రకటించింది. అంటే భారత్ కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు 8900రూపాయలు ఉండొచ్చు. చైనాలో రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన కంపెనీ, ఈ ఫోన్ ను మే 16నుంచి విక్రయానికి తీసుకొస్తోంది. మెటల్ ఫ్రేమ్ విత్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ రియర్ కెమెరా, 4060 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో స్పెషల్ ఫీచర్లు. సాఫ్ట్ గోల్డ్, బ్లాక్ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. డ్యూయల్ స్పీకర్ గ్రిల్స్ ను స్మార్ట్ ఫోన్ కింద భాగంలో కంపెనీ ఉంచింది. 5.5 అంగుళాల డిస్ ప్లే కలిగిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ తో రన్ అవుతుంది. 64బిట్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 653 చిప్ సెట్, 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డు ద్వారా విస్తరణ మెమరీకి అవకాశం, రెండు 13మెగాపిక్సెల్ సోనీ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా, సెల్ఫీ కోసం ముందు భాగాన 8 మెగాపిక్సెల్ కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి.. -
కూల్‌పాడ్ నోట్ 5 లైట్ ఓపెన్ సేల్
న్యూడిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ కూల్ పాడ్ తాజా స్మార్ట్ ఫోన్ నోట్ 5 లైట్ ఇక మీదట ఓపెన్ సేల్ లో లభ్యం కానుంది. ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ చేసిన కూల్ పాడ్ నోట్5 లైట్ స్మార్ట్ ఫోన్ ను ఇపుడు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తోంది. ఫ్రీ డెలివరీ, క్యాష్ ఆన్డెలివర్, ఈఎంఐ సదుపాయంతో పాటు, కొనుగోలు చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం తయారీదారు వారంటీ, ఆరు నెలలు ఇన్బ్యాక్స్ (బ్యాటరీలు సహా లో ఇతర యాక్ససరీస్) వారంటీ అందిస్తోంది. వైఫై,బ్లూ టూత్,డ్యూయల్ సిం,ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్లతో లాంచ్ అయిన స్పేస్ గ్రే కలర్స్ వేరియంట్ అందుబాటులో ఉంది. రూ.8,199 ధరలో ఈ కూపాడ్ నోట్ 5లైట్ ఫోన్ అందుబాటు ఉంచింది. దీంతోపాటూ రూ.6,395 ల దాకా ఎక్సేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఒక కస్టమర్‌కు ఒక యూనిట్ మాత్రమే . కూల్ పాడ్ నోట్ 5లైట్ ఫోన్ ఫీచర్స్ 5ఇంచెస్ హెచ్ది డిస్ప్లే ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం, 3 జీబీ రామ్ 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13ఎంపీ రియర్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా 2500ఎంఏహెచ్‌బ్యాటరీ -
కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్ లాంచ్... ధర ఎంత?
న్యూడిల్లీ: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజ సంస్థ కూల్ ప్యాడ్ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో గురువారం లాంచ్ చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల స్మార్ట్ఫోన్లను విక్రయించిన సంస్థ ఆ సిరీస్ లో కూల్ ప్యాడ్ నోట్ 5 లైట్ ను విడుదల చేసింది. కూల్ ప్యాడ్ నోట్ 5 తో తొలి స్మార్ట్‌పోన్‌ను భారత మార్కెట్టో ప్రవేశపెట్టిన సంస్థ ఆ సిరీస్ లో పోటీ ధరలోదీన్ని పరిచయం చేసింది. స్టయిలిష్ లుక్ లో ఫుల్మెటల్బాడీతో రూపొందించిన గ్రే అండ్ బ్లాక్ కలర్స్‌లో లాంచ్ చేసింది. కూల్ ప్యాడ్ నోట్ 5 లైట్ ధరను రూ.8199గా కంపెనీ నిర్ణయించింది. మార్చి 21నుంచి ప్రత్యేకంగా అమెజాన్‌లో విక్రయానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్ ఫీచర్స్ 5.0 అంగుళాల ఐపీఎస్ హెచ్డీ డిస్ప్లే 3జీబీ ర్యామ్, 16జీబీస్టోరేజ్ 64 జీబీమైక్రోస్టాఫ్ట్ కార్డ్ ద్వారా ఎక్స్‌పాండబుల్ మెమొరీ, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో, 200 గంటల స్టాండ్‌బై బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ ప్రత్యేకతగా కంపెనీ చెబుతోంది. Presenting the #CoolpadNote5Lite which comes with 13+8 MP with Front Flash, 3GB+16GB ROM, FP Scanner, Metal body & more @ Rs. 8199 only! pic.twitter.com/V9dJ5NgAgW — Coolpad India (@CoolpadInd) March 16, 2017 -
కూల్‌ప్యాడ్ నుంచి రెండు 4జీ స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ కూల్‌ప్యాడ్ ‘డాజెన్ ఎక్స్7’, ‘డాజెన్ 1’ అనే రెండు 4జీ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి ధరలు వరుసగా రూ.17,999, రూ.6,999గా ఉన్నాయి. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై నడిచే ‘డాజెన్ ఎక్స్7’ స్మార్ట్‌ఫోన్‌లో 5.2 అంగుళాల హెచ్డీ తెర, 13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ, 2,700 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే 1.2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ‘డాజెన్ 1’ సొంతం. ఈ ఫోన్లు జూన్ 9 నుంచి స్నాప్‌డీల్‌లో మాత్రమే లభించనున్నాయి. భారత్‌లో ఆన్లైన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అత్యంత వేగంగా వృద్ధిచెందుతోందని, అందుకే తమ మార్కెట్ ప్రాథమ్యాలలో భారత్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని కూల్‌ప్యాడ్ గ్లోబల్ సీఈఓ లీ వాంగ్ తెలిపారు. ఔరంగాబాద్‌లో మొబైల్ ప్లాంట్ ఔరంగాబాద్‌లో మొబైల్ అసెంబ్లింగ్ యూని ట్ను ఏర్పాటు చేస్తున్నట్లు కూల్‌ప్యాడ్ ఇండియా సీఈఓ వరుణ్ శర్మ తెలిపారు. అదేవిధంగా రీసెర్చ్, డెవలప్మెంట్ యూనిట్‌ను బెంగళూరులో ఏర్పాటు చేయనుంది.