Sajjan Jindal
-
వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి: సజ్జన్ జిందాల్‌తో గడ్కరీ
కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' (Nitin Gadkari) నాగ్‌పూర్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదర్భలో పెట్టుబడులు పెట్టవలసిన అవసరాన్ని గురించి వివరించారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు లేకపోవడం వల్ల రూ. 500 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారులు లేకపోవడాన్ని పేర్కొన్నారు.జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియాలో 35 శాతం వాటాను కలిగి ఉన్న 'సజ్జన్ జిందాల్' ఇటీవల తన నివాసాన్ని సందర్శించినట్లు గడ్కరీ పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని తాను చెప్పినట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: 40 ఏళ్ల క్రితం టీసీఎస్‌లో జీతం ఎంతంటే?: ఆఫర్ లెటర్ వైరల్వ్యాపారాలకు ప్రభుత్వ రాయితీల సమస్యను ప్రస్తావిస్తూ, పారిశ్రామికవేత్తలు కూడా కొంత ఓపికతో ఉండాలని గడ్కరీ చెప్పారు. లడ్కీ బహిన్ యోజన కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాల్సి ఉన్నందున.. పెట్టుబడిదారులు తమ సబ్సిడీ చెల్లింపును అందుకోవడానికి కొంత సమయం ఎదురు చూడాల్సి ఉంటుందని అన్నారు. కాబట్టి విదర్భలోని వ్యాపారులు, తమ వ్యాపారాలను స్వతంత్రంగా చేసుకోవాలని, ప్రభుత్వాల మీదే పూర్తిగా ఆధారపడకూడదని సలహా ఇచ్చారు. -
పారిస్ ఒలింపిక్స్ విజేతలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ బంపరాఫర్..
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ తరపున పతకాలు సాధించేవారికి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జల్ జిందాల్ బంపరాఫర్ ఇచ్చారు. ఈ విశ్వ క్రీడల్లో మెడల్స్ సాధించిన భారత క్రీడాకారులకు 'ఎంజీ విండ్సర్' కారు బహుమతిగా ఇవ్వనున్నట్లు సజ్జల్ జిందాల్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా శుక్రవారం వెల్లడించారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల్స్ను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిందాల్ తెలిపారు. "భారత్ తరపున పతకం సాధించే ప్రతీ క్రీడాకారుడికి జేఎస్‌డబ్ల్యూ గ్రూపు తరుపున 'ఎంజీ విండ్సర్స్ బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఈ ప్రకటన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అత్యుత్తమ వ్యక్తులు అత్యుత్తమైనవి పొందేందుకు అర్హులు కదా! వారి అంకిత భావం, విజయాల కోసమే ఇది అంటూ" ఎక్స్‌లో జిందాల్ రాసుకొచ్చాడు. కాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్‌గా కూడా సజ్జల్ జిందాల్ ఉన్నారు. ఇక ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ప్రస్తుతం మూడు పతకాలు ఉన్నాయి. షూటింగ్లో మను భకర్ రెండు కాంస్య పతకాలు సాధించగా.. స్వప్నిల్ కుసాలే సింగ్ ఓ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. -
ప్రతి మూడు నెలలకు ఓ కొత్త కారు
ముంబై: చైనాకు చెందిన ఎస్ఏఐసీతో దేశీ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ’జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా’ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. సెపె్టంబర్ నుంచి మొదలుపెట్టి ప్రతి 3–4 నెలలకు ఓ కొత్త కారును ఆవిష్కరించాలని భావిస్తోంది. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఎస్ఏఐసీతో భాగస్వామ్యం ఖరారు చేసుకోవడాన్ని ప్రకటించిన సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, హలోల్‌లో (గుజరాత్) ఇప్పుడు తమకున్న ప్లాంటుకు దగ్గర్లోనే మరో ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు ఎంజీ మోటార్ ఇండియా గౌరవ చైర్మన్ రాజీవ్ చాబా తెలిపారు. దీనితో తమ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 1 లక్ష యూనిట్ల నుంచి 3 లక్షలకు పెరుగుతుందన్నారు. సామర్థ్యాల పెంపు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణపై భాగస్వాములు భారీగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మారుతీ తరహా విప్లవం.. కొత్త ఇంధనాలతో నడిచే వాహనాల (ఎన్ఈవీ) విభాగంలో ఈ జేవీ ’మారుతీ తరహా విప్లవాన్ని’ తేగలదని సజ్జన్ జిందాల్ పేర్కొన్నారు. ‘నలబై ఏళ్ల క్రితం మారుతీ మార్కెట్లోకి వచి్చన తర్వాత ఆటో పరిశ్రమను మార్చేసింది. సమర్ధమంతమైన, తేలికైన, అధునాతనమైన కార్లను ప్రవేశపెట్టి ఇప్పుడు మార్కెట్ లీడరుగా ఎదిగింది. అంబాసిడర్లు, ఫియట్లు కనుమరుగయ్యాయి. కొత్త ఇంధనాలతో నడిచే వాహనాల విభాగంలో ఎంజీ కూడా ఆ ఫీట్‌ను పునరావృతం చేయగలదని విశ్వసిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు. 2030 నాటికి ఏటా 10 లక్షల యూనిట్ల విక్రయాలతో ఎన్ఈవీ విభాగంలో తమ సంస్థ మార్కెట్ లీడరుగా ఎదగాలని నిర్దేశించుకున్నట్లు జిందాల్ వివరించారు. ఎంజీ మోటర్ మాతృ సంస్థ అయిన ఎస్ఏఐసీ మోటార్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ గతేడాది నవంబర్‌లో జేవీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కొత్త స్వరూపం ప్రకారం జేవీలో జేఎస్డబ్ల్యూకి 35 శాతం, భారతీయ ఫైనాన్షియల్ సంస్థలకు 8 శాతం, ఎంజీ మోటార్ డీలర్లకు 3 శాతం, ఉద్యోగులకు 5 శాతం, మిగతా 49 శాతం వాటాలు ఎస్ఏఐసీకి ఉంటాయి. కాగా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ – ఎస్ఏఐసీ మోటార్ జాయింట్ వెంచర్ క్రింద అభివృద్ధి చేసిన ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ జరిగింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ పార్త్ జిందాల్, ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సీఎం వైఎస్ జగన్ తో జేఎస్ డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ భేటీ
-
అత్యాచార ఆరోపణలను ఖండించిన సజ్జన్ జిందాల్
ముంబై: తనపై నమోదైన అత్యాచార కేసుపై జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ స్పందించారు. ఆ ఆరోపణలు అవాస్తవమని, నిరాధారమని పేర్కన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానన్న సజ్జన్ జిందాల్ కేసు విచారణ కొనసాగుతున్నందున దీనిపై మరింతగా వ్యాఖ్యానించలేనని వివరించారు. సజ్జన్ జిందాల్‌పై 30 ఏళ్ల వైద్యురాలైన మహిళ ఈ ఆరోపణలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ముంబైలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫిర్యాదు చేసి చాలా నెలలు గడిచినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆ మహిళ ఆరోపించారు. 2021లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్‌లో తాను సజ్జన్ జిందాల్‌ను కలిశానని ఆ మహిళ తెలిపారు. పెళ్లి చేసుకుంటానని సజ్జన్ జిందాల్ తనను నమ్మించాడని, 2022 జనవరి 24న తనపై అత్యాచారం చేశాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. -
‘70 గంటల పని’ వివాదంపై జిందాల్ ఏమన్నారంటే..
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. భారత యువత వారంలో కనీసం 70 గంటలు పనిచేయాలని ఆయన అనడంతో ఐటీ ఉద్యోగులతో సహా ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. అయితే ఆయన మాటలను సమర్థిస్తూ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్పర్సన్ సజ్జన్ జిందాల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. యువత విశ్రాంతి కంటే పనికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశానికి ఐదు రోజులపాటే పని చేయాలనే సంస్కృతి అవసరం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రోజూ 14-16 గంటలకు పైగా పని చేస్తారని, తానూ రోజూ 10-12 గంటలు విధుల్లో ఉంటానని తెలిపారు. A 5 day week culture is not what a rapidly developing nation of our size needs. Our PM @narendramodi ji works over 14-16 hours everyday. My father used to work 12-14 hours, 7 days a week. I work 10-12 hours everyday. We have to find passion in our work and in Nation Building. — Sajjan Jindal (@sajjanjindal) October 27, 2023 -
సీఎం వైఎస్ జగన్‌ను కలవడం ఆనందంగా ఉంది
సాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పేదల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించడం ఆనందంగా ఉంది’ అని జేఎస్‌డబ్ల్యూ సంస్థ చైర్మన్ అండ్ ఎండీ సజ్జన్ జిందాల్ శనివారం ట్వీట్ చేశారు. సీఎం వైఎస్ జగన్ తనకు వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ సజ్జన్ జిందాల్ ఈ ట్వీట్ చేశారు. ‘గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. రాష్ట్రంలోని పేద ప్రజల అభ్యున్నతి కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సీఎంతో చర్చించటం జరిగింది.’ అని ఆయన పేర్కొన్నారు. Its always a pleasure to meet @ysjagan Hon’ble CM of Andhra Pradesh. Discussed about the pathbreaking programs for the upliftment of the poor people of the state. pic.twitter.com/Bz2cx34sEU — Sajjan Jindal (@sajjanjindal) August 19, 2023 -
సజ్జన్ జిందాల్‌కు ఈవై ఎంటర్ప్రెన్యుర్ అవార్డ్
న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ ఈవై ఎంట్రప్రెన్యుర్ ఆఫ్ ద ఇయర్ 2022గా ఎంపికయ్యారు. డీఎల్ఎఫ్ అధినేత కేపీ సింగ్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ కేవీ కామత్ అధ్యక్షతన గల ఏడుగురు సభ్యుల జ్యురీ విజేతల వివరాలను ప్రకటించింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ స్టీల్, సిమెంట్, ఇన్ఫ్రా, ఎనర్జీ, పెయింట్స్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా 40వేల మందకి పైగా ఉపాధి కల్పిస్తుండడంతో ఈ సంస్థ అధినేత సజ్జన్ జిందాల్‌ను ఈవై ఎంట్రప్రెన్యుర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపిక చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరి కూడా హాజరయ్యారు. మరో తొమ్మిది ఇతర విభాగాల్లోనూ విజేతలను జ్యురీ ఎంపిక చేసింది. స్టార్టప్ విభాగంలో మెడ్‌జీనోమ్ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో మహేశ్ ప్రతాప్నేని, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వీ వైద్యనాథన్, ఎనర్జీ అండ్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా విభాగంలో ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్, ఎండీ ఇర్ఫాన్ రజాక్, తయారీ విభాగంలో బోరోసిల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మ్ ప్రదీప్ ఖెరుకాను జ్యురీ ఎంపిక చేసింది. -
స్టీల్ ప్లాంట్‌తో సొంతింటికి వచ్చినట్లుంది: సజ్జన్ జిందల్
సాక్షి, వైఎస్సార్: రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే రోజులకు బీజం పడింది. కడప సిగలో మరో కలికితురాయి వచ్చి చేరబోతోంది. నిరుద్యోగాన్ని పారదోలి మెరుగైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా స్టీల్ ప్లాంట్ రాబోతోంది. తొలివిడతగా రూ.3,300 కోట్లతో 10 లక్షల టన్నుల సామర్థ్యంతో చేపట్టనున్న నిర్మాణ పనులకు సున్నపురాళ్లపల్లి గ్రామం వద్ద భూమి పూజ చేశారు. జెఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించిన సందర్భంగా ‘అందరికీ నమస్కారం’ అంటూ జెఎస్డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందల్ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తన ప్రసంగంలో మహానేత వైఎస్సార్ తనకు మంచి మిత్రులు, గురువు అని సజ్జన్ జిందల్ అన్నారు. ఏపీకి సంబంధించి వైఎస్సార్ ఎన్నో విషయాలు చెప్పారన్నారు. సీఎం జగన్‌తో చాలా కాలం నుంచి పరిచయం ఉంది. వైఎస్సార్ చూపిన బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారని సజ్జన్ జిందల్ ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులపై సజ్జన్ జిందల్ మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో మా గ్రూప్‌నకు చెందిన స్టీల్ ప్లాంట్ భూమి పూజకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ స్టీల్ ప్లాంట్ అనేది రాష్ట్ర ప్రజలతో పాటు, జిల్లా వాసుల చిరకాల వాంఛ. ఈ ప్లాంట్ కోసం సీఎం జగన్ ఎంతో అంకితభావం, చిత్తశుద్దితో కృషి చేశారు. మమ్మల్ని నిరంతరం సంప్రదించారు. ఆయన చొరవ, ప్రయత్నం వల్లనే ఇవాళ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తోంది.’’ ► ‘‘ఇది వైయస్సార్ జిల్లా. ఇక్కడ ఇవాళ ఆయనను తల్చుకోకుండా ఉంటే, ఈ కార్యక్రమం అసంపూర్తిగా ఉండి పోతుంది. దివంగత వైయస్ రాజశేఖర్‌రెడ్డి నాకు వ్యక్తిగత మిత్రులు. ఆయనను ఎప్పుడు కలిసినా, మాట్లాడినా నాకెంతో సంతోషంగా ఉండేది. ఆయన నాకు ఒక మార్గదర్శకుడిగా ఉండేవారు. సీఎం వైఎస్ జగన్ కూడా నాకు సుదీర్ఘ కాలంగా తెలుసు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో నేను నా సొంత ఇంటికి తిరిగి వచ్చినట్లు అనిపిస్తోంది. తండ్రి రాజశేఖర్‌రెడ్డి బాటలో పయనిస్తున్న సీఎం జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారు.’’ ► ‘‘నేను దేశంలో అనేక రాష్ట్రాలు తిరిగాను. చాలా మంది ముఖ్యమంత్రులను కలిశాను. అందరూ సీఎం వైయస్ జగన్‌ను ప్రస్తావిస్తారు. ఆయన నాయకత్వం, పరిపాలన దక్షత గురించి చెబుతారు. ఎందుకంటే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గత మూడేళ్లుగా రాష్ట్ర జీడీపీ చాలా వేగంగా పెరుగుతోంది. అందుకు ప్రధాన కారణం సీఎం వైఎస్ జగన్ పరిపాలన, అంకితభావం. ఆయన చిత్తశుద్ధితో పని చేయడం వల్లనే ఇది సాధ్యమవుతోంది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు.’’ ►‘‘నేను క్రితంసారి ఆయనను కలిసినప్పుడు కలిసి భోజనం చేశాం. దాదాపు గంటన్నర ఇద్దరం కలిసి ఉన్నాం. అప్పుడు ఆయన చాలా బిజీగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువసేపు మాట్లాడుకోలేక పోయాం. అయినప్పటికీ ఆ సమయంలో కూడా ఆయన మొత్తం రాష్ట్రం గురించే మాట్లాడారు. ఏ విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోంది? ఈ విధంగా రాష్ట్ర రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తోంది? పేద ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తోంది? విద్య, వైద్య రంగాలలో చేస్తున్న పెను మార్పులు.. ఇలా అన్ని విషయాలు చెప్పారు. వాటిన్నింటి వల్ల రాష్ట్రం ఎలా మారుతోంది అనే విషయం కూడా ప్రస్తావించారు.’’ ►‘‘రాష్ట్రంలో సువిశాల సముద్ర తీరం ఉంది. రాష్ట్రంలో చాలా పెద్ద పోర్టులు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు ఏర్పాటువుతున్నాయి. ఒకటి ప్రైవేటు రంగంలో నిర్మిస్తుండగా, మిగిలిన మూడు ప్రభుత్వం నిర్మిస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి. అందరూ సంతోషంగా ఉండాలి. రాష్ట్రం అన్ని విధాలుగా ఇంకా అభివృద్ధి చెందాలన్నది తన ఆకాంక్ష అంటూ చెప్తున్న సీఎంగారి మాటలు వింటుంటే.. అప్పుడు ఒక దేవుడి నోటి నుంచి అవి వచ్చినట్లుగా అనిపించాయి.’’ ►‘‘గ్రామస్థాయిలో సేవలు, ఇంటి గడప వద్దనే ప్రభుత్వ పాలన. డిజిటల్ రూపంలో పంచాయతీల్లో సమగ్ర సమాచారం..వాటన్నింటి గురించి సీఎంగారు చెబుతూ పోతుంటే.. నాకెంతో ఆశ్చర్యం కలిగింది. దురదృష్టవశాత్తూ నాకు తెలుగురాదు. నేను తెలుగులో మాట్లాడలేను. ఒకవేళ నేను తెలుగులో మాట్లాడి ఉంటే, నా ఫీలింగ్స్ మీరు అర్ధం చేసుకుని ఉండేవారు. రాష్ట్రానికి వైఎస్ జగన్ వంటి యువ, డైనమిక్ ముఖ్యమంత్రి ఉండడం అదృష్టం. ఆయన వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమిటన్నది స్పష్టంగా కనిపిస్తోంది.’’ ►‘‘జిల్లాలో స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎంగారు చాలా చిత్తశుద్దితో ఉన్నారు. అందుకే భూమి పూజ, పనుల ప్రారంభం కోసం ఆయన విజయవాడ నుంచి ఇక్కడకు వచ్చారు. ఇవాళ పనులు ప్రారంభిస్తున్న ఈ కంపెనీ, భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది. పెద్ద స్టీల్ ప్లాంట్‌గా అభివృద్ధి చెందుతుంది.’’ ►‘‘బళ్లారిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం నేను తొలిసారి 1995లో అక్కడికి వెళ్లాను. అప్పుడు మేము అక్కడ 1.2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణం మొదలు పెట్టాం. మొక్కలా మొదలైన ఆ ప్లాంట్ ఇవాళ ఒక మహావృక్షంలా ఎదిగింది. ఇవాళ ఆ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 13 మిలియన్ టన్నులు. వచ్చే మూడేళ్లలో ఆ ప్లాంట్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాంట్‌గా అవతరించబోతోంది. అప్పటికి ఆ ప్లాంట్ సామర్థ్యం 25 మిలియన్ టన్నులకు చేరుతుంది. ఇవాళ ఇక్కడ కూడా ఆనాటి మాదిరిగానే అంతే సామర్థ్యంతో ప్లాంట్‌ను మొదలు పెడుతున్నాం. కాబట్టి ఇది కూడా అలాగే ఎదుగుతుంది.’’ ►‘‘మా నాన్నగారు ఓపీ జిందల్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. నీవు అభివృద్ధి చెందితే, నీ చుట్టూ ఉన్న వారు కూడా బాగు పడాలని. నీవు మాత్రమే బాగు పడి, నీ చుట్టూ ఉండే సమాజంలో మార్పు రాకపోతే, నీవు నీ పని సక్రమంగా నిర్వర్తించినట్లు కాదని. కాబట్టి మిత్రులారా, మీకు ఒక మాట చెబుతున్నాను. ఇవాళ మేము ఇక్కడ భూమి పూజ చేస్తోంది కేవలం ఒక స్టీల్ ప్లాంట్ కోసం మాత్రమే కాదు. ఇది జిల్లా అభివృద్ధి కోసం చేస్తున్న భూమి పూజ. నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. దేశవ్యాప్తంగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందుతుంది.’’ ►‘‘బళ్లారిలోని విజయనగర్‌లో మా స్టీల్ ప్లాంట్ విజయానికి ఒక కారణం ఆ ప్రాంత ప్రజలు. కడపకు, బళ్లారికి చాలా పోలికలు ఉన్నాయి. రెండు ప్రాంతాల ప్రజలకు చాలా సామీప్యం ఉంది. వారు చాలా కష్టపడతారు. అలా పని చేసే మా బళ్లారి ప్లాంట్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. ఈ ప్లాంట్‌కు ఇంఛార్జ్ అయిన రాజశేఖర్ సండూరుకు చెందిన వారు. మా సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇస్తాం. అలా శిక్షణ పొందిన వారే మా బళ్లారి, మహారాష్ట్ర, ఒడిషా, గుజరాత్ ప్లాంట్లలో పని చేస్తున్నారు. ఈ ప్లాంట్‌లో కూడా అదే జరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్‌ను ఒక మోడల్‌గా తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఈ ప్లాంట్ గ్రీనెస్ట్ (పర్యావరణహిత) ప్రాజెక్టుగా నిలవబోతుంది. ఈ ప్లాంట్ హరిత ఇంధనం (గ్రీన్ ఫ్యుయెల్)తో పని చేస్తుంది. అందుకే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నాం.’’ ►‘‘2023లో నిర్మిస్తున్న ప్లాంట్ ప్రపంచ స్థాయిలో, ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్లాంట్‌గా నిలుస్తుంది. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తైతే, ప్రపంచంలోనే ఒక మోడల్‌గా నిలుస్తుంది. దీని గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో దీన్ని చూసేందుకు వస్తారు. కాబట్టి మిత్రులారా సుస్థిర స్థిరత్వం, అభివృద్ధి రెండూ ఒకటిగా సాధించే దిశగా మనమంతా కలిసి పని చేద్దాం. అలాగే సంపదను కూడా కేవలం సంస్థ మాత్రమే కాకుండా, అందరం కలిసి పంచుకుందాం. మన నిర్ణయాలు, మన పని భవిష్యత్ తరాలకు కూడా మేలు చేయాలి. ఈ ప్రాజెక్టు మనందరికీ ఒక గర్వకారణం కావాలని ఆకాంక్షిస్తూ.. మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ.. సెలవు తీసుకుంటున్నాను’ అంటూ ప్రసంగాన్ని ముగించారు.’’ సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ►‘‘అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. జమ్ముల మడుగు నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి అన్నకు, తమ్ముడుకి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. దేవుడి దయతో ఇవాళ వైయస్సార్ జిల్లాలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.ఎన్నికల కోడ్ నేపధ్యంలో పెద్ద ఎత్తున జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని... వీలైనంత తక్కువ మందితో జరపాల్సి వచ్చింది. మమ్నల్ని కూడా పిలవండి అని కార్యకర్తలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అడుగుతున్నా... కోడ్ అడ్డంకిగా ఉందన్న విషయాన్ని పెద్ద మనసుతో అర్ధం చేసుకొండి.’’ స్టీల్ ప్లాంట్ పునాది రాయి చిరకాల స్వప్నం. ►‘‘ఈ రోజు మనం పునాది రాయి వేస్తున్న ఈ కార్యక్రమం మనం చిరకాల స్వప్నం. స్టీల్ ప్లాంట్ వస్తే ఏ రకంగా నగరాలుగా మారిపోతున్నాయి అన్నదాన్ని మనం గమనించాం. విశాఖపట్నం తీసుకున్నా.. కర్ణాటకలోని విజయనగరం పక్కన జిందాల్ వాళ్లు పెట్టిన ఫ్యాక్టరీ చూసినా, ఇతర ప్రాంతాల్లో ఉన్న స్టీల్ ప్లాంటులు చూసినా జిల్లా అంతా ఎంత అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నది మనం చూశాం.అదే జరగాలి అని అప్పట్లో నాన్నాగారు ఉన్నప్పుడు ఈప్రాంతం అభివృద్ధి కోసం కలలుకని.. ఇక్కడ స్టీల్ ప్లాంట్ కావాలని ఆలోచన చేశారు. ఆయన చనిపోయిన తర్వాత జిల్లాను ఏ నాయకుడు పట్టించుకోకపోవడంతో జిల్లా మొత్తం వెనుకబాటుకు గురి కావడం మన కళ్లతో మనం చూశాం.’’ మరలా దేవుడి ఆశీస్సులతో ఇవాళ.. ‘‘ఈ రోజు దేవుడి మళ్లీ ఆశీర్వదించాడు. మీ బిడ్డ మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఈ ప్రాంతానికి ఒక్కొక్కటిగా పరిశ్రమలు వస్తూ.. మంచి రోజులు వస్తున్నాయి. అందులో భాగంగానే ఇవాళ దేవుడి దయతో మనం ఎప్పటినుంచో స్వప్నంగా ఎదురుచూస్తున్న స్టీల్‌ప్లాంట్‌కు ఇవాళ శంకుస్ధాపన చేస్తున్నాం.’’ ‘‘ఇవాళ ఇక్కడ నిర్మించబోయే స్టీల్‌ప్లాంట్ ప్రాజెక్టు మరో 24–30 నెలల్లోపు ప్రారంభమవుతుంది. 3 మిలియన్ టన్నుల ప్లాంటును రెండు దశలలో కట్టడానికి జిందాల్ గారు కార్యాచరణ తయారు చేసారు. ఇందులో మొదటి దశ మరో 24 నుంచి 30 నెలల్లో పూర్తవుతుంది. అది రూ.3,300 కోట్లతో పూర్తవుతుంది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ మరో 5 సంవత్సరాలలో రూ.5,500 కోట్లతోనూ కలిపి మొత్తంగా రెండు దశల్లోనూ రూ.8,800 కోట్లతో ఈ ప్రాంతంలో 3మిలియన్ టన్నుల సామర్ధ్యమున్న స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంతంలో వేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఒక మంచి వ్యక్తి చేతుల మీదుగా జరుగుతుంది.’’ ‘‘జిందాల్ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్ గారు 28.5 మిలియన్ టన్నుల స్టీల్ సామర్ధ్యంతో దాదాపు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులతో స్టీల్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ 3 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో ప్రారంభించిన ఈ స్టీల్‌ప్లాంట్ అక్కడితో ఆగిపోదు.బళ్లారిలో కూడా జిందాల్ గ్రూపు స్టీల్ ప్లాంట్ మొదలుపెట్టినప్పుడు 3 మిలియన్ టన్నుల సామర్ధ్యం అనే చెప్పారు. ఇవాళ అది పెరుగుతూ వస్తూ... 13 మిలియన్ టన్నుల ప్లాంట్ అవడంతో ఆ ప్రాంత రూపురేఖలు అన్ని పూర్తిగా మారాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి రావాలని మనసారా కోరుకుంటున్నాను.’’ రూ.700 కోట్లతో మౌలిక సదుపాయాలు. ‘‘ఈ ప్లాంట్‌కు మద్ధతివ్వడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కారణం ఈప్రాంతం సముద్రతీరానికి దగ్గరగా కాకుండా.. విసిరేసినట్టు దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినా దేవుడి దయతో మనకు మంచి రోజులు వచ్చాయి. ఈ ప్లాంట్ కోసం ఇక్కడ మిగిలి ఉన్న భూములన్నీ రూ.40 కోట్లతో కొనుగోలు చేసి.. దాదాపు 3,500 ఎకరాలు సజ్జన్ జిందాల్ గారికి జిందాల్ ఫ్యాక్టరీకి ఇవ్వడమే కాకుండా... దాదాపు రూ.700 కోట్లతో ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం.’’ ‘‘కారణం ఇక్కడ జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీతోపాటు పక్కన అనుబంధపరిశ్రమలు కూడా వ్యవస్ధ ఏర్పడుతుంది. ఫలితంగా ఇక్కడో స్టీల్ సిటీ ఆవిర్భావమవుతుందన్న ఉద్దేశ్యంతో గొప్ప అడుగులు వేస్తున్నాం. ఈ ప్లాంట్‌కు సంబంధించి 67వ నెంబరు జాతీయ రహదారిని కలుపుతూ.. ఏడున్నర కిలోమీటర్ల మేరకు నాలుగు లైన్ల రోడ్డు వేస్తున్నాం. ప్రొద్దుటూరు, ఎర్రగుంట రైల్వే లైను కొరకు కొత్తగా మరో పదికిలోమీటర్లు లైన్ నిర్మాణం కూడా జరుగుతుంది. గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిసరఫరా కోసం ప్రత్యేక పైపులైన్ ద్వారా అందించే కార్యక్రమం చేపడుతున్నాం. నిరంతరంగా విద్యుత్ సరఫరా కోసం తలమంచిపల్లె సబ్‌స్టేషన్ నుంచి ఈ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా 220 కేవీ లైన్ కూడా నిర్మిస్తున్నాం. ఈ రకమైన మౌలిక సదుపాయాలు ఈ ప్లాంట్‌కు అందించేందుకే దాదాపు రూ.700 కోట్లు మనం ఖర్చు చేస్తున్నామని మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నాను.’’ ‘‘ఈ ప్లాంట్ వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పటికే కొప్పర్తిలో 550 ఎకరాలు కేటాయించి.... ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ)ను తీసుకొచ్చాం. ఇక్కడకు దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తున్నాయి. ఆ 550 ఎకరాల్లో మొత్తం పరిశ్రమలు వస్తే... మొత్తంగా లక్ష మంది మందికి ఉద్యోగాలు వచ్చే గొప్ప కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే అక్కడ రూ.1100 కోట్లతో పెట్టుబడులు వచ్చాయి. 11,500 మందికి ఉద్యోగాలకు సంబంధించిన కార్యాచరణకూడా వేగంగా జరుగుతుంది. అదే కొప్పర్తిలో జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌పేరుతో 3,155 ఎకరాలను కేటాయించి.. అడుగులు ముందుకు వేస్తున్నాం. అక్కడ కూడా రూ.18వేల కోట్ల రూపాయిల పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చే అవకాశాలను క్రియేట్ చేస్తున్నాం. తద్వారా 1.75లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది.’’ చదువుకున్న ప్రతి పిల్లాడికి ఉద్యోగం దిశగా.. ‘‘ఈ రకంగా చదువుకున్న ప్రతి పిల్లాడికి మన ప్రాంతంలోనే మన దగ్గరే ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని మన పిల్లలకు రావాలన్న తపన, తాపత్రయంతో అధికారంలోకి వచ్చిన వెంటనే 75 శాతం ఉద్యోగాలు స్ధానికులకు ఇవ్వాలని మీ బిడ్డ ప్రభుత్వం ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చింది.వీటన్నింటితో మన ప్రాంతం అంతా బాగుపడాలని, మన పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని మనసారా కోరుకుంటూ, తపిస్తున్నాను.’’ జిందాల్ గారికి ధన్యవాదాలు... ‘‘అదే విధంగా ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు సజ్జన్ జిందాల్ గారికి ధన్యవాదాలు. ఈ ప్రాంతం అభివృద్ధిలో బాగా వెనుకబడి ఉంది. ఈ తరహా పెట్టుబడి ఇక్కడ పెట్టడం ద్వారా ఈ జిల్లా ముఖచిత్రం మారిపోనుంది. ఇక్కడికి వచ్చి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా..మీరు ఈ ప్రాంతం అభివృద్ధికి ఒక ఆశ కల్పించారు. మీరు స్టీల్ ప్లాంట్ కోసం పెడుతున్న రూ.8,800 కోట్ల పెట్టుబడితో ఆగిపోకూడదని విశ్వసిస్తున్నాను. ఇంకా మిగిలిన గ్రీన్ హైడ్రోజన్, సోలార్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల దిశగా కూడా పెట్టుబడులు పెట్టాలని ఆశిస్తున్నాం. ఈ రంగంలో దాదాపు 30 వేల కోట్ల పెట్టుబడులుకు అవకాశం ఉంది. మీరు పెట్టిన పెట్టుబడి ద్వారా మీరు ఆ దిశగా కూడా నమ్మకాన్ని కల్పించారు.’’ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ ఏపీ ‘‘ఈ సందర్భంగా నేను రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. గడిచిన మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే నెంబర్ వన్ స్ధానంలో స్ధిరంగా కొనసాగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే 2019 నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇచ్చే ముందు పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో.. పరిశ్రమల స్ధాపనకు చేస్తున్న కృషితో పాటు పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్ బ్యాడ్ వల్లే మేం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ స్ధానంలో స్ధిరంగా కొనసాగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమలకు ఎంత అనుకూలంగా ఉంది, పారిశ్రామిక వేత్తలు ఏపీలో పరిశ్రమల స్ధాపనకు ఎంతటి సానుకూలంగా ఉన్నారన్న విషయాన్ని ఈ ర్యాంకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ’’ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 2021–22లో 11.43 శాతం గ్రోత్ రేటుతో ఏపీ దేశంలోనే వేగవంతమైన గ్రోత్ రేటు గల రాష్ట్రంగా మొదటి స్ధానంలో నిల్చింది. ఈ రెండు అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమలకు ఏ మేరకు అనుకూలంగా ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం.. ‘‘నేను మరో విషయం మీకు స్పష్టం చేస్తూ హామీ ఇస్తున్నాను. మీకు ఏ సమస్య ఉన్న, ఎలాంటి అసౌకర్యం కలిగినా కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉంటాం. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ సమస్యను పరిష్కరిస్తుంది. మీ అందరి తరపును నేను సజ్జన్ జిందాల్ గారికి హామీ ఇస్తున్నాను. ఈ రోజు స్టీల్ ప్లాంట్ కోసం 3 మిలియన్ టన్నులతో ప్రారంభమైన ఈ అడుగులు ఇక్కడితో ఆగిపోకుండా ఇంకా విస్తరణ జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడకు వస్తున్న పెట్టుబడులను మనసారా ఆహ్వానిస్తూ పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటామని మీ తరపున హామీ ఇస్తున్నాను. ఈ ప్రాంతానికి మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు.’’ -
సీఎం జగన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సజ్జన్ జిందాల్
-
వైఎస్ఆర్ చూపిన బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారు: సజ్జన్ జిందాల్
-
సీఎం జగన్‌పై సజ్జన్ జిందాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: మహానేత వైఎస్సార్ తనకు మంచి మిత్రులు, గురువు అని జేఎస్‌డబ్ల్యు ఛైర్మన్ సజ్జన్ జిందాల్ అన్నారు. బుధవారం ఆయన జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో స్టీల్‌ప్లాంట్ భూమిపూజ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం జగన్‌తో చాలా కాలం నుంచి పరిచయం ఉందన్నారు. మహానేత వైఎస్సార్ చూపిన బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారని అన్నారు. ‘‘రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. వైఎస్ జగన్ నాయకత్వం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ స్టీల్ ప్లాంట్ కడప ప్రజల చిరకాల స్వప్నం. వైఎస్ జగన్ కృషి, పట్టుదల కారణంగానే ఈ కల సాకారమవుతోంది. ఇది వైఎస్సార్ జిల్లా. మహానేత వైఎస్సార్‌ని స్మరించుకోకుంటే ఈ కార్యక్రమం అసంపూర్తిగానే మిగిలిపోతుంది’’ అని సజ్జన్ జిందాల్ వ్యాఖ్యానించారు. ‘‘నేను వైఎస్సార్‌ను కలిసినప్పుడు వైఎస్ జగన్ యువకుడు. ఆయన్ను ముంబై తీసుకెళ్లి వ్యాపార సూత్రాలు నేర్పించాలని వైఎస్సార్ చెప్పారు. 15-17 ఏళ్ల క్రితం జగన్ ముంబైలోని నా ఆఫీస్‌కు కూడా వచ్చారు. ఏపీని సీఎం జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ప్రజా సంక్షేమమే తన జీవిత లక్ష్యంగా జగన్ భావిస్తున్నారు. విజయవాడలో సీఎంతో కలిసి లంచ్ చేసినప్పుడు రాష్ట్రం గురించి చాలా మాట్లాడుకున్నాం. వైద్య ఆరోగ్య రంగం నుంచి డిజిటలైజేషన్ వరకూ ఆయన మాటలు నాకు దేవుడి మాటల్లా అనిపించాయి. నాకు తెలుగు మాట్లాడటం రాదు.. లేదంటే.. నేను చెప్పే విషయాలు మీకు పూర్తిగా అర్థమయ్యేవి. సీఎం జగన్ లాంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది’’అని సజ్జన్ జిందాల్ పేర్కొన్నారు. చదవండి: దేవుడి దయతో మంచిరోజులొచ్చాయ్: సీఎం జగన్ -
ఫైనాన్స్ వ్యాపారంలోకి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్
ముంబై: సజ్జన్ జిందాల్ సారథ్యంలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తాజాగా రుణాల వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఈ–కామర్స్ విభాగమైన జేఎస్‌డబ్ల్యూ వన్ ప్లాట్‌ఫామ్స్ (జేఎస్‌డబ్ల్యూవోపీ) కింద గ్రూప్‌లోని సంస్థల అవసరాల కోసం జేఎస్‌డబ్ల్యూ వన్ ఫైనాన్స్ పేరిట నాన్–బ్యాంక్ ఫైనాన్స్ సంస్థ (ఎన్బీఎఫ్సీ)ని ఏర్పాటు చేస్తోంది. అందులో రెండేళ్ల వ్యవధిలో రూ. 350– రూ. 400 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు త్రైమాసికంలో లైసెన్సు కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేసుకోనున్నట్లు, ఆ తర్వా 7–9 నెలల్లో నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు జేఎస్‌డబ్ల్యూవోపీ సీఈవో గౌరవ్ సచ్‌దేవా చెప్పారు. ఇందులో దాదాపు 200 మంది వరకూ సిబ్బంది ఉంటారు. ఆ తర్వాత క్రమంగా గ్రూప్‌లోని సిమెంటు, స్టీల్, పెయింట్స్ తదితర ఇతర కంపెనీలకు ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ అందిస్తుంది. తమ క్లయింట్లుగా ఉన్న లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు బ్యాంకింగ్ రంగం నుంచి తోడ్పాటు ఎక్కువగా లభించదని, ఈ నేపథ్యంలోనే వాటి అవసరాలను తీర్చేందుకు ఎన్బీఎఫ్సీని ఏర్పాటు చేస్తున్నట్లు సచ్‌దేవా చెప్పారు. -
తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన సజ్జన్ జిందాల్..!
వరల్డ్ స్టీల్ అసోసియేషన్(డబ్ల్యూఎస్‌ఏ) ఛైర్మన్‌గా జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్‌ను ఎన్నుకున్నారు. ప్రతిష్ఠాత్మక వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఛైర్మన్‌గా నియమితులైన తొలి భారతీయుడిగా సజ్జన్ జిందాల్ నిలిచారు. సజ్జన్ ఒక ఏడాదిపాటు ఈ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ వైస్ఛైర్మన్లుగా హెచ్‌బీఐఎస్ గ్రూప్‌కు చెందిన యూ యాంగ్, పోస్కో జియాంగ్ వూ చోయ్ సెలక్ట్ అయ్యారు. చదవండి: అరేవాహ్...! జాతీయ రికార్డును కొల్లగొట్టిన మహీంద్రా ఎక్స్‌యూవీ..! ఎగ్జిక్యూటివ్ కమిటీలో భాగంగా టాటా స్టీల్ సీఈఓ టీవీ నరేంద్రన్, ఆర్సెలార్ మిట్టల్ చీఫ్ ఎల్ఎన్ మిట్టల్ ఎంపికైనారు. ఈ సంస్థకు ట్రెజరరీగా బ్లూస్కోప్ స్టీల్‌కు చెందిన మార్క్ వాసెల్లా, ఇంటర్నేషనల్ స్టెయిన్లెస్ స్టీల్ ఫోరమ్ ఛైర్మన్‌గా టియోటియో డి మాలో (అపెరామ్) ఎన్నికయ్యారు. అంతేకాకుండా బోర్డు సభ్యులు 16 మందితో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీని నియామకం కూడా జరిగింది. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ సభ్యుల పదవి కాలం ఒక సంవత్సరం పాటు కొనసాగనుంది. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఉక్కు పరిశ్రమకు కేంద్ర బిందువుగా పనిచేస్తోంది. స్టీల్‌రంగంలో ప్రభావితం చేసే అన్ని ప్రధాన వ్యూహాత్మక సమస్యలపై పరిష్కారాలను డబ్ల్యూఎస్‌ఏ చూపిస్తోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా స్టీల్ ధరలను నియంత్రిస్తోంది. దీనిని 1967లో స్థాపించారు. ఈ సంస్థలో ఉన్న సభ్యులు ప్రపంచవ్యాప్తంగా సుమారు 85 శాతం ఉక్కును ఉత్పత్తి చేస్తున్నారు. చదవండి: పేరు వాడితే...! రూ. 7500 కోట్లు కట్టాల్సిందే...! -
అంచనాలు అందుకోవాల్సిన బాధ్యత మాపైనే!
సాక్షి,న్యూఢిల్లీ: దేశ అభివృద్ధిలో ప్రైవేట్ రంగం కూడా కీలకపాత్ర పోషిస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చిన నేపథ్యంలో కార్పొరేట్లు స్పందించారు. ప్రైవేట్‌పై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా రాణించాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో.. పరిశ్రమలపై సానుకూల అభిప్రాయం కలిగించేందుకు ప్రధాని మోదీ వ్యాఖ్యలు తోడ్పడగలవని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఆశాభావం వ్యక్తం చేసింది. ‘దేశంలో సంపద, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్న రంగానికి ఎంతో ఊతం లభిస్తుంది‘ అని ఆనంద్ మహీం ద్రా, సజ్జన్ జిందాల్ తదితర దిగ్గజాలు పేర్కొన్నారు. ‘కరోనా దెబ్బతో కుదేలైన భారతీయ పరిశ్ర మ మళ్లీ అధిక వృద్ధి బాట పట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో పరిశ్రమ కృషిని ప్రధాని గుర్తించడమనేది ఔత్సాహిక వ్యాపారవేత్తలు, పరిశ్రమవర్గాలకూ ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. ప్రైవేట్ రంగంపై ఆయనకున్న నమ్మకానికి కృతజ్ఞతలు. జాతి నిర్మాణంలో ప్రైవేట్ రంగ పాత్రపై ఆయన దార్శనికతకు ఈ వ్యాఖ్యలు నిదర్శనం. అదే సమయంలో మిగతా విషయాల కంటే దేశ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసేలా వ్యాపారవర్గాలపై బాధ్యతను మరింతగా పెంచాయి‘ అని ఫిక్కీ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా.. దేశాభివృద్ధిలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగం పాత్ర కూడా కీలకమేనంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం టెలికం, ఫార్మా తదితర రంగాలను ప్రస్తావించారు. ప్రోత్సాహకర వ్యాఖ్యలు.. మరోవైపు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ‘కరోనా పరిస్థితుల్లో కష్టకాలం ఎదుర్కొంటున్న పరిశ్రమకు ప్రధాని వ్యాఖ్యలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఇక పనితీరులోను, గవర్నెన్స్‌లోనూ అంచనాలను అందుకోవాల్సిన బాధ్యత మనపైనే (ప్రైవేట్ రంగం) ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. ‘భారతీయ వ్యాపారవేత్తలపై దేశ ప్రధాని బహిరంగంగా గౌరవాన్ని వ్యక్తపర్చడం ఇదే ప్రథమం. దేశంలో సంపద సృష్టిస్తూ, ఉద్యోగాలను కల్పిస్తున్న పరిశ్రమకు ఇది ఎంతో ప్రోత్సాహాన్నిచ్చే విషయం’ అని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ పేర్కొన్నారు. -
ఎకానమీని కాపాడే అత్యవసర చర్యలు కావాలి
సాక్షి, ముంబై : కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు సానుకూల ఫలితాలనిచ్చినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలు పూర్తి నిలిచిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిందని పారిశ్రామికవేత్త, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ అభిప్రాయపడ్డారు. ఇపుడు ఆర్ధిక పతనంనుంచి కాపాడేందుకు త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. వైరస్ కట్టడితోపాటు ప్రస్తుతం ఆర్థిక శ్రేయస్సుపై కూడా దృష్టి పెట్టడం అత్యవసరమని ఆయన మంగళవారం వ్యాఖ్యానించారు. ఎకానమీ నిద్రావస్థలోకి జారిపోకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతోపాటు ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా చూడాలన్నారు. దేశంలో ఆర్థికమాంద్యం కూడా ప్రమాదమేనని జిందాల్ పేర్కొన్నారు. అలాగే అతి తక్కువ సమయంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుని సామర్థ్యానికి సాధించేందుకు కొత్త పని మార్గాలను కనుగొనాలని ఆయన అన్నారు. (నోకియా దూకుడు : భారీ డీల్) కాగా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం మార్చి 25 నుండి 21 రోజుల లాక్డౌన్ ప్రకటించింది. అనంతరం దీనిని మే 3వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్త లాక్డౌన్ ప్రతి రంగంలోని వ్యాపారాలను ప్రభావితం చేసింది. అయితే ఏప్రిల్ 20నుండి అనేక పరిశ్రమలకు,సంస్థలకు సడలింపులతో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అవసరమైన వస్తువులు, సేవలను మినహాయించి 40 రోజుల లాక్డౌన్ దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
నవాజ్ షరీఫ్ ను స్కూల్ పిల్లాడిలా చూశారు: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై క్రికెటర్, పాకిస్థాన్ తెహరీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ నిప్పులు చెరిగారు. భారత పర్యటనలో నవాజ్ తన హోదాను మరిచి, దేశ ప్రయోజనాలను పక్కన పెట్టారని ఇమ్రాన్ ఆరోపించారు. అంతేకాక నవాజ్ ను భారత్ లో ఓ స్కూల్ పిల్లాడిలా చూశారని ఇమ్రాన్ ఎద్దేవా చేశారు. దేశ ప్రయోజనాలను భంగ పరిచే విధంగా ఉక్కు వ్యాపారవేత్త సజ్జన్ జిందాల్ ఆతిధ్యాన్ని ఎలా స్వీకరిస్తారని ఇమ్రాన్ ప్రశ్నించారు. తన కుమారుడు హసన్ నవాజ్ తో కలిసి సజ్జన్ జిందాల్ ఇంటికి నవాజ్ వెళ్లడాన్ని ఇమ్రాన్ తప్పుపట్టారు. సజ్జన్ జిందాల్ ఇంటికి వెళ్లడానికి సమయాన్ని కేటాయించిన నవాజ్.. హరియత్ నేతలతో సమావేశానికి ఆసక్తి చూపలేదన్నారు. పాకిస్థాన్ దేశ ప్రయోజనాలను నవాజ్ పక్కన పెట్టారని ఇమ్రాన్ మండిపడ్డారు. -
'మానాన్నను నవాజ్ షరీఫ్ ఆరాధించేవారట'
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త సజ్జన్ జిందాల్ ఏర్పాటు చేసిన విందులో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ కలుసుకున్నారు. తన తండ్రి కైఫీ అజ్మిని నవాజ్ షరీఫ్ ఆరాధించేవారని తెలుసుకోవడం ఆనందం కలిగించిందని షబానా తెలిపారు. బాలీవుడ్ ప్రముఖులు మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్ లంటే కూడా ఇష్టమని నవాజ్ తనతో అన్నారని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. రెండు దేశాలు సంయుక్తంగా చిత్రాలు నిర్మించే విషయంపై నవాజ్ షరీఫ్ తో చర్చించానని షబానా వెల్లడించారు. అయితే ఇరుదేశాలు సంయుక్తంగా చిత్రాలను నిర్మించాడానికి షరీఫ్ కూడా సానుకూలంగా స్పందించారన్నారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనడానికి ఓ సందేశంతో నవాజ్ షరీఫ్ వచ్చారని షబానా ఆజ్మీ తెలిపారు.