
జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చీఫ్ సజ్జన్ జిందాల్
న్యూఢిల్లీ: భారత్‌లో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు ఇక్కడి మార్కెట్‌పై పట్టు సాధించడం అంత సులువు కాదని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ వ్యాఖ్యానించారు. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలాంటి దేశీ దిగ్గజాల తరహాలో అది రాణించలేకపోవచ్చని తెలిపారు. ఎర్న్‌స్ట్ అండ్ యంగ్ ‘ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘‘మస్క్ చాలా స్మార్ట్. అందులో సందేహం లేదు. ఆయన చాలా గొప్ప పనులు చేస్తున్నారు.
కానీ ఆయన ఉన్నది అమెరికాలో, భారత్‌లో కాదు. ఇక్కడ విజయం సాధించాలంటే అంత సులభం కాదు. మహీంద్రా, టాటాల్లాగా ఆయన రాణించలేరు’’ అని జిందాల్ పేర్కొన్నారు. ఈవీల దిగుమతులపై టారిఫ్‌ల తగ్గింపు అవకాశాలతో భారత మార్కెట్లో ప్రవేశించేందుకు టెస్లా సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కూడా ఈవీ సెగ్మెంట్లో అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. చైనాకు చెందిన ఎస్‌ఏఐసీ కార్పొరేషన్‌తో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా ఇటీవలే ఎలక్ట్రిక్, ప్లగ్–ఇన్ హైబ్రిడ్స్ మొదలైన పలు వాహనాలను ప్రదర్శించింది.
Comments
Please login to add a commentAdd a comment