కూల్‌ప్యాడ్ నుంచి రెండు 4జీ స్మార్ట్‌ఫోన్లు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ కూల్‌ప్యాడ్ ‘డాజెన్ ఎక్స్7’, ‘డాజెన్ 1’ అనే రెండు 4జీ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. వీటి ధరలు వరుసగా రూ.17,999, రూ.6,999గా ఉన్నాయి. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై నడిచే ‘డాజెన్ ఎక్స్7’ స్మార్ట్‌ఫోన్‌లో 5.2 అంగుళాల హెచ్‌డీ తెర, 13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ, 2,700 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
అలాగే 1.2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ‘డాజెన్ 1’ సొంతం. ఈ ఫోన్లు జూన్ 9 నుంచి స్నాప్‌డీల్‌లో మాత్రమే లభించనున్నాయి. భారత్‌లో ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అత్యంత వేగంగా వృద్ధిచెందుతోందని, అందుకే తమ మార్కెట్ ప్రాథమ్యాలలో భారత్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని కూల్‌ప్యాడ్ గ్లోబల్ సీఈఓ లీ వాంగ్ తెలిపారు.
ఔరంగాబాద్‌లో మొబైల్ ప్లాంట్
ఔరంగాబాద్‌లో మొబైల్ అసెంబ్లింగ్ యూని ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కూల్‌ప్యాడ్ ఇండియా సీఈఓ వరుణ్ శర్మ తెలిపారు. అదేవిధంగా రీసెర్చ్, డెవలప్‌మెంట్ యూనిట్‌ను బెంగళూరులో ఏర్పాటు చేయనుంది.